Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · The Householder Is the Best of Men
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
లోకాచరణ
ఆశ్రమములు
నాలుగున్నవి.
అవియే
'బ్రహ్మచర్యము,
గృహస్థము,
వానప్రస్థము,
సన్యాసమ'నునవి.
ఇవి
నాలుగును
వేరు
వేరు
ఆశ్రమముల
పేర
గృహస్థుని
వలననే
ఏర్పడినవి.
ఇందులో
బ్రహ్మచర్య,
వానప్రస్థ,
సన్యాసాశ్రమములను
సర్వవిధములా
పోషించుచుండుటచేత
గృహస్థ
ధర్మము
ప్రధానమైనదిగానున్నది.
కాన,
గృహస్థుడే
ఉత్తముడు.
వాయువునాశ్రయించి
జీవులెట్లు
బ్రతుకుచున్నారో,
గృహస్థుని
ఆశ్రయించి
పై
మూడు
ఆశ్రమముల
వారూ
జీవించుచున్నారు.
పై
మూడాశ్రమముల
వారికి
అన్నపానముల
నొసగుటేగాక
వేదాధ్యయనము
చేయించుచున్నాడు.
దీనినే
బలపరచి,
మనువు
కూడనూ
తన
'ధర్మసూత్ర'మందు
స్థిరపరచి
స్పష్టముగా
తెలిపెనుకదా?
గృహస్థులకు
కూడనూ
మోక్షము
కలదనియు,
అయితే
'స్వధర్మానుష్ఠానపరులు
కావలెన'నియూ
తెలిపెను.
అట్టి
ధర్మానుష్ఠానము
నెవరు
ఏ
ఆశ్రమమునందు
ఆచరించిననూ,
అట్టి
వారికి
మోక్షము
గలదనుటలో
సందియము
లేదు.
మనువు
ఆదిగా
స్మృతులను,
నారద
పరివ్రాజకోపనిషదాది
శ్రుతులను
పరిశీలించిన,
ఆ
శాస్త్రములందు
కూడనూ
కొన్ని
కొన్ని
సమయములలో
'స్వధర్మానుష్ఠాన
నిరతులగు
గృహమేధులు
పరమోత్కృష్టు'లనియు,
అలాగున
మరి
కొన్ని
ప్రదేశములందు
'సమస్తమును
సన్యసించిన
వీతరాగులైన
యతీశ్వరులే
సర్వపూజ్యు'లనియూ
మహర్షులు
వచించిరి
కదా?
ఇందులో
సకలాశ్రయమగు
గృహస్థాశ్రమము
2
▾
Meaning
Keep
నవలంబించి
ప్రవర్తించవలయునా?
సర్వపూజ్యమగు
సన్యాసమును
స్వీకరించి
నివృత్తి
మార్గములో
నుండవలయునా?
అని
కొంత
సంశయమునకు
స్థానమేర్పడవచ్చును.
పరమ
పవిత్రులు,
పావనులగు
గృహస్థులకును,
లోక
పూజ్యులగు
పరమహంసలకును
పరస్పర
సంబంధము
కలదు.
ఏ
ఆశ్రమములోనున్నవారైననూ
తప్పు
లేదు,
బాధ
లేదు.
నాలుగాశ్రమముల
వారునూ
స్వధర్మనిరతులై
బాగుగా
ఆచరణ
గలిగినవారై
యుండినచో,
దృఢతరమగు
స్వప్రయత్నములచే
తప్పక
విముక్తులగుదురు.
ఆయా
స్థానములలో
ఆయా
ఆశ్రమములు
శ్రేష్ఠము.
ఆచరణ
మాత్రము
ఇందులో
ప్రధానము.
బాగుగా
సదాచార
సంపన్నుడైనచో
ఏ
ఆశ్రమస్థుడైననూ
పవిత్రాశ్రమము
గలవాడగుచున్నాడు.
అనగా,
సర్వదా
అనుష్ఠానముతో
కూడియుండెనేని
సర్వాశ్రమములు
పునీతములే,
శ్రేష్ఠములే,
ముఖ్యములే.
శాస్త్ర
నియమమే
ఇది.
ఆత్మజ్ఞాన
సంపన్నులగు
వారందరు
భవ
సాగరమును
తరించి,
శాశ్వత
ముక్తి
పదవిని
నిస్సందేహముగా
నొందుచున్నారు.
ఉత్తమ
వంశమందు
జన్మించిన
వాడైననూ,
యతీశ్వరుడైననూ,
పామరుడైననూ,
పరమహంస
అయినను,
స్వధర్మాచరణను
వీడి,
వ్రతనిష్ఠలుకాక,
వేదాధ్యయనమును,
గీతోపనిషదాది
పారాయణములు
గావింపక,
ధ్యానానుష్ఠానము
లేక,
బాహ్యాచరణ
చేయువారు
దృఢముగా
దుఃఖబంధితులగుచున్నారు.
నిత్యానుష్ఠానము
కంటె
శ్రేష్ఠమైన
కార్యముకానీ,
నిత్యానుష్ఠానము
కంటే
మించిన
తపస్సుకానీ,
నిత్యానుష్ఠానముకంటే
శ్రేష్ఠమైన
ధర్మముకానీ
వేరు
లేదు.
సకలోపనిషత్సారమైన
గీతా
శాస్త్రము
ఏ
పరమోపదేశము
చేసినదో
చూచితివా?
"సర్వదా
ప్రయత్నశీలురగువారు
ఏ
ఆశ్రమమున
నుండినను,
ఏ
వర్ణస్థులైననూ
బాధకము
లేదు,"
అని
మనువు
అనెను.
వారందరునూ
విజ్ఞానసంపన్నులై
భగవంతుని
చెందుచున్నారు.
3
▾
Meaning
Keep
ఏ
పురుషుడు
సమస్తములైన
కోరికలను
విడిచి
ఏ
విషయములందును
కావలయునను
తలంపు
లేనివాడై
సర్వదా
బ్రహ్మమందు
విహరించుచున్నాడో,
అట్టి
విజ్ఞాని
సకల
దుఃఖములకు
దూరమై
పరమానందరూప
శాంతిని
బడయుచున్నాడు.
"అవసానకాలమందైననూ,
బ్రహ్మనిష్ఠను
పొందినవాడు
బ్రహ్మ
నిర్యాణమును
పొందును,"
అని
అనెను.
ఈ
రీతిగనే
స్థితప్రజ్ఞ
లక్షణమంతయు
సర్వసాధారణముగా
నుండును.
నిరంతరము
"బ్రహ్మమే
నేను"
అను
దృఢరూప
సంస్కార
భావమే
మానవునికి
దివ్యౌషధము
కావున,
అట్టి
'అహం
బ్రహ్మాస్మి'
భావనయే
ముక్తియగును.
అదే
మానవ
నిజధర్మము.
జడబుద్ధిగల
అజ్ఞానికి
"దేహమే
నేన"ను
బుద్ధియుండును.
కొంచెము
విచారముగల
పండితునకు
దేహమునందును,
జీవునియందును,
'నేన'ను
బుద్ధియుండును.
అట్లుకాక
మరింత
లోతుగా
విచారము
చేసిన,
అనాత్మనుండి
ఆత్మను
వేరుచేసిన
వివేక
జ్ఞానము
గల
మహాత్మునకు
'అహం
బ్రహ్మాస్మి'
బుద్ధి
సర్వదా
యుందును.
బ్రాహ్మణాది
జాతులు,
అరుణాది
వర్ణములు,
బ్రహ్మచర్యాద్యాశ్రమములు,
ఇవి
అన్నియూ
కేవలము
దేహధర్మములే
అగును.
ఆత్మధర్మములు
కావు.
అంతియేకాక
ఇవి
ఆయా
ప్రదేశమునకు
సంబంధించినవే;
కేవలము
బంధకారణములే.
ఇవి
లోకనియామకమునకై
భగవత్సంకల్పము
చేతనే
కల్పింపబడినవి.
వీటిని
కేవలము
లోకసంబంధ
ప్రతిబంధనలోనున్న
ప్రతి
మానవుడునూ
ఆచరించే
తీరవలెను.
ప్రతిబంధ
సంబంధములు
లేనివారు,
అనగా
అతీతమైనవారికి
ఈ
ఆచారములు
అంతగా
లెక్కకు
రావు.
అందుకనే
బ్రహ్మనిష్ఠాపరులు
(తత్త్వవేత్తలు)
వీటినంతగా
చూడరు,
ఈ
వర్ణజాతులకు
వారు
కట్టుబడరు.
అట్టి
వారలకు
సర్వమూ
బ్రహ్మతత్త్వముగానే
గోచరించును.
కానీ,
అంతటి
స్థితికి
వచ్చునంత
వరకు,
ఈ
రెండునూ
తూ.చ.
తప్పక
ఆచరించవలెను.
అదే
దేహధర్మము.
4
▾
Meaning
Keep
యథార్థము
నెరిగిన
మహర్షులు
'ఆత్మధర్మములైన
సత్,
చిత్,
ఆనందమను
మూడు
గుణములనే
స్వరూపలక్షణముల'ని
నిర్ణయించిరి.
అందుచే
ఆ
మహావిజ్ఞానులు
సచ్చిదానంద
పరబ్రహ్మమును
పొందుచున్నారు.
ముక్తికి
ఆత్మశుద్ధియే
కారణము.
జాతివర్ణములు
కారణములు
కావు.
కానీ,
ఆత్మశుద్ధి
ధర్మాచరణవలననే
కలుగుచున్నది.
ధర్మమునకు
జాతివర్ణములు
అత్యవసరము.
జాతి
వర్ణ
ఆశ్రమముల
స్వధర్మాచరణ
వల్లనే
ఆత్మశుద్ధి,
ఆత్మశుద్ధి
వలననే
మోక్షము.
మోక్షమునకు
జాతివర్ణములు
ప్రధానము
కాకపోయినప్పటికినీ,
ఆత్మశుద్ధికి
ఆచరణ
అత్యవసరము.
ఆచరణ
వలన
అనుభవము,
అనుభవము
వలన
సత్యము,
సత్యము
వలన
శుద్ధి,
శుద్ధి
వలన
మోక్షము.
అట్టి
శుద్ధి
రూప
మనస్తత్త్వము
గలవారెల్లరూ,
ఏ
ఆశ్రమములో,
ఏ
వర్ణములో
నున్ననూ,
విజ్ఞానమునకు
యోగ్యమైన
అంతఃకరణశుద్ధి
కలిగియున్నందుచే,
ఎల్లప్పుడూ
యేలాటి
ప్రతిబంధము
లేనివారై
ముక్తిని
పొందుచున్నారు.
ఈ
విషయమునే
అంతఃకరణశుద్ధి
కలవారే
మోక్షమునకర్హులని
శాస్త్రము
చెప్పినది.
రాగద్వేషము
కలవారు
వనమునందుండిననూ
వారికి
దోషములే
కలుగుచుందును.
ఇంద్రియ
నిగ్రహము
కలవాడు
గృహస్థాశ్రమమునందుండిననూ
తాపసుడే
అగుచున్నాడు.
నిందితముకాని
కర్మచేయువాడు
ఎచ్చట
ఉండిననూ
జ్ఞానియే
యగును.
రాగరహితునకు
స్వగృహమే
తపోవనము.
సంతానము
చేతను,
ధనముచేతను,
యజ్ఞయాగాదుల
చేతను,
ముక్తి
సిద్ధించదు.
కేవలము
ఆత్మశుద్ధి
ఒక్కటియే
కావలసినది.
కాబట్టి
కర్తవ్యాకర్తవ్య
నిశ్చయమునకు
శాస్త్రమే
ప్రమాణము.
బ్రహ్మచారియు,
గృహస్థుడు,
వానప్రస్థుడు,
సన్యాసి,
యెవరైననూ,
ఏ
మార్గములో
చేరిన
వారైననూ
నిరంతరము
స్వస్వరూప
పరబ్రహ్మమును
దర్శించునట్టి
బ్రహ్మమయ
దృష్టి
యుండినచో
సుఖముగా
విముక్తులగుదురు.
స్వాత్మదృష్టియే
మోక్షమునకు
కారణము.
వేదాంతార్థము
నెరింగి,
తన
స్వధర్మాచరణను
వీడక
ఏ
జాతిలోనున్నను
వాడు
పరమపదవి
నొందును.
5
▾
Meaning
Keep
గృహస్థాశ్రమ
ధర్మములో
నున్నవారు
శాస్త్రరీతిగా
సమస్త
ధర్మములు
నిర్వహించుటకు
శక్తిగల
వారైనచో,
జ్ఞానము
సంపాదింప
ప్రతిబంధములు
లేకుండిన,
సన్యాసాశ్రమమును
పొందకయే
విజ్ఞాన
సంపత్తిచే
మోహబంధముల
త్రెంచి
గృహస్థాశ్రమము
నుండే
ముక్తి
పొందుదురు.
గృహస్థాశ్రమ
ధర్మముల
చక్కగ
నిర్వర్తించుచు,
నిత్యము
స్వధర్మానుష్ఠానపరులై,
సర్వేశ్వరుని
పరమానుగ్రహమున
సకల
విఘ్నములను
పోగొట్టుకొని,
నిరంతరము
ధ్యానింపదగిన,
పరమలక్ష్యమైన
ధ్యేయమును,
పరమాత్మ
యొక్క
నిర్వికల్పసమాధి
నిష్ఠులై
రాజ
ఋషులయిన
జనక
చక్రవర్తి,
అశ్వపతి,
దిలీప
మహారాజు
మొదలగు
మహాత్ములెందరో
ఈ
గృహస్థాశ్రమము
నుండియే
పరమ
ముక్తిని
బడసిరికదా?
కావున,
గృహస్థాశ్రమము
మోక్షహేతువగునా
కాదా
అని
సంశయము
వలదు.
గృహస్థాశ్రమము
నుండియే
ఈ
సంసార
సాగరమును
తరించి
సులభముగా
ముక్తి
పొందవలయునని
యిచ్చగించు
భార్యాభర్తలిరువురును
ఏకమనసుగలవారై
యుండవలెను.
మరియు
అట్టి
అపవర్గ
ధర్మమార్గమున
ప్రవర్తించుచున్న
సతీపతులకిద్దరికిని
మోక్షము
ప్రాప్తించును.
అయితే
సంకల్పము
కూడనూ
సమానముగానూ,
దృఢముగానూ
ఉండవలెను.
లేనిచో,
సన్యాసము
శరణ్యము.
చూడు,
మిట్టమధ్యాహ్నమునధిష్ఠించియున్న
సూర్యభగవానుడును,
స్వధర్మపత్నియగు
ఛాయాదేవితో
కూడుకొనేయున్నాడు.
పదునారు
కళలతో
కూడుకొనియున్న
పరిపూర్ణ
శుద్ధ
చంద్రుడును
అమృతము
వంటి
వెన్నెల
చేతనే
శోభిల్లుచున్నాడు.
అలాగున
యెంత
గొప్పవాడైననూ
గృహమేధి
ప్రసన్నత,
శాంతి,
క్షమ,
శీలము
మొదలగు
పవిత్ర
గుణములతో
పరిపూర్ణురాలగు
స్వధర్మపత్ని
చేతనే
పవిత్రుడై
వెలుగొందవలెను.
గృహస్థాశ్రమములోనున్నవారికి
ఎప్పుడును
స్వధర్మోన్నతి
మార్గమునకు
ప్రతిబంధములే
జనించుచుండిన,
తమకు
పరిపూర్ణ
వైరాగ్యమున్నచో,
తప్పక
6
▾
Meaning
Keep
సన్యసించవలయునని
నిబంధన
లేదు.
ఎట్టి
ప్రతిబంధములు
జనించినను,
స్వధర్మపత్ని
మనసు
సంతృప్తిలేనిది
సన్యాసము
సఫలము
కాదు.
అట్టి
కష్టములే
సంభవించిన
ఇద్దరూ
ఏకమనస్కులై
వానప్రస్థమును
స్వీకరించి
అడవుల
సంచరించవచ్చును.
అమాయకపు
పిల్లలు,
అనగా
వయసురాని
బిడ్డలుండిన
వానప్రస్థము
కూడనూ
శాస్త్ర
సమ్మతము
కాదు.
ఆ
పిల్లలను
ఒక
మార్గము
చేసి,
వారి
నుండి
యెట్టి
అడ్డులు
లేనివిగా
చేసికొని
వానప్రస్థమును
స్వీకరించవచ్చును.
కాన,
ప్రతిబంధములు
జనించినను,
జనించక
పోయిననూ
గృహస్థ
ధర్మము
48
సంవత్సరముల
వయసు
వరకూ
ఆచరించుట
శాస్త్రసమ్మతము,
లోక
సమ్మతము.
స్వధర్మాచరణలకు
అడ్డులేక
చూచుకొనవలెను.
అట్లు
సంభవించెనేని
భగవత్ప్రీతికర్పితమొనర్చి
దానికి
పశ్చాత్తాపము
పొందవలెను.
ఈ
రీతిగా
గృహస్థ
ధర్మమును
సాధించవలెను.
స్త్రీలకుగానీ,
పురుషులకుగానీ
గృహస్థధర్మమొక్కటియే.
Previous
←
The Power of Gāyatrī-Mantra Japa
Next
Everyone Is Fit for Brahma-Vidyā!
→