Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · Everyone Is Fit for Brahma-Vidyā!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
9
బ్రహ్మ
విద్యకు
అందరూ
అర్హులే!
రోగ
పీడితులగుటకు
శూద్రులేమి,
బ్రాహ్మణులేమి;
కూటి
పేదయేమి,
కోటీశ్వరుడేమి;
స్త్రీయేమి,
పురుషుడేమి?
ఔషధమును
సేవించుటలో
అందరికీ
అధికారమున్నది
కదా?
అటులనే
భవరోగస్థులగు
మానవులు
బ్రహ్మవిద్యయందధికారము
కలిగియున్నారు.
బ్రహ్మవిద్యకు
అందరూ
అర్హులే.
వారివారి
అధికార
ప్రాప్తులనుపట్టి
ఆయా
ఔషధముల
సేవించునటుల
వారివారి
సాధనా
ధర్మములనుపట్టి
ఆయా
స్థానములు
ప్రాప్తించుచుండును.
అయితే,
ఒకటి
ఇక్కడ
చక్కగ
గమనించవలెను;
ఔషధ
సేవనతో
పాటు
నియమ
పూర్వకమైన
పథ్యమును
కూడా
యెటుల
కలిగియుండ
వలెనో,
అటులనే
బ్రహ్మవిద్యాభిలాషియు
నిరంతర
బ్రహ్మభావనయను
ఔషధమును
సేవించుచు,
దానికి
అనువగు
ధర్మములను,
భక్తి
జ్ఞాన
వైరాగ్యాది
గుణములను
ఆధ్యాత్మిక
పథ్యమునుగూడ
కలిగియుండవలెను.
ఔషధమును
సేవించియూ
సరియైన
పథ్యమును
పాటించని
మనుజుడు
ఎటుల
రోగవిముక్తిని
పొందజాలడో,
అటులనే
బ్రహ్మోపదేశమును
పొందియు,
శమదమాది
గుణరహితులై
ధర్మభ్రష్టులై
సక్రమానుష్ఠాన
శూన్యులైన
బ్రాహ్మణులైననూ,
శూద్రులైననూ,
చక్రవర్తి
అయిననూ,
చండాలురైననూ
భవరోగముక్తులై
పరబ్రహ్మమును
పొందలేరు.
బ్రహ్మవిద్యకు
సర్వులూ
అధికారులే
కానీ,
దానిని
పొందు
యోగ్యతలు
మొదలు
సంపాదించుకొనవలెను.
2
▾
Meaning
Keep
మందులు
త్రాగుటకు
అందరికీ
అధికారమే
కానీ,
ఆ
విలువైన
మందులు
తీసికొను
యోగ్యత
కూడా
నుండవలెను
కదా?
ఒక్కొక్క
వేళ
వారి
జన్మాంతర
సంస్కారమే
బలవత్తరమైనదైన,
ఆ
భవరోగ
వైద్యుడైన
భగవంతుడే,
యోగ్యత
లేనప్పటికిని
ప్రసాదించును.
ఇప్పుడు
లోకమున
మాత్రము,
అనేక
మంది
గొప్ప
ఔషధములు
కొనుటకు
శక్తిలేని
వారికి,
ఎవరో
ఒక్కొక్క
చోట
ధర్మశీలుడైన
డాక్టరు
ఉచితముగ
మందులు
ఇచ్చుట
లేదా?
అయితే
భవరోగ
వైద్యుడొక్కడే.
అతడెప్పుడునూ
దయాస్వరూపుడే,
దానశీలుడే.
వారి
వారి
ప్రాప్తిని,
జన్మాంతర
సంస్కారమును
మాత్రము
కలిగియుండవలెను;
లేక
ఇప్పుడైననూ
అట్టి
యోగ్యతను
ప్రయత్నించి
పొందవలెను.
ఇప్పుడు
ఒక
సమస్య.
"స్త్రీలకు
బ్రహ్మవిద్యయందధికారము
లేదా?"
అని.
దీనికి
పైన
తెలిపినదే
సమాధానము.
అట్లు
అధికారము
లేకున్న,
విష్ణుమూర్తి
భూదేవికి
గీతా
మహాత్మ్యము
నెటుల
బోధించెను?
అంతియేగాక,
పరమేశ్వరుడు
గురుగీతను
పార్వతీదేవికి
బ్రహ్మతత్త్వోపదేశము
నెటుల
జెప్పెను?
భగవద్గీతయందు
"ధరోవాచ"
అనియు,
గురుగీతయందు
"పార్వత్యువాచ"
అనియు
తెలిపినది
లోకమునకు
తెలియదా?
అంతేల,
ఈశ్వరుడు
పార్వతికి
యోగ
శాస్త్రమును,
మంత్ర
శాస్త్రమును
ఉపదేశించలేదా?
ఇది
శాస్త్ర
ప్రమాణమే
కదా?
బృహదారణ్యకోపనిషత్తునందు
యాజ్ఞవల్క్యమహర్షి
మైత్రేయికి
బ్రహ్మవిద్యోపదేశమును
చేసిన
విషయము
తెలియదా?
ఇంతేల;
వేదమే
కర్మకాండము,
జ్ఞానకాండమనియు
రెండుగా
నున్నది.
అందులో
కర్మకాండము
ప్రాకృత
జనులకును
(అజ్ఞానులకును),
జ్ఞానకాండము
విజ్ఞానులకును
కదా?
కేవలము
శాస్త్రాధ్యయనమొనర్చిన
పండితుల
వాక్యములు,
ఆత్మజ్ఞానానుభవముగల
విద్వాంసుని
వాక్యములని
రెండు
గలవు.
బ్రహ్మాత్మైక
భావనచే
సమస్త
కర్మలు
పరిత్యజించినట్టియు,
సమస్త
ప్రాణికోటులందున్న
ఆత్మ
ఒక్కటే
అని
తలంచి,
స్వపర
భేదభావమును
వీడి
3
▾
Meaning
Keep
చరాచర
హితము
నాకాంక్షించునట్టి,
ఆత్మవేత్తలగు
మహానుభావుల
వాక్యములు
యథార్థ
వాక్యములు.
బృహదారణ్యకమున
సన్యాసము,
బ్రహ్మచర్యము,
ఇత్యాది
ఆధ్యాత్మిక
సద్గుణములతో
జాజ్వల్యమానమై
ప్రకాశించు
గార్గి,
మైత్రేయి,
భారతమున
సులభాయోగిని
మొదలగు
ఆదర్శ
నారీమణుల
యొక్క
ఉజ్జ్వల
చరిత్రములు
కలవు
కదా?
అయితే,
వారి
ధర్మాచరణ
లెట్టివో
మొదలు
వాటిని
తెలుసుకొని,
ఆ
క్రమమును
పాటించిన
తదుపరి
ఆ
స్థానముల
సంగతి.
చూడాల,
మదాలస
మొదలగు
నారీమణులు
గృహస్థాశ్రమమున
నుండియే
బ్రహ్మజ్ఞానమును
సంపాదించి,
నిత్య
నిరతిశయ
మంగళస్వరూపమగు
బ్రహ్మమును
పొందినటుల
యోగవాసిష్ఠమునను,
పురాణాదులందును
గానవచ్చుచున్నది
కదా?
శాస్త్రముల
చక్కగనభ్యసింపనందువలననే
పూర్వోక్త
సంశయములు
కలుగుచుండును.
బ్రహ్మచారిణులు
గార్గిని,
గృహిణులు
చూడాలను,
వానప్రస్థులు
మైత్రేయిని,
సన్యాసినులు
సులభాయోగినిని
పవిత్ర
హృదయములతో
స్మరించి
నిత్యము
స్వధర్మానుష్ఠానమును
వీడరైరి
కదా?
అదే
మొదలు
స్త్రీలు
పాటించవలెను.
"లౌకిక
శాస్త్రముల
బోధించు
ఉపాధ్యాయుని
కన్ననూ
ఆచార్యుడు
(కుల
గురువు)
పదిరెట్లు
శ్రేష్ఠుడు.
ఆచార్యునికన్నను
కన్నతండ్రి
నూరురెట్లు
శ్రేష్ఠుడు.
కన్న
తండ్రికన్ననూ
మాతృదేవి
వేయిరెట్లు
పూజనీయురాలు,"
అని
మనువు
తన
మనుస్మృతిలోనే
తెలిపెను.
మనుస్మృతి
ధర్మశాస్త్రములన్నిటికినీ
ప్రమాణము,
మూలము,
కారణము
కూడా.
కాన,
అందులో
కూడను
మాతృ
స్థానమునకు
ఎంతటి
గౌరవస్థాన
మివ్వబడినదో
యోచింపుడు!
ధనాధి
దేవతయగు
లక్ష్మీదేవి
నారీ
లోకమునకు
చెందినవారే.
కనుకనే,
స్త్రీలకు
ఉత్తరములు
వ్రాయు
సమయమున,
"లక్ష్మీ
సమానురాలగు"
అని
సంబోధించుచున్నారు.
ఈ
సత్యమును
కూడను
మరువరాదు.
అంతేల,
కారణ
జన్ములగు
రామకృష్ణాద్యవతారపురుషులు,
4
▾
Meaning
Keep
శంకర,
రామానుజ,
మధ్వాది
మత
ప్రవక్తలందరు,
బుద్ధ,
ఏసుక్రీస్తు,
మహమ్మదు
ఇత్యాది
జ్ఞాన
సంపన్నులు
స్త్రీ
గర్భమందే
కదా
జన్మించిరి?
పవిత్ర
గర్భమును
దాల్చి
తత్త్వజ్ఞులగు
ఇట్టి
మహనీయుల
ఆవిర్భావమునకాదికారణులైన
మహాశక్తి
స్వరూపిణులు,
ఆ
స్త్రీలు.
ఆ
సతీమతల్లుల
గుణశీలమును
వారి
నిత్యానుష్ఠానమును,
ధర్మాచరణను
పాటించిన
ఆ
స్త్రీ
జాతికి
సంబంధించిన
ప్రతి
నారీమణికినీ,
బ్రహ్మజ్ఞానముపై
అధికారము
కలదు.
ఆ
పథ్యములను
మాత్రము
పాటింపక,
మాకును
ఆ
రోగనయములు
కావలెనన్న
యెట్లగును?
నిజముగ
జూడ,
ఆత్మ
స్త్రీ
పురుషాది
భేదరహితమై
నిత్య
శుద్ధ
బుద్ధ
ముక్త
స్వయంజ్యోతి
స్వరూపమైనది.
అట్టి
ఆత్మబోధ
కలిగినపుడే
ఆ
పవిత్రస్థానమునకర్హులగుదురు.
విద్యాధిదేవతయగు
సరస్వతియు,
ధనాధిదేవతయగు
లక్ష్మియు,
జ్ఞాన
స్వరూపిణి
యగు
పార్వతియు
స్త్రీలే
కదా?
ఈ
సత్యమును
తెలిసికొనకనే
స్త్రీలు,
కొన్నింటికి
అర్హులు
కాకపోయినప్పటికినీ,
బ్రహ్మతత్త్వమునకూ,
బ్రహ్మోపాసనకూ,
మోక్ష
సామ్రాజ్యమునకూ,
బ్రహ్మచర్యాది
వ్రతములకూ
అర్హులు
కాదనుట
నమ్మదగినది
కాదు.
నిద్రించుచున్న
సింహము
తన
ప్రభావము
గుర్తించనటుల
మాయా
సుషుప్తిలోనున్న
మానవులు
సైతము
తమ
దివ్యమగు
ఆత్మ
శక్తిని
కనుగానలేక,
కొన్ని
కొన్ని
వారి
వారి
అనుకూలములకు
తగినట్లు
నడచుకొంటూ
శాస్త్రము
చెప్పినదని
చెప్పుచుందురు.
శాస్త్రమేనాటికీ
అట్లు
చెప్పదు.
లోకమునకు
శాస్త్రము
నేత్రము
వంటిది.
దాని
ననుసరించి
అందలి
నిబంధనలను
పాటించుటే
మొదటి
ధర్మము.
అదే
నేడు
లోకమున
చేయవలసిన
ఘనకార్యము.
కానీ,
శాస్త్రమును
పూర్తీ
తెలిసికొన్న,
దాని
విషయమై
చర్చించవలసిన
అవసరముండదు.
ఏదో
తనకు
అనువగు
విషయములను
సూచించు
విషయములను
తీసికొని
శాస్త్రము
చెప్పినదని
వాదులాడిన
అది
సరియైనది
కాదు.
శాస్త్రమును
పూర్తీ
పరిశీలించిన
అందులో
లేనివి
యేవి
5
▾
Meaning
Keep
చేసినను
అది
శాస్త్రసమ్మతము
కాదు;
అంతేకాక
శాస్త్ర
నిందితుడగును.
అట్టివాడు
అనేక
పాపములకు
పాల్పడును.
కాన,
శాస్త్రధర్మమునకు
ఏనాటికినీ
అడ్డు
తిరుగకూడదు.
తిరుగుటేమి,
అట్లు
తలంచిననూ
పాపమే.
నేడు
లోకమీగతికి
వచ్చినదన్న
శాస్త్ర
విశ్వాసము,
శాస్త్ర
ధర్మమూ
లేకపోవుటే
కారణము.
ఇది
గొప్ప
అపచారము,
అధర్మము.
శాస్త్రములో
చెప్పబడిన
బ్రహ్మజ్ఞాన
లక్షణములు
లేనివాడు,
నియమనిష్ఠలతో
శాస్త్రమును
అభ్యసించి,
శాస్త్రవిహితములగు
కర్మలను
చేసి,
తదుపరి
మోక్షము
కొరకు
యత్నించవలెను.
సమస్త
శాస్త్రములు
చదివిన
వానికి
బ్రహ్మజ్ఞానము
లేకపోయినచో,
తాను
చదివిన
శాస్త్రములన్నియు
తనకు
భారమే
కానీ
వాటి
వలన
మరేమియు
సుఖము
కలుగదు.
సర్వశాస్త్రములు
చదివి
అందలి
సారము
తెలియని
మనుజుడు,
అనేక
రుచులుగల
పదార్థములలో
తిరుగుచుండు
గరిటెతో
సమానము.
శాస్త్రాధ్యయనము
చేసియు
అవిద్యలో
నుండి,
పండితులమని
భావించు
వారు,
అంధులను
ఊతగాగొని
వెళ్లెడి
అంధులతో
సమానమని
ముండకోపనిషత్తు
కూడను
తెలిపెను
కదా?
శాస్త్రజ్ఞానము
లేకపోయిననూ
అనుభవాత్మక
ఆత్మజ్ఞానమున్నచో
తద్వారా
ముక్తిని
పొందును.
ఇతరులకు
కూడనూ
ఉపయోగపడును.
అజ్ఞానికి
శాస్త్రమేలాగున
ఆవశ్యకమైనదో,
అలాగుననే
సర్వకాల
సర్వావస్థలయందాత్మనిష్ఠల
యందును,
ఈశ్వర
ధ్యానమందును
నిమగ్నుడైయుండు
పుణ్యజీవునకు
శాస్త్రమవసరము
లేదు.
సత్కర్మాచరణలలోనూ,
సద్ధర్మానుష్ఠానములలోనూ
ప్రారంభములో
దుఃఖముగ
నున్ననూ,
రాబోవు
గొప్ప
సుఖమునకు
హేతువులై
నున్నందున,
వాటిని
అట్టి
సుఖమును
గోరువారు
తప్పక
అనుష్ఠించవలెను.
బుద్ధిమంతుడీ
సత్యము
నెరింగినచో
తరించగలడు.
లేనిచో
పాపముజెంది
బద్ధుడగును.
6
▾
Meaning
Keep
మనస్సు
ననుసరించే
యుగము
ప్రవర్తించుచున్నది.
అందుకనే
కృతయుగము
నాలుగు
పాదములు
గల
ధర్మముతో
గూడినదనియూ,
త్రేతాయుగము
మూడు
పాదములు
గల
ధర్మముతో
కూడినదనియూ,
ద్వాపరయుగము
రెండు
పాదములు
గల
ధర్మముతో
గూడినదనియూ,
కలియుగము
ఒక
పాదముతో
కూడినదనియు
సామాన్యముగా
చెప్పుచుందురు
గదా?
ధర్మమునే
పాదములుగా
చెప్పుచుందురు.
ఆ
పాదములే
సత్య,
దయా,
తపో,
దానములను
నాలుగు.
ఇవి
యెవరి
యందుండునో
అట్టి
మహా
పురుషులు
ఏ
యుగమునందుండిననూ
కృతయుగము
వారనే
తలంచవచ్చును.
తలంచుటేమి?
సత్యము;
వారు
కృతయుగ
పురుషులే.
ఇంక
సత్యము
నశించి,
దయా
దాన
తపస్సులు
మూడింటిలో
మాత్రమే
కూడియున్న
మానవుడు,
ఏ
యుగమునందున్ననూ
త్రేతాయుగమువాడే.
తరువాత,
దయా
సత్యములు
నశించి
తపో
దానములు
రెండింటితోనే
సంచరించువాడు
ఏ
యుగమునందున్ననూ
ద్వాపరయుగమువాడే.
ఆపైన
సత్య
దయా
తపస్సులు
నశించి
ఒక్క
దానము
మాత్రము
గలిగినవాడు
ఏ
యుగమునందున్ననూ
కలియుగమువాడే.
యుగములు
సహితము
ధర్మ
పాదములయిన
సత్య,
దయా,
తపస్సు,
దానముల
వలననే
మారుచున్నవి.
దీనినిపట్టి
చూడ
యుగ
మార్పు
కూడనూ
ధర్మముపై
ఆధారపడియున్నది.
సర్వమునకూ
ధర్మమే
ఆధారము,
ఆధేయము.
ధర్మములను
పట్టే
గుణములు
మారును.
దుష్టుడైన
హిరణ్యకశిపుడూ,
సజ్జనుడైన
ప్రహ్లాదుడు
ఒకే
యుగమున,
అనగా
కృతయుగమున
జన్మించిరి.
ఒకే
యుగమున
ధర్మ
బుద్ధి,
శాంత
స్వభావముగల
ధర్మజుడు,
లోకవంచకుడగు
దుర్యోధనుడు
జన్మించిరి.
కృతాదియుగములు
వేరువేరుగా
నున్నచో
పైవారు
ఆయా
యుగములలో
జన్మించి
ధర్మాధర్మ
ప్రవర్తకులుగ
నుండకపోదురు
కదా?
కాన
అన్నింటికీ
ధర్మమే
కారణము.
ధర్మముననున్న
పాదములను
ప్రధానముగా
గ్రహించి,
7
▾
Meaning
Keep
చరించిన
యెప్పటికినీ
మనము
కృతయుగము
వారలమే.
మన
ప్రవర్తనలే
ఈ
యుగ
మార్పులనూ,
ధర్మమార్పులనూ
తెప్పించి,
అనేకమైన
అపోహలకు
గురిచేయుచున్నవి.
Previous
←
The Householder Is the Best of Men
Next
Temples Are Means to the Realization of Satya
→