Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · Temples Are Means to the Realization of Satya
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
10
ఆలయాలు
సత్యసాక్షాత్కార
సాధనాలు
ఇక
ఆలయములూ,
మఠములూ,
మందిరములూ
అని
పిలువబడు
భగవత్
సాకార
స్వరూప
నిలయముల
సంగతా?
అనేకులనేక
రీతుల
నిబంధనలను
కల్పించి,
కట్టుబాట్లను
బలపరచి,
కడకు
అవి
కూడను
ధర్మవిరుద్ధమై,
ధర్మాచరణాకాక,
బ్రహ్మాచరణాకాక,
కర్మాచరణాకాక
అయోమయములో
దింపు
అంధకార
ఆచారములై
లోకమునకు
మరింత
హాని
గలిగించుచున్నవి.
అసలు
నాస్తికత్వమునకు
ప్రథమ
సోపానమే
యిది!
నిజముగా
యోచించిన,
ఆలయాలు
సత్యసాక్షాత్కార
సాధనాలు,
ఆధ్యాత్మిక
కళాశాలలు,
శాస్త్రాభ్యాస
సౌకర్యాలు,
సత్య
విజ్ఞాన
కేంద్రములు,
జీవిత
పరిశోధనా
మందిరములు.
భవరోగమునకేగాక,
మనోరోగములకు
సహితము
వైద్యశాలలు.
మానవుని
దౌర్బల్య,
అనుమాన,
అహంకార
నిర్మూలనా
వ్యాయామ
రంగములు.
హృదయ
సౌందర్య
సంస్కార
దర్పణాలు.
దేవాలయాల
ఆశయం,
దేహమునే
దేవాలయంగా
భావించి,
జీవుని
దేవునిగా
ప్రవర్తింప
జేసి,
మానవునిలోని
మాధవత్వమును
జాగృతి
చేయడం.
అందుచేత,
ఆలయాల
ఆచార
వ్యవహారములన్నియూ
బ్రహ్మజ్ఞాన
వికాసమునకు
అనుకూలమై
యుండవలెననే
వాటి
ఆశయము.
బ్రహ్మవిజ్ఞాన
వికాసమునకు
అనుకూలపడే
ధర్మకర్మలన్నియూ
శాస్త్రవిహిత
కర్మలే.
అనుకూలపడని
కర్మలన్నియూ
శాస్త్రవిరుద్ధ
కర్మలే.
మన
ప్రాకృత
భావాలను,
ప్రాకృత
హక్కులను,
2
▾
Meaning
Keep
ప్రాకృత
కర్మలను,
ప్రాకృత
బోధనలను
ఈశ్వరాభిముఖము
చేసి,
సత్య
శాంతి
సాక్షాత్కారమును
కలిగించడానికే
వివిధ
మందిరములు,
ఆలయములునూ.
దేవతారాధనా
విధానములన్నియూ,
నరునకూ
నారాయణునకూ
గల
సనాతన
సంబంధాన్నీ,
మానవులకూ
మాధవునకూ
గల
మాధుర్య
మతాన్నీ,
జీవునకూ
బ్రహ్మమునకూ
గల
అవినాభావ
సంబంధమునూ
స్ఫురింప
చేసి,
సన్నిహితం
చేసి
శాశ్వతానుభూతిని
చేకూర్పడానికే.
వాని
ప్రయోజనము,
వాని
బాధ్యత,
వాని
కార్య
ప్రణాళిక
గంభీరమైనవి.
ఆలయాల
పతనావస్థ,
ఆత్మ
యొక్క
పతన
దశను
ప్రకటించును.
ఆలయాల
యొక్క
సక్రమ
స్థితి,
ఆత్మ
ఉన్నత
స్థితిని
నిరూపించును.
ఆలయానికి,
ఆత్మకూ
అత్యంత
సంబంధమున్నదని
ప్రకటించుటే
ఆలయాల
ధర్మము.
నేటి
ఆలయ
సంబంధమైన
లౌకికాచారములు,
మతాచారములు
–
భక్తి,
జ్ఞాన,
వైరాగ్య,
వికాసములకు
ప్రాధాన్యమిచ్చి
వాటికి
విధేయతగా
నుండవలెను.
నేడు
కలిగిన
మిథ్యాశాస్త్రములట్లుంచి,
సనాతన
సత్య
శాస్త్రాచారములన్నియూ
లౌకిక,
పారలౌకిక,
ధర్మసమన్వయాత్మకములైనవే.
భక్తి,
జ్ఞాన,
వైరాగ్యములను
పెద్ద
గుర్తుగా
పెట్టుకొని,
ఆచార
వ్యవహారాలను
సముచితరీతిగా
మెలకువతో
తీర్చిదిద్దమని
శాస్త్రములు
మానవునకు
బోధించుచున్నవి.
ఇందులో,
అనగా,
భక్తి,
జ్ఞాన,
వైరాగ్యములను
మూడింటియందును
భక్తి
రాణి
అనియూ,
ఆచార
వ్యవహారములు
ఆమె
చెలికత్తెలనియూ,
భక్తి
అను
రాణి
తన
సఖీమణులను
ప్రేమతో
మన్నించుననియూ,
భక్తియను
రాణిని
ధిక్కరించిన
చెలికత్తెలగు
ఆచారములను
బహిష్కృతి
తప్పక
చేయుననియు,
మన
ఆచారములన్నియూ
భక్తియను
రాణిని
విధేయతగా
సేవించవలెననియూ
సత్య
ధర్మ
సూత్రముల
యొక్క
సారము.
అట్లుండిననే
సాధకుడైన
జీవుడు
లేక
మానవుడు
సార్థకత
జెందుననియూ
దీని
బోధన.
3
▾
Meaning
Keep
మానవుని
మనఃప్రవృత్తులను,
ఇంద్రియ
వికారములను,
భావ
ధారలను,
పరమ
గమ్యమైన
పరమేశ్వరునకు
అభిముఖములయ్యేలా
చేసి,
ఉద్దీపింపజేసి,
దివ్యీకరించి
బ్రహ్మైక
సుఖాన్ని
అతి
సహజ
విధానములో,
భక్తి
సిద్ధింపజేస్తుంది.
ఈ
భక్తి
ననుసరించే
దేవతార్చనా
కలాపములన్నీ
ఆవిర్భవించాయి.
మేలుకొలుపు
మొదలు
పవళింపు
సేవల
వరకు
జరుగునవన్నియు
వివిధ
భక్తి
భావ
సాధనలో
చేరినవే.
ఒక్కొక్క
భావ
సాధన
దాని
స్థానంలో
అతి
రమ్యంగా
వుంటుంది.
సత్యభావోదయంలో
ఈ
భావతారకలన్నీ
విలీనమై
అదృశ్యమైపోతాయి.
ఇంతకూ
ప్రాకృత
భావాలు
పరమేశ్వరాంకితములై
పవిత్రస్వరూపమును
ధరించును.
భగవంతుని,
ఎవరే
భావముతో
కొల్తురో
వారికా
విధంగా
గోచరించును.
సద్భావము
దీపించిన
కొలదీ
పరమేశ్వరుని
సత్య
స్వరూపము
గోచరించును.
భగవంతుని
భూతముగా
భావిస్తే
భూతమై
మ్రింగును.
భగవంతుని
భూతనాథునిగా
భావించి
విశ్వసించిన,
లోకనాథుడై
సాక్షాత్కరించును.
అది
యెట్లని
ప్రశ్నింతురేమో;
ప్రశ్నించుటేమి,
నేటి
కలిలోనున్న
అవివేకమే
అది
కదా?
తెలిసిన
వారూ,
తెలియని
వారూ
సలహాలు
అడుగుట
ఒక
ఫ్యాషన్!
ఆ
సలహాల
ప్రకారము
నడుచుకొందురో
లేదో,
అది
తరువాత
యోచన.
అది
ఒక
గౌరవమనియూ,
తాము
అన్నియూ
తెలిసినవారనియూ
లోకులు
తలంచవలెనని
ఈ
అంధకారమున
మునుగుదురు.
పాపము!
అట్టి
వారిని
చూచిన
ఎంతో
జాలి
వేయును.
భగవంతుని
విషయమును
ఇట్లు,
అట్లని
యెవ్వరునూ
నిర్ణయించి
తెలుపలేరు.
జ్ఞాన,
వైరాగ్యములకు
కొన్ని
ప్రమాణములున్నవి
కానీ,
భక్తికి
భక్తియే
ప్రమాణము.
దానికి
వేరు
ప్రమాణము
లేదు.
ఎందుకన,
అది
అన్ని
రూపములూ
ధరించును.
భక్తుని
భావములనుపట్టి
మారును.
లేకున్న
కంస,
శిశుపాల,
జరాసంధ,
హిరణ్యకశిపాదులు
భగవంతుని
శత్రువుగా
భావించారు.
4
▾
Meaning
Keep
వారి
భావములకు
తగినట్లే
పరమేశ్వరుడు
వారలకట్లు
సాక్షాత్కరించెను;
అంతమొనరించెను.
పరమాత్ముని
ప్రేమస్వరూపునిగా
భావించిన
జయదేవ,
గౌరాంగ,
తుకారాము,
రామదాసు,
సూరదాసు,
మీరా,
రాధ,
సక్కుబాయిలకు
పరమేశ్వరుడు
ప్రేమస్వరూపుడుగానే
అండయై,
దండయై,
నిండు
ఆనందమొసగెను.
అమాయకపు
బిడ్డలు
సూర్యుని,
అమ్మ
ముఖమున
బెట్టిన
కుంకుమ
బొట్టువలె
భావింతురు.
అనుభవజ్ఞులైన
పెద్దలు
ఆ
సూర్యుని
తేజోమండలంగా
దర్శింతురు.
వీటికి
కారణము,
వారివారి
మనోభావములే
కదా?
ఇట్లే,
మానవులు
పరమేశ్వరుని
గూర్చి,
మందిర,
ఆలయాలను
గూర్చి
సంభావించగలుగుతారు.
భగవంతుని
గూర్చి
గానీ,
మందిర
ఆలయాలను
గూర్చి
గానీ
ఉన్నత
సంభావన
చేయగలగటం
మానవ
జాతికి
సముచితం,
సత్ఫలప్రదం.
మానవుడు,
మాధవుని
మానవాకారంగా
సంభావించటము
సముచితమే.
కానీ,
ప్రాకృత
మానవునిగా
సంభావించకూడదు.
అప్రాకృత
దివ్యమంగళ
విగ్రహంగా
సంభావించవలెను.
ఇది
భక్తి
భావముల
ధర్మము.
మానవ
దృష్టితో
చేయు
భావములు,
మధుర
మంజులములై
మానవునిలోని
ప్రాకృత
వికారములను
విస్మరించేలా
చేయవలెను.
ఆ
భావములు
మానవునిలోని
పశు
వికారములను
లేపకూడదు,
రేపకూడదు.
ఉదాహరణమునకు
ఒక
విషయము
చూడుడు.
త్యాగరాజే,
శ్రీరామచంద్రునకు
పవ్వళింపు
సేవ
చేయు
సమయమున
తన
పవ్వళింపును
విస్మరించెను.
ఇందులో
రాములను
ఊయలలో
ఉంచడము
కాదు.
రాముడే
భక్తి
డోలికలలో
త్యాగరాజును
ఊచినట్లు
భావించవలెను.
అట్లు
లేకున్న,
రాములను,
కృష్ణుణ్ణి,
లేక
మరే
యిష్ట
దైవమును
ఊయలలో
ఊపే
సమయమున
తన
యింటిలో
ఊగే
బాలుణ్ణి
గుర్తుకు
తెచ్చుకొనక,
తన
యింటిలో
బాలుణ్ణి
ఊయలలో
ఊపుచున్ననూ,
బాలకృష్ణుని,
బాలరాముణ్ణి
ఆ
ఊయలలో
ఊపుచున్నట్లు
స్మృతికి
తెచ్చుకొనవలెను.
5
▾
Meaning
Keep
అట్లే
మందిరములలో,
ఆలయములలో
పరమాత్ముని
దర్శించునపుడు,
తన
హృదయ
మందిరములో
ప్రతిష్ఠింపబడిన
జీవబ్రహ్మమును
స్మృతికి
తెచ్చుకొను
ఆశయమును
బలపరచుటకై
ఆలయ
ధర్మకర్మలను
ఆచారము
క్రింద
నిర్బంధించిరి
కానీ,
వేరు
భావములు
కావు,
వికారములు
లేవు.
అట్లుగాక,
అర్చకుడు
పెట్టిన
తిండి
తిని,
నీరు
త్రాగి,
యేదో
కాపురము
చేసుకొనుచుండిన
పామర
దంపతులుగా
మానవులు,
సీతారాములనుకానీ,
రాధాకృష్ణులనుగానీ,
లక్ష్మీనారాయణులనుగానీ,
పార్వతీపరమేశ్వరులనుగానీ
తలంచరాదు.
అంతేకాక
ఆచారములకు
అర్థములు
తెలియక,
అర్ధరాత్రి
వేళలో
దంపతులు
నిద్రించుచుందురని
కొన్ని
ఆలయాలలో
తలుపులు
తీయరు.
ఆరగింపు
సమయములలో
ఇతరులను
విడువరు.
ఏమనిన,
స్వామికి
పవ్వళింపు
జరిగినది,
ఇంక
తలుపులు
తీయము,
అని
అర్థరహితమైన
సమాధానములు
తెలుపుదురు.
అంతేకాక,
స్వామి
పవ్వళించినారు,
ఎవ్వరూ
అరువక
నిశ్శబ్దముగా
వెళ్ళండని
కూడా
అందురు.
ఆ
సమయములందు
ఏదో
ఆపదల
మ్రొక్కులకు
కూడా
అవకాశములుండవు.
ఇట్లు
పద్ధతులను
అనేక
అపార్థములకు
దారితీయునట్లు
చేసి
అసలైన
అర్థమును
కప్పిపుచ్చుచున్నారు.
ఈ
పద్ధతులను
చూచుచు
అనేక
భగవత్
విశ్వాసహీనులు
నిజార్థమును
తెలిసికొనలేనివారై
"అట్లయిన
భగవంతునకు
ఉక్కపోయదా,
లేక
మలమూత్ర
విసర్జనములకు
వెలుపలకు
వచ్చు
అవసరములు
లేవా?"
అని
అనేక
హాస్యాస్పదములైన
మాటలను
ఆడిపోతురు.
ఇట్టివారు
ఇరువురును,
అనగా,
అర్చక
ఆస్తికులును,
పరిహాస
నాస్తికుడునూ
సత్యధర్మమును
ఎరుగనివారే
అగుచున్నారు.
అందువలననే
నేటి
లోకస్థితి
ఈ
స్థితికి
వచ్చినది.
ఇట్టి
సామాన్య
లౌకిక
భావములతో
మానవులు
ఆలయాలను
అపార్థముల
క్రింద
దించకూడదు.
ఉత్తమ
సంస్కృతిని
పొందవలెను.
ఏ
భావమైనా,
భక్తి
చేతనే
సుందరముగా
మారుతుంది.
6
▾
Meaning
Keep
నేడు
నవీన
భావాల
చేత
ఆలయాలన్నియు
హాస్యాస్పదములై
పోయినవి.
ఇది
చాలా
శోచనీయము.
అందుకనే
ఆలయాల
యథార్థ
ధర్మ
భావములను
బైట
పెట్టి,
వాటికి
పట్టము
కట్టి,
వాటి
ఆచరణలలో
ఆలయాలను
అభివృద్ధిపరచవలెను.
మనము
జోలపాడిన
పండుకొనినట్లు,
మేలుకొలిపిన
లేచినట్లు,
నైవేద్యము
పెట్టిన
తినినట్లు,
పెట్టకున్న
యెండినట్లు
లేక
పస్తుండినట్లు
తలంచుట
యెంత
అవివేకము!
అండపిండ
బ్రహ్మాండమంతటా
నిండి
కాలాతీతమై,
కాంతియుతమై
కరుణ
కలిగిన
పరమాత్మకు
హద్దులు
నిల్పి,
వాటిని
సత్యభావములకు
సమకట్టక,
అసత్య
వూహలకూ,
హాస్యములకూ,
అర్థరహితమునకూ
అంటగట్టిన
యెంత
అవివేకము!
భక్తుని
బాధలు
కానీ,
అశాంతి
కానీ
కాలము
చెప్పివచ్చునా?
అట్టిది,
భగవంతుని
కాలములో
బంధింపబడిన
భక్తుని
బాధలు
తెలుపుకొనుటకు
కాచియుండవలెనన్న
మాట;
అయ్యో!
ఎంత
పిచ్చి!
శిశువు
తల్లిపాల
కోసము
ఎపుడైనా
ఏడువవచ్చును.
తల్లి
గాఢనిద్రలోనైనా
లేచివచ్చి
బిడ్డకు
పాలిచ్చును
కానీ,
నిద్ర
సమయములో
పాలకొరకు
ఏడ్వకూడదని
తిరస్కరించునా?
అట్లే
జగన్మాత,
జగత్పిత
అయిన
పరమాత్మను
గూర్చి
కొందరు
బిడ్డలైన
భక్తులు
అట్లు
భావించవచ్చును
కదా?
ఈ
భావముతో
నిజముగా
యోచించిన
భగవంతుని
నిద్రాభంగమనునది
నామరూపములు
లేకుండా
కొట్టుకొనిపోతుంది.
ఏదైనా
భావ
వికాశమునుపట్టి
వుంటుంది.
మానవునకు
కావలసినది
సర్వజనీన
తారకమైన
ఉన్నత
భావము.
భగవంతుడు
సర్వమయుడు,
సర్వసమర్థుడు,
సర్వసాక్షి,
సర్వజ్ఞుడు
అన్న
సత్యమును
గుర్తించి,
అందుకు
తగిన
భావములు
మానవ
సాధనలో
సంస్కరించుకోవలసియున్నది.
ప్రాకృత
వికారములు
దేవునికి
అంటగట్టకూడదు.
కాన,
సమున్నత
భక్తిభావములు
అత్యవసరము.
భగవంతునకు
నిద్రాభంగము,
నైవేద్యసమయము,
సుఖ
భంగము
అని
ఇలాంటి
శైశవ
భావాలతో
ఆలయాల
ద్వారాలు
ఆ
సమయములలో
తీయకూడదు
అనే
దృష్టి
మాత్రం
విహితమైనది,
7
▾
Meaning
Keep
విశాలమైనది,
విజ్ఞానమయమైనదీ
కాదు.
భక్తి
భావము
వికసించు
కాలదీ
సామాన్య
భావములు
నిలువక
పారిపోవును.
ఒక
చిన్న
విషయము
తలపునకు
వచ్చుచున్నది.
ఒకానొక
సమయమున
కలకత్తాలో
రాణి
రాస్మణి
నిర్మించిన
కాళికాలయమున
ఒక
గోపాల
విగ్రహం
క్రిందపడి
కాలు
విరిగిపోయినది.
అపుడు
అనేకమంది
పెద్దలు
విరిగిన
విగ్రహము
అర్చనకు
పనికిరాదని,
శాస్త్రము
ఒప్పదనీ
చెప్పినందున
రాణి
రాస్మణి
కొత్త
విగ్రహం
చేయించుటకు
తగిన
యేర్పాటు
చేయుచుండెను.
అప్పుడు
రామకృష్ణుడు
ఈ
విషయము
తెలుసికొని
రాస్మణి
దగ్గరకు
వెళ్ళి,
"మహరాణీ,
నీ
అల్లునికి
కాలు
విరిగితే
ఆ
కాలు
కట్టు
కట్టించి
లేక
అతికించి
యెట్లయినా
దానినే
సరి
చేయించుకొందువేకానీ,
కాలు
విరిగిన
అల్లుడని
అతనిని
త్రోసివేసి
వేరే
అల్లుణ్ణి
మారుస్తావా?"
అని
అడిగెను.
అప్పుడు
పండితులు
నిరుత్తరులై,
విరిగిన
కాలు
అతికించి
ఆ
విగ్రహాన్నే
ప్రతిష్ఠించినారు.
చూడు,
భక్తి
దీప్తించినపుడు
భగ్న
విగ్రహములో
అభంగుడైన
పరమాత్ముడు
గోచరించును.
ఇదియును
శాస్త్రము
చెప్పిన
ధర్మమే.
తలుపులు
మూసిన
పిదప
ఎవరు
వచ్చినా
తీయకూడదనేది
సామాన్య
నియమము
కావచ్చును.
కానీ,
సనకసనందనాదుల
వంటివారో,
లేక
చైతన్య,
జయదేవాదులవంటి
వారో
వచ్చినపుడు
ఈ
నియమం
సడలించక
తప్పదు
కదా!
ఉడిపిలో
కృష్ణుడే
తిరిగినాడు.
నందనారునకు
ఈశ్వరుడే
వంగినాడు!
వీటి
సత్యమేమిటి?
అట్లు
కాకున్న,
వారు
ఏమైనారు?
భక్తి
సూత్రములననుసరించే
మన
ఆచార
వ్యవహారములు
విరచించుకోవలసియున్నది.
తలుపులు
తెరవకుండా
ఉండుటకు
కారణము
దైవాచారమనే
దృష్టి
కాకూడదు.
పై
నియమములు,
పెద్దలైనవారు
కొన్నికొన్ని
భావములను
అనుభవమున
గుర్తించి,
ఇట్టి
హద్దులను
పెట్టిరే
కానీ,
ఇది
దైవశాస్త్ర
ధర్మము
కాదు.
8
▾
Meaning
Keep
ఆ
యనుభవము
లేదని
శంకింతురేమో;
ఆలయ
సేవాదులకు
సమయ
నిర్ణయములు
లేకపోతే
సామాన్య
జనులకు
భక్తి
అంత
ప్రకాశించక
నశించునేమో
అనియూ,
అవి
ప్రజలలో
భక్తి,
శ్రద్ధ
నియమాలు,
భక్తి
తీవ్రత
కలిగించడానికనియు
నిర్ణీత
సముచిత
సదుపాయములలోనే
ఆలయదర్శన
సేవాదులకు
ఏర్పాట్లు
చేయటం
అసమంజసం
కాదు;
ఈ
విధానాన్ని
విశిష్టధర్మంగా
మనమెంచవచ్చును.
సముచిత
నిర్ణీత
సమయాలలో
దేవాలయ
ద్వారాలు
తెరచి
దర్శించవచ్చును.
ఆలయాల
ఆశయము,
ధర్మము,
ఆత్మ
-
సంస్కృతిని
మానవులకు
కలిగించడమే.
భగవద్విజ్ఞాన
వికాసానికి
తగిన
రీతిగా
మానవ
భావాలూ,
సేవలు,
ఆచారాలూ
ఉండవలెను.
అయితే,
ఆలయ
సేవాదులు
సక్రమంగా
జరగడానికి
సమయ,
నియమ,
నిర్ణయాదులు
సర్వసామాన్య
ధర్మంగా
నుండవలసినదే,
అవి
అవసరమే.
లేకపోతే,
సామాన్య
జనులలో
శ్రద్ధ,
క్రమశిక్షణ,
భక్తి
దీప్తి
ఏర్పడదు.
కాన,
ప్రజలకు
ఉత్తమ
ప్రయోజనమును
కలిగింపగల
విశిష్టభక్తి
సమయాల్లో,
అనుదిన
నియమాల్లోనే
కాక,
ఇతర
సమయములందు
కూడా
భగవత్సేవార్థం
ఆలయద్వారాలు
తెరవవచ్చును.
ఇందులో
అర్చకుల
బాధ్యత,
ధర్మకర్తల
బాధ్యత,
ప్రజల
బాధ్యత
గురుతరమైనది.
భక్తి
దృష్టితో,
శ్రద్ధతో,
భగవత్సేవను
నిర్వహింపగల
సంస్కృతి
యొక్క
అవసరాన్ని
అందరూ
గుర్తించవలెను.
మందిరములూ,
ఆలయములూ
మానవుల
బాగుకే
అను
విషయమును
ప్రతి
మానవుడును
మరువకూడదు.
Previous
←
Everyone Is Fit for Brahma-Vidyā!
Next
Three Ages — Vedic, Upaniṣadic, Purāṇic
→