Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · Three Ages — Vedic, Upaniṣadic, Purāṇic
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
11
మూడు
యుగములు
–
వైదిక,
ఉపనిషద్,
పౌరాణిక
హిందూధర్మ
సంబంధమైన
ఆధ్యాత్మిక
ధర్మకర్మలననుసరించి
స్థూల
రూపమున
యుగములు
మూడు
విధములుగానున్నవి.
ఒకటి,
కర్మయే
ప్రధానముగా
గల
వైదిక
యుగము;
రెండు,
జ్ఞానమే
ప్రధానముగాగల
ఉపనిషద్
యుగము;
మూడు,
భక్తియే
ప్రధానముగాగల
పౌరాణిక
యుగము.
వైదిక
సాహిత్యము,
సంహితలు,
బ్రాహ్మణములు,
ఆరణ్యకములు,
ఉపనిషత్తులను
నాలుగు
భాగములుగా
విభజింపబడినది.
అందులో
మొదటి
మూడైన
సంహిత,
బ్రాహ్మణ,
ఆరణ్యకములలో
కర్మకాండమూ,
ఉపనిషత్తులలో
జ్ఞానకాండమూ
ప్రతిపాదింపబడియున్నవి.
వేద
సంహితా
భాగముల
మంత్ర
సమూహము,
ఇంద్రుడు,
అగ్ని,
వరుణుడు,
సూర్యుడు,
రుద్రుడు
మొదలగు
దేవతల
యొక్క
స్తోత్రములతో
నిండియున్నది.
ఈ
మంత్రములతోనే
ప్రాచీన
ఆర్యులు,
దేవతలనుద్దేశించి
యజ్ఞయాగాదులు
ఆచరించి
అభీష్టసిద్ధినందుచుండెడివారు.
పరమాత్మ
ఒక్కడై,
అద్వితీయుడైయుండి
కూడా
వివిధములగు
దేవతా
నామములతో
వ్యక్తమగుచున్నాడన్న
సత్యసూత్రమును
మన
పూర్వులు
గ్రహించినట్లు,
ఈ
తత్త్వమును
గూర్చి
ఋగ్వేదమందనేక
మంత్రములలోనుద్ఘోషించబడినది:
2
▾
Meaning
Keep
"ఏకం
సత్
విప్రా
బహుధా
వదన్త్యగ్నిం
యమం,
మాతరిశ్వాన
మాహుః"
తత్త్వదర్శనులగు
మహాత్ములు,
ఒకే
సత్పదార్థమగు
పరబ్రహ్మమును
యముడు,
అగ్ని,
మాతరిశ్వుడు
మొదలగు
వివిధ
నామములతో
పేర్కొనుచున్నారని
దీని
అర్థము.
అట్టి
అద్వితీయుడగు
'బ్రహ్మము'
ఋగ్వేదమునందలి
పదపదమునందున
హిరణ్యగర్భుడు,
ప్రజాపతి,
విశ్వకర్మ,
పురుషుడు
మొదలగు
నామములతో
ప్రకటింపబడియున్నాడు.
దీనికి
ఋగ్వేదము
యొక్క
హిరణ్య
గర్భ
సూక్తము,
పురుష
సూక్తము
మొదలగునవే
ప్రమాణము.
ప్రాచీనార్యుల
యొక్క
ప్రధానమగు
అనుష్ఠానము,
ధర్మము;
అదియే
యజ్ఞము.
వారి
యొక్క
యజ్ఞాద్యనుష్ఠానములు,
అర్చనలు,
వందనములు,
నమస్కారములు
మొదలగు
భక్త్యంగములతో
కూడియున్నవి.
వేదసంహితలలో
'భక్తి'
శబ్ద
ప్రయోగము
సుస్పష్టముగా
కనబడకపోయిననూ
ఆ
అర్థములో
'శ్రద్ధ'
అను
శబ్ద
ప్రయోగము
తరచుగా
కనపడుచుండును
కదా?
శ్రద్ధయాగ్నిః
సమిధ్యతే
శ్రద్ధయా
హూయతే
హవిః
।
శ్రద్ధాం
భగస్య
మూర్ధని
వచసా
వేదయామసి
॥
"శ్రద్ధ
ద్వారా
మాత్రమే
యజ్ఞాగ్ని
ప్రజ్వలితమగుచున్నది,
శ్రద్ధ
వలననే
హవిర్భాగముల
ఆహుతులందబడుచున్నవి.
సమస్తమగు
ఆరాధనలకూ
ప్రధానాంగమైన
శ్రద్ధను
మేము
స్తుతించుచున్నాము,"
అని
పై
శ్లోకార్థము.
చూడుడు!
శ్రద్ధ
యెంత
పవిత్రశక్తి
కలిగినదో
యోచించుడు!
వేదకాలమున
దైవభక్తి
మూలకములగు
సహజ,
సరళ
ధర్మములు,
పరిశీలనకు
అందుబాటులోనుండెడివి.
ఇటీవల,
ఆ
భక్తి
ధర్మములు,
జటిలములగు
క్రియా
విశేషములతో
కూడిన
బహుళ
యజ్ఞానుష్ఠానములందు
మరుగుబడిపోయినవి.
కాలక్రమమున
అట్టి
మతమభివృద్ధి
నొంది,
'యజ్ఞమే
మనకు
ధర్మము,
ఆ
యజ్ఞానుష్ఠానము
వలననే
జీవులు
సర్వసుఖములు
3
▾
Meaning
Keep
పొందగలరు',
అని
బోధించిరి.
అయితే,
యజ్ఞానుష్ఠానము
దేవతల
నుద్దేశించి
చేయబడుచున్ననూ,
యజ్ఞమునకు
మాత్రమే
ప్రాముఖ్యముండెను.
దేవతలు
గౌణములు.
అందుచేత,
"యజేత
స్వర్గకామః"
స్వర్గ
సుఖాపేక్షతో
మాత్రమే
యజ్ఞములు
చేయవలసినదని,
వేదవాదమను
పేర
బోధింపబడసాగెను.
ఇంతలో
ఉపనిషద్
యుగము
ప్రారంభమయ్యెను.
చైతన్యరహితమగు
భౌతికవాదములు
ఖండించుచూ,
ఉపనిషత్తులలో,
'వేద
కర్మకాండము
మానవులను
సంసార
సాగరము
నుండి
తరింపచేయుటకు
'నావ','
అని
ఆవిర్భవించెను.
ఉపనిషద్యుగమునందలి
సాధకుని
దృష్టి
బాహ్యజగత్తును
ఛేదించుకొని
అంతర్
జగతిపై
కేంద్రీకృతము
కాజొచ్చెను.
ఉపనిషద్
ఋషులందరును
కలసి
'చరమ
తత్త్వము'
యొక్క
స్వరూప
నిర్ణయము
ఈ
విధముగ
చేసియుండిరి.
ఈ
నామరూపాత్మకమగు
దృశ్య
ప్రపంచాంతరాళములో
నిత్యమైన,
శాశ్వతమైన
ఒక
సత్పదార్థము
గలదు.
అదియే
'పరబ్రహ్మము'.
ఆ
పరమేశ్వరుని
జ్ఞానయోగము
వలన
గ్రహించవలెను.
"తద్విజిజ్ఞాసస్వ
తద్బ్రహ్మ".
"ఈ
బ్రహ్మవిద్యనే
ఉపనిషత్తులు
(వేదాంతము)
ప్రతిపాదించుచున్నవి."
ఇంతియే
కాదు;
ఇంకనూ
ఉపనిషత్తులిట్లు
చెప్పుచున్నవి;
వేదవాదము
స్వర్గ
సాధనమైననూ
మోక్షసాధనమునకు
కూడను
ఆధారము.
కేవలము
బ్రహ్మవిద్యాలంబనముతో
పరబ్రహ్మప్రాప్తి
లభ్యమగుచున్నదని
కూడా
తెలిపెను.
ఉత్తమ
విషయములనేకములు
పఠించుట
వలన
గానీ,
గ్రంథ
ధారణాశక్తి
వలన
గానీ,
పాండిత్య
ప్రకర్షణల
వలన
గానీ
ఈ
పరమాత్మను
పొందుటకు
వీలుకాదు.
ఏ
సాధకుడు
పరమాత్మను
ఉపాసించునో
అతడు
మాత్రము
పరమాత్మను
పొందును.
అయితే,
మరొకటి
మరువరాదు.
పై
చెప్పిన
గ్రంథ
పఠన,
గ్రంథ
ధారణాశక్తి,
పాండిత్య
ప్రకర్షణలూ
ఉండియూ,
అందులో
పరమాత్మోపాసన
ప్రాప్తించిన,
వాడు
పరమ
పుణ్యుడు,
ధన్యులలో
ధన్యుడు;
4
▾
Meaning
Keep
పరమాత్మ
ప్రత్యక్ష
స్వరూపమున
అతని
యెదుట
నిలుచును.
అందుకనే
బృహదారణ్యకోపనిషత్తులో
జీవునకు,
పరమాత్మునకు
గల
సంబంధమును
ఈ
రీతిగా
తెలిపెను.
"ఏషాఽస్య
పరమా
గతిరేషాఽస్య
పరమా
సమ్పద్
ఏషోఽస్య
పరమో
లోక
ఏషోఽస్య
పరమానందః"
పరమేశ్వరుడే
ఈ
జీవులకు
పరమ
గతి,
పరమ
సంపద,
పరమ
లోకము,
పరమానందమై
యున్నాడు.
తైత్తిరీయోపనిషత్తునందిట్లుద్ఘోషింపబడినది:
"ఆ
పరమాత్మ
రసస్వరూపమగు
తృప్తి
హేతువు.
రసస్వరూపుడగు
పరబ్రహ్మమును
పొంది
జీవుడు
ఆనందింపగలడు.
హృదయాకాశమునందు
ఈ
ఆనంద
స్వరూపుడగు
పరమాత్మ
లేకున్న,
ఎవడు
చలించును,
ఎవడు
జీవించును?
అతడే
యెల్లవారికిని
ఆనందమునిచ్చుచున్నాడు".
అందుచేతనే
వేదసంహితలతో
నాటబడిన
భక్తిబీజము
ఉపనిషద్గ్రంథమునందు
అంకురించి,
పురాణములందు
క్రమేణా
శాఖోపశాఖలుగా
విస్తరించి
ఫలపుష్ప
భరితమగు
మహావృక్షముగా
పరిణమించినది.
అయితే
"యేది
భక్తి?
యెట్టిది
భక్తి?"
అని
అనేక
మంది
సందియ
మనస్కులై,
సతమతమగుచున్నారు.
భక్తి
భావములు
ఇట్టివని
యెవ్వరునూ
నిర్ణయించలేరు.
అవి
అనేకములు.
వానిని
నిర్మలము,
కోమలము,
ఉదారము,
శాంతము,
ప్రేమమయమునగు
హృదయము
గల,
భక్తజన
మానస
మరాళములగు
సాధు
శిరోమణులే
యెరుగజాలుదురు.
కానిచో
పాషాణమున
నవనీత
కోమలత్వము,
అగ్నియందు
హిమశైత్యము,
వేమున
మకరంద
మాధుర్యము
సంభావ్యములా?
భక్తులకు
భగవానుడును,
భగవానునకు
భక్తులును,
ప్రాణము
కన్న
ప్రియులు.
మహాత్ములు
కొందరు,
భక్తులే
భగవానునికన్న
గొప్పయందురు.
చూడు!
రైతులకు
మేఘముల
మీద
ప్రీతి
మెండు.
ఏలన,
వారి
పైరుపంటలు
మేఘముల
వలననే
వృద్ధి
పొందును.
సముద్రమే
స్వయముగా
వచ్చి
వారి
5
▾
Meaning
Keep
పొలములను
తడుపదు.
ఇట్లు
భక్తులను
మేఘములతోను,
వాయువులతోను
పోల్చి
తులసీదాసు
ప్రశంసించి
యున్నాడు.
మేఘజము,
వాయు
సౌగంధ్యము,
సముద్రచందనములదే
కావచ్చును.
ఇట్లే,
భక్తులు
దయ,
ఉదారత,
ప్రేమ,
సౌశీల్యము
మొదలగు
భగవద్గుణములను
లోకమున
ప్రస్తరింతురు.
బంగారు
గనుల
నుండి
వచ్చినట్లే
ఈ
గుణములన్నియూ
వారికి
భగవానుని
నుండియే
వచ్చును.
ఒక
విషయము
యోచించుడు.
భక్తి
భావమును
గూర్చి
ఒకానొక
దినమున
దుర్వాస
మహర్షి
అంబరీషుని
పరీక్షింపనెంచి
వచ్చెను.
అకారణ
క్రోధమున
అతని
నాశమునకై
"కృత్యను"
పుట్టించెను.
కానీ,
భక్తభయహారకమగు
భగవానుని
చక్రము
"కృత్యను"
తుదముట్టించి
దుర్వాసుని
వెంటబడెను.
ప్రాణ
సంరక్షణకై
దుర్వాసుడు
ఆశ్రయ
మపేక్షించి
వనములు,
పర్వతములు,
సరస్సులు,
సముద్రములు,
నదులు,
సత్యలోకము,
కైలాసము,
ఆకాశము,
సమస్త
ప్రదేశములు
తిరిగెను.
దీనుడై
ఆశ్రయమర్థించెను.
కానీ,
భక్తద్రోహికాశ్రయమెందునా
లభించలేదు.
తుదకాతడు
వైకుంఠమునకు
పరుగిడి
శ్రీమన్నారాయణుని
చరణారవిందముల
మీదపడి
రక్షణభిక్ష
నర్థించెను.
అప్పుడు
భగవానుడు
ఇట్లు
చెప్పెను:
నాకు
మేలు
గోరు
నాభక్తుఁడగువాఁడు
భక్తజనుల
కేన
పరమ
గతియు
భక్తుడెందు
జనిన
పరతెంతు
వెనువెంట
గోవువెంట
దవులు
కోడె
భంగి
తనువు
మనువు
విడిచి,
తనయుల
చుట్టాల
ఆలి
విడచి
సంపదాలి
విడిచి
6
▾
Meaning
Keep
నన్న
కాని
యన్యమెన్నడు
యెరుగని
వారి
విడువ
నెట్టి
వారి
నైన.
(ఇది
బమ్మెర
పోతన
తెలుగు
భాగవతమునందలిది)
ఒకానొక
సమయమున
కృష్ణుడు
ఉద్ధవునకు
ఇట్లు
చెప్పెను:
"తపస్సు,
జ్ఞానము,
వైరాగ్యము,
యోగము,
దానము,
ధర్మము,
వ్రతము,
తీర్థ
సేవనము
మొదలగు
సాధనముల
వలన
ఎట్టి
ఫలితము
లభించుచున్నదో,
అట్టి
ఫలితమును
నా
భక్తులు
అనాయాసముగా
పొందుచున్నారు."
ఈ
విషయమెంత
సారముతో
చేరియున్నదో
యోచింపుడు.
ఇంతే
కాదు,
పరమేశ్వరుని
యందైకాంతిక
భక్తి
వలన
చండాలుడను
వాడు
కూడా
బ్రాహ్మణుని
కన్నా
అధికుడు
కాగలుగుచున్నాడనియు,
పరమేశ్వర
భక్తిహీనుడగు
బ్రాహ్మణుడు
సైతము
చండాలుని
కన్నా
అధమునిగ
పరిగణింపబడుచున్నాడనియు,
పురాణములందు
కూడనూ
అనేక
సమయములందు
ఉద్ఘోషితమై
యున్నది
కదా?
ఇక
పురాణముల
యొక్క
మహా
ధర్మము,
వేదములు
"నేతి
నేతి"
యని
చెప్పుచూ,
"యతో
వాచో
నివర్తన్తే
అప్రాప్య
మనసా
సః"
అని
పలుకుచు,
ఏ
పరతత్త్వమును
ఇంద్రియ
మనోబుద్ధ్యతీతమైన
ఒకానొక
అగమ్య
దేశమునందుంచి,
అది
కేవలము
ఉచ్చస్థితినందిన
జ్ఞానులకు
మాత్రమే
ధ్యానగమ్యమని
వచించుచున్నాయో,
అట్టి
చరమ
తత్త్వమును
భక్తి
సాధన
సౌలభ్యముతో
భక్తజనుల
యొక్క
సమస్తేంద్రియ
గోచరభూతముగ
చేయుటయందున్నది.
పురాణములలోని
భగవానుడు
కేవలము
జ్ఞేయ
బ్రహ్మము,
నిర్గుణుడు,
నిర్వికారుడు,
అద్వితీయుడు,
చిత్స్వరూపుడు,
జగత్కారకుడు
మాత్రమేకాక,
ప్రత్యక్షముగానుపాసింప
దగిన,
ఆరాధింప
దగిన
ప్రేమఘనమూర్తి.
సౌందర్య,
మాధుర్య
నికేతనుడు,
అశేష
కళ్యాణ
గుణాకరుడై
యున్నాడు;
పతితపావనుడై
యున్నాడు.
ఇంతేకాక,
పురాణము
మరొక
విధముగ
కూడా
బోధించుచున్నది.
7
▾
Meaning
Keep
ఏమన,
జ్ఞానమార్గమునందలి
అవ్యక్తమగు
నిర్గుణ
బ్రహ్మోపాసనము
దేహాభిమానులగు
జీవులకు
మిక్కిలి
కష్టము.
దేహాత్మభావము
నశించనిదే
నిర్గుణ
బ్రహ్మోపస్థితి
లభించదు.
భక్తియోగమునందలి
సగుణబ్రహ్మోపాసన
సామాన్య
మానవులకు
సహితము
సులభ
సాధ్యము.
ఈ
కారణము
చేతనే,
పురాణములందు
సగుణోపాసనను
గూర్చి
విశేషముగ
చెప్పబడియున్నది.
మొదట
సగుణోపాసన
ద్వారా
చిత్తైకాగ్రతను
సాధించి,
స్థూల
సౌరామ్బికా
(సౌరామ్బము-ఎండనీరు,ఎండమావి,మృగతృష్ణ)
న్యాయముననుసరించి
భగవత్
నిర్గుణ
స్వరూపములో
చిత్తమును
లయమొనర్చవలెను.
జలాశయము
వరకూ
వెళ్ళుటకసమర్థుడగు
దప్పిగొన్న
మానవుని,
ఎండమావి
బహుదూరము
ఈడ్చుకొనిపోవుచున్నవి.
తదుపరి
ఆ
మానవునకు,
మార్గమున,
సత్యమైన
జలాశయమును
సమీపించిన
మీదట
జలాస్వాదన
ప్రాప్తి
కలుగుచున్నది.
దీనినే
స్థూల
సౌరామ్బికా
న్యాయ
మందురు.
అదే
విధముగ,
ముముక్షువులగు
సాధకులు
సహజముగనే
నిర్గుణోపాసనా
తత్పరులగుదురు.
భక్తవత్సలుడగు
భగవానుడు
నిరాకారుడైయుండి
కూడనూ,
సాధు
మహాత్ముల
యొక్క
ఇష్టదేవతా
స్వరూపమున
సాక్షాత్కరించును.
వారి
వారి
ఇష్టార్థము
ధర్మార్థ
కామమోక్షములను
చతుర్విధ
పురుషార్థములను
ప్రసాదించును.
Previous
←
Temples Are Means to the Realization of Satya
Next
The Importance of Temples
→