The Vahini series of Bhagavān Śrī Satya Sāī Bābā

Gītā Vāhini · Prabodha 20

Passage 28

Passages 1–28

మానస సరోవరములోని మాణిక్య రత్నమైన హృదయ పుష్పమే పరమాత్మ, అర్పితమునకు యోగ్యమైనదని గీత స్పష్టముగా తెలుపుచున్నది. అందులకే కాబోలు కృష్ణుడు, అర్జునుని “బావా! నీవు ఏ పని చేసినను, ఏ దానము చేసినను, ఏమి భుజించినను, వాటన్నింటిని నా కర్పణము చేయి; అనగా, సర్వకర్మలు సర్వేశ్వరార్పణ బుద్ధితో చేయుము. తప్పక నన్నే పొందుదువు. నాకు భేద భావములు లేవు. శత్రువులు కాని, మిత్రులు కాని లేరు. నేను సాక్షీభూతుడను మాత్రమే. ఎవరు నన్ను కోరి సేవించి, మొదలింతురో వారల యందుందును” అన్నాడు.

అందులకు అర్జునుడు తిరిగి అనుమానగ్రస్తుడై, “కృష్ణా! నీకు అందరూ సమానమే అని అంటివి గదా, అటులయిన లోకమున కొందరు సుఖముగా మరికొందరు దుఃఖముగా, కొందరు యోగులుగా మరికొందరు రోగులుగా, కొందరు ధనవంతులుగా, కొందరు దరిద్రులుగా ఉన్నారే! దీనికి కారణమేమి? నీకే భేదము లేకున్న, అందరిని ఒకే స్థితిలో ఉంచి యుండకూడదా? దీనిని పట్టి చూడు, నీకు భేదము లేదనుమాట నమ్మ సాధ్యము కానిది, ఆధారము లేనిది” అని అన్నాడు.

పరమాత్ముడు అర్జునుని అనుమానమునకు నవ్వి “బావా! అర్జునా! నేను సత్యమునే పలుకుదును. నీవు నమ్మిననూ, నమ్మకున్ననూ సత్యము పొంగదు కుంగదు, నేను అందరియందును సమానముగనే యున్నాను. కాని, అందరూ నా యందు సమానదృష్టిగా లేరు! ఎటులన చలికాలమున రాత్రులందు గ్రామాదులలో మంటలు వేసుకొందురు. ఎవరు ఆ మంటలకు దగ్గర కూర్చొందురో, వారు మాత్రమే చలిలేక యుందురు. అంతియేకాక చీకటిలేక ప్రకాశమును కూడనూ అనుభవింతురు. అట్టుకాక, మంటకు దూరముగా నిలుచుకొని చలిపోలేదనియు, చీకటి ఆవరించినదనియు, ప్రకాశము వారి పాలలేదనియు అనిన, ఆ భేదము అగ్నిదెట్లగును? ఇంత మాత్రమున అగ్నికి భేదమున్నదని వాదించుట అర్థరహితము, బుద్ధిహీనము, వివేక శూన్యము కదా!

భగవత్ జ్ఞానకిరణముల సంబంధమూ ఇట్టిదే. దానిని పొందగోరి చెంతచేరువారు దాని ప్రకాశము ఫలితమూ పొందగలరు. అంత మాత్రముచే భగవంతునకు భేదమని తలంచరాదు. అయితే అగ్ని దగ్గరకు వెళ్ళుటకు అందరికీ అధికారము కలదు. మంటలు వృద్ధి చేసుకొనుటకూ అందరికీ స్వతంత్రమున్నది. మంటకు ఏ భేదము ఉండదు! దానిని అనుభవించుటయందు, అభివృద్ధి పరచుకొనుటయందే భేదము. ఇదే విధముగ జ్యోతిర్మయుడనయిన నాకునూ ఎట్టి భేదమునూ ఉండదు. నన్ను పొందుటకు అందరికిని అధికారము కలదు. భేద భావములు సాధకులలోని దోషములే కాని నాలోని మచ్చలు కావు బావా” అని కృష్ణ భగవానుడు వచించెను.

చూచితిరా! పరమాత్ముని ప్రేమ పలుకులు, సమాన తలపులు, ఎంత సత్యము? నిజముగా లోకులు కాకులు; తమ తమ లోపములను విచారించక ఎదుటి వారిపై దోషములను రుద్దుట అజ్ఞానము! పరమాత్మయందే దోషముండిన లోకముండదు.

పరమాత్మ భేదరహితుడు, సమాన హృదయుడు కనుకనే లోకము ఈ మాత్రమైననూ క్షేమముగా నిలిచినది. రోగికి జ్వరము లేదని రోగి తృప్తిపై డాక్టరు అబద్ధము చెప్పిననూ, థర్మామీటర్ తప్పు చూపదు. అటులనే పరమాత్మ టెంపరేచరు వంటి అంతరాత్మను తెలుపునే కాని పైపై పూతలను కాదు. లోకులు పైపై రూపములే పాటింతురు. తినిన రుచి, దిగిన లోతు, తెలిసికొనగలరే గాని దిగక లోతు, తినక రుచి, చెప్పువారల పలుకులు సత్యములు కాజాలవు.

భగవంతునికే భేదముండిన స్త్రీలయిన గోపికలకు సాయుజ్యమిచ్చి యుండునా! శబరి ఎంగిలి ఫలములు తినియుండునా! జనకుడు బ్రహ్మజ్ఞాని అయియుండునా! నందనారుకు దివ్యదర్శనమిచ్చియుండునా! ప్రహ్లాద విభీషణాదులను దగ్గర చేరియుండునా! వానరుడైన హనుమంతుని రామబంటుగా అంగీకరించి యుండునా! వాల్మీకి రామాయణమును వ్రాయగలిగి యుండునా! ఈ కార్యములన్నియూ భగవంతునిలో భేదభావము నిరూపించినవా? భేద రహితునిగా ఆదర్శించినవా? పాఠకులు యోచించిన, విషయము తెలియును. భగవంతుని ప్రేమతత్త్వమునకు సమానత్వమునకు పై ఉదాహరణములే తారాణము.

“మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు” అని పలికిన దానిలోని అర్థము ఇది కాక మరేమి? “నాయందు మనస్సు కలవాడై నన్నే భక్తితో భజింపుము. నాకే నమస్కరించుము! నా యందు ప్రీతి కలవాడగుదువు! నన్నే పొందుదువు” అనుచు భగవంతుడు తనకు ప్రియమైన పదార్థములైన మనో నిర్మలము; ప్రేమ శుద్ధి; ఈ రెండిటిని తాను ఆశించును.

లోకములో దేనిని తెలుసుకొనవలెనని ఆశింతురో అట్టివారు అట్టి స్థితిని పొందినచో తెలిసికొనవలుగును. అనగా వివేకమును తెలిసికొనుటకు వివేకమే కావలెను. చీకటిని చూచుటకు చీకటే కావలెను. ప్రకాశమును దర్శించుటకు ప్రకాశమే కావలెను.

అటులనే మాధవతత్త్వమును తెలిసికొనుటకు మాధవత్వమునే మనము పొందవలసి వచ్చును. మానవతత్వమును చింతించుచూ, మాధవతత్వమును తెలిసికొన వీలుకానిది. మాధవతత్వమునే స్మరించుచూ, చరించుచూ, ఆచరించిన మాధవతత్వమును పొందవచ్చును. స్థానములు, స్థితులు, భావములు ఏకమైననే తత్త్వము అర్థము కాగలదు.

దీనిని పురస్కరించుకొనే కృష్ణుడు అర్జునునకు, “బావా! మానవుల కంటే దేవతలను, దేవతలకంటే జ్ఞానులను, అధికస్థానము కలవారు. అట్టి అధిక స్థానముననున్న జ్ఞానులు కూడనూ పరబ్రహ్మముయొక్క సంపూర్ణజ్ఞానమును తెలిసి కొనలేరు. ఇక సామాన్య మానవులైన నీబోటి వారికి సాధ్యమా?” అని వేళాకోళము చేసినాడు.

అర్జునుడు సిగ్గుతో తలవంచుకొని, “స్వామీ! నిజమే; నిన్ను తెలిసికొన ఎట్టివారికి సాధ్యముకాదు. నీవు అనంత రూపుడవని నేను దృఢముగా విశ్వసించుచున్నాను. మీరే పరబ్రహ్మమని భావించుచున్నాను. మీరే చర చరా ప్రపంచమున సృష్టి స్థితి లయములు గావించుచున్నారని నమ్మితిని. మీరు కూడ స్వయముగా తెలుపితిరి; ధన్యుడను”.

“అయితే, ఈ లోకమున మీరు మీ శక్తిమయమైన రూపములను ఎట్లు ధరించుచున్నారు? అనగా, మీరు ఏయే రూపమున ఈ జగత్తును వ్యాపించియున్నారో, వాటన్నింటిని తెలిపి నా జ్ఞానమును సార్థక మొనరించుడు; మరియు నేను నిన్ను ఏ రూపమున ధ్యానించవలెనో అరియును సెలవిచ్చిన, అట్లు ధ్యానింతును, కృష్ణా!” అని వేడుకొనెను.

“అర్జునా! చాల చిన్న కోరికనే కోరితివి. ఇది నీకంత సులభముగా అర్థమగుననుకుంటివా! అడిగితివి కనుక దయతో తెలుపుదును, విను. సకల భూతముల యొక్క హృదయ కమలములందుండు ప్రత్యగాత్మను నేనే. దీనినే ఆత్మ అని అందురు. దానిని ధ్యానించిన చాలు. అనగా సర్వభూతముల యొక్క ప్రత్యగాత్మ అని విశ్వసించిన చాలు, అదే ధ్యానము. ఇట్టి విశ్వాసమునకు ప్రతిబంధకములు కలుగక దృఢవ్రతుడవై ఆచరణలయందు నిరూపణ సలిపినపుడు నీవే నేను, నేనే నీవుగా అనుభవింతువు అనగా ఏకత్వము పొందవచ్చును.

“ఇక లోకమున భూతములు కాక మిగిలిన సృష్టిజాలమున ఏ యే రూపముననున్నానో అరియును తెలిసికొమ్ము. పంచభూతముల స్వరూపమైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు నా రూపములే. సూర్య చంద్ర నక్షత్రముల యందలి చైతన్యమును నేనే. ప్రళయకాలమున సమస్తమునూ తనలో లయపరచెడు మృత్యుదేవతయు, ఉత్పత్తి కాలమున పుట్టుకయూ నేనే వేదవేదికీ! అణువు మొదలు అఖండము వరకు, త్రికాల, త్రిలోక, త్రిగుణములందు అంతర్యామి నేనే వ్యాపించి యున్నాను.

“నేను కాని వస్తువుకాని, నాది కాని పేరు గాని లోకమున లేదు. దేహమునందలి రక్తము, ఏ భాగము చూచిననూ ఒక్కటిగానే ఎట్లుండునో, దేహమునందు ఏ భూతమును చూచిననూ అందులో సర్వ వ్యాపియైన నేనే రక్తమువలె ప్రవహించుచుందును” అని కృష్ణపరమాత్మ బోధించెను.

అప్పుడు అర్జునుడు రెండు చేతులు జోడించి, కృష్ణా! విశ్వమంతయు నీ రూపమే కదా! అందులోని జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బలము, వీర్యము, తేజస్సులు నీ రూప సారములే కదా! ఈ అన్నింటి సమ్మేళనలో ఉన్న నీ విశ్వరూపమును ఒక పరి చూచి నన్ను కృతార్థుని చేయకూడదా? పాదములంటి ప్రార్థింతును!” అని వినయ విధేయులతో కోరినాడు. అప్పుడు పరమాత్ముడు, “బావా! అర్జునా! నీ కోరిక తప్పక చెల్లింతును; కాని, విశ్వరూపధరుడగు నన్ను, ఈ ప్రాకృతమైన నేత్రములతో చూడ సాధ్యముకాదు. చూడలేవు. కనుక అప్రాకృతమైన దృష్టిని అనుగ్రహించెదను! చూడుమని” దివ్యదృష్టిని ప్రసాదించి, తన విశ్వరూపమును చూపించినాడు, పరమ దయాళుడైన పరమాత్మ స్వరూపుడు కృష్ణుడు.

ఈ సమయమున సాధకులు గుర్తించవలసిన అతి సూక్ష్మ సారాంశము ఒకటి విచారింతము.

వేదములు, శాస్త్రములు, పురాణములే కాక అనేకమంది అనుభవజ్ఞులు పండితోత్తములు - ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్మ అని తెలుపుచునే యున్నారు. కాని దీనిని ఆధారముగా తీసుకొని మరిక తెగవారు ఈశ్వరుడు సర్వవ్యాపియే అయి ఉండిన, ఎందుకు అందరికీ కనిపించడు? అని వాదించుచుందురు. అట్టి అవిశ్వాస వాదకులకు ఇది సరియైన సమాధానము. ఏమన, పంచ భూతాత్మకమగు ఈ చక్షువులు, పంచభూత సంబంధమైన వస్తువులను మాత్రమే చూడగలవు. అప్రకాశ వస్తువులు ఎంత ప్రకాశవంతమైన ఎంత విలువైన సువర్ణ రత్నములైననూ ప్రకాశింపజేయజాలవు. దీపము స్వప్రకాశమే తన్ను, తాను, ఇతర వస్తువులను ఎట్లు ప్రకాశింపజేయునో అటులనే భగవంతుడు స్వయం ప్రకాశకుడను, జ్ఞాన స్వరూపుడను, అప్రాకృతుడను అగుటచే అతనిని జ్ఞాన దృష్టిచే మాత్రమే చూడగలము. అట్టి జ్ఞానదృష్టి కూడనూ స్వయముగా కలుగుట దుస్సాధ్యము. ఈశ్వరానుగ్రహము వలననే కలుగవలెను. అందువలన ఈశ్వరోపాసన అవసరము. అది లేనివారికి అన్నియు లేనట్లే. తనను తాను చూడలేనివాడు ఇతరములను మాత్రమే ఏమి చూడగలడు? ఈశ్వరానుగ్రహమును పొందగలిగినట్లే సాధన చేసిన, జ్ఞాన నేత్రము తానే అందించగలడు! అతను భక్త సులభుడు.

విశ్వరూపమును చూచు అర్జునుడు ఆనంద బాష్పములు రాల్చు ఇట్లనెను. “పరమాత్మా! సకల దేవతలను, సృష్టి కర్తయైన చతుర్ముఖ బ్రహ్మను, సమస్త ఋషులను, నానా స్థావర జంగమాది భూత సమూహములను, చూచుచున్నాను. అబ్బా; భయంకరమైన నీ మోమున వెలువడు మంటలు, ఆ తేజస్సులు, సమస్త జగత్తును వ్యాపించి తపింపజేయుచున్నవి. ఈ భయంకరమైన ఉగ్రరూపమును తెలిసికొన గోరుచున్నాను”.

“అర్జునా చూచితివా! సమస్త కర్తలను, సమస్త భూతములను సృష్టి స్థితి లయకారుడను నేనే అని తెలిసినవాడా? దీనిని బట్టి ఈ యుద్ధభూమియందు చేలిన జనులను కాపాడువాడవు కాని, సంహరించువాడవు కాని, నీవు కాదని తెలిసికొమ్ము. నీవు నిమిత్తమాత్రుడవే. చంపు అధికారము నీకుగాని, చచ్చు అధికారము వారికిగాని ఎప్పటికీ లేదు. సర్వమూ నాయందే, నా సంకల్పమందే యున్నది. భూభారమణచుటయు, భూభారమును పోషించుటయు, భూభారమును వహించుటయు నా ప్రవృత్తి అని తెలిసికొమ్ము,” అని కృష్ణుడు వీపు నిమురుచూ, వాత్సల్యత చూపుచూ పలుకుచున్న అర్జునుని ఓదార్చినాడు.

భక్తవత్సలుడు, భక్తపరాధీనుడనుటలో ఈ ఘట్టము ప్రత్యక్ష నిదర్శనము, ప్రత్యక్ష ప్రమాణము, కాకున్న, సామాన్య మానవునివలె అదరి బెదరుచున్న అర్జునుడెక్కడ? మహా వీరులు సర్వశక్తిమయులు, సర్వవిద్యా ప్రవీణులయిన భీష్మ, ద్రోణ కర్ణాదులెక్కడ? అట్టివారలను ఒక్క భగవంతుడు తప్ప ఎవ్వరునూ ఓడించలేరు. సాధ్యము కాదు. అట్టి మహావీరులను ఓడించినట్టి ఘనత, వధించినట్టి ఘనత, తనకు శరణాగతుడైన అర్జునుని పొందుమని తెలిపెను.

భక్తులయొక్క యశస్సును కోరి భగవంతుడు మానవాతీతమైన కార్యములను కూడా చేయించును. తాను సాక్షీభూతుడై సర్వకర్తయై నాటకమాడించి, ఏమియూ ఎరుగనివానివలె నటించును. ఇది తన భక్తుల యందుగల వాత్సల్యము. అర్జునుడు కన్నులు తుడుచుకొనుచు చేతులు జోడించి “పరమాత్మా! నేనెప్పుడూ కనివిని ఎరుగని విశ్వరూపమును చూచితిని. అందలి సత్యమును తెలిసికొంటిని. భయంకర తేజఃపుంజములు నన్ను కాల్చివేయుచున్నవి. నా దేహము మండుచున్నది. ఒకపరి నీ మొదటి రూపమైన ప్రసన్న స్వరూపమును చూపుము, శాంతింపజేయుము. తాళలేను తండ్రీ! చూడలేను” అని మోర పెట్టుకొన్నాడు.

అంత కృష్ణుడు అనుగ్రహ హృదయుడై, “అర్జునా! వేదాధ్యయనము చేత గాని, ఘోర తపస్సులచే గాని, దాన ధర్మాది సత్కర్మలచే గాని, యజ్ఞయాగాది క్రతువులచే గాని చూడ సాధ్యము కాని నా విశ్వరూపమును నీవు చూడగలిగితివి. ఇట్టి దర్శనము మహదైశ్వర్యమైన ఒక్క భక్తునకు మాత్రమే ప్రాప్తించును, సాధ్యమగును. అనన్య చింతనతో నన్ను ఉపాసించువారికి ఇది సాధ్యము కాగలదు. అట్టివారి హృదయము మాణిక్య రత్నమై నిర్మలముగా నుండును. ఆ సమయమున దేనిని చూచిననూ, చేసిననూ భగవత్ స్వరూపముగను, భగవత్ రూపమైన కర్మలుగను తలంతురు. వారలకు వేరు రూపములు గాని వేరు భావములుగాని ఉండవు; వేరు చింతనలు కాని ఉండవు. సర్వకాల సర్వావస్థలయందూ నా రూపమే, నా నామమే, నా భావమే, నా కర్తలే చేయుచుందురు. అట్టివారలకే ఈ పవిత్ర ప్రాప్తి లభ్యమగును. నేను అనన్య భక్తినే కోరుచుందును బావా”! అర్జునుడు చిరునవ్వులు ముఖమున చిందులాడ, పెదవులు కదిలించుచూ, స్వామీ! అనన్యభక్తి మీకు అతి ప్రీతి అని తెలిసినది. అయితే సాకారోపాసన నిన్ను తృప్తిపరచునా? లేక నిరాకారోపాసన నిన్ను కరిగించునా? ఈ రెండిటిలో ఏది సాధకులకు, సర్వేశ్వరుడైన మీ సులభ ప్రసన్నత చేకూర్చును? ఇందులో ఏది శ్రేష్ఠమో సెలవిమ్ము,” అన్నాడు.

స్వామి అందులకు ప్రసన్న చిత్తుడై “అర్జునా! ఈ రెండింటియందునూ నాకేమాత్రమూ భేదము లేదు. రెండునూ ఒక్కటియే. కావలసినది చిత్తము భగవదాయత్తమైయుండుట. పవిత్రమైన శ్రద్ధతో ఎట్లు ఆరాధించిననూ నేను ప్రసన్నుడనెదను”.

“కృష్ణా! చిత్తశుద్ధి కలిగి యుండిన చాలునా? దీనికి లింగ భేదము కాని, ఆశ్రమ భేదము కాని, వర్ణ భేదము కాని అడ్డురావా?”

“బావా! అన్నియు అనుభవించి, తిరిగి నీకే సందేహము ఎట్లు కలిగినది! సర్వమూ ఈశ్వరార్పణ చేసి, మనస్సును భగవంతుని యందు లగ్నపరచి నిత్య సత్య నిర్మలమైన నాయందు చిత్తముంచు వారికి దేహభ్రాంతి యెట్టుండును! ఒక వేళ దేహభ్రాంతి యుండిన అది సంపూర్ణ ఈశ్వరార్పణ కాదు. దేహభ్రాంతే లేనివారలకు ఆశ్రమ, వర్ణ, లింగ భేదములు ఉండవు కదా! భగవంతునియందు మనస్సు నిలుపుటకును, భగవంతుని చేరుటకును, చిత్త శుద్ధితో ఉపాసన సలుపుటకును ఆశ్రమ వర్ణ ధర్మములు అడ్డుతగులవు. దేహాత్మభావము, లోకాత్మభావము కలవారలకే వర్ణ ఆశ్రమ లింగ భేదములు. కనుక నీవు వాటి విషయమై చింతించనక్కరలేదు” అని పరమాత్ముడు అర్జునునకు తెలిపినాడు.

అందులకు అర్జునుడు “కృష్ణా! దేహాభిమానము, లోకాభిమానము కలవారలకు నిర్గుణోపాసన అంత సులభము కాదు కదా! సామాన్య మానవులు చేయు సగుణోపాసనచే అంతఃకరణము శుద్ధి అగుటకు వీలులేదా? దయచేసి తెలుపుము” అన్నాడు.

The Gītā makes it clear that the true offering fit for Paramātma is the heart-flower, the jewel in the lake of Manas. Kṛṣṇa therefore tells Arjuna: “Bāvā, whatever you do, whatever you give, whatever you eat—offer it all to Me. Perform every Karma with Sarveśvarārpaṇa-buddhi and you will surely reach Me. I have no divisions of enemy and friend; I remain the Witness. Yet I dwell openly with those who turn toward Me in service.” Arjuna again became doubtful. “Kṛṣṇa, You say all are equal to You. Then why are some happy and others sorrowful, some yogins and others sick, some wealthy and others poor? If You truly make no distinctions, could You not keep everyone in the same condition? Your claim of equality seems difficult to accept.” Paramātma smiled. “Bāvā, Arjuna, I speak only truth. Whether you believe it or not does not alter Truth. I am equally present in all, but all do not stand in equal relation to Me. On a cold night people gather around a fire. Those who sit close feel warmth and light. If one stands far away and complains that cold and darkness remain, is that partiality in the fire? To accuse the fire of discrimination would be without reason.” “So it is with the rays of Bhagavat-jñāna. Those who come near in longing receive their light and warmth. Everyone has the right and freedom to approach and to kindle the fire. The difference lies in how people approach and use it, not in the fire itself. I too am Jyotirmaya and without partiality. All have access to Me. Differences arise from the sādhaka’s own condition, not from a stain in Me.” See the tenderness and truth in Paramātma’s words. It is ignorance to ignore our own limitations and impose fault on another—still more to place such fault upon Paramātma. If defect belonged to Him, the world itself could not endure. Because Paramātma is free of division and equal-hearted, the world has whatever order and welfare it possesses. A patient may deny his fever, and a physician may even humour him, but the thermometer does not lie. In the same way the Antaryāmin reveals the inner condition rather than the outward coating. Depth is known by entering it; taste by tasting it. Claims without experience cannot become truth. If Bhagavān were partial, would He have granted Sāyujya to the Gopikās, accepted Śabarī’s tasted fruits, allowed Janaka to become a Brahma-jñānī, given divine vision to Nandanār, drawn Prahlāda and Vibhīṣaṇa near, accepted Hanumān—a vāṇara—as Rāma’s servant, or raised Vālmīki to compose the Rāmāyaṇa? These very examples testify to the equality of divine Prema, not to partiality. This is the meaning of ‘manmanā bhava madbhakto madyājī māṁ namaskuru’: “Keep Manas in Me; worship Me with Bhakti; bow to Me; love Me; and you will reach Me.” What Bhagavān asks for is purity of Manas and purity of Prema. To know a thing truly, one must become fitted to its mode. Viveka is known through Viveka; light is seen through light. Likewise, to know Mādhava-tattva, one must grow into Mādhavatva. While remaining absorbed only in ordinary manava-bhāva, one cannot comprehend the Divine. By remembering, living, and practising Mādhava-tattva, one comes to share its mode. When state, bhāva, and standpoint become one, Tattva becomes intelligible. Kṛṣṇa teasingly told Arjuna, “Bāvā, the devas are above ordinary human beings, and Jñānīs are higher still. Yet even such Jñānīs cannot exhaust the complete knowledge of Parabrahman. How then will an ordinary person like you grasp Me entirely?” Arjuna bowed his head in humility. “Swāmi, it is true. None can fully know You. I firmly believe You are Ananta-rūpa, that You are Parabrahman, and that creation, sustenance, and dissolution of the moving and unmoving universe take place through You. You Yourself have declared it. I am blessed.” “Still, tell me how You assume Your forms of power in this world. In what forms do You pervade the universe? Make my understanding fruitful, and tell me also in what form I should meditate upon You, Kṛṣṇa.” “Arjuna, you have asked a ‘small’ question indeed!” Kṛṣṇa replied. “You imagine it will be easily grasped, but since you ask, I shall tell you. I am the Pratyagātma dwelling in the heart-lotus of every being. Meditate on that. Firmly believe that I am the inner Ātma of all beings. Hold this conviction without allowing obstacles to shake it and prove it through life; then you will experience ‘you are I and I am you’—oneness.” “Know also the forms in which I stand throughout creation. Earth, water, fire, air, and space—the Pañca-bhūtas—are My forms. I am the consciousness in sun, moon, and stars. I am death that draws all into itself at dissolution, and birth at the time of manifestation. From atom to the undivided Whole, through the three times, the three worlds, and the three guṇas, I pervade all as Antaryāmin.” “There is no object in the world that is not Me and no name that is not Mine. As the same blood flows through every part of a body, I, the All-pervading One, flow through every being and element.” Arjuna folded his hands. “Kṛṣṇa, the whole universe is Your form. Its Jñāna, Aiśvarya, Śakti, Bala, Vīrya, and Tejas are expressions of You. Will You not fulfil me by granting a vision of that Viśvarūpa in which all these are united? I pray at Your feet.” Paramātma replied, “Bāvā, I shall fulfil your wish. But this cosmic form cannot be seen with these ordinary physical eyes. I shall grant you an extraordinary sight.” Out of compassion Kṛṣṇa gave Arjuna Divya-dṛṣṭi and revealed the Viśvarūpa. At this point the sādhaka should pause over a subtle teaching. The Vedas, Śāstras, Purāṇas, experienced seekers, and great scholars all declare Īśvara to be Sarva-vyāpī and Sarva-bhūtāntarātma. Some then argue: if He is everywhere, why is He not visible to everyone? The answer is that physical eyes, themselves constituted of the Pañca-bhūtas, can ordinarily perceive only objects within their range. Bhagavān is Svayam-prakāśa, Jñāna-svarūpa, and aprākṛta; He is therefore known through Jñāna-dṛṣṭi. Such vision is not easily self-produced—it flowers through Īśvara-anugraha. Hence Upāsanā is necessary. One who cannot yet see one’s own deepest Self cannot demand to see all else. Practise so as to become fit for grace; Bhagavān is Bhakta-sulabha and can grant the eye of Jñāna. Beholding the Viśvarūpa, Arjuna wept with wonder. “Paramātma! I see all the devas, the four-faced Brahmā, the ṛṣis, and hosts of moving and unmoving beings. Ah! The flames pouring from Your terrifying mouths, that blazing Tejas, pervade and scorch the whole universe. I long to understand this terrible and majestic form.” Kṛṣṇa said, “Arjuna, now do you understand that I am the creator, sustainer, and dissolver of all? Know therefore that on this battlefield you are neither the independent protector nor the independent destroyer of these beings. You are Nimitta-mātra, merely an instrument. The authority to kill is not yours, nor is death in their independent control. All rests in Me and in My Saṅkalpa. To bear, nourish, and relieve the burden of the earth belongs to My function.” With vātsalya He comforted Arjuna. This episode directly illustrates Bhagavān as Bhakta-vatsala and even Bhakta-parādhīna. Arjuna, trembling like an ordinary man, faced warriors such as Bhīṣma, Droṇa, and Karṇa, whose power seemed impossible to overcome. Bhagavān Himself accomplished what no ordinary person could, yet offered the honour of victory to Arjuna, who had taken refuge in Him. For the sake of a devotee’s glory, Bhagavān can bring about deeds beyond ordinary human capacity, remaining the Witness and true Karta while appearing not to claim anything. Arjuna wiped his tears and prayed, “Paramātma, I have seen a Viśvarūpa never before seen or heard of. I have understood its truth, but its terrible blaze is consuming me. Show me once again Your earlier, serene form. Father, I cannot bear this.” Kṛṣṇa replied with compassion: “Arjuna, you have seen My Viśvarūpa, which cannot be obtained merely through Vedic study, severe Tapas, charity, or ritual sacrifice. This vision becomes possible through the great wealth of Ananya-bhakti. Those who worship Me with undivided remembrance have hearts clear like jewels; whatever they see or do becomes Bhagavat-svarūpa and Bhagavat-karma. They hold no separate form, bhāva, or preoccupation apart from Me. At all times and in all states My Name, My Form, My Bhāva, and My work fill them. It is Ananya-bhakti that I cherish.” Arjuna smiled and asked, “Swāmi, if Ananya-bhakti is so dear to You, which is superior for the sādhaka: Sākāra-upāsanā or Nirākāra-upāsanā? Which most readily wins Your grace?” Swāmi answered serenely, “Arjuna, I make no distinction between the two. Both lead to Me. What matters is that Citta be surrendered to Bhagavān. Worship with pure Śraddhā in whichever way is natural, and I am pleased.” Arjuna asked, “Kṛṣṇa, is Citta-śuddhi alone sufficient? Do distinctions of gender, āśrama, or varṇa become obstacles?” “Bāvā! After all that you have experienced, why this doubt again? One who truly offers everything to Īśvara and fixes Manas in the eternal, pure Reality cannot remain bound by deha-bhrānti. If body-identification remains dominant, the offering is not yet complete. For one free of deha-bhrānti, distinctions of āśrama, varṇa, and gender do not obstruct God-remembrance or God-attainment. Such distinctions belong to the plane where deha-ātma-bhāva and loka-ātma-bhāva operate. Do not be anxious about them.” Arjuna then asked, “Kṛṣṇa, for those who still possess body- and world-identification, Nirguṇa-upāsanā is not easy. Can ordinary people purify the Antaḥkaraṇa through Saguṇa-upāsanā? Please explain.”