In plain words
“Keeping no worry at all in the Manas, one must always wish for the good of all living beings. One must keep contemplating the Paramātma. Holding in check the citta that runs after other things, one must hold only holy feelings in the Manas. This is called the tapas of the Manas.”
10“మనసున ఎట్టి విచారమును పెట్టుకొనక సకల ప్రాణులకు ఎల్లప్పూడూ మేలుకోరుచుండవలెను.11“ఇక శారీరక తపస్సు; పరోపకార కార్యములలో పాల్గొనుట, పరమాత్మ పూజ, భజన, ప్రదక్షిణ, ఆసన, బ్రహ్మచర్య, ప్రాణయామములతో పవిత్రము చేయుట, దీనులకు రోగులకు సేవజేయుట, సదాచార ప్రవర్తనలతో దేహమును పవిత్రము చేయుట ఇత్యాది సత్కర్మలచే దేహమును వినియోగించు కొనవలెను.”12“అతిభాష లేకుండుట, అనృతములాడకుండుట, చాడీలు చెప్పకుండుట, పరులను దూషించకుండుట, కఠినోక్తులాడకుండుట, మధురమైన పలుకులు, మాధవ స్మరణతో వాక్కును పవిత్రము చేయవలెను.13“ఇందులో ఏ ఒకటి పవిత్రము కాకపోయిననూ అనగా మనో తపస్సుగాని, శారీరక తపస్సు కానీ, వాక్ తపస్సు కానీ పవిత్రముగా లేకుండిన ఆత్మజ్యోతి ప్రకాశించదు.10 to 13