Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · Ordinary Moha and Extraordinary Moha
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
శిష్యుడు
తనలోని
మంచి
గుణములను
వెతుకుటకంటే
తనలోని
దోషాలను
వెతికి
తీసివేయుట
చాలా
మంచిది.
అట్టివాడు
త్వరలో
ముందుకు
రాగలడు.
అట్టి
స్థితి
కలవాడే
సర్వమూ
భగవత్
శక్తిపై
భారము
వేసి
నిర్భయంగానుండగలడు.
నిశ్చింతగా
నిలువగలడు.
అదే
వాని
ధన్యతకు
తగిన
గుర్తు.
మన
అర్జునుడు
అట్టి
స్థితికి
రాగలిగినాడు.
సర్వ
మానవులకూ
ఇట్టి
స్థితిని
రాగోరే
అర్జునుని
నిమిత్త
మాత్రముగా
పెట్టుకొని
భగవానుడు
లోకమునకు
ఇట్టి
అమృతమును
అందించెను.
2
▾
Meaning
Keep
ఒకటి
మనమీ
తరుణమున
యోచించిన,
ఇది
యెవరి
కొరకనునది
చక్కగా
తెలియగలదు.
గోవు
కొరకు
గోవు
పాలు
పితుకనక్కర
లేదు.
ఇక
దూడ
అయిన
అర్జునుడా
కడుపారా
త్రాగినాడు.
ఆ
దూడకవసరము
లేదు.
గోవులు
వాటి
పాలు
అవి
త్రాగవు.
పోనీ
పిండిన
వానికొరకని
తలంతుమా,
నిత్య
తృప్తుడైన
పరమాత్మకు
అక్కరలేదు.
ఇక
ఈ
ఉపనిషత్
సారమైన
క్షీరామృతము,
గీతామృతము
ఎవరి
కొరకు?
“సుధీ
జనుల”కని
కృష్ణుడే
తెలిపెను.
కాన,
ఈ
గీతామృతము
గుణవంతులైన
జనులకని
స్పష్టముగా
తెలియుచున్నది.
ఇట్టి
మహా
పరిశ్రమ
జరిగిన
స్థానమును
యోచింతుమా,
అది
మరింత
విచిత్రమైన
చిత్రము.
రెండు
సేనల
మధ్య.
ఆహా!
ఎంతటి
గూఢార్థము.
ఒక
వైపున
ధర్మపుత్రులు,
మరొక
వైపున
దానవ
వ్యక్తులు.
అంటే,
మంచి
చెడ్డల
మధ్య
ద్వంద్వసంకులమై
ఏడుస్తూ
ఈ
సంసారమున
దారీ
తెన్నూ
తెలియక
పరితపించు
వారలకే
భగవంతుడు
ఈ
గీతామృతమును
అందించెను.
అర్జునునికి
వచ్చిన
సమస్య
అతనిదని
భావించకూడదు.
విశ్వమానవ
సమస్య.
లేకున్న
అతి
జ్ఞానియైన
అర్జునుడు
కృష్ణ
శరణాగతిలో
ప్రేయస్సు,
కేవలము
ఇహ
పర
సుఖభోగాలు,
కోరునా?
అవి
మానవ
ప్రయత్నములతో
లభించును.
అవి
కర్మ
సాధ్యాలు.
“నా
ప్రయత్నముతో
లభించే
వాటిని
నిన్ను
కోరుట
అవివేకము.
అట్టి
అవివేకిని
కాదు
నేను.
నా
ప్రయత్నముతో
కాని
శ్రేయస్సును
అనుగ్రహించు.
అది
కర్మ
ఫలం
కాదు
కదా!
అది
కేవలము
నీవు
అనుగ్రహించిన
తప్ప
వేరు
రీతిగా
చేజిక్కదు,”
అని
అర్జునుడు
ప్రపత్తి
బొందెను.
భగవత్
శరణాగతినే
“ప్రపత్తి”
అని
అందురు.
3
▾
Meaning
Keep
ఈ
“శరణాగతి”ని
గురించి
చెప్ప
పూనుకొన్న
ఎంతైననూ
కలదు.
మానవుడు
లోకమున
అనేక
విధములైన
అభిమాన,
మమకార,
అహంకార,
దంభానికి,
ధన,
కనక,
వస్తువాహనములకై
శరణుజొచ్చుచున్నాడు.
కానీ
భగవంతుని
శరణుజొచ్చే
ప్రాప్తి
వానికి
సులభముగా
లభించుటలేదు.
ఎట్లు
లభించును?
వస్తు
ఆనందమునే
ఆధారముగా
తీసుకొందురు
కానీ
వస్తు
ధాతయైన
ఆధార
రూపమును
మరచుచున్నారు.
ఆధారము
లేని
ఆధేయము
ఎంత
కాలము?
అసలు
ఆధారములేని
ఆధేయమొకటనునది
ఉన్నదా?
అట్లున్నదని
అందురా,
అది
కేవలము
“పరమాత్మ”
తప్ప
మరేదియూ
కాదు,
లేదు.
కనుక
సర్వాధారుడైన
సర్వేశ్వరుణ్ణి
ఆశ్రయించుటే
నిజమైన
శరణాగతి.
కానీ,
ఆధేయములైన
అనిత్య
పదార్థములను
శరణుజొచ్చుట
అజ్ఞానము.
అర్జునుడు
పరమ
జ్ఞాని
కనుకనే,
పరమాత్ముని
శరణుజొచ్చెను.
ఈ
శరణాగతులందును,
మూడు
విధములైన
శరణాగతులు
కలవు.
4
▾
Meaning
Keep
“తవైవాహం,
మమైవత్వం,
త్వమేవాహ
మితి
త్రిథా.”
అనగా,
మొదటిది,
“నేను
నీవాడననునది”.
రెండవది,
“నీవు
నావాడవనునది”.
మూడవది,
“నీవే
నేననునదియును”.
కానీ,
ఉత్తరోత్తరంగా
యోచించిన
ఒకదానికంటే
ఒకటి
ఉత్తమమైనదిగా
నున్నది.
మొదటి
“తవైవాహం”లో
పరమాత్ముని
సర్వస్వతంత్రునిగాను,
భక్తుని
పరతంత్రునిగాను
భావించును.
అనగా
భగవంతుడు
పిల్లిగానూ,
భక్తుడు
పిల్లి
పిల్లగానూ.
ఇది
అతి
మృదువైనది.
సర్వులకూ
సాధ్యమైనదిగా
నుండును.
ఇక
రెండవదైన
“మమైవత్వం.”
5
▾
Meaning
Keep
ఇందులో
భక్తుడు
స్వతంత్రుడుగాను,
పరమాత్ముడు
పరతంత్రునిగాను
సూచించినది.
దీనికి
సూరదాసు
భక్తే
ఆధారము.
“కృష్ణా!
నీవు
నా
చేతుల
నుండి
తప్పించుకొని
పోగలిగావు
గానీ,
ఏదీ
నా
హృదయము
నుండి
వీడిపో
చూతము?”
అని
గర్జించినాడు.
ఆ
మాటలకు
పరమాత్మ
ఒప్పుకొని
“బిడ్డా!
నేను
భక్త
పరతంత్రుణ్ణి”
అని
ఆత్మగౌరవంగా
అంగీకరించెను.
చూడు!
ఇందులో
భగవంతుని
నిలువుగా
కట్టిపెట్టగలడు
భక్తుడు.
అయితే
అంతటి
భక్తి
పరవశుడు
కావలెను
కదా?
ఆనాడు
పరమాత్ముడు
భక్తుని
మంచి
చెడ్డలు
పూర్తిగా
తనవిగానే
భావించును,
అనుగ్రహించును.
ఇక్కడ
గీతలో
చెప్పిన
“యోగ
క్షేమం
వహామ్యహం”
అని
ప్రతిజ్ఞ
చేసిన
ప్రభు
వాక్యము
నిరూపించినాడు.
ఇక
మూడవదైన
“త్వమేవాహ
మితి
త్రిధా”
అనునది.
“నీవే
నేను”
అని
అవిభక్తమైన
భక్తి.
ఇందులో
సర్వమూ
అర్పించి
తనను
మాత్రము
మిగిలించుకొన్న
లాభమేమిటి?
అట్లు
చేసిన
ద్వైత
శరణాగతిగా
నుండును.
కాని
ఇది
“అద్వైత
శరణాగతి”.
ఇట్టిది
“వాసుదేవస్సర్వం”
అను
భావమును
పొందియుండును.
దేహాభిమానమున్నంత
వరకూ
భక్తుడు
–
దాసుడు,
భగవంతుడు
–
ప్రభువు.
జీవాభిమానియై
యున్నంత
వరకూ
భక్తుడు
అంశము,
భగవంతుడు
పూర్ణుడు.
ఉపాధుల
అభిమానము
వదలి
స్వరూప
స్థితిలో
ఉన్నప్పుడు
భక్తుడూ
భగవంతుడూ
ఇద్దరూ
ఒకటే
అగును.
ఈ
మూడవస్థలనూ,
స్థితులనూ
రామయణమున
హనుమంతుడు
రాములను
పొందెను.
ఇదే
విషయమును
ఈ
గీతయందు
రెండవ
అధ్యాయమున
ఏడవ
శ్లోకమున
అనుబంధ
చతుష్టయములను
చెప్పెను.
“ప్రపన్నం”
అనునది
అధికార
లక్షణము.
ఏ
రీతిగానన
తన
తప్పును
తాను
తెలిసికొని
అర్జునుడు
శరణు
పొందెను.
ఎప్పుడు
మానవుడు
తన
తప్పును
తాను
తెలుసుకొనునో
అప్పుడు
వాడు
అధికార
స్థానమును
పొందనర్హుడగును.
అంతియేకాక
అతను
తమో
గుణము
నుండి
మేల్కొనిన
వాడగును.
తిని
నిద్రించుటే
తమోగుణ
లక్షణము.
కానీ
అట్టి
దానికి
అతీతుడై
అంతఃకరణముల
యందు
జాగ్రత్త
వహించిన
స్థితిని
పొందినవాడు
కనుకనే
అర్జునుడు
తన
తప్పును
తాను
చక్కగ
తెలిసికొనగలిగెను.
ఈ
స్థితిని
కృష్ణపరమాత్మ
గ్రహించి
చిరునవ్వు
నవ్వుతూ
“బావా!
తమో
గుణమునకు
ఉపలక్షణమే
కదా
నిద్ర.
కనుక
నిద్రనే
జయించిన
వానిని
ఈ
మోహనిద్ర
ఏమి
చేయగలదు?
దాని
ప్రభావము
తాత్కాలికము.
అందువలననే
ఇంత
త్వరలో
స్వస్థితికి
రాగలిగితివి.
నీ
తప్పును
నీవు
తెలిసికొనగలిగితివి.
నన్ను
శరణాగతి
పొందితివి.
బావా!
ఈ
యేడుపు
ఇంటి
దగ్గరే
ఏడ్చి
ఉండకూడదా?”
అని
అప్పటి
నుండి
కృష్ణపరమాత్మ
గురువుగాను,
అర్జునుని
శిష్యునిగాను
తీర్చిదిద్దెను.
6
▾
Meaning
Keep
ఇంద్రియములకధిపతి
కృష్ణుడు.
ఇంద్రియములను
స్వాధీనమునకు
తెచ్చుకొన్నవాడు
అర్జునుడు.
అందుకనే
కృష్ణునికి
హృషీకేశుడనియు,
అర్జునునకు
గుడాకేశుడనియూ
పేర్లు
గలవు.
అసలు
దుఃఖమునకు
కారణమేమని
యోచించిన
దుఃఖమునకు
దేహము
కారణమనియు,
దేహమునకు
రాగద్వేషాలే
కారణమని,
రాగద్వేషాలకు
శోభనాశోభన
బుద్ధి
కారణమనీ
తెలిసికొన
గల్గెను.
జీవుడు
భ్రాంతిలో
అనుకూల
ప్రతికూలముల
భావనలు
చేసుకొన్నాడు.
సహజంగా
చెడ్డది
అని
అనుకొన్న
వస్తువుపై
ద్వేషమును,
మంచిది
అని
అనుకొన్న
వస్తువుపై
ప్రేమయు
కుదురుతుంది.
కానీ
భగవంతుని
దృష్టిలో
ఒకటి
మంచిది,
ఒకటి
చెడ్డది
అనునది
లేదు.
ద్వైత
బుద్ధే
దీనికి
కారణము.
ఉన్నది
ఒక
వస్తువైతే
రెండున్నాయని
అనుకోవడము.
ఇట్టి
స్థితిలో
ఉండుట
వలననే
ఇంతవరకూ
అర్జునుడు
అజ్ఞానమున
మునిగియుండెను.
అజ్ఞానమునకు
తత్త్వజ్ఞానము
లేకపోవుటే
మొదటి
కారణము.
తత్త్వమనగా
కూడను
అనేకమంది
అనేక
విధముల
తెలుపుదురు.
కానీ
యే
విషయమునకైననూ
చివరి
నిష్కర్ష,
అజ్ఞాన
వివసుడై
జీవుడు
అనేక
పర్యాయములు
పుడుతూ
గిడుతూ
దుఃఖ
సముద్రమున
మునుగుతూ
తేలుతూ
ఉండును.
కనుక
అజ్ఞానమును
రూపుమాపిన,
దుఃఖముల
నుండి
మానవుడు
విముక్తి
పొందగలడు.
అయితే
లోకములో
ఈ
ఆవరించిన
అజ్ఞానమునకు
అనేక
చికిత్సలు
కనిపెట్టుచూ,
ఆచరించుచూ,
ప్రబోధించుచూ
పలుకులు
చిలుకలవలె
పలుకుచున్నారు.
కానీ,
కడుపు
నొప్పికి
కన్నులలో
కాటుక
పెట్టినట్లున్నది,
ఈ
ప్రయోగములన్నియు.
ఉన్నదొకటైతే
చేసేది
మరొకటి.
ఎట్లు
నివారణ
కాగలదు?
నొప్పిని
తెలుసుకొని
తగిన
మందు
ఇచ్చిన
జబ్బు
కుదురును.
అట్టి
దివ్య
వైద్యుడు
ఒక్క
నారాయణుడు
తప్ప
అన్యులకు
అసాధ్యము.
ఇక్కడ
అర్జునుని
బాధకు
తగిన
ఔషధమును
కనిపెట్టి
సూటిగా
తినిపించినాడు.
ఆ
మందుతో
లోనున్న
మాలిన్యమంతయూ
బైట
పడినది.
పై
పై
మందులకు
పగలని
పుండును
లోమర్మము
తెలిసికొనగోరి
ఈ
రీతిగా
కృష్ణపరమాత్మ
ప్రశ్నించెను.
7
▾
Meaning
Keep
“ఎందుకు
బావా!
ఇట్లు
పిరికిపందవై
యేడ్చుట?
భీష్మ
ద్రోణాదులు
మరణింతురనియా?
నీ
యేడ్పు
కేవలము
భీష్మ
ద్రోణాదులు
మరణింతురని
కాదు.
వారలు
నావారే
అను
‘మమకారమే’
నిన్ను
ఏడ్పించుచున్నది.
లోకములో
ఏడ్చు
వారందరూ
మూడు
భాగములు
మరణములకు
ఏడ్చుట
లేదు.
మరణించువారు
నా
వారలను
‘మమకారము’తో
ఏడ్చుచుందురు.
బావా!
నీ
వారు
కానివారల
నెందరిని
నీవు
దీనికి
పూర్వము
చంపలేదు.
ఆనాడు
ఈ
యేడుపు
ఎక్కడకు
పోయినది?
ఈ
కనుపించు
వారలు
నా
వారలను
‘మమకార’మే
నిన్నింత
దుఃఖమునకు
కూలద్రోసినది.
ఆ
మమకారమునకు
అహంకారము
కారణము.
నిద్రలో
అహంకారము
లేదు.
అందుకే
పరుండిన
తన
దేహము
తనవారల
దేహములు,
కూడబెట్టిన
ధన,
కనక,
వస్తు
వాహనములు
ఏమైపోయినవో,
ఏమైపోవుచున్నవో
ఏమియూ
తెలియకుండును.
‘అహం’
ప్రథమా
విభక్తి.
మొదట
ఉండే
‘మమ’
షష్ఠీ
విభక్తి,
తరువాత
వస్తుంది.
ఇది
సహజమే
కదా?
పిచ్చివాడా,
తాను
కాని
దేహాన్ని
తానుగా
అనుకొనుటే
అజ్ఞానము.
అనాత్మను
ఆత్మగా
తలంచటము
విపరీతజ్ఞానము.
అది
జ్ఞానము
కానేరదు.
దేహాత్మ
బుద్ధే
అజ్ఞానము.
కాన,
అర్జునా!
నీ
అజ్ఞానము
మరేమి
చేసినా
తీరదు.
దీనికి
జ్ఞానమే
దివ్యౌషధము”
అని
ప్రథమములోనే
ఆత్మజ్ఞాన
బోధకుపక్రమించెను.
అదియే
రెండవ
అధ్యాయమున
పదకొండవ
శ్లోకము.
అక్కడ
నుండి
‘ఆత్మజ్ఞానము’
ప్రారంభించెను.
ఈ
శ్లోకము
గీతాపారాయణములో
‘బీజ
శ్లోకము’గా
భావించవలెను.
8
▾
Meaning
Keep
ఇందులో
అర్జునునిలోనున్న
రెండు
ఆక్షేపణలను
ఖండించుచున్నాడు
కృష్ణుడు.
మొదటిది,
దేహములకు
సంభవించు
నాశము
ఆత్మకేననియు,
శోకింపదగని
వాటికి
శోకించుట.
ఇది
“ప్రజ్ఞావాదాంశ్చ
భాషసే”.
స్వధర్మాన్ని
అధర్మమని
పండిత
వాదాన్ని
చెండి
వేస్తున్నావని
అన్నాడు.
ఇక్కడ
పాఠకులు
గమనించవలసిన
విషయమున్నది.
ఏమన,
అర్జునునకు
రెండు
విధములైన
మోహములు
ఆవేశించినవి.
ఒకటి
సామాన్య
మోహము.
రెండవది,
అసాధారణ
మోహము.
దేహమే
ఆత్మ
అనుకొని
దేహ
ధర్మాన్ని
ఆత్మయందు
ఆరోపించుట
సాధారణ
మోహము.
స్వధర్మమైన
యుద్ధము
అధర్మమని
తలంచుట.
ఇది
అసాధారణమైన
మోహము.
ఇదే
అర్జునుని
యందు
ప్రత్యేకించిన
మోహము.
అందువలననే
కృష్ణపరమాత్మ
మొదటిదైన
సాధారణ
మోహమును
నిరసిస్తూ,
రెండవదైన
అసాధారణ
మోహమును
నివారిస్తున్నాడు.
సాధారణ
మోహమును
రెండవ
అధ్యాయములో
పండ్రెండవ
శ్లోకము
నుండి
ముప్పదవ
శ్లోకము
వరకూ
ఆత్మబోధచేసి,
రెండవదయిన
అసాధరణ
మోహమునకు
ప్రత్యుత్తరముగా
విశేష
మోహాన్ని
నివారిస్తూ
స్వధర్మ
ప్రతిపాదకమైన
ఎనిమిది
శ్లోకాలు
చెప్పెను.
వాటినే
“ధర్మాష్టక”మని
అందురు.
ఆ
స్వధర్మము
ఏ
రీతిగా
చేస్తే
అది
జన్మ
హేతువుకాక
మోక్షహేతువు
కాగలదో
అట్టి
నిష్కామకర్మ
యోగాన్ని
అనంతరం
బోధించెను.
ఈ
రెండవ
అధ్యాయములో
చివరలో
సాకారమూర్తి
అయిన
స్థితప్రజ్ఞుని
వర్ణన
జరిగినది.
వినుడు
కృష్ణుని
మరు
ప్రసంగము.
9
▾
Meaning
Keep
“అర్జునా!
నీవెవరో,
నీవు
చేసే
పని
ఏమో
కొంత
యోచించుకో.
అన్నియూ
నాకు
తెలుసునని
అంటావు.
గోడున
ఆడవారివలే
ఏడుస్తావు.
మాటలు
పండిత
మాటలు,
ఆటలు
పామర
ఆటలు.
మాటలతో
జ్ఞానివని
తలచిన,
ఆటలతో
అజ్ఞానివని
చింతించవలసి
వచ్చుచున్నది.
నీ
స్థితిని
చూచిన
అగమ్యగోచరముగానున్నది.
పోనీ
పండితుడవేనని
అందుమా,
చావు
బ్రతుకులకు
పండితులు
దుఃఖించరు,
దుఃఖించకూడదు.
అట్లు
దుఃఖింతురా
వారు
పండితులు
కారు.
10
▾
Meaning
Keep
“పండా”
అనగా
తత్త్వ
నిర్ణయ
బుద్ధి.
అది
కలవారే
పండితులు.”
11
▾
Meaning
Keep
“దేహము
యొక్క
మర్మమును,
ఆత్మ
యొక్క
ధర్మమును
ఉన్నదున్నట్లు
తెలుసుకొనువారే
పండితులు
కదా?
అట్టి
పండితులు
కాయములతో
ఉన్నవారికి
కానీ,
ఊడిన
వారికి
కానీ
దుఃఖించరు.
ఎట్టి
ద్వంద్వ
పరిస్థితులలోను
చిత్త
సమాధానాన్ని
కోల్పోరు.
ఏమియూ,
రెండూ
(దేహము
యొక్క
మర్మమును,
ఆత్మ
యొక్క
ధర్మమును)
తెలియని
అజ్ఞానులే
మరణించిన
వారికై
విలపించేది.
తెలిసి,
తెలియని
వారు
బ్రతికి
ఉన్నవారి
బాగోగుల
కొరకు
దుఃఖించుట,
అన్నియూ
తెలిసిన
పండితులు
దేనికీ
దుఃఖించకుండుట
జరుగును.
బావా!
అర్జునా!
భీష్మ
ద్రోణాదుల
దేహములు
మరణించునని
ఏడ్చుచున్నావా?
లేక
ఆత్మలు
మరణించునని
ఏడ్చుచున్నావా?
దేహముల
కొరకే
అని
అందువా,
ఎంతమందికని
ఏడ్తువు?
పోనీ
ఏడ్చిన
దేహములు
నిలుచుచుండిన,
లోకములో
కూలీల
నైననూ
పెట్టి
యేడ్పించి
బ్రతికించుకొని
యుండెడివారు.
అట్లు
ఏనాటికినీ
కాదు.
ఈ
కాయమును
అమృతభాండములో
దాచిననూ
గిట్టేదేమో
సత్యము.
ఇట్టివారికి
ఏడ్చి
ప్రయోజనమేమి?
ఇక
ఆత్మకొరకని
అందువేమో,
అది
మరింత
తెలివి
తక్కువ.
దానిని
మృత్యువు
సమీపించలేదు.
అది
నిత్య,
సత్యమైన
నిర్మల
వస్తువు.
12
▾
Meaning
Keep
కనుక
యెందులకు
ఏడ్చుచున్నావు?
దీనిని
పట్టి
చూడ
ఆత్మజ్ఞానము
శూన్యము.
యుద్ధము
క్షత్రియులకు
స్వధర్మము
కదా!
భీష్మాదులను
ఎట్లు
యుద్ధమున
చంపుట?
అని
చింతించుచున్నావు.
బావా!
నీ
పాలిటికి
వచ్చిన
కర్తవ్యాన్ని
నిర్వర్తించి
కృతకృత్యుడవు
కమ్ము.
(“కథం
భీష్మమహం
సంఖ్యే?”
అని
అన్నాడు
అర్జునుడు)
యుద్ధమున
చంపనున్నావు
కానీ,
గృహమున
కాదు
కదా?
నీవు
చెప్పినట్లు
ఇంటిలో
చంపిన
అధర్మము
కానీ
యుద్ధములో
అధర్మ
మెట్లగును?
బావా!
ఈ
వివేకమైననూ
కడకు
నీలో
లేక
పోయెనా!”
13
▾
Meaning
Keep
“చాలు,
పిచ్చివాడా!
లేచి
సిద్ధముకమ్ము.
లేని
మమకారమును
తలకు
రుద్దుకొని
మొద్దువలే
కూలినావు.
సర్వమునకూ
సర్వేశ్వరుడు
కారణము
కానీ,
నీవు
కావు.
అట్టి
ప్రచండ
శక్తి
ఒకటి
కలదు.
ఆ
శక్తిని
వారు
గ్రహించినందున
ఎట్టి
ప్రళయాలకూ
వెరువరు.
క్షత్రియులకు
యుద్ధము
ధారాతీర్థము,
దీనిని
బాగుగా
తెలిసికొనియే
భీష్మద్రోణాదులు
యుద్ధములో
దేహమును
వీడి
తరించవలెనని
వచ్చిరి.
చూడు,
వారు
నీవలే
ఏడ్చుచున్నారేమో!
వారు
ఏనాటికినీ
నీవలే
శోకించరు,
వెనుదీయరు.
అర్జునా!
నీకిది
గట్టి
పరీక్షా
ఘట్టము
సుమా!”
అని
అంతటితో
విడువక,
“పార్థా!
ఎప్పుడు
కూడనూ
నేను
లేనిది
గానీ
లేకుండినది
గానీ
లేదు.
ఇంతేల?
నీవునూ,
ఈ
రాజులును,
ఈ
సైన్యమును
కూడను
అంతే.
ఎప్పుడునూ
మనమందరమూ
లేకుండా
పోలేదు.”
అని
“తత్”
పదమైన
పరమాత్మకూ
“త్వం”
పరమైన
జీవాత్మకూ
ఏకత్వము
చెప్పి
“తత్త్వమసి”
మహావాక్యార్థాన్ని
బోధించెను.
కుండకు
పూర్వము
మట్టి
యెట్లు
ఉండునో
కల్పితమునకు
పూర్వము
అధిష్ఠానముండియే
యున్నది.
14
▾
Meaning
Keep
దీనికి
అర్జునుడు
అందుకొని
కొంత
స్పృహలోనికి
వచ్చి,
“కృష్ణా
!
నీవు
భగవంతుడవు
కావచ్చు.
నీకు
నాశము
లేకుండవచ్చు.
కానీ
నేను
ఏడ్చుట
నీ
కొరకు
కాదు
కదా!
నిన్న
పుట్టి,
నేడు
ఉండి,
రేపు
గిట్టే
మా
సంగతి
తెలుపుము”
అని
ప్రార్థించెను.
ఇక్కడ
చక్కగ
గమనించవలెను.
“తత్”
పదార్థమైన
భగవంతుడు
“నిత్యుడు”
అనియు,
ఇక
ఉన్నదంతా
“త్వం”
పదార్థము.
“త్వం
పదార్థము
కూడా
నిత్యమే”.
కానీ
నిత్యమంటే
పామరులు
అంత
త్వరగా
గ్రహించుకొనలేరు.
కాన
ఈ
విషయము
కృష్ణ
పరమాత్మ
అందుకొని,
“బావా!
మీరునూ
నిత్యులే.
“తత్త్వం”
పదార్థములు
పరిచ్ఛిన్నాలుగా
కనిపించినను
ఉపాధి
వదిలి
చూచిన
రెండూ
ఒకటే.
ఏ
రీతిగా
నగకు
ముందూ
బంగారమున్నది,
నగలోనా
బంగారమున్నది,
నగ
చెడకొట్టిననూ
బంగారమున్నది,
అటులనే
చిదాకారమైన
ఆత్మ,
దేహముల
వెంటరాదు,
దేహముల
వెంట
పోదు”
అని
అర్జునునకు
బోధించెను.
Previous
←
The Vṛtti of Śaraṇāgati
Next
Niṣkāma Karma – Buddhi Yoga
→