Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · Niṣkāma Karma – Buddhi Yoga
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
దేహములతో
కలసియుండిననూ
“ఆత్మ”,
గుణధర్మాలకు
అతీతమై
యుండును.
దేహములోని
బాల్య,
కౌమార్య,
యౌవన,
వార్థక్యాదులెట్టులో
(అవస్థలు)
దేహ
తదనంతరము
ప్రాప్తి
కూడ
అట్టిదే.
ధీరుడు
ఇందుకై
శోకింపడని,
కృష్ణుడు
గట్టిగా
రథముని
ఊపించి
చెప్పెను.
2
▾
Meaning
Keep
దానికి
అర్జునుడు
సందేహ
మనస్సుతో
ప్రశ్నించును:
“స్వామీ!
అవస్థాంతరాల
వలెనే
దేహాంతరాలు
కూడనూ,
అని
అంటిరి
కదా?
కానీ,
అవస్థాంతరాలలోని
విషయములు
జ్ఞాపకమందుండును
కదా?
దేహాంతరాల
విషయములు
జ్ఞాపకమందుండవే?
నీవు
చెప్పినది
దీనికి
ఎట్లు
పొసగును?”.
“ఏకదేశీ
అంశమే
గ్రహించవలెను.
సర్వాంశ
గ్రహణము
సరిపోదు.
అవస్థలు
మారినా,
ఆత్మ
మారదు!
అట్లే,
దేహములు
మారినా
ఆత్మ
మారదు!
దృష్టాంతములో
ఇంతవరకే
గ్రహించవలెను.”
3
▾
Meaning
Keep
కానీ,
అర్జునుడు
మరో
అంశానికి
దిగినాడు.
ఇది
అర్జునున
కొక్కనికే
కాదు,
సామాన్య
మానవులకు
ఈలాంటి
అనుమానములు
వచ్చుననే
భగవంతుడు
“ధీరస్తత్ర
న
ముహ్యతే”
అంటూ
ఆ
అనుమానమునకు
అక్కడికక్కడే
నిదానము
లేక
సమాధానము
తెలిపెను.
“అర్జునా!
అవస్థాంతరాలలో
బుద్ధి
కొంతవరకు
జ్ఞాపకము
పెట్టుకో
గలుగుతుంది;
మరణకాలములో,
అనగా,
దేహాంతర
పరిస్థితులలో
బుద్ధి
వికలమై
పోతుంది.
ఆ
దెబ్బతో
గడిచినవన్నింటిని
ఒక్క
పెట్టున
మరచి
పోతుంది.
ఎరుక
మరుపులు
బుద్ధి
ధర్మము
కానీ
ఆత్మ
ధర్మము
కాదు.”
4
▾
Meaning
Keep
“ఇప్పుడు
మరొక
విషయము
తీసుకో:
అనగా,
నీకు
పాతిక
సంవత్సరముల
వయస్సు
అనుకో.
గడచిన
పది
సంవత్సరముల
మునుపు
ఏదో
ఒక
దినమున
నీవు
ఎక్కడుంటివని
అడిగిన
నీవు
చెప్పలేవు.
కానీ,
నీవుండియుండుట
సత్యమే
కదా?
నేను
లేనని
మాత్రము
అనలేవు
కదా?
అటులనే
దేహాంతర
విషయాలు
కూడనూ!
నీవున్నావు
కానీ
విషయములు
మాత్రము
జ్ఞాపకమందు
లేవు.
ఈ
విషయమందే
బుద్ధిబలము
కలవాడు
భ్రమ
చెందడు.
అట్టివానినే
“జ్ఞాని”
అందురు.
ఆత్మ
పోయేది
కాదు;
దేహము
ఉండేది
కాదు.
పోనీ,
వారి
మరణము
కోసమేమైనా
దుఃఖించిన,
వారి
ఆత్మకేమైనా
సంతోషమా,
అన్న,
మరింత
పిచ్చిమాట.
ఆత్మకు
ఏమి
చేసినా
దుఃఖము
లేదు.”
5
▾
Meaning
Keep
“ఇంద్రియములు
తమ
తమ
స్థానములలోనే
ఉండిన
ఏ
భయము
రాదు;
లేదు.
కాని,
విషయములతో
చేరుట
వలన
భయము;
అనగా,
ఇంద్రియ
విషయ
సంయోగమే
సుఖదుఃఖములకు
కారణమగుచున్నది.
నిన్నెవరైననూ
దూషించిన,
అది
నీవు
విన్న,
నిన్ను
వికారముగా
మార్చును.
అట్లు
కాక,
ఆ
విషయమునే
నీవు
ఇంద్రియమునకు
చేర్చకుండిన,
అనగా,
వారి
దూషణపు
మాటలు
నీ
చెవిన
పడకుండినంత
కాలము
ఏ
వికారమూ
నీలో
లేదు.
ఇట్టి
వికారమునకు
విషయేంద్రియ
సమ్మేళనమే
కారణము
కదా?”
6
▾
Meaning
Keep
“ఇవి
కేవలము
శీతోష్ణాలవలే
నుండును.
శీతలము
వేడి
కాలమున
సుఖమును,
హోయినీ
ఇచ్చును.
అటులనే
ఉష్ణము
కూడనూ
శీతకాలమున
సుఖమును,
హోయినీ
అందించును.
అటులనే
విషయ
స్పర్శలు
కూడనూ
ప్రపంచమున్నంతవరకూ
బైట
విషయాలు
తప్పవు.
ప్రారబ్ధమున్నంత
వరకూ
సుఖదుఃఖాలు
తప్పవు.
అయితే
వాటిని
భరించుకొను
విద్యను,
ఉపాయమును
నేర్చుకొనవలెను.”
7
▾
Meaning
Keep
“కానీ,
సముద్రమున
అలలు
తగ్గువరకూ
నేను
స్నానానికి
పోనన్న
ఇక
అలలు
తగ్గుటెప్పుడు?
స్నానము
చేయుటెప్పుడు?
అలలతో
దెబ్బతినని
ఉపాయమును
తెలుసుకొనవలెను
కానీ,
అది
తెలుసుకొనక,
అసలే
స్నానము
మానుట
యెంత
విపరీతము!
కాన,
అర్జునా,
‘తితీక్షా’
కవచమును
నీవు
ధరించిన
సుఖ
దుఃఖముల
బాధ
నీకుండదు.”
8
▾
Meaning
Keep
“తితీక్ష,
యనగా
ద్వంద్వములలో
సహనము.
సహనము
బలవంతులకే
తగినది;
అది
వారి
సొత్తే;
వారి
పొత్తే.
దుర్బలుడు
ద్వంద్వాల
తాకిడికి
నిమిషము
స్థిరములేక,
నెమలి
పింఛమువలే
కదలుచునే
యుండును.
గడియారము
పెండ్యులమువలే
అటూ
ఇటూ
కదలుచునే
యుండును.
అనగా,
ఒకతూరి
సుఖము
వైపున
మరొక
తూరి
దుఃఖము
వైపునా
చూచుచుండును.”
9
▾
Meaning
Keep
“ఇక్కడ
కొంత
యోచించవలెను.
సహనమన్న
విధిలేని,
గతిలేని,
స్థితిలేని,
సహనము
కాదు.
అన్నియూ
ఉండియూ,
సహనమును
అవలంబించిన
అదియే
మోక్షసాధనము.
బైట
క్షాంతితో
పాటు
లోని
శాంతి
యుండవలెను.
వివేకముతో
కూడినది,
సహనము.”
10
▾
Meaning
Keep
(ఇచ్చట
వివేకమంటే,
ఆగమాపాయినాలనే
తలంపు.
అనగా,
విషయాలు
వచ్చిపోవునవని
తలంచవలెను.
అవి
స్థిరముగా
నుండునవి
కావని
అర్థము.
వివేకమునకు
తితీక్షను
అవలంబించవలెను.)
“సాధారణముగా
మానవులు
సుఖసంతోషములనే
ఆశింతురు
కానీ
ఎట్టి
సమయమునందును
కష్టదుఃఖములను
ఆశించరు.
సుఖసంతోషములన్న
ప్రాణమిత్రులుగాను,
కష్టదుఃఖములన్న
పరమశత్రువులుగాను
చూతురు.
ఇది
పెద్ద
అవివేకము!
సుఖములో
ఆనందము
తక్కువ;
అశాంతి
ఎక్కువ.
కష్టములలో
విచారణ
ఎక్కువ!
అనగా,
సుఖములో
ఉన్నంత
పాపము
కష్టములలోనుండదు.
కష్టములు
మానవుని
జాగ్రత
స్థితికి
తెప్పించి
ముందుయోచనకు
విచారించునటుల
చేయును.
సుఖము
మానవత్వమునే
మరిపించి
అవివేక
అహంకారములతో
పాపములు
చేయించును.
పుణ్యములను
ఖర్చు
చేయించును.
మన
పాపములను
తరిగింపజేసి,
జాగ్రతను
ప్రసాదించు
కష్టమే
నిజమిత్రుడు.
పుణ్యములను
ఖర్చు
చేయించి
పాపముల
చెలరేగింప
జేయు
సుఖమును
మన
శత్రువుగా
భావించవలెను.”
11
▾
Meaning
Keep
“కష్టములు,
మానవత్వమునందలి
వివేకమును
విజృభింపజేసి,
విచారణశక్తిని
కలిగించుచున్నవి.
సుఖములు
నూతన
అనుభవములను
కూడనూ
మరచిపోవునట్లు
చేసి,
మందమతిగా
మార్చుచున్నవి.
కాన
కష్టములను
కేవలము
మిత్రునిగా
చూడకపోయిననూ,
శత్రువు
మాత్రము
కాదు!
ప్రారబ్ధముతో
పాలిటబడిన
సుఖదుఃఖాలను
పరమాత్మ
ప్రసాదముగా
తలంచవలెను.
అపుడే
బంధ
విముక్తుడౌతాడు.
ఆ
వివేకమే
జ్ఞానము.
అది
లేకుండుటే
అజ్ఞానము.
అజ్ఞానము
కలవాడు
అంధుడనే
భావించవచ్చును.
జ్ఞాన
అజ్ఞానములవలే
సుఖ
దుఃఖములు
కూడనూ.
అంధునికి
దారి
చూపువాడు
ఒకడు
ఉండవలెను
కదా?
అంధుడు
ఒక్కడే
రాలేడు.
అటులనే
సుఖమును
కోరిన
దానితో
పాటు
దుఃఖము
కూడనూ
రాకతప్పదు.
సుఖముతో
పాటు
దుఃఖము
ఉండిననే,
సుఖము
యొక్క
విలువ
అర్థమగును”
అని
కృష్ణపరమాత్మ
బోధించగా,
అప్పుడు
అర్జునుడు
అందుకొని
“మాధవా!
నీవు
చెప్పినటుల
తితీక్షను
అవలంబించి,
సుఖ
దుఃఖములను
జయించిన
కలుగు
లాభమేమి?
ఓర్పు
మాత్రమని
అనవచ్చును.
అంతకంటే
మరేమీ
ఉండదు
కదా?”
12
▾
Meaning
Keep
అంత
భగవానుడిట్లు
వచించెను:
“కౌంతేయా!
సంసార
సముద్రమందు
ఎడతెరపి
లేకుండా
వచ్చిపడే
సుఖ
దుఃఖములను
తరంగములకు
కించిత్తైననూ
చలించక,
చిత్త
సామ్యాన్ని
కోల్పోక,
తన
పట్టుదలతో
నిలిచిన
(అనగా
నిష్ఠలో
నిలచిన)
వాడు
‘ధీరుడ’గును.
విషయ
ద్వంద్వాలను
తిరస్కరించే
శక్తి
సామర్థ్యములు
కలిగినవాడే
బుద్ధిమంతుడు.
అట్టి
బుద్ధి
కలవానినే
‘ధీరుడ’ని
అందురు.”
13
▾
Meaning
Keep
“‘ధీ’
అనగా
బుద్ధి
కదా!
అట్టి
బుద్ధి
కలవాడే
పురుషుడు.
కేవలము
మీసములు
పెంచి
చొక్కా
వేసుకొన్నవాడు
కాదు
పురుషుడు.
ద్వంద్వ
తిరస్కార
బుద్ధి
కలవాడే
పురుషుడు.
అట్టి
పురుషుడు
బైట
శత్రువులను
గెలుచుటకంటే
లోని
శత్రువులను
గెలుచుట
చాలా
ఉత్తమ
మార్గము.
సుఖదుఃఖములను
జయించుటే
–
ఈ
ధీరుడు
చేయవలసిన
పని,
అదే
నిజఫలము.”
14
▾
Meaning
Keep
“బావా!
మరి
నీవు
సందేహింతువేమో!
నీవు
వట్టి
సందేహాల
పుట్టవు!
ఇన్ని
జయించియూ
ఫలమేమని
తిరిగి
అడుగవచ్చును.
‘అమృత
పథమే’
దాని
గమ్యము.
సుఖ
దుఃఖములను
జయించిన
లభించు
ఫలము
నిరపేక్షికమైన
అమృతము.
బావా!
పురుష
శ్రేష్ఠుడవు,
కనుక
ఈ
అనిత్య
అసత్యమైన
లౌకిక
సుఖదుఃఖముల
జయము
కానీ,
ఈ
అమృతప్రాప్తి
కానీ
ఆవశ్యకత
కాదు
అని
శోకించుచున్నావను
ఆక్షేపణను
పురస్కరించుకొని
నీకు
ఆత్మానాత్మ
వివేకమును
చెప్పేను.”
15
▾
Meaning
Keep
‘ఆత్మ
ఒక్కటే
సద్వస్తువనియు,
దేహోదులు
మాత్రాస్పర్శలు,
సత్తుకు
అభావం,
అసత్తుకు
భావం
ఏనాటికీ
రావు,
లేవు’
అని
సదసత్తుల
నిర్ణయాన్ని
కృష్ణపరమాత్మ
బోధించెను.
16
▾
Meaning
Keep
జ్ఞానము
లేనివాడు
కర్మలు
చేసి
బద్ధుడు
కాగలడు.
జ్ఞాని
కర్మ
బంధానికి
కట్టుబడడు.
ఈత
తెలిసి
నదిలో
దిగిన
వానికి
ఏనాటికీ
అపాయము
సంభవించదు.
వానికి
క్షేమమే
కలుగును;
అట్లు
కాక,
ఈత
తెలియక
నదిలో
దిగిన
సాగరమే
గతి!
మరణమే
శరణ్యము!
17
▾
Meaning
Keep
అందువలననే
కృష్ణపరమాత్మ
మొదలే
‘ఆత్మజ్ఞానము’ను
బోధించెను.
ఆత్మ
చంపునదియూ,
చచ్చునదియూ
కాదని
తెలిపెను.
చంపుననియు,
చచ్చుననియూ
తలంచే
వారిద్దరూ
ఆత్మస్వరూప
స్వభావాన్ని
యధార్థముగా
తెలియుని
వారనే
తలంచవలెను.
కాన
అర్జునుని
ఆత్మ
చంపేదే
కాదనియు,
భీష్మ
ద్రోణాదుల
ఆత్మలు
చచ్చేటివీ
కాదనియు,
కృష్ణునుని
ఆత్మ
ప్రేరేపించేదీ
కాదనియు,
ఇవి
కేవలము
కర్తృ
కర్మ
ప్రేరక
భావాలు
మాత్రమేననియు,
ఆత్మ
యే
కర్మకూ
కర్త
కాదనియూ,
యే
కర్మకూ
విషయము
కూడా
కాదనియు,
నిర్వికారమైన
ఆత్మ
చావదనియు,
చంపదనియూ
ఈ
క్రింది
విధముగా
కృష్ణపరమాత్మ
బోధించెను.
18
▾
Meaning
Keep
“పుట్టుట,
ఉండుట,
పెరుగుట,
పరిణామము
చెందుట,
క్షీణించుట,
నశించుట,
ఈ
ఆరింటిని
షడ్భావవికారాలని
అందురు.
ముందు
లేకుండి
తరువాత
కలుగుట
జన్మమని
అందురు.
ఉండి
లేకపోవుట
మరణమని
అందురు.
జన్మము
సావయువ
వస్తువుకే
కానీ
నిరవయువ
వస్తువుకు
కాదు.
ఆత్మ
నిరవయువం
కదా?
కనుక
ఆత్మకు
జన్మ
మెక్కడిది?
అట్టి
జన్మమే
లేని
దానికి
మరణము
ఎట్లు
సంభవించును?
అట్టి
ఆత్మ
యెవరిని
చంపును?
ఎవరిని
చంపించును?
అది
అజము,
నిత్యము,
శాశ్వతము.
మలినమైన,
జీర్ణమైన
వస్త్రములను
మనుజుడు
విడచి
నూతన
శుభ్రమైన
వస్త్రములను
ఏ
రీతిగా
ధరించునో
అటులనే
దేహి,
జీర్ణమైన
దేహములను
వీడి
నూతన
దేహములను
ధరించుచున్నది.
వస్త్రము
దేహమున
కెట్టిదో,
దేహము
దేహికట్టిది.
దేహములకు
సాక్షియైన
ఈ
ఆత్మను
తత్త్వతః
తెలిసికొనినచో
నీవు
ఈ
రీతిగా
శోకించియుండెడివాడవు
కావు.
నీ
సర్వాయుధములు
ఈ
శరీరములను
జడములను
కొట్టగలవే
గాని
నిర్వికారమైన
ఆత్మను
ఏ
రీతిగానూ
సమీపించలేవు.
ఈ
సత్యమును
తెలిసికొని
శరీరమునందలి
శోకమును
త్యజించుము.”
19
▾
Meaning
Keep
“ధర్మము
తరపున
నిలచి,
అధర్మమును
రూపుమాపుట
క్షత్రియుల
పరమ
పవిత్ర
ధర్మము.
బావా!
అర్జునా!
భీష్మాదులంతటివారు
ప్రతియోధులుగా
నిలుచుట
నీ
భాగ్యమే
భాగ్యము!
క్షత్రియ
ధర్మమునకు
కట్టుపడే
కదా,
నీకు
పరమపూజ్యుడు,
పితామహుడూ
అయిన
భీష్ముడు,
బ్రాహ్మణుడు,
అందులో
తనకు
సర్వవిద్యలూ
నేర్పిన
గురువు
అగు
పరశురామునితో
ఆనాడు
యుద్ధము
చేసెను!
అది
యోచించితివా?
ఆనాడు
భీష్ముడు
కూడనూ
ఇదే
రీతిగా
ఏడ్చెనా?
సర్వ
సుగుణ
సంపన్నుడు,
మహాత్యాగి
అయిన
భీష్ముడే
తన
క్షత్రియ
ధర్మమునకు
కట్టుపడి,
బ్రాహ్మణ
గురువు
అయిన
పరశురామునితో
యుద్ధము
చేయగా,
దానిని
మరచి
అట్టి
ధర్మకర్మలనాచరించిన
వారిపై
నీవు
యద్ధము
చేయుటకు
పిరికి
వాడవై
వెనుదీయుచున్నావు!
సర్వమునూ
ఓడించి
ధర్మమును
నిలుపుట
క్షత్రియ
జాతికి
పరమ
శ్రేయస్సు,
అదే
శ్రేయోమార్గము.”
20
▾
Meaning
Keep
“క్షతమనగా
నేమియో
యోచించితివా?
దుఃఖమని,
దాని
నుండి
ప్రజాకోటిని
రక్షించే
వానినే
క్షత్రియుడని
అందురు.
ఇట్టి
ధర్మయుద్ధము
ఎట్టి
పుణ్యాత్ములకో
లభించును
కానీ
అది
సామాన్యము
కాదు!
అందులోనా,
క్షత్రియునికే
ఈ
పుణ్యము
దొరికినది.
ధర్మపరులను
కాపాడుటలో,
అధర్మపరులను
హతమార్చుటలో
ఎంతటి
ఉపకారమైన
పుణ్యము
కలదో
యోచించకో!
లోకములో
శాంతి
సౌఖ్యాన్ని
నెలకొలుపుటకు
చేయు
యుద్ధమునే
ధర్మయుద్ధమని
అందురు.”
21
▾
Meaning
Keep
“కౌరవులు
చేయని
పాపము,
అనాచారము,
అధర్మములు
లేనే
లేవు.
పెద్దలను
అగౌరవపరచిరి;
మంచిని
ధిక్కరించిరి;
పతివ్రతలను
పరాభవము
చేసిరి;
ధర్మపరులను
హింసించిరి;
ఇట్టివి
లెక్కకు
రానట్లు
చేసిరి;
అట్టి
వారికి
వినాశకాలమాసన్నమయినది.
ఇట్టి
తరుణమున
నీవు
పిరికి
వాడయిన
కన్న
తలిదండ్రులకు,
తోబుట్టిన
అన్నదమ్ములకు,
ఇంతేల?
క్షత్రియ
కులమునకే
అపకీర్తి
తెచ్చినవాడవగుదువు.”
22
▾
Meaning
Keep
“బావా!
యుద్ధము
చేసిన
పాపమనుచున్నావు.
చాలా
పౌరపడుచున్నావు!
యుద్ధము
చేయక,
పాపులను
అంతమొనరించక
పరమపుణ్య
కోటికి
అపకారము
తెచ్చుట
పాపము
కానీ,
యుద్ధము
చేయకపోవుటే
పెద్ద
పాపమును
చేసినవాడవగుదువు.
ఈ
సమయమున
నీ
స్వధర్మమును
వదలితివంటే
అతిహీనస్థితికి
రాగలవు.
స్వధర్మమును
నిర్వహిస్తే
నీకు
ఏ
పాపమూ
అంటదు.
ద్వంద్వాలలో
సమచిత్తమును
పెట్టి
దృఢచిత్తముతో
యుద్ధమున
ఎదుర్కొనుము.”
దానివలననే
ఈ
అధ్యాయములో
ముప్పై
ఒకటవ
శ్లోకము
మొదలు
ఎనిమిది
శ్లోకములు
బోధించెను.
స్వధర్మ
నిష్ఠను,
సుఖదుఃఖములలో
సమభావము
పెట్టి
కర్మలో
పాల్గొనవలెనని
ముప్పై
ఏడవ
శ్లోకమున
చెప్పెను.
ముప్పై
తొమ్మిదవ
శ్లోకం
ఒక
సంధి
శ్లోకం.
అందులో
“ఏషా
తేఽభిహితా
సాంఖ్యే”–
“సాంఖ్యబుద్ధిని
నీకు
బోధించితిని.
ఇక
యోగబుద్ధిని
తెలిపెదను
వినుమ”ని,
పరమాత్ముడు
తెలిపెను.
23
▾
Meaning
Keep
బుద్ధిపూర్వకముగా
ఫలాసక్తి
వదలి
చేసిన
కర్మనే
“నిష్కామకర్మ”
అని
అందురు.
అదే
“బుద్ధి
యోగం”.
బుద్ధి
నిర్మలము
కానిదే
ఫలాసక్తి
వదలేది
వీలుపడదు
కదా?
కాబట్టి
దానినే
“యోగ
బుద్ధి”
అని
కూడనూ
అందురు.
దీని
సహాయంతోనే
నీవు
కర్మ
బంధాలను
వదలించుకో,
నీవు
కర్మాతీతుడవు
కమ్ము.
పోనీ,
అసలు
బంధనలను
కలిగించే
కర్మలు
చేయకుండా
ఉందామని
తలంచిన
అది
సాధ్యము
కాదు.
అసలు
కర్మచేయక
ఉండుటకు
వీలులేదు.
అది
ఎట్టివారి
చేతనూ
కాదు.
అందులకనే
గీతలో
కృష్ణుడు
మూడవ
అధ్యాయములో
“నహి
కశ్చిత్
క్షణమపి”
అని
అంటున్నాడు.
24
▾
Meaning
Keep
“అర్జునా!
కామ్యకర్మలకు
‘అభిక్రమనాశ’మున్నది.
నిష్కామకర్మలకు
అభిక్రమనాశము
లేదు.
ఇదియే
సకామ
నిష్కామకర్మలకు
భేదము.
కామ్యకర్మ
శిక్షకు
కూడనూ
సిద్ధము
కావలసి
యుండును.
నిష్కామకర్మకు
అట్టి
శిక్షలు
ఉండవు.
ఫలాపేక్ష
సంసార
హేతువు;
ఫల
త్యాగము
మోక్ష
హేతువు.
నిష్కామకర్మయోగ
మార్గమును
అనుసరించువాడు
ఆ
జన్మలోనే
సిద్ధిని
సాధించలేకపోయిననూ
చేసిన
కర్మ
వ్యర్థము
కాదు.
దాని
ఫలము
తరువాత
వచ్చు
జన్మమునందైననూ
ఫలించును.
తన
లక్ష్యాన్ని
అవశ్యం
సాధించవచ్చును.
కనుక
కర్మయందే
అధికారముంచుకో,
కాని
కర్మఫలమందు
అధికారము
ఉంచుకొనవద్దు.
25
▾
Meaning
Keep
“బావా!
ఫలాపేక్ష
రజోగుణ
సంబంధము.
అది
నీకు
సరిగాదు.
ఫలం
వదలమంటే
కర్మనే
మానుదువేమో!
అది
మరింత
మోసము.
అది
తమోగుణ
లక్షణము.
జాగ్రత్త!”
ఇక్కడ
భగవంతుడు
నాలుగు
ఆజ్ఞలు
పెట్టినాడు.
మొదటిది
విధాయకాజ్ఞ,
తక్కిన
మూడును
నిషేధకాజ్ఞలు.
మొదటిది
గుణ
నిరూపణ
సంబంధము.
రెండవది
దోషనిరూపణ
సంబంధము.
కాన
మానవులందరికీ
కర్మయందధికారము
కలదని
భావించవలెను.
ఒక
అర్జునునికే
కాదు.
26
▾
Meaning
Keep
అర్జునుని
మానవ
ప్రతినిధిగా
భావించవలెను.
అదియే
గీతా
పాఠకులు
మొదలు
గమనించవలసిన
విషయము.
ఇందులో
మరొకటి
తెలిసికొనవలెను;
ఏమన,
కర్మాధికారము
మానవులకే
కానీ,
పశుపక్ష్యాదులకు
కానీ
దేవతలకు
కానీ
కాదని
దీని
అర్థము.
లోకమున
ప్రతి
మానవుడూ
ఫలాన్ని
కోరే
కర్మలు
చేయును.
ఫలమే
లేదన్న
అసలు
మానవుడు
కర్మనైననూ
వదలును
కానీ
ఫలములేక
ఏ
కర్మయునూ
చేయుటలేదు.
ప్రతి
కర్మకూ
మానవునకు
లాభము
అవసరము
కానీ
మన
గీతా
పానము
చేయువారలకు
ఇది
అన్వయింపదు.
సామాన్య
మానవుల
మనసులు
అట్టి
ఫలాపేక్షకు
పాల్పడవచ్చును.
మోక్షాపేక్ష
కలవారు
కర్మలు
చేయుచు,
ఫలమును
భగవదర్పితము
చేయవలెను.
అది
శాంతిని
చేకూర్చును.
Previous
←
Ordinary Moha and Extraordinary Moha
Next
The Marks of the Sthitaprajña
→