Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Marks of the Sthitaprajña
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఫలాపేక్ష
అశాంతిని
అందించును.
ఫలమునే
వదలిన
జీవించుటెట్లు?
అని
తలంతురేమో,
అంత
దౌర్బల్యమెందుకు?
ఎవరు
“యోగక్షేమం
వహామ్యహం”
అని
అన్నారో
వారే
చూచుకొందురు.
జీవితానందము
ప్రధానమా?
మోక్షానందము
ప్రధానమా?
‘జీవితానందము
క్షుద్రము;
మోక్షానందము
నిత్యము,
భద్రము!’
ఈ
విషయములో
అనేక
మంది
వ్యాఖ్యానీకులు
వారి
వారి
బుద్ధి
కుశలతను
పట్టి
వ్రాతలు
వ్రాసిరి.
అందులో
అధిక
సంఖ్య
ఫలాపేక్ష,
అనగా,
“ఫలమును
కోరుటకు
మానవునకు
అధికారము
లేదు”
అని
తెలుపుచుందురు.
2
▾
Meaning
Keep
ఇది
వ్యాఖ్యానీకులు
పడిన
పెద్ద
పొరపాటు.
భగవంతుడు
గీతలో
“మా
ఫలేషు”
అన్నాడు.
అనగా,
‘ఫలము
వద్దు’
అని
దాని
అర్థము.
“మా”
అనగా
‘వద్దు’,
అంటే
“ఫలమేమో
ఉన్నది;
కానీ
‘నాకు
వద్దు,’
అని
దానిని
వదులుట,”
దీని
భావము.
వ్యాఖ్యానీకులు
వ్రాసినట్లు
“అధికారము
లేదు”
అని
యుండిన
కృష్ణపరమాత్మ
“న
ఫలేషు”
అని
ఉండవలెను
కదా?
“న”
అనగా
లేదు
అని.
“మా
ఫలేషు”కు
“న
ఫలేషు”
అనుటలో
భగవత్
వాక్యమును
కూడనూ
మార్చినవారగుదురు.
అట్టిది
మహాపరాధము.
3
▾
Meaning
Keep
కర్మచేయుటకు
అధికారమున్నప్పుడు
కర్మఫలమునకు
కూడనూ
మానవునకధికారమున్నది.
లేదని
చెప్పుటకు
సాధ్యము
కాదు,
వీలులేదు.
కానీ,
“ఇష్టముతో
కర్మఫలమును
వదలవలె”ననియే
దీని
అర్థము.
అందుకనే
గీత
ఒక
మార్గము
తెలిపినది:
పని
చేయి;
ఫలము
వదలు.
ఫలాపేక్ష
రజోగుణము.
ఫలము
లేదని,
పనే
మానిన
తమోగుణము.
కాన
పనిచేసి
ఫలమును
వదలిన
అది
సత్వగుణమగునని
దివ్యమార్గమును
చూపుచున్నది.
4
▾
Meaning
Keep
అంతటితో
వదలక
“కర్మయోగికి
సంఘబుద్ధి
కంటే,
సమబుద్ధి
ప్రధానము”ని
కూడనూ
అన్నాడు.
సంఘబుద్ధి
వద్దన్నాడు;
ఎందుకన,
బంధనమునకు
మూలకారణము
సంఘమే.
“ఈ
కర్మ
నాది,
ఈ
చేసే
కర్మఫలము
నాది.
ఈ
కర్మకు
కర్త
నేనే”
అను
సంఘము
బంధమునకు
గురి
అగును.
5
▾
Meaning
Keep
సంఘబుద్ధికి
అతీతుడయిన
మంచిదన్నాడు,
కృష్ణ
పరమాత్మ.
“సమత్వమే
యోగ”మన్నాడు.
అందుకనే
కృష్ణపరమాత్మ
“సమత్వం
యోగ
ఉచ్యతే”
అని
అన్నాడు.
6
▾
Meaning
Keep
ఈ
రెండవ
అధ్యాయములో,
స్థూలంగా
ముఖ్యమయిన
ఘట్టములు
నాలుగు
తెలిపెను.
మొదటిది
“శరణాగతి
తత్త్వం,”
రెండవది
“సాంఖ్య
జ్ఞానం,”
మూడవది
“యోగబుద్ధి,”
నాలుగవది
“స్థితప్రజ్ఞుని
లక్షణము.”
ఇపుడు
తెలిపిన
పై
నాలుగింటిలో,
మూడునూ
పూర్తి
అయినవి.
ఇక
స్థితప్రజ్ఞుని
లక్షణములు.
వాని
విషయము
కృష్ణ
పరమాత్మ
అర్జునునకు
బోధించును.
అర్జునుడు
తెలుపుమని
ప్రార్థించుచు
“కేశవా!”
అని
పలికినాడు.
కృష్ణుడు
ఈ
పలుకునకు
పక్కున
నవ్వినాడు.
ఎందుకనగా
కొంతవరకు
నన్ను
తెలిసికొన్నాడని!
ఏమి
తెలిసికొన్నాడన్న,
“కేశవా!”
అనగా
త్రిమూర్తి
స్వరూపుడని
అర్థము!
ఇంతటి
స్థితికి
అర్జునుడు
వచ్చినాడంటే
దీనికి
కృష్ణుని
అనుగ్రహమే
కారణము.
స్థితప్రజ్ఞుని
లక్షణములను
తెలుపుమని
కేశవుని
ప్రార్థించగా
“పార్థా!
మనోగతాలైన
సర్వవాంఛలను
సంపూర్ణముగా
ఎవడు
వదలి
ఆత్మయందు,
ఆత్మలో
సంతోషించువాడై
యున్నాడో
అట్టివాడే
‘స్థితప్రజ్ఞుడు’
అని
చెప్పవచ్చును.”
7
▾
Meaning
Keep
“ఇందులో
రెండు
పద్ధతులున్నవి.
ఒకటి
విధ్వంసక
పద్ధతి.
రెండవది
విధాయక
పద్ధతి.
మనసునందుకల
సర్వ
ఆశలూ
వదులుట
విధ్వంసకము;
అంతఃకరణములో
సంతోషముగా
ఉండుట
విధాయకము!
హృదయ
భూమిలో
మొలచిన
మలినపు
మొక్కలను
పెరికి
వేయుట,
హృదయమును
నిర్మలము
చేయుట
–
విధ్వంసకము!
నిర్మలమైన
హృదయ
భూమిలో
భగవత్
రతిని
నాటుట
–
విధాయకము!
కావలసిన
పంటను
పెంచుకొనుట
విధాయకము!
అవసరములేని
మలినపు
మొక్కలను
పెరికివేయుట
విధ్వంసకము!
ఇందులో
విషయ
వాసనలు
అవసరములేని
మొక్కలు;
భగవత్
రతి
అవసరమయిన
మొక్క
అని
భావించవలెను.
కోర్కెల
యొక్క
మూటే
మనసు.
ఎప్పుడు
కోర్కెలు
పోవునో
అప్పుడు
మనసు
ఉండదు
కదా?
ఎటులనిన
ఒక
వస్త్రమున్నది.
అందులో
దారములు
అటు
ఇటు
చేరుటచే,
అది
వస్త్ర
రూపమును
ధరించినది.
వస్త్రమందుండెడి
దారములను
విడివిడిగా
తీసివేసిన
వస్త్రమెక్కడున్నది?
అటులనే,
కోర్కెలు
అను
దారములు
అటూ
ఇటూ
చేరుట
వలన
మనసు
అను
రూపము
ధరించినది.
కోరికలే
పోయిన
మనసుకు
రూపమే
లేదు.
ఎప్పుడు
మనసే
లేకుండునో
అప్పుడే
స్థితప్రజ్ఞుడు.”
8
▾
Meaning
Keep
కాన,
కామమును
మొదలు
సాధించవలెను.
దీనిని
సాధించుటకు
పెద్ద
యుద్ధమక్కరలేదు.
తీయని
పలుకులక్కరలేదు.
వాటితో
అది
పోయేది
కాదు.
కామనలు
దృశ్య
వస్తువులు.
నేను
వాటికి
సాక్షిని
అని
అంటూ
వాటితో
తాదాత్మ్యం
చెందకుండా
ఉండుటే,
దీనిని
సాధించు
ఉపాయము.
కేవలము
నీవు
సాక్షిగానే
ఉండవలెను.
కానీ,
వాటితో
చేర
రాదు.
అనగా
“మనస్సును
చూచువాడవు
కమ్ము
కానీ,
మనస్సువు
కావద్ద”ని,
దీని
అర్థము.
9
▾
Meaning
Keep
మానసిక
శక్తి
ఒక
మహాతీవ్రమైన
కరెంటు
వంటిది.
దానిని
దూరము
నుండి
చూచుచుండవలెను
కానీ,
తాకరాదు.
తాకిన
తక్షణమే
భస్మము.
అటులనే
మనస్సును
అంటకట్టుకున్న
వారికి
మహానరకము.
దానికెంత
దూరమున్న
అంతహాయి.
దానిని
యేరీతిగా
మనము
వినియోగించుకొనవలెనో
అట్లు
నేర్పుతో
పొందవలసివచ్చును.
10
▾
Meaning
Keep
స్థితప్రజ్ఞుని
ఆత్మానందమునకు
బాహ్యవస్తువులు
వినియోగించవు.
వాటి
సహాయమక్కరలేదు.
ఆనందము
ఎవరికి
వారిలోనే
సహజముగానే
యున్నది.
శుద్ధ
అంతఃకరణముతో
ఆత్మయందు
సంతుష్టపడును.
ఇవి
స్వసంవేద్య
లక్షణం.
ఇవి
యితరులకెవ్వరికీ
బాహ్యరీతిగా
కనిపించునవి
కావు.
తనకు
తాను
తెలిసికోతగినదే
కానీ,
వేరు
రీతిగా
సాధ్యము
కాదు.
ఇది
అర్జునునకు
అర్థముకాకపోవుటచే
తిరిగి
సులభశైలిలో
యాభై
ఆరు,
యాభై
ఏడు,
యాభై
ఎనిమిది
శ్లోకాలలో
ఉపదేశించిన
సారాంశమును
తెలిపెను.
11
▾
Meaning
Keep
సుఖములు
కానీ,
దుఃఖములు
కానీ
మూడు
విధములు.
ఒకటి
ఆధ్యాత్మికము,
రెండవది
ఆధిభౌతికము,
మూడవది
ఆధిదైవికము.
సుఖఃదుఃఖములు
పుణ్యపాపముల
సంబంధములు.
పాపములను
చేయవద్దని
చెప్పుటకే
దుఃఖములు
వచ్చుచున్నవనియు,
పుణ్యములు
చెయ్యమని
చెప్పుటకే
సుఖములు
వచ్చుచున్నవనియు
తలంచవలెను.
కానీ
స్థితప్రజ్ఞుని,
ఏ
దుఃఖమూ
బాధించదు,
ఏ
సుఖమూ
ఆకర్షించదు.
కష్టములకు
కలతపడదు;
సుఖములకు
లొట్టలు
కొట్టదు.
ఆత్మ
విషయము
తెలియని
వారే
ఈ
రెంటికీ
పొంగి
కృంగేది.
12
▾
Meaning
Keep
స్థితప్రజ్ఞుడు
మననశీలుడు.
అనగా,
“ముని”
అని
అందురు.
స్థితబుద్ధి
కలవాడే
స్థితప్రజ్ఞుడు.
ఇంద్రియ
నిగ్రహం
సాధకునకు
అగత్యం.
అయితే
అదే
సర్వస్వము
కాదు
అని
తెలిసికొనవలెను.
విషయాసక్తి
మనస్సును
శోషించి
యున్నంతవరకూ
ఇంద్రియ
నిగ్రహము
పూర్ణత్వము
పొందదు.
అందుకనే
అర్జునునకు,
“బావా!
ఇంద్రియములను
నిగ్రహించుము.
అపుడు
నీవు
కోరలు
పెరికిన
పాము
వలే
భయము
లేక
ఉందువు.”
విషయ
చింతన
ప్రారంభమైనదన్న
తన
వికృత
స్వరూపాన్ని
చూడవలసివచ్చును;
అనుభవించవలసివచ్చును.
‘గణితానికి
అంతులేదు;
కామానికి
పూర్తిలేదు’
అన్నట్లు
బాహ్యేంద్రియ
నిగ్రహముతో
పాటు
మనో
నిగ్రహము
కూడా
ఉండిననే
స్థితప్రజ్ఞుడు.
అట్లు
లేకున్న
దానికి
విరుద్ధమైన
‘గతప్రజ్ఞుడు’
కాగలడు.
గతప్రజ్ఞ
స్థానము
అధోగతి,
స్థితప్రజ్ఞ
స్థానము
ఊర్ధ్వగతి.
మనస్సును
నిగ్రహించిన
చాలును.
బాహ్యేంద్రియములను
నిగ్రహించకపోయిననూ
అంత
ప్రమాదము
సంభవించదు.
మనసున
విషయాసక్తి
నశించిన,
రాగద్వేషములు
నిరాశ్రయమై
దిక్కుతోచక
తమకు
తామే
లొంగిపోవును.
రాగద్వేషములు
నశించిన
తర్వాత
ఇంద్రియములు
విషయాలతో
ప్రవర్తించిననూ
బంధానికి
అవకాశముండదు.
ఆత్మప్రసాదలబ్ధునకు
సంసారిక
దుఃఖము
లెక్కడివి?
సూర్యుడుదయించినంతనే
నక్షత్రములగుపించనటుల,
జ్ఞాన
ప్రసాద
లాభముతో
దుఃఖ
అశాంతులు,
అజ్ఞాన
స్వరూపాలు
పలాయనమగును.
13
▾
Meaning
Keep
మానవునకు
మూడు
ముఖ్యమైన
ఉపకరణాలు
కలవు.
మనస్సు,
బుద్ధి,
ఇంద్రియములు.
ఇవి
ఒకదానితో
ఒకటి
సమ్మేళన
కలిగినపుడే,
వరించినపుడే,
వాటి
తత్త్వములయిన
సంసారప్రాప్తి,
ఆత్మప్రాప్తి
చేకూరుచున్నది.
అయితే
‘యేది
దేనితో
చేరిన
ఏమి
జనించుచున్నదో’
అని
శంక
అర్జునునకు
రావచ్చునని
పరమాత్మ
గ్రహించి
“పార్థా!
మనసు
ఇంద్రియములతో
చేరుటచే
‘సంసార
ప్రాప్తియు,’
మనసు
బుద్ధికి
వశమయితే
‘ఆత్మ
ప్రాప్తియు’
కలుగుచున్నవి.
బుద్ధికి
నిశ్చయపరచు
శక్తియు,
మనసుకు
బుద్ధి
చేసిన
నిశ్చయాన్ని
అమలు
జరుపు
పెత్తనము
మాత్రమే
సక్రమ
పరిపాలన”
అని
చక్కగ
విశదీకరించెను.
14
▾
Meaning
Keep
“ఇంద్రియములను
సర్వతోముఖంగా
నిగ్రహించుట
స్థితప్రజ్ఞ
లక్షణము.”
అన్ని
భూతములకూ
ఏది
రాత్రియో
స్థితప్రజ్ఞుడు
అందులో
మేల్కొనియుండును.
అన్ని
భూతములు
మేల్కొనియున్న
కాలములో
స్థితప్రజ్ఞుడు
నిద్రించుచుండును.
(అనగా
పగలు
రాత్రిగను,
రాత్రి
పగలుగనూ)
దీనికి
సామాన్యముగా
లోకమున
అక్షరార్థమును
తీసుకొనుచున్నారు.
అది
స్థితప్రజ్ఞుని
లక్షణమనకు
సరితూగదు.
అంటే,
సామాన్య
మానవులు
రాత్రి
నిద్రించు
సమయమున
స్థితప్రజ్ఞుడు
మేలుకొనుననియు,
సామాన్య
మానవులు
మేలుకొనిన
పగలు
స్థితప్రజ్ఞునికి
రాత్రి
అనియు
తలంతురు.
దీనికి
గూఢార్థము
అతి
సున్నితము.
లౌకిక
విషయములందు
సామాన్య
మానవులు
జాగ్రత
వహించుయుందురు.
అనగా
విషయేంద్రియములందు
విజృంభించి
యుండుటే
మేలుకొనుట.
కాని,
స్థితప్రజ్ఞుడు
ఇట్టి
విషయేంద్రియములందు
విముఖుడై
యుండును.
అనగా
నిద్రించును.
విషయేంద్రియములను
అరికట్టుటే
నిద్రించుట.
విషయములను
రేకెత్తించుటే
మేలుకొనుట.
సామాన్య
మానవులు
ఇంద్రియములను
విజృంభింపచేయునపుడు
స్థితప్రజ్ఞుని
ఇంద్రియములు
నిద్రించును.
దీనినే,
మరొక
రీతిగా
కూడనూ
చెప్పవచ్చును.
ఆత్మస్థితిని
మరచుట,
దేహస్థితిని
పొందుట.
ఇవి
సామాన్య
మానవుల
స్థితులు.
సామాన్య
మానవులు
ఆత్మస్థితి
యందు
మరచి
నిద్రించుచూ
దేహస్థితిలో
మేల్కొనుచుందురు.
స్థితప్రజ్ఞుండు
అట్లుకాక
ఆత్మస్థితిలో
మేల్కొని
దేహస్థితిలో
నిద్రించును.
ఇదే
“స్థితప్రజ్ఞ
స్థితి”.
సామాన్య
మానవులు
అజాగ్రత్తలో
ఉన్న
ఆత్మస్థితిలో
స్థితప్రజ్ఞుడు
జాగ్రతతోనూ,
సామాన్యులు
జాగ్రతలో
ఉన్న
విషయవాసనలలో
స్థితప్రజ్ఞుడు
అజాగ్రత్తతోను
మెలగును.
ఇదియే
సూక్ష్మార్థము.
కానీ,
అందరూ
మేలుకొన్న
సమయమున
స్థితప్రజ్ఞుడు
నిద్రించుననియు
అందరూ
నిద్రించు
సమయమున
స్థితప్రజ్ఞుడు
మేలుకొనుననియు
అక్షరార్థమునే
తెలిపిన
దొంగలు,
ఘూర్కాలు,
పహారావారు
ఇట్టివారందరూ
రాత్రులందు
మేల్కొని
పగలు
నిద్రింతురు
కదా?
వీరందరూ
స్థితప్రజ్ఞులు
కావలసినదేనా?
15
▾
Meaning
Keep
సర్వ
కామములనూ
వదలి
యెవ్వడు
నిస్పృహుడై
అహంకార
మమకార
రహితుడై
సంచరించునో
వాడే
శాంతిని
పొందును.
స్థితప్రజ్ఞ
లక్షణమును
కామనాత్యాగ
ప్రసంగముతో
కృష్ణుడు
ముగిస్తాడు.
ఈ
సాంఖ్యయోగము
అద్వితీయమైనది.
గీతా
సారమంతా
ఇందులోనే
ఇమిడ్చబడినది.
16
▾
Meaning
Keep
జీవిత
కురుక్షేత్ర
సంగ్రామ
రంగమున
అతిదీనుడై
విభ్రాంతుడై
దిక్కూ
తెన్నూ
తోచక
నిర్వేదించే
మానవునకు
మాధవుడు
సాంఖ్య
యోగోపదేశము
ప్రసాదించెను.
తక్కిన
అధ్యాయములు
వ్యాఖ్యానములుగా
ఈ
రెండవ
అధ్యాయమైన
సాంఖ్యయోగమునందే
అమరి
యున్నవి.
ఇందులో
సందియము
లేదు.
“అర్జునా!
మనస్సును
వదలి
నీలో
నీవు
తన్మయుడవై
యుండుటకు
సిద్ధము
కమ్ము.
తాబేలు
వలె
ఎవడు
శబ్దాది
విషయముల
నుండి
తన
ఇంద్రియములను
అన్ని
విధముల
నిగ్రహింపగల్గునో,
వాడే
స్థితప్రజ్ఞుడు”అని
శ్రీకృష్ణ
పరమాత్మ
ఈ
రెండవ
అధ్యాయమున
పదకొండవ
శ్లోకము
నుండి
ముప్పదవ
శ్లోకము
వరకు
ఆత్మతత్త్వమును
విపులముగా
పండు
ఒలిచి
అందించినటుల
అర్జునునకు
అందించెను.
అటు
తరువాత
ముప్పది
తొమ్మదవ
శ్లోకము
మొదలు,
ఏబది
ఐదవ
శ్లోకము
వరకూ
సమత్వబుద్ధి
రూపమగు
కర్మయోగము
నాశ్రయించి
పరమేశ్వరుని
పొందునట్టి
ధర్మ
కర్మ
భావములనందించెను.
ఈ
ఘట్టమున
కర్మయోగ
మహిమ
యెక్కువగా
చెప్పబడెను.
Previous
←
Niṣkāma Karma – Buddhi Yoga
Next
Whoever One May Be, One Cannot Escape Doing Karma
→