Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · Whoever One May Be, One Cannot Escape Doing Karma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
రెండవ
అధ్యాయము,
ఏబది
ఆరవ
శ్లోకము
మొదలు
డెబ్బది
రెండవ
శ్లోకము
వరకు
స్థితప్రజ్ఞుని
లక్షణములు,
దాని
మహిమను
విశదీకరించెను.
తరువాత
భగవంతుడు
“సాంఖ్యులకు
జ్ఞానయోగము,
యోగులకు
కర్మయోగము,
ముక్తి
మార్గమునకు
నేనే
ప్రపంచమున
ఏర్పరిచితిని.
కాన
క్షణమాత్రమైననూ
కర్మ
చేయక
ఎవ్వడునూ
ఉండలేడు.
ప్రతివాడునూ
ప్రకృతికి
లొంగక,
కర్మ
చేయక
తప్పదు.
కాన
కర్తవ్యకర్మ
చేయుము.
కర్మచేయకుండుట
కంటే
కర్మచేయుటే
మంచిది.”
2
▾
Meaning
Keep
“కర్మచేయకుండిన
జీవయాత్ర
దుర్లభము,
నడువలేదు.
అందులోనా
బంధనలు
కలిగించని
కర్మలు
యజ్ఞరూపమగు
కర్మలు.
ఇక
మిగిలిన
సర్వకర్మలూ
బంధకారణములే.
కనుక,
కౌంతేయా!
ఆసక్తి
వదలి
యజ్ఞార్థముగ
కర్మలు
చేయుము.”
అని
ఈ
కర్మ
జన్మస్థానమును
తీసుకొని
చక్కగా
అర్జునుని
హృదయము
అదరునట్లు,
కదలునట్లు
బోధించెను.
పరమాత్మ
నుండి
వేదములు,
వేదముల
నుండి
కర్మలు,
కర్మల
నుండి
యజ్ఞములు,
యజ్ఞముల
నుండి
వర్షములు,
వర్షముల
నుండి
అన్నము,
అన్నము
నుండి
భూతప్రాణులు
కలుగుచున్నవని
తెలిపెను.
3
▾
Meaning
Keep
“ఈ
రీతిగా
తిరుగుచున్న
జగచ్చక్రమును
అనుసరించియే
తీరవలెను
సుమా!
ఒకటి
చక్కగా
విను,
బావా!
ముల్లోకములందునూ
నేను
విధిగా
చేయవలసిన
పని
యెద్దియూ
లేదు.
పొందినది
కానీ,
పొందవలసినది
కానీ
యేదియూ
లేదు.
అయినా
నేనే
సదా
కర్మలయందు
మెలగుచున్నాను.
దీనిని
నీవు
యోచించు!
నేను
ఏ
కర్మలు
చేయక
వదలిన
లోకము
పూర్తిగా
నశించును.
అంతియేకాక
లోకదుర్గతికి
నేనే
కారణమగుదును.
ఆత్మ
నిష్ఠమగు
బుద్ధితో
సమస్త
కర్మములను
నా
యందు
సమర్పించి
యే
ఆశయమూ,
ఏ
మమకారమూ
లేనివాడవై
ఈ
ఆరాటము
మాని
నీవు
యుద్ధము
చేయుము,”
అని
ఆజ్ఞాపించెను.
4
▾
Meaning
Keep
“భగవత్
సృష్టి
చక్రము
సక్రమముగా
నడువవలెనన్న
ప్రతివాడునూ
కర్మ
చేసియే
తీరవలెను.
ఎట్టి
వానికైననూ
ఇది
తప్పినది
కాదు.
పరమజ్ఞాని
సహితము
కర్మ
చేయక
ఉండుటకు
వీలులేదు.
తిండి
తీర్థములు
తీసుకొనటము,
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
సహితము
కర్మలు
కావా?
అట్టివి
చేయక
ఎట్టి
వాడైననూ
ఉండగలడా?
ప్రపంచము
చేతనైనను
లేక
సమాజము
చేతనైననూ,
ఏమైననూ
సరే
మనము
ఏదో
ఒక
విధమైన
ఉపకారము
పొందుచునే
యున్నాము
కదా?”
5
▾
Meaning
Keep
“అంత
యెందుకు
బావా!
బ్రహ్మాండమైన
ఈ
విశ్వమంతయూ
ఒక
పెద్ద
కర్మాగారమే.
ఈ
కర్మాగారమున
ప్రతి
మానవుడూ
ఏదో
ఒక
విధమైన
ఉపాంగములవలె
ఉన్న
వారలే.
కనుక
ఏ
ఏ
అంగములకు
తగిన
కర్మ
ఆ
ఉపాంగములైన
మానవుల
పాలికి
వచ్చిన
దానిని
పరమాత్మ
కర్మగా
భావించి
చేయవలెను.
బావా!
ఇంతెందుకు,
ప్రపంచములో
పనిచేయని
వస్తువు
కానీ,
భూతము
కానీ
ఒక్కటయిననూ
కలదా,
చెప్పు?
చెట్టూ,
చేమ,
చీమ,
దోమ,
రాయి,
రప్ప,
గాలి,
వాన,
ఎండ,
చలి
ప్రతి
ఒక్కటియూ
కర్మలు
చేయుచునే
యున్నవి.
సూర్య
చంద్రాదులు
కర్మలు
చేయకుండిన
జరుగదు.
గాలి,
అగ్ని,
కర్మ
చేయకున్న
పని
జరగదు.
భూమి,
ఆకాశము
కర్మలు
చేయకున్న
లోకము
నిలువదు.
వింటివా?”
6
▾
Meaning
Keep
“కనుక
ఈ
కాయముతో
కర్మ
చేయకుండా
ఉండిన
వారు
లోకమునకు
రారు,
లేరు.
వారి
వారికి
తగిన
కర్మలు
వారు
అప్రమత్తతో
నిర్వహించుచు
పోయిననే
ఈ
విశ్వచక్రము
నిరాటంకముగా
నడువగలదు.
బావా!
జ్ఞానులు
కర్మ
యెందుకు
చేయవలెనని,
నీవూ
శంకించ
వచ్చును;
నీకే
కాదు,
లోకమున
మానవులందరికీ
కలుగవచ్చును.
ఉత్తమ
స్థానమునగల
పురుషుల
ఆచరణలే
సర్వసామాన్యులకు
ఆదర్శము.
పెద్దవారల,
అనుభవజ్ఞులైన
వారల
కర్మలే
ధర్మములు.
అట్టివారల
బాధ్యతలు
కూడా
అత్యుత్తమమైనవిగా
యుండును.
“మేము
చేయనక్కరలేదు;
మేము
అన్నియూ
అనుభవించినవారమే.
ఆ
కర్మలకూ
మాకూ
సంబంధములేదు.
వాటితో
పనేమి?”
అని
పెద్దలు,
జ్ఞానులు
అయినవారు
ఊరకుండిన
సామాన్య
మానవులైన
అజ్ఞానుల
గతి
యేమైపోవును?
అప్పుడు
తప్పక
ధర్మగ్లాని
సంభవించును.”
7
▾
Meaning
Keep
“అందుకనే
ధర్మసంరక్షణ
నిమిత్తము,
ధర్మమును
పెద్దలయినవారు
పోషించి
అట్టి
ధర్మకర్మలను
ఆచరణలో
పెట్టుటకు,
వారు
ముందాచరించి
ఇతరులకు
అందించవలెను.
తామే
యెంతయో
చేసి,
చేయించి,
చూసి,
చూపించిన
గాని
అజ్ఞానులు
కొంత
మాత్రమైననూ
నేర్చుకొని
ఆచరణకు
అడుగిడ
గలరు.”
8
▾
Meaning
Keep
“అర్జునా!
ఒక్క
విషయమును
నీవు
చక్కగా
యోచించు.
ఇప్పుడు
నీ
దేహమున
ఉష్ణమెంత
ఉండును?
98.4
డిగ్రీలున్నది.
ఏ
కారణముచే
నీ
దేహమున
ఇంత
ఉష్ణము
గలదు?
దీనికి
కోట్ల
అధికమైన
ఉష్ణమును
సూర్యుడు
అనుభవించుకొని
యుండుట
వలన
గదా?
9
▾
Meaning
Keep
అట్లుకాక
ఇంత
వేడి
నేను
ఎందుకు
భరించుకొనవలెనని
సూర్యుడూరకుండిన
ఇక
లోకమున
మానవుల
గతి
ఏమైయుండెడిదో!
అటులనే
ఈ
బ్రహ్మాండమైన
విశ్వకర్మను
నేను
చేయనవసరం
లేదని
నేనూరకుండిన
ఇక
ఈ
విశ్వము
ఏమైయుండెడిదో!
అందువలన
నేనే
నా
కర్తవ్యమని
కర్మ
నాచరించుట
ఏ
ఆదాయము
కొరకు?
నాకు
వచ్చు
సుఖమేమి?
ఫలమేమి?
యోచించుకో.
బావా!
ఈ
లోకమున
కర్మాధికారులే
అధికముగానున్నారు.
వారి
వారి
యోగ్యతను
కాని,
ధర్మ
కర్మ
మర్మములను
కానీ
వారు
తెలిసికొనలేని
అజ్ఞాన
స్థితిలో
ఉన్నారు.
అట్టి
వారు
ప్రముఖ
వ్యక్తుల
ఆచరణలననుసరించి
తరించవలెను.
అందులకై
జ్ఞానియైన
వారు
కూడనూ
తామాచరించి
అజ్ఞానుల
బుద్ధి
భ్రమించ
కుండునటుల
వారికినీ
మార్గదర్శకులు
కావలెను.
కనుక
ఎట్టివారయిననూ
కర్మను
తు.చ.
చేయక
తప్పదు.
నాకు
భూమితో
అవసరములేదు
కదా
అని
విమానము
ఆకాశమననే
యుండునా?
దానిలో
ఎక్కు
ప్రయాణీకులు
పైకెగురలేరు
కదా?
అందువల్ల
వారల
కొరకై
అది
ఆయా
స్టేషనులలో
దిగి
వారినెక్కించుకొని
పైకి
ఎగిరిపోవునట్లు,
కర్మలతో
జ్ఞానులకు
అవసరము
లేకపోయిననూ
అర్హత
కలిగినవారలకు
మార్గదర్శకులుగా
వారిని
గొంపోవుటకు
తాను
కూడనూ
నడుముకట్టి
కర్మాచరణకు
వంగవలెను
సుమా!
అజ్ఞానులను
ఉద్ధరించుటకు
అధర్మ
కర్మలను
దునుమార్చుటకు
జ్ఞానులు,
తమ
తమ
స్థాయి
నుండి
దిగి
వచ్చి
పామరులైన
వారలతో
కలసిమెలసి
కర్మలు
ఆచరించవలెను.
జనకాదులంతటి
వారు
కూడనూ
ధర్మకర్మలు
చేయలేదా?
అశ్వపతి
మహాశయుడు
కర్మనాచరించలేదా?”
10
▾
Meaning
Keep
అంతట
అర్జునుడు
అవాంతరమైన
ప్రశ్న
అడుగగా
దానికి
కృష్ణపరమాత్మ
అందుకొని,
“బావా!
సర్వ
పాపములకు
సమస్త
అనర్థములకు
మూలకారణము,
ఆది
బీజము,
కామము.”
దానిని
గురించి
విశదీకరించి
‘దేహాత్మబుద్ధి’
కలవారికి
దీనిని
జయించుట
చాలా
కష్టమనియు,
‘బ్రహ్మాత్మ
బుద్ధి’
కలవానికే
ఇది
సాధ్యము
కాగలదనియు,
ఆ
బ్రహ్మాత్మబుద్ధి
కలుగవలెనన్న
సర్వకర్మలూ
భగవత్
ప్రీత్యర్థముగా
చేయవలెననియు,
ఈ
విశ్వము
విష్ణు
స్వరూపమని
భావించవలెననియూ,
మూడవ
అధ్యాయమున
వివరించెను.
ఈ
అధ్యాయమున
ప్రారంభమైన
కర్మమీమాంస
ఐదవ
అధ్యాయముతో
ముగించెను.
ఈ
అధ్యాయమున
మూడు
ముఖ్యమైన
విషయములను
తెలిపెను.
ఒకటి
ప్రతివారునూ
కర్మలు
ఆచరించవలెననియూ
అట్లు
ఆచరించకుండిన
సృష్టియే
లేదనియు,
రెండవది,
పెద్దవారు
అనుభవజ్ఞులు
అయిన
వారల
కర్మలే
సామాన్యుల
కాదర్శములనియు,
మూడవది,
లోకమున
కర్మాధికారులే
అధికులు
కనుక
వారికి
ఆదర్శకులుగా,
జ్ఞానులు
కూడనూ
కర్మల
నాచరించవలెననియూ,
ఈ
మూడింటిని
అర్జునునకు
అతి
ప్రీతితో
త్రాపించెను.
అంతటితో
మానక
కృష్ణపరమాత్మ
సకల
కర్మలకూ
పరమావధి
జ్ఞానమనియు,
అంతఃకరణ
మాలిన్యమును
పోగొట్టుకొనుటకు,
ఈశ్వరానుగ్రహమునకు
కూడా
చరమ
దశ
జ్ఞానమేయని,
జ్ఞానము
ఆనంద
సాధనమే
కాక
అనంత
ధామము
కూడా
అని
స్పష్టము
చేసి
జ్ఞానమార్గము
ప్రారంభించెను.
11
▾
Meaning
Keep
భగవద్గీతా
శాస్త్రము
నందు
అమూల్యమైన
రత్నము
‘జ్ఞానయోగము’గా
మెరయుచున్నది.
“న
హి
జ్ఞానేన
సదృశం
పవిత్రమిహ
విద్యతే”
అన్నారు.
అంతేగాక
ఏడవ
అధ్యాయములో
కూడనూ
“జ్ఞానీ
త్వాత్మైవ
మే
మతమ్”
అన్నారు.
ఈ
విధముగనే
అనేక
చోట్ల
జ్ఞానయోగ
ప్రాశస్త్యాన్ని
వెలిబుచ్చినారు.
అందువల్లనే
జ్ఞానయోగమును
ఆధ్యాత్మిక
సాధనకు
గమ్యస్థానంగా
భావించవలెను.
సర్వశాస్త్రములు
జ్ఞానముతో
అంత్యము
చేయుచున్నవి.
జ్ఞానస్వరూపానుసంధానంలో
మిగులునది
తానే.
అంతా
తనలోను,
తనలో
అంతనూ
ఉండును.
తత్త్వ
విమర్శ
చేసి
తెలిసికొనుటయే
జ్ఞానము.
కర్మలు
చేయుట
కానీ
వదులుట
కానీ
ముఖ్యము
కాదు.
దేహము,
మనస్సు,
బుద్ధి,
చిత్తము
ఇత్యాది
ఇంద్రియ
వ్యాపారమేదియూ
‘ఆత్మ’కు
చేరినది
కాదు.
12
▾
Meaning
Keep
అది
ఊరకున్నప్పటికీ
ఆ
కర్మ
కూడనూ
ఆత్మకు
చెందినది
కాదు.
ఈ
రీతిగా
తెలిసికొనుటకే
జ్ఞానమని
పేరు.
ప్రతికర్మ
కూడనూ
జ్ఞానపూర్వకంగా
చేయవలెను.
జ్ఞానము
అందుకనే
ప్రవృత్తి
నివృత్తి
మార్గములను
బోధించుచూ
ఆస్తికతను
అభివృద్ధిపరచుచూ,
మానవుని
ముక్తి
సామ్రాజ్యమునకు
‘నిష్కామకర్మ’
మార్గమున
కొనిపోవుచున్నది.
కాన,
మోక్ష
ప్రాప్తికి
జ్ఞానము
తిన్నని
తెన్ను.
అందుకనే
జ్ఞానమువంటి
పవిత్రము
వేరులేదు.
అజ్ఞానముకంటే
అపవిత్రము
కానరాదు.
వ్యష్టిలో
సమిష్టిని,
సమిష్టిలో
వ్యష్టిని
చూడు;
అదే
జ్ఞానము.
అన్ని
క్షేత్రములకూ
క్షేత్రజ్ఞుడు
ఒక్కడే.
అట్టి
క్షేత్రజ్ఞుడైన
ఆత్మయే
తానని
తెలుసుకొనుటే
జ్ఞానము.
ఆత్మయే
పరమాత్మయని
తెలిసికొనుట
విజ్ఞానము.
ఈ
యోగమును
సర్వజ్ఞుడగు
కృష్ణుడు
అర్జునునకు
సంశయమును
నివారింపదలచి
ఉపదేశింప
మొదలిడెను.
13
▾
Meaning
Keep
“బావా!
ఈ
పవిత్ర
జ్ఞాన
యోగమును
పూర్వము
నేను
సూర్యునకు
ఉపదేశించితిని.
అది
పరంపరగా
మనువునకు,
ఇక్ష్వాకునకు,
ప్రాప్తించి
వారి
ద్వారా
రాజర్షులు
తెలిసికొనిరి.
అంతటితో
అది
లోకమున
నశించెను.
అట్లు
నశించిన
అవ్యయమైన
ఈ
యోగమును
తిరిగి
లోకమునకు
అందించుటలో
నేనే
తిరిగి
కంకణము
కట్టవలసివచ్చినది”
అని
అన్నాడు
కృష్ణుడు.
14
▾
Meaning
Keep
ఇచట
‘నశించినది’
అని
తెలిపి,
తదుపరి
ఈ
యోగము
‘అవ్యయమైనది’
అని
అనుటలో
పరస్పర
విరుద్ధమైన
భావము
కలుగక
తప్పదు.
అందుకు
కారణము
లేకపోలేదు;
అవ్యయమనగా
నాశరహితము.
నాశరహితమైన
ఈ
యోగము
నశించినదని
అనుటలో,
విరుద్ధమైన
అర్థము
కాక
మరేమగును?
ఈ
యోగమున
నాశరహితమైన
రెండు
ఫలములు
ఉండుటచేత
దీనికి
‘అవ్యయ
యోగ’మని
కూడను
పేరు
వచ్చినది.
ఆ
ఫలములేవన,
ఈ
యోగమునకు
ఆధారమైనది,
ఆది
అయినది
‘వేదము’.
ఇది
అవ్యయమైనది!
ఇక
రెండవది
కారణ
ఫలము,
ఈ
యోగమునకు
ఫలము
‘మోక్షము’.
అదియునూ
నాశరహితమైనదే.
ఇందులో
సందియము
లేదు.
ఇట్టి
అవ్యయ
ఫలప్రదమైన
ఈ
యోగము
కాలకర్మ,
కాల
రూపముల
చేత
ఆచార
ప్రచారములు
లేక
అడుగున
పడుటచేత,
అనగా
అదృశ్యమగుటచే
నశించినదని
చెప్పవలసివచ్చినది
కాని,
అది
నశించునట్టిది
కాదు.
అడుగునపడి
అదృశ్యస్థానమున
నున్న
ఈ
యోగమును
తిరిగి
బైటకు
తీయుటనగా
ఆచార
ప్రచారములోకి
అందించుటే
దీని
భావము
కాని,
నశించినదానిని
తిరిగి
సృష్టించెనని
కాదు.
అది
నశించలేదు.
అదృశ్యమునకు
నశించుట
అనియు
దృశ్యమునకు
సృష్టించుట
అనియూ
సామాన్య
భాషలందు
ఉపయోగింతురు.
అంతమాత్రమునకే
ఈ
యోగము
నశించునదని
భావించరాదు.
నశించునట్టిదానిని
పరమాత్ముడు
ఏనాటికీ
బోధించడు.
15
▾
Meaning
Keep
ఇక
సూర్యుని
విషయమందు
కూడనూ
సామాన్యముగా
మనము
కొంత
విచారించవలసిన
విషయము
కలదు.
భారతీయులకు
సూర్యునికి
సన్నిహిత
సంబంధము
కలదు.
అనాది
కాలము
నుండి
సూర్యుని
స్థానము
భారత
వీరులైన
క్షత్రియులకే
కాక
సామాన్య
ప్రజలకు
కూడనూ
ప్రధాన
స్థానమే
కాక,
పవిత్రమగు
పీఠమును
ధరించినది,
వహించినది.
క్షత్రియ
జాతికి
మూలపురుషుడు
సూర్య
భగవానుడు.
భారత
సంస్కృతిలో
ఇట్టి
పవిత్రస్థానము
మరెవ్వరికీ
లేదు.
16
▾
Meaning
Keep
భారతీయులకే
కాక
యావత్ప్రపంచమునకే
సూర్యుడు
ప్రత్యక్ష
భగవానుడు.
ప్రపంచమంతయూ
కాలముచే
నడుచుచున్నది.
కనుక
కాలానికి
కూడనూ
ప్రధాన
ఆధారము
సూర్యుడు.
కాలము
తనవలననే
కలుగుచున్నది.
కనుక
కాలుడు
సూర్యుని
పుత్రుడని
కూడ
వాడుచున్నాము.
ప్రతి
మానవుని
జీవితము
కాలముచే
కట్టుబడినది.
కనుక,
జీవితమునకు
సూర్యుడే
ఆధార,
ఆరాధ్య
దేవుడై
యున్నాడు.
ఎవరికి
అర్పితము
చేసిననూ
చేయకున్ననూ
మానవుని
సర్వకర్మలూ
సూర్యునకు
మాత్రము
అర్పితము
చేయక
తప్పించుకొన
వీలులేదు.
17
▾
Meaning
Keep
మానవుని
జీవిత
ప్రమాణమును
దినదినమునూ
కరిగించి
హరించు
చున్నాడు.
అంతియేకాక
అతని
ద్వారా
ఈ
లోకమునకు
ఎంత
ఉపకారమనునదీ
వేయిమాటలతో
చెప్పనక్కరలేదు.
నిత్యానుభవమే
ప్రత్యక్ష
సాక్షి.
లోకమునందలి
పాడిపంటలకు,
సస్యశ్యామలములకు
మూలకారకుడు
సూర్యుడే.
అతని
కిరణముల
చలువ
సోకకుండిన
పాడిపంటల
యందు
పటుత్వము
ఉండదు.
తన
సూటియైన
కిరణముల
ద్వారా
సముద్ర
జలమును
పైకి
చేది,
అక్కడ
తనచే
సృష్టింపబడిన
మేఘముల
స్వరూపమున
ఇమిడ్చి,
వాటిని
ప్రజల
యొక్క
ధర్మకర్మల
ఫలముల
ననుసరించి
ఆయాస్థానములందు
క్రిందికి
వర్ష
రూపమున
అందిచుచున్నాడు.
అతను
నిరంతరము
ధర్మదేవత
స్వరూపమును
ధరించి
తారతమ్యమును
పాటించక
తనకెదురైన
వాటన్నింటినీ
పలుకరించుచూ,
తన
తేజస్సును
వాటితో
చేర్చుచున్నాడు.
18
▾
Meaning
Keep
సూర్యుడు
మహాత్యాగి,
యోగి,
ఒక
నిమిషమయిననూ
తన
సుఖమును
కానీ,
విశ్రాంతిని
కానీ
ఆశించక
కర్తవ్య
కర్మనాచరించు
నిష్కామకర్మ
యోగి,
నిరాడంబరముకల
నిగర్వి.
లోకమునకు
ఎవ్వరూ
చేయనంతటి
ఉపకారమునూ
క్షేమమునూ
తాను
చేయుచూ,
అందిచుచుండిననూ
తాను
ఏమీ
చేయనివానివలె
నటించుచుండును.
ఇన్ని
కార్యములు
నా
వలన
లోకమునకు
జరుగుచున్నవి
కదా!
నేను
లేకుండిన
లోకమేగతి
పట్టియుండునో
అనునది
ఏనాడూ
తాను
గర్వముతో
తలంచదు.
19
▾
Meaning
Keep
ఎంతవేడయిననూ
సహించి
ఓపికతో
ఎంత
పని
అయిననూ
చేసి
లోక
క్షేమమును
అందించుచున్నాడు!
సూర్యుడే
శ్రమ
అని
తలంచినట్లయి
ఉండిన
లోకమేస్థితిలో
ఉండెడిదో,
ఊహలకు
కూడనూ
అందదు.
అసలు
మానవుని
దేహమందు
ఈ
మాత్రపు
వేడి
నిలచియున్నదన్న
దీనికి
కారణము
సూర్యుడంతటి
వేడిని
సహించుకొనుట
వల్లనే
కాని
వేరు
కాదు.
దీనిని
బట్టి
చూడగా
దేహమును
కూడనూ
తానే
కాపాడుచున్నాడు.
తన
శక్తిని
కొంత
దేహమున
ఇమిడ్చును.
ఆ
సూర్య
కాంతే
దేహమున
కొంత
లేకుండిన
అది
ఒక
జడమై
నిస్సారమై
యుండెడి
కదా!
20
▾
Meaning
Keep
సూర్యుడే
విసుగు
విరక్తి
పడిన
లోకమంతా
ఒక
నిమిషములో
మండిపోయివుండెడిది.
కాన
అతనికి
ఏ
విధమైన
విసుగూ
లేక
అతి
ఓపికతో
లోకమును
రక్షించుచున్నాడు.
ఇది
అతను
‘సహజమని’
భావించుచున్నాడు.
కానీ
సర్వుల
కోసమని
భావించుటలేదు.
21
▾
Meaning
Keep
సహజ
కర్మలందే
ఓర్పు
ఉట్టిపడును
కానీ,
అసహజ
కర్మల
యందు
అంత
శాంతము
చేరుటకు
వీలులేదు.
సహజ
కర్మలు
ఎప్పటికీ
ఏ
ఒక్కరికీ
భారమనిపించవు,
ఆశ్చర్యము
కలిగించవు.
అహంకారమున
ఆచరించిన
కర్మలయందే
విసుగు,
విరక్తి,
అశాంతి,
భారమూ
తాండవమాడును.
అందుకు
ఆశ్చర్యము
కూడనూ
తోడగును.
సహజమునకు
అట్టివి
చేరవు.
22
▾
Meaning
Keep
ఒక
విషయమును
చూడుము.
మానవుడు
ఎవడైనా
సుఖముగా
జీవించుచుండిన
ఎవ్వరూ
ఏమయ్యా
సుఖంగా
ఉన్నావని
ప్రశ్నించరు.
అదే
దుఃఖముగానుండిన
ప్రతివాడూ
ఎందుకయ్యా
దుఃఖముగానున్నావని
ప్రశ్నల
వర్షము
కురిపింతురు.
కారణమేమి?
మానవుడు
సుఖస్వభావము
కలవాడు.
అందు
వలన
ఆశ్చర్యము
కలుగదు.
అందులో
దుఃఖము
మానవునకు
అస్వభావము
కనుక
అంత
ఆశ్యర్యము
కలిగించి
అనేక
ప్రశ్నలకు
గురిచేయును.
దుఃఖము
భ్రాంతితో
ఏర్పడినది
కాని
అది
సహజంగా
మనది
కాదు.
అందువలననే
అన్ని
వికారములు
కలుగును.
23
▾
Meaning
Keep
దీనిని
బట్టి
చూడ
“సహజమునకు
విసుగు
కానీ,
భారము
కానీ,
ఆశ్చర్యము
కానీ,
గర్వము
కానీ
విరుద్ధమైన
కల్పిత
వికారముల”ని
సూర్యభగవానుడు
ప్రత్యక్షముగా
మానవులకు
బోధించుచున్నాడు.
24
▾
Meaning
Keep
సూర్య
భగవానుని
కర్మ
కృత్రిమము
కాదు.
కనుకనే
ఏ
ఆర్భాటము
కానీ,
అద్వర్టైజులు
(ప్రచారము)
కానీ
లేక
నిశ్శబ్దముతో
సకాలమునకు
సక్రమ
పద్దతిని
సాగించుచున్నాడు.
తన
వలన
కలిగిన
కాలమును
కూడా
వృథాగావించక,
దానినే
మానవుల
జీవితప్రమాణముగా
నియమించి,
కాలము
వలన
ఆనంద
ఆహారములనే
గాక,
మంచి
చెడ్డలను
కూడా
నిర్ణయించి
జీవులకు
మార్గదర్శకుడై
మెలగుచున్నాడు.
జీవులకు
సద్గతి
మార్గమును
సమకూర్చుచున్నాడు.
ఇట్టి
గుణవంతుడూ,
మహాత్యాగీ,
నిష్కామకర్మ
యోగి
కనుకనే
భగవంతుడు
మునుపు
ఈ
యోగమును
సూర్యునకు
బోధించియుండుట;
లేకున్న
సామాన్యులకు
ఇట్టిది
సాధ్యమా!
ఇప్పుడు
అవ్యయమయిన
ఈ
యోగమును
తిరిగి
ప్రజా
ప్రతినిధిగా
నిలచిన
అర్జునునికి
బోధించుచున్నాడన్న,
అర్జునుడు
సూర్యుడంతటి
గుణశాలి
అయి
ఉండవలెను
గదా?
ఇతని
చరిత్ర
ఎంతటిదయి
యుండనో
పాఠకులు
యోచించవచ్చును.
అంతటి
పవిత్రతే
ఈ
అర్జునుని
యందు
లేకుండిన
కృష్ణపరమాత్మ
ఇంత
ప్రయత్నము
ఎందుకు
సంకల్పించి
యుండును?
అర్హత
లేనిదే
అందరికీ
భగవంతుడు
అందుబాటులో
ఉండడు.
తన
సంకల్పమునకు
తగిన
అర్హత
అర్జునునియందు
ఉన్నదనుటలో
సందియము
లేదు.
Previous
←
The Marks of the Sthitaprajña
Next
Establishing the Practice of Dharma Is the Establishment of Dharma
→