Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Dharma of the (Śrī Kṛṣṇa) Avatāra
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
అవతార
పురుషులకు
జన్మాంతర
పుణ్య
పాప
కర్మలు
లేవు.
సామాన్యమైన
మానవ
దేహములకు
కలిగిన
కారణములు
అవతార
పురుషులకు
లేవు.
పాపాత్ముల
పాపములు,
పుణ్యాత్ముల
పుణ్యములు
రెండునూ
చేరే
లీలా
జన్మకు
కారణమగును.
ఉదాహరణమునకు
ఒకటి
చూడుదు.
నరసింహావతారమునకు
కారణమేమి?
హిరణ్యకశిపుడు
చేసిన
పాపకర్మ,
ప్రహ్లాదుడు
చేసిన
పుణ్య
కర్మలే
కదా?
ఈ
రెండూ
చేరే
కదా
నరసింహుడు
అవతరించుటకు
తోడ్పడినది.
అటులనే,
అవతార
పురుషుల
జన్మలకు
కారణములను
వెతుకనక్కరలేదు.
అవతార
జన్మముల
ద్వారా
ధర్మాత్ములు
సుఖపడుదురు.
పాపాత్ములు
దుఃఖపడుదురు.
తన
జన్మకు,
ప్రత్యేకించిన
పుణ్య
పాప
కర్మలు
కారణములు
కావు.
తన
కాయముతో
తనకు
దుఃఖము
కాని,
సుఖము
కాని
లేదు.
అవతార
జన్మలకు
వెనుక
జన్మ
కారణము
కాదనియూ,
దానికి
పంచ
భూతముల
యొక్క
వికారములు
లేవనియూ,
ఇది
చిన్మయ
స్వరూపమే
కాని
మృణ్మయము
కాదనియు,
అహంకార
మమకారములు
అందులో
లేశ
మాత్రమైనా
నిలువలేవనియు,
అవిద్యావరణము
అవతారములందు
కానరాదనియు,
సామాన్య
మానవులవలె
లోకులు
తలంచిన
అది
కేవలము
అజ్ఞాన
దోషమనియు,
కృష్ణుడు
చెప్పెను.
“దేహధారి
అయిన
నేను
అవతరించి
ఈ
లోకమున
ఆచరించు
కృత్యములు
ఏవో
చెప్పెద
విను”
అన్నాడు.
2
▾
Meaning
Keep
“సాధువులను
రక్షించుట,
దుష్ట
శిక్షణ,
ధర్మోద్ధరణ.
సాధువులనగా
సామాన్య
మానవుల
దృష్టియందుండు
సాధుసన్యాసులు
కారు.
సాధుగుణము
ప్రతి
ప్రాణియందునూ
అనగా
క్రిమి
కీటకములందు
సహితము
కలదు.
సూక్ష్మముగా
చెప్పవలెనన్న
‘సత్వగుణ
పోషణే
సాధు
సంరక్షణ’.
ఇట్టి
పవిత్ర
గుణము
పరమ
పురుషులయందు
ప్రధాన
పాత్ర
వహించియుండును.
కనుక
సాధు
రక్షణ
అనగానే
సామాన్యముగా
సన్యాసుల
రక్షించుటకని
తలంతురు.
సత్వగుణాభివృద్ధికి
ఎవరు
ప్రయత్నింతురో
సదాచార
పరాయణులయి,
సత్మీల
వంతులై,
సత్యవాక్పరిపాలకులై,
సర్వేశ్వర
సాన్నిధ్యాభిమానులై,
సద్ధర్మ
పరాయణులై,
సర్వజన
సమాన
ప్రేమ
కలవారై
ఉందురో
అట్టి
వారందరూ
సాధు
సంతతి
వారు.”
3
▾
Meaning
Keep
“అట్టి
సాధుత్వము
పశువునందునూ,
పక్షియందునూ,
మృగమునందునూ
కలదు.
అందువలననే
రామాయణమందు
జటాయువును
రక్షించెను;
గజరాజును
కాపాడెను;
కోతులను
అనుగ్రహించెను;
ఉడుతను
ప్రేమించెను.
ఇవన్నియూ
సాధుత్వము
కలిగినవే
కదా?
కంఠమాల
ధరించి,
కాషాయము
కప్పి,
దండము
పట్టినంత
మాత్రమున
సాధువు
కాజాలడు.
వేషభాషలకంటే
సుగుణ
స్వభావమే
సాధుత్వమునకు
ముఖ్య
లక్షణము.
సమస్త
జీవులందునూ
సాధుత్వమను
గుణము
కలదు.
కనుక
లోకసంరక్షణే,
ప్రధాన
సాధుపోషణ
అని
తలంచవలెను.”
4
▾
Meaning
Keep
“ఇక,
దుష్ట
శిక్షణ
ఎవరిని?
ఏ
ఏ
జాతి
జీవులకు
నియమించిన
హద్దులను
దాటి
అక్రమ
ప్రవర్తనలలో,
అన్యాయ
అనాచార
ఆటలతో,
అహంకార
ఆవేదనలతో
క్రమమును
తప్పి
సంచరించు
వారిని
శిక్షించుట.
అనగా,
రజో
తమోగుణ
బలిష్టులను,
దయా
ధర్మ
దమములు
లేనివారలను
శిక్షించుట.
ఇక
ధర్మ
రక్షణ.”
ఈ
మూడు
విధములైన
ఆచరణలే
తన
అవతార
లక్షణమని
శ్రీ
కృష్ణపరమాత్మ
తన
అవతార
ధర్మమును
అర్జునునకు
చెప్పెను.
5
▾
Meaning
Keep
ధర్మోద్ధరణలో
మరొక
సూక్ష్మమున్నది.
ఏమన,
తనకు
ప్రాణాపాయ
స్థితి
సంభవించిననూ
తన
కర్తవ్య
ధర్మమును
వీడకుండుటే
“సాధు”
శబ్ధమునకు
మరొక
అర్థము.
అట్టి
సాధు
సత్పురుషులను
హింసించుచు,
త్రికరణముల
శాస్త్ర
విరుద్ధమగు
చర్యలను
ఆచరించుచుండువారే
దుష్టులు.
శాస్త్రవిహితమగు
ధర్మములను
స్వయముగా
తానాచరించుచూ,
ధర్మము
యొక్క
విశిష్టతను,
ప్రభావమును
లోకమునకు
తెలుపుచూ,
ప్రకటించుటయే
కాక
వేద
శాస్త్రములందూ,
దైవమునందూ,
అవతారములందూ,
పరలోకమునందూ,
పరమపురుషులయందూ
శ్రద్ధాభక్తులు
కలిగించునట్లునూ,
వారు
సదాచార
నిష్ఠాసంపన్నులగునట్లును
మార్చుటే
“ధర్మ
సంస్థాపన”మనబడును.
ధర్మ
రక్షణమనబడును.
ధర్మోద్ధరణమనబడును.
నేను
చేయు
సర్వకర్మలూ
ధర్మసంస్థాపనకొరకేనని
భావించి,
స్వార్థ
ఉపయోగమునకు
కాదనియూ,
ఈ
రహస్యమును
తెలిసికొనిన
వారికి
తిరిగి
పుట్టుక
ఉండదనియూ,
వారు
నన్నే
పొందుదురనియూ
కృష్ణపరమాత్మ
తెలిపెను.
6
▾
Meaning
Keep
తనకంటే
భగవంతుడు
అన్యముగా
ఎక్కడో
ఉన్నాడను
భావమే
పరోక్ష
జ్ఞానము.
సర్వవ్యాపి
అయిన
పరమాత్ముడు
నాలోనే
ఆత్మ
స్వరూపమున
ఉన్నాడను
భావమే
అపరోక్ష
జ్ఞానము.
సర్వ
కర్మలూ
భగవత్పరముగా
నొనర్చిన
వారికి
‘చిత్తశుద్ధి’
కలుగునని
తెలిపెను.
భగవంతుని
జన్మకర్మలు
దివ్యములని
తెలిసికొమ్మనెను.
అయితే
మహనీయులు
మాత్రమే
దివ్యకర్మజన్మలను
గుర్తెరుగుచున్నారు.
అందరికీ
సాధ్యమయ్యేది
కాదు.
అట్లని
అంతటితో
ప్రయత్నమును
మానకూడదు.
సాధ్యమైనంత
వరకు
ప్రయత్నలోపము
లేకుండా
రాకుండా
చూచుకొనవలెను.
అందుకనే
ఈ
అధ్యాయములో
పదవ
శ్లోకమున
అధికార
లక్షణములను
నిరూపించెను.
7
▾
Meaning
Keep
“అర్జునా!
రాగ,
ద్వేష,
భయ,
క్రోధముల
నుండి
వేరైనవారునూ,
నా
చింతన,
నామ
రూపమునందే
లీనమైన
వారునూ,
నన్ను
వినా
అన్య
ఆశ్రయమును
ఎరుగనివారునూ,
ఆత్మజ్ఞానముచే
పవిత్రమైనవారునూ,
నా
దివ్య
జన్మ
కర్మలనెరిగి
సత్య
ధర్మ
ప్రేమలతో
నన్నే
వెదుకువారునూ
నన్నే
పొందుదురు.
ఇది
ముమ్మాటికీ
సత్యము.
సంశయము
విడువుము.
అజ్ఞానులైన
మానవులు
నిరంతరమూ
విషయచింతనతో
అంతఃకరణములను
అపవిత్రము
చేసికొనుచున్నారు.
అట్టివారు
కేవలము
శబ్దాది
విషయములను
చింతించెడివారగుదురు;
వారలకు
విషయవాసనలు
సోకినంతనే
వాటిని
పొందవలెనను
అభిలాషలు
కలుగును.
అట్లు
కోరిన
అభిలాషలు
నెరవేరకున్న,
లేక
చేతికి
చిక్కి
జారిపోయిన,
వారు
అశాంతికి
గురియై
భయభ్రాంతులకు
గురియగుదురు.
భయము
మానవుని
సర్వశక్తులను
భక్షించును.
భయస్థునకు
కోపము
మెండు.
కోపము,
భయము
ఈ
రెండే
భగవత్ప్రాప్తికి
భయంకర
ప్రతిబంధకములు.
అంతఃకరణమున
ఈ
మూడూ,
అనగా,
అభిలాష,
క్రోధము,
భయము
పూర్తిగా
తొలగినపుడే
భగవంతునితో
ఎప్పటికినీ
వియోగమును
పొందకుండా
ఉందురు.
బావా!
పై
విషయములను
చక్కగా
యోచించు;
విచారించు.
వివేకివై
నా
మాటలయందు
విశ్వాసముంచు”
అని
భగవానుడు
వచించెను.
8
▾
Meaning
Keep
అందులకు
అర్జునుడందుకొని,
“నందకుమారా!
ఇట్టి
పవిత్ర
ఉత్తమ
స్థితిని
లోకమున
అందిరికీ
ఎందుకు
కలుగజేయకూడదు?
నీవు
ప్రేమ
స్వరూపుడవనీ,
దయామయుడవనీ
నీవే
తెలుపుకొందువే?
అట్టి
నీకు,
ఈ
పక్షపాత
మెందులకు?
పక్షపాతములేదందువా!
జ్ఞానులకే
ఈ
స్థితిని
ఇచ్చి
అజ్ఞానులకు
ఇవ్వకుండుట
పక్షపాతము
గాక
మరేమిటి?
అజ్ఞానులనే
ఆదరించవలసినది.
అన్నింటియందూ
నిలకడలేక,
గడియారపు
పెండ్యులము
వలె
అల్లలలాడు
అజ్ఞానులకే
నీవు
శ్రద్ధగా
ఈ
స్థితిని
అందించవలెను.
అన్నియూ
ఎరిగి
“సర్వం
విష్ణుమయం
జగత్”
అని
తెలిసిన
జ్ఞానులకు
నీవు
మరీ
మరీ
తెలుపనక్కర
లేదు
కదా!
వారికి
దేనితోనూ
నిమిత్తము
లేదు
కదా!”
9
▾
Meaning
Keep
“అర్జునా!
నీ
ప్రశ్నలు
చాలా
అవసరమైనవే!
లోకమున
మానవులు
ఇట్టి
సందేహములతో
తూలిపడుచున్నారు.
వారల
ప్రతినిధివి
కనుక
నీ
సందేహమే
లోక
సందేహము.
నీ
సందేహ
నివృత్తే
నా
సందేశము!
విను,
లోకమున
నన్ను
చేరగోరువారు,
నాలుగు
విధములుగా
ఉన్నారు.
10
▾
Meaning
Keep
నిరంతరము
దేహ
సంబంధమైన
దుఃఖములతో
పీడింపబడువారు
ఒకరు;
అతనిని
‘ఆర్తుడ’ని
అందురు.
ఇక
ధనకనక
వస్తువాహనములతో,
పదవీ
పేరు
ప్రతిష్ఠలతో,
పుత్ర
పౌత్రాభివృద్ధిని
గోరి
పరితపించువారు
రెండవతెగవారు;
వీరిని
‘అర్థార్థి’
అని
అందురు.
తరువాత,
ఆత్మస్వరూపమైన
పరమాత్మను
తెలిసికొనగోరి
అనేక
సద్గ్రంథములతో,
సాధుసంగములతో,
సదాలోచనలతో,
సద్భావములతో
విచారణ
సలుపుచూ
సాన్నిధ్య
ప్రాప్తిని
బడయగోరువారు;
వీరిని
‘జిజ్ఞాసువు’లని
అందురు.
ఇక
నాలుగవ
వారయిన
వాడే
‘జ్ఞాని’.
అతను
నిరంతరము
బ్రహ్మతత్వమున
మునిగియుండును.”
11
▾
Meaning
Keep
“మొదటి
వాడయిన
‘ఆర్తభక్తుడు’
లౌకిక
విషయములందు
దుఃఖము,
అశాంతి,
సంకటము,
బాధలు,
కష్టములు
కలిగినప్పుడు
మాత్రమే
నన్ను
భజించును,
స్మరించును.
నేను
వాని
స్మరణను
విని
వానికి
ఆ
విషయమునందు
మాత్రమే
తృప్తిపరతును.
ఆ
బాధలు
నివారణ
చేతును.
అటులనే
రెండవ
వాడయిన
‘అర్థార్థ
భక్తుడు’
ఆశించిన
వస్తువాహనములు,
పదవీ
ప్రతిష్ఠలు,
కీర్తి
మర్యాదలు,
పుత్రపౌత్రులను
ప్రసాదించి
వానిని
అంతమాత్రముననే
ఆనందింపజేతును;
తరువాత
మూడవవాడైన
‘జిజ్ఞాసువును’
నిష్కామకర్మలు
చేయించుచూ
సరియైన
గురువుని
అనుగ్రహించి,
తాను
జేయు
ఆత్మ
విచారణలకు
తగిన
బుద్ధికుశలతను
ప్రసాదించి
వాని
సాధనలకు
తగిన
శక్తి
సామర్థ్యమును
అనుగ్రహించి,
ఆత్మ
ప్రాప్తి
చేకూర్తును;
అన్య
ఆశలు
అతనియందు
చేరనివ్వక
నిరంతర
మోక్షాపేక్షనే
తన
దీక్షగా
ఉండునట్లు
కటాక్షింతును.
బావా!
కల్ప
వృక్షము
వంటివాడను!
ఎవరు
దేనిని
కోరిన
అది
అందించుటే
నా
కర్తవ్యము.
వ్యక్తుల
భావనానుకూలము
ననుసరించుచూ,
దానికి
తగిన
ఫలమును
ప్రసాదించుచుందును.
ద్వేషము
కాని,
భేదము
గాని,
పక్షపాతముగాని
నాకు
ఏనాడునూ
లేదు;
రాదు.
నిర్దయ
నా
నీడ
కూడా
తాకలేదు;
నాలో
ఎట్టి
వైషమ్యమునూ
ఆరోపించుటకు
వీలులేదు.
ప్రకాశించు
సూర్యుని
కిరణములు
తనకు
ఎదురైన
వాటిపైనంతా
వ్యాపించును.
తనకు
మరుగైనవాటిని
తానెట్లు
ఆక్రమించును?
అటులనే
నేనూ,
ఏ
విధమయిన
అభీష్టములను
కోరుదురో
ఆ
యభీష్టములను
తీర్తును.
కనుక
ఉత్తమ
భావముల
వృద్ధి
చేసుకొన్న
ఉత్తమ
స్థానమును,
అల్ప
భావములు
వృద్ధి
చేసుకున్న
అధమస్థానమును
అందింతును.
దీనికి
భక్తుల
భావదోషములు
తప్ప
భగవంతుని
అనుగ్రహలోప
మేనాడునూ
లేదు.”
12
▾
Meaning
Keep
“బావా!
మానవులు
తమ
ఆత్మ
స్వరూపమైన
నన్ను
ఉపాసించుట
మాని,
నన్ను
చేరకోరుట
విడచి
అనిత్య,
అసత్య
అశాశ్వతమైన
ఫలప్రదానమును
అందించు
అల్పశక్తులను
ఆశ్రయింతురు.
దీనికి
కారణము
చెప్పెదను
వినుము.
‘కర్మోపాసన’
(ప్రాపంచిక
కర్మలలో
ఫలసిద్ధి
కోసం
ఇతర
దేవతలను
పూజించుట)
వలన
ఫలసిద్ధి
త్వరలో
లభించును.
ప్రత్యక్షముగా
అగుపించు
వాటినే
ప్రజలు
ఆశింతురు.
ఇవి
కేవలము
శరీర
యింద్రియములకు
మాత్రము
సంబంధించి
యుండును;
సామాన్య
మానవులు
సత్యమును
తెలిసికొనలేక
క్షణికమైన
ప్రత్యక్షానందమునకు
పాటుపడుదురే
కాని
శాశ్వతమయిన
అపరోక్షానందమునకు
ప్రయత్నింపరు.”
13
▾
Meaning
Keep
“జ్ఞాన
సిద్ధి
కేవలము
అంతఃకరణ
సంబంధము;
అది
ఆలస్యముగా
సిద్ధించును.
అంత
ఓపిక
మానవునియందు
బలపరుచుకొనుట
లేదు.
స్థూల
శరీరానికే
ప్రాధాన్యత
ఇత్తురు.
సామాన్య
మానవులు,
దాని
సంబంధమునే
బలపరచు
కొందురు.
కామనాసక్తులగుట
వలన
వారు
‘జ్ఞానసిద్ధి’ని
ఆశించక
‘కర్మసిద్ధి’ని
ఆశింతురు.
లోకమున
విషయగ్రస్తులు
ఎక్కువగాని
విచారగ్రస్తులు
తక్కువ.
విషయగ్రస్తులు
నిరంతరమూ
శరీరపుష్టిని
మాత్రము,
ప్రత్యక్ష
గోచరమును
మాత్రము
ప్రమాణముగా
పాటింతురు.
ఆ
చింతనయందే
తత్పరులై
యుందురు.
విచారగ్రస్తులు
ఆత్మీక
పుష్టిని
ఆశించి
నిరంతర
సాక్షాత్కార
ప్రాప్తికై
సర్వం
బ్రహ్మతత్వమును
ప్రదర్శించుటకై
ప్రయత్నింతురు.
అందులోనే
వారి
కాలమును,
కర్మను
చేర్తురు.
ఇది
సక్రమమార్గము.
కర్మోపాసన
వక్ర
మార్గము
కనుక
సక్రమ
మార్గమైన
ధర్మ
కర్మలనూ,
జ్ఞాన
విచారణనూ
సరియైన
హద్దులలో
ఇమిడ్చి,
వాటిని
నిలబెట్టి
లోకమునకు
వాటి
యొక్క
సత్యమును
తెలుపుటే
నా
కర్తవ్యము.
అయితే
బావా!
ధర్మసంస్థాపనకు
తగినది
ఒకటి
కలదు
విను;
దానినే
‘చాతుర్వర్ణ
వ్యవస్థ’యని
యందురు.
ఇది
ప్రజల
కర్మలనూ,
గుణములనూ
అనుసరించి
నాలుగు
విధముల
సృజించియున్నాను.”
14
▾
Meaning
Keep
“ఈ
వర్ణవ్యవస్థ
సృష్టి
సంచాలనమునకు
అత్యావశ్యకము.
దీని
అంతరార్థమును
ప్రజలు
అంత
సులభముగా
గ్రహించుకొనలేరు.
ఏదో
ఈ
వర్ణములు
మానవులను
అనేక
విధముల
బాధించి
భేదములు
కల్పించుచున్నవని
అజ్ఞానులు
తలంతురు.
విషయ
విచారణ
ద్వారా
పరిశోధించిన,
పదార్థము
యొక్క
యథార్థము
బైటపడును.
కాని
పరిశోధన
సలుపక
వర్ణభేదము
సరియైనది
కాదని
వాదించిన
విషయము
తెలియని
వాదన,
వివేకములేని
రోదన,
విశ్వాసము
లేని
వేదనగా
మారును.
లోక
క్షేమమునకే
ఈ
వర్ణములు
నేను
కల్పించితిని
కాని
లోక
క్షామమునకు
కాదు.
ఈ
వర్ణవ్యవస్థ
వలన
మానవుడు
తన
కభిరుచియగు
కర్మలనాచరించి
పూర్ణమును
పొందుచున్నాడు.
వర్ణ
నిబంధనలు
లేనిది
మానవుడు
ఒక
నిమిషమూ
సుఖపడడు.
మానవుని
కర్మలకు
వర్ణములు
ప్రాణము
వంటివి.”
15
▾
Meaning
Keep
“సాత్విక
గుణము
ద్వారా
‘బ్రహ్మతత్త్వము’ను
తెలిసికొని
లోకమునందు
ఆధ్యాత్మిక,
నైతిక,
ప్రగతి
జీవనమును
ప్రేరేపించి,
స్వస్వరూప
సందర్శన
భాగ్యమును
కలిగించునట్టి
వారలను
‘బ్రాహ్మణుల’నియు;
రాజనీతిని,
శాసన
వ్యవస్థను,
దేశ
క్షేమమును,
ధర్మమును
రక్షించెడి
దృష్టితో
దుష్టులను
దుర్మార్గులనుగ్గడించుచూ,
అసహాయ
దీనులైన
దుర్బలులను
కాపాడుచూ
అట్టివారలకు
చేదోడు
వాదోడుగా
ఉండి
పరిపాలన
చేయువారలను
‘క్షత్రియుల’నియూ;
పాడి
పంటలతో
న్యాయబద్ధమైన
వృత్తి
వ్యాపారములతో
వృద్ధినొందింపుచూ
లోకములో
సామాన్య
ప్రజలకు
తగిన
ఆహార
సదుపాయములను
అందించుచూ,
ప్రజా
దేహపోషణకు
సాధ్యమైనంత
సదుపాయములను
కల్పించు
వారలనే
‘వైశ్యుల’నియు;
ప్రపంచ
శ్రేయమునకు
పునాదులు
వేయుచూ
సేవాకర్మలనాశ్రయించి
పై
మూడు
వర్ణముల
వారినీ
అనుసరించి
వారలకు
తగిన
బలమును
అందించు
వారలను
‘శూద్రుల’నియూ,
నాలుగు
వర్ణములను
నిర్మించితిని.
ఇట్లు
వారి
వారి
విహిత
విధాన
కర్మలను
ఆచరించుచున్న,
లోకము
కాని,
సమాజము
కాని
సర్వతోముఖ
వికాసమును
పొందును.
ఇట్టి
నిబంధనలు
ఉండుటచే
శ్రమ
విభాగములు
జరిగి
వ్యక్తి
సమాజ
జీవితములో
ఒడుదుడుకలు
లేక
హాయిగా
ఉండగలడు.”
16
▾
Meaning
Keep
ఇట్టి
వర్ణ
విభాగములు
భగవంతుడు
భారతీయుల
కొసగిన
వరప్రసాదము.
భారతీయులు
ఎంతటి
అదృష్టవంతులో!
భగవంతుని
అనుగ్రహమునకు
పాత్రులై,
ప్రతిచర్య
భగవదాజ్ఞకు
బద్ధమైనదై
యుండుట
మహాభాగ్యము.
ఈ
విషయమున
మనము
కొంత
యోచించవలసిన
విషయము
కలదు.
ఇది
ప్రధానమైన
సమస్య.
భగవత్
ప్రసాదమైన
వర్ణ
వ్యవస్థకు
నేడు
భయంకరమైన
ప్రమాదము
కలుగుచున్నది.
పాలకులు
గూడనూ
వర్ణవ్యవస్థను
రూపుమాపిన
కాని
లోకమునకు
క్షేమమేర్పడదని,
వర్ణవ్యవస్థ
వలననే
భారతదేశమింతటి
దుస్థితికి
వచ్చినదని
అనేకమంది
వాదించుచూ
బోధించుచున్నారు.
17
▾
Meaning
Keep
మంచిదే!
సర్వులకూ
లోకక్షేమమే
ప్రధానము.
కాని
‘వర్ణ
వ్యవస్థ
వలన
లోకము
ఇంత
మాత్రమైనా
నిలువ
గలిగినదా,
లేక
వర్ణ
వ్యవస్థ
క్షీణించుటచేత
ఈ
దుర్గతి
పట్టినదా?’
అని
బుద్ధిమంతులు
శాంతముగా
విచారణ
సలిపి
పరిశోధనల
ప్రమాణములచే
వీటిని
ప్రక్కకు
నెట్టిన,
తప్పక
అందరూ
ఒప్పుకొనతగినదే.
అట్లుకాక,
విచారణలు
సలుపక,
వివేక
దృష్టితో
పరిశోధించక,
అనుమాన
ప్రమాణములతో
వర్ణ
వ్యవస్థను
నిందించిన
సహించలేని
విషయము.
కొంతమంది
పెద్దలు
చెప్పినట్లు
వర్ణ
వ్యవస్థలు
సక్రమ
మార్గమును
తప్పి
వక్ర
మార్గమును
పట్టినది
వాస్తవమే.
అంత
మాత్రాన
దానిని
పారద్రోలుట
న్యాయము
కాదు.
చేతులు
చేయవలసిన
పనులు
కాళ్ళు,
కాళ్ళు
చేయవలసిన
పనులు
తల
చేయుచున్నదని,
చేతులు,
కాళ్ళు
తెగగొట్టుట
మంచిది
కాదు.
అట్లు
దారి
తప్పిన
వాటిని,
క్రమము
తప్పిన
వాటిని,
ఆచరణలో
పెట్టుటకు
ప్రయత్నించవలెను
కాని
అసలుకే
మోసము
చేసిన
అన్యాయమునకు
గురియగును.
అసలు
ఇంత
అరాజకమునకు
మూల
కారణము
వర్ణ
వ్యవస్థ
యేర్పడి
కాదు.
వర్ణ
వ్యవస్థను
సరియైన
మార్గమున
పోషించకుండటే
కారణము.
వర్ణ
వ్యవస్థ
భగవత్
ప్రసాదమైనది.
తగిన
రీతిగా
గౌరవించక,
సక్రమ
మార్గమున
నడిపించక,
ఇష్టమొచ్చినట్లు
ఉపయోగించుకొనుటచే
ఈ
విధమైన
అవలక్షణములకు
దారితీసినది.
18
▾
Meaning
Keep
ఈ
చాతుర్వర్ణ
వ్యవస్థ
ఒక
మన
భారతీయులకే
కాక
యావత్
ప్రపంచమునకే
అవసరమైనది.
విదేశములలో
మాత్రము
ఈ
పద్ధతి
లేకపోలేదు.
అక్కడికీ
ఇక్కడికీ
ఒక్క
పేరు
మాత్రమే
వ్యత్యాసము.
అక్కడ
కూడనూ
శిక్షక
వర్గమని,
రక్షక
వర్గమని,
వణిగ్వర్గమని,
శ్రామిక
వర్గమని
నాలుగు
రకములు
కలవు.
19
▾
Meaning
Keep
అయితే
మన
భారత
వర్ణములు
జన్మతో
నిర్ణయించబడినవి.
విదేశీయులకు
కర్మతో
నిర్ణయించబడినవి.
ఇదే
వాటికీ,
వీటికీ
భేదము.
ఇప్పూడు
ప్రథమ
స్థానమున
ప్రతిష్ఠించబడిన
బ్రాహ్మణులయందు
దారి
తప్పి,
తుచ్ఛమార్గముకు
వడగట్టిన
వారు
లేకపోలేదు.
నాలుగవ
స్థానమున
శూద్రులను
వారల
యందు,
పవిత్ర
భావములు
అభివృద్ధి
అయి,
చిత్తశుద్ధి
కొరకు
పాటుపడువారు
లేకపోలేదు.
ఇంతమాత్రమునకే
వర్ణము
పనికి
రాదనుట
ఒప్పుకోదగినది
కాదు.
Previous
←
Establishing the Practice of Dharma Is the Establishment of Dharma
Next
The Varṇa System – Its Meaning
→