Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Varṇa System – Its Meaning
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
భగవత్
విషయమున
‘చిత్తశుద్ధి’కి
ప్రధాన
స్థానమిచ్చిననూ,
పరిపాలనా
పద్ధతికి,
‘వర్ణ
వ్యవస్థ’,
ఈ
కట్టుబాట్లు
అత్యవసరము.
దీనిని
యెంత
ద్వేషించి
పనికిరాదని
పారవేసిననూ
ఇది
పారిపోవునది
కాదు.
లోక
క్షేమము
సర్వులకూ
ప్రధాన
అంశమే
కనుక
తొందరపడక
విచారణ
సలిపి
పండితులు,
ప్రభువులు,
దీనిని
ఒక
మార్గమునకు
తెచ్చుట
చాలా
మంచిది.
ఎవరో
అసూయపరులు
వర్ణము
పై
లేనిపోని
దూషణలను
రెచ్చగొట్టినంత
మాత్రమున,
బుద్ధిమంతులూ
విద్యావంతులూ
కూడా
దానిని
బలపరచుట
న్యాయ
మార్గము
కాదు.
వర్ణము
లేదనుటా
ఒక
వర్ణమే,
మతము
లేదనుటా
ఒక
మతమే
కదా!
ఈ
చిన్న
విషయమును
కూడా
యోచించక
అన్నియూ
తెలిసినవారు
కూడా
ఈ
విషయమున
వివేకశూన్య
లగుచున్నారన్న
ఆశ్చర్యము!
ఒక్కొక్క
వస్తువునకు
కూడా
ఒక్కొక్క
హద్దు
కలదు.
ఆ
వస్తువులు
దానికి
నీమించిన
హద్దును
మీరిన
ఆ
వస్తువే
నాశనమగును.
స్వభావ
స్వరూపములు
ఏకమగుటే
వస్తువు
యొక్క
సత్యము.
అట్లుకాక
స్వరూపము
మాత్రముండి
స్వభావము
లేకుండిన
అది
నిత్యవస్తువు
కాలేదు
కదా!
అటులనే
ఒకొక్క
వర్గమునకు
స్వభావమను
హద్దులు
లేకుండిన
ఆ
వర్గము
ఏవర్గముగా
నుండును?
త్రిశంకు
స్వర్గముగా
నుండును.
లోక
సంరక్షణార్థమై
భగవంతుడు
నియమించిన
హద్దులను
మహనీయులు
తరతరముల
నుండి
కాపాడుకొని
వచ్చుచుండగా,
నేడు
ఈ
కలిలో
అతి
తెలివితేటలు
గలవారు
దీనిని
పనికిరాని
పదార్థముగా
పాటించుచున్నారు.
విచారణచేయక,
వివేకముపయోగించక,
బాహ్యదృష్టితో
వ్యష్టి
భావముతో
చూడరాదు.
సమిష్టి
భావముతో,
అంతర్
దృష్టితో,
వివేక
విచారణలతో
పరిశోధించిన,
పవిత్రత
తప్పక
పైకి
తేలగలదు.
పాలలో
సర్వ
వ్యాపిగా
ఉన్న
వెన్నను,
చక్కని
పద్ధతితో
మర్దన
సల్పిన
పైకి
విడిగా
వచ్చి
తేలునటుల,
నాలుగు
వర్ణములందూ
ఉన్న
నాణ్యమైన
పవిత్రత
వివేకబుద్ధితో
విచారణ
సలిపిన
విశదమగును.
వికారములు
మారును.
విషయము
తేలును.
2
▾
Meaning
Keep
ఇదే
వర్ణ
వ్యవస్థను
మరికొంత
మంది
వేరొక
రకమున
ప్రచారము
సల్పుదురు.
ఏదెట్లున్ననూ,
ఒక
దేహమందుండిన
అంగములవలె
ఈ
నాలుగు
వర్ణములూ
నాలుగు
అంగములుగా
నిలచినవి.
భగవంతుడను
దేహమునందే
ఉద్భవించిన
అంగములే
ఈ
వర్ణములు.
ముఖమునుండి
బ్రాహ్మణులనియూ,
భుజముల
నుండి
క్షత్రియులనియూ,
తొడల
నుండి
వైశ్యులనియూ,
పాదముల
నుండి
శూద్రులనియు
చెప్పబడుచున్నది.
అయితే
దీనికి
సూక్ష్మార్థము
వేరు
కలదు.
గురువువలె
జ్ఞానమును
ఉపదేశించుటకు
వాక్కు
వంటివాడు
‘బ్రాహ్మణుడ’నియూ,
భూభారము
వహించువాడు
బాహుబలుడగు
‘క్షత్రియుడ’నియు,
శరీరమును
నిలబెట్టు
తొడలవలె
సంఘ
సౌధమును
నిలబెట్టు
సమర్ధుడు
‘వైశ్యుడ’నియు,
తిరిగి
పనీ
పాటు
చేయుటకు
పాదములు
ఉపయోగమగునట్టి
ఇతర
కృత్యములు
చక్కపెట్టువాడు
‘శూద్రుడ’నియు
భావము.
శరీరమునకు
ఏ
అవయువములు
లోటు
వచ్చిననూ
దానికది
కొరతయే
అగునట్లు,
సంఘమనకీ
కార్యములు
చేయువారిలో
నెవరు
లోటయిననూ
లోపమవచ్చి
క్షేమము
చెడును.
శరీరావయవములు
అన్నియూ
ఉత్తమములయినట్లు
వర్ణములన్నియూ
శ్రేష్ఠములయినవే.
కాలుచేతులు
కడుపుపై
కోపించి
పనిమానుట
వంటిదే
సంఘ
వైషమ్యము.
ఒక
చక్కెర
బొమ్మ
నుండి
వచ్చిన
పదార్థములే
కదా!
తల
గిల్లుకొని
నోటిలో
వేసికొన్ననూ
తీపే,
కాలు
గిల్లుకొని
నోటిలో
వేసుకొన్ననూ
తీపే.
అన్నీ
ఒక
పరమాత్మ
దేహము
నుండే
వచ్చిన
ఈ
వర్ణములను
అంగములు,
వేరువేరెట్లగును?
కర్మలు
వేరు
వేరు
కాని
రక్తనాళములూ,
సుఖదుఃఖములూ,
అందరికీ
ఒక్కటే.
దేహమంతా
సమాన
రక్తమే
ప్రవహించును
కానీ
చేతులకొక
రక్తమూ,
పాదములకొక
రక్తమూ,
ముఖమునకు
మరొక
రక్తమూ
ప్రవహించదు
కదా?
ఇది
వేద
విహితమైన
సమానధర్మము
కానీ
కల్పితమైన
మానవ
నీమములు
కావు.
కనుక
వర్ణవ్యవస్థను
అర్థము
చేసుకొనక,
వాటి
వలన
లోకమునకు
అనేక
భేదభావములు
కలుగుచూ
ద్వేషములకు
గురియగుచున్నట్లు
తలంచుట
అజ్ఞానము
తప్ప
వేరుకాదు.
3
▾
Meaning
Keep
వర్ణ
వ్యవస్థను
నిర్మూలము
చేసిన
లోక
క్షేమము
కలుగునని
వాదించు
వారు
మాత్రమే
లోక
క్షేమమును
కోరుచున్నారని
వారు
భావింతురు
కాబోలు!
వర్ణ
వ్యవస్థ
మంచిదని
వాదించువారు
లోకమునకు
హానికోరువారని
వారి
ఉద్దేశ్యమైయుండవచ్చును.
ఇవి
రెండనూ
భ్రమలే.
వర్ణవ్యవస్థను
వ్యతిరేకించువారికంటే,
వర్ణవ్యవస్థను
కాపాడవలెనను
వారలలోనే
లోకక్షేమము
నిండుగా
దండిగా
నుండును.
అది
వారు
తెలిసికొనలేకున్నారు.
ఏదో
వర్ణవ్యవస్థను
నిర్మూలము
చేసిన
మేము
దేశాన్ని
కాపాడిన
వారమగుదుమని
భ్రాంతి
పడుచున్నారు.
అది
అమాయకపు
తృప్తి.
వర్ణవ్యవస్థను
వ్యతిరేకించువారు
కానీ,
పోషించవలెనన్న
వాంఛకలవారు
కానీ,
చక్కగా
విచారణ
సల్పి
మంచి
చెడ్డలు
స్పష్టముగా
తెల్పి
తదుపరి
పరిపాలించుటో,
పాడుచేయుటో
చూచుకొనవచ్చును
కానీ,
ఊరికే
విషయము
తెలియని
వాదనలలో
విపరీతార్థములు
చెలరేగి
వింత
మార్పు
కలుగును.
ద్వేషము
పెరుగును.
అది
యెవ్వరికీ
క్షేమము
కాదు.
ఎండమావుల
జలమను
భ్రాంతి
చేత
తరుముకొని
పోయినట్లు
సర్వమూ
సమానమను
భ్రాంతితో
సర్వులకూ
అశాంతిని
కలింగించుచున్నారు.
ప్రజా
ప్రతినిధులయిన
పండితులునూ,
అనుభవజ్ఞులయిన
పెద్దలను
చేరి,
పరిపాలకులు
పరిశోధనలు
సలుపుట
చాలా
మంచిది.
కానీ,
వీటి
విషయమే
తెలిసికొనక
బాహ్యకర్మలనే
ప్రధానముగా
పట్టుకొని
ఇందులో
ఏదో
విషమున్నదని
అదిరిపడుట
అవివేక
లక్షణము.
పరిపాలకులకు,
పండితులకు
ప్రజాక్షేమమే
ప్రధానము.
అసలు
ఈ
వర్ణములు
అందరి
క్షేమమునకే
అవతరించినవి.
దీనిని
వినియోగించు
విధానములు
అనుభజ్ఞుల
ద్వారా
యోచించక,
ఆచరించక,
ఇన్ని
అపోహలకు
దారి
తీసినవి.
ఒక
చిన్న
ఉదాహరణము
యోచించుడు.
ఇపుడు
పరదేశీయులు,
లక్షలమందిని
చంపే
బాంబులు
తయారుచేసినారు.
అవి
చెడ్డవనే
తెలుసు.
వాటికి
ప్రభుత్వమే
అనేక
విధముల
తోడ్పడుచున్ననూ,
చేసిన
శాస్త్రజ్ఞుడు
తెలివి
తేటలు
గలవాడైననూ,
వినియోగించే
విషయమున
తిరిగి
ప్రభుత్వపు
అనుమతి
అవసరము
కదా!
చెడ్డవాటికి
ప్రభుత్వము
సర్వసహాయము
చేసిననూ
అది
అవసరమునుపట్టి
వినియోగించవలెనే
కాని,
చేసితిమి
కదా
యని
ఇష్టమొచ్చినట్లు
ఉపయోగించిన
అందరికీ
ప్రమాదమే!
లోకమున
అరాచకము
సంభవించినపుడు
ఆత్మరక్షణ
కొరకు
వారి
వారి
దేశ
రక్షణ
కొరకు
వాటిని
ఉపయోగింతురే
కాని
లోకమునే
నాశనము
చేయవలెనను
దృష్టి
కాదు
కదా?
4
▾
Meaning
Keep
అట్లే
వర్ణములను
తీక్షణమైన
రక్షణలను,
వారి
వారి
కర్తవ్యములను
కొనసాగించి
దేశమును
రక్షించునట్టి
ఆయుధములనే
భావించవలెను.
వాటిని
ఏ
ఏ
విధముగా
క్రమము
తప్పక
వినయోగింతుమో,
భద్రపరతుమో
అట్లే
వాటిని
ఆచరించి
భద్రపరచవలెను
కానీ,
వాటిని
హద్దూ
పద్దూ
లేక
ఇష్టమొచ్చినట్లు
ఉపయోగించుటచే
ఇంతటి
అరాజకమునకు
గురి
అయినది.
కనుక
పూర్వపురుషులు,
మహారాజులు,
ఉత్తమ
పండితులు,
అనుభవజ్ఞులైన
మహానుభావులు
వీటినెంతటి
పవిత్రముగా
వాడి,
తరించి
ఇంతకాలమూ
కాపాడుకొని
వచ్చిరో
ఒకపరి
యోచించిన,
అవి
మంచివా?
చెడ్డవా?
అని
బుద్ధిమంతులకు
గోచరము
కాగలదు.
అవి
లోకమునకు
అపకారమే
చేయునవైన
వారల
కేమి
తెలివి
లేకనా,
లేక
ఇప్పటి
కాలపు
చదువు
సంధ్యలు
లేకనా?
అసలు
అమాయకులా?
కాదు,
కాదు.
వారి
తెలివితేటలూ,
వారి
బుద్ధికుశలతలూ,
వారి
ఆత్మవిద్యలూ,
వారల
పరిశోధనా
బలములూ
ఇప్పటి
వారలలో
వెతికిననూ
కోటికొక్కరు
చిక్కరు.
వారు
కందమూలాదులు
భక్షించి,
కాయకష్టములు
సలిపి,
లోక
క్షేమమును
ప్రాణముగా
భావించి
తమ
తమ
సర్వశక్తులనూ
ధారబోసిన
మహాత్యాగులు,
యోగులు,
యోధులు.
నిజమైన
దేశక్షేమమును
కోరి,
ఆశించి
అన్ని
విధములా
ధీ
కొట్టిన
మహాబుషులు.
ఇప్పటి
వారల
వలె
మాటలతో
క్షేమమును
కోరుచూ,
చేతలతో
అంతా
నాశనమే
చేయుట
పూర్వీకులకు
తెలియని
విద్య.
ఇట్టివే
నేటి
నూతన
భావములు,
నవీన
ప్లానులు;
వీరి
ప్లానులు
గాలి
మేడలు.
వారివి
వారికే
తెలియును
తప్ప
అన్యులకు
అర్థము
కాదు.
ఒక
వైపు
కట్టుచూ
వచ్చుచుండిన
మరొకవైపున
కూలుచూ
వచ్చుచుండును;
ఊహ
మేడలు.
5
▾
Meaning
Keep
జీవునకు
దేహమెట్లు
ప్రధానమో,
దేవునకు
దేశమట్లు
ప్రధానము.
దేహమునందలి
ఏ
భాగమున
ఏమి
జరిగిననూ
జీవునకెట్లు
సంబంధమో,
దేశమున
ఏ
భాగమున
ఏమి
ప్రమాదము
జరిగిననూ,
దేవునికట్లే
సంబంధించి
యుండును.
దేహములోని
సర్వాంగములూ
ఎట్లు
క్షేమముగా
నుండకోరుదుమో,
దేశములో
సర్వ
ప్రాంతములూ
అంత
క్షేమముగా
నుండవలెననే
దేవుని
భావము.
దేశమంతా
దేవుని
దేహమయినపుడు,
తన
అంగముల
నాశమును
దైవము
కోరుకొనునా?
దైవ
విషయమున
సర్వులూ
సమానులే.దైవమును
పొందే
విధానమున
సర్వులకూ
అధికారమున్నది.
కాని
ఏ
ఏ
అవయవములు
ఏ
ఏ
కర్మలు
చేసి
తమ
తమ
కర్తవ్యమును
జరుపవలెనో
ఆయా
అవయములు
అట్లు
చేయవలెను.
అట్లే
ఆయా
వర్ణముల
వారు
తమ
తమ
హద్దులను
దాటక,
తమ
తమ
కర్తవ్యములను
సలిపి
దేశ
క్షేమమునకు
పాటు
పడవలెను.
దేహమునకెట్లు
అవస్థా
భేదములున్నవో,
అట్లే
దేశమునకు
వర్ణములు,
అవస్థా
భేదములు.
అట్లుకాక
వ్యాపారము
చేయువారే
అందరూ
ఉండిన
కొనువారెవరు?
అందరూ
యుద్ధము
చేయువారే
ఉండిన
వారికి
తగిన
తిండి,
తీర్థములు
సరఫరా
చేయువారెవరు?
అందుకనే
ఒకరు
ఒక
వర్గమను
వర్ణమును
నియమించుకొని,
వారి
వారి
పనులు
వారు
చేయుచూ,
తమ
తమ
కర్మలన్నియూ
దేశ
రక్షణ
నిమిత్తమని
భావించుట
చాలా
ఉత్తమ
మార్గము.
చేయవలసినవి
ఎన్నియో
ఉండగా
అనవసరముగా
వర్ణములను
అడ్డుపెట్టుకొని
మనలో
మనము
యుద్ధము
చేయుచున్నాము.
మన
మన
దేహములనే
హద్దులో
పెట్టుకోలేని
వారలము,
ఇక
దేశమునేమి
హద్దులో
ఉంచగలము?
వర్ణకలహములు
మాని
దేశ
క్షేమమును
యోచించుట
మంచిది.
ఇంతకాలమూ
మన
పూర్వీకులు
ఎట్లు
కాపాడుకుంటూ
వచ్చిరో
అటులనే
నేడునూ
మన
వర్ణములను
కాపాడుకొనుట
దేశమునకే
పరమ
శ్రేయస్సు.
6
▾
Meaning
Keep
ఈ
వర్ణ
వ్యవస్థలో
పరమాత్ముడు
ఎట్టి
పక్షపాతమూ
చేయలేదు.
అతనిలో
అట్టి
గుణమే
లేదు.
భగవంతునికి
కూడా
ఈ
భేదమెందుకని
కొందరు
తలంతురు.
అతనిలో
భేదము
ఏ
కొననూ
లేదు.
చక్కెరముద్ద
వంటి
చల్లనివాడు,
తియ్యనివాడూ
దేవుడు.
సర్వభేదములూ,
బాధలూ,
అనాత్మ
భావముగల
జీవుల
కల్పనలేకానీ,
దేవుని
కల్పనలు
కావు.
ఉదాహరణమున
కొక
విషయము
యోచింతము:
ఒక
తల్లికి
నలుగురు
పిల్లలు
కలరు.
నలుగురూ
ఒకే
తల్లి
గర్భము
నుండి
జన్మించినవారే!
కాని,
తొట్టిలో
పరుండబెట్టిన
బిడ్డ
యోగక్షేమములు
చూచినట్లు
మిగిలిన
పిల్లలను
ఆ
తల్లి
చూడదు.
అంతేకాక,
పిల్ల
పిలువకపోయిననూ
కాల
కాలములకూ
తగిన
ఆహార
సదుపాయములు
తల్లియే
గమనించుచుండును.
మిగిలిన
ముగ్గురు
బిడ్డలూ
వచ్చి
అడిగిననే
అన్నము
పెట్టును.
ఆటబొమ్మలిచ్చును.
అంతమాత్రము
చేతనే
తల్లి
భేదబుద్ధిగలదని
కాని,
తన
ప్రేమంతా
కడగొట్టు
బిడ్డపై
నున్నదని
కాని
చెప్పుటకు
వీలు
లేదు
కదా?
బిడ్డల
యెక్క
శక్తి
సామర్థ్యమునూ,
పరిస్థితులనూ
పట్టి
తల్లి
యెట్లు
మెలగునో,
అటులనే
లోకమంతా
తన
వారైనప్పటికినీ,
అందరూ
తన
సంతతే
అయినప్పటికినీ,
ఒక్కొక్కరి
శక్తి
సామర్థ్యములను
పట్టి
ఒక్కొక్క
రక్షణ
బాధ్యతను
దేవుడు
నియమించినాడు.
అట్టి
నిస్వార్థమైన,
నిర్దోషియైన,
నిరాడంబరుడైన
నిత్యానందునిపై
నిందలు
మోపుట
సూర్యునిలో
చీకటిని
వెతుకుటవంటిది.
తన
కిరణములు
పడిన
వెంటనే
చీకటి
పటాపంచలమై
పోవును.
అట్టిది
ఇక
తనలో
చీకటి
నిలుచుటకు
వీలగునా?
ఇది
ఎంత
అజ్ఞానము!
ఇట్టి
వారలను
సూర్యుని
విషయమే
తెలియని
వారనవచ్చును.
7
▾
Meaning
Keep
అసలు
ఆధ్యాత్మిక
దృష్టిలో
ఈ
వర్ణములను
మరొక
రీతిగా
భావించవలసివుండును.
బ్రహ్మనిష్ఠగలవాడే
బ్రాహ్మణుడు.
అసత్య
పక్షమును
ధిక్కరించువాడే
క్షత్రియుడు.
సదా
సద్విచారము
చేయజాలెడి
వ్యవసాయాత్మిక
బుద్ధిగలవాడే
వైశ్యుడు.
కర్మ
నిష్ఠా
సత్యాచరణను
సల్పువాడే
శూద్రుడు.
మానవత్వము
పొందుటకు
ఈ
నాలుగు
వృత్తులు
అత్యావశ్యకము.
8
▾
Meaning
Keep
ఇక
విషయమునకు
దిగుదము!
కృష్ణపరమాత్మ
అర్జునుని
పిలిచి,
“బావా!
గుణకర్మ
విభాగమును
పట్టి
నాచే
నాలుగు
వర్ణములు
సృజింపబడినవి.
వాటికి
నేనే
కర్తనయివుండియూ,
అకర్తనే.
తత్త్వ
దృష్టితో
చూచిన
జడమైన
కర్మ,
‘చైతన్య
ఆత్మ’ను
బంధింపజాలదు.
ఆత్మ
స్వయముగా
అసంగము.
‘నేను
చేయుచున్నాన’ను
అభిమానము
కానీ,
అహంకార
మమకారములు
కానీ
లేవు.
అందువలననే
ఈ
జగదుత్పత్తి
స్థితిలయ
రూపమగు
కర్మము
నన్ను
ఏ
మాత్రమూ
బంధించలేదు.
అభిమాన,
అహంకార,
మమకారములు
అజ్ఞానుల
లక్షణములు.
అట్టి
వానినే
కర్మలు
బంధించును.
వ్యవహార
దృష్టిని
పట్టే
నేను
కర్మలు
చేయువానివలె
లోకులకు
తోచుచున్ననూ
వాస్తవానికి
నేను
అకర్తను.
బావా!
ఇంతేకాదు,
ఈ
కర్మలు
ఇంతటితో
వదులునవి
కావు.
కర్మల
వలన
ఫలమునూ,
ఫలాపేక్ష
వలన
వాసనలునూ;
వాసనల
వలన
జన్మములూ
ఎత్తవలసి
వచ్చును.
ఆ
జన్మలలో
తిరిగీ
కర్మ,
ఫలాపేక్ష,
వాసనా,
తిరిగీ
జన్మ.
ఈ
విధముగా
జననమరణముల
బారిని
పడి
తపించుటగును.
కర్మ
అనునది
ఒక
పెద్ద
సుడిగుండము.
అది
త్రిప్పి
త్రిప్పి
అడుగునకు
తీసుకొని
పోవును.
అర్జునా!
మరొక
విషయమును
అతిజాగ్రత్తగా
వినుము!
కర్మకు
బంధించునట్టి
శక్తి
సామర్థ్యములు
లేవు.
అది
స్వయముగా
బంధించలేదు.
కానీ
‘నేను
ఈ
కర్మను
చేయుచున్నాన’ను
అభిమానమూ,
ఫలమునందలి
ఆశయూ,
బంధనకు
ముఖ్య
కారణములగుచున్నవి.
ఉదాహరణమునకు,
ఒకటి
చేరినపుడే
సున్నకు
విలువ
కదా!
అటులనే
‘కర్తృత్వము’
అంకె
వంటిది,
కర్మలు
సున్నల
వంటివి.
కాన,
అంకెలయిన
కర్తృత్వము
వలననే
బంధనలు
ఏర్పడుచున్నవి.
కనుక,
బావా!
అభిమానమును
వదలిన,
కర్మ
నిన్నేమీ
బాధించదు.
అకర్మలనునవి
నిష్క్రియాత్మక
పక్షమనియూ
అందురు.
వీటినే
సులభముగా,
ఫలాసక్తి
లేక
చేసిన
కర్మలు
వాసనా
రూపమున
పరిణమించవు,
ఎప్పుడు
వాసనలు
లేవో
అప్పుడు
పునర్జన్మము
కూడా
ఉండదు.
ఇట్టి
పవిత్రమైన
విచారణలు
దీక్షతో
సలిపే
పూర్వము
ముముక్షువులు
కర్మలు
సలిపిరి.
అట్టి
ముముక్షువులు
తాము
కర్తలమని
కానీ,
భోక్తలమని
కానీ
తలంచలేదు.
సర్వమునకూ
కర్త
భగవంతుడే
అనియూ,
ఇవి
కేవలము
వ్యవహార
మాత్రములనియూ
తలంచెడివారు.”
9
▾
Meaning
Keep
“బావా!
నీవును
అటులనే
తలంచి
కర్మలు
చేయుము.
అట్లు
చేసితివేని
నీకు
తప్పక
‘చిత్తశుద్ధి’
కలుగును.
ఇంతియే
కాక
ఈ
కర్మలయందే
కర్మ,
అకర్మలన్న
నేమియో
నీకు
తెలిపెదెను
వినుము.”
10
▾
Meaning
Keep
“ఈ
కర్మ,
అకర్మల
విషయమున
అర్థముకాని
ఆవేదనతో
అనేకమంది
తికమకలు
పడుచున్నారు.
దీని
సత్యము
అందరికీ
అంత
సులభముగా
బోధపడదు.
స్వధర్మములే
కర్మలనియూ,
ఆత్మజ్ఞానముతో
చేయు
కర్మలు
వికర్మలనియూ
తలంతురు.
ఏ
కర్మలయిననూ
సరే,
అజ్ఞానముతో
చేసిన
కర్మకు
ఎంత
శ్రమ
పడిననూ
అది
క్లేశమునే
కలిగించును
కానీ
శాంతిని
చేకూర్చదు.
కర్మయందు
అకర్మనూ,
అకర్మయందు
కర్మనూ
చూచుటే
బుద్ధిమంతుడైన
మానవుని
లక్షణము.
ఇక్కడ
కర్మలు
మూడని
భ్రమింతురు!
ఏమనగా;
కర్మ,
వికర్మ,
అకర్మలని.
కానీ
వికర్మ
కర్మయందే
మిళితమయి
ఉన్నందున
వికర్మను
ప్రత్యేకించి
యిందులో
ఉపయోగించలేదు.
కర్మలు
చేయదగినవనియూ
వికర్మలు
చేయరానివనియూ,
అకర్మలనునవి
నిష్క్రియాత్మక
పక్షమనియూ
అందురు.
వీటినే
సులభముగా
అర్థమగునట్లు
చెప్పవలెనన్న
దేహము,
ఇంద్రియములు,
ప్రాణము,
బుద్ధి,
మనస్సుల
యొక్క
వ్యాపారమున్నియూ
కర్మలనియూ,
ఇక
అకర్మయన్న
కర్మలు
చేయకుండుట
అని
కూడనూ,
ఒక
అర్థము.
అకర్మయన్న
ఆత్మస్థితియనే
సరియైన
అర్థము.
అది
ఆత్మయందారోపించబడినది.
11
▾
Meaning
Keep
ఎటులన,
ప్రయాణీకులు
ఒక
బస్సునందో,
రైలునందో,
పడవనందో
ప్రయాణము
సల్పుచుండిన
గట్టుపయినున్న
చెట్లూ,
గుట్టలూ,
కదలకుండిననూ
అవి
ప్రయాణము
చేయుచున్నట్లును,
ప్రయాణము
చేయుచున్నవారు
నిలిచినట్లునూ
కనిపించును,
తెలిపించును.
రథము
యొక్క
కదలిక
వలన
వృక్షములందు,
గుట్టలయందూ
గమనక్రియనారోపించును.
అట్లే
శాస్త్రీయ
సంస్కారములేని
మూఢుడవ్యయమగు
ఆత్మయందు
దేహేంద్రియాదుల
కర్మమును
ఆరోపించుచున్నాడు.
ఆత్మ
అకర్త
అనెడి
అనుభవమును
పొందుటే
నిజమయిన
అకర్మ;
అంతేకాని,
బాహ్యవ్యవహారములందు
కర్మలను
వదలినంత
మాత్రమున
అకర్మయనుకొనుట
చెల్లదు.
బాహ్యమున
కర్మల
నాచరించక
ఎవడునూ
ఉండలేడు.
ఇది
సాధ్యము
కాదు.”
Previous
←
The Dharma of the (Śrī Kṛṣṇa) Avatāra
Next
The Qualifications of Guru and Disciple
→