Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Qualifications of Guru and Disciple
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
గురుశిష్యుల
యోగ్యతలు**
“బావా!
ధనంజయా,
కర్మాకర్మల
యొక్క
యథార్థ
దర్శనము
కలిగిన
వాడే
నిజమైన
పండితుడు.
పుస్తకమందున్న
విషయములను
కంఠస్థము
చేసి
మస్తకమున
చేర్చినంత
మాత్రమున
పండితుడని
తలంచరాదు.
పండితుడు
కాదు.
సమ్యగ్దర్శనమునకు
యోగ్యమగు
బుద్ధికలవాడే
పండితుడనబడును.
అట్టి
జ్ఞాన
సంపదను
ఆర్జించిన
వాని
సర్వ
కర్మలూ
పటాపంచలము
కాగలవు
(జ్ఞాని
యొక్క
స్వదృష్టికి).
జ్ఞానాగ్నియందు
అట్టి
దహన
శక్తి
కలదు.
అయితే
ప్రారబ్ధ
కర్మను
జ్ఞానులయిననూ
అనుభవించే
తీరవలెనని
కొందరి
అభిప్రాయము,
ఇది
పరదృష్టి
నాశ్రయించి;
జ్ఞానికి
ప్రారబ్ధముండినట్లు
పరదృష్టికి
తోచునే
కాని,
స్వదృష్టికి
అదిలేదు.
ఎవడు
లౌకిక
వస్తువులపై
ఆధారపడివుండడో,
ఇంద్రియసుఖమును
ఎవడాశించడో,
సర్వవిధములైన
వాసనాకామములెవ్వని
వదలియుండునో
అట్టివాని
యందు
శబ్దాదులు
వాటి
ప్రభావములు
కూడనూ
చూపలేవు.
ఇట్టి
స్థితిని
సాధించినవాడే
సన్యాసి
అనిపించుకొనును.
అతడే
సర్వపరిగ్రహా
వివర్జితుడు.
అతడే
జ్ఞాని.
అనగా
నిరంతరమూ
బాహ్య
వస్తువులపై,
విషయములపై
ఆధారపడక
తనయందే
తాను
సంతృప్తి
పొందువాడు.
ఇతను
కర్మయందు
అకర్మనూ,
అకర్మయందు
కర్మనూ
దర్శించిన
మహానుభావుడు,
పండితుడు.
ఇట్టి
వ్యక్తి
కర్మయందు
ప్రవర్తించుచుండినప్పటికీ
అట్టి
కర్మలకేమాత్రమూ
బాధ్యుడు
కాని
వాడే
అగును.
జ్ఞానికి
ఫలాపేక్ష
ఉండదు.
కారణమేమందువేమో?
విను!
అతను
నిత్య
తృప్తుడు.
తృప్తుడు
నిరాశ్రితుడు.
అతనికి
కర్తృత్వభావము
లేకుండును.
పరేచ్ఛా
ప్రారబ్ధముననూ,
అనిచ్ఛా
ప్రారబ్ధముననూ
ప్రాప్తించిన
ప్రతికూల
అనుకూల
పదార్థముల
యందు
రాగద్వేషములు
లేక
సదా
తృప్తిగా
ఉండును.
ఇతనిని
‘యదృచ్ఛాలాభ
సంతుష్టు’డని
కూడనూ
అందురు.
ఏది
జరిగిననూ
భగవదిచ్ఛానుసారము
జరుగునని
నిరంతర
ప్రశాంతి
ప్రసన్నుడై,
నిశ్చల
చిత్తుడై
సదానందమున
తాండవమాడును.
తృప్తిగలవాడే
జ్ఞాని.
అసంతృప్తుడే
అజ్ఞాని”
అని
కృష్ణపరమాత్మ
బోధించెను.
2
▾
Meaning
Keep
పురుషార్థమును
పూర్తిగా
మాని
సోమరిపోతులై
జడ
ప్రాయముగ
ఉండు
మూర్ఖుని
‘యదృచ్ఛాలాభాసంతుష్టుడ’నుట
ఏ
మాత్రము
పొసగదు.
సంతృప్తి
జ్ఞాని
సొత్తేగాని
అన్యులకు
లభించునట్టిది
కాదు.
అజ్ఞాని
అసంతృప్తుడై
అశాంతి
గోతిలో,
కోర్కెలపై
కోర్కెలు,
ప్లానులపై
ప్లానులు
వేయుచుండును.
అంతటితో
విడవక
పరితపించుచూ
పడరాని
ఆరాటము
పడుచూ
హృదయమును
ఉడికించును.
3
▾
Meaning
Keep
“బావా!
సుఖదుఃఖములూ,
జయాపజయములూ,
లాభనష్టములనెడి
ద్వంద్వముల
ప్రభావములు
జ్ఞానులయందు
ఏ
మాత్రమూ
పెత్తనము
చెలాయించవు.
అతనిని
‘ద్వంద్వాతీతు’డని
కూడా
పిలుతురు.
ఇతను
‘మచ్చరము’లను
తుచ్ఛముగా
యెంచి
చెంత
చేరనీయడు.
ఇక
ఆత్మస్వరూప
స్వభావములా?
అది
‘అసంగము’.
ఆత్మకు
అనాత్మ
వస్తువులతో
ఎట్టి
పొత్తునూ
కుదరదు.
ఆత్మకు
చావు
పుట్టుకలు
కానీ,
ఆకలి
దప్పులు
కానీ,
శోక
మోహములు
కానీ
లేవు.
ఆకలి
దప్పులు
ప్రాణసంబంధము.
(చావు
పుట్టుకలు
–
అవి
దేహధర్మాలు.
రెండవ
జత,
ఆకలి
దప్పులు
–
ప్రాణ
ధర్మాలు.
మూడవ
జంట,
శోక
మోహాలు
–
మనస్సు
ధర్మాలు.
ఇవి
“షడూర్ములు”)
కాన,
బావా!
నీవు
వీటికి
ఏ
విధమైన
స్థానము
నీయక,
కేవలము
‘ఆత్మస్వరూపు’డవని
తలంచి
భ్రాంతులు
వీడి
అసంగుడవు
కమ్ము.
దీని
కంటే
రమణీయత్వము
వేరొకటి
లేదు.
బావా!
సంసారములో
నీవు
తామరాకువలె
మెలగవలెను.
సంసారమును
మలినము
హృదయమునకు
చేర్చుకొనవద్దు.
నీవు
సంసారమందున్ననూ,
సంసారమును
నీవు
చేర్చుకొనక
మెలగవలయును.
అదే
అసంగుని
లక్షణము.
తామరాకువలె
నీటిని
జేర్చకుండుట
తెలిసికొనవలెను.
కానీ
బ్లాటింగ్
పేపరువలె
చిక్కినవన్నింటిని
సోకిన
కోడిగీతలు,
కొంగగీతలన్నింటినీ
ప్రింటువలె
చేర్చుకొనవద్దు.
‘చిత్తవృత్తు’లనే
జలధారలతో
ఆత్మలింగాభిషేకము
చేయవలెను.”
4
▾
Meaning
Keep
“చిత్తము
ఒకవైపునా,
ఇంద్రియములు
మరొక
వైపునా
ప్రయాణము
సలిపిన
వారు
ఉభయ
భ్రష్టులగును.
కనుక
ఆసక్తి
అను
దోషము
నుండి
దూరము
కమ్ము.
అట్లు
చేసిన
నీ
చిత్తము
జ్ఞానమునందు
స్థిర
నివాసము
చేయును.
అపుడు
నీవేది
యొనర్చిననూ
యజ్ఞమే
కాగలదు.
నీవేమి
పలికిననూ
అది
ఒక
దివ్యమంత్రమై
నిలువగలదు.
నీవెక్కడ
పాదము
పెట్టినా
అదొక
క్షేత్రముగా
మారగలదు.
బావా!
యజ్ఞములను
గూర్చి
కూడా
కొంత
తెలుపుదును;
శాంత
మనస్కులై
చిత్తవృత్తులు
మాని
శ్రవణము
చేయుము.
లోకమున
కొందరు
ద్రవ్య
యజ్ఞమును,
మరికొందరు
తపోయజ్ఞమును
ఇంకా
కొందరు
యోగ
యజ్ఞమును,
స్వాధ్యాయ
యజ్ఞమును,
జ్ఞాన
యజ్ఞమనియు,
అనేక
విధములైన
యజ్ఞములను
సలుపుచుందురు.
ద్రవ్యముతో
సాధ్యములగు
పవిత్ర
పుణ్యకార్యములన్నింటినీ
‘ద్రవ్యయజ్ఞ’మని
అందురు.
ధనమునకు
దానము,
భోగము,
నాశములని
మూడు
విధములైన
గతులు
కలవు.
దానమునకూ,
భోగమునకూ
ధనమును
ఉపయోగించిన
నాశము
తప్పును
కదా?
ఇప్పుడు
ఒక
చోట
బావి
త్రవ్విరనుకో,
అక్కడ
యెంత
గుంట
త్రవ్విరో
ఆ
మట్టి
అంతా
ఒకచోట
గుట్టబడియుండును
కదా,
గుంట
ఉన్నచోట
గుట్ట
ఉండకపోదు.
ధనమొకచోట
రాశి
రాశిగా
పెరుగుచున్న
మరొకచోట
లోటుపాటులు
కనిపించుచునే
యుండును.
5
▾
Meaning
Keep
ఆ
విధమైన
లోటులు
కనిపించకుండుటకే
దానములు
చేయవలెను.
తన
చేతనున్న
ద్రవ్యమును
సదుపయోగము
చేయుటే
శాస్త్రసమ్మతమైన
ద్రవ్య
యజ్ఞము.
సదుపయోగమన్న
గోదానము,
భూదానము,
విద్యాదానము,
వైద్యదానము,
శ్రమదానము,
అన్నదానము
ఇత్యాది
సత్కర్మలన్నియూ
ద్రవ్య
యజ్ఞము
క్రిందనే
భావించవలెను.”
6
▾
Meaning
Keep
“ఇక
మనో
వాక్కాయములను
ధర్మసాధనల
కొరకు
వినియోగించిన
అది
‘తపోయజ్ఞ’మగును.
ఒకవేళ
శరీరమునకు
అన్నము
దొరకక
పస్తుపరుండిన,
అది
తపస్సగునా?
కాదు.
చిత్తవృత్తులను
అణచుకొనుట
‘యోగ’మందురు;
సర్వకర్మలూ
చేయుచూ
కర్మబంధములకు
చిక్కకుండుటే
‘యోగ’మందురు.
మనస్సును
భగవంతునితో
లగ్నముచేయు
సాధనే
‘యోగము’.
ఇక
‘స్వాధ్యాయ’మన,
మోక్షశాస్త్రములను
భక్తిశ్రద్ధలతో,
వినయ
భయ
విశ్వాసములతో
పఠించుట.
వీటి
వలన
బుషి
బుణము
తీరును.
దీని
వలన
పుణ్యము
లభించుటయేగాక,
పాపము
నశించును.
తరువాత
‘జ్ఞాన
యజ్ఞము’.
ఇది
అపరోక్ష
జ్ఞానము
కాదు.
సాధన
రూపమైన
పరోక్ష
జ్ఞానము.
వీటికి
సంబంధించిన
శాస్త్రములను
శ్రద్ధతో
విని,
పఠించి,
యుక్తి
ప్రయుక్తులతో
మననము
సలుపవలెను.
ఇది
సిద్ధరూపము
కాదు.
ఇట్టి
దానినే
‘జ్ఞానయజ్ఞ’మందురు.
పెద్దలవలన
ఆత్మవిచారణ
సలిపి,
ఆత్మతత్త్వమును
ఎరుగవలెనను
ఆశనే
జ్ఞానమని
అందురు,
జ్ఞానయజ్ఞమని
పిలుతురు.
విహితమైన
కర్తవ్య
కర్మల
నొనర్చవలెను.”
7
▾
Meaning
Keep
“అర్జునా!
‘ఇట్టి
పవిత్ర
జ్ఞానము
అందరికీ
లభ్యమగునా?’
అని
సంశయింతువేమో!
లేక
‘ఇది
లభించు
ఉపాయమేది?’
అని
ప్రశ్నింతువేమో!
విను.
ఈ
పవిత్రమైన
తత్త్వమును
బదయగోరువారు
తత్త్వవేత్తలగు
మహనీయుల
చెంతచేరి
వారి
చిత్తములు
ప్రసన్నములగునట్లు
చేసి,
సమయ
సందర్భములు
చూచుకొని
వారి
మనస్సు
నెరింగి
మెలంగవలెను.
సంశయములేవైనా
స్ఫురించినపుడెల్లా
ఇష్టమొచ్చినటుల
ప్రశ్నించక,
తరుణము,
సమయము
చక్కగా
ఉన్న
వేళ
వాటిని
శాంత
మనస్కుడై
మహనీయునికి
తెలిపి
దానిని
నివారణ
చేసుకొనవలెను
కానీ
ఊరకే
పుస్తకములు
బండ్లు
బండ్లు
చదివినంత
మాత్రమున,
ఉపన్యాసములు
గంటలు
కొట్టినట్లు
చిలుకపలుకులు
పలికిన
గానీ,
లేక
దొంగ
వేషములుగా
కాషాయములు
ధరించి
ఊర్ధ్వదృష్టితో
వుర్రూతలూగించిన
గానీ
అది
జ్ఞాని
లక్షణము
కాదు.”
8
▾
Meaning
Keep
“వాటి
వలన
జ్ఞానము
చేకూరదు.
దీనిని
అనుభవజ్ఞులైన
మహనీయుల
ద్వారానే
అనుభవింపజేసుకోవలెను.
వారలను
ఆశ్రయించవలెను.
మానవుని
సంశయములు
తీరవలెనన్న
శాస్త్ర
పఠనముతో,
గ్రంథ
పఠనముతో
తీరునది
కాదు.
వీటి
ద్వారా
మరింత
సంశయములు
అభివృద్ధియగును.
ఇవి
కేవలము
తెలుపునవే
కాని
చేసి
చూపించలేవు.
చేసి
చూపించువారు
తత్త్వవేత్తలే
కాన,
వారలను
అంతో
ఇంతో
కాలమైననూ
ఆశ్రయించక
లభించునట్టిది
కాదు,
ఈ
పవిత్ర
జ్ఞానము.
సముద్ర
జలము
సరాసరి
త్రాగిన
దాహము
ఏ
మాత్రము
తీరదు;
అది
పోను,
నాలుకను
కూడా
చెఱచును.
అట్లే
శాస్త్రముల
నుండి
సరాసరి
సంశయము
తీరదు.
ఇంతియే
గాక
జ్ఞానమును
కోరువారి
స్థితిని
కూడనూ
గమనించవలెను.
అట్టి
వానికి
భక్తి
శ్రద్ధలతో
పాటు
సరళభావము
కలిగి
ఉండవలెను.
అట్టి
స్థితిని
కలిగిన
వానికే
జ్ఞానము
సిద్ధించును.
అట్లుగాక
ఆతురత
కొలదీ
గురువును
విసిగించకూడదు.
ఎంతకాలమైననూ
ఆశ్రయించి
ఓపికతో
సాధించవలెనే
కాని
ఆతురత
పనికిరాదు.
గురువు
చెప్పిన
దానిని
జవదాటక
ఆచరించుచూ
నిత్యానుభవమునకు
తేవలెను.
విన్నవాటినీ,
తిన్న
వాటినీ
దినమొకటిగా
రుచి
చూచుకుంటూ,
త్వరత్వరగా
‘జ్ఞాని’
కావలెనని
దురాశాపరుడై
తనకు
తోచినట్లంతా
సాధనను
మార్చుకొనుచుండిన
‘అజ్ఞాని’
కాగలడు.
ఒకపరి
అట్లుకూడనూ
అయిన
ఎంతో
మేలు.
రెండునూ
కాక
పూర్తిగా
పిచ్చివాడైపోవును.
కాన
ఈ
విషయమున
అతి
జాగ్రత్త
పహించవలెను.”
9
▾
Meaning
Keep
“గురువు
చెంత
చేరిన
తోడనే
అతని
(గురువు
యొక్క)
అవసరములను
పట్టి,
జ్ఞానచింత
సహితము
మాని,
గురువు
చిత్తము
రంజింపజేయు
శుశ్రూష
సలుపుతూ
ఆజ్ఞల
యందు
మమకారమును
వీడి
శిరసావహించుచు,
గురు
కార్యము
తప్ప
మరే
యితర
చింతనలు
లేక
సర్వమూ
గురుకటాక్షమునకు
వదలిన
వానికి
జ్ఞానము
త్వరగా
లభించును.
కానీ,
అట్లుగాక
గురువుపై
అవిధేయుడై,
మమకార,
అభిమాన,
అహంకారములతో,
అలక్ష్యముతో,
అవిశ్వాసముతో
గురువునే
పరీక్షింప
చూచిన
తత్త్వజ్ఞానదేవత
అనుగ్రహమునకు
బదులు
ఆగ్రహ
ప్రసాదమును
అందుకొనవలసివచ్చును.”
10
▾
Meaning
Keep
“దూడను
చూచిన
తోడనే
ఆవు
చేపుచున్నట్లు
శిష్యుణ్ణి
చూచిన
తక్షణమే
గురువు
యొక్క
అనుగ్రహమను
క్షీరమును
అందించునట్లు
చేసుకొనలెను.
శిష్యుడు
సువినీతుడై
ఉండవలెను.
అట్లుండిన
శుభ్రమైన
ఇనుమును
అయస్కాంతము
ఆకర్షించినట్లు
శిష్యుణ్ణి
గురువు
అనుగ్రహించును.
బావా!
నేను
శిష్యుని
యోగ్యతలు
మాత్రమే
తెలుపుచున్నానని
తలంచితివా!
కాదు
కాదు.
ఇక్కడ
గురువు
యొక్క
యోగ్యతను
కూడా
శిష్యుడు
పరీక్షించవలసియున్నది.
లేకున్న
బోధగురువులూ,
బాధగురువులూ,
ఇంకా
అనేక
పేర్లుగల
గురువులు
లోకమున
వేలకు
వేలు
గలరు.
కాన,
నీకు
బోధగురువులే
అవసరము
కాని,
మిగిలిన
వారితో
పనిలేదు.
బావా!
విను.
గురువుకుండవలసిన
లక్షణములు
కూడనూ
వివరింతును.
ముఖ్యముగా
జ్ఞాన
లక్షణములతో
పాటు
అనుభవజ్ఞానమును
కూడనూ
కలిగియండవలెను.
తత్త్వవేత్త
అయి
బ్రహ్మనిష్ఠత్వము
కలిగియుండవలయును.
శాస్త్రజ్ఞానము
భుక్తికి
మాత్రము
తోడవును
కాని
ముక్తిని
అందించలేదు.
శాస్త్రజ్ఞానమేమాత్రమూ
లేక,
తత్త్వానుభవము
సాధించి
తమకు
తాము
ముక్తులయినవారు
కూడనూ
కొంత
మంది
గురువులు
కలరు.
ఆశ్రయించిన
శిష్యులను
అట్టివారు
ఆదరించలేరు.
కడతేర్చలేరు.
కనుక
శాస్త్రజ్ఞానము,
అనుభవజ్ఞానము
రెండునూ
ఉన్నవారే
జ్ఞానోపదేశమునకు
అర్హులు.
పేరుకు
గురువులు
లక్షలు
గలరు,
కాషాయము
వేసిన
వారంతా
గురువులే,
గంజాయి
త్రాగిన
వారంతా
గురువులే,
ఉపన్యాసములిచ్చిన
వారందరూ
గురువులే,
పుస్తకములు
వ్రాసిన
వారందరూ
గురువులే!
అబ్బా!
గురు
శబ్దమునకు
అపకీర్తి!
దేశము
తిరిగి,
మాటలు
నేర్చినంత
మాత్రమున
గురుత్వమునకు
అర్హుడు
కాదు.
సర్వశక్తిమయుడయి
అనుభవరూపమున
ఆశ్రితుని
ఆదరించవలెను.
శాస్త్రవిహితమయిన
సాధనలను
అలవరచవలెను.
యుక్తి
మాటలతో
వాదించిన
ఉపయోగముండదు.
ఏది
చేసినా
చెప్పినా
శాస్త్ర
సమ్మతముగా
ఉండవలెను.”
11
▾
Meaning
Keep
“పుస్తకమందున్న
విషయమును
కంఠస్థము
చేసి,
తిన్న
అన్నము
కక్కినట్లు
ఊరికే
ప్రజలను
ఉర్రూతలూగించినట్లు
ఉపన్యాసములిచ్చిన
గురువు
కాలేడు.
ఇట్టి
వారు
ఉపన్యాసములందు
హీరోలు
కానీ,
సాధనలందు,
గురుత్వమునందు
జీరోలు.
వీరలు
బడిపంతుళ్ళకు
పనికి
వత్తురే
కాని
భక్తిముక్తులనుగ్రహించుటకు,
ఉపదేశించుటకు
పనికి
రారు.
అన్ని
విషయములను
ఇముడ్చుకొన్న
పుస్తకమునకెంత
ప్రాప్తి
లభించునో
ఇట్టి
గురువుకూ
అంతే
ప్రాప్తి.
అట్టి
గురువును
ఆశ్రయించిన
శిష్యనకూ
అదే
ప్రాప్తి.
ఇది
తెలియక
అనేకమంది
సాధకులు
ఇటువంటి
వాక్
“మ్యాజిక్”
గలవారల
చెంతకు,
పదముల
కసరత్తు
కలవారి
చెంతకు
చేరి
శిష్యులయి
ఉభయ
భ్రష్టులగుచున్నారు.
విద్య
తెలిసినంత
మాత్రమున,
పండితుడని
పేరుపొందినంత
మాత్రమున,
ఉపన్యాసములిచ్చినంత
మాత్రమున
వారు
‘జ్ఞానభిక్ష’నందించలేరు.
అది
కేవలము
భగవదవతారమూర్తులు,
దైవాంశ
సంభూతులు,
అనుభవ
తత్త్వవేత్తలకే
సాధ్యము.
అంతో
ఇంతో
అనుభవముండిననూ
ప్రయోజనము
లేదు.
సంపూర్ణ
అనుభవము
గలవారలకే
ఇది
సాధ్యము.
అంతో
యింతో
తెలిసినవాడు
అంతవరకే
పోయి
ఆపై
రెండింటికీ
చేరని
త్రిశంకుడు
కాగలడు.
కాన
‘సంపూర్ణనుభవము’
గలవారి
చెంతకు
చేరవలెను.”
“శిష్యుని
గుణలక్షణములు
మాత్రమే
చూడవలెను.
వాని
ఆస్తిపాస్తులు,
అధికార
గౌరవములు
ఏమాత్రమూ
యోచించగూడదు.
12
▾
Meaning
Keep
అట్టి
హృదయ
పాత్రను
తెలిసికొనునట్టి
శక్తిగల
ఉత్తమ
గురువులే
గురువులగుదురు.
బావా!
అజ్ఞాన
నిద్రలో
నిద్రించు
శిష్యునికి
అలారం
గడియారము
వంటివారుగా
ఉండవలెను.
అట్లుకాక
గురువు
లోభి,
శిష్యుడు
సోమరి
అయిన
ఇద్దరికీ
నరకమే
శరణ్యము.”
ఈ
విధముగా
కృష్ణపరమాత్మ
గురుశిష్యుల
యోగ్యతలూ,
వారి
ఆచరణలూ,
వారి
శాస్త్రానుభవములూ,
వారికి
ఉండవలసిన
గుణలక్షణములూ,
విశ్వాస
ప్రవర్తనలూ;
చక్కగా
అర్జునునకు
బోధించెను.
13
▾
Meaning
Keep
అర్జునునకే
కాదు
ఈ
పవిత్రమైన
అమృతవాక్కులు
లోకమునకే
ప్రధానమయిన
పద్ధతి.
గురుశిష్యులు
కాగోరువారందరికీ
ఇది
అమృతోపదేశము.
14
▾
Meaning
Keep
ఇక
నేటి
లోకమునందలి
గురుశిష్యుల
యోగ్యతలు
చూతము.
కాలమునకు
తగినట్లున్నారు.
పూర్వము
పై
పద్ధతులననుసరించు
గురువులు
లెక్కకు
మాత్రము
వచ్చువారలు,
ఎక్కువగా
దొరికెడి
వారలు
కారు.
అట్టి
వారిని
ఆశ్రయించి
జ్ఞానోదయమును
పొందవలెనని
వేలమంది
శిష్యులు
కాగోరు
సాధకులు,
అడవి
అడవి
వెదకెడివారు.
గురువులు
తక్కువ,
శిష్యులెక్కువ
కనిపించెడివారు.
ఇప్పుడు
చూతమా,
ఎచట
చూచినా
గురువులను
పేర్లతో
సందు
సందుకూ
పది
పది
మంది
కనిపింతురు!
సరియైన
శిష్యులు
సన్నగిల్లిపోయారు.
కారణమేమి?
సరియైన
పద్ధతిలో
లేకుండుటే
ఇందుకు
కారణము.
ఇంతేకాక
శిష్యులు
కూడనూ
వారిననుసరించకుండుటే
రెండవ
కారణముగానున్నది.
శిష్యులను
పట్టి
గురువులూ,
గురువులు
పట్టి
శిష్యులూ
గంతకు
తగిన
బొంతలై
కనిపించుచున్నారు.
గురువుల
కర్మము
కాలి
శిష్యులను
గురువులు
పోషించవలసిన
అవసరము
వచ్చినది;
అది
పరవాలేదు.
సరియైన
శిష్యుడైన
అతనిని
పోషించుటలో
ఏ
విధమైన
తప్పూలేదు.
కాని
గురువు
శిష్యుని
అనుసరించి,
శిష్యుని
చూచి
భయపడవలసి
వచ్చుచున్నది.
మాటలకు
గురుపుత్రులమని
అందురు.
ఆశ్రమ
వాసము
జేయుచున్నామనియూ,
మేము
సాధక
బృందమునకు
చేరిన
వారమనియూ
బూటకపు
మాటలు
చెప్పుదురు.
సాధుత్వము
కాని,
ఆశ్రమ
లక్షణములు
కాని,
గురు
కృతజ్ఞత
కానీ
వారిలో
ఎంత
వెదికిననూ
కనుపించవు.
చెప్పుట
కృష్ణార్పణము,
చేసేది
దేహార్పణము.
ఇంతేగాక
కొన్ని
కొన్ని
నవీన
పద్ధతులు
బయలుదేరినవి.
నిబంధనలను
శిష్యుడే
నియమించవలెను.
ఆ
అధికారము
శిష్యునికే
ఉండవలెను.
శిష్యుని
కామవాంఛా
విలాసాలకు,
లౌకిక
విహారాలకు,
వినోదాలకు
గురువు
ఏ
విధమైన
ఆటంకములు
చెప్పకూడదు.
ఇది
మొదటి
శిక్ష.
ఇక
రెండవదా?
శిష్యుని
ఒళ్ళు
కదలకుండా
సాధనలు
సలుపకుండా,
శ్రమపడకుండా,
నయాపైసా
ఖర్చు
కాకుండా
గురువు
బోధించవలెను.
మోక్షమును
ఒడిలో
ఉట్టిపడునట్లు
చేయవలెను.
కఠిన
సాధనలు
కాని,
నిబంధనలు
కానీ
గురువు
చెప్పకూడదు.
శిష్యుని
ఇష్టముననుసరించి
గురువు
మెలగవలెను;
అట్లు
కాదా,
తక్షణమే
గురువునకు
విడాకులు
సిద్ధము!
Previous
←
The Varṇa System – Its Meaning
Next
Dhyāna Yoga, the Inner Sādhana for Jñāna Yoga
→