Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · Dhyāna Yoga, the Inner Sādhana for Jñāna Yoga
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఇట్టి
సుకుమారులకూ,
విషయలోలురకూ
మోక్షమెట్లు
ప్రాప్తించును?
ఇట్టి
దండుమారి
శిష్యులు
లేకున్న
గురువులకేమి
నష్టము?
కానీ
ఇట్టి
శిష్యులు
లేకపోతే
నష్టపడే
గురువులు
కూడా
ఉన్నారు.
నల్లమందు
గురువులూ,
గంజాయి
గురువులూ.
ఛీ!
ఇట్టి
గురువులు
గురువులు
కారు.
అట్టి
శిష్యులు
శిష్యులూ
కారు.
లోకవంచకులు.
పొట్ట
కొరకు
పాటుపడు
గురువులు,
గురువులెట్లగుదురు?
విలాసాల
కొరకు
ఆశించు
శిష్యులు
శిష్యులు
ఎట్లగుదురు?
ధన
గురువులు
వారు.
మద
శిష్యులు
వీరు.
ఇట్టి
వారిని
గురుశిష్యులని
తలంచుట
కూడనూ
మహా
పవిత్రమైన
“గురు”
పదమునకు
అపకీర్తి
తెచ్చిన
వారగుదురు.
మోహనాశనమును
చేయు
ఉపదేశములను
అందించువారు
నిజగురువులు.
విషయ
వాసనలు
అరికట్టుటకు
ప్రయత్నించువాడు
శిష్యుడు.
నేటి
గురువులు,
తిన్న
అన్నము
కక్కినట్లు
రాత్రంతా
చదివి
పగలు
“ప్లాటుఫారములు”
ఎక్కి
వేదాంత
తత్వమును
అబ్బా!
చిలుకలవలే
పలుకుదురు.
కామక్రోధాది
అరిషడ్వర్గములను
అణగ
ద్రొక్కవలెనని
బల్లలు
కొట్టి
చెప్పుదురు.
కాని
వారలలో
అట్టి
కామక్రోధములు,
ఈర్ష్యాద్వేషములు,
దురాశా
పిశాచములు,
నిమిష
నిమిషమూ
ప్రతి
మాటయందూ,
ప్రతిచిన్న
పనియందు
ప్రదర్శించుచుందురు.
గురువులను
వారే
ఈ
గుణములను
అరికట్టలేకపోతే
ఇక
శిష్యులు
ఏ
విధముగా
వృద్ధికి
రాగలరు?
పోనీ,
సర్వ
విషయములందు
సంపూర్ణ
త్యాగమును
కలిగి,
రాగద్వేషములను
చెంత
జేర్చక
సర్వజన
సమానప్రియులై,
సత్యవాక్పోషకులై,
సదా
సచ్చింతనతో
సర్వుల
క్షేమమును
ఆశించి,
సరళ
భావముతో
సన్మార్గమునూ,
సద్గుణములనూ
బోధించు
గురువులు
దొరికిన
అట్టివారి
దగ్గర
శిష్యులు
అల్పసంఖ్యలో
చేరుదురు!
చేరుటే
కాక,
అట్టి
పవిత్ర
గురువులపై
విపరీత
భావములు
కల్పించి
వారిని
సందేహింతురు.
ఇది
శిష్యుల
కర్మ
తప్ప
మరేమియూ
కాదు.
గురువులకేమి
నష్టము
లేదు.
కాని
ఇట్టి
గురువులను
ఆశ్రయించకుండిన
శిష్యులకే
చాలా
నష్టము.
దేహభ్రాంతిని
వదలని
శిష్యులు
ఎన్ని
దేశములు
తిరిగిననూ,
ఎందరి
గురువులను
ఆశ్రయించిననూ
వారు
దేవుని
చూడలేరు.
భ్రాంతిని
వీడలేరు.
ఎన్ని
ధ్యాన,
జపములు
చేసినా
తీర్థయాత్రలు
తిరిగినా
ఫలమును
పొందజాలరు.
వారి
సర్వసాధనలూ,
తూటుపడిన
పాత్రలో
పోసిన
నీరువంటివిగా
నిలుచును.
2
▾
Meaning
Keep
అట్టి
సాధకుల
కంటే
సంసారులే
మేలు.
తమ
తమ
ఆశ్రమ
ధర్మములను
తాము
చేసుకుంటూ,
తమ
కర్మలయందు
దోషములు
లేక,
దారి
తప్పక
నడచుకొంటూ
దైవమును
స్మరించుకొంటూ
ధన్యులగుచున్నారు.
నేటి
గురుశిష్యుల
విషయములు
చెప్పవలెనన్న
ఎన్ని
గ్రంథములైనా
వ్రాయవచ్చును.
కాన
అవసరములేని
విషయమలలో
మనము
జోక్యము
కల్పించుకొనుట
కాలమును
అపవిత్రము
చేయుటయే
అగును.
ఇక
మన
విషయమునకు
వత్తము.
3
▾
Meaning
Keep
కృష్ణార్జునుల
యొక్క
గురు
శిష్యుల
సంబంధమున,
అట్టి
భావములను
ఊహించుట
కూడనూ
పాపము.
వారిరువురకూ
వారిరువురే
సాటి
కాని,
మరొకరు
లోకమున
లేరు.
గురుశిష్యులన్న
వారిద్దరినే
ప్రధానముగా,
ప్రమాణముగా
తీసికొన్నవారి
జన్మలు
ధన్యములు
కాగలవు.
గురువు
మాటను
శిరసావహించి
ఆచరించిన
పవిత్ర
శిష్యుడు
అర్జునుడు!
శిష్యుని
మంచిని,
కీర్తిని,
ఆత్మానందమునూ,
ధర్మమునూ
కోరి,
తన
ప్రాణసమానముగా
పాలించి
లాలించిన
గురువు
కృష్ణుడు!
పరమాత్ముడైన
కృష్ణుడు,
జీవాత్ముడైన
అర్జునుడూ,
గురు
శిష్యులగుట
ఎన్ని
జన్మల
ఫలమో!
పురుషోత్తముడు
కృష్ణుడు,
నరోత్తముడు
అర్జునుడు;
ఇట్టి
ఉత్తమ
సాంప్రదాయములు
కలిగిన
వారలకే
గురుశిష్యుల
సంబంధము
తగును
కానీ,
అందరూ
పేర్లకు
గురువులే,
చేరిన
వారంతా
పేర్లకు
శిష్యులే;
దండుమారి
శిష్యులు,
పేరు
బరువు
గురువులు,
ప్రయోజనము
లేని
ప్రాణులు.
కృష్ణపరమాత్ముని
ప్రేమ
అపారము.
అర్జునుడన్న,
దేహమందలి
గుండెవలె,
ముఖమునందలి
నేత్రమువలె
చూచుకొన్నాడు,
ప్రేమించినాడు,
పవిత్ర
మొనర్చినాడు,
పావనుని
చేసినాడు.
అట్టి
గురువు
గురువు.
ఇక
అర్జునుడు
మాత్రము
సామాన్యమయినవాడా?
అతని
త్యాగము
అతనికే
చెల్లును.
ఎట్టి
క్లిష్టసమయము
లందైననూ
కృష్ణుని
మాట
మీరక,
కృష్ణుని
దేహమును
తన
దేహముగా
భావించి,
విశ్వసించి,
దాని
యోగక్షేమమును
పాలించి,
ప్రాణదానమైననూ
చేయుటకు
సిద్ధమయి
నిలచిన
శక్తిమయుడు.
గురుశిష్యులన్న
ఈ
విధముగా
మెలగవలెను.
ప్రేమస్వరూపుడైన
పరమాత్ముడు
గురుశిష్యుల
యోగ్యతలను
తెలిపి,
తరువాత
ఆత్మజ్ఞాన
ప్రయోజన
ప్రభావములను
చెప్పుచున్నాడు.
4
▾
Meaning
Keep
“కౌంతేయా!
జ్ఞానము
యొక్క
ప్రభావము
చేత
తొలుత
సమస్త
భూతములనూ
నీ
యందు
నీవు
చూడవలెను.
తరువాత
నా
యందు
చూడవలెను.
దీని
వలన
అజ్ఞాన
మోహములు
తొలగిపోవును.
సూర్యోదయము
వలన
చీకటి
అదృశ్యమైనట్లు,
జ్ఞానోదయము
వలన
అజ్ఞానము
అదృశ్యమగును.”
5
▾
Meaning
Keep
“బావా!
నీ
పుట్టు
పూర్వోత్తరములన్నియూ
నాకు
బాగుగా
తెలియును.
నీ
జన్మము
సామాన్యము
కాదు;
అది
దైవీసంపదతో
పుట్టినది;
ఇది
నాకు
తప్ప
మరెవరికీ
తెలియదు.
నీకు
పుట్టిన
వ్యామోహము
వలన
“నేనింతటి
పాపకార్యములు
చేయుచున్నాను.
బంధువులనూ,
గురువులనూ
పెద్దలనూ
చంపుచున్నా”
నని
నీలో
నీవు
భ్రమించి
‘పాపిని.
పాపిని’
అని
నీవు
నిందించుకొనుచున్నావు.
పోనీ!
పాపులు
మాత్రము
పాపులుగా
ఉండి,
జ్ఞానమును
పొందలేరా?
ఒక
వేళ
గతములో
పాపములు
సలిపియుండిన,
వాటిని
పశ్చాత్తాపము
పవిత్రము
చేయును
కదా?
పరమాత్ముడు
పశ్చాత్తాపమునకు
కరుణించువాడు
కనుక,
ప్రేమతో
పటాపంచలు
చేయును.
నిన్న
మొన్నటివరకు
అనేక
పాపకార్యములు
చేసిన
రత్నాకరుడు
ఉద్ధారకము
కాలేదా?
వాల్మీకిగా
మారలేదా?
వాల్మీకి
చరిత్రయే
ప్రమాణము.
పాపరాశి
నుండి
విముక్తులైనంత
మాత్రమున
ప్రయోజనమేమి?
పుణ్య
కర్మలున్నవి
కదా
అని
అందువేమో,
పిచ్చివాడా!
పాపకర్మ
ఫలాన్ని
వదలుకొనుటకు
వారికి
స్వాతంత్ర్యము
లేదు
కాని,
పుణ్యకర్మ
ఫలాన్ని
వదులుటకు
వానికి
స్వాతంత్ర్యము
కలదు.
వలయునపుడు
వాటిని
పరిత్యజించవచ్చును.
మండెడి
దావాగ్ని
అన్ని
విధములైన
కట్టెలనూ
భస్మము
చేయునట్లు
పుణ్యపాప
కర్మలన్నింటినీ
జ్ఞానాగ్ని
భస్మము
చేయును;
కాన
ఇట్టి
పవిత్రజ్ఞానమును
పొందుటకు
శ్రద్ధావంతుడై
యుండవలెను.”
6
▾
Meaning
Keep
“శ్రద్ధ
అనగా,
శాస్త్రములయందూ,
గురువులయందూ,
జ్ఞానార్జన
యందూ,
ఇంతియే
కాదు,
వీటన్నింటికినీ
మించినది
నీకై
నీకు
శ్రద్ధ
ప్రధానంగా
ఉండవలెను.
శ్రద్ధలేక
యెట్టి
చిన్న
కార్యమును
కూడనూ
సాధింపలేదు
మానవుడు.
ఇక
ఇట్టి
పవిత్రమైన
జీవనాధారమైన
జ్ఞానమునకు
శ్రద్ధ
ఎంత
ప్రధానమో
యోచించు.
ఈ
శ్రద్ధ
అనునది
సామాన్యమైనది
కాదు.
శమ,
దమ,
ఉపరతి,
తితీక్ష
సమాధానమను
పవిత్ర
పదార్థములను
భద్రపరచునట్టి
ఇనుపపెట్టె
వంటిది
శ్రద్ధ.”
7
▾
Meaning
Keep
“బావా!
ఇంతటితో
జ్ఞానము
లభించుననుకొంటివా?
కాదు
కాదు.
ఈ
ఒక్కటి
మాత్రము
ఉండినచాలదు.
నే
చెప్పెడి
విషయములను
గ్రహించవలెనను
ఆసక్తి
కూడా
అత్యవసరము.
ఈ
రెండూ
ఉండినపుడు
సోమరితనము
దీనికి
తోడు
కాకూడదు.
పై
రెండయిన
శ్రద్ధా,
ఆసక్తి
ఉండినప్పటికినీ
ఒక్కొక్కపుడు
సంఘదోషము
సంభవింపవచ్చును.
కనుక
ఇట్టి
సంఘదోషమును
జయించుటకు
ఇంద్రియనిగ్రహము
ప్రధానమైనదిగా
ఉండవలెను.
సంశయమును
చేర్చకు.
అశ్రద్ధకంటే
సంశయమే
పరమనాశము
చేయును.
సంశయము
సాధనకు
క్షయరోగము
వంటిది.
సంశయమునకు
అజ్ఞానమే
పుట్టినిల్లు.
ఇది
హృదయ
గుహయందు
ఉండును.
సర్వ
అనర్థములకూ
ఇది
మూలము.
కనుక
మొదట
ఆత్మజ్ఞానమను
ఖడ్గముతో
దీనిని
అంతము
చేయవలెను.
లెమ్ము
బావా!
కర్మలను
కర్తవ్యముగా
నెంచి,
నా
మాటలయందు
సంపూర్ణ
విశ్వాసముంచి,
ఫలాపేక్షను
దృష్టియందుంచుకొనక
చెప్పిన
కర్మలు
చేయుము.
అపుడు
నీవు
నిష్కామకర్మను
ఆచరించిన
వాడగుదువు.
నీవు
ఫలాసక్తిని
వదలుట
వలన
జ్ఞాన
నిష్ఠాత్మకమగు
మోక్షమును
పొందుదువు.
బావా!
ఈశ్వరార్పణ
బుద్ధితో
కర్తృత్వములను,
ఫలాపేక్షను
వదలి
కర్మలు
చేయువానిని
ఏ
పాపము
కూడనూ
ఏమియూ
చేయలేదు.
జిడ్డు–నాలుకనూ,
కంటి
కాటుక–గ్రుడ్డునూ,
తామరాకు–నీటిని
అంటనట్లు,
జేర్చనట్లు
నిష్కామకర్మ
యోగికి
యెట్టి
కర్మచేసినా,
చూచినా,
వినినా,
తానేమియూ
చేయనివాడే
అగుచున్నాడు.
బాహ్యమైన
విషయ
భోగములు
సుఖదుఃఖములకు
దారితీయును;
అవి
క్షణికములు.
నీవు
వీటన్నింటికీ
అతీతమైన
ఆత్మస్వరూపుడవు;
నీవు
స్వయముగా
జ్ఞానస్వరూపుడవు.
ఈ
కర్మలతో
కాని
నీకెట్టి
సంబంధమూ
లేదు.
అన్నింటికీ,
నీవు
కర్తవు
కాదు;
సాక్షివి.
కాన
ఈ
అభిమాన
మమకారములను
భ్రాంతితో
నీవీ
సంశయములకు
గురి
అయినావు.
నీవు
బ్రహ్మజ్ఞానివి
కమ్ము.
సర్వ
కర్మలూ
చేయుచూ
ఫలమును
మాత్రము
త్యాగము
చేయుము.
కర్మత్యాగము
కంటే
కర్మ
ఫలత్యాగమూ,
కర్మ
సన్యాసము
కంటే
కర్మయోగమూ
ఎంతో
పవిత్రమైనవి.
ఈ
రెండింటికంటెనూ
ధ్యానయోగము
మరింత
శ్రేష్ఠమయినది.”
8
▾
Meaning
Keep
“ధ్యానయోగమునకు
కర్మయోగము
యొక్క
తోడ్పాటు
అవసరము!
కనుకనే,
కర్మయోగమును
ముందుగానే
తెలుపవలసివచ్చినది.
అర్జునా!
ఫలమును
వదలి
కర్తవ్యకర్మ
చేయువాడు
నాకు
అత్యంత
ప్రియుడు.
అట్టివాడే
నిజసన్యాసి.
అంతే
కాని
అగ్నులను
వదలి,
పనిపాటులను
మాని,
పరమ
సోమరులవలె
తిని,
నిద్రించి,
ఇంద్రియ
విషయములను
ఆశించుచు
కుంభకర్ణుని
సోదరులైనవారు
నాకేనాటికీ
ప్రియులు
కారు.
సోమరులకు
నేను
చాలా
దూరము.
సంకల్పములను
సన్యసించని
వాడు
ఎన్ని
సాధనలు
చేసిననూ
యోగి
కాలేడు.
శబ్దాది
విషయములందునూ,
కర్మల
ఫలములందునూ
తగులుకొనని
వాడు
సర్వసంగ
పరిత్యాగి
కాగలడు.
ఇట్టి
నిష్కామకర్మల
వలననే
ధ్యానయోగమును
సాధింపవచ్చును.
ఆజ్ఞావర్తి
కాని
చిత్తమే
తనకు
పరమ
శత్రువుగా
మారును.
కనుక
నీవు
జితేంద్రియుడవు
కమ్ము.
ఏకాంత
వాసము
చేయుము.
చిత్తేంద్రియములను
వశపరచుకొనుము.
కళ్ళైములేని
గుఱ్ఱము,
కాడి
పెట్టనివ్వని
యెద్దు,
ఇంద్రియములు
వశము
చేసుకోలేని
సాధనా
నీరులేని
నది
వంటివే.
నిష్ప్రయోజన
కర్మలు”.
9
▾
Meaning
Keep
“బావా,
లెమ్ము!
ధ్యానయోగమును
అభ్యసించుము;
క్రమము
తప్పక,
కాలము
మార్చక,
స్థానమును
వీడక,
మనస్సును
అరికట్టుటకు
పూనుకో.
ఈ
యోగమునకు
క్రమము
ప్రధాన
అంగము;
దానిని
అతి
జాగ్రత్తగా
పాటించవలెను.
ఇష్టమొచ్చినట్లంతయూ
పద్ధతులు
మార్చకూడదు.
అది
ప్రమాదమునకు
గురియగును.
అతిగా
తిని
ఆయాస
పడువానికీ,
తిండి
తినక
దేహమును
కృశింపజేయువానికీ,
అతిగా
నిద్రించువానికీ,
అసలే
నిద్రలేక
నిరంతరము
మెలుకవతో
నుండు
వానికీ,
అనుకూలమును
పట్టి
ధ్యానమును
ఆచరించువానికీ
(అనగా
నేడు
ఏ
పనీ
లేదని
ఆనాడు
ఎక్కువ
కాలము,
రేపు
అతి
పని
కలదని
ఆనాడు
ఏదో
శాస్త్రముగా
జరుపువాడు),
కామక్రోధాది
షడ్గుణములను
విచ్చలవిడిగా
ఉపయోగించువానికీ,
తల్లిదండ్రుల
యొక్క
హృదయములను
హింసించువానికీ,
మాతృదేవి
హృదయమును
సంతృప్తి
చేయనివానికీ,
వీటన్నిటి
కంటే
అతి
ముఖ్యమైనది
భగవంతునియందు
గానీ
లేక
ఎవరిని
గురువుగా,
దైవముగా
భావించి
హృదయము
అర్పితము
చేసితివో,
అట్టి
వారలపై
సంశయములు,
అవిశ్వాసములు
ప్రదర్శించువానికీ,
ఎన్ని
యుగములు
ధ్యానము
చేసినా
ఫలసిద్ధి
కాజాలదు.”
10
▾
Meaning
Keep
“యోగాభ్యాసము
చేయువాని
చిత్తము
గాలిలేని
స్థానమున
దీపము
ఉండినట్లు
నిశ్చలముగా
ఉండవలెను.
ఏ
ఏ
సమయమున
మనస్సు
చలించునో
అప్పటికప్పుడే
దానిని
నిశ్చలముగా,
పరుగెత్తనీయక
అరికట్టుటకు
ప్రయత్నించవలెను.
అన్నింటియందూ
నేనే
యున్నానను
భావమును,
సర్వభూతములూ
నాయందే
యున్నవను
ఏకత్వమునూ
పొందువాడు
అన్ని
యోగములనూ
సాధించినవాడగును.
అట్టివానికి
పరులనియూ,
పరమాత్మ
అనియూ
భేదము
లేకుండును.
ఇతరుల
సుఖదుఃఖములు
తనవిగా
భావించును.
ఇతర
హృదయములను
బాధింపజేయక
సర్వులనూ
సర్వేశ్వర
భావమున
ప్రేమించును.
ఇట్టి
భావము
గలవాడు
యోగులలో
శ్రేష్ఠుడు”
అని
భగవంతుడైన
కృష్ణుడు
భక్తుడైన
అర్జునునకు
తెలుపుచుండగా,
మధ్యలో
అర్జునుడు
సందేహ
మనస్కుడై
సమాధాన
మడుగుచున్నాడు.
11
▾
Meaning
Keep
“కృష్ణా!
నీవు
చెప్పెడి
ప్రతి
విషయము
వినుటకు
హాయి
గానూ,
అనుభవించుటకు
ఆనందముగానూ
ఉన్నవి
కానీ,
ఆచరించ
అందరికీ
సులభసాధ్యము
కానివై
యున్నవి.
సమత్వరూపమైన
యోగము
సర్వశక్తిమయులైన
సాధకులకే
కష్టముగా
ఉంటే
సామాన్యులైన
మాబోటి
వారలకు
ఇది
సాధ్యమా?
సాధన
అటుంచి,
మనస్సు
మాత్రము
సామాన్యమైనదా
కృష్ణా?
అబ్బా!
దాని
బలము
ఏనుగులకు
కూడా
లేదు.
దాని
చంచలమా,
పుట్టిన
యిల్లు,
పెట్టిన
పేరు
దానికే
చెల్లును.
ఇక
దాని
క్షోభ
చాల
బలమైనది,
గట్టిదైనది.
అది
పరమ
గయ్యాళి,
ఎవరికీ
చిక్కదు,
ఎక్కడా
ఉండదు.
మూటకట్టిన
నీరు,
పిడికిట
పట్టిన
గాలివలె
పట్టసాధ్యము
కానిదై
యుండును.
ఇట్టి
మనస్సుతో
అట్టి
యోగమును
సాధించ
వీలగునా?
రెండూ
రెండే.
గుండూ,
బండవంటివి.
వీటిని
కరిగించవలెనన్న
ఎట్టి
వారికీ
సాధ్యము
కాదు,
కృష్ణా!”
12
▾
Meaning
Keep
పై
మాటలకు
భగవంతుడు
చిరునవ్వి
నవ్వి,
“బావా!
మనసు
తత్త్వము
చక్కగ
గమనించితివి.
ఎట్టి
అసాధ్యమైన
పనినైననూ
అభ్యాసముతోడనూ
లేక
విచారణతోడనూ,
వైరాగ్యమువలననూ
దానిని
క్రమేణా
వశపరచుకొనవచ్చును.
అభ్యాసముతో
కాని
పనులు
లోకములో
లేవు.
ఎట్టి
ఘనకార్యములైననూ
భగవంతునిపై
భారమువైచి,
ఆత్మ
విశ్వాసముతో
అభ్యాసము
సల్పిన
అన్నియూ
సాధించవచ్చును.
కనుక
దీక్షతో
ఎవడు
ఈ
యోగమును
సాధించునో
అట్టివాడు,
బహుజన్మ
పరిపాకమున
సమస్త
దోషరహితుడై
పరమ
సిద్ధిని
పొందును.
అట్టివాడు
తపోవంతులకంటే,
జ్ఞానులకంటే,
కర్మనిష్ఠులకంటే
యోగసిద్ధుడు,
గొప్పవాడు.”
13
▾
Meaning
Keep
“బావా!
నీవు
ఇట్టి
పవిత్రస్థానమైన
యోగి
స్థానమును
పొందుము.
దానిని
సాధించుము.
ఇంతేకాదు,
దీనికంటే
మరొక
ఉత్తమ
పవిత్రస్థానమొకటి
కలదు.
అది
యేదన,
ఎవడు
నా
యందే
చిత్తముంచి
శ్రద్ధతో
ఎవడు
నన్నే
ధ్యానించుచుండునో
వాడు
అందరికంటే
శ్రేష్ఠుడు,
మహాయోగి.
ఈ
ధ్యానయోగము
జ్ఞానయోగమునకు
అంతరంగ
సాధనము.
ఇది
శ్రద్ధా
భక్తి
పూర్వకమైనపుడే
ఈ
యోగమునకు
విలువ
కాని,
లేకున్న
కొయ్యబొమ్మ
వంటిదగును.
వీటకన్నింటికీ
భగవంతునిపై
ప్రేమ
గాఢంగా
ఉండవలెను.
అదే
భక్తి.
ఇటువంటి
భక్తి
స్థిరముగా
గల్గుటకు
భగవంతుని
గుణగణములు,
స్వభావ
స్వరూపములు,
పరిచయమూ,
మొదలగు
వాటిని
తెలుసుకొనవలెను.
అందుకనే
మునుముందు
స్వరూప
స్వభావములను
గూర్చి
నీకు
తెలుపుచున్నాను.
విను.
అనుభవజ్ఞానముతో
కూడిన
శాస్త్రజ్ఞానమును
నీకు
పూర్తిగా
చెప్పతలంచితిని.
దీనిని
తెలుసుకున్న
తరువాత
నీవు
తెలిసి
కొనవలసిన
మరియొకటేదియూ
మిగిలియుండదు.
ఇట్టి
పవిత్ర
జ్ఞానసిద్ధికి
ప్రయత్నించువాడు
ఈ
లోకములో
వేలాది
సాధకులలో
ఏ
ఒక్కడు
మాత్రమే
యుండును;
అట్టి
ప్రయత్నించు
వేలాది
సాధకులలో
ఏ
ఒక్కడో
నన్ను
పొందుచున్నాడు.
అందరూ
చెందుట
లేదు.
కనుక,
బావా!
నా
కంటే
అధికమైనది,
మరి
ఏ
లోకముననూ
లేదు.
దారమునందలి
పూసలవలె
అన్నియూ
నాయందే
చేరియున్నవి.”
14
▾
Meaning
Keep
“పంచ
భూతములు,
మనో,
బుద్ధి
అహంకారములను
ఎనిమిది
విధములైన
ప్రకృతి
చేతనే
యావత్తు
సూక్ష్మ,
జడ
ప్రపంచమంతయూ
నిర్మితమైనది.
దీనినే
‘అపరాప్రకృతి’
అని
అందురు.
ఇంతియే
కాక
అపరాప్రకృతికి
అన్యముగా
నా
ప్రకృతి
వేరు
ఒకటున్నది.
దానినే
‘పరాప్రకృతి’
అని
అందురు.
ఇది
జడప్రకృతి
కాక
చైతన్యమైన
జీవరూపమున
ఉండును.
అసలు
ఈ
జగత్తంతయూ
దానిని
ధరించియున్నది.
అపరాప్రకృతి
జడమైనది.
పరాప్రకృతి
చైతన్యమైనది.”
15
▾
Meaning
Keep
“భగవంతుడే
మొదలు
జడప్రపంచమును
సృష్టించి
తానే
జీవ
రూపమున
అందులో
ప్రవేశించి
జగత్తును
చైతన్యవంతముగా
చేసెనని
వేదములు,
స్పష్టముగా
తెలుపుచునేయున్నవి
కదా!
అపరాప్రకృతి
పరమేశ్వరుని
స్వభావమనియు,
పరాప్రకృతి
పరమేశ్వరుని
స్వరూపమనియు,
ఈ
స్వరూప
స్వభావములు
భిన్నము
కాదనియు
విశ్వసించవలెను.
చైతన్యమునకు
జడము
స్వాధీనమయి
ఉండును.
చైతన్యము
సర్వస్వతంత్రముతో
నుండును.
16
▾
Meaning
Keep
జడము
అట్లుకాక
పరతంత్రమై
యుండును.
జీవుడనగా
ప్రాణధారణము
చేసేవాడు.
జీవుడు
తన
శక్తి
సామర్థ్యముచే
ప్రాణాన్ని
పట్టియున్నాడు.
జీవుడు
అంతర్యామియై
అన్నింటియందూ
ప్రవేశించియున్నాడు.
కనుక
అపరాప్రకృతి
అనునది
కూడనూ
పరమాత్ముడే.
జడ
చైతన్యములతో
గోచరించునది
ఒకే
వస్తువు
అని
తెలుసుకొనవలెను.
సమస్త
ప్రపంచమునకూ
జడచైతన్యములే
ప్రధానములు.
ఆ
రెండింటి
సమ్మేళన
ఈ
ప్రకృతి
స్వరూపములోనున్న
చైతన్య
శక్తి,
భోక్తగా
స్వకర్మముచే
వాటిని
ధరించును.
జడ
ప్రకృతి
దేహరూపమును
ధరించును.
బావా!
ఈ
రెండూ
నా
ప్రకృతులే
కాన,
వీటి
మూలమున
సమస్త
జగత్తు
యొక్క
సృష్టి,
స్థితి,
లయమునకు
కారణమైన
ఈశ్వరుడను
నేనేనని
తెలుసుకో.
నాకంటే
ఈ
లోకమున
వేరు
పదార్థము
కానీ,
పరమార్థము
కానీ
లేదు.
అన్నింటికీ
మూలకారణము
నేనే.
మూల
వస్తువు
నేనే.
‘ఏకోహం
బహుస్యాం.’
అన్నీ
నేనే
సృష్టి
సంకల్పము
చేసితిని.
ఆ
సంకల్పము
ద్వారా
మాయా
శక్తిలో
చలనం
కలిగినది.
అదే
‘మహత్తత్త్వం’గా
మారింది.
అదే
ప్రకృతి
మొదటి
పరిణామము.
ఒక
విత్తనము
భూమిలో
పాతినామనుకో,
పాతిన
తరువాత
నీరు
పోస్తే,
ఒకటి
రెండు
దినములకు
ఆ
విత్తనము
మెత్తగా
నాని
ఉబ్బిపోవును.
అది
విత్తనమునకు
మొదటి
మార్పు.
కానీ
మొలకరాలేదు.
అదే
మహతత్త్వం
యొక్క
స్వరూపం.
ఆ
తరువాత
భగవంతుని
సంకల్పముచే
అందులోనుండి
ఒక
మొలక
పైకి
కనిపించును.
అదే
‘మహదహంకారం’.
దాని
నుండి
పంచశాఖలు
పుట్టును.
అవే
‘సూక్ష్మ
పంచభూతములు’.
ప్రకృతి
శక్తి
ఒకటి,
మహతత్త్వం
ఒకటి,
అహంకారమొకటి,
ఈ
పంచభూతములు
అన్నియూ
చేరి
ఎనిమిది.
ఈ
ఎనిమిందిటితోనే
జడజగత్తు
ఏర్పడినది.”
Previous
←
The Qualifications of Guru and Disciple
Next
The Ātma Within All Beings, the Tattva of the Support of All
→