Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Ātma Within All Beings, the Tattva of the Support of All
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
భగవానుడైన
శ్రీకృష్ణుడు
ఇంకనూ
ఇట్లు
చెప్పదొడగెను.
“దీనినే
‘అపరాప్రకృతి’
అని
కూడనూ
అందురు.
ఇది
కేవలము
నా
శక్తి
ప్రభావమే,
బావా!
స్థూలదృష్టికి
ప్రపంచమున
అనేకములు
ఉండినట్లు
కనుపించిననూ
అందులో
అనేకములు
లేవు;
ఏక
స్వరూపమే.
‘అంతఃకరణ
వృత్తి’
(దీనినే
‘దృష్టి’
అని
అందురు)
–
ఇది
జ్ఞానమయమయిన,
జగత్తంతయూ
‘బ్రహ్మమయము’గా
తోచును.
కాన
అంతఃకరణ
వృత్తి
జ్ఞానమయము
కావలెను.
జగత్తంతయూ
నిండియుండినది
జగదీశుడే.”
2
▾
Meaning
Keep
‘ఈశావాస్యమిదం
సర్వం’
అని
ఉన్నది.
‘ఉన్నది
ఒకటే’
అయినప్పటికినీ
అనేకములుగా
గోచరించునని
కృష్ణపరమాత్మ
చెప్పిన
విషయములో
మనమొక
ఉదాహరణమును
స్మరింతము.
ఒక
సాయంకాల
సమయమున
మసక
మసక
గల
మబ్బులలో,
మనము
ప్రయాణము
చేయుదారిలో
మధ్య
మడతలు
మడతలుగా
చుట్టుకొన్న
త్రాడు
పడియుండును.
అది
నిజమునకు
త్రాడు
త్రాడుగనే
యున్ననూ
ఆ
దారిని
నడుచు
ప్రయాణీకులు
ఒక్కొక్కరూ
ఒక్కొక్క
విధమైన
వస్తువుగా
భ్రాంతి
పడుదురు.
ఒకరు
అది
దండ
అని
తలంచి
దాటిపోదురు.
మరొకరు
జలధార
అని
తలంచి
త్రొక్కి
పోదురు.
మరొకరు
ఏదో
తీగపడినదని
తలంతురు.
మరికొందరు
పామో,
యేమో
అని
దూరము
దూరమే
నిలచి
పరీక్షింతురు,
భయపడుదురు.
కదా!
3
▾
Meaning
Keep
అటులనే
పరబ్రహ్మ,
తన
స్వరూపమునకు
భంగము
లేకనే
మాయ
వలన
నానా
నామ
రూప
ప్రపంచముగా
భాసిస్తాడు.
ఎన్ని
రకములుగా
కనుపించిననూ,
భావించిననూ,
భ్రమించిననూ
త్రాడు
తప్ప
అన్యమెట్లు
కాదో,
అటులనే
భగవంతుని
యెన్ని
విధములుగా
తలంచి,
భావించి,
భ్రమించిననూ,
అతను
“బ్రహ్మము”
తప్ప
అన్యము
కాడు.
పరమాత్ముడు
అన్నింటికీ
ఆధారమైయున్నాడు.
అతని
ఆధారము
లేక
ప్రపంచము
నిలువజాలదు.
పూలమాలకు
దారమెట్లు
ఆధారమో,
కట్టిన
అంతస్థుల
మేడకు
పునాది
యెంత
ఆధారమో,
పరమాత్ముడు
కూడనూ
జీవులను
పూలకూ,
ప్రకృతి
సౌధమునకూ
అంత
ఆధారము.
అయితే
పూలమాలలోని
పూలూ,
కట్టిన
అంతస్థుల
మేడ
ముందు
కనుపించును
కానీ,
మాలలోని
దారము,
భూమిలోని
పునాది
ముందుగా
కనుపించదు.
కనుపించనంత
మాత్రమున
అవి
లేవనరాదు.
వాటి
ఆధారమే
లేకున్న
పూలమాల
లేదు,
అంతస్థుల
భవనమూ
లేదు.
4
▾
Meaning
Keep
అయితే,
వాటిని
మనము
చూడవలెనన్న
కొంత
విచారణ
అవసరము.
పరిశీలన
చేయక
అవి
కనుపించవు.
మాలలో
పరిశీలించి
చూచిన
దారము,
భూమిలో
త్రవ్విచూచిన
పునాదులూ
మనకు
తెలియునే
కానీ
కనుపించు
పై
అంతస్థులందూ,కట్టిన
పూలమాలపైనా
–
పునాదులు,దారము
కనుపించవు.
కనుక
పాఠకులారా!
కనుపించు
ఆధేయాన్ని
మనము
ప్రధానముగా
తీసుకొని
అంతటితోనే
ఉండి
మన
బుద్ధిని
పరిశీలనకు
దింపకున్న
మనకు
సత్యమేమాత్రమూ
తెలియదు.
కనుపించిన
దానికి
కనుపించని
ఆధారమొకటున్నదని,
దీనిని
తెలుసుకొనుటకు
విచారణ
సలుపుట
చక్కని
మార్గము.
దీనిని
అనుభవమునకు
తెచ్చుకొనువారలకు
అనేక
విధముల
చెప్పనవసరము
లేదు.
అంతే
కానీ
పూసలైన
జీవుల
యోగ్యతా,
అయోగ్యతా
మనకు
ప్రధానము
కాదు.
దీనికి
ఆధారమైన
‘సూత్రము’
బ్రహ్మము;
అదే
మనకు
ప్రధానము.
కేవలము
మాల
అందమునకు
అయోగ్యమైన
పూవులు
కూడనూ
చేర్చవచ్చును.
అనగా
జీవులు
తామసిక,
రాజసిక,
సాత్త్వికములైన
భేదములతో
ఉన్ననూ
పరమాత్మ
వాటిని
పాటించక
అతీతస్థాయిలో
సత్య
నిత్య
నిర్మలుడై
నిండియుండును.
దండకు
దారము
అండయై
యుండును.
దారము
లేక
పూవులు
దండ
కాలేవు.
అటులనే
బ్రహ్మములేక
జీవులను
వేరుచేయ
వీలులేదు,
సాధ్యము
కాదు.
5
▾
Meaning
Keep
ప్రపంచమున
సర్వ
పదార్థములందూ,
పంచభూతములయందూ
తను
నిండియండియూ,
పైకి
గోచరముకాక
అంతర్యామియై
అన్నింటిలో
ఉన్నాడు.
అందుకనే
కృష్ణపరమాత్మ,
“జలములో
నేను
రసస్వరూపముగను,
సూర్యచంద్రాదులలో
ప్రకాశముగను,
వేదములో
ప్రణవముగను,
ఆకాశమందు
శబ్దముగను,
మానవులయందు
శక్తి,
పౌరుషముగనూ
ఉన్నాను”
అని
తెలిపెను.
ఇక్కడ
ప్రణవ
విషయము
విచారింతుము.
వేదములకు
ప్రణవము
జీవమని
అన్నాడు
కదా!
వేదములు
అనాదివని
ప్రసిద్ధి.
అనాది
అయిన
వేదములకు
ప్రణవము
ప్రాణమన్న
ఇక
సృష్టికి
ఆ
పవిత్ర
ప్రణవమెంత
ప్రధానమో,
బుద్ధిమంతులు
బాగా
యోచించవచ్చును.
ప్రతివస్తువు
యొక్క
సూక్ష్మ
స్వరూపమూ
ప్రణవమనే
భావించవలెను.
6
▾
Meaning
Keep
ప్రపంచమందలి
సర్వ
పదార్థములూ
రెండు
భాగములుగానున్నవి.
అవియే
రూప
నామములు.
ఈ
రూప
నామములను
తీసివేసిన
ప్రపంచమే
లేదు.
రూపమును
స్వాధీనము
చేసుకొన్నది
నామము;
నామమును
ఆశ్రయించి
యున్నది
రూపము.
ఇందులో
ఏది
నిత్యము,
ఏది
అనిత్యము
అని
యోచించిన,
నామము
నిత్యము;
రూపము
అనిత్యము.
లోకమున
ఎన్నియో
సత్కార్యములను
చేసి
కొన్ని
ఘనకార్యములను
సాధించి
యుండవచ్చును.
కొన్ని
వైద్యశాలలో,
విద్యాసౌకర్యములో,
భగవన్మందిరాలో,
అనేక
ప్రజా
ప్రధాన
సదుపాయములు
చేసియుండవచ్చును.
కానీ,
వారు
నేడు
స్వరూపకముగా
లోకములో
లేనప్పటికినీ
వారు
చేసి
సాధించిన
కార్యములు,
కర్మలు
లోకమున
నేటికినీ
నిలచియున్నవి
కదా!
రూపము
కొంతకాలముండి
పోయిననూ,
నామము
మరికొంత
యెక్కువ
కాలము
నిలచియుండును.
నామములు
అసంఖ్యాకములయినప్పుడు
స్వరూపములూ
అసంఖ్యాకములయి
ఉండును.
అయితే
యిచ్చట
మనకు
నిత్యానుభవమునందు,
పండితుని
మొదలు
పామరుని
వరకూ
సులభముగా
అర్థమయ్యే
అక్షరములను
విచారింతుము.
తెలుగునందు
చూచిన
యెడల
యేబదిరెండు
అక్షరములు,
ఆంగ్లమునందు
చూచిన
ఇరువది
ఆరు
అక్షరములు.
లోకంలో
గొప్ప
గొప్ప
సాహిత్యములన్నింటినీ
కొండలు
కొండలుగా
కుప్పలు
వేసిననూ,
ఈ
తెలుగు
నందు
గల
యేబదిరెండు
అక్షరములే
తప్ప
మరేమీ
ఎక్కువ
ఉండవు.
ఆంగ్లమున
చూచిన
ఇరువది
ఆరు
అక్షరములే
తప్ప
క్రొత్తవేవీ
అందులో
లేవు,
రావు.
అటులనే,
మానవుని
దేహమందు
కూడనూ,
ప్రాముఖ్యమైన
ఆరు
నాడీ
కేంద్రములు
ఉన్నవి.
అవి
కమలాకారమును
చెంది
ఉండును.
ఆ
ఆరు
కమలాకారములు
చేరి
మొత్తము
యేబదిరెండు
రేఖలు
ఉండును.
ఒక్కొక్క
రేఖపై
కూడా
ఒక్కొక్క
అక్షరము
ఏర్పడియుండును.
వాయించు
హార్మోనియంలో
ఉండు
‘రీడ్సు’
వలె
ఒక్కొక్క
రేఖయు
కదలు
సమయమున
ఒక్కొక్క
విధమైన
శబ్దము
బహిర్గతమగుచుండును.
ఇచ్చట
బుద్ధిమంతులకు
ఒక
సందేహము
కలుగవచ్చును.
ఈ
రేఖలందలి
అక్షరములు
కదవలెనన్న
ఏదో
ఒకటి
కదలించు
శక్తి
ఆధారమై
యుండును
కదా!
అది
నిజమే.
ఆ
కదలించు
శక్తియే
‘ప్రణవము’.
ఇది
అనాహతమైన
ధ్వని.
ఇది
అప్రయత్నముతో
కలుగును.
ప్రయత్నములతో
కలిగే
ధ్వనిని
ఆహత
ధ్వని
అని
అందురు.
7
▾
Meaning
Keep
దారములో
పూసలు
గ్రుచ్చబడినట్లు
అనాహత
ధ్వనియైన
ప్రణవములో
వేదములను
పూసలు
గ్రుచ్చబడినవి.
రసస్వరూపమైన
తనలో
జలము
చేర్చబడినది.
ఇట్టి
సర్వాధారమైన
ప్రణవములోనే
మనస్సును
లీనము
చేయవలెననే
కృష్ణపరమాత్మ
యొక్క
బోధ.
శబ్దములో,
మనసును
లయము
చేసే
స్వభావము
కలదు.
మనసు
ఏది
చూచితే
అది
అంతా
కావాలని
కోరేది.
ప్రతి
దానినీ
ఆశించడమే
దానికి
పని.
అట్టి
చంచల
మనసునే
శబ్దమున
లయము
చేయవచ్చును.
అందువలననే
మనసును
సర్పమునకు
పోల్చిరి.
8
▾
Meaning
Keep
పాముకు
రెండు
పిచ్చి
గుణములు
కలవు.
ఒకటి
వంకరి
టింకరి
నడక,
రెండవది
చూచినదానినంతా,
అద్దము
వచ్చిన
వాటినన్నింటినీ
కరచుట.
ఈ
రెండునూ
మానవునకు
అక్షరాలా
ప్రత్యక్షమగుచున్నవి.
చక్కని
నడకలేదు.
చూచినవన్నింటినీ
పట్టుకొనుటకు
ప్రయత్నించుట.
9
▾
Meaning
Keep
అయితే
పాములో
ఒక
పవిత్రమైన
స్వభావమున్నది.
అది
ఏదన,
నాగస్వరము
పట్టిన,
ఎట్టి
విషసర్పమైనా
ఆనందముగా
అందులో
పడగవిప్పి
ఆడుతూ,
తన
సర్వస్వమునూ
ఆ
స్వరమున
లీనము
చేయును.
అటులనే
మానవునిలో
‘అభ్యాసము’
ద్వారా
ప్రణవములో
మనసును
లీనము
చేయవచ్చును.
కనుక
శబ్దోపాసన
పరమాత్ముని
పొందుటకు
ప్రధాన
మార్గమై
యున్నది.
శబ్దమే
పరమాత్మ.
అందుకనే
“మానవునియందలి
పురుషార్థ
శక్తిని
నేనే”
అని
పరమాత్ముడు
తెలిపెను.
పురషకారమే
మానవుని
ప్రాణము.
అట్టి
పురుషకారమునకు
ప్రాణమే
లేకున్న
మానవత్వమే
లేదు.
ఎట్టి
ప్రారబ్దమయిననూ
పురషకారమునకు
అణిగి
మణగి
ఉండవలసినదే.
ప్రారబ్దమున
కంటే
పురుషకారము
ముందుగలదు.
ఇది
తెలియక
‘ప్రారబ్దము
ప్రారబ్దమని’
ప్రారబ్దమును
పట్టి
ప్రాకులాడుదురు,
వెట్టి
మానవులు!
ప్రతి
మానవుడూ
పురషకారమును
అనుసరించియే
తీరవలెను.
చేయకుండిన,
అట్టివాడు
లోకమున
అరనిమిషము
కూడనూ
నివసించలేడు.
ఈ
లోకమున
పురుషార్థమును
అనుసరించి
దాని
శక్తిలో
ధన్యుడవు
కమ్మనే
మానవుని
పరమాత్మ
సృజించెను
కాని,
ఊరికే
తిండికి
చేటు,
భూమికి
బరువుగా,
సార్థకము
కాని
పనులతో,
పశువాంఛలతో
భోగములు
అనుభవించమని
పంపలేదు.
సోంబేరివై,
నడుమువంచి
పని
పాటులు
చేయక,
కండలు
పెంచుకొని
లొట్టలు
కొడుతూ
దిట్టముగా
బలవమని
పంపలేదు.
10
▾
Meaning
Keep
పరమాత్ముని
మరచి,
ఆత్మవిశ్వాసమును
కోల్పోయి,
పశువులవలె
జ్ఞానహీనునివై
అనుభవించునంత
వరకూ
ఆ
ఫలితమును
స్మరించి
తదుపరి
దానికి
కృతజ్ఞతే
లేక
క్రూరుడవై
తిరుగమని
సృష్టించలేదు.
ప్రకృతి
అంతయూ
పరమాత్మ
రూపముగా
భావించి,
విశ్వసించి,
చక్కగా
వినియోగించుకొమ్మని
కూడా
తెలిపెను.
కానీ,
“ఇది
నాది,
అది
నాది,
నా
వారిది”
అని
అహంకారముతో
ప్రకృతిని
వినియోగించుకొంటూ
ప్రకృతి
యొక్క
చట్టమును
ఉల్లఘించి
తన
ఇచ్ఛానుసారము
ప్రవర్తించు
వారికి
ప్రకృతే
తగిన
ప్రాయశ్చిత్తము
చేయును.
పతనానికి
దారితీయును.
అందుకనే
కృష్ణపరమాత్మ
తనను
ఉపాసించు
విషయమును
విపులముగా
అర్జునునకు
తెలుపుచున్నాడు.
11
▾
Meaning
Keep
“బావా!
అనేకమంది
నన్ను
ఉపాసించుటకు
కారడవులకు
పోవుచుందురు;
అది
ఒక
విధమైన
వెర్రితనము,
మూఢనమ్మకము.
ఉపాసించవలెనన్న
ఎక్కడో,
ఏ
అడవులకో
పోనవసరములేదు.
నేను
లేని
స్థానముకాని,
నాది
కాని
రూపము
కాని
లేదు.
పంచభూతములూ
నేనే.
ఏ
భూతమూ
లేనిచోటు
ఎచ్చట
ఉన్నది?
అంతటా
నిండియున్న
నన్ను
అనుభవించుటకు
ప్రత్యేకించి
ఒక
స్థానమనునది
లేదు.
విను!
భూమిలోని
గంధము
నేను.
అగ్ని
యందలి
తేజస్సు
నా
స్వరూపం.
సర్వ
భూతములలోని
జీవినీ
నేనే
అయి
ఉన్నాను.
ఇంతియేకాక,
బలవంతులలోని
కామ
రాగ
రహితమైన
బలమూ
నేనై
ఉన్నాను
(ఇచ్చట
బలమనగా
బుద్ధి
బలమని
తలంచవలెను).
సర్వభూతములలోని
ధర్మమునకు
విరుద్ధము
కాని
కామము
నా
స్వరూపముగా
నున్నది.
లోకమున
అనేక
విధములైన
బలములున్నవి;
ధనబలము,
బుద్ధిబలము,
విద్యాబలము,
జనబలము,
మనోబలము,
దేహబలము
అని
కలవు.
ఇవన్నియూ
పరమేశ్వరుడనైన
నా
బలమనే
భావించవలెను.
కానీ
అవి
కామ
రాగ
రహితమై
ఉండవలెను.
అట్టివి
మాత్రమే
భగవత్
స్వరూపములనబడును.
అట్లుకాక
కామ
రాగ
సహితమైన
బలములు
పశుబలములనవచ్చును;
కాని
పశుపతి
బలము
కానేరదు.
కామమనగా
లభించే
అవకాశము.
దాని
చిహ్నములు
కనుపించకున్ననూ,
లేకపోయిననూ
వస్తువును
కోరే
ఆశనే
‘కామ’మందురు.”
12
▾
Meaning
Keep
“ప్రాప్తించిన
వస్తువు
స్థిరమైనది
కాకుండా
నశించిపోయే
దయినప్పటికినీ
దానిని
గట్టిగా
స్థిరముగా
తనకే
ఉండవలెనను
పట్టుదలనే
‘రాగము’
అని
అందురు.
రంజననే
రాగమందురు.
ఇట్టి
కామ
రాగములను
రెండింటితోను
దూషితమైన
‘బలము’
భగవత్
బలము
కాదు.
అయితే
కొన్ని
కొన్ని
స్థానబలమును
పట్టి,
విశేషబలమును
పట్టి
యోగ్యత,
అయోగ్యతలను
పొందును.
ఉదాహరణమునకు
ఒక్కటి
చూతము.
ధనమున్నది.
అది
దుష్టునిచేరి
మదకారణమౌతుంది.
సజ్జనులను
చేరి
దానధర్మములగు
సత్కర్మలకు
ఉపయోగమవుతుంది.
అటులనే
బలము
దుర్మార్గుల
చెంత
చేరి
పరపీడనకు
ప్రాకుతుంది.
సజ్జనుల
చెంత
చేరి
పరరక్షణకు
ప్రయోగింపబడుతుంది.”
13
▾
Meaning
Keep
ఇచ్చట
మరొకటి
గమనించవలెను.
ధర్మవిరుద్ధ
కామ,
క్రోధ,
లోభములు
కూడనూ
భగవత్
స్వరూపములని
కృష్ణపరమాత్మ
అన్నాడు.
కానీ,
వేయేటికి?
“సర్వభావములూ,
సర్వరూపములూ,
సర్వ
వస్తువులూ
నా
అపరా
పరాకృతి
వల్ల
సంభవించినవే”
అని
అన్నాడు.
కానీ,
ఉపాసకునకు
ఉత్తమ
భావనలేర్పడే
కోసం
మొట్టమొదట
ఉత్తమభావం,
ఉత్తమరూపం
ఉత్తమభూతంలో
నా
స్వరూపమని
తెలిపెను.
ఇంత
మాత్రమునకే
మంచిది
మాత్రము
భగవత్
స్వరూప
లక్షణములనియూ,
తతిమావన్నియూ
కాదనియూ
తలంచుట
తత్త్వజ్ఞానము
కాదు.
త్రిగుణములయిన
రాజసిక,
తామసిక,
సాత్త్విక
వస్తువులూ,
భూతములూ,
భావములూ
భగవంతునియందే
ఉద్భవించినవి
అని
స్థిరము
చేసుకొనుటకు
విచారణా,
ప్రయత్నమూ
జరుపవలెను.
14
▾
Meaning
Keep
ఆ
భగవంతుడే
స్వయముగా
తెలిపెను:
“అర్జునా!
అన్నియూ
నా
యందే
పుట్టి,
నా
యందే
ఉండును.
కాని
నేను
మాత్రము
వాటి
అధీనమందుండక
వాటితో
ఏ
సంబంధము
లేనివానివలె
యుండును.”
ఇచ్చట
రెండు
దృష్టులు
కలవు.
ఒకటి
జీవ
దృష్టి.
రెండవది
భగవత్
దృష్టి.
జీవ
దృష్టిలో
చూచినపుడు
మంచిచెడ్డలను
ద్వంద్వాలు
కలవు.
భగవత్
దృష్టిలో
చూచినపుడు
ద్వంద్వములు
లేక
సర్వమూ
భగవంతుడే,
మరేమీ
లేదని
సర్వ
భూతాంతరాత్మ
తత్త్వమును
బోధించెను.
15
▾
Meaning
Keep
ఈ
విషయమున
సామాన్య
మానవులకు
కొంత
సందేహమునకు
స్థానము
కలుగవచ్చును.
సమస్త
మంచి
చెడ్డలకు
తానే
కారణమనియు,
సర్వమూ
తననుండే
పుట్టినవనియు,
అట్లుండియూ
వాటి
దోషములు
తననేమాత్రము
బంధించుట
కానీ,
బాధించుట
కానీ
చేయవనియూ,
వాటితో
తనకేమీ
సంబంధము
లేదనియు,
అన్నింటికినీ
అతీతమై
యున్నాననియూ
తెలుపుటలో,
మానవుడు
చేయు
మంచి
చెడ్డలకు
మానవుడు
ఏ
మాత్రమూ
కర్తకానీ,
కారణము
కానీ
కాదనియూ,
ఎట్టి
మంచి
చెడ్డలయిననూ
భగవంతుని
ప్రేరణవలననేననియూ,
మానవుడు
ఎట్టి
పాప
పుణ్యములకూ
బాధ్యుడు
కాదనియూ
తలంచ
వచ్చును.
నిజమే.
అయితే,
ఇట్టి
విశ్వాసము,
నిశ్చలమైన,
నిర్మలమైన,
నిస్వార్థమైన
ప్రేమ,
పరమాత్మునిపై
కలిగి
యుండిన
ఇంతకంటే
ధన్యము,
పుణ్యము
మరేమున్నది?
తెలిసికొనవలసినదీ,
స్థిరము
చేసుకొనవలసినదీ
ఇదే.
“సర్వమూ
భగవంతుడే.
నాకు
ఏ
మాత్రమూ
ఈ
లోకములో
కానీ,
భావములో
కానీ
సంబంధములేదు.
నేను
వీటన్నింటికీ
అతీతమైనవాడను”
అని
ఏ
మానవుడు
తెలిసికొనునో
వాడే
‘సత్యజీవి’.
అయితే
మాటల్లో
మాత్రము
“సర్వము
భగవంతుడే.
నేనతని
చేతిలో
కీలుబొమ్మ.
అతని
అధీనంలో
నున్నవాడను,
నాదేమీ
లేద”
ని
చిలుక
పలుకులు
పలుకుచూ,
మంచిదానిని
మాత్రము
“నేనే
చేసినది”
అనియూ,
చెడ్డ
మాత్రము
“భగవత్
ప్రేరణ”
అనియూ,
కీర్తిమర్యాదలూ,
గౌరవప్రతిష్ఠలూ
వచ్చు
పనులూ,
ఉపదేశములూ
“నా
సాధనా
శక్తి,
నా
కల్పితము”
అని
సభలో
గొంతు
చించుకొని
అరచటము,
తప్పులో,
అపకీర్తిలో,
అగౌరవములో
జరిగిన
అన్నియూ
“నావి
కాదు,
నేను
నిమిత్త
మాత్రమైనవాడను,
సర్వమూ
భగవంతుడు
చేయించుచున్నాడు”
అని
అనుట
నేటి
మానవులకు
పరిపాటైనది.
అది
ఒక
నూతన
“ఫ్యాషన్”
కూడా!
ఇట్టి
గడియారం
“పెండ్యులం”
వంటి
మాటలు,
ఆటలు,
సత్యములు
కాలేవు.
మనోవాక్కాయ
కర్మలందు
కూడా
సర్వమూ
భగవంతుని
లీలావిభూతియే
అను
దృఢవిశ్వాసమును
కలిగియుండుట
చక్కటి
తత్త్వము.
మంచి
చెడ్డలు
మానవుని
దృష్టి
దోషములే;
వీటిని
భగవంతుని
యందు
నిరూపించుట
ధర్మవిరుద్ధము.
16
▾
Meaning
Keep
అట్టి
లోపములు
భగవంతుని
కూడనూ
ఆవరించినటుల
అప్పుడప్పుడు
తెలియుచుండును,
అగుపించును.
కానీ,
అవి
సత్యములు
కావు.
మేఘములు
ఆకాశమునందే
పుట్టినవి.
అందే
సంచరించుచున్నవి.
అయితే
ఆకాశము
మేఘములను
ఆశ్రయించి
ఉన్నదా?
లేదు.
పొగ
నిప్పునందే
పుట్టినది
కానీ,
నిప్పు
పొగనాశ్రయించి
యుండలేదు.
అటులనే
గుణములు
పరమాత్మ
యందే
పుట్టిననూ,
పరమాత్ముడు
గుణముల
నాశ్రయించి
యుండలేదు.
పై
జెప్పినట్లు
పూసలు,
వూవులు
దారము
నాశ్రయించియుండినట్లు
సర్వమూ
తనలో
తననే
ఆశ్రయించి
యుండును.
తాను
భూతములను
కాని,
వస్తువులను
కాని,
గుణములను
కాని
ఆశ్రయించి
యుండలేదు.
ప్రపంచమంతయూ
పరమాత్మలోనే
ఉన్నది.
కాని
పరమాత్మ
ప్రపంచమును
ఆధారముగా
తీసుకొనలేదు.
ఎట్లన,
ఇపుడొక
వస్త్రము
ఉన్నదనుకొనుడు;
వస్త్రము
దారమునాశ్రయించి
యున్నది
కాని
దారము
వస్త్రమునాశ్రయించి
లేదు.
మట్టినాశ్రయించి
కుండ
ఉన్నది
కానీ
కుండనాశ్రయించి
మట్టిలేదు.
మట్టి
వేరూ,
కుండ
వేరూ
కాదు.
దారము
వేరూ,
వస్త్రము
వేరూ
కాదు.
మట్టి
బ్రహ్మము,
కుండ
ప్రకృతి.
దారము
బ్రహ్మము,
వస్త్రము
ప్రకృతి.
ఆకారము
వికారములు
ఎన్నిమారినా
మట్టి
మట్టిగానే
యుండును.
దారము
దారముగానే
ఉండును.
మట్టి
లేక
కుండ
కాలేదు.
దారము
లేక
వస్త్రము
కాలేదు.
అటులనే
బ్రహ్మము
లేక
ప్రకృతి
కాలేదు.
బ్రహ్మమను
దారమును
ఆధారము
చేసుకొని
వస్త్రమను
ప్రకృతిగా
తయారైనది.
దీని
వలన
అన్నింటియందూ
సర్వత్రా
పరమాత్ముడున్నాడనుటలో
ఎంతో
ఆనందమున్నది.
అన్ని
పూసలయందూ
దారమున్నదనుట
కంటే
పూసలన్నియూ
దారమందే
యున్నవనుట
యెంతటి
సత్యము!
ఎంతటి
తత్త్వము!
కాన
“సర్వభూతాంతరవర్తి”యని
పరమాత్ముని
పిలుచుటకంటే,
“సర్వాధారము”
అని
పిలుచుట
సార్థకము,
సత్యము.
Previous
←
Dhyāna Yoga, the Inner Sādhana for Jñāna Yoga
Next
The ‘Jñāni’ Is Most Dear to the Paramātma
→