Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The ‘Jñāni’ Is Most Dear to the Paramātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రపంచమంతయూ
‘ఆధేయము’,
పరమాత్ముడు
‘ఆధారుడు’.
లోకమున,
ఆధారమును
అంత
యోచించక
ఆధేయమునే
ప్రధానముగా
ఆశింతురు.
“ఆధారము
లేక
ఆధేయముందునా?”
అని
యైననూ
ఆలోచించకున్నారు.
ఇది
కూడానూ
‘దృష్టి
దోష’మనే
చెప్పవచ్చును.
దృష్టి
దోషము
కుదిరిన,
సృష్టి
కర్త
అగుపించును.
2
▾
Meaning
Keep
ఈ
విషయమునే
ఒక
పర్యాయము
అర్జునుడు
కృష్ణుని
ప్రశ్నించినాడు.
“కృష్ణా!
దృష్టి
దోషమనేదేమో
నాకు
విశదముగా
తెలుప”మనియు,
“అట్టి
దోషమునకు
కారణము
కూడనూ
తెలుప”మనియూ
అడిగినాడు.
అర్జునుడు
మాత్రము
సామాన్యమైన
వ్యక్తి
కాదు.
చెప్పినవన్నింటిని
వివేకశూన్యుడై
ఊకొట్టుట
లేదు.
తనకేమైన
సందేహములు
అడ్డు
తగిలిన
వెంటనే
భగవంతుని
మాటలకే
అడ్డు
ప్రశ్న
వేస్తూ
వచ్చే
ధైర్యశాలి,
గుణశాలి.
సామాన్య
మానవులవలే
అనుభవ
పూర్వకమైన,
శాస్త్రసమ్మతమైన,
సమాధానములు
చిక్కు
వరకూ
కృష్ణుని
సతాయించెడివాడు.
3
▾
Meaning
Keep
వెంటనే
పరమాత్ముడు
చిరునవ్వుతో
సమాధానములందించెడివాడు.
ఇప్పుడునూ
ఈ
దృష్టిదోషమునూ,
అందుకు
కారణమునూ
ఇట్లు
తెలుపుటకు,
“బావా!
విను.
ఈ
లోకమునకూ
నాకూ
మధ్యలో
‘మాయ’
అను
భ్రాంతి
తిరుగుచుండును.
దానిని
మానవులు
జయించుట
కష్టము.
అదియును
నాదే.
మాయయన్న
నాకు
భిన్నమైనది
కాదు.
నా
సృష్టిలోనిదే,
నా
వశమైనదే.
అది
యెట్టి
వారినైననూ
ఒక్క
నిమిషములో
తలక్రిందులు
చేయును.
‘దానిని
జయించుట
అంత
కష్టమా?’
అని
నీవు
కూడనూ
తలంచవచ్చును.
కష్టమే.
నీవు
కూడనూ
వాయువును
సులభముగా
జయించితివి
కానీ,
మాయను
జయించలేవు.
అది
అంత
తేలికయైన
పనికాదు;
జయించలేవు.
ఎవరు
నన్ను
సంపూర్ణముగా
ఆశ్రయించియుందురో
అట్టివారు
మాత్రమే
ఈ
మాయను
జయించగలరు.”
4
▾
Meaning
Keep
“మాయనగా
వేరేమీ
నూతనముగా
వచ్చి
చేరునట్టి
వికార
స్వరూపము
కాదు,
బావా!
నిత్యసత్యమైన
పరమాత్మను
మరచి,
గుణకార్యములైన
నామ
రూప
పదార్థములే
నిజమని
యెంచుటే
మాయ
యొక్క
గుణము.
దేహియైన
ఆత్మ
తాననుకోక,
దేహమే
తాననుకొనుట
మాయ
యొక్క
స్వభావము.
మాయ
అనునది
ముందు
ఉండి
తరువాత
పోవునది
కానీ,
లేనిది
తరువాత
వచ్చి
చేరుననుది
కానీ
కాదు.
ఇది
ఎప్పుడూ
లేదు;
లేని
వస్తువే
మాయ.
అయితే
కనుపించును.
ఇది
ఎండమావుల
జలమువలే
కనుపించును.
అవి
నీరూ
కాదు,
పుట్టనూ
లేదు.
వాటి
సత్యమును
తెలిసికొనిన
వారిని
అవి
ఆకర్షించలేవు.
తెలియని
వారిని
జలభ్రాంతి
కలిగించి,
అనేక
విధముల
శ్రమింపజేయును.
అశాంతిని
కలిగించును;
నిరుత్సాహమును
పుట్టించును.
చీకటి,
ఇంటిలోనే
పుట్టి
ఇంటినే
ఆవరించునటుల,
పాచి
నీటియందే
పుట్టి
నీటినే
ఆవరించునటుల,
కంటిపొర
కంటియందే
పుట్టి
కంటిని
కప్పినటుల,
మాయ
కూడనూ
సామాన్యమైనది
కాక
యెవరియందు
పుట్టునో
వారినే
ఆశ్రయించును.
త్రిమూర్తిని,
త్రిగుణాలనూ
ఆవరించును.”
5
▾
Meaning
Keep
“కానీ,
జీవ
భ్రాంతి
కలవారు
దీనికి
వశులగుదురు.
తత్త్వ
దృష్టి
కలవారు
దీనికి
అతీతులగుదురు.
అట్టి
వారిని
అది
ఆవరించలేదు.
తత్త్వ
వస్తువులను
గోచరించకచేయును
కానీ,
తత్త్వ
జ్ఞానులను
చేరలేదు.
బావా!
ఎక్కడ
పుట్టినదో,
ఎవరిలో
పుట్టినదో
వారినే
ఆవరించునని
మాయను
గురించి
చెప్పిన
విషయమును
పురస్కరించుకొని,
‘నీలోనే
పుట్టిన
మాయ
నిన్ను
మాత్రము
ఆవరించలేదా?’
అని
నీవనవచ్చును.
సంశయము
కలుగవచ్చును.
అది
పొసగదు.
మాయ
సర్వజగత్తుకూ
ఉపాదాన
కారణము.
సర్వేశ్వరునికి
కారణము
కాదు.
నేను
మాయాధికారిని,
మాయావరణము
జగత్తు.
మాయ
నన్ను
ఆశ్రయించి
నా
ఆజ్ఞలో
నిలచియుండును.
నన్ను
ఆశ్రయించి
నా
ఆజ్ఞలో
ఎవరుందురో,
వారికి
కూడనూ
మాయ
దాసురాలై
దోసిలొగ్గును.”
6
▾
Meaning
Keep
“పరమాత్మ
జ్ఞానమువలననే
దానిని
దాటవచ్చును
కానీ,
అన్యమార్గముల
దాటలేరు.
ప్రాణధర్మమును
పరమాత్మపై
ఆరోపించుటే
మాయ!
సుఖదుఃఖములు
–
మనోధర్మములు;
జననమరణములు
–
దేహధర్మములు;
ఆకలి
దప్పులు
–
ప్రాణధర్మములు.
ఇవి
అనాత్మ
ధర్మములు
కానీ
ఆత్మధర్మములు
కావు.
అనాత్మ
ధర్మములను
ఆత్మయందు
ఆరోపించుటే
మాయ.
ఇది
నన్ను
శరణుజొచ్చిన
వారి
చెంతకు
కూడనూ
పోలేదు.
మాయ
వైపున
చూపు
పెట్టి
చూచువానికి
మాయ
అపారమైన
సాగరమువలే
అడ్డువచ్చును.
పరమాత్మవైపున
చూపుపెట్టి
చూచువారలకు
మాయయే
మాధవుడై
సాక్షాత్కరించును.
భగవదైక్య
భావముతో
కానీ
శరణాగతితో
కానీ,
మాయ
ప్రతిబంధాన్ని
అతిక్రమించవచ్చు;
ఒకదానిని
జ్ఞానమార్గమనియూ
మరొకదానిని
భక్తి
మార్గమనియూ
పిలుతురు.”
7
▾
Meaning
Keep
లోకమున
సామాన్య
మానవులకు
భగవంతుని
శరణుజొచ్చి
మాయను
జయించవలెనను
బుద్ధి
పుట్టదు.
అది
వారి
వారి
జన్మాంతర
సుకృత
దుష్కృతములను
పట్టి
ఉండును.
దుష్కృతులు,
కేవలము
భోగలాలసులై
క్షణానందమునకు
ప్రాకులాడుచుందురు.
పశుపక్షి
మృగములవలే
తిని
తిరుగుచూ
తాత్కాలిక
ఆనందములతో
తందనాలాడుచుందురు.
ఇట్టిదే
జీవిత
లక్ష్యమని
భావించి
దైవ
చింతనే
లేక,
సత్సంగమన్న
అసహ్యించుకొనుచూ,
సదాచారమన్న
గిట్టనివారై
వట్టి
భ్రష్టులగుచుందురు.
8
▾
Meaning
Keep
ఇక
సుకృతులు,
నిరంతరము
సద్గుణ,
సదాలోచన,
సర్వేశ్వర
చింతనలతో
భగవదాసక్తులై
ఆరాటపడుచుందురు.
అట్టివారు
ఆర్తులు
కావచ్చు.
అర్థార్థులు
కావచ్చు,
జిజ్ఞాసువులు
కావచ్చు.
వీరి
జన్మజన్మాల
పుణ్యకర్మలే
వీరికిట్టి
స్వభావములు
కలిగించును.
సంస్కారముతో
ఈ
జన్మయందు
కూడనూ
పుణ్యకర్మలే
ఆచరించిన
సుకృతులు.
కానీ,
గీత
సకామ
కర్మలను
అంగీకరించదు.
నిష్కామకర్మనే
నిర్మోహమాటంగా
అందించుచున్నది.
9
▾
Meaning
Keep
దీనిని
పట్టి
అర్జునుడు
సకామ
బుద్ధి
కలవాడు
కదా?
అతనిని
భక్తుడని
‘గీత’
యే
విధముగ
ఒప్పుకొనునని
కొందరు
శంకించవచ్చును.
కానీ
ఏదో
ఒక
విధమైన
కోర్కెలు
లేని
వారు
లోకమున
ఏ
ఒక్కడూ
కనుపించడు.
వారి
వారి
అభీష్టములను
తీర్చుకొను
నిమిత్తమై
లోకమున
ఎవరినో
ఒకరిని
ఆశ్రయిస్తారు
కదా?
అసలు
కోర్కెలు,
విషయవాసనలు
ఉండుటే
ఒక
తప్పు
(దోషము).
అట్టి
సమయమున
భగవంతుని
మరచి
సామాన్యమైన
సరి
మానవుని
ఆశ్రయించటము
మరొక
తప్పు.
అయితే
భక్తుడు
అటులకాక
తాను
విశ్వసించిన,
ఆరాధించుచున్న
భగవంతుని
తన
అభీష్టములు
నెరవేర్చుమని
ఆశించును,
ఆశ్రయించును.
10
▾
Meaning
Keep
కోర్కె
ఉండుట
ఒక
దోషమైననూ
సరి
మానవుని
ఆశ్రయించక,
సర్వేశ్వరుని
ఆశ్రయించుటలో
రెండవ
దోషము
వానిని
అంటకున్నది.
రెండు
దోషములు
కలవానికంటే
ఒక
దోషము
కలవాడు
ఉత్తమస్థాయికి
చెందినవాడే
కదా!
ఈ
విషయమున,
ఇట్టి
తరుణమున
ఏమి
కోరుచున్నాడను
విషయముకన్నా
ఎవరిని
కోరుచున్నాడను
విషయమునే
ప్రధానముగా
విచారించిన
పవిత్రత
తేలును.
సకామ
బుద్ధితోనైనా
సరే
సరి
వారిని
కోరక,
సర్వేశ్వరుని
వైపున
లక్ష్యముంచునట్టి
వాడు
ఉత్తమ
తరగతివాడే
అని
తెలుపవచ్చును.
అట్టివాడు
భక్తుడే
కాగలడు.
11
▾
Meaning
Keep
ఆర్తి,
అర్థార్థి,
జిజ్ఞాసు,
జ్ఞాని
అనే
ఈ
నాలుగు
విధములైన
భక్తులలో
మొదటి
ముగ్గురు
అయిన
ఆర్తి,
అర్థార్థి,
జిజ్ఞాసులు
భగవంతుని
పరోక్షముగా
భావించి
ప్రార్థింతురు.
అయితే
జ్ఞాని
అట్లుకాక
స్వాత్మ
రూపముగా
అపరోక్షముగా
నెరిగి
సేవిస్తాడు.
అట్టివాడు
సదా
భగవన్నిష్ఠుడై
యుండును.
పై
మొదటి
మూడు
మార్గములవారు,
తమ
తమ
అభీష్ట
ప్రాప్తికోసం
భగవంతుని
సాధనంగా
ఉపయోగించుకొందురు.
12
▾
Meaning
Keep
జ్ఞానిది
ఏకభక్తి.
మిగిలిన
ఆర్తి,
అర్థార్థి,
జిజ్ఞాసులను
మూడు
అవస్థల
వారిది
అనేక
భక్తి
(అనగా
కోరే
వస్తువులయందూ,
విషయములందూ,
భూతములందూ,
భగవంతునియందూ,
అన్నిటియందూ
ప్రేమను
ప్రవహింపజేయుదురు).
అట్టివారు
భగవంతునికే
కాక,
వస్తు
వాహనములకూ
విషయ
విహారములకూ
భక్తులగుదురు.
జ్ఞాని
భగవంతునకు
తప్ప
మరే
ఇతరమైన
వాటిని
కన్నెత్తి
కూడనూ
చూడడు.
చూచిననూ
అతనికి
సర్వమూ
భగవంతుడుగానే
గోచరించును.
అందువలననే
పరమాత్ముడు,
“జ్ఞాని
నాకు
అతిప్రియమైన
వాడు”
అని
తెలిపెను.
భగవంతునకు
అందరూ
సమానమే
అయిననూ,
చెంతచేరి
సన్నిహితులుగా
ఉన్నవారిపై
ప్రేమ
ప్రత్యక్ష
గోచరము,
అనుభవము.
కనుక
జ్ఞాని
భగవంతునికి
అతి
సమీపమున
ఉన్నవాడనే
తలంచవలెను.
13
▾
Meaning
Keep
శీతల
బాధ
తీర్చుట
అగ్నికి
సహజ
గుణము;
అయినప్పటికినీ
దగ్గర
కూర్చొనక
అతి
దూరమున
నుండిన,
వానికి
శీతలమెట్లు
తీర్చును?
అతని
శీతల
బాధను
తీర్చనంత
మాత్రమున
అగ్నికి
శక్తి
లేదని
అర్థము
కాదు.
శీతల
బాధను
తీర్చుకొనవలెనని
అభీష్టమున్నవాడు,
ఎట్లు
అగ్ని
సమీపమున
నివసించవలెనో
అటులనే
అనుగ్రహమను
జ్ఞానాగ్నిని
అనుభవించి
తమ
తమ
ఈతి
బాధలను
శీతలములను
దూరము
చేసుకొనవలెనన్న
అభీష్టము
కలవారు,
జ్ఞానులై
పరమాత్మునికి
సన్నిహితులగుటకు
ప్రయత్నించవలెను.
14
▾
Meaning
Keep
సాధకులలో
కలిగిన
ప్రయత్న
లోపములకు
సర్వేశ్వరుని
అడ్డుపెట్టుకొని,
దేవునకు
పాపులనీ,
పుణ్యులనీ,
జ్ఞానులనీ,
అజ్ఞానులనీ
భేదమున్నదన్న
అవి
అర్థములేని
వ్యర్థ
వూహలు.
భగవంతునికెప్పుడూ
అట్టి
భేదములు
లేవు.
నిజముగా
భగవంతునికే
అట్టి
భేదములే
ఉండియుండిన
పాపులు
లోకమున
ఒక
నిమిషము
కూడనూ
బ్రతుకలేరు.
భగవంతున
కట్టి
భేదము
లేదు.
కనుకనే
అందరూ
లోకమున
బ్రతుకుచున్నారు.
ఇట్టి
సత్యము
జ్ఞానికి
మాత్రమే
తెలియును
కానీ
తక్కిన
వారలకు
తెలియదు.
కనుకనే
దేవుడు
మాకు
దూరముగా
ఎక్కడో
ఉన్నాడని
పిచ్చి
భ్రాంతిలో
పడి
పరితపించుచున్నారు.
15
▾
Meaning
Keep
జ్ఞాని
మాయాతీతుడు,
గుణరహితుడు.
జిజ్ఞాసువు
అట్లుకాక,
అన్య
అపేక్షలకు
చోటివ్వక
నిరంతరము
భగవత్
చింతనలతో,
సత్
ప్రవర్తనలతో,
సదాలోచనలతో
కాలమును
గడుపును.
ఇక
అర్థార్థుడు,
ఆర్తుడు
క్రమక్రమేణ
విషయ
విచారణ
చేసి
సాధనలతో
విశ్వాసములతో
జిజ్ఞాసువులుగా
మారి,
దాని
ద్వారా
జ్ఞానమును
చేరగలుగుచున్నారు.
దానిని
ఆశ్రయించి
తరించుచున్నారు.
16
▾
Meaning
Keep
పై
విధముగ
సాధన
స్థానములు
ఒకదాని
ద్వారా
ఒకటిని
దాటే
గమ్యమును
చేరుదురు.
అట్లు
లేక
ఒకే
పర్యాయము
గమ్యమునకు
యేగవలెనన్న
అది
సాధ్యము
కాదు.
దీనికి
ఒక
ఉదాహరణము.
జ్ఞానమనునది
“త్రూ
రైలు.”
అనగా
అందులో
సాధకుడు
ప్రయాణము
చేసిన
ఎక్కడా
మధ్యలో
దిగనక్కరలేక
తాను
చేరవలసిన
స్థానమును
చేరును.
17
▾
Meaning
Keep
జిజ్ఞాసు
అనునది
“త్రూ
పెట్టె
(క్యారేజి).”
అందులో
ప్రయాణము
చేయు
సాధకుడు
దిగనక్కరలేదు
కానీ
ఆ
పెట్టెను
మరొక
బండికి
తగిలింతురు.
అట్టి
మార్పులుండును.
దాని
ద్వారా
గమ్యమును
చేరును.
ఇక
ఆర్తుడు,
అర్థార్థుడు
అనునది
సామాన్యమైన
రైలు
బండి.
అనగా
త్రూ
రైలూ
కాదు,
త్రూ
క్యారేజీ
కాదు.
ఆ
బండి
పూర్తి
గమ్యము
వరకూ
పోదు.
కనుక
ఆ
బండిలో
ఎక్కిన
సాధకుడను
ప్రయాణీకుడు
మధ్య
మధ్య
బండి
నుండి
దిగి
తరువాత
మరొక
బండికై
కాచుకొని
ఉండి,
ఆ
తరువాత
మరొక
బండి
యెక్కి,
దాని
ద్వారా
గమ్యమును
చేరును.
ఇందులో
ప్రయాణము
చేయువారు
కొన్ని
కష్టములకు,
శ్రమలకు
గురి
కావలసి
వచ్చును.
అయితే
కడకు
గమ్యము
మాత్రము
నలుగురూ
చేరుదురు.
కానీ
కాల
కర్మముల
వ్యత్యాసము.
అందువలననే
భగవంతుడు
“ఈ
నాలుగు
విధముల
వారూ
నా
వారే”
అని
పలుమారులు
తెలుపుచుండును.
కారణమేమి?
గమ్యము
ఒక్కటే
కనుక.
కాన
అల్ప
వస్తువులను
కోరక
అది
దైవమును
కోరుటలో
ఆనందము
మెండు.
“అల్ప
వస్తువును
కోరే
వారు
కృపణులు.
భగవంతునే
కోరు
వారు
ఉదారులు”
అని
కూడనూ
కృష్ణపరమాత్మ
అన్నాడు.
18
▾
Meaning
Keep
జ్ఞాని
భక్తి,
సహజ
భక్తి.
మిగిలిన
వారలది
గౌణ
భక్తి.
జ్ఞాని
తన
ఆత్మనే
పరమాత్మగా
భావించును.
భక్తి
అనగా
అనురక్తి,
అనురాగము.
“హూజ్యేషు
అనురాగో
భక్తిః”
అని
అన్నాడు
కృష్ణుడు.
అనేక
జన్మల
సాధనా
బలమే
చివరకు
జ్ఞానిగా
మార్చును.
జ్ఞానము
కావాలన్న
అప్పటి
కప్పుడు
ఉట్టిపడునది
కాదు.
ఇది
ఒక
షాపులోని
వస్తువు
కాదు,
సంతలోని
సరుకు
కాదు.
జన్మాంతర
సాధన
యొక్క
సారమే.
ఒక్కతూరి
అనేకమంది
చక్కని
డాక్టర్లు
కావాలని
ఆశింతురు.
దానికి
పూర్వము
ఎంత
చదివి
యుండవలెను?
అట్లుగాక
ఏమీ
తెలియని
వానిని
ఆసుపత్రిలో
పెట్టి
రోగులకు
మందు
ఇవ్వమనగా
ఏమి
చేయును?
రక్షణకు
బదులు
మరణమునకు
సిద్ధము
చేయును.
19
▾
Meaning
Keep
అటులనే,
నేడు
ఒకడు
మహాజ్ఞానిగా
నున్నాడన్న
అతను
పూర్వ
జన్మములందు
ఎంత
సాధనలను
సలిపి
యుండబట్టియే
నేడీ
స్థితికి
రాగలిగినాడు.
దీనికి
జన్మాంతర
సంస్కారము
కూడనూ
సాయము
కావలెను.
ఇప్పుడేమో
ప్రతివాడూ
జ్ఞానిననే
తనకు
తాను
తెలుపుకొనుచుండును.
అయితే
జ్ఞానికి
కొన్ని
చిహ్నములుండవలెను.
సర్వమూ
వాసుదేవుడను
అనుభవ
వాక్యమే,
నిజమైన
చిహ్నము,
సరియైన
స్థితి.
“వాసుదేవుడ”నగా
సామాన్యముగా
‘వసుదేవ
కుమారుడ’ని
తలంతురు.
అది
సరి
కాదు.
సర్వభూతములకు
నివాసమై,
తాను
సర్వభూతములందూ
నివసించుచున్న
స్థితినే
వాసుదేవుడని
అందురు.
20
▾
Meaning
Keep
ఇట్టి
అనుభవస్థితిని
పొందినవాడే
జ్ఞాని
కాగలడు
కానీ,
తనకు
తాను
‘నేను
జ్ఞాని’
అని
పేరు
వ్రాసుకొన్న
అతను
పేరుకు
జ్ఞానే
కానీ
అనుభవమున
అజ్ఞాని.
దేనిని
తెలుసుకొన్న
తరువాత
మరొక్కటి
తెలిసికొనవలసిన
పనిలేదో
దానిని
తెలుసుకొనుటే
జ్ఞాని
యెక్క
మహత్యము.
అంతే
కానీ,
కొన్ని
శ్లోకములు
కంఠస్థము
చేసి,
కొన్ని
గ్రంథములు
గణము
కొట్టి
పెద్దల
దగ్గర
కొన్ని
కొన్ని
సువాక్యములు
స్వీకరించి,
పదిమందిలో
చేరి
స్టేజి
యెక్కి
నాకన్నియూ
తెలియునని
తిన్న
అన్నము
కక్కినట్లు
లెక్చర్లు
కొట్టినంత
మాత్రమున,
పదిమందిని
శిష్యబృందమును
చేర్చుకొన్న
మాత్రమున
అతను
జ్ఞాని
అని
అనిపించుకోడు.
అట్టి
మహనీయులు
నేటి
కలియందు
అనేకులు;
వేషములందు
కాషాయము,
హృదయములు
కసాయి.
రాళ్ళను
రత్నాలవలే
మెరిపించవలెనంటే
అది
సాధ్యమా?
అన్ని
రాళ్ళు
రత్నములు
కావు.
రత్నములకిచ్చిన
వెల
రాళ్ళకుండునా?
ఒక
వేళ
రాళ్ళకు
కూడా
అంతే
ఇచ్చినట్లైన
అట్టి
వాడు
పరమమూర్ఖుడు.
ఏనాడూ
రాళ్ళను
కానీ
రత్నములను
కానీ
చూడని
వాడనే
అర్థము.
21
▾
Meaning
Keep
ఇట్టి
చిల్లర
జ్ఞానులు
బయలుదేరుదురనే
కృష్ణపరమాత్మ
గీతలో
మహా
మంత్రరాజమైన
“వాసుదేవస్సర్వం”
అను
పవిత్ర
మహోపదేశమును
అందించినాడు.
ఆ
ఒక్క
మంత్రమే
చాలు
మానవుడు
తరించుటకు.
దానినే
నిరంతరము
పరోక్ష
ప్రసాదముగా
భావించి
స్మరించుట
పరమపుణ్యం,
అదే
గమ్యం.
ఈ
షడక్షర
నామమే
మానవుని
సార్థకము
చేయగలదు.
అంతేకానీ,
ఈనాడు
లోకమున
ఎవరికి
వారే
మేము
మహాత్ములమనియు,
జగద్గురువులమనియు,
భగవానులమనియు,
జ్ఞానులమనియు,
పరమహంసలమనియు,
త్యాగులమనియు,
ఆనందులమనియు,
అబ్బా!
చెప్పనలవికాని
పేర్లు
పెట్టుకొని
లోకమున
చలామణి
అగుచున్నారు.
ఈ
బిరుదులు
ఎవరిచ్చినవీ
కావు,
ఏరి
తెచ్చుకొన్నవే.
పాపము!
తలకు
తగిలించుకొనినవే.
ఈ
పేర్లు
మూడు
రోజుల
ముచ్చటైనవే.
అచ్చమైనవి
కావు.
స్వచ్చమైనవి
కావు.
22
▾
Meaning
Keep
రూపము
సన్యాసులు,
లోపల
అత్యాశలు.
పైన
యోగాలు,
లోన
విషయ
రోగాలు.
పేర్లు
ఆనందులు,
తిరిగేది
సందుగొందులు.
మాటలు
తేనె
మాటలు,
చేష్టలు
చెండాలపు
చేష్టలు.
ఇట్టి
త్యాగాలు,
యోగాలు,
వేషాలకంటే,
నిత్యకృత్య
కర్మలలో
నిమగ్నులైన
సంసారులే
మేలు.
23
▾
Meaning
Keep
ముఖ్యముగా
మన
భారత
నీతి,
జాతి,
సంస్కృతి
సన్నగిల్లుటకు
ఇట్టి
దురాచారులే
కారణము.
ఇట్టి
వారల
వలన
భగవత్
విశ్వాసము
కూడనూ
కోల్పోయినది.
చెప్పుట
త్యాగాలు,
కోరేది
భోగాలు.
పలుకులు
నీతిపలుకులు,
ఉపయెగించేది
ద్వేష
అసూయలు.
ఇవి
సన్యాసులకు
పరమ
శత్రువులు.
పతనానికి
పయనము
చేయునవి.
ఆటకూ
మాటకూ
పొందిక
లేని
అసత్యమే
తప్ప
సత్యము
కాదు.
24
▾
Meaning
Keep
సంసారులయందు
ఎంతో
సత్యశీలులు,
సాత్త్విక
హృదయులు,
సదాచార
సంపన్నులు,
ద్వేషరహితులూ
కలరు.
సర్వద్వేషములు,
సర్వ
ఆశలు
–
త్యాగులు,యోగులను,వేషధారుల
చెంతనేగుంతలు
త్రవ్వుచున్నవి.
అసూయ,
అహంకార,
ఆడంబరములు
సాధకుని
సర్వనాశనము
చేయును.
కానీ
సాధకులు,
భక్తులు,
వీటన్నిటికీ
తగిన
వారలయి
విడవవలసిన
వాటిని
విడిచి,
సదాచారులై
సర్వేశ్వర
చింతన
చేయుచు
అనుభవ
ఆనందమును
సాధించవలెను.
వాటినే
లోకమునకందించవలెను.
అప్పుడే
లోక
శాంతి,
లోక
కళ్యాణము
చేకూరును.
అట్టి
పవిత్ర
జ్ఞానులను
గురించే
కృష్ణపరమాత్మ
ప్రత్యేక
దృష్టితో
తెలిపెను.
“జ్ఞానుల
వలననే
లోకము
ప్రకాశించును.
జ్ఞానము
లేని
మానవుడు
దీపము
లేని
ఇంటివంటివాడే,”
అని
కూడా
తెలిపెను.
Previous
←
The Ātma Within All Beings, the Tattva of the Support of All
Next
Asti Bhāti Priyam
→