Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · Asti Bhāti Priyam
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
“నహి
జ్ఞానేన
సదృశం”
జ్ఞానముతో
సమానమైనటువంటిది
వేరొకటి
లేదు.
సంసార
సముద్రమును
దాటించి
‘పరమప్రాప్తి’ని
యేది
కలిగించునో
దానినే
“జ్ఞాన”మని
అందురు.
అట్టి
జ్ఞానము
కూడనూ
రెండు
విధములుగా
ఉన్నది.
అందులో
మొదటిది
“విషయజ్ఞాన”మనియూ,
రెండవదానిని
“అభేద
జ్ఞాన”మనియూ
అందురు.
అనగా,
మొదటిది
లౌకికమైనది;
రెండవది
“అహం
బ్రహ్మాస్మి”
అనే
బ్రహ్మాత్మ
విజ్ఞానమే;
దీనినే
అభేదజ్ఞానమందురు.
ఇది
అనాది.
సంసార
భయాన్ని
నివారించి,
మానవుని
నిర్భయ
స్వరూపుని
చేసి
‘బ్రహ్మప్రాప్తి’లో
ప్రవేశపెట్టును.
ఇది
బుద్ధికి
సాక్షియై
యుండును;
అందువలన
దీనికి
“సమ్యక్
జ్ఞాన”మని
పేరు.
2
▾
Meaning
Keep
దీనిని
మానవుడు
సాధించవలెనన్న,
రెండు
మార్గములు
కలవు.
ఒకటి
‘బహిరంగ
సాధన’,
రెండవది
‘అంతరంగ
సాధన’.
అనగా
నిష్కామకర్మ
(బహిరంగ
సాధన);
అంతరంగ
సాధన,
అనగా
ధ్యానసమాధులు.
ఇట్టి
స్థితికి
“ఆత్మ
సంయమ”మని
కూడనూ
అందురు.
వేదాంత
పరిభాషలో
దీనినే
“నిదిధ్యాస”మని
పిలుతురు.
దీనిని
పొందవలెనన్న
శ్రవణమననాదులు
ఆధారము.
వాటి
ద్వారానే
ధ్యానమును
సాధించవలెను.
కానీ,
శ్రవణమననాదులు
లేక
ధ్యాన
సిద్ధి
కలుగదు.
3
▾
Meaning
Keep
‘ఆత్మసంయమ’మనగా
కూడా
అర్థము
ఇదియే.
మనో
నిగ్రహానికి
కావలసిన
ఉపాయములనే
“ఆత్మసంయమము”
అందురు.
మానవ
జీవితమున
ఇదియే
లక్ష్యము;
పరమాత్మను
తెలిసికొనుట,
ముక్తిని
సాధించుట.
ఇంతకంటే
వేరు
సత్యాన్వేషణ
మానవునకు
వేరొండు
లేదు.
మిద్దెలు,
మేడలు,
కట్టడములు,
భూములు
సంపాదించడము,
బిడ్డలను
కనడము,
ధనమార్జించడము,
పదవులకు
ప్రాకులాడటము,
బిరుదులను
పొందటము,
ఇది
కాదు
మానవునకు
గొప్పతనము.
శాశ్వతానందమును
పొందటము,
శాశ్వత
దుఃఖనివృత్తి
చేసుకొనుటే,
“తానే
బ్రహ్మ”నను
అనుభూతిని
సాధించుటే
సాధన
యొక్క
సారము.
4
▾
Meaning
Keep
“శ్రుణ్వంతు
విశ్వే
అమృతస్య
పుత్రాః”
అన్న
సత్యమును
అనుభూతిలో
ఆనందించవలెను,
సాధించవలెను.
ఉన్న
రూపనామములను
త్యజించవలెను.
కల్పితములు,
కల్లలే;
అవి
కదలునవి,
వదలునవి.
సత్యములు
కావు.
త్రికాలములందూ
స్థిరముగా
నుండు
ఆనందమే
తన
స్వరూపమని
తెలుపుటే
జ్ఞానము.
తాత్కాలిక
దుఃఖనివృత్తి,
తాత్కాలిక
ఆనంద
ప్రాప్తి
నిజ
విముక్తి
కాదు.
కనుక
“ఇట్టి
నిత్య
సత్య
నిర్మలమైన
స్థితిని
పొందవలెనన్న
నన్ను
ఆశ్రయించవలె”నని
కృష్ణబోధ.
5
▾
Meaning
Keep
“బావా!
అర్జునా!
జరామరణములనే
దుఃఖాల
నుండి
విముక్తి
నొందు
నిమిత్తము
నన్నాశ్రయించి
ఎవడు
సాధన
చేయునో,
వాడు
బ్రహ్మనూ,
సంపూర్ణమైన
అధ్యాత్మికాన్ని,
కర్మనూ
తెలుసుకొన్నవాడగును.
అధిభూత,
అధిదైవ,
అధియజ్ఞములతో
కూడిన
నన్ను
ఎవరు
ఆరాధన
చేయునో
అట్టివాడు
‘సమాహిత
చిత్తవృత్తి’
కలవాడై,
దేహము
వీడు
సమయమునందు
కూడనూ
నన్ను
మరువక
చింతించును.
ఆ
కారణముచే
అట్టివాడు
నన్నే
పొందుచున్నాడు;
అనగా
నాలో
చేరుచున్నాడు.”
6
▾
Meaning
Keep
“బావా!
ముసలితనము,
మరణము
ఈ
రెండు
దుఃఖముల
నుంచి
తప్పించుకొనవలెనని
ప్రతి
మానవునకూ
ఉండును;
ఉండవచ్చును.
కానీ,
అంతమాత్రమున
ప్రయోజనమేమి?
దానికి
అనుకూల
ఆచరణ
ముఖ్యముగా
ఉండవలెను,
కదా?
నిజముగా
అట్టి
తీవ్రమైన
ఆవేదనతో
భగవంతునిపై
సర్వ
బాధ్యతలను
వేసి
ఆచరించువాని
దుఃఖమును
అనుగ్రహ
కిరణములతో
అంతమొనరింతును.
కానీ,
దుఃఖ
రూపములైన
ప్రాపంచిక
పదార్థాలను
ఆశ్రయించిన
అట్టివారి
దుఃఖము
ఏనాటికీ
తీరునది
కాదు;
మరెవ్వరూ
తీర్చలేరు.
‘మాయాపతి’ని
ఆశ్రయించక
‘మాయా
పదార్థాల’ను
ఆశ్రయించినవారికి,
దుఃఖము
ఎట్లు
తీరును?
ఆనంద
మేవిధమున
ప్రాప్తించును?
ఈ
రెండూ
జరుగకున్న
ముక్తికి
మార్గమేది?”
అని
కృష్ణుడు
పలికెను.
7
▾
Meaning
Keep
అపుడు
అర్జునుడు,
“కృష్ణా!
అటులయిన,
అట్టివారు
నిన్ను
పొందలేరా?
నిన్ను
పొందుటకు
ఈ
‘దుఃఖనివృత్తే’
మొదటి
కారణమనుచున్నావు.
అసలు
ఈ
దుఃఖమునకు
కారణమేమి?
అది
యెట్లు
కలుగుచున్నది?
అది
తెలుసుకొన్న
కదా,
నివారణకు
ప్రయత్నింతురు?
కాన
దుఃఖమునకు
కారణమేమో
మొదట
తెలుపు,
స్వామీ!”
అన్నాడు.
8
▾
Meaning
Keep
“అర్జునా!
విను.
సర్వ
దుఃఖములకూ
మూలకారణము
అజ్ఞానమే.
అజ్ఞానమంటే
ఏమి
అని
తిరిగి
నీవు
ప్రశ్నించవచ్చును!
దేహాత్మ
భ్రాంతే
అజ్ఞానము.
అది
తొలగవలెనంటే
జ్ఞానము
కావలెను.
చీకటి
పోవలెనంటే
వెలుతురు
ఎంత
అవసరమో,
అజ్ఞానము
పోవాలంటే
జ్ఞానమంత
అవసరము.
అట్లుకాక
చీకటిని
పొమ్మని
బెదిరిస్తే,
అదిరిస్తే,
ప్రార్థిస్తే,
పోతుందా?
వెలుతురు
తప్ప
మరేవిధముగ
ప్రయత్నించిననూ
అది
వదలునదీ,
కదలునదీ
కాదు.
అటులనే,
అజ్ఞానము
పోవలెనని
ఊరికే
స్మరిస్తే
పోదు;
దాని
స్థితి
గతి
ఏమిటో
విచారించి
సత్యమును
తెలిసికొన్న,
అజ్ఞానము
అంతర్ధానమగును.”
9
▾
Meaning
Keep
“అజ్ఞానమెప్పుడు
లేదో
అప్పుడు
దుఃఖము
కూడా
లేదు.
అట్టి
దుఃఖ
నివృత్తి
మార్గమయిన
నన్నాశ్రయించి
జ్ఞానజ్యోతిని
సంపాదించుకొని
శాశ్వత
ఆనందమును
అనుభవించు”
అని
కృష్ణుడు
ఉపదేశించెను.
10
▾
Meaning
Keep
వెంటనే
అర్జునుడు
అందుకుని
“కృష్ణా!
ఇంతవరకూ
తమను
చేరు
మార్గములు
కొన్నింటిని
తెలిపిరి.
తటపట
ఫిరంగులవలె
తమరు
మాటలను
ప్రేల్చిన
నాకు
అర్థమగుటెట్లు?
నా
కంతటి
శక్తినైననూ
అనుగ్రహించలేదు!
కాన,
దయచేసి
ఏవి
తెలిసికొన్న
తమను
చేరగలమో
వాటిని
విపులముగా
సెలవిచ్చి
నన్ను
కృతార్థుని
చేయుము,”
అని
ప్రార్థించెను.
11
▾
Meaning
Keep
అపుడు
కృష్ణుడు
“బావా!
విను.
బ్రహ్మము,
అధ్యాత్మము,
కర్మ,
అధిభూతము,
అధిదైవము,
అధియజ్ఞము
అనునవి
తెలిసికొన్న,
నా
తత్త్వము
పూర్తిగా
తెలియును.
నా
తత్త్వము
ఎవరు
తెలుసుకొందురో
వారు
నన్నే
పొందుదురు”
అన్నాడు.
12
▾
Meaning
Keep
“అటులైన
మొదటిదైన
‘బ్రహ్మము’ను
గురించి
తెలుపుము
స్వామీ!”
అన్నాడు
అర్జునుడు.
13
▾
Meaning
Keep
“అర్జునా!
‘అక్షరం
బ్రహ్మపరమం’.
పరమైన
అక్షరమే
బ్రహ్మము.
అక్షరమంటే
నాశనము
కానటువంటిది.
‘బ్రహ్మ’నగా
‘పెద్దది’
అని
కూడ
అర్థము.
అనగా,
ఎంత
పెద్దదని
ప్రశ్న
పుట్టునేమో;
ఎంత
పెద్దదనుకొన్న
దానికంటే
పెద్దది!
‘అక్షర’మంటే
మరొక
అర్థము
కూడా
కలదు.
దానిని
‘సర్వవ్యాపక’మని
కూడా
అందురు.
బ్రహ్మమనగా
కేవలము
అక్షరమే
కాదు.
పరమైన
అక్షరం.
దేశ
కాల
జ్ఞానములతోనూ,
మరేవిధమైన
సాధనలతోను
తెలియని,
ఏమి
చేసిననూ
నశించక,
కృశించక
ఉండి
నాశనము
కానిదే
అక్షరం.”
14
▾
Meaning
Keep
“అట్టి
స్థిరమైన
‘బ్రహ్మము’ను
పొందుటే
మానవజాతికి
లక్ష్యం.
అక్షరమనియు,
బ్రహ్మమనియు,
రెండు
పదములుగ
శబ్దములుగ
గోచరించిననూ
అవి
రెండూ
ఒక్కటే.
అవి
బ్రహ్మము
యొక్క
సగుణ
నిర్గుణములను
సూచించును.
అక్షర
శబ్దము
బ్రహ్మవాచకమగు
‘ఓంకారము’ను
తెలుపును.
అందువలననే
దీనిని
‘అక్షర
పరబ్రహ్మయోగ’మని
కూడనూ
పిలుతురు.
బ్రహ్మమునకు
పరమము,
అక్షరము
అని
రెండు
విశేషణములు
కలవు.
అక్షరమను
మాటకు
‘ప్రణవము’
అనియూ,
‘మాయ’
అనియూ
అర్థము
వచ్చును.
అక్షరమని
చెప్పబడే
మాయ
కూడా
ప్రణవానికి
శ్రేష్ఠమైన
వస్తువే.
ఇవి
సవిశేషము.
ఇట్టి
బ్రహ్మమును
తెలుసుకొన్న
వాడే
నన్ను
పొందును,
బావా!”
15
▾
Meaning
Keep
“ఇక
రెండవది,
విను!
బ్రహ్మమే
సర్వ
శరీరములందూ
సర్వభూతములందూ,
“నేను”
“నేను”
అను
రూపమున
నివసించుచున్నది.
ప్రతి
శరీరము
“నేను”
అను
వస్తువునే
ఆశ్రయించుకొని
ఉన్నది.
ఆ
శరీరములందు
కూడా,
ఒక్కొక్క
అంగము
ఒక్కొక్క
కార్యమునకు
ప్రాధాన్యత
వహించియుండును;
ఉపయోగపడుచుండును.
ఒక్కొక్క
ఇంద్రియము
ఒక్కొక్క
విషయమును
గుర్తిదుచుండియూ,
ఈ
సర్వ
ఇంద్రియములకు
సంబంధించియూ
వాటన్నిటికీ
అతీతమయి,
“నేను”
అనునది
ప్రకాశించుచుండును.
ఆ
“నేన”ను
శక్తి
ఈ
సర్వాంగములలో,
సర్వేంద్రియములలో
చేరకున్న
అవి
అన్నియునూ
జడములైపోవును!
16
▾
Meaning
Keep
‘నేను’
అను
శక్తి
సర్వేంద్రియములలో
చేరినపుడే
ఆయా
ఇంద్రియములు
వాటి
వాటి
పనులను
చేయగలవు.
ఇట్టి
శక్తినే
‘అధ్యాత్మం’
అని
అందురు
బావా!
అది
అందరికీ
అంత
సులభముగా
తెలియునట్టిది
కాదు.
తెలిసికొన
వీలు
కాదు.
వివేక
దృష్టితో
విచారణ
సలుపు
వారలకే
కొంతవరకు
అర్థమగును,
విషయము
తెలియును.”
17
▾
Meaning
Keep
“బ్రహ్మము
‘తత్’
పదార్థమనియు,
అధ్యాత్మం
‘త్వం’
పదార్థమనియు,
అనవచ్చును.
ఇంకనూ
సులభముగా
అర్థము
కావలెనన్న,
ఈ
రెండును
స్వరూప
స్వభావములుగా
తలంచవలెను.
స్వరూప
స్వభావములు
వేరు
కాదు,
కదా?
కనుక,
బ్రహ్మ–స్వరూపము,
అధ్యాత్మం–స్వభావమూ
అని
తలంచు”
అన్నాడు
కృష్ణుడు.
18
▾
Meaning
Keep
ఇచ్చట
మనము
కొంత
విచారింతము.
శాస్త్రములందు,
“సచ్చిదానంద
స్వరూపుడు
బ్రహ్మ”
అని
ఉన్నది
కదా!
ఇది
కేవలము
వేదాంత
పరిభాష
యొక్క
అర్థము.
ఇక
సంస్కృత
భాషలోని
అర్థము,
“అస్తి
భాతి
ప్రియం”
అని
అందురు.
ఈ
రెండూ
ఒకటియేనా?
లేక
వేరునా
అని
విచారించిన
రెండూ
ఒక
పదార్థమే.
ఒక
స్థితి
యొక్క
నామములే.
స్వభావము
కానీ,
పదార్థము
కానీ
వేరు
కాదు.
“సత్”
అనగా
ఎల్లప్పూడూ
ఉండునది.
దానినే
సంస్కృతమున,
‘అస్తి’
అని
అందురు.
“చిత్”
అనగా
అన్నింటినీ
తెలిసికొను
శక్తి;
దీనిని
సంస్కృతమున
‘భాతి’
అని
అందురు.
ఇక
“ఆనందమ”నగా
నిరంతర
సుఖాపేక్ష.
దీనినే
సంస్కృతమున
‘ప్రియం’
అని
అందురు.
ఈ
మూడునూ
ప్రతి
మానవుని
యందును,
పశుపక్షులయందు
సహితము
గోచరమగుచున్నది.
ఎటులన,
‘సత్’
అను
మొదటి
దానిని
విచారించిన
తెలియును.
దేహము
ఏనాటికైననూ
చావునదే,
ఊడునదే.
ఇది
ప్రతి
ఒక్కరికి
తెలిసినదే.
ఇది
తెలియని
మనుజుడంటూ
లోకమున
లేదు.
అయినప్పటికిని
చావన్న
భయము;
ఎవరికీ
ఇష్టముండదు.
ఇష్టము
లేనంత
మాత్రమున
ఉండగలదా?
అది
వీలు
కాదు.
ఇష్టమున్ననూ,
లేకున్ననూ
చావు
మాత్రము
తప్పదు.
పుట్టిన
ప్రతి
వస్తువుకూ
అంత్యము
కలదు.
క్షీణించుట
మానదు.
అయిననూ
చావుకు
ఎవరూ
ఇష్టపడరు.
కారణమేమి?
ఇచటనే
మనము
జాగ్రత్తగా
యోచించవలెను;
ఇష్టపడనిదీ,
నిరంతరము
ఉండవలెనన్నదీ
ఏది?
మరణము
దేనికి?
వీడునది
దేనిని?
అనునది
యోచించిన,
వీడునది
దేహమునే;
దేహమునకే
చావు.
ఆత్మకు
చావు
లేదు.
అది
తెలిసికొనలేక
మానవులు
అమర
ధర్మాన్ని
దేహముపై
ఆరోపించుచున్నారు.
19
▾
Meaning
Keep
ఆత్మకూ
చావుకూ
ఎట్టి
సంబంధమూ
లేదు.
మరణము
యొక్క
అనుభవము
దేహమునకే
కానీ
నిత్య,
సత్య,
నిర్మలమైన
ఆత్మకు
అంటదు.
అందువలననే
మరణమన్న
ఇష్టపడదు;
ఇష్టపడనిది
ఆత్మ
కానీ
దేహము
కాదు.
మరణమన్న
ఏది
ఇష్టపడకుండా
ఉన్నదో
ఆ
ఆత్మనే
నీవు.
నీవు
సత్స్వరూపుడవు.
దేహముపై
ఆరోపించే
అమరధర్మం
‘సత్’
కాని
దేహమునకు
కాదు.
ఆ
సత్
పేరుననున్న
నీవే
‘ఆత్మ’,
కాన
ఆత్మకు
మరణము
రాదు,
లేదు.
అట్టి
మరణము
లేని
ఆత్మ,
సర్వ
ఉపాధులందూ
ఉండును.
కనుక,
ప్రతి
దేహము
లోనూ
సత్పదార్థశక్తి
సార్థకమైయున్నదని
తేటతెల్లమగుచున్నది.
20
▾
Meaning
Keep
ఇక
రెండవదైన
“చిత్”,
ఇది
అన్నింటినీ
తెలిసికొనవలెనను
శక్తి.
ప్రతి
మానవుడు
దేనిని
చూచిననూ
ఇది
యేమి?
అది
యేమి?
అని
ప్రశ్నించి
దాని
స్థితిగతులను
తెలిసికొనగోరును.
ఆ
విధముగా
ప్రయత్నించి
దీనిని
తెలుసుకొనువారు
కొంతమంది
ఉండవచ్చును.
కేవలము
తెలుసుకొనవలెనని
మాత్రము
ఆశించి,
ప్రయత్నించి
తెలుసుకొన
లేకుండా
పోవచ్చును.
ఎటులైననేమి
ప్రతివాడూ
మాత్రము
తెలిసికొనవలెనని
ఆతురత,
ప్రయత్నము
సలుపును.
ఎవరైన
చిన్న
పిల్లవానిని
చేత
పట్టుకొని,
సంతకో,
లేక
బజారునకో,
లేక
ఎగ్జిబిషన్కో
వెళ్ళిన,
ఆ
పిల్లవాడు
అక్కడున్న
ప్రతి
వస్తువును
చూచుచూ
ఊరికే
ఉండడు.
తన
పెద్దవారైన
వారినో,
లేక
ఎవరు
చేయి
పట్టుకొని
తీసుకొని
వెళ్ళిన
వారినో,
“ఇది
ఏమి?
అది
ఏమి?”
అని
ప్రశ్నించుచుండును.
ఆ
పిల్లవానికి
అవసరము
లేకపోయిననూ,
తెలిపిన
అర్థముకాక
పోయిననూ,
ఆ
పిల్లవాడు
ప్రశ్నించక
ఉండడు.
ఇది
సాధారణముగా
ప్రతి
ఒక్కరికీ
నిత్యానుభవములో
కనుపించును.
దీనిలోని
అంతరార్థమేమి?
అని
ఆలోచించిన,
ఆ
రూపములో
ఉన్న
‘చిత్
శక్తి’
ఊరకుండలేదు.
దానికది
సహజము
కాదు.
ప్రతి
ఒక్కటినీ
తెలిసికొనవలెనని
తహతహలాడును.
అది
ఈ
రూపేణా
బైట
పడుతుంది.
21
▾
Meaning
Keep
స్వయముగా
చైతన్యమైన
‘చిత్
శక్తి’కి
జడ
వస్తువులను
కూడా
చైతన్యవంతముగా
ప్రకాశింపచేసే
స్వభావము
ఉన్నది.
అందుకనే
ఈ
లక్షణము
మానవునియందు
మెరయుచున్నది,
మెరిపించుచున్నది.
మానవుని
యందు
‘చిత్
శక్తి’
ఉన్నదనుటలో
పై
విషయము
విచారించిన
స్పష్టమగుచున్నది.
22
▾
Meaning
Keep
తరువాత
మూడవది;
మానవుడే
కాక
పశుపక్షి
మృగాదులు
కూడనూ
తమంతట
తాము
సుఖముగా
ఉండవలెననియే
కోరుచుండును.
సుఖమునకై
ప్రయత్నములు
కూడనూ
చేయుచుండును.
దుఃఖమును
కానీ
కష్టమును
కానీ
అవి
ఆశించవు.
వచ్చిననూ
తప్పించుకొనుటకు
ప్రయత్నించును.
ఇక
మానవుల
విషయము
తెలుపనక్కరలేదు.
నిరంతరము
సర్వకర్మలయందూ,
సర్వత్రా
సుఖముగానే
ఉండవలెనని
కోరును
కానీ
ఒక
సమయమందైనా,
వేరొక
స్థానమందైనా,
వేరొక
కాలమందైనా
దుఃఖమును
ఆశించరు.
ఎట్టి
పూజలు
చేసినా,
భజనలు
చేసినా,
వ్రతములు
చేసినా,
యాత్రలు
వెళ్ళినా,
పాత్రలు
తోమినా,
దాన
ధర్మములు
చేసినా,
ఏమిచేసినా
తానూ,
తనవారూ
సుఖముగా
ఉండవలెననే
ప్రార్థించును.
అంతెందుకు?
దేహమునకేదైనా
రోగము
సంప్రాప్తమైన
దాని
నివారణకై
వైద్యుడేదైనా
మందును
ఇచ్చిన
ఆ
మందు
కూడనూ
తమకు
సుఖంగా
ఇంపుగా
ఉండవలెననే
ఆశించును
కదా!
దీనికి
కూడనూ
కారణము
యోచించిన
స్పష్టమగుచున్నది.
23
▾
Meaning
Keep
జీవుడు
స్వయముగా
సుఖస్వభావుడు,
ఆనందస్వరూపుడు.
వాడు
దేహ
స్వరూపమున
లేడు.
దేహము
తాను
కాదు.
ఆత్మనే
తాను.
ఆత్మకు
సుఖం
సహజము.
ఆ
కారణముచే
దుఃఖమును
తాను
ఇష్టపడడు.
ఆ
సుఖమునకు
ఆశ్చర్యము
లేదు.
లేనిది
చూచినపుడే
లోకమునకు
ఆశ్చర్యము.
నిత్యమూ
చూచు
వాటిపై
ఎవ్వడూ
ఆశ్చర్యము
పొందడు.
సహజమునకు
విరుద్ధమైన,
అపుడు
ఆశ్చర్యమునకు
గురియగును.
ఒకటి
చూడుడు!
మన
ఇంటిలో
చంటిబిడ్డ
ఊయలలో
పరుండియుండును.
తొట్టికి
కట్టిన
గిలకనో,
మరేవస్తువునో
చూచి
లేక
తనలో
తాను
నవ్వుకొంటూ,
ఆడుకొంటూ
ఉండును.
దానికి
ఇంటిలోని
వారెవ్వరూ
ఆశ్చర్యముగా
కానీ,
విపరీతముగా
కానీ
భావించరు.
నవ్వుతూ
ఆడుకొంటూ
ఉన్న
పిల్లవాడు
ఒక్కతూరి
కిల్లుమని
ఏడ్చిన,
ఇంటిలోని
వారందరూ
ఆత్రుతతో
ఆశ్చర్యముతో
ఊయల
చెంతకు
పరుగెత్తి
వత్తురు.
ఎందుకేడ్చుచున్నాడో
ఏమోయని
ఊయలలోని
బట్టలన్నియు
విదిలింతురు.
ఏ
పురుగో,
చీమయో
ఉన్నవేమో?
లేకున్న
ఏడ్చుటకు
కారణము
లేదే,
అని
కంగారు
పడుదురు.
ఇది
చిన్న
బిడ్డలు
కల
ప్రతి
ఇంటిలోనూ
నిత్యానుభవము.
యోచించి
చూచిన,
దీనికి
పూర్వము
కిలకిల
నవ్వుటకు
కారణమేమని
ఎవరూ
ప్రశ్నించలేదు.
ఇప్పుడు
కిల్లుమని
ఏడ్చిన
దానికి
కారణములు
వెతుకుచుందురు.
మొదలు
మనము
దీనికి
కారణము
విచారింతము.
24
▾
Meaning
Keep
ఆనందము
వానికి
సహజమనియూ,
దుఃఖము
అసహజమనియూ
మనకు
తెలియచున్నది.
ఇంతియే
కాదు.
మరొక
విషయమును
కూడనూ
ఉదాహరణమునకు
తీసుకొందము.
ఎవడైన
మన
మిత్రుడో
లేక
బంధువో
సర్వసుఖములతో
ఉండిన
“ఎందుకయ్యా
నీవు
సుఖంగా
ఉన్నావు?”
అని
ఎవరూ
ప్రశ్నించరు.
ఏమైనా
దుఃఖముగా
ఉండిన
“ఎందుకు
విచారంగా
ఉన్నావు”?
అని
ప్రశ్నింతురు.
25
▾
Meaning
Keep
ఇవికూడా
సామాన్య
మానవులయందు
నిత్యమూ
చూచునవే
కదా?
వీటికి
కారణమేమి?
సుఖము
సహజమనియూ,
దుఃఖము
అసహజమనియూ
స్పష్టమగుచున్నది.
సుఖము
దేనికి
సహజమన్న
–
ఆత్మకు.
ఆత్మ
సుఖ
స్వభావము
కలది.
కనుక,
నిరంతరమూ
సుఖమునే
కోరును.
పై
మూడింటిని
ప్రతి
జీవియందు
ప్రత్యక్షముగా
నిత్యమూ
మనము
చూచుచున్నాము.
కాన
దేవుడే
ఆత్మ
స్వరూపమున
జీవతత్త్వమును
వహించి
చరించుచున్నాడు.
ఈ
అంతరార్థమును
పురస్కరించుకొనియే
కృష్ణ
పరమాత్మ
పై
చెప్పిన
బ్రహ్మ,
అధ్యాత్మము
అను
స్వరూపస్వభావములు
రెండునూ
తనవే
అని
అర్జునునకు
నిరూపించినాడు.
26
▾
Meaning
Keep
ఆ
తరువాత
అర్జునుడు
మూడవదైన
కర్మ
విషయమును
తెలుపుమని
ప్రార్థించినాడు.
కృష్ణుడు
సంసిద్ధుడయి,
“బావా!
భూతముల
స్థితి
ఉత్పత్తికి
కారణమైన
త్యాగమే
“కర్మ”
అనబడును.
చరాచరాత్మకమైన
వస్తువులన్నియూ
భూతములే
కదా!
వేయేటికి?
సృష్టి
సంకల్పమునే
నిజమైన
కర్మ
అని
తెలుసుకో.
భగవత్
సంకల్పమే
కర్మ
ప్రవాహ
రూపమున
ప్రవహించుచున్నది.
ఈ
కనుపించు
సర్వ
ప్రపంచమునకు
నా
సంకల్పమే
ఆది
బీజము.
సంకల్పమెంత
కాలముండునో
అంతవరకూ
కర్మప్రవాహము
ప్రవహించుచునే
యుండును.
అది
యెండిపోవుటకు
వీలులేదు.
లోకమున
మనము
చేయు
ప్రతి
కర్మయు,
ఈ
మహా
ప్రవాహములో
అంతర్భాగమే.
సృష్టి
సంకల్ప
రూపమైన
కర్మనే
సమస్త
భూతముల
సృష్టి,
స్థితి,
లయములకు
కారణమైయున్నది.
బావా!
ఇంతేల.
ఈశ్వరార్పిత
బుద్ధితో
చేయు
ప్రతి
చిన్న
కర్మయూ
పరమాత్మ
స్వరూపమైపోవుచున్నది”
అని
బోధించెను.
Previous
←
The ‘Jñāni’ Is Most Dear to the Paramātma
Next
I Am the Doer and the Enjoyer Too
→