Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · I Am the Doer and the Enjoyer Too
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
“బావా!
కర్మ
నా
స్వరూపమే!
నేనే
కర్మ
స్వరూపముతో
గోచరించుచున్నాను”
అని
కృష్ణ
పరమాత్మ
విభ్రాంతి
చెందునటుల
తెలిపెను;
అనగా,
కర్మకూడ
తన
స్వరూపమనే
స్పష్టపరిచెను.
2
▾
Meaning
Keep
తరువాత,
“అర్జునా!
బ్రహ్మ,
అధ్యాత్మం,
కర్మ
ఈ
మూడింటిని
నా
స్వరూపమని
తెలిసికొన్న
చాలును.
తప్పక
విముక్తడవౌదువు;
ముక్తిని
పొందుదువు.
ఇక
మిగిలిన
వాటితో
అవసరము
లేదు,”
అని
తప్పించుకొన్నాడు.
ఎందుకు
తప్పించుకొన్నాడు?
కాలము
తక్కువ,
ముందు
చేయవలసిన
కర్మ
ఎక్కువ,
అందుకై
త్వరత్వరగా
ముందుకు
రథమును
సాగించవలెనను
ఉత్సాహమే
కృష్ణునకు.
3
▾
Meaning
Keep
అయితే,
అర్జునుడు
వదులువాడు
కాదు.
సామాన్య
మానవులై
యుండిన
ఇంతకాలము
కూడనూ
కృష్ణపరమాత్మతో
వాదించియుండరు.
కృష్ణునకు
తగినవాడు
అర్జునుడు.
అర్జునునికి
తగినవాడు
కృష్ణుడు.
వీరిద్దరూ
నరనారాయణులు.
కనుక
అది
వారిద్దరికే
చెల్లును;
అన్యులకు
అసాధ్యము.
4
▾
Meaning
Keep
అర్జునుడు
కృష్ణుని
ఓదార్పునకు
తృప్తినొందక
“మిగిలిన
మూడింటిని
కూడనూ
తెలిపి,
నన్ను
సంశయముల
బారినుండి
తప్పించి
అంధకారమును
రూపుమాపి
నీ
ఆకారమును
చూపు
స్వామీ!”
అని
ప్రార్థించినాడు.
అపుడు
పరమాత్మ
జాలిహృదయుడై
వీపు
నిమురుతూ,
“బావా,
చింతించకు!
తెలుపుదును;
వినుము.
“అధిభూతమ”నగా
ఇది
పెద్ద
సమస్యలతో
కూడినదేమి
కాదు;
ఇది
సర్వసామాన్యమైన
విషయము.
లోకమున
నశించు
ప్రతి
రూపనామములనూ
అధిభూతములనే
అందురు.”
5
▾
Meaning
Keep
“దీనిని
మరొక
విధముగా
తెలుపవలెనన్న,
అపరా
ప్రకృతినే
అధిభూతమని
అందురు.
ఈ
దేహములన్నియూ
అధిభూతములే,
అయిననూ,
నాకంటే
ఇవి
భిన్నము
కాదు”
అని
చెప్పి
ఊరక
నిలిపి
వేసెను,
ముందుకు
సాగించలేదు
విషయమును.
“హరి
హరి
చిత్రలీల
హరికే
తెలియున్”
అన్నట్లు
భగవంతుని
ఆటలు
తనకు
తప్ప
మరెవ్వరికీ
అర్థము
కావు;
అర్థము
చేసుకొనవలెనని
ప్రయత్నించియూ
ప్రయోజనముండదు.
ఈ
మాటతో
అర్జునుడు
కొయ్యబారి
స్తంభించిపోయెను.
తలభారమెక్కెను.
బుద్ధి
బద్దగించెను.
మనసు
మరింత
కులికెను.
సంశయములా
పుట్టలు
పుట్టలు,
పట్టుటకు
సాధ్యము
కాక
పుట్టెను.
దేనికి
అతనికింత
భారమూ,
కష్టమూ?
6
▾
Meaning
Keep
“సత్
చిత్
ఆనందములైన
సత్య,
నిత్య
పదార్థమును
నేను!”
అని
ముందు
చెప్పి,
“నేను
నాశరహితుడను,
పుట్టూ,
చావులూ
లేనివానిని,”
అని
రొమ్ము
కొట్టి
చెప్పిన
కృష్ణుడు,
ఇప్పుడు
“నాశనమైన,
అస్థిరమైన
దేహమును
కూడా
నేనే”
అని
చెప్పుటలో
ఎట్టివానికైననూ
సంశయము
రాక
తప్పవు.
తలభారమెక్కకపోదు,
కదా?
ఈ
అర్జునుని
మార్పును
చూచుచు
కృష్ణపరమాత్మ
మరింత
నవ్వుచున్నాడు.
దీనితో
అర్జునునకు
సిగ్గు,
కోపము,
సందియము
మూడూ
చేరి
పిచ్చివానివలే
చూచుచున్నాడు.
7
▾
Meaning
Keep
అయితే
కాలహరణము
చేయుట
కృష్ణునునకు
ఇష్టములేక,
హృదయమును
తెలిసిన
పరమాత్మ
కనుక,
తక్షణమే
అర్జునుని
సంశయమును
తీర్చ
మొదలు
పెట్టెను.
“బావా!
కంగారు
పడుటెందులకు!
అస్థిరమైన
దేహమును
నేనని
తెలిపితిననియా
నీ
సందియము?
అది
సామాన్యులకు
నీవనుకున్నట్లే
తోచును.
అయితే
ఇది
అందరికీ
అంత
సులభముగా
అర్థమగునది
కాదు.
అస్థిరమైన,
నాశమగు
ఈ
దేహమునకునూ
నాకునూ
సంబంధము
కలదు.
నేనే
దీనికి
ఆధారము;
నేను
లేక
ఈ
దేహము
లేదు.
దీనికి
పుట్టుపూర్వోత్తరమును
విచారించిన
విపులముగా
నీకు
విశదమగును;
గుట్టు
బట్టబయలగును.
విను!
సాధారణముగా
స్థూలశరీరమునకు
మూల
కారణము
ఆ
దేహమునకు
సంబంధించిన
తల్లిదండ్రులు
తిన్న
ఆహారమే
(అన్నమే);
ఆ
అన్నము
ఎక్కడి
నుండి
వచ్చినది?
పృథివి
నుండి.
అంటే
ఈ
అన్నము
పూర్వము
పృథివి
రూపమున
నున్నదన్నమాట.
దాని
నుండే
ధాన్యరూపము
ధరించి
అన్నమయినది.
ఈ
పృథివికి
ఆధారమేదని
విచారించిన
అది
జలస్వరూపమున
నుండినది,
ఇట్లే
విచారించుచూ
వెళ్ళిన,
జలమునకు
అగ్ని
ఆధారమైయున్నది.
జలము
పూర్వము
అగ్ని
స్వరూపమున
నున్నదన్నమాట.
అగ్ని
ఎక్కడ
నుండి
వచ్చినది?
దానికి
ఆధారమేది?
అని
పరిశీలించిన,
అపుడు
వాయువు
నుండి
అగ్ని
వచ్చినదనియు,
అగ్ని
పూర్వము
వాయు
రూపమున
నున్నదని
తేలును.
వాయువునకు
పూర్వరూపమేది?
అని
పరిశీలించిన
దానికి
ఆకాశమే
ఆధారమని
తెలియును.
ఆకాశమునకు
పూర్వము
ఏ
రూపము?
ఆకాశము
ఎక్కడ
నుండి
వచ్చినది?
అని
విచారణ
సలిపిన
దానికి
‘మాయ’
ఆధారమయి
ఆకారమయి
యుండునట్లు
స్పష్టమగును.
ఆ
మాయ
నా
ఉపాధియే!
చూచితివా!”
8
▾
Meaning
Keep
“నా
ఉపాధియైన
మాయ
ఆకాశముగా
మారి,
ఆకాశము
వాయువుగా
మారి,
వాయువు
అగ్ని
ఆకారమును
ధరించి,
అగ్ని
నుండి
జలమయి,
జలము
నుండి
పృథ్వీ
రూపము
దాల్చి,
పృథ్వీ
నుండి
ధాన్యము
వచ్చి,
ధాన్యము
అన్నముగా
మారి,
అన్నము
ఆకారమైన
దేహమును
పొందినది.
ఈ
సంబంధముతో
అనిత్యమైన
దేహమును
కూడనూ
నేనే
అనునది
స్పష్టముగా
తెలియుచున్నది
కదా?
దీనికి
సందియమెందుకు?”
9
▾
Meaning
Keep
“ముందు
చెప్పిన
బ్రహ్మ,
అధ్యాత్మం,
కర్మలతో
పాటు
అధిభూతము
కూడా
నేనే
అనునది
తేలినది,
కదా?
బావా!
ఈ
కార్య
కారణ
నియమాన్ని
పట్టి
చూచిన,
అధిభూతమని
చెప్పబడు
ఈ
శరీరములు
కూడనూ
నేనే!
నేనే
పరమాత్మ.
మిగిలినది
అధిదైవము.
హిరణ్యగర్భ
పురుషుడే
దేహములనబడు
పురములన్నిటిలో
పూర్ణముగా
నుండువాడు,
కనుక
పురుషుడనబడుచున్నాడు.
సర్వదేహములందూ
పూర్ణముగా
నున్నవాడు
హిరణ్య
గర్భుడని
కూడ
పిలువబడుచున్నాడు.
మానవునకు
ఇంద్రియములవలే
హిరణ్యగర్భునకు
అధిదేవతలు
ఇంద్రియములై
యున్నారు.”
10
▾
Meaning
Keep
“అధి
దేవతలెవరని
నీవు
తిరిగి
అనుమానింతువేమో!
లేక
ప్రశ్నించ
వచ్చును.
వారు
శక్తి
స్వరూపములైన
దేవతలు;
వారు
భగవంతుని
పరిచారకులు.
అనగా
కంటికి
సూర్యుడు,
కర్ణములకు
దిక్కులు,
చేతులకు
ఇంద్రుడు,
ఏ
రీతిగా
అధిదేవతలై
ఉన్నారో,
ఆ
అధిదేవతలే
హిరణ్యగర్భునకు
ఇంద్రియములై
యున్నారు.
ఎట్టి
సాధకులైననూ,
మహనీయులైననూ,
హిరణ్యగర్భుని
మూలముననే
ఉత్తమగతికి
చేరగలరు;
ఉత్తమ
స్థితిని
సాధించగలరు.
తనకూ
భగవంతునకూ
అనగా,
హిరణ్యగర్భునకూ
భగవంతునకూ
ఏ
మాత్రము
వ్యత్యాసము
లేక
ఇద్దరూ
ఒక్కటే,
భిన్నము
కాదు.
అర్థమయినదా?
అర్జునా!
పై
చెప్పిన
బ్రహ్మ,
అధ్యాత్మం,
కర్మ,
అధిభూతముల
వలెనే
అధిదైవము
కూడా
నేనే
అయి
ఉన్నాను.
ఒకదాని
కొకటి
భిన్నము
కావు.”
11
▾
Meaning
Keep
“ఇక
అధియజ్ఞుడన్ననూ
నేనే.
సర్వదేహములందూ
సర్వకర్మఫలాలను
అనుభవించు
ఏ
భోక్తకలడో,
అతనే
అధియజ్ఞుడు.
సర్వేంద్రియములందు
వాటి
వాటి
శక్తులనబడు
శబ్ద,
స్పర్శ,
రూప,
రస
గంధములను
అనుభవించు
భోక్తనే
కర్త;
అతనే
దేహములందు
సర్వాంతర్యామియై
యున్న
కర్త.
ఆ
కర్త,
భోక్త,
కూడనూ
నేనే!”
12
▾
Meaning
Keep
ఈ
అధియజ్ఞుడు,
ఎవరు
అనునదీ
అర్జునునకు
కన్నులు
తెరిపించి
చూపించినాడు.
కానీ,
సామాన్య
మానవులకు
అంత
అర్థము
కాకుండా
ఉండవచ్చును.
మనము
లోకానుభవములో
కొన్నింటిని
ఉదాహరణమునకు
తీసికొన్న
సులభముగా
బోధపడగలదు.
మనము
గాలి
కావలెనన్న
ఫ్యాన్
(fan)
వేసుకొనుచున్నాము.
వెలుతురు
కావలెనన్న
బల్బులు
(bulbs)
వేసుకొంటున్నాము.
వంటకావలెనన్న
స్టౌవును
(stove)
వెలిగించుకొంటున్నాము.
లౌడ్స్పీకర్లో
(loudspeaker)
మాట్లాడవలెనన్న
యాంప్లిఫైయర్ను
(amplifier)
వినియోగించుకొంటున్నాము.
13
▾
Meaning
Keep
ఇంకేమైన
ప్రింట్లు
(prints)
కొట్టవలెనన్న
ప్రెస్మిషన్ను
(press
machine)
పనిచేయ
ప్రారంభించుచున్నాము.
వీటిని
ప్రత్యేకించి
ప్రత్యేకించి
చూచిన,
ఒకదానికొకటి
విరుద్ధముగా
కనిపించును.
వెలుతురునకూ,
గాలికీ,
వేడికీ,
శబ్దమునకూ,
సంబంధము
లేనట్లు
కనిపించును.
అయితే
అన్నింటికీ
ఒకే
కరెంటే
(current)
కర్త,
భోక్తా
అయి
ఉన్నది.
14
▾
Meaning
Keep
ఆధేయములు
విధవిధములయినా
వినియోగములు
విధవిధములయినా
ఆధారము
ఒక్కటే
అయివున్నది.
ఆధారము
కరెంటు
(current)
ఎటులనో
అటులనే
సర్వోపాధులయందూ
సర్వకర్మల
ఫలదాత
ఆ
పరాత్పరుడై
యున్నాడు.
కరెంటు
(current)
వలే
పరాత్పరుడు
సర్వభూతాంతరాత్మయై
యుండి
సర్వకర్మలకూ
కర్తయై
యుండుట
చేత
అధియజ్ఞుడు
తానే
అయివున్నాడు.
15
▾
Meaning
Keep
ఇక
ఏడవదయిన
“ప్రాణ
ప్రయాణ
సమయమున
ఎవరు
ప్రణవమును
స్మరింతురో,
ధ్యానింతురో,
అట్టివారు
అక్షర
పరబ్రహ్మమును
చేరుదురు”
అని
కృష్ణపరమాత్మ
తెలుపగా
దాని
విషయమును
విపులముగా
తెలుపమని
అర్జునుడు
ప్రార్థించును.
అందుకు
పరమాత్ముడు
ఈ
క్రింది
రీతిగా
బోధించును.
16
▾
Meaning
Keep
“బావా!
అంత్యకాలమనగా
ఎపుడో
కాదు.
ఎప్పటికప్పుడే
నశ్వర
శరీరములకు
ప్రతిక్షణము
అంత్యమే.
అట్టి
అంత్యసమయమున
ఏమి
స్మరింతురో
అదియే
తరువాత
పరిస్థితులకు
అనుకూలమగును.
అనగా,
పునర్జన్మకు
పునాది.
అట్టి
సమయమున
నన్ను
స్మరించినవాడు
నా
భావాన్నే
పొందును.
అనగా,
నన్నే
చేరును.
మానవుని
ప్రతి
ప్రయత్నము,
ప్రతి
కర్మ,
ప్రతి
సాధన
మరణకాలమును
సంస్కరించేవిగా
ఉండవలెను.
ఆ
సమయమున
పవిత్ర
చింతన,
అనగా
ప్రణవ
చింతన
వచ్చునట్టి
సాధన
అభ్యసించవలెను.”
17
▾
Meaning
Keep
“వదలవలసినది
దేహమును;
పొందవలసినది
పరబ్రహ్మమును.
ఏవి
వదులుదువో
అవి
నీ
స్వరూపములు
కావు.
ఏది
వదలుటకు
సాధ్యము
కాదో,
మారుటకు
వీలులేదో,
అట్టి
సత్య
నిత్యమైనదే
నీ
స్వరూపము.
దీనినే
“ఆత్మ”
అని
అందురు.
అట్టి
ఆత్మనే
“పరమాత్మ”.
అతనిని
వదులుటకు
ఎవ్వరికీ
సాధ్యము
కాదు.
శరీరములు
వదలుట
యింటి
నుండి
వేరొక
యింటికి
వెళ్ళునటువంటిది.
జనన
మరణములు
దేహసంబంధములే
కానీ
ఆత్మకు
కాదు.”
18
▾
Meaning
Keep
“ఆత్మ
వచ్చునదీ
కాదు,
పోవునదీ
కాదు,
బావా!
దేహభ్రాంతితో
ఉన్నవారికి
ఆత్మ
తత్త్వము
అర్థము
కాదు.
దేహతత్త్వము
స్థిరము
కాదు.
కాన
పై
చెప్పిన
ఆరింటికంటే,
ఈ
మరణకాలమున
యెట్టి
భావమును
ఎట్టి
స్థితిని
కలిగియుండవలెననునది
తెలిసికొనుట
అత్యవసరము.
ఎందుకన,
ఈ
స్థితిని
తెలిసికొనుటకే
జీవితకాలమున
చేయు
సర్వసాధనలు.
అట్టి
సాధనల
ఫలమే,
అంత్యమున
అట్టి
పవిత్ర
చింతన
వచ్చుటకు
కారణము.
కార్య
కారణములు
అవినాభావములు.
తిండికొద్దీ
తేపు,
కదా?
సాధన
కొలదీ
సద్గతి.
కాన
సద్గతికి
అంత్యమున
చింతించు
పవిత్రచింతనే
ప్రధాన
లక్ష్యము
దానికి
చిహ్నము.
జీవితమున
వేటిని
ఆచరింతుమో
వాటిని
పురస్కరించుకొనే
అంత్యమున
స్మరణ
కలుగును”
అని
అన్నాడు.
19
▾
Meaning
Keep
అందులకు
అర్జునుడు,
“స్వామీ!
అంత్యమున
సచ్చింతన
రావలెనన్న
నేటి
నుండియే
ప్రయత్నించవలెనా?
ఆనాడు
స్మరించకూడదా?”
అని
సంశయపడ్డాడు.
అది
పరమాత్ముడు
గ్రహించి,
“అర్జునా!
ఈనాటి
నుండి
అట్టి
సచ్చింతన
ఏలనని
సంశయించుటతో
నీ
బుద్ధి
చాలా
మందగించినదని
తోచుచున్నది.
బావా!
మనసును
అభ్యాస
యోగయుక్తం
చేసి
ఇతర
చింతనలను
వదలించిన
అట్టివాడు
పరమ
దివ్యపురుషుని
పొందగలుగుతాడు.
మనసును
అభ్యాస
యోగయుక్తం
చేయనిది
ఆనాడు
నీవు
పరమపురుషుని
స్మరించు
చింతన
రాదు,
రాలేదు.
ఎట్లని
కూడా
తిరిగి
ప్రశ్నింతువేమో?
నీ
విషయమే
యోచించుకో.
నీవు
ఏనాటి
నుండియో
అస్త్ర,
శస్త్ర
విద్యలను
అభ్యసించి
యుండుట
చేత
ఈనాడు
ఈ
యుద్ధమున
వాటిని
పట్టి,
నేర్చిన
విద్యలతో
పోరాడగలవు.
అట్లుకాక
నీవు
మొదలు
నుండియూ
ఈ
అస్త్ర,
శస్త్ర
విద్యలు
నేర్వక
ఈనాడు
నీవు
వాటిని
పట్టి
పోరాడగలవా?
అది
సాధ్యమగునా?
కాదు.
క్షత్రియులకు
ఏనాటికైన
యుద్ధము
చేయు
సందర్భములు
కలుగక
ఉండవు.
వాటిని
పట్టియే,
క్షత్రియులకు
ఏ
విద్యలు
లేకపోయిననూ
రాకపోయిననూ,
యుద్ధసంబంధమైన
విద్యలు
నేర్పుదురు,
నేర్చుకొనవలెను.”
20
▾
Meaning
Keep
“అటులనే
మానవునికి
యేది
వచ్చినా,
రాకపోయినా,
మరణము
రాక
తప్పదు.
కనుక,
ఆ
సమయమున
యే
విధమైన
చింతనతో
దానిని
పవిత్రం
చేసుకొన
వలెననునది
ప్రతి
వ్యక్తియూ
ముందుగానే
నేర్చియుండవలెను.
అట్లు
నేర్వని
వారు
పరాజయమునకు
పట్టము
కట్టవలసి
వచ్చును.
లేక
ప్రాప్తించిన
దానినే
అనుభవించవలసి
వచ్చును.
యుద్ధము
జయించ
వలెనని
చేతురు
కానీ
వోడిపోవలెనని
యెవ్వరు
చేయరు.
అటులనే
మానవుడు
ఉత్తమ
గతికి
పోవలెనని
ఆశించును
కానీ
అధమస్థితిలో
ఉండవలెనని
కోరడు.
దేనిని
కోరునో
దానికి
తగినటుల
ముందు
ప్రయత్నము
జరుపవలెను
కదా?
కాన
యేడవదైన
ప్రయాణకాలమున
పవిత్ర
చింతన
వచ్చునట్టి
ప్రయత్నములు
ప్రతి
మానవుడు
చేయవలెను.
అట్లు
యెవరు
చేయుదురో
వారు
నన్ను
పొందుదురు”
అని
పరమాత్ముడు
అర్జునకు
బోధించినారు.
21
▾
Meaning
Keep
గీతాసారమంతయు
ఇందులోనే
కలదు.
మానవుడు
యే
విధమయిన
సత్కర్మలు
చేసిననూ
ఉత్తమగతిని
పొందవలెననే
ఉద్దేశమే,
కదా?
లేకున్న
పవిత్ర
ప్రార్థనలు,
జపధ్యానములు,
అర్చన
తపస్సులు
యెందుకు
చేతురో?
అట్లు
చేయు
ఆస్తికులందరూ
ఈ
విషయమును
చక్కగ
గమనించిన,
సార్థకమునొందగలరు.
ఈ
యేడవదైన
ప్రాణ
ప్రయాణకాలమున
భగవంతుని
స్మరించు
విషయమయి
“ఓం”ను
స్మరించమని
తెలిపెను.
22
▾
Meaning
Keep
ఇందులో
కొంత
విచారించ
వలసిన
విషయము
అందరికీ
అత్యవసరము.
యేమన,
లోకమున
“ఓం
అనగా
ప్రణవమును,
వీరు
మాత్రమే
ఉచ్చరించవలెను,
వారు
మాత్రమే
ఉచ్చరించవలెనని”
కొంతమంది
అలజడి
కలిగింతురు.
ఇది
చాలా
పొరపాటు;
నిజముగా
అట్టివారు
విషయము
తెలియక
కేవలము
విశ్వాసము
మాత్రమే
ప్రధానముగా
పాటించువారు.
23
▾
Meaning
Keep
గీతలో
‘వీరు
వారు’
అని
తెలుపలేదు.
యెవరైననూ
సరే,
అన్నాడు
కృష్ణుడు.
దీనికి
యే
తెగలు
కానీ,
యే
లింగ
బేధములు
కానీ
చూపలేదు.
యెవరు
అర్హులు,
యెవరు
అనర్హులు,
అని
తెలుపలేదు;
అయితే
ప్రణవ
ధ్యానమునకు
మాత్రము
యోగ్యతలు
తెలిపినాడు.
యేమనగా,
కేవలము
“ఓం”
ప్రణవమును
స్మరించినంత
మాత్రమున
ప్రయోజనము
లేదు.
‘సర్వేంద్రియములను
స్వాధీనమందుంచుకొని
మనస్సును
భగవంతుని
పై
నిలిపి
ప్రణవమును
ధ్యానించ’మని
అన్నాడు.
ఇది
చాలా
అవసరము.
మనసు
పరి
పరి
విధముల
విలపించును,
నోటిలో
‘ఓం
ఓం’
అనినంత
మాత్రమున
పరమాత్ముని
పొందలేడు.
దానికి,
జీవితకాలమున
ఇంద్రియ
నిగ్రహ
సంబంధమయిన
సాధనలు
చేసిన,
ఆనాటికి
అట్టి
అర్హతను
పొందగలడనే,
పుట్టినదాదిగా
చచ్చే
వరకూ
సత్యాన్వేషణను
సాగించమని
అన్నాడు
పరమాత్ముడు.
అట్లుకాక
ఆనాడు
మాత్రము
సాధన
ప్రారంభించవచ్చును
కదా?
ఈనాటి
నుండి
యెందులకన్న
సంవత్సరమంతయూ
కష్టపడి
చదివిన
కదా
సంవత్సరాంత్యమున
పరీక్షలో
ఉత్తీర్ణుడు
కాగలడు.
అట్లు
కాకుండ
పరీక్షలు
సంవత్సరమున్నది
కదా
అని
పుస్తకము
పట్టక
ఉపాధ్యాయులు
చెప్పినది
వినక,
వ్రాసుకొన్నది
చదువక,
పరీక్షనాడు
పుస్తకమును
పట్టిన
అసలు
మస్తకమే
చెడిపోవును.
ఇక
పరీక్ష
యేమి
పాస్
(pass)
కాగలదు?
ఇట్టి
స్థితి
పరమ
సోమరిపోతు
విద్యగా
ఉండును.
24
▾
Meaning
Keep
మనము
మన
పెరటిలో
యేదైనా
పండ్ల
చెట్టు
వేసుకొనవలెనని
ఆశించి
విత్తనము
పాదిలో
బూడ్చిన
తక్షణమే
చెట్టయి
ఫలములను
అందించదు.
ఫలము
అందించునట్టి
స్థితికి
రావలెనన్న,
దానికి
పూర్వము
యెన్ని
విధములనో
దానిని
పోషించి
కాపాడుకొనవలెను.
యెన్నో
సంవత్సరములు
దానిని
కాపాడి,
పోషించిన
కదా
తదుపరి
ఫలములను
అనుభవింపజేయును?
అటులనే
మనము
యే
కార్యమును
సాధించవలెనన్ననూ,
దానికి
పూర్వము
దాని
ఫలసిద్ధికై
తగిన
కర్మ
సక్రమముగా
సాగించవలెను.
అంతేకానీ,
పూర్వము
చేయవలసిన
కర్మలను
మాని,
అంత్య
ఫలము
కావాలంటే
అది
యెట్టి
వారికైననూ
లభించదు.
25
▾
Meaning
Keep
సాధకులు
కూడనూ
ముఖ్యముగా
తెలుసుకొనవలసినది,
యెట్లు
పుట్టవలెను
అనుదానికంటే
యెట్లు
చావవలెను
అనునదే.
చచ్చేదానిని
పట్టే
పుట్టుట
సంభవించును.
చావు
మొదలు-పుట్టు
తరువాత,
పుట్టేది
చచ్చే
కొరకనియు,
చచ్చేది
పుట్టే
కొరకనియూ
సామాన్య
మానవులు
తలంతురు;
కానీ,
అది
నిజము
కాదు.
పుట్టుట
పుట్టకుండుటకు;
చచ్చుట,
తిరిగి
చావకుండుటకు.
అనగా,
చచ్చినవాడు
పుట్టకుండ
ఉండవలెనని
అర్థము.
పుట్టిన
కదా
చావు,
పుట్టకున్న
చావే
లేదు.
26
▾
Meaning
Keep
దీనిని
పట్టి
సాధకులు,
మంచి
చావును
కోరవలెను
కానీ,
మంచి
పుట్టును
కోరరాదు.
పుట్టుట
మంచిగానే
పుట్టవచ్చును;
తదుపరి
మన
కర్మలను
పట్టి
మంచిది
రాకుండవచ్చు.
కనుక,
చావును
మంచిదిగా
కోరిన,
తిరిగి
పుట్టుకతో
పని
ఉండదు.
పుట్టిన
ప్రతి
మానవుడూ
అంత్యమును
ప్రధానముగా
లక్ష్యమందుంచుకొని,
ఉత్తమ
అంత్యము
కలుగునట్టి
సదభ్యాసములు,
సాధనా
రూపమున
సాధించవలెను.
అదియే
సాధకులకు
సరియైన
అనుగ్రహ
ప్రసాదము.
Previous
←
Asti Bhāti Priyam
Next
Thought of None Other at the Final Hour
→