Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · Thought of None Other at the Final Hour
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సామాన్య
మానవునకు
మరణ
సమయమున
మాధవ
చింత
రావలెనన్న,
అంత
సులభము
కాదు.
దానికినీ
పూర్వపు
సంస్కారము
ఆధారమై
ఉండవలెను.
మనసును
అభ్యాస
యుక్తము
చేయవలెను;
అంత
మాత్రమున
కూడనూ
పవిత్ర
స్మరణ
ప్రాప్తించదు.
అన్య
చింతనను
మనసున
చేరనివ్వక
వాటిపై
అసహ్య
భావన
పెరగవలెను.
2
▾
Meaning
Keep
ఈ
రెండింటి
వలననే
మరణ
సమయమున
మాధవ
చింతన
మనసున
చేరును.
దీనికినీ
మనసే
ప్రధానము.
మనసు
చెడెనా,
మనిషి
చెడును.
మనసు
స్థితిని
పట్టే
మనిషి
గతి
ఏర్పడును.
కానీ
మనసును
సంస్కరింపజేయు
కొరకు,
మంచి
అభ్యాసములు
కావలెను.
అందు
నిమిత్తమై
కృష్ణపరమాత్మ,
భగవంతుని
యెట్టి
భావముతో
స్మరించవలెనో,
భగవంతుని
స్వరూపమెట్టిదో
వర్ణించుటకు
మొదలు
పెట్టెను:
3
▾
Meaning
Keep
“బావా!
అర్జునా!
లోకమున
మానవులు
నన్ను
మూడు
విధములుగా
వర్ణింతురు:
మొదటిది
నిర్గుణ
నిరాకార
రూపమును,
రెండవది
సగుణ
నిరాకార
రూపమును,
మూడవది
సగుణ
సాకార
రూపమును.
ఇందులో
సగుణ
నిరాకార
రూపమును
మొదలు
తెలుపుదును.”
4
▾
Meaning
Keep
“ఇందులో
భగవంతుని
ఏ
విధముగా
స్మరింతురో,
విను.
కవి
అనియు,
పురాణుడనియు,
అనుశాసితుడనియు,
సూక్ష్మములన్నింటి
కంటే
సూక్ష్మ
స్వరూపుడనియు,
సర్వాధారుడనియు,
అచింత్యరూపుడనియు,
ఆదిత్యవర్ణుడనియు,
తమస్సుకు
అతీతుడనియు
వర్ణింతురు”
అని
అన్నాడు.
అంతలో
అర్జునుడు,
“స్వామీ!
సర్వ
సామాన్య
మానవులయందునూ
కవులు
కలరు
కదా?
అట్టి
సామాన్య
కవి
వర్ణన
పరమాత్మకు
యోగ్యమైనదా?
లేక
ఆ
‘కవి’
అను
వర్ణన
ప్రత్యేక
స్థానమునకు
చెందినదా?
కొంత
వివరింపుము”
అన్నాడు.
5
▾
Meaning
Keep
కృష్ణుడు,
“అర్జునా!
కవి
అనగా
కేవలము
కావ్యములు,
పద్యములు
వ్రాయుట
కాదు!
కవి
అనగా
‘సర్వజ్ఞత్వం.’
కాన,
భగవంతుడే
త్రికాలదర్శి;
అతనే
సర్వజ్ఞుడు.
కవి
చూడని
స్థానముండదు.
అందుకనే,
‘కవిః
సర్వజ్ఞః
క్రాంతదర్శి’
అని
ఉత్పత్తి.
ప్రతివాని
హృదయమందును
క్రాంతి
కలిగించునది
భగవంతుడే.
వేయేటికి?
సర్వ
సృష్టికి
కవియే
ఆధారము.
కాన,
కవి
అనగా
‘సర్వజ్ఞుడ’ని
కానీ
వేరు
కాదు.
భగవంతుడు
అక్షర
కవి.
అతని
కవిత్వం
అమృత
కావ్యం”
అని
వివరించినాడు.
“స్వామీ!
రెండవది
‘పురాణుడ’ని
అంటిరి.
అది
యెట్టిది?
దాని
అంతారార్ధమును
తెలుపుడు”
అన్నాడు
అర్జునుడు.
“అర్జునా!
ఎంత
పాతవాడయిననూ
అంతకంతకు
క్రొత్తవాడగుచుండును!
అట్టి
వాడు
భగవంతుడు.
అతనే
సనాతనుడు,
ఎప్పటికప్పుడు
నూతనుడు.
అందుకనే
‘పురా
నవమితి
పురాణం’”
అని
అన్నాడు.
6
▾
Meaning
Keep
“ఇంక
‘అనుశాసితుడు’
అనగా
ఏమి?”
అన్నాడు
అర్జునుడు.
“అతను
‘సర్వతంత్ర
స్వతంత్రుడు’.
అతడు
అందరి
యందునూ
శాసనము
చేయువాడు.
పంచభూతములు
సహితము
అతని
ఆజ్ఞకు
బద్ధులు
కావలెను.
అతడు
శాసించిన
శాసనముల
హద్దులను
మీరి
పోవుటకు
వాటికి
కూడనూ
సాధ్యము
కాదు.
లోకమున
ఏ
శాసనము
చేసిననూ,
అది
బాహ్య
సంబంధమైనది
కానీ,
పరమాత్ముని
శాసనము
అట్టిది
కాదు,
అంతర్యామియై
శాసించును.
అనగా
మనసును
కనిపెట్టి
శాసించువాడు.
కనుక
అతను
‘సర్వతంత్ర
స్వతంత్రుడు’
అని
భావించు”
అని
భగవానుడనెను.
7
▾
Meaning
Keep
“స్వామీ!
నాలుగవదయిన
‘సూక్ష్మ
రూపుడు’,
అతను
ఎట్లుండును?
సూక్ష్మమనగా
యేమో
సెలవిండు”
అన్నాడు
అర్జునుడు.
8
▾
Meaning
Keep
“పార్థా!
సూక్ష్మమనగా
చిన్నదేహము
కలవాడని
తలంచితివేమో!
కాదు,
కాదు.
దీనికి
‘నిర్గుణు’డని
అర్థము.
దీనిని
ఇంద్రియములతో
తెలిసికొన
సాధ్యము
కాదు.
వస్తువు
యొక్క
గుణములు
తగ్గుకొలదీ
ఆ
వస్తువు
సూక్ష్మమవుతుంది.
ఎట్లన,
పంచభూతములు
(ప్రపంచ
వస్తువులు)
వున్నవనుకో;
అనగా
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధములు
వాటి
వాటి
గుణములు.
భూమి
మొదటిది,
రెండవది
జలము,
మూడవది
అగ్ని,
నాలుగవది
వాయువు,
ఐదవది
ఆకాశము,
కదా?
ఇవి
ఒకదానికంటే
ఒకటి
తేలికయి
సూక్ష్మమవుచున్నవి;
ఇది
ప్రత్యక్ష
ప్రమాణము.”
9
▾
Meaning
Keep
“భూమిలో
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధములు
ఐదునూ
కలవు.
అందువలన
భూమి
అతి
భారమైనది.
రెండవదైన
నీరులో
శబ్ద,
స్పర్శ,
రూప,
రసమను
నాలుగు
మాత్రమే
కలవు.
అందులో
గంధము
ఒకటి
తగ్గినది.
దాని
వలన
కొంత
తేలికయి,
అది
ప్రవహించుచున్నది.
ఇక
మూడవదైన
అగ్నియందు
శబ్ద,
స్పర్శ,
రూపము
మాత్రమే
ఉన్నవి.
రస,
గంధములు
లేవు.
ఆ
కారణముచే,
అగ్ని
మరికొంత
సూక్ష్మమై
పైకి
లేచుచున్నది.
వాయువు
నాలుగవది;
అందులో
శబ్ద,
స్పర్శ
మాత్రమే
నిలిచి,
రూప,
రస,
గంధములు
లేనందున
అది
మరింత
సూక్ష్మమయి
సర్వవ్యాపి
అయినది.
తరువాత,
ఆకాశము;
అందులో
శబ్దము
మాత్రము
మిగిలినది.
తక్కిన
స్పర్శ,
రూప,
రస,
గంధములు
లేనందున
ఆకాశము
అన్నింటికంటే
తేలిక
అయినది.”
10
▾
Meaning
Keep
“ఈ
ఐదు
సూక్ష్మ
వస్తువులకంటే,
తాను
అతీతుడయి
ఉండుటచే
అతని
యందు
ఏ
గుణములూ
లేనందున
భగవంతుడు
సూక్ష్మాతి
సూక్ష్మ
స్వరూపుడయి
ఉన్నాడు.
అన్నింటికంటే
వ్యాపకుడయి
యన్నాడు.
గుణములు
బరువుగా
ఉండును.
భగవంతుడు
గుణాతీతుడు;
కనుక
అతను
ఏ
బరువూ
లేక
సూక్ష్మాతి
సూక్ష్మ
రూపుడయి
ఉన్నాడు”
అని
కృష్ణుడు
తెలిపెను.
11
▾
Meaning
Keep
“ఇక
ఐదవది
‘సర్వాధారుడు’.
అనగా,
లోకమున
ఆధారము
ఒకటి,
ఆధేయము
ఒకటి
అని
రెండు
కలవు.
మన
కంటికి
కనుపించు,
చెవులకు
వినుపించు,
ఒకటేమి,
సృష్టి
యావత్తు
ఆధేయము.
ఈ
సృష్టి
అంతయూ
పై
చెప్పిన
పంచభూతములతో
నిండినది.
అనగా,
భూమి,
జలము,
అగ్ని,
వాయువు,
ఆకాశము.
ఇవి
ఆధేయములే.
ఎట్లన,
ఇవి
అన్నియూ
భగవంతుని
ఆధారముతో
నిలిచినవి.
వీటికన్నింటికి
ఆధారుడు,
ఆ
దేవుడు.
అతనికి
వేరు
ఆధారము
మరొకటి
లేదు.
కనుక
అతనే
సర్వాధారుడని
తేలినది.”
12
▾
Meaning
Keep
“ఆరవది
తెలిపెదను
వినుము.
‘అచింత్య
రూపుడు’
అనగా
‘చింతింప
వీలుకాని
వాడు’
అని
అర్ధము.
చింతించేది
యేది?
మనసు
కదా.
కనుక
మనసుతో
చింతించ
వీలుకానిదని
అర్ధము.
ఎట్లని
నీకు
సంశయము
కలుగవచ్చును.
బావా!
విను.
మనుసు
క్షణికం.
అంతేకాదు;
జడము.
పరమాత్ముడు
చూతమా,
నిత్య
వస్తువు,
చైతన్యుడు
కూడాను.
ఇవి
విచారించిన
ఒకదానికొకటి
పూర్తి
విరుద్ధము.
క్షణికం,
నిత్యత్వం
ఒకదానికొకటి
సంబంధము
లేదు.
ఒకటి
లేనిది,
మరొకటి
ఉండునది.
ఇక
జడము,
చైతన్యము.
ఇవియూ
అంతే;
ఒకదానికొకటి
పొందిక
లేవు.
అలాంటి
జడము,
క్షణికమూ
అయిన
మనసు,
నిత్యము,
చైతన్యము
అయిన
పరమాత్ముని
యెట్లు
చింతింపగలదు?
“అటులైన
సాధకుని
గతేమి?”
అని
కూడనూ
నీవు
అడుగవచ్చును.
వానికి
గతి
లేకపోలేదు,
బావా!
పరమాత్ముని
‘అచింత్యరూపు’డని
చింతించిన
చాలును.
తప్పక
వానికి
గతి
కలుగును.
చింతించవలసిన
మార్గమున
చింతించిన,
రావలసిన
మార్గమున
ఫలితము
వచ్చి
తీరును.
కాన
చింతించవలసిన
విధానమును
కూడనూ
సాధకుడు
మొదలు
తెలిసికొనవలెను.”
అప్పుడు
అర్జునుడు,
“సరి
స్వామీ!
ముందుకు
నడచుదుము,
కాలము
సమీపించుచున్నది.
మనము
ఏ
బాధ్యతా
లేక
ఈ
యుద్ధభూమిన
నిలువలేదు
కదా?
ముందుకు
ముంచుకు
వచ్చుచున్నది,
మన
పాలిటికి
యుద్ధము.
నీవు
త్వరత్వరగా
ఏమి
ఆజ్ఞ
ఇత్తువో
ఆ
రీతిగా
చేయుటకు
సిద్ధముగా
ఉన్నాను.
కాన,
మిగిలిన
ఏడవదాని
గురించి
తెలుపుడు”
అని
అన్నాడు.
13
▾
Meaning
Keep
“అర్జునా!
‘ఆదిత్య
వర్ణం’.
అనగా
సూర్యుని
వలే
‘స్వయం
ప్రకాశకుడు’
భగవంతుడని
అర్థము.
అంతేకాదు,
సూర్యుని
ప్రకాశము
కూడనూ
పరమాత్ముడే.
లోకమును
ప్రకాశింపజేయువాడు
సూర్యుడైతే,
సూర్యుని
కూడా
ప్రకాశింపజేయువాడు
భగవంతుడు
కనుక
అతనికి
‘ఆదిత్యు’డని
పేరు
వచ్చినది.”
14
▾
Meaning
Keep
“ఇక
ఎనిమిదవ
దానిని
కూడనూ
తెలిపెదను
వినుము.
‘తమస్సుపరుడు’.
తమస్సు
అనగా
‘అజ్ఞానము’,
పరుడు
అనగా
‘సాక్షి’.
అజ్ఞానమునకు
సాక్షి
అని
అర్థము.
బావా!
మాయ
అన్ననూ,
అజ్ఞానమన్ననూ
ఒకటే
కనుక,
అట్టి
మాయకు
అతీతమైన
వాడు
పరమాత్ముడు
అని
కూడనూ
తలంచవచ్చును.
బావా!
ఒకతూరి
కన్నులు
మూసుకొని
చూడు,
ఏమున్నదో
తెలియగలదు.
కన్నులు
మూసుకొన్న
ఏమున్నది?
అంతా
ఒకే
చీకటి.
ఔనా
కాదా?
ఆ
చీకటి
నీకెట్లు
తెలిసినది?
తెలియకున్న
చీకటి
అని
యెట్లనుచున్నావు?
అక్కడ
చీకటి
ఒకటి,
చూచుట
మరొకటి,
రెండు
ఉన్నవి
కదా.
నీవే
చీకటి
అయిన,
నీవు
ఎట్లు
చూడగలవు?
నీవు
చూచుచున్నావు
కనుక
నీవు
చీకటివి
కాదు.
చీకటిని
చూచినట్టు
సాక్షివి.
బావా!
మరొకటి
యోచించుకో.
మానవుడు
ఒక్కొక్క
సమయమున
“నేను
అజ్ఞానిని;
నాకేమి
తెలియదు”
అని
తనను
తాను
నిందించుకొంటూ
ఉంటాడు.
నిజముగా
వాడు
అజ్ఞానియే
అయి
ఉండిన
“నేను
అజ్ఞాని”
అని
తెలిసికొను
జ్ఞానము
ఎక్కడ
నుండి
వచ్చినది?
ఎట్లు
వచ్చినది?
అజ్ఞానము
దృశ్యము,
జ్ఞానము
దృక్కు,
అజ్ఞానమును
చూచే
సాక్షివే
నీవు
కానీ,
అజ్ఞానము
నీవు
కాదు.
ఇదే
విధముగానే
పై
చెప్పిన
ఎనిమిది
వర్ణనలనూ
ఎవరు
చింతింతురో
అది
సరియైన
స్వరూప
చింతన
బావా!”
అర్జునుడు,
“కృష్ణా!
ఈ
విధమైన
చింతన
చేసినంత
మాత్రమున
సరిపోవునా
లేక
మరింకేమైననూ
వీటికి
జత
చేర్చవలెనా?”
అని
అడిగెను.
15
▾
Meaning
Keep
కృష్ణుడు,
“పార్థా!
ఇట్టి
చింతన
చేయు
సమయమున
మనసును
ఒక
వస్తువు
మీదనే
కేంద్రీకరించవలెను.
మనసు
ఒక
వస్తువును
మాత్రమే
పట్టుకొనవలెను.
కానీ
అనేక
వస్తువుల
యందు
సంచరించరాదు.
అంతియే
కాక
ఆ
పట్టిన
వస్తువుపై
ప్రీతి,
భక్తి
కలవాడై
యుండవలెను.
సామాన్యముగా
మానవుల
ప్రేమ
సామాన్యమైన
అస్థిర
పదార్థముల
పై
పడి
వ్యర్థమగుచున్నది.
అనేక
దుఃఖములకూ
బాధలకూ
చిక్కుకొనుచున్నది.
అట్టి
ప్రేమను
ప్రపంచ
వస్తువుల
నుండి
మరల్చి
భగవంతుని
పై
మరలించిన
ధన్యుడు
కాగలడు.
భక్తి
అనగా
ఏమో,
కొంత
తెలిపెదను
వినుము.
తన
ధ్యేయ
వస్తువుతో
చిత్తవృత్తి
తదాకారము
చెందుటే
సరియైన
భక్తి
కాగలదు.”
“ఇది
యెట్లు
సాధ్యమగును
స్వామీ?”
అన్నాడు
పార్థుడు.
“అర్జునా!
ఇంద్రియ
ద్వారములన్నింటిని
సంయమము
చేసి,
మనసును
హృదయ
స్థానమున
నిరోధించి,
ప్రాణమును
శీర్షస్థానమున
స్థాపించి,
ఆత్మ
సంబంధమగు
యోగ
ధారణను
అవలంబించినవాడై
ప్రాణప్రయాణ
సమయమున
“ఓం”
అను
బ్రహ్మమును
ఉచ్చరిస్తూ
శరీరమును
వదలిన
అట్టి
వాడు
నన్ను
చేరును.
చిత్తవృత్తి
తదాకారము
పొందును”
అని
కృష్ణుడు
అన్నాడు.
16
▾
Meaning
Keep
ఇచ్చట
పరమాత్మ
అన్న
మాటలను
ప్రధానముగా
పాఠకులు
గమనించవలెను.
ఇంద్రియముల
విషయము
తెలుపుతూ
వాటిని
సంయమము
చేయమన్నాడు
కానీ,
నిగ్రహము
చేయమని
తెలుపలేదు.
సంయమము
అనగా
స్వాధీనము,
నిగ్రహమనగా
నిర్వ్యాపారము
చేయటము,
అనగా
పూర్తి
బంధించడము.
అందులోనూ
ఇంద్రియముల
ద్వారములను
అన్నింటిని
సంయమము
చేయమన్నాడు
కానీ
కొన్నింటిని
మాత్రము
తెరచి
కొన్నింటిని
స్వాధీనము
చేయమని
తెలుపలేదు.
సర్వేంద్రియములను
స్వాధీనమున
ఉంచుకొనవలెనన్నమాట.
ఏ
ఏ
ఇంద్రియము
ఏ
ఏ
కార్య
నిమిత్తము
అనుగ్రహించినాడో
వాటిని
అవసరమొచ్చినపుడు
మాత్రమే
వినియోగించవలెను.
అట్లు
కాక
ఇంద్రియ
శక్తి
ఉన్నది
కదా,
అని
ఇష్టమొచ్చినటుల
వినియోగించకూడదు.
హద్దునందుంచుకొని
అవసర
సమయమున
క్లుప్తముగా
వాడుకొనవలెననే
భావము.
17
▾
Meaning
Keep
అంతేకాక
యేది
మన
హృదయమును
వికసింపచేయునో,
ఏ
విషయము
మనకు
అశాంతి
కలిగించునో
ఆ
విషయమును
యోచించి
వాటిని
సక్రమమైన
మార్గమున
సాగించుకొని
రావలెను.
అట్లుకాక
వక్రమ
మార్గమున
వదలుటచే
తిక్క
కోతి
వలె
దిక్కు
తెలియక
చలించుచూ,
తిరుగుచూ
ఉండవలసి
వచ్చును.
ఇపుడు
లోకమున
అనేకమంది
అనేక
విధముల
బాధలకు
గురియై
అశాంతిని
పొందుచున్నారన్న,
వాటన్నింటికి
కారణము
సక్రమ
మార్గమున
ఇంద్రియములను
వినియోగ
పెట్టుకొనకుండుటే
అని
తలంచవలెను.
లేకున్న
అశాంతి
వచ్చుటకు
వేరు
కారణములు
లేవు.
ఏ
ఏ
ద్వారమున
యెట్టి
రాకపోకలు
అని
చక్కగ
విచారించవలెను.
ఒకటి
వచ్చు
మార్గమున,
మరొకటి
ప్రవేశమైన
అపుడే
ఆ
యింటిలో
అశాంతి,
అలజడి
ప్రారంభమగును.
వచ్చిన
తరువాత
విచారించుటకంటే
పూర్వమే
జాగ్రత్త
పడిన
ఉత్తమ
మార్గము.
పోనీ,
ఒకతూరి
దారి
తప్పిననూ
రెండవ
తూరైననూ
అట్టి
పొరపాటు
జరగక
ఉండునటుల
చూచుకొనవలెను.
అది
మధ్యమము.
18
▾
Meaning
Keep
తరువాత,
ఇంద్రియములను
అధీనములో
బంధించిన
యెట్లు
ఓంకారోచ్చారణ
జరుగునని
అర్జునునికి
సంశయము
పుట్టినది.
అపుడు
పరమాత్మ
మనసెరిగి,
“బావా!
ఓంకారోచ్చరణ
మనసుతో
జరగవలెను.
కానీ,
వాక్కులతో
కాదు”
అని
ఎదురందుకొన్నాడు.
తరువాత,
అర్జునునకు
మరొక
సంశయము
మొలకెత్తెను.
“కృష్ణా!
‘జపతోనాస్తి
పాతకం’
అన్నావు
కదా?
జపముచే
పాపము
మాత్రము
పోవును,
పరమాత్మ
ప్రాప్తియెట్లు
లభించును?”
అని
అడిగెను.
అపుడు
పరమాత్ముడు
అర్జునుని
ప్రశ్నకు
సంతసించి,
“పార్థా!
నీవడిగిన
ప్రశ్న
చాలా
అవసరమైనదే.
కానీ
అది
ప్రత్యేకించి
వేరు
క్రియగా
చేయనక్కరలేదు.
ఓంకార
మంత్రమును
ఉచ్చరించుచూ,
ఆ
ఓంకార
మంత్రార్థమైన
పరమాత్ముని
భావన
చేసినంత
మాత్రమున
పరమాత్మ
ప్రాప్తి
కూడా
చేకూరును”
అని
అన్నాడు.
“స్వామీ!
రెండునూ
ఒక
పర్యాయము
చేయ
ఇది
సాధ్యమయ్యే
పనేనా?
ఏదో
తమరు
త్వర
త్వరగా
చెప్పుకొని
పోవుట
సులభము
కానీ,
ఆచరించుట
చాలా
ప్రయాసయైన
పని
కాదా
స్వామీ!”
అని
అన్నాడు
అర్జునుడు.
19
▾
Meaning
Keep
“పార్థా!
అందుకనే
అభ్యాస
యోగము
ఉండవలెనని
మొదలే
తెలిపియున్నాను
కదా!
అభ్యాసము
ద్వారా
ఆ
రెండు
పనులు
మనసు
అతి
సులభముగా
చేయగలదు.
అందుకు
అభ్యాసము
ప్రధానమని
తలంచ
వైతివి
వెర్రి
బావా!
అల్పమైన
ప్రాణి
అభ్యాసముతో
అనేక
ఘనకార్యములు
చేయుట
నీవు
చూచుట
లేదా?
వేయేటికి?
అసలు
నీ
రథమునకు
కట్టిన
గుఱ్ఱములు
కానీ,
యుద్ధభూమిలో
నిలచియున్న
గజములు
కానీ,
మనకు
తెలివితేటలు
కల
మానవుడు
కూడనూ
చేయలేనంతటి
సహాయమును,
చేయుచున్నవన్న
కారణమేది?
విషయమును
యోచించు,
దీని
కారణమేదో
విచారించు;
సులభముగా
తేటతెల్లమగును.
అడవులయందు
సంచరించు
గజములు
యుద్ధపద్ధతులు
ఏనాడు
చూచినవి?
లేక
వాటికి
మొదటి
నుండియూ
ఇట్టి
యుద్ధమున
పోరాడుట
సహజమైన
విద్యయా?
కాదు,
కాదు.
ఇవన్నియూ
అభ్యాసము
ద్వారా
ఆచరణకు
వచ్చినవని
తలంచవలెను.”
20
▾
Meaning
Keep
“అటులనే
మనసును
ఇంద్రియముల
నుండి
ఉపసంహరించు
అభ్యాసమును
చాలా
కాలము
పాటించిన
దానికి
అట్టి
శక్తి
సామర్థ్యములు
అలవడును.
ఓంకారోచ్చార
పూర్వకంగా
పరమాత్మను
స్మరిస్తూ
ప్రాణమును
వదలిన
అట్టివాడు
తప్పక
భగవంతుని
పొందుచున్నాడు”
అని
కృష్ణుడు
గట్టిగా
తెలిపినాడు.
అందులకు
పార్థుడు
సాహసించి,
“స్వామీ!
అట్టి
పవిత్ర
ప్రణవోచ్ఛారణ
అంత్యమందు
స్మరించు
వారికే
భగవంతుడు
ప్రాప్తించిన
మిగిలిన
వారి
గతి
యేమైపోవును?
వారి
సంఖ్యయే
అధికము
కదా!
వారికింక
విమోచనే
లేదా?
భగవద్దర్బారులో
దర్జాగల
వారికే
స్థానమైన,
దీనులకు
చోటే
లేదన్న
మాట.
పోనీ
వారికి
చోటెక్కడో,
ప్రవేశమెక్కడో
తెలుపుడు”
అన్నాడు.
21
▾
Meaning
Keep
“అర్జునా!
పొరబడుతున్నావు;
భగవంతునకు
‘దీనులు,
ధీరులు’
అను
వ్యత్యాసము
కానీ,
‘అధికులు,
అల్పుల’ను
తారతమ్యము
కానీ,
ఏనాటికీ
లేదు,
రాదు.
భగవదనుగ్రహమునకు
అందరూ
అర్హులే.
అతని
దర్బారు
లోనికి
అందరికీ
ప్రవేశమున్నది.
దాని
ద్వారములు
ఎప్పుడూ
తెరువబడియుండును.
కాపలావారు
అసలే
లేరు.
వచ్చు
వారిని
అడ్డు
పెట్టుట
లేదు!
రానీ
అని
వారిని
ఆహ్వానించుట
లేదు.
ద్వారమున
ప్రవేశించిన
ప్రతివారికీ
స్వాగతమే.
కానీ,
ద్వారము
చెంతకే
రాని
వారిని
ఎవరేమి
చేయగలరు!
నిప్పువేడి
కావలెనన్న
వారు
నిప్పుకు
సమీపమునకు
వెళ్ళి
కూర్చొన్న
వేడిని
అనుభవించవచ్చును.
దూరమున్న
వారికి
వెలుతురు
మాత్రమే
తెలియును,
వేడి
తెలియదు.
అంతమాత్రమున
నిప్పుకు
వేడిలేదని
తలంచుట
ఎంత
వెర్రితనము!
అటులనే
భగవంతుని
సన్నిధి
కావలెననియు,
అనుభవించవలెననియు,
ప్రవేశము
కావలెననియూ
ఎవరు
ఆరాటపడి
నిరంతరము
చింతింతురో
అట్టి
వారందరికీ
అచట
చోటు
కలదు.
అందరికీ
అంత్య
సమయమున
ప్రణవోచ్ఛారణ
మానసికముగా
చేయుట
సాధ్యము
కాదు.
అందుకనే,
నిరంతరము
నిర్మల
చిత్తముతో
స్మరించిన,
అట్టి
వారి
యోగక్షేమములను
తప్పక
చూచుకొందును.
దానికి
కూడనూ
అభ్యాసము
అవసరము.
‘సాధన’
వలననే
సర్వమూ
సమకూరును.
దేనికి
కానీ,
‘సాధనాభ్యాసములు’
ప్రధానము;
‘అనన్య
చింత’
నన్ను
చేరుటకు
ఆధారము”
అని
భగవానుడుపదేశించెను.
Previous
←
I Am the Doer and the Enjoyer Too
Next
The Final Hour: The Arcirādi Paths
→