Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Final Hour: The Arcirādi Paths
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
“అనన్య
చిత్తముతో
నిత్యయుక్తుడై,
సతతము
నన్ను
ఎవరు
స్మరింతురో
అట్టివాడు,
ప్రాణము
ఊర్ధ్వ
ద్వారము
నుండి
వదలనీ,
మరే
ద్వారము
నుండి
వదలనీ,
వాడు
నన్ను
తప్పక
పొందుచున్నాడు.
అట్టివానికి
నాలో
స్థానమున్నది.
వాడు
నాకెంత
సమీపమో,
నేనునూ
అతనికంత
సమీపమే.
నన్ను
మరువని
వానిని
నేను
మాత్రము
మరతునా,
బావా?
అసలు,
మరపు
మానవత్వమునకే
కానీ
దైవమునకు
లేదు.”
2
▾
Meaning
Keep
“యోగము
వద్దు,
తపస్సు
వద్దు,
జ్ఞానము
వద్దు.
ఇన్ని
చేయు
శక్తి
లేకపోయిననూ
సరే,
శక్తి
యుండియూ
చేయకపోయిననూ
సరే,
నేను
యోగమును,
తపస్సునూ
కోరుటలేదు.
కేవలము
చిత్తము
నాపై
పెట్టమనియు,
చిత్తము
నాకర్పితము
చేయుమని
మాత్రమే
అడుగుదును.”
3
▾
Meaning
Keep
“అంత
మాత్రము
భగవంతునకు
అర్పితము
చేయలేకున్న,
అట్టివాని
సాధన
ఏమి
సాధన?
అనన్య
చిత్తముతో
నన్ను
స్మరించేటందుకు
శక్తిలేని
మానవుడు,
అనవసరమైన
అస్థిరమైన
ఆలుబిడ్డలకూ,
కీర్తి
మర్యాదలకూ,
పదవీ
ప్రతిష్ఠలకూ,
అర్పితము
చేయుచున్నాడే
ఆ
శక్తి
యెక్కడిది?
అన్నింటికీ
చేయుటకు
ఉన్న
శక్తి
భగవంతునకు
అర్పితము
చేయుటకు
లేదా?”
4
▾
Meaning
Keep
“మానవుడు
విషయాసక్తుడైనందున
విషపూరితమైన
విషయాలకైనా
మనసును
సులభముగా
అర్పితము
చేయును
కానీ,
విశ్వేశ్వరునకు
చేయవలెనన్న,
ఏమో
కొండ
విరిగి
మీద
పడినంత
బాధపడును.
తరించటమన్న,
బజారునందలి
తోటకూరని
తలంతురో
ఏమో!
అంత
సులభముగా
తరించవలెనని
కోరుదురు.
తపించుట
తక్కువ;
తమస్సు
ఎక్కువ.
తత్ఫలితమైన
ప్రాప్తి
మాత్రము
అధికముగా
కావలెనని
ఆశింతురు.”
5
▾
Meaning
Keep
“అట్టి
ఆశయే
నిజముగా
ఉన్న,
అట్టి
సాధకుడు
తన
సాధనకు
ఎన్ని
ఇక్కట్లు
కలగిననూ,
ఎన్ని
విధముల
నిరాశలు
సంభవించినప్పటికినీ,
విసుగు,
వేసరపాటు
చేరనీయక
అనన్య
చిత్తముతో
సదా,
సర్వదా
చింతించుచుండిన,
అట్టి
వానికి
భగవంతుడు
అన్యముగా
ఉండక
తదాత్మ
స్వరూపుడై,
‘తానే
నేను,
నేనే
తాన’ను
(అనగా
‘అహం
బ్రహ్మాస్మి’
అను
స్థితి)
అనుసంధానము
నిత్యం,
నిరంతరం
జరుగుచుండును.
అట్టి
దానినే
‘అనన్య
భావ’మని
కూడనూ
అందురు”
అని
కృష్ణభగవానుడు
వచించెను.
6
▾
Meaning
Keep
అపుడు,
అర్జునుడు
“స్వామీ!
అనన్య
భక్తి
చాలా
సులభమనియూ,
వేరు
శ్రమలు
పడనక్కరలేదనియూ
అంటిరి.
అంతియే
కాక,
అట్టివారికి
‘నేను
కూడనూ
సులభుడనే’,
అనిరి
కదా?
మీరు
సులభుడైన,
సాధకునకు
వచ్చు
లాభమేమి?
దాని
వలన
సాధకుడు
ఏ
విధమైన
ఫలమును
అనుభవించునో
తెలుపుడు”
అని
ప్రశ్నించినాడు.
7
▾
Meaning
Keep
దానికి
కృష్ణపరమాత్మ
చిరునవ్వు
నవ్వి,
“బావా!
భగవత్
ప్రాప్తి
వలన
ఫలమేమని
అడుగుటలో
అర్థము
లేదు.
ఇక,
అంతకంటే
వేరు
గొప్ప
ఫలమేమున్నది?
అట్టి
పవిత్ర
ప్రాప్తి
వలననే,
పామరుడైన
మానవుడు
మహాత్ముడగుచున్నాడు.
మహాత్ముడైన
ఫలమేమి?
అని
తిరిగి
నీకు
సంశయము
కలుగవచ్చు.
విను!
మానవునకు,
మహాత్మునకు
చాలా
భేదములు
కలవు.
మానవుడు
జీవభావమును,
దేహభావమును
పొంది,
అందువలన
కలుగు
సుఖదుఃఖములకు
క్రుంగి
పొంగుచు,
అశాంతి
ప్రశాంతులకు
మధ్యగల
అనేక
కష్టములకు
గురియగుచున్నాడు.
మహాత్ముడు
అట్లు
కాదు.
అతనికి
దేహభావము,
జీవభావమూ
పూర్తి
నశించి,
బ్రహ్మభావమే
పొందియుండును.
అట్టి
మహాత్ముడు,
ఆత్మ
పరిచ్ఛిన్నమైనది
కాదనియూ
అపరిచ్ఛిన్నమైనదనియూ,
తెలుసుకొని,
తాను
కూడనూ
అపరిచ్ఛిన్నమైయుండును.”
8
▾
Meaning
Keep
“అట్టి
మహాత్మునకు
అంతఃకరణములందు
రజో
తమోగుణముల
యొక్క
మాలిన్యము
ఉండదు.
అట్టి
శుద్ధమైన
అంతఃకరణము
కలవారినే
‘మహాత్ము’లని
అందురు.
కానీ
నేటి
రోజులలో
మహాత్ములన్న
పేరు
మాత్రమే
కానీ,
అంతఃకరణములందు
అన్నివిధములైన
మాలిన్యములూ
కరుడుగట్టి
కదలలేని
స్థితిలో
ఉండును.
నిజమైన
అంతఃకరణ
శుద్ధిగల
వారికి
తిరిగి
జనన
మరణములుండవు.
వారు
తిరిగీ
లోకమునకు
రానక్కరలేదు.
అదిలేక,
యెన్ని
పుణ్యకార్యములు
చేసిననూ,
ఎట్టి
స్థితిని
సాధించిననూ,
ఏ
లోకమునకు
వెళ్ళిననూ,
తిరిగీ
రాక
తప్పదు.
నిరంతరం
బ్రహ్మభావములో
నుండునట్టి
మహాత్ములు
మాత్రమే
కాలాతీతమైన
నన్ను
చేరి
పునర్జన్మమనునది
లేక
తదాత్మాకారమునే
పొందుదురు”
అని
అన్నాడు.
9
▾
Meaning
Keep
అంతలో
అర్జునుడు
అందుకొని,
“స్వామీ!
అట్లయిన
ఉపనిషత్తులలో
బ్రహ్మలోకమునకు
వెళ్ళిన
వానికి
పునరావృత్తి
లేదని
తెలిపితిరి,
కదా?
పునరావృత్తి
ఎవరికి
లేదు?
అది
కొంత
వివరింపుము”
అన్నాడు.
10
▾
Meaning
Keep
“బావా!
ఉపనిషత్తులలో
ముక్తి
రెండు
విధములుగా
తెలుపబడినది.
ఒకటి,
‘సద్యోముక్తి’,
రెండవది
‘క్రమ
ముక్తి’.
సద్యోముక్తిని
‘కైవల్య
ముక్తి’
అని
కూడ
అందురు.
అట్టివారు
ఏ
లోకమునకూ
పోనక్కరలేదు.
వారు
అక్కడికక్కడనే
భగవత్
ప్రాప్తిని
పొందుదురు.
అది
నిత్యమైన
స్థితి.
మిగిలిన
ఎట్టి
ప్రాప్తులైననూ
అనిత్యమైనవే.
తాను
చేసిన
పుణ్య
కర్మల
ఫలము
ఎంత
వరకు
ఉండునో,
అంతవరకు
స్వర్గాది
లోకములందుండి
తిరిగి
రావలసి
యుండును.
వీరికి
‘లయము’
అనునది
ఉండదు.
కైవల్యమును
పొందినవారికి
మాత్రమే
లయము.”
11
▾
Meaning
Keep
“కృష్ణా!
లయమునకును
నాశమునకూ
భేదమేమి?
రెండూ
ఒకటే
కదా?”
12
▾
Meaning
Keep
“పార్థా!
లయమంటే
నాశము
కాదు.
కంటికి
కానరాని
స్థితినొందుట
లయమని
అందురు.”
13
▾
Meaning
Keep
“స్వామీ!
కంటికి
కానరాకుండుట
నాశముకాక
మరేమి?”
14
▾
Meaning
Keep
“బావా!
కంటికి
కానరానంత
మాత్రమున
నాశమని
తెలుపుట
చెల్లదు.
ఎటులన
లవణము
కానీ,
పంచదార
కానీ
జలములో
వేసిన
అది
నీటిలో
చేరి
కంటికి
కనుపించక
పోవును.
దానిని
నాశమందువా?
లయమందువా?
నాశమయిన
దాని
రుచి
తెలియచున్నదే
నీటి
ద్వారా,
లేదని
ఎటులందువు?
ఉండియూ,
తన
గుణమును
మాత్రము
తెలుపుతూ,
నిరాకారమైన
తత్వమును,
లయమని
అందురు.
నీటిలో
చేరిన
లవణమువలే,
బ్రహ్మముతో
చేరిన
జీవమునూ
లయమని
అందురు.
అది
ఏనాటికీ
నశించదు.
అట్లు
కైవల్యమును
పొందక
కర్మల
ద్వారా
పుణ్యములు
సలిపిన
వారు
స్వర్గాది
లోకములకు
వెళ్ళి
తిరిగి
వచ్చి
కొన్ని
సాధనలను
సలిపి
తత్ఫలితములను
అనుసరించుచుందురు.”
15
▾
Meaning
Keep
“కృష్ణా!
బ్రహ్మలోక
పర్యంతం
ఏ
లోకమునకు
వెళ్ళిననూ
పునర్జన్మము
తప్పదనిన,
ఇక
రాహిత్యమునకు
మార్గమేది?
అట్టి
వారి
గతి
అంతేనా?”
16
▾
Meaning
Keep
“పార్థా!
ఇట్టి
అనిత్య
లోకములకంటే
విలక్షణమైన
నిత్యస్థితి
మరొకటి
కలదు.
మానవులయందునూ
ఇది
అనేక
మార్గముల
పొడసూపబడుచున్నది.
దానిని
తెలిసికొనలేక
సక్రమమేదో
వక్రమమేదో
తెలియని
మార్గముల
ప్రయాణములు
చేయుచున్నారు.”
17
▾
Meaning
Keep
“మానవులు
ఇపుడు
నడుచుచున్న
మార్గములు
నాలుగు.
మొదటి
మార్గము
కర్మాతీతమైనది.
రెండవది
నిష్కామకర్మ
మార్గము.
మూడవది
కామ్యకర్మ
మార్గము.
నాల్గవది
కర్మభ్రష్టు
మార్గము.”
18
▾
Meaning
Keep
“ఇందులో
మొదటి
వారైన
కర్మాతీతులు,
జీవన్ముక్తులు!
వారు
చేసిన
సర్వకర్మలూ
జ్ఞానాగ్నితో
భస్మమై
పోవును.
చేయవలసినవనియూ,
చేయరాని
వనియూ
విధి
నిషేధములు
లేవు.
19
▾
Meaning
Keep
సాధనలు,
దాన
ధర్మములు,
తపములు
కూడా
వేరే
ఏమీ
ఉండవు.
వారు
చేసిన
కర్మలన్నియూ
భగవత్
కర్మలగనే
మారును.
వారు
తమ
కాలుపెట్టిన
స్థానమంతయూ
కైవల్యముగానే
ఉండును.
ప్రతి
మాట
బ్రహ్మవాక్కుగానే
మారును.
అట్టి
వారు
దేహమును
విడిచిన
తక్షణమే
వారి
ప్రాణము
ఎక్కడో
పోనక్కరలేదు.
అక్కడికక్కడే
బ్రహ్మమును
పొందును.
అట్టివారే
పైన
చెప్పిన
కైవల్య
ప్రాప్తికి,
బ్రహ్మ
ప్రాప్తికి,
సద్యోముక్తికి
సంబంధించిన
వారు.”
20
▾
Meaning
Keep
“తరువాత,
రెండవ
తెగవారు,
నిష్కామకర్మ
యోగమును
అవలంబించు
వారు;
వీరినే
ముముక్షువులని
అందురు,
అనగా
మోక్షాపేక్ష
కలవారని.
వీరు
చేయు
సర్వకర్మలూ
భగవత్
ప్రాప్తి
భావముతోనే
చేయుదురు.
వేరు
ఫలములనాశించరు.
వీరు
సత్
కర్మలు
మాత్రమే
చేతురు.
లోక
సంబంధమైన
వాంఛలు
కానీ,
మరే
విధమైన
స్వర్గాది
లోకముల
ఆశ
కానీ
వీరిలో
ఉండవు.
కేవలము
మోక్షమును
మాత్రము
కోరుచుందురు.
వారి
వారి
దీక్షను
పట్టి
భగవత్
కటాక్షము
కలిసి,
కరిగి,
అనుగ్రహించును.”
21
▾
Meaning
Keep
“ఇక,
మూడవ
వారు,
సకామ
కర్మ
యోగులు;
వీరు
ఫలాపేక్షతో
సత్కర్మలాచరింతురు.
శాస్త్ర
విహిత
కర్మలు
మాత్రమే
చేతురు.
పాప
కర్మలు
కానీ,
నిషిద్ధ
కర్మలు
కానీ
వీరు
చేయరు.
అటులే
వీరి
అభీష్టము.
సుఖములు,
భోగములు
కావలెనని,
ఏ
సత్కర్మ
చేసిన
ఏ
సుఖము
కలుగునని,
ఏ
పుణ్యకర్మలు
చేసిన
ఏ
భోగాది
స్వర్గములు
లభించునని,
ఫలమును
మొదలు
లక్ష్యము
నందుంచుకొని
పవిత్ర
కర్మల
నాచరింతురు.
అట్టి
వారు
శరీరమును
వదలిన
తరువాత
స్వర్గాది
లోకములకు
పోయి,
వారు
చేసిన
పుణ్యము
నశించు
వరకూ
ఉండి,
తరువాత
భూలోకమునకు
వత్తురు.”
22
▾
Meaning
Keep
“ఇక
మిగిలిన
నాలుగవ
తెగవారు;
కర్మ
భ్రష్టులు.
వీరికి
పుణ్యము
కానీ,
పాపము
కానీ,
మంచి
కానీ
చెడ్డ
కానీ,
నీతి
కాని,
నియమము
కానీ,
శాస్త్రము
కానీ,
ధర్మము
కానీ,
దైవము
కానీ,
దయ్యము
కానీ,
ఏవీ
లేవు.
ఇట్టి
వారిని
మనిషి
రూపమునున్న
మృగమని
తెలుపవచ్చును.
లోకమున
ఈ
తెగకు
చెందినవారే
అధిక
సంఖ్యలో
కలరు.
తాత్కాలిక
సుఖము,
ఆనందము,
ఆహారము,
హోయి
వీరి
ఆశయము.
వీరు
మానవ
రూపముతో
నున్న
వానరులని
చెప్పుటకు
కూడా
వీలుకాదు.
వానరులయినా
ఒక
స్థానమును
వదలి
మరొక
స్థానమునకో,
ఒక
కొమ్మను
వదలి
మరొక
కొమ్మకో
ఎగురుదురు.
వీరట్లు
కాదు;
మరొకటి
ఆధారము
చేసుకొని
ఉన్నదానిని
విడుతురు.
అనగా,
ఆనపకాయలందును,
చెట్ల
కొమ్మలయందునూ
ఒక
విధమైన
పురుగుండును.
అది
ఒక
ఆకు
నుండి
మరొక
ఆకును
చేరునపుడు
ముందు
మూతితో
ఒక
ఆకును
కరచుకొని
వెనుక
వైపున
మరొక
ఆకును
వదలును.
అటులనే
వీరునూ,
క్రిములవలే
దేహమును
విడిచి,
మరొక
దేహమును
అప్పుడే
అందుకొనుటకు
సిద్ధముగా
ఉందురు.
వీరికి
ఏ
లోకమూ
లేదు;
రాదు.
జననమరణములే
వీరి
ప్రాప్తులు.
వారికి
పవిత్రకాలము
వచ్చు
వరకూ
ఈ
విధమైన
ప్రయాణమే
చేయుచుందురు.
ప్రాణము
వదలుటకు,
ప్రాణము
పుట్టుటకు
కూడనూ
పవిత్ర
కాలము
ప్రమాణము,
ప్రధానము,
బావా!
యోగులు
పవిత్రకాలము
వచ్చునపుడే
ప్రాణము
వదలుదురు.
అందుకనే
‘మంచివారికి
మరణమే
సాక్షి’
అని
అందురు.
మరణమునకు
కూడా
మంచి
కాలము
అవసరము.”
ఇట్లు
వచించిన
శ్రీ
కృష్ణుని
మాటలనే
ఆధారముగా
చేసుకొని
అర్జునుడు
క్రింద
ప్రశ్న
అడిగినాడు.
23
▾
Meaning
Keep
“కృష్ణా!
ఏ
కాలమున
దేహమును
వీడిన
పునర్జన్మము
ఉండదో,
ఏ
కాలమున
ప్రాణము
విడిచిన
పునర్జన్మము
కలుగునో
దానిని
నాకు
తెలుపుము.”
“పార్థా!
నీవు
అడిగిన
ప్రశ్న,
ఈ
సమయమున
చాలా
అవసరమైనది.
ఒకొక్క
సమయమున
నీ
తెలివి
తేటలు
నాకే
ఆశ్చర్యమును,
ఆనందమును
కలిగించును.
మరొక
సమయమున
అసహ్యమనిపించును!
అజ్ఞానమని
తలంతును!
దీనికి
కారణము,
నీ
అభిమాన
మమకారములే.
అవే
అజ్ఞాన
గుర్తులు.
పోనీ!
తిరిగి
ఆ
విషయము
చూచుకొందము.”
24
▾
Meaning
Keep
“నీ
ప్రశ్నకు
జవాబు
వినుము.
నిష్కామకర్మ
యోగులు,
ఉపాసకులు
–
అగ్ని,
జ్యోతిస్సు,
పగలు,
శుక్లపక్షం;
ఆరు
నెలలు
ఉత్తరాయణ
కాలమార్గమున
ప్రయాణము
చేస్తూ
బ్రహ్మమును
పొందుదురు.
వీరికి
మొదటి
స్టేషన్
అనగా
మొదటి
స్థానము
‘అగ్ని’.
దీనినే
‘దేవయాన’మని
కూడా
అందురు.
ఈ
అగ్నినే
వేదములలో
‘అర్చి’
అంటారు.
‘అర్చిరాది
మార్గ’మని
కూడా
అంటారు.
వీరు
ప్రకాశములో
ప్రారంభమై
ప్రకాశములోనే
ప్రయాణము
సలిపి
ప్రకాశమందే
చేరుదురు.
వీరు
తిరిగి
జన్మమెత్తరు.
ఇట్టి
వారికి
బ్రహ్మ
ప్రాప్తే.”
25
▾
Meaning
Keep
“ఇక
రెండవ
వారు
సకామ
కర్మయోగులు.
దేహమును
వదలి
ధూమము,
రాత్రి,
కృష్ణపక్షం,
ఆరు
నెలలు
దక్షిణాయనము,
‘ధూమాది
మార్గ’మున
ప్రయాణము
సలిపి,
స్వర్గలోకం
చేరి
భోగములు
అనుభవించి
పై
చెప్పిన
విధముగా
ఆ
పుణ్యము
నశించగనే
పునర్జన్మ
మెత్తుచున్నారు.
అయితే
ఈ
యిద్దరినీ
‘యోగు’లనే
చెప్పవచ్చును.
ఈ
రెండు
మార్గములు
అనాది
కాలము
నుండీ
వచ్చుచున్నవి.
జగత్తునందు
ఇవి
శాశ్వతముగా
నిలిచి
యుండును.
ఎంత
వరకని?
నీకు
సంశయము
రావచ్చును.
బావా!
ఉపాసకులు,
కర్మాధికారులు
ఈ
లోకమున
ఎంతకాలముందురో
ఈ
మార్గములు
కూడనూ
అంత
కాలముండును”
అన్నాడు
కృష్ణుడు.
26
▾
Meaning
Keep
ఇచ్చట
మనము
కొంత
యోచించవలసి
వచ్చును.
ఏమన,
శుక్లపక్ష
దేవతా
అనుగ్రహము
కానీ,
కృష్ణపక్ష
దేవతా
అనుగ్రహము
కానీ,
ఉన్నదని
యెట్లు
తెలియును?
ఈ
రెండు
పక్షములకూ
మధ్యలోను,
రెండు
వేళలకూ
సంబంధములేని
కాలములోను,
దేహమును
వీడిన
వారికి
ఏ
లోకము?
వారి
గతేమి?
స్థితేమి?
అని
సంశయము
సరియైనదే,
సర్వులకూ
ఇది
తెలిసికొనవలసిన
విషయమే.
27
▾
Meaning
Keep
ఇపుడు
శుక్లపక్షమన్న
ఏమో
విచారింతము.
చంద్రుని
యొక్క
ప్రకాశము,
దినదినమునకు
వృద్ధి
పొందుకాలమును
శుక్లపక్షమని
అందురు.
అట్లయిన
దానికినీ
మానవుని
మరణమునకూ
ఎట్టి
సంబంధమని
సంశయింతురేమో?
చంద్రునకూ
మనసునకూ
సన్నిహిత
సంబంధము
కలదు.
చంద్రుడు
మనసునకు
సంకేతం.
“చంద్రమా
మనసో
జాతః
చక్షో
సూర్యో
అజాయతః”
అన్నట్లు,
మనము
అంతరార్ధమును
విచారించిన
స్థూల
చంద్రుని
ప్రకాశము
దిన
దినమునకు
వృద్ధికాంచినటులనే,
మనసులోని
పవిత్రమైన
దైవీ
భావములు
దినదినమునకు
వికసించి
అంత్యకాలమప్పటికి,
అనగా
దేహమును
విడచునప్పటికి
పూర్ణత్వమును
నొందినవైన
అట్టి
పవిత్రమైన
కాలమును
శుక్లపక్ష
దేవత
యొక్క
అనుగ్రహమనే
తలంచవచ్చును.
28
▾
Meaning
Keep
అది
బాహ్యరూపమున
ఏ
కాలమైననూ
కావచ్చును.
అది
పవిత్ర
కాలమే;
అందులో
సందియము
లేదు.
దేహమునకు
పవిత్రకాలము
స్థూల
చంద్రుని
ప్రకాశము,
మనస్సుకు
పవిత్రకాలము,
దైవభావన;
వికాసమే
సరియైన
ప్రకాశము.
ఈ
స్థూల
సూక్ష్మ
సంబంధమైన
భావముల
రెండింటినీ
యోచించుట
సాధకులకు
సరియైన
భావము.
అభివృద్ధికినీ
అది
చక్కని
మార్గము.
29
▾
Meaning
Keep
తరువాత
ఉత్తరాయణమని
కూడనూ
అందురు.
దానికి
అర్ధమేమో
విచారించిన
ఆ
సందియం
తీరును.
విషయము
తేలును.
తెలిసి
చేయు
పూజ,
తెలిసి
చేయు
సాధన,
హృదయమును
శుద్ధి
చేయును.
సంశయమును,
బద్ధకమును
వీడును.
‘ఉత్తరాయణ’మన్న
నిర్మల
ఆకాశమని
అర్ధము.
అనగా
ఆకాశమున
మేఘములు,
మబ్బులు,
మరేవిధమైన
ధూమములు
లేక,
రాక,
సూర్యుడు
స్పష్టంగా
ప్రకాశించే
సమయమునే
ఉత్తరాయణమని
అందురు.
ఇది
స్థూలార్ధము.
అనగా
దేహసంబంధమైన
కాలనిర్ణయం.
30
▾
Meaning
Keep
ఇక
సూక్ష్మమైన
అంతార్భావమెట్టిదని
విచారించిన,
మానవ
హృదయమే
అంతర్
ఆకాశము.
ఆ
హృదయాకాశమున
అజ్ఞాన,
అభిమాన,
మమకార
మేఘములు
లేక,
జ్ఞానసూర్యుడైన
బుద్ధి
ప్రకాశించుచుండుట.
అనగా,
నిశ్చలమైన
బుద్ధియే
ప్రకాశ
సూర్యుడన్నమాట.
అట్టి
శుద్ధబుద్ధి,
మమకార
అజ్ఞానములకు
చిక్కుపడక
నిర్మల
హృదయమున
స్థిరమగుటే
ఉత్తరాయణమని
తలంచవలెను.
అది
యే
కాలమైననూ
సరే,
అట్టి
సమయమున
దేహము
వీడిన
వారు
ఉత్తరాయణ
కాలమునే
అనవచ్చును.
31
▾
Meaning
Keep
జ్ఞానమునే
సూర్యుడని
అందురు.
జ్ఞాన
భాస్కరుడని
శుద్ధబుద్ధికి
పేరు.
ఈ
విధమైన
స్థితిలో
ప్రయాణము
చేసిన
వ్యక్తికి
పునర్జన్మము
లేదు.
దీనినే
‘అర్చిరాది
మార్గ’మని
కూడా
అందురు.
ఇట్టి
వారు
బ్రహ్మమును
చేరిపోదురు.
32
▾
Meaning
Keep
ఇక
దక్షిణాయనమన్న
పై
రెండింటికీ
పూర్తి
విరోధమైనది.
అనగా,
ఆకాశమందు
దట్టమైన
మబ్బులూ,
మేఘములూ
సంచరించుచూ
ధూమముతో
ఆకాశము
కప్పబడి,
సూర్యుడు
స్పష్టముగా
కనుపించక,
ప్రకాశించక
యుండుట.
ఇక
కృష్ణపక్షమన్న
చంద్రుడు
దిన
దినమునకు
క్షీణించు
కాలము.
33
▾
Meaning
Keep
దీనినే
సూక్ష్మ
రీతిగా
తెలుపవలెనన్న
మనసునందలి
దైవీభావములు
దినదినమునకు
క్షీణించుచుండుట.
అంత్యకాలమప్పటికి
అమావస్య
చంద్రుని
వలె
హృదయాకాశమున
కనుపించక
ధూమముతో,
చీకటితో
అనగా
పూర్ణ
అజ్ఞాన
స్థితియందున్న
సమయము.
దీనినే
కృష్ణపక్షమని
అందురు.
అట్టి
సమయమున
దేహమును
వీడిన
వానికి
ధూమమార్గమే.
అట్టి
వారు
స్వర్గలోకం
చేరి,
ఆ
పుణ్యము
నశించగనే
పునర్జన్మమెత్తుచున్నారు.
Previous
←
Thought of None Other at the Final Hour
Next
Yogakṣemaṃ Vahāmyahaṃ
→