Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · Yogakṣemaṃ Vahāmyahaṃ
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
“ఉత్తరాయణ
మార్గము
పవిత్రమైన
జ్ఞాన
ప్రకాశమగుటచే
దానిని
‘శుక్ల
మార్గ’మనియును,
దక్షిణాయన
మార్గము
తమోమయమై,
జ్ఞానప్రకాశము
కాక
అంధకారమయమైనదగుట
చేత
దానిని
‘కృష్ణ
మార్గ’మనియును
చెప్పబడినది.
మొదటి
మార్గమైన
శుక్లమార్గమున
పయనము
చేసిన
వారు
(అనగా,
శరీరమును
వదలి
వెళ్ళినవారు),
జనన
మరణము
లేక
(అనగా,
తిరిగి
దేహములు
ధరించక)
బ్రహ్మానంద
నిలయమైన,
మోహరహితమైన
స్థానమగు
‘మోక్షము’ను
పొందగలరనియు,
రెండవ
మార్గమైన
కృష్ణ
మార్గమున
ప్రయాణమైన
వారికి
(దేహమును
వీడిన
వారికి),
తిరిగి
జనన
మరణ
కారణమగు
దేహము
ప్రాప్తించుననియు
తెలిసికొనవలెను.”
2
▾
Meaning
Keep
“జ్ఞానమైన
స్వబోధమగు
ప్రకాశముతో
దేహమును
విడిచిన
వారు
‘ఉత్తరాయణ
మార్గ’
ప్రయాణీకులనియు,
ఆత్మజ్ఞానము
లేక
మూఢత్వముగా
దేహమును
విడచిన
వారు
‘పితృయాన
మార్గ’మున
వెళ్ళిన
వారనియు
తెలియందగును.
సత్వగుణమును
నిర్మలమై,
ప్రకాశమైనదిగను,
తమోగుణము
అంధకారమును,
కృష్ణవర్ణమును
కూడినదనియూ
తలంచవలెను.”
3
▾
Meaning
Keep
“మరియును,
‘ఇడా
పింగళ’
అను
రెండు
నాడులు
కలవు;
కుడి
ప్రక్కనుండునది
‘పింగళ’
అనియు,
ఎడమ
ప్రక్కన
నుండు
దానిని
‘ఇడా’
నాడియనియును
పిలుతురు.
యోగి
అయిన
మహానుభావులు
తమ
యోగశక్తితో
సూర్య
మార్గమైన
‘పింగళ
నాడి’
మార్గమున
వెళ్ళుదురు.
యోగ
శక్తిలేక
సామాన్య
స్థితి
గలవారు
‘చంద్ర
మార్గ’మనబడు
‘ఇడా
నాడి’
మార్గమున
వెళ్ళుదురు.
ఇదియునూ
మరొక
అంతరార్ధము.”
4
▾
Meaning
Keep
“సంయోగమునకు
వియోగమే
అంత్యము;
పుట్టినవాడు
గిట్టుటయు,
గిట్టినవాడు
పుట్టుటయు
ఇవి
ప్రకృతి
యొక్క
నియమములు.
పుట్టని
గిట్టని,
అనగా,
రాకడ
పోకడలేని
స్థితినే
‘బ్రహ్మ
సాక్షాత్కార
జ్ఞాన’మనబడును.
బ్రహ్మము
సర్వవ్యాపక
తత్త్వము
కలవాడు
కనుక,
రాకడకు,
పోకడకు
వేరు
స్థలమెక్కడిది?”
5
▾
Meaning
Keep
“ఇది
అందరికీ
సాధ్యమా?
ఇట్టి
ప్రాప్తి
అందరికీ
చేకూరునా?
అని,
సంశయించనక్కరలేదు.
దీనికి
ఏ
శ్రమయు,
ఏ
ప్రాప్తియు,
ఏ
యోగ్య
కర్మయూ
చేయనక్కరలేదు.
నిరంతరము,
నీ
మనసును
పరమాత్మయందు
లగ్నము
చేసిన
చాలు.
అనగా,
నిరంతరము
భగవంతుని
ధ్యానించుచుండిన
చాలును.
అట్టి
నిరంతర
ధ్యానమే
మాలిన్యమైన
మనసును
నిర్మలము
చేయును.
మనసు
ఎప్పుడు
నిర్మలాకారమును
పొందునో,
అప్పుడు
మోహము
నాశమగును.
మోహనాశమే
మోక్షము.
మోహక్షయమైన
వాడు
ఎట్టి
మృత్యువు
చేత
దేహమును
వీడిననూ
బ్రహ్మైక్యమును
పొందును.
అట్టి
వానినే
‘జ్ఞాని’
అని
అందురు.”
6
▾
Meaning
Keep
ఇంతలో
అర్జునుడు,
“కృష్ణా!
జ్ఞానమనగా
నాకర్ధము
కావటము
లేదు.
ఆచార్యుల
ముఖాంతరమున
విన్నటువంటి
విషయమా
లేక
శాస్త్రములనందుండునదియా
లేక,
అనుభవజ్ఞుల
నుండి
శ్రవణము
చేసినదా?
ఇందులో
దేనిని
జ్ఞానమందురు?
ఎట్టి
జ్ఞానము
లభించిన
భవబంధ
విమోచనము
కలుగును?
కరుణించి
తెలుపుము”
అని
ప్రార్ధించినాడు.
7
▾
Meaning
Keep
అందులకు
పరమాత్ముడు,
“అర్జునా,
విను!
నీవు
తెలిపినవన్నియునూ
ఆయా
సమయమునకు
అవసరమైన
జ్ఞానములే
కానీ,
వాటి
ద్వారా
భవ
బంధముల
నుండి
దూరము
కాలేరు.
దేనిని
తెలిసికొనిన
మానవులు
జననమరణ
రూపమగు
సంసార
బంధము
నుండి
విముక్తులు
కాగలరో,
అదియే
‘అనుభవ
జ్ఞానము’;
అట్టి
అనుభవ
జ్ఞానము
కలవారే
భవబంధముల
నుండి
దూరమై
మోక్షార్థులు
కాగలరు.”
8
▾
Meaning
Keep
“శాస్త్రజ్ఞానమును
ఆచార్యుల
ద్వారా
శ్రవణము
చేసిన
కొంత
సహాయకారులే
కానీ
నిజాకారమును
చూపించలేరు.
అనుభవజ్ఞానముతోపాటు
అసూయారహితుడై
పరమ
రహస్యమైన
ఆత్మతత్త్వమును
ఎవడు
తెలుసుకొనునో
వాడే
‘పరిపూర్ణ
జ్ఞాని’
అని
తెలుపవచ్చును.”
9
▾
Meaning
Keep
“అసూయారహితుడే
కాక
శ్రద్ధావంతుడు
కూడనూ
కావలెను.
శ్రద్ధ
లేక
యే
చిన్న
కార్యమును
కూడనూ
మానవులు
సాధించలేరు.
మానవులే
కాదు;
ఏ
క్రిమికీటకాదులు,
పశుపక్షి
మృగాదులు
కూడనూ
కార్యములు
సాధించలేవు.
శ్రద్ధ
లేక
కర్మ
చేసిరనుకో,
దాని
ఫలమునైననూ
అందుకొనలేరు.
ఒకవేళ
ఫలము
కూడనూ
లభించినదందువా?
అది
శుద్ధముగా
నైననూ
ఉండియుండదు.
శ్రద్ధ
ఇంతటి
మహత్తరమైనది.
అది
లేనిది
శుద్ధ
ఫలమును
ఎట్టి
వాడునూ
పొందలేడు.”
10
▾
Meaning
Keep
“బావా!
సాక్షిమాత్రుడగు
నా
చేతనే
ప్రకృతి,
ఈ
జంగమస్థావరములతో
కూడిన
ప్రపంచమును
గనుచున్నది.
ఈ
హేతువు
చేతనే
నానా
విధములుగా
ప్రపంచము
ప్రవర్తించుచున్నది.
ఇట్టి
సర్వోత్తమమైనట్టిదియును,
సర్వభూతములను
నియమించునట్టిదియును,
అగు
నా
తత్త్వమును
తెలిసికొనలేని
మూఢులు
నన్ను
సామాన్య
మనుష్యునిగా
తలంచుచున్నారు!
కొంతమంది
మహనీయులు
నన్ను
బ్రహ్మముగా
ఉపాసించుచున్నారు.
మరికొంతమంది
నన్నే
వేరు
వేరు
రూపనామములతో
కొలుచుచున్నారు.
ఇంకా
కొందరు
జ్ఞానయజ్ఞనమనియు,
ఆత్మయజ్ఞమనియు
ఆయా
రూపముల
ఉపాసించుచున్నారు.”
11
▾
Meaning
Keep
“ఎవరెట్లు
ఉపాసించిననూ
ఎవరే
పేరు
పెట్టిననూ
పరమాత్ముడైన
నేను
మాత్రమే
దానిని
అందుకొనుచున్నాను.
నేను
తప్ప
మరెవ్వరూ
లేరు.
నేనే
నానా
రూపనామములతో
ఆయా
ఉపాసనా
స్థానమును
చేరుచున్నాను.
ఇంతియే
కాదు.
సర్వకర్మ
ఫలమును,
ఫలప్రదాతయును,
సర్వమున
కధిష్ఠానమును,
వేయేటికి,
ఉత్పత్తి,
స్థితి,
లయములు
మూడింటికిని
స్థానమైనవాడను
నేనే;
ఎట్టి
నాశము
లేని
కారణమునూ
నేనే
అయి
ఉన్నాను.”
12
▾
Meaning
Keep
“అట్టి
కారణ
స్వరూపుడైన
నన్ను
పొందుటే,
మోక్షము.
అట్టి
మోక్షప్రాప్తిని
అనుభవించుటే
‘జీవన్ముక్తి’
అని
అందురు.
కాన,
బావా!
జీవన్ముక్తుడవు
కావలెనన్న,
మోక్షమును
పొందవలెనన్న,
కొన్ని
సాధనలు
సలుపవలెను;
సర్వసంగ
పరిత్యాగులు
కావలెను.
అనగా
దేహాభిమానమును
నిర్మూలము
చేసుకొనవలెను.”
13
▾
Meaning
Keep
అందులకు
అర్జునుడు,
ఎదురు
ప్రశ్న
వేయ
మొదలిడెను.
“కృష్ణా!
సర్వసంగ
పరిత్యాగము
అంత
సులభమైన
పని
అనుకొంటివా?
దేహాభిమానము
పోవలెనన్న
మాబోటి
సామాన్య
మానవులకే
కాదు,
తపస్సంపన్నులకు
కూడా
సాధ్యమయ్యే
పని
కాదు,
కదా?
ఇట్టి
దుస్సాధ్యమైన
సాధనలను
మీరు
సులభముగా
చెప్పుచున్నారు;
కానీ
చేయుట
చాలా
కష్టము.
కేవలము
ఇట్టి
మాటలతో
నన్ను
పరీక్షింప
బూనినట్లున్నది.
కృష్ణా!
దీనిని
పట్టి
చూడ,
నేను
నిన్ను
పొందగలనా?
మోక్షమును
సాధించగలనా?
అని
నిరుత్సాహము
కలుగుచున్నది”
అని
నిరుత్సాహముతో
నిలబడిపోయెను.
14
▾
Meaning
Keep
దీనిని
పరికించుచున్న
పరమాత్మ
అర్జునుని
సమీపించి,
వీపు
నిమిరి,
“బావా!
ఇంత
మాత్రమునకే
అదరి
బెదరి
నిరుత్సాహముతో
నిలువనక్కరలేదు.
అదే
యిందులో
ఉన్న
పరమరహస్యము;
వినినంత
మాత్రమున
విషయముపై
విశ్వాసము
రాదు.
విచారించి
చూచిన
విషయము
విపులముగా
తెలియగలదు.
ఈ
విద్య
చెప్పినంత
కష్టమైనది
కాదు.
నీవు
తలంచినంత
దుస్సాధ్యమైనదీ
కాదు.
సర్వసంగ
పరిత్యాగి
అన్న,
జటాకాషాయ
వస్త్రధారియై,
తపస్సుచే
శరీరమును
కృశింప
జేయనక్కరలేదు.
నీవు
చేయు
సర్వకర్మలు
ఈశ్వరార్పణ
బుద్ధితో
నిష్కామకర్మలాచరించిన
చాలును.
తప్పక
నన్ను
పొందగలవు.
ముక్తుడవు
కాగలవు.
ఇది
సత్యము.
ఇదే
ఇందులోని
పరమరహస్యము.”
15
▾
Meaning
Keep
“నిష్కామకర్మ
నాచరించుటలో
ఎవ్వరికీ
ఎట్టి
ప్రయాసయూ
ఉండదు.
అయితే
శ్రద్ధ
సంపూర్ణముగా
ఉండవలెను.
లోకమున
ఎట్టి
చిన్న
కార్యమును
సాధించవలెనన్ననూ
శ్రద్ధలేక
కావు,
కదా?
ఇక
ఆధ్యాత్మిక
విషయమున
అంత
మాత్రమైననూ
శ్రద్ధ
అవసరములేదా?
ఇది
నే
ప్రత్యేకించి
చెప్పవలెనా?”
16
▾
Meaning
Keep
“ఏ
పరమ
భక్తులు
ఇతర
చింతలను
చేరనివ్వక
సర్వకర్మలు
ఈశ్వరార్పణ
బుద్ధితో
సలుపుదురో,
నిరంతరము
నన్నే
ధ్యానించి,
సేవించి,
పూజించి,
స్మరింతురో,
అట్టి
సర్వకాలములందూ
సమాహిత
చిత్తులైన
వారి
యోగక్షేమమును
నేనే
స్వయముగా
చూచుకొను
చుందును,
వింటివా?”
అని
అర్జునుని
వీపు
తట్టి
ధైర్యము
చెప్పుచున్నాడు
కృష్ణుడు.
17
▾
Meaning
Keep
ఈ
యోగ
క్షేమమును
చూచుకొను
విషయమును
పరమాత్మ
వాక్యమును
సరిగా
అర్థము
చేసుకొనలేక,
పండితుని
మొదలు
పామరుని
వరకూ,
ఈ
గీతావాక్యమున
సరియైన
అర్థమును
తెలిసికొనుట
లేదు.
గీతాభాష్యకారులు
కూడనూ
దీనిని
అనేక
విధములుగా
ప్రచారము
సలుపుచున్నారు.
కానీ,
అనుభవము
లేకున్నారు.
18
▾
Meaning
Keep
గీతా
స్వరూపమునకు
ఈ
పరమ
పవిత్రపదము
నాభివంటిది.
సృష్టికర్తయైన
బ్రహ్మకు
విష్ణు
నాభి
యెట్లు
జన్మస్థానమో,
బ్రహ్మజ్ఞానమును
పొందగోరు
గీతా
పారాయణ
ప్రచార
సాధకులకు
ఈ
“యోగక్షేమం
వహామ్యహం”
అను
స్థానము,
జన్మస్థానము
వంటిది.
దీనిని
అనుసరించిన
గీత
పూర్తీ
అర్థము
కాగలదు.
19
▾
Meaning
Keep
ఈ
పవిత్రపదముపై
లోకమున,
అనేక
విధముల
హాస్యాస్పద
ప్రచారములు
జరుగుచున్నవి.
మచ్చునకు
ఒక్కటి
ముచ్చటింతును.
ఒక
మహారాజు
సన్నిధిని
మహాపండితోత్తముడు
గీతా
ప్రవచనము
జరుపుచుండెడివాడు.
ఒక
దినమున
ఈ
పవిత్ర
శ్లోకము
గురించి
(అనగా,
“అనన్యాశ్చింతయంతో
మాం,
యే
జనాః
పర్యుపాసతే,
తేషాం
నిత్యాభియుక్తానాం
యోగక్షేమం
వహామ్యహం”)
అనేక
విధముల
అర్థమును
తెలుపుచుండెను.
ఇది
విన్న
రాజు
పండితుడు
చెప్పు
అర్థములను
ఒప్పుకొనక
“దీనికిది
సరికాదు”
అని
వారించుచు
వచ్చుచుండెను.
పాపము!
పండితుడు
దీనికి
పూర్వము
అనేక
రాజుల
దగ్గర
గొప్ప
గొప్ప
బిరుదులు
పొంది
గొప్ప
విద్వాంసుడని
పేరు
పొందియుండుటచే,
తన
ప్రసంగమును
రాజు
ఒప్పుకొనక,
ఈ
శ్లోకమునకు
అర్థము
సరిగా
చెప్పుట
లేదని
సభలో
వాదించినది
పండితునకు
తలతీసినంతటి
అవమానమైనది.
అంతటితో
పండితుడు
తిరిగి
బాగుగా
ఆలోచించి,
‘యోగ’మను
పదమునకు,
‘క్షేమ’మను
పదమునకూ
నానార్థములు
ఉదాహరణములతో
అందించెను;
కానీ
అందునకునూ
రాజు
అంగీకరించక,
“ఈ
శ్లోకమునకు
నీవు
చక్కగ
అర్థము
తెలుసుకొని
రేపటి
దినము
రమ్ము”
అని
తెలిపి
లేచి
పోయెను.
20
▾
Meaning
Keep
దీనితో
పండితునకు
ఉన్న
ధైర్యము
కూడా
క్రిందికి
దిగజారి
విచారముతో,
ఘోరమైన
అవమానముతో,
గ్రంథము
చంకన
పెట్టి
ఇల్లు
చేరి
గీతా
గ్రంథమును
ఒక
చోటుంచి,
మంచముపై
కూలెను.
ఇది
చూచి
ఆ
పండితుని
భార్య,
“ఏమి?
ఈనాడు
మీరింతటి
విచారముతో
ఇల్లు
చేరితిరి?
ఏమి
జరిగినది?”
అని
అనేక
విధముల
ప్రశ్నల
వర్షము
కురిపించినది.
దానికి
పండితుడు
తనకు
జరిగిన
అవమానము
గురించి,
రాజు
అడిగిన
జవాబులను
గురించి,
తెలిపెను.
అన్నియూ
విన్న
ఆ
ఇల్లాలు,
చక్కగా
ఆలోచించి,
“నిజమే!
మీరు
చెప్పిన
జవాబు
సరియైనది
కాదు.
రాజు
ఎట్లు
ఒప్పుకొనును?
మీదే
తప్పు”
అని
ఆ
ఇల్లాలు
పండితునితో
పలికినది.
అంతటితో
పండితుడు
తోక
త్రొక్కిన
పాము
వలే
మంచము
నుండి
లేచి,
“నీకేమి
తెలియును?
ఇంటిలో
వంటలు
వండుకొను
ఆడదానికి
తెలిసిన
అర్థము
నాకు
తెలియలేదనియా?
నోరు
మూసుకొని
పొమ్ము”
అని
గర్జించినాడు.
అంతటితో
ఆ
ఇల్లాలు
బెదరుకొనక
“నాథా!
సత్యము
చెప్పిన,
ఎందుకు
మీకింతటి
కోపము?
ఆ
శ్లోకమును
మీరే
మరొక
తూరి
చెప్పి
చూడుడు.
చక్కగ
ఆలోచించి
అర్థము
తెలిసికొనిన
మీకు
తెలియగలదు
సత్యము”
అని
నిదానముగా
అతని
మనసును
శాంతింపచేయుచూ
సంభాషించెను.
21
▾
Meaning
Keep
తిరిగి
ఆ
పండితుడు
“అనన్యాశ్చింతయంతో
మాం,”
అని
ప్రారంభించి,
ఒక్కొక్క
పదమునకూ
విడివిడిగా
అర్థము
చెప్పుచూ
వచ్చెను.
అది
విని
అతని
ఇల్లాలు
నవ్వి,
“నాథా!
కేవలము
పదములకు
అర్థములు
చెప్పుట
నేర్చుకొనిన,
వచ్చు
ఫలమేమి?
అసలు
మీరు
రాజు
దగ్గరకు
వెళ్ళిన
కారణము
తెలుపుడు.
ఏ
నిమిత్తమై
మీరు
రాజును
ఆశ్రయించితిరి?”
అని
ప్రశ్నించెను.
అందులకు
పండితుడు
“సంసారము
జరుగనక్కరలేదా?
మన
తిండి,
తీర్థములు,
గుడ్డా
గూసా
ఎక్కడ
నుండి
తేగలను?
ఈ
సంసార
సంరక్షణార్థమై
అతనిని
ఆశ్రయించితి
కానీ,
లేకున్న
అతనితో
నాకు
పనేమున్నది?”
అని
కసరుకొనెను.
అది
విన్న
ఆ
ధర్మపత్ని
“నాథా!
ఈ
శ్లోకమున
కృష్ణపరమాత్మ
ఏమి
చెప్పెనో,
మీరు
సరిగా
అర్థము
తెలిసికొనియుండిన,
మీరు
రాజు
చెంతకు
పోయి
ఉండెడివారు
కారు.
అనన్య
చింతనతో
తనను
ఉపాసించిన,
తననే
శరణు
జొచ్చిన,
నిత్యమూ
తనయందే
మనసును
లగ్నము
చేసిన,
అట్టివారి
యోగక్షేమములు
తానే
చూచుకొందునని
ఈ
శ్లోకములో
పరమాత్ముడే
చెప్పియుండగా,
మీరు
పై
మూడింటిని
చేయక,
నీ
యోగక్షేమములు
రాజు
చూడవలయునని
అతని
చెంతకు
వెళ్ళుట
ఈ
శ్లోమునకు
ఎంత
విరుద్ధ
అర్థమో
మీరే
యోచించుడు.
అందుకనే
రాజు
మీ
అర్థమును
అంగీకరించలేదు”
అని
ఆ
ఇల్లాలు
చెప్పగా
ఆ
పేరు
మ్రోగిన
పండితుడు
కొంత
యోచించి
తన
తప్పును
తాను
అర్థము
చేసుకొని,
మరుసటి
దినము
రాజు
గారి
ఆస్థానమునకు
వెళ్ళక,
ఇంటిలో
కృష్ణారాధనలో
మునిగియుండెను.
రాజు
విచారించగా
పండితుడు
రాలేదని
నౌకరులు
తెలిపిరి.
కారణము
తెలుసుకొనుటకు
రాజు
మరొక
నౌకరును
పండితుని
యింటికి
పంపగా
పండితుడు,
“నేను,
ఎవరి
దగ్గరకూ
రానక్కరలేదు.
కృష్ణుడే
నా
యోగక్షేమమును
చూచుకొనును.
ఇంతకాలమూ
తెలిసికొనలేక
కేవలము
పదముల
అర్థముల
పై
మాత్రమే
ప్రయాణము
చేయుటచే
నాకీ
పరాభవము
ప్రాప్తించెను.
పరమాత్మునే
శరణుజొచ్చి,
అన్య
చింతలకు
చోటివ్వక,
నిరంతరము
తన
ఆరాధనలో
మునిగియుండిన
నా
సర్వస్వమూ
తానే
చూచుకొనును”
అని
తెలిపి
పంపుట
చూచి,
రాజు
ఆనందించి
తానే
పండితుని
ఇంటికి
నడచి
వచ్చి
పండితునకు
నమస్కరించి,
“స్వామీ!
నిన్నటి
శ్లోకమునకు
అర్థము
నేడు
మీరు
అనుభవ
రూపమున
తెలిపినందులకు
నా
హృదయ
పూర్వక
నమస్కారములు”
అని
తెలిపి,
అనుభవరూపమున
లేని
ప్రచారము,
ఆడంబర
విశ్వాసమే
కాని
అది
అసలు
సారము
కాదని
తెలిపి
వెళ్ళెను.
22
▾
Meaning
Keep
చూచితిరా!
నేడునూ
గీతా
ప్రచారము
చేయు
అనేక
మంది
మహనీయులు,
నిరర్థకమైన
అర్థములను
లోకమునకు
అందించుచున్నారే
కానీ
అనుభవ
రూపమున
ఆ
గీతను
ఆచరించుట
లేదు.
ఆచరణలో
లేని
అర్థము,
ప్రచారము
గీతకు
అపకారము
చేసినట్లగును.
గీతపై
విశ్వాసమున్నట్లు,
గీతనే
వారి
ప్రాణమనియు,
గీతకు
మించిన
మహా
గ్రంథరాజము
వేరు
లేదనియు,
ఇది
భగవత్
ముఖము
నుండి
వచ్చినదనియూ,
భక్తి
శ్రద్ధలు
చూపుచూ,
ఆనంద
బాష్పములు
రాల్చుచూ,
శరీరములపై
ఉంచుకొనుచూ,
కన్నులకద్దుకొనుచూ,
పూజా
పీఠములందుంచి
పూజించుచూ,
చాలా
ఆర్భాటముగా
గౌరవింతురు!
ఆ
గౌరవ
మర్యాదలు
కేవలము
కాగితములకు,
గ్రంథమునకు
అంతే!
నిజముగా
గ్రంథమునకే
అంత
గౌరవమిచ్చుచుండిన,
లోని
విషయములకు
ఆచరణలో
మరింకెంతటి
స్థానమివ్వవలెను?
ఊహూ!
ఏ
మాత్రమూ
అనుభవము
లేదు;
అనుభవమే
ఉండిన
ధనము
కొరకు
వీరి
ప్రచారమును
అమ్ముకొనరు.
భగవంతుని
దయకొరకు
ప్రాకులాడుదురు.
నేటి
గీతా
ప్రచారకులలో
కోటికొక్కరు
కూడా
దయకు
ప్రాకులాడువారు
లేరు.
ఉండిన,
వారిట్టి
ధనమునకు
స్థానమివ్వరు.
Previous
←
The Final Hour: The Arcirādi Paths
Next
The Gītā: Practice Is Greater Than Preaching
→