Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Gītā: Practice Is Greater Than Preaching
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
నేడు,
లోకమున,
గీతా
ప్రచారకులు
అధికమయి,
పరమాత్ముని
పవిత్ర
పదములకు
అనర్థములు
కల్పించి,
సత్యార్థమును
మరుగుపరుచుచున్నారు.
ఆయా
ప్రచారకుల
ప్రవర్తనలననుసరించి,
సమర్థించుకొనుచు
ఎవరికి
తోచినట్లు
వారు
చిలుక
పలుకులు
పలుకుచున్నారే
కానీ,
ఆచరణ
యందు
అణుమాత్రమైనా
ప్రవేశింపక
గొప్ప
‘గీతా
ప్రచారకు’లను
బిరుదులను
తలభారముగా
మోయుచున్నారు.
ఇట్టిది
వారికి
వారు
కీడు
చేసుకొనుటే
కాక
లోకమునకు
కూడా
అవిశ్వాసమును
కలిగింపజేయుచున్నారు.
2
▾
Meaning
Keep
పరమాత్ముని
పలుకులు
ప్రతి
ఒక్కటియును
ఆచరణరూపమైనవే
కానీ,
ప్రచారరూపమైనవి
కావు.
నేడు,
కలి
మహాత్మ్యమో
అన్నట్లు,
దానికి
విరుద్ధమైన
మార్గమును
లోకమునకు
రుద్దుచున్నారు.
పోనీ,
విను
వారలందైనా
ఆ
వివేకమున్నదా,
అని
విచారించిన,
అదీ
జీరోనే.
సరే,
‘చెప్పువారేమాత్రము
ఈ
గీతార్థమును
అనుభవరూపమున
ఆనందించుచున్నారా?’
అని
ఒకరైనా
విచారించకున్నారు.
వారు
చెప్పే
భాషకూ,
లోకమున
నడచు
పోకడలకూ
విరగబడుచున్నారే
కానీ
గీత
యొక్క
భావాన్ని,
చెప్పు
వారి
ప్రవర్తనను
కోటికొక్కరైననూ
కోరకున్నారు.
3
▾
Meaning
Keep
ఒక్కొక్కరు
చెప్పుచుందురు,
‘గీత
నాకు
పూర్తి
కంఠస్థము
వచ్చు’నని,
‘ఏ
అధ్యాయమున
ఏ
శ్లోకమడిగిననూ,
టక్కని
చెప్పునంతటి
అనుభవము
కలద’ని!
దీనిని
విన్న,
ఇట్టి
పాండిత్యము
చూచిన,
నాకు
నవ్వు
వచ్చును.
అనుభవమున
అణుమాత్రమూ
లేక
అంతయూ
కంఠస్థము
వచ్చుననగా
కంఠమునకు
బాధ
తప్ప,
మరేమీ
ఫలితముండదు.
అందులో
“గ్రాంఫోన్
ప్లేటు”
(Gramophone
Plate)
వలే
వీరూ
ఒక
ప్లేటని
చెప్పవచ్చును.
ప్లేటుకెంత
ఫలమో,
కంఠస్థము
చేసిన
వారికీ
అంతే
ఫలము.
ఇన్ని
శ్లోకములు
కంఠస్థము
రాకపోయిననూ,
ఒక్క
శ్లోకమును
ఆచరణలో
ఉంచిన
అట్టివారు
ధన్యులు.
4
▾
Meaning
Keep
అర్జునుడు
కృష్ణపరమాత్మ
చెప్పిన
ప్రతి
పదమును
అనుభవమున
నిరూపించినాడు.
అందుకే
కృష్ణుని
అనుగ్రహమునకు
పాత్రుడైనాడు.
5
▾
Meaning
Keep
ఈనాడు
మహా
పండితులను
వారు
కూడనూ
ఒక
పదమునైననూ
ఆచరణయందు
అనుభవించకున్నారు.
ఇక
పామరుల
సంగతెందులకు?
ఒక్క
మాటలో
చెప్పవలెనన్న,
నేడు
గొప్ప
గొప్ప
పేరు
ప్రఖ్యాతులు
తగిలించుకొని
ఎవరు
‘మహా
గీతోపన్యాస’కులని
తిరుగుచున్నారో,
అట్టివారు
కూడను
గీతకు
విరుద్ధముగా
ప్రవర్తించుచున్నారు.
భగవద్గీతకు
గీతలు
గీయుచు,
ఎవరికి
వారు
వారి
వారి
బుద్ధికుశలతను,
విద్యాకుశలతను
ప్రదర్శించుచూ
వారి
వారి
భావగీతాలను,
భగవద్గీతకు
అంటించుచున్నారు.
మచ్చునకు
ఒకటి
వినుడు.
6
▾
Meaning
Keep
గీత
6వ
అధ్యాయమున
10వ
శ్లోకమున
“పరిగ్రహము
మహాపాప”మని
తెలిపినది.
నిజముగా
గీతను
ప్రమాణముగా
విశ్వసించినవారు
దానిని
ఆచరించవలెను
కదా?
లేదు.
ఈనాడు
గీతా
ప్రచారకులలో
నూటికి
తొంబైతొమ్మిది
మంది
పరిగ్రహించుచున్నారు.
పరిగ్రహము
ఏ
రూపమున
కానీ
అంగీకరించరాదు;
పరిగ్రహమునకు
హద్దులేదు.
గీతాయజ్ఞమనీ,
హారతిదక్షిణ
అని,
ప్రచార
సంఘము
యొక్క
ఖర్చులనీ,
గురు
కానుకలనీ,
ఎన్నో
పేర్లు!
ఇది
కృష్ణుడు
చెప్పలేదే!
టిక్కెట్లు
తీసుకొని
డ్రామా,
సినీమాలకు
వెళ్ళినట్లు,
నేడు
గీతా
ఉపన్యాసములు
ఇచ్చి,
‘దక్షిణ’
అను
పేరుతో
ఉపన్యాసములు
అమ్ముచున్నారు.
7
▾
Meaning
Keep
ఇట్టి
వారికి
నిజముగా
కృష్ణుని
పవిత్ర
వాక్కుల
పైన
విశ్వాసముండిన,
విరుద్ధముగా
ఎందుకు
నడుతురు?
ఇది
దోషమని
తెలిసియుండినవారే
ఎందుకు
చేతురు?
బహశా,
కలిలో
చెప్పేవారలకు
దోషముండదేమో?
ఇట్టి
ఆచరణ
రూపము
లేని
ప్రచారములు
నిదానముగా
ప్రమాదము
తెప్పించి,
కడకు
అవిశ్వాసమునకు
గురిచేయును.
కేవలము
ఆడంబర
ప్రచారముగా
రూపుదాల్చుచున్నది,
నేటి
గీతా
ప్రచారము.
8
▾
Meaning
Keep
గీతా
గ్రంథమునకిచ్చు
గౌరవము,
విషయమునకివ్వకున్నారు.
గీత,
రామాయణ,
భాగవత,
భారత
ఇత్యాది
పవిత్ర
గ్రంథరాజములను
చూచిన
తడవుగ,
కన్నుల
కద్దుకొని,
తలపై
నిడుకొని,
పూజా
గదులందు
పీఠలపై
నిడి
పుష్పాక్షితలు
వేసి,
కన్నులు
మూసి,
కన్నీటి
ధారలు
కార్చి
నమస్కరించువారలు
వేలకు
వేలు
కలరు.
కానీ,
వారు
ఇచ్చు
గౌరవము,
వారు
చేయు
పూజ,
అర్పించు
వందనములు
కేవలము
కాగితములకే
కానీ,
అందులోని
భావములకు
కాదు.
9
▾
Meaning
Keep
తలపై
నుంచుకొనవలసినది
గ్రంథము
కాదు;
అందులోని
భావమును.
చేయవలసిన
పూజ
గ్రంథమునకు
కాదు,
విషయమునకు;
పీఠలపైన
పెట్టుట
కాదు,
హృదయ
పీఠమున
ప్రతిష్ఠించవలెను.
అట్లు
చేసిననే
గీత
యొక్క
సత్యము,
నిత్యమై,
నిర్మలమై
నిలుచును.
10
▾
Meaning
Keep
గీతా
ప్రచారకులు
కానీ,
గీతా
పారాయణులు
కానీ
విషయమునకు
హృదయమున
స్థానమిచ్చి,
ఆచరణలయందు
దానిని
అందుకొని
ఆనందమును
పొందవలెనే
గానీ,
శ్లోకములు
కంఠస్థము
చేసిన
కానీ,
గ్రంథమును
పూజగదులందు
పీఠలపై
నుంచి
పూజించుట
వలన
కానీ,
వాటిని
కన్నులకద్దుకొని
శిరస్సున
దాల్చుట
వలన
కానీ
మనలోని
మాలిన్యము
మాయము
కాదు.
అట్టి
కర్మలు
పైపై
మర్యాదలు
మాత్రమే
కానీ,
మాలిన్యము
పోదు.
11
▾
Meaning
Keep
పంచ
భక్ష్య
పరమాన్నములు
పాత్రలో
ఉంచి
వాటిని
కన్నుల
కద్దుకొన్నంత
మాత్రమున,
తలపై
నిడుకొన్నంత
మాత్రమున
కడుపు
నిండదు
కదా?
ఇదియూ
నట్టిదే.
గీతా
గ్రంథము
–
భక్తి,
జ్ఞాన,
కర్మ,
వైరాగ్యములను
మధురామృతమును
నింపుకొన్నది.
దానిని
తీసుకొని
ఎవరు
త్రాగుదురో
వారే
ధన్యులు.
వారే
నిజముగా
గీతాపానము
చేసినవారు.
కొంచెము
త్రాగిననూ
చాలు.
ఆకలికొన్న
వానికి
ప్రపంచమున
పండిన
ధాన్యమంతయూ
చిక్కనక్కరలేదు.
పట్టెడు
అన్నము
చిక్కిన
చాలు.
దప్పికొన్న
వానికి
గోదావరి,
కృష్ణా
నదులు
పూర్తీ
అవసరము
లేదు;
గ్లాసెడు
నీరు
చిక్కిన
చాలును.
12
▾
Meaning
Keep
అటులనే
‘భగవదనురక్తి’
అను
ఆకలికొన్న
వానికి
గీతా
ప్రవాహమును
పూర్తీ
త్రాగనక్కరలేదు.
ఒక్క
శ్లోకమును
ఆచరణలో
ఉంచిన
చాలును.
అగ్గిపెట్టెయందు
అనేక
పుల్లలుండును.
మనకు
అగ్ని
కావలెనన్న
ఒక
పుల్లను
అంటించిన
కావలసినంత
అగ్నిని
అభివృద్ధి
చేసుకొనవచ్చును
కదా?
అన్ని
పుల్లలు
గీచనక్కరలేదు.
అటులనే,
గీత
అను
పెట్టెలో
ఏడునూర్లు
శ్లోకములను
జ్ఞానాగ్ని
పుల్లలున్నవి.
ఇందులో
ఒక
శ్లోకమను
పుల్లను
అనుభవమున
గీచిన
చాలును.
13
▾
Meaning
Keep
గీతను
ఈ
విధముగా
పవిత్ర
వినియోగము
చేయవలెను
గానీ
దుర్వినియోగము
చేయుట
మహాదోషమగును.
ఆచరణలేక
పేరు
ప్రఖ్యాతుల
కొరకు
గౌరవ
మర్యాదుల
కొరకు,
ఆడంబరమును
ప్రవేశ
పెట్టిన,
అది
స్వార్థమే
కాక
భగవద్ద్రోహమగును.
గ్రంథము
నుండి
విషయమను
గంధమును
తీయవలెను.
పుస్తకమును
కూడా
మస్తకముగా
మార్చవలెను
గానీ
మస్తకమును
పుస్తకముగా
మార్చరాదు.
14
▾
Meaning
Keep
రాళ్ళయందూ
దేవుని
చూడవలెను
గానీ
దేవుళ్ళను
రాళ్ళగా
చేయరాదు,
చూడరాదు.
అదే
మన
భారతీయులకు
భగవంతుడందించిన
మహాభాగ్యము.
సముద్రమున
పైపై
అలలలో
వెతికిన
ముత్యములు
చిక్కవు.
సముద్ర
మధ్య
భాగములో
స్వాతివాన
పడిన
సమయములో
సముద్ర
గర్భమున
చేరి
వెతికిన
చిక్కును.
ఇట్టి
భగవదన్వేషణ
సలుపువారే
మన
భారతీయులు.
15
▾
Meaning
Keep
ధర్మాచరణే
దేహముగాను,
దైవదర్శనమే
హృదయముగాను
తలంచి,
చరించి,
తరించువారు
మన
భారతీయులు
పైపై
పూతలకు,
బాహ్యాడంబరములకు,
భౌతిక
అభివృద్ధులకూ
బానిసలు
కారు.
అంతర్దృష్టితో
ఆత్మాన్వేషణ
సలుపునట్టి
నిస్వార్థ
హృదయులు.
ఇట్టి
పవిత్ర
స్థితిగతులు
కలిగిన
భారతీయులు,
నేడీ
భౌతిక
అభివృద్ధులకు
ప్రాకులాడుట,
పైపై
పూతలు
పూయుట
శోచనీయము.
ధనార్జనకై
గీతా
ప్రబోధ
చేయువారలకు
దైవము
దూరమే.
సమర్థించుకొనుటకు
అట్టి
వారు
అనేక
కథలు
కల్పింతురు.
విధ
విధ
ప్లానులు
వేయుదురు.
కానీ,
నిజమైన
గీతా
విశ్వాసకులు
గానీ,
గీతా
దాసులు
కానీ
దీనిని
అంగీకరించరు.
16
▾
Meaning
Keep
ధర్మము
కొరకు
గీత
కానీ
ధనము
కొరకు
కాదు.
కృష్ణ
మందిరాలనియూ,
రామ
మందిరాలనియూ
ఏవో
కొన్ని
కొన్ని
పేర్లు
పెట్టుకొని
మందిర
నిర్మాణమున
పేరుతో,
ఆశ్రమముల
నిర్మాణములను
పేరుతో,
గీతా
ప్రచార
నిర్వహణ
పేరుతో
ధనమును
ప్రోగు
చేయుట
కూడా
భగవత్
విశ్వాసము
కోల్పోవుటకు
ఒక
మార్గము.
సర్వ
వ్యాపియైన
పరమాత్మకు
కేవలము
మందిర
నిర్మాణము
హాస్యాస్పదము.
భగవత్
ప్రతిష్ఠకు
హృదయ
మందిరము
ప్రధాన
స్థానము.
17
▾
Meaning
Keep
అట్టి
మందిరమును
నిర్మించుటకు
ప్రయత్నించక,
మానవ
కల్పిత
మందిరములు
మాత్రము
నిర్మించిన,
స్థిరమా?
నిత్యసత్యమైన
పరమాత్మకు
శాశ్వత
మందిరమే
సార్థకము
కానీ
శిథలమగు
మందిరములు
కావు.
18
▾
Meaning
Keep
అయితే
ఒక
స్థితికి
వచ్చునంతవరకూ
బాహ్య
నిర్మాణ
మందిరములు
అవసరమే;
కానీ,
అనాది
మందిరములు
అనేకములున్నవి
కదా?
వాటిని
భద్రపరచుకొని,
సద్వినియోగము
చేసుకొన్న
చాలదా?
నూతన
మందిరములు
కట్టడము,
సనాతన
మందిరములను
కొట్టడము,
గోవును
చంపి
చెప్పులు
దానము
చేసినట్లున్నది!
ప్రత్యేకించి
నూతన
మందిరములు
కట్టక,
శిథిలమైన
సనాతన
మందిరములను
పునరుద్ధరణ
చేయుట
యెంతయో
లోక
క్షేమము.
ఆనాటి
శాస్త్రోక్తమైన
ధర్మ
ప్రతిష్ఠలు
మహా
పవిత్రములు.
అట్టి
ధర్మ
మందిరముల
శక్తియే
మన
భారతదేశము
నేడు
ఈ
మాత్రమైననూ
క్షేమముగా
ఉండుటకు
మూల
కారణము.
19
▾
Meaning
Keep
ఆనాటి
మహనీయులైన
మహా
బుషులు,
మహా
తపస్సులాచరించి,
సర్వసంగ
పరిత్యాగులై,
దేహములు
సహితము
శిథిలము
చేసుకొని
లోక
క్షేమమును,
దానికి
తగిన
ఆచరణ
యోగ్యమైన
కొన్ని
నియమములను,
నియమించి
మనకందించిరి.
అందించిన
వాటినైననూ
నేడు
అనుభవించక,
వాటికి
నానార్థములు
కల్పించి,
ఎవరికి
తగినట్లు
వారు
నూతన
పద్ధతులను
ప్రవేశపెట్టుటచే
అసలు
సత్యము
అడుగున
పడిపోయినది.
అట్టి
పవిత్ర
సత్యమును
పైకి
తీయుటకు
ప్రయత్నించక,
నేడు
లోకమున
పెద్దలను
వారు,
గురువులను
వారు
నూతన
పద్ధతులనే
అంగీకరించి
వాటినే
పోషించుచున్నారన్న
ఏమని
చెప్పవలెను?
20
▾
Meaning
Keep
ఇక
భారతదేశము
ధర్మక్షేత్రము,
యోగక్షేత్రము,
త్యాగక్షేత్రము
ఎట్లు
కాగలదు?
అందులకే
కాబోలు,
అన్నపూర్ణ
స్వరూపమైన
మన
భారతావని,
నేడు
“అన్నమో!”
అని
అల్లాడవలసి
వచ్చినది!
ఏ
పర్వతముల
యందు,
ఏ
గుహల
యందు,
ఏ
పవిత్ర
నదీ
తీరముల
యందు,
ఏ
పుణ్య
క్షేత్రముల
యందు
“శివోహం,
శివోహం”
అని
వినబడుచుండెడిదో
అట్టి
స్థానములందు
నేడు
“శవోహం,
శవోహం”
అని
వింటూ
ఉన్నాము.
ఒకటేమి,
అన్నింటియందూ
నేడు
మన
దేశము
ఆనందరహితమై,
అశాంతిమయమై,
స్వార్థ
స్వరూపమై,
ఆడంబర
ప్రదర్శనములతో
అలరారుచున్నది.
కాన,
నేడు
ఆచరణ
రూపమైన
ప్రచారములు
అత్యవసరము.
ఇది
పామరుని
మొదలు
‘పరమహంస’
అని
పిలువబడు
వారందరూ
తెలిసికొనవలసిన
విషయము.
గీతా
విషయమున
మరింత
శ్రద్ధ
వహించి,
స్వయముగా
పరమాత్ముని
పలుకులుగా
విశ్వసించి
ఆచరించవలెను.
21
▾
Meaning
Keep
పరించినంత
మాత్రమున
ప్రయోజనము
లేదు.
“యోగ
క్షేమం
వహోమ్యహమ్”
అను
భగవంతుని
పవిత్ర
ప్రతిజ్ఞకు
దీక్షా
కంకణమునకు
మానవులు,
సాధకులు,
అర్థులు
కావలెనన్న,
చెప్పినట్లు
తాను
భక్త
రక్షణ,
అనగా
“యోగక్షేమము”
చూచుకొనలేదన్న
దానికి
పూర్వము
పరమాత్ముడు
చెప్పిన
పద్ధతిని
‘మనము
ఆచరించుచున్నామా?
లేదా?’,
అని
విచారించిన
సులభముగా
తేలును.
సాధకులట్లు
విచారించుట
లేదు.
వారికి
అవసరమైన
దానిని
మాత్రము
తీసుకొని
దానికి
సంబంధించిన
ముందూ
వెనుకలు
విచారించకున్న,
అది
అనర్థములగును.
22
▾
Meaning
Keep
“అనన్యాశ్చింతయంతోమాం,
యేజనాః
పర్యుపాసతే
తేషాం
నిత్యాభి
యుక్తానామ్,”
అను
ఈ
మూడు
అంగములను
చేర్చుకొన్న
“యోగక్షేమం
వహోమ్యహామ్”
అను
శిరస్సుకు
విలువ
కానీ,
కాళ్ళు,
కడుపు,
భుజము
లేక
ఒక
తలను
మాత్రమే
గట్టిగ
పట్టుకొన్న
ప్రయోజనమేమి?
ఇనుప
పెట్టె
దొంగలు
తీసికొని
పోయిననూ
పరవాలేదులే,
తాళములు
నా
మొలలో
ఉన్నవన్నట్లుగా
యుండును.
పెట్టెలోని
వస్తువుల
కొరకు
కదా
తాళముల
అవసరము?
వస్తువులు
పోయిన
తాళములు
ఉండి
ఉపయోగమేమి?
అటులనే,
అనన్య
చింతన
లేక,
తన
ఉపాసన
జరుపక,
తననే
శరణు
పొందక,
తన
యోగక్షేమమును
మాత్రము
చూచుకొనలేదే
అన్న,
యెంత
అజ్ఞానము!
పరులను
శరణు
జొచ్చి,
పరులను
కొల్చుతూ
అనన్య
చింతలతో
ఉండువాని
యోగక్షేమము
తానెట్లు
చూచును?
పోనీ,
పరులయందూ
పరమాత్మ
భావము
నుంచి,
సర్వ
కర్మలు
భగవదర్పితమని
యైననూ
తలంచిన,
పరమాత్ముడు
అనుగ్రహించును.
ఆశ్రయించడము
అన్యులను,
ఫలితమాశించడము
పరమాత్ముని;
ఇది
అనన్య
చింతన
యెట్లగును?
రాజు
దగ్గర
నౌకరులు,
ఆశ్రయించడము
రాజును;
అభిమానించడము
సంసారమును.
అభిమానము,
ఆశ్రయము
రెండునూ
ఒక్కటి
అయిన,
అది
శరణాగతమనబడును.
23
▾
Meaning
Keep
గీతా
స్వరూపమునకు
“అనన్యాశ్చింతయంతోమామ్”
అను
శ్లోకము
నాభివంటిది.
భగవంతుని
వాక్
పుష్పములను
వ్యాసులవారు
“గీత”
అను
హారముగా
తయారు
చేయుటలో
ఈ
శ్లోకమును
హారమునకు
అలంకారము
నిచ్చు
మధ్య
కుచ్చుగా
అమర్చినాడు.
కాన,
గీతా
రత్నహారమునకు
ఈ
శ్లోకము
మధ్య
మణుల
కుచ్చుగా
అమర్చబడినది.
అప్రాప్తమైన
ప్రాప్తిని
అందించుటే
‘యోగ’మనియు,
అట్లు
ప్రాప్తించిన
దానిని
సంరక్షించుకొనుటే
‘క్షేమ’మనియు
మరి
యొక
అర్థము
కూడనూ
కలదు.
ఇట్టి
సంరక్షించుకొను
సాధనలే
అనన్య
చింతనలు.
అట్టి
పరమాత్మ
చింతన
వలన
మనసు
యొక్క
మాలిన్యము
వీడును.
అట్టి
మాలిన్య
రహితమైన
మనసు
కలిగియుండుటే
భక్తుని
యొక్క
లక్షణము.
తన
చూపులు,
తన
ఆటలు,
పాటలు,
మాటలు
అన్నియూ
భగవత్
మయము
కావటమే
భక్తుని
చిహ్నములు.
ఇట్టివారు
“ప్రత్యేకించి
యజ్ఞయాగాదులు
కానీ,
దానధర్మాదులు
కానీ,
క్షేత్రయాత్రలు
కానీ
చేయలేకపోతిమే,
అట్టి
పవిత్ర
కర్మలద్వారా
పరమాత్ముని
తృప్తి
చేయలేకపోతిమే,
పోనీ
చేయుటకు
శక్తి
సామర్థ్యములైననూ
పరమాత్ముడు
ప్రసాదించలేదే?”
అని
విచారించనక్కరలేదు.
పరమాత్ముడు
ఇవి
ఏనాడూ
కోరలేదు.
నిర్మల
మనస్సు
కలిగియుండి,
ఏమి
అందించిననూ,
తాను
ఆనందముగా
అందుకోగలడు.
24
▾
Meaning
Keep
‘సత్కర్మల’ను
పదార్థములు,
ఎంత
పవిత్రమైనవైనప్పటికినీ,
‘మనస్స’నే
పాత్ర
మాలిన్యమై
యుండిన,
‘భగవచ్చింతన’
అను
కళాయి
పూయకుండిన
సర్వ
పదార్థములు
విషమయమైపోవును.
కాన,
పాత్ర
యొక్క
పరిశుద్ధతే
తాను
ప్రధానముగా
ఆశించును.
అట్టి
నిర్మల
హృదయులు
పరమాత్మకేమి
అందించిరో
పురాణ
ఇతిహాసములలో
చూడుడు;
పిడికెడు
అటుకులు
కుచేలుడిచ్చెను.
విదురుడు,
ద్రౌపది
ఏమి
ఇచ్చిరి?
వారునూ
చారెడు
గంజి,
బలుసు
పత్రము.
వీటి
విలువెంత?
లోకములో
అరకాసైననూ
చేయదు.
అట్టి
దానికి
పరమాత్ముడెంతటి
ఫలితమును
అందించెనో
చూడుడు!
పరమాత్ముని
దృష్టి
వస్తువుపై
కాదు,
భావశుద్ధిపై.
కాన,
భావమును
పవిత్రముగా
పాటించుడు.
Previous
←
Yogakṣemaṃ Vahāmyahaṃ
Next
The Vision of the Viśvarūpa
→