Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Vision of the Viśvarūpa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మానస
సరోవరములోని
మాలిన్య
రహితమైన
‘హృదయ
పుష్పమే’
పరమాత్మ
అర్పితమునకు
యోగ్యమైనదని
గీత
స్పష్టముగా
తెలుపుచున్నది.
అందులకే
కాబోలు
కృష్ణుడు,
అర్జునుని
“బావా!
నీవు
ఏ
పని
చేసినను,
ఏ
దానము
చేసినను,
ఏమి
భుజించినను,
వాటన్నింటినీ
నాకర్పణము
చేయి;
అనగా,
‘సర్వకర్మలు
సర్వేశ్వరార్పణ
బుద్ధి’తో
చేయుము.
తప్పక
నన్నే
పొందుదువు.
నాకు
భేద
భావములు
లేవు.
శత్రువులు
కానీ,
మిత్రులు
కానీ
లేరు.
నేను
సాక్షిభూతుడను
మాత్రమే.
ఎవరు
నన్నుకోరి
సేవించి,
మోదింతురో
వారలయందుందును”
అన్నాడు.
2
▾
Meaning
Keep
అందులకు
అర్జునుడు
తిరిగీ
అనుమానగ్రస్తుడై,
“కృష్ణా!
నీకు
అందరూ
సమానమే
అని
అంటివి
గదా?
అటులయిన
లోకమున
కొందరు
సుఖముగా
మరికొందరు
దుఃఖముగా,
కొందరు
యోగులుగా
మరికొందరు
రోగులుగా,
కొందరు
ధనవంతులుగా,
కొందరు
దరిద్రులుగా
ఉన్నారే!
దీనికి
కారణమేమి?
నీకే
భేదమూ
లేకున్న
అందరినీ
ఒకే
స్థితిలో
ఉంచి
యుండకూడదూ?
దీనిని
పట్టి
చూడ,
నీకు
భేదము
లేదనుమాట
నమ్మ
సాధ్యము
కానిది,
ఆధారము
లేనిది”
అని
అన్నాడు.
3
▾
Meaning
Keep
పరమాత్ముడు
అర్జునుని
అనుమానమునకు
నవ్వి
“బావా!
అర్జునా!
నేను
సత్యమునే
పలుకుదును.
నీవు
నమ్మిననూ,
నమ్మకున్ననూ
సత్యము
పొంగదు,
క్రుంగదు.
నేను
అందరియందును
సమానముగనే
యున్నాను.
కానీ,
అందరూ
నా
యందు
సమానదృష్టిగా
లేరు!
ఎటులన,
చలికాలమున
రాత్రులందు
గ్రామాదులలో
మంటలు
వేసుకొందురు.
ఎవరు
ఆ
మంటలకు
దగ్గర
కూర్చొందురో,
వారు
మాత్రమే
చలిలేక
యుందురు.
అంతియేకాక
చీకటి
లేక,
ప్రకాశమును
కూడనూ
అనుభవింతురు.
అట్లుకాక,
మంటకు
దూరముగా
నిలుచుకొని
చలి
పోలేదనియూ,
చీకటి
ఆవరించినదనియూ,
ప్రకాశము
వారి
పాల
లేదనియూ
అనిన,
ఆ
భేదము
అగ్నిదెట్లగును?
ఇంత
మాత్రమున
అగ్నికి
భేదమున్నదని
వాదించుట
అర్థరహితము,
బుద్ధిహీనము,
వివేక
శూన్యము
కదా?”
4
▾
Meaning
Keep
“భగవత్
జ్ఞానకిరణముల
సంబంధమూ
ఇట్టిదే.
దానిని
పొందగోరి,
చెంత
చేరువారు
దాని
ప్రకాశము
ఫలితమూ
పొందగలరు.
అంత
మాత్రముచే
భగవంతునకు
భేదమని
తలంచరాదు.
అయితే
అగ్ని
దగ్గరకు
వెళ్ళుటకు
అందరికీ
అధికారము
కలదు.
మంటలు
వృద్ధి
చేసుకొనుటకునూ
అందరికీ
స్వతంత్రమున్నది.
మంటకు
ఏ
భేదము
ఉండదు!
దానిని
అనుభవించుట
యందు,
అభివృద్ధి
పరచుకొనుట
యందే
భేదము.
ఇదే
విధముగనే
జ్యోతిర్మయుడనయిన
నాకునూ
ఎట్టి
భేదమునూ
ఉండదు.
నన్ను
పొందుటకు
అందరికినీ
అధికారము
కలదు.
భేద
భావములు
సాధకులలోని
దోషములే
కానీ
నాలోని
మచ్చలు
కావు,
బావా!”
5
▾
Meaning
Keep
చూచితిరా!
పరమాత్ముని
ప్రేమ
పలుకులు,
సమాన
తొలుకులు,
ఎంత
సత్యము!
నిజముగా
లోకులు
కాకులు;
తమ
తమ
లోపములను
విచారించక
ఎదుటి
వారిపై
దోషములను
రుద్దుట
అజ్ఞానము!
పరమాత్మయందే
దోషముండిన
లోకముండదు.
6
▾
Meaning
Keep
పరమాత్మ
భేదరహితుడు,
సమాన
హృదయుడు,
కనుకనే
లోకము
ఈ
మాత్రమైననూ
క్షేమముగా
నిలిచినది.
రోగికి
జ్వరము
లేదని
రోగి
తృప్తికై
డాక్టరు
అబద్ధము
చెప్పిననూ,
ధర్మామీటర్
(Thermometer)
తప్పూ
చూపదు.
అటులనే
పరమాత్మ
టెంపరేచరు
(Temperature)
వంటి
అంతరాత్మను
తెలుపునే
కానీ
పైపై
పూతలను
ఒప్పదు.
లోకులు
పైపై
రూపములే
పాటింతురు.
తినిన
రుచి,
దిగిన
లోతు,
తెలిసికొనగలరే
గానీ
దిగక
లోతు,
తినక
రుచి
చెప్పువారల
పలుకులు
సత్యములు
కాజాలవు.
7
▾
Meaning
Keep
భగవంతునికే
భేదముండిన
స్త్రీలయిన
గోపికలకు
సాయుజ్యమిచ్చి
యుండునా?
శబరి
ఎంగిలి
ఫలములు
తినియుండునా?
జనకుడు
బ్రహ్మజ్ఞాని
అయివుండునా?
నందనార్కు
దివ్యదర్శనమిచ్చియుండునా?
ప్రహ్లాద
విభీషణాదులను
దగ్గర
చేర్చియుండునా?
వానరుడైన
హనుమంతుని
రామబంటుగా
అంగీకరించియుండునా?
వాల్మీకి
రామాయణమును
వ్రాయగలిగి
యుండునా?
ఈ
కార్యములన్నియూ
భగవంతునిలో
భేదముగా
నిరూపించినవా?
లేక
భేద
రహితునిగా
ఆదర్శించినవా?
పాఠకులు
యోచించిన,
విషయము
తెలియును.
భగవంతుని
ప్రేమతత్త్వమునకు
సమానత్వమునకు
పై
ఉదాహరణములే
తార్కాణము.
8
▾
Meaning
Keep
“మన్మనాభవ
మద్భక్తో
మద్యాజీ
మాం
నమస్కురు”
అని
పలికిన
దానిలోని
అర్థము
ఇది
కాక
మరేమి?
“నా
యందు
మనసు
కలవాడై
నన్నే
భక్తితో
భజింపుము.
నాకే
నమస్కరించుము!
నా
యందు
ప్రీతి
కలవాడవగుదువు;
నన్నే
పొందుదువు.”
తనకు
(అనగా,
భగవంతునకు)
ప్రియమైన
పదార్థములు
మనో
నిర్మలము,
ప్రేమ
శుద్ధి;
ఈ
రెండిటిని
తాను
ఆశించును.
9
▾
Meaning
Keep
లోకములో
దేనిని
తెలుసుకొనవలెనని
ఆశింతురో
అట్టి
వారు
అట్టి
స్థితిని
పొందినచో
తెలిసికొనవీలగును.
అనగా
వివేకమును
తెలిసికొనుటకు
వివేకమే
కావలెను.
చీకటిని
చూచుటకు
చీకటే
కావలెను.
ప్రకాశమును
దర్శించుటకు
ప్రకాశమే
కావలెను.
10
▾
Meaning
Keep
అటులనే
‘మాధవ
తత్త్వము’ను
తెలిసికొనుటకు
‘మాధవత్వము’నే
మనము
పొందవలసి
వచ్చును.
మానవత్వమును
చింతించుచూ,
మాధవత్వమును
తెలిసికొన
వీలుకానిది.
మాధవత్వమునే
స్మరించుచూ,
చరించుచూ,
ఆచరించిన
మాధవత్వమును
పొందవచ్చును.
స్థానములు,
స్థితులు,
భావములు
ఏకమైననే
తత్త్వము
అర్థము
కాగలదు.
11
▾
Meaning
Keep
దీనిని
పురస్కరించుకొనే
కృష్ణుడు
అర్జునునకు,
“బావా!
మానవుల
కంటే
దేవతలును,
దేవతలకంటే
జ్ఞానులును,
అధిక
స్థానము
కలవారు.
అట్టి
అధిక
స్థానమున
నున్న
‘జ్ఞానులు’
కూడనూ
పరబ్రహ్మము
యొక్క
సంపూర్ణ
జ్ఞానమును
తెలిసి
కొనలేరు.
ఇక
సామాన్య
మానవులైన
నీబోటి
వారికిది
సాధ్యమా?”
అని
వేళాకోళము
చేసినాడు.
12
▾
Meaning
Keep
అర్జునుడు
సిగ్గుతో
తలవంచుకొని,
“స్వామీ!
నిజమే;
నిన్ను
తెలిసికొన
ఎట్టి
వారికీ
సాధ్యము
కాదు.
నీవు
అనంత
రూపుడవని
నేను
దృధముగా
విశ్వసించుచున్నాను.
మీరే
‘పరబ్రహ్మ’మని
భావించుచున్నాను.
మీరే
చరాచర
ప్రపంచమున
సృష్టి
స్థితి
లయములు
గావించుచున్నారని
నమ్మితిని.
మీరు
కూడ
స్వయముగా
తెలిపితిరి;
ధన్యుడను.”
13
▾
Meaning
Keep
“అయితే,
ఈ
లోకమున
మీరు
మీ
శక్తిమయమైన
రూపములను
ఎట్లు
ధరించుచున్నారు?
అనగా,
మీరు
ఏ
ఏ
రూపమున
ఈ
జగత్తును
వ్యాపించియున్నారో,
వాటినన్నింటిని
తెలిపి
నా
జన్మమును
సార్థకమొనరించుడు;
మరియు
నేను
నిన్ను
ఏ
రూపమున
ధ్యానించవలెనో
అదియును
సెలవిచ్చిన,
అట్లు
ధ్యానింతును,
కృష్ణా!”
అని
వేడుకొనెను.
14
▾
Meaning
Keep
“అర్జునా!
చాలా
చిన్న
కోరికనే
కోరితివి.
ఇది
నీకంత
సులభముగా
అర్థమగుననుకొంటివా?
అడిగితివి
కనుక
దయతో
తెలుపుదును,
విను.
సకల
భూతముల
యొక్క
హృదయ
కమలములందుండు
‘ప్రత్యగాత్మ’ను
నేనే.
దీనినే
‘ఆత్మ’
అని
అందురు.
దానిని
ధ్యానించిన
చాలును.
అనగా
‘సర్వభూతముల
యొక్క
ప్రత్యగాత్మ’
అని
విశ్వసించిన
చాలును,
అదే
ధ్యానము.
ఇట్టి
విశ్వాసమునకు,
ప్రతిబంధకములు
కలుగక
దృధవ్రతుడై
ఆచరణల
యందు
నిరూపణ
సలిపినపుడు
‘నీవే
నేను,
నేనే
నీవు’గా
అనుభవింతువు.
అనగా,
ఏకత్వము
పొందవచ్చును.”
15
▾
Meaning
Keep
“ఇక
లోకమున
భూతములు
కాక,
మిగిలిన
సృష్టిజాలమున
ఏ
ఏ
రూపముననున్నానో
అదియును
తెలిసికొమ్ము.
పంచభూతముల
స్వరూపమైన
భూమి,
జలము,
అగ్ని,
వాయువు,
ఆకాశములు
నా
రూపములే.
సూర్య,
చంద్ర,
నక్షత్రముల
యందలి
చైతన్యమును
నేనే.
ప్రళయ
కాలమున
సమస్తమునూ
తనలో
లయపరచెడు
మృత్యుదేవతయు,
ఉత్పత్తి
కాలమున
పుట్టుకయూ
నేనే.
వేయేటికి?
అణువు
మొదలు
అఖండము
వరకూ,
త్రికాల,
త్రిలోక,
త్రిగుణములందు
అంతయు
నేనే
వ్యాపించి
యున్నాను.”
16
▾
Meaning
Keep
“నేను
కాని
వస్తువుకానీ,
నాది
కాని
పేరు
గానీ
లోకమున
లేదు.
దేహమునందలి
రక్తము,
ఏ
భాగము
చూచిననూ
ఒక్కటిగానే
ఎట్లుండునో,
దేశమునందు
ఏ
భూతమును
చూచిననూ
అందులో
సర్వ
వ్యాపియైన
నేనే
రక్తమువలె
ప్రవహించుచుందును”
అని
కృష్ణపరమాత్మ
బోధించెను.
17
▾
Meaning
Keep
అప్పుడు
అర్జునుడు
రెండు
చేతులు
జోడించి,
“కృష్ణా!
విశ్వమంతయు
నీ
రూపమే
కదా!
అందులోని
జ్ఞాన,
ఐశ్వర్య,
శక్తి,
బలము,
వీర్యము,
తేజస్సులు
నీ
రూపములోని
సారములే
కదా?
ఈ
అన్నింటి
సమ్మేళనలో
ఉన్న
నీ
విశ్వరూపమును
ఒక
పరి
చూపి
నన్ను
కృతార్థుని
చేయకూడదా?
పాదములంటి
ప్రార్థింతును!”
అని
వినయ
విధేయలతో
కోరినాడు.
అపుడు
పరమాత్ముడు,
“బావా!
అర్జునా!
నీ
కోరిక
తప్పక
అందింతును;
కానీ,
విశ్వరూపధరుడగు
నన్ను
ఈ
ప్రాకృతమైన
నేత్రములతో
చూడ
సాధ్యముకాదు.
చూడలేవు.
కనుక
అప్రాకృతమైన
దృష్టిని
అనుగ్రహించెదను!
చూడము”
అని
దివ్యదృష్టిని
ప్రసాదించి,
తన
‘విశ్వరూపము’ను
చూపించినాడు,
పరమ
దయాళుడైన
పరమాత్మ
స్వరూపుడు
కృష్ణుడు.
18
▾
Meaning
Keep
ఈ
సమయమున
సాధకులు
గుర్తించవలసిన
అతి
సూక్ష్మ
సారాంశము
ఒకటి
విచారింతుము.
19
▾
Meaning
Keep
వేదములు,
శాస్త్రములు,
పురాణములే
కాక
అనేకమంది
అనుభవజ్ఞులు
పండితోత్తములు
–
ఈశ్వరుడు
సర్వవ్యాపి,
సర్వభూతాంతరాత్మ
అని
తెలుపుచునే
యున్నారు.
కానీ
దీనిని
ఆధారముగా
తీసుకొని
మరొక
తెగవారు
“ఈశ్వరుడు
సర్వవ్యాపియే
అయి
ఉండిన,
ఎందుకు
అందరికీ
కనుపించడు?”
అని
వాదించుచుందురు.
అట్టి
అవిశ్వాస
వాదకులకు
ఇది
సరియైన
సమాధానము.
ఏమన,
పంచ
భూతాత్మకమగు
ఈ
చక్షువులు,
పంచభూత
సంబంధమైన
వస్తువులను
మాత్రమే
చూడగలవు.
అప్రకాశ
వస్తువులు
ఎంత
ప్రకాశవంతమైన,
ఎంత
విలువైన
సువర్ణ
రత్నములైననూ
ఎట్లు
ప్రకాశింపజేయజాలవో,
దీపము
ఎట్లు
స్వప్రకాశమై
తన్నుతాను,
ఇతర
వస్తువులను,
ఎట్లు
ప్రకాశింపజేయునో
అటులనే
భగవంతుడు
స్వయం
ప్రకాశకుడును,
జ్ఞాన
స్వరూపుడును,
అప్రాకృతుడును
అగుటచే
అతనిని
జ్ఞాన
దృష్టిచే
మాత్రమే
చూడనగును.
అట్టి
జ్ఞాన
దృష్టి
కూడనూ
స్వయముగా
కలుగుట
దుస్సాధ్యము.
ఈశ్వరానుగ్రహము
వలననే
కలుగవలెను.
అందువలన
ఈశ్వరోపాసన
అవసరము.
అది
లేనివారికి
అన్నియూ
లేనట్లే.
తనను
తాను
చూడలేనివాడు
ఇతరములను
మాత్రమేమి
చూడగలడు?
ఈశ్వరానుగ్రహమును
పొందగల్గినట్టి
సాధన
చేసిన,
జ్ఞాన
నేత్రము
తానే
అందించగలడు!
అతను
భక్త
సులభుడు.
20
▾
Meaning
Keep
విశ్వరూపమును
చూచుచు
అర్జునుడు
ఆనంద
బాష్పములు
రాల్చుచు,
“పరమాత్మా!
సకల
దేవతలును,
సృష్టి
కర్తయైన
చతుర్ముఖ
బ్రహ్మను,
సమస్త
బుషులను,
నానా
స్థావర
జంగమాది
భూత
సమూహములను,
చూచుచున్నాను.
అబ్బా!
భయంకరమైన
నీ
మోమున
వెలువడు
మంటలు,
ఆ
తేజస్సులు,
సమస్త
జగత్తును
వ్యాపించి
తపింపజేయుచున్నవి.
ఈ
భయంకరమైన
ఉగ్రరూపమును
తెలిసికొన
గోరుచున్నాను.”
21
▾
Meaning
Keep
“అర్జునా!
చూచితివా?
సమస్త
కర్మలకును,
సమస్త
భూతములకును
సృష్టి,
స్థితి,
లయకారుడను
నేనే
అని
తెలిసినదా?
దీనిని
పట్టి
ఈ
యుద్ధభూమి
యందు
చేరిన
జనులను
కాపాడువాడవు
కానీ,
సంహరించువాడవు
కానీ,
నీవు
కాదని
తెలిసికొమ్ము.
నీవు
నిమిత్తమాత్రుడవే.
చంపు
అధికారము
నీకుగాని,
చచ్చు
అధికారము
వారికి
గానీ
ఎప్పటికీ
లేదు.
సర్వమూ
నా
యందే,
నా
సంకల్పమందే
యున్నది.
భూభారమణచుటయు,
భూభారమును
పోషించుటయు,
భూభారమును
వహించుటయు
నా
ప్రవృత్తి
అని
తెలిసికొమ్ము”
అని
కృష్ణుడు
వీపు
నిమురుచూ,
వాత్సల్యత
చూపుచూ
వణుకుచున్న
అర్జునుని
ఓదార్చినాడు.
22
▾
Meaning
Keep
భక్తవత్సలుడు,
భక్తపరాధీనుడనుటలో
ఈ
ఘట్టము
ప్రత్యక్ష
నిదర్శనము,
ప్రత్యక్ష
ప్రమాణము.
కాకున్న,
సామాన్య
మానవునివలె
అదరి
బెదురుచున్న
అర్జునుడెక్కడ?
మహా
వీరులు
సర్వశక్తిమయులు,
సర్వవిద్యా
ప్రవీణులయిన
భీష్మ,
ద్రోణ
కర్ణాదులెక్కడ?
అట్టివారలను
ఒక్క
భగవంతుడు
తప్ప
ఎవ్వరునూ
ఓడించలేరు,
సాధ్యము
కాదు.
అట్టి
మహావీరులను
ఓడించినట్టి
ఘనత,
వధించినట్టి
ఘనత,
తనకు
శరణాగతుడైన
అర్జునుని
పొందమని
తెలిపెను.
23
▾
Meaning
Keep
భక్తులయొక్క
యశస్సును
కోరి
భగవంతుడు
మానవాతీతమైన
కార్యములను
కూడా
చేయించును.
తాను
సాక్షీభూతుడై
సర్వకర్తయై
నాటకమాడించి,
ఏమియూ
ఎరుగని
వానివలే
నటించును.
ఇది
తన
భక్తుల
యందుగల
వాత్సల్యము.
అర్జునుడు,
కన్నులు
తుడుచుకొనుచు,
చేతులు
జోడించి,
“పరమాత్మా!
నేనెన్నడూ
కనీవినీ
ఎరుగని
విశ్వస్వరూపమును
చూచితిని.
అందలి
సత్యమును
తెలిసికొంటిని.
ఆ
భయంకర
తేజః
పుంజములు
నన్ను
కాల్చివేయుచున్నవి.
నా
దేహము
మండుచున్నది.
ఒకపరి
నీ
మొదటి
రూపమైన
ప్రసన్న
స్వరూపమును
చూపుము,
శాంతింపజేయుము.
తాళలేను
తండ్రీ!
చూడలేను”
అని
మొర
పెట్టుకొన్నాడు.
24
▾
Meaning
Keep
అంత
కృష్ణుడు
అనుగ్రహ
హృదయుడై,
“అర్జునా!
వేదాధ్యయనము
చేత
గానీ,
ఘోర
తపస్సుల
చేత
గానీ,
దాన
ధర్మాది
సత్కర్మల
చేత
గానీ,
యజ్ఞయాగాది
క్రతువుల
చేత
గానీ,
చూడ
సాధ్యము
కాని
నా
విశ్వరూపమును
నీవు
చూడగలిగితివి.
ఇట్టి
దర్శనము
మదేక
నిష్ఠుడైన
ఒక్క
భక్తునకు
మాత్రమే
ప్రాప్తించును,
సాధ్యమగును.
అనన్య
చింతనతో
నన్ను
ఉపాసించువారికి
ఇది
సాధ్యము
కాగలదు.
అట్టివారి
హృదయము
మాలిన్య
రహితమై
నిర్మలముగా
నుండును.
ఆ
సమయమున
దేనిని
చూచిననూ,
చేసిననూ
భవత్
స్వరూపముగను,
భగవత్
రూపమైన
కర్మలుగను
తలంతురు.
వారలకు
వేరు
రూపములు
కానీ,
వేరు
భావములుకానీ,
వేరు
చింతనలు
కానీ
ఉండవు.
సర్వకాల
సర్వావస్థలయందూ
నా
రూపమే,
నా
నామమే,
నా
భావమే,
నా
కర్మలే
చేయుచుందురు.
అట్టి
వారలకే
ఈ
పవిత్ర
ప్రాప్తి
లభ్యమగును.
నేను
అనన్య
భక్తినే
కోరుచుందును,
బావా!”
అర్జునుడు
చిరునవ్వులు
ముఖమున
చిందులాడ,
పెదవులు
కదలించుచూ,
“స్వామీ!
అనన్యభక్తి
మీకు
అతి
ప్రీతి
అని
తెలిసినది.
అయితే
సాకారోపాసన
నిన్ను
తృప్తిపరచునా?
లేక
నిరాకారోపాసన
నిన్ను
కరిగించునా?
ఈ
రెండింటిలో
ఏది
సాధకులకును,
సర్వేశ్వరుడైన
మీకునూ
సులభ
ప్రసన్నత
చేకూర్చును?
ఇందులో
ఏది
శ్రేష్ఠమో
సెలవిమ్ము”
అన్నాడు.
25
▾
Meaning
Keep
స్వామి
అందులకు
ప్రసన్న
చిత్తుడై,
“అర్జునా!
ఈ
రెండింటియందునూ
నాకేమాత్రమూ
భేదము
లేదు.
రెండునూ
ఒక్కటియే.
కావలసినది
చిత్తము
భగవదాయత్తమైయుండుట.
పవిత్రమైన
శ్రద్ధతో
ఎట్లు
ఆరాధించిననూ
నేను
ప్రసన్నుడనౌదును.”
26
▾
Meaning
Keep
“కృష్ణా!
చిత్తశుద్ధి
కలిగి
యుండిన
చాలా?
దీనికి
లింగ
భేదము
కానీ,
ఆశ్రమ
భేదము
కానీ,
వర్ణ
భేదము
కానీ
అడ్డురావా?”
27
▾
Meaning
Keep
“బావా!
అన్నియూ
అనుభవించి,
తిరిగీ
నీకీ
సంశయము
ఎట్లు
కలిగినది!
సర్వమూ
ఈశ్వరార్పణ
చేసి,
మనసును
భగవంతుని
యందు
లగ్నపరచి
నిత్య
సత్య
నిర్మలమైన
నాయందు
చిత్తముంచు
వారికి
దేహభ్రాంతి
యెట్లుండును?
ఒక
వేళ
దేహభ్రాంతి
యుండిన,
అది
సంపూర్ణ
ఈశ్వరార్పణ
కాదు.
దేహభ్రాంతే
లేని
వారలకు
ఆశ్రమ,
వర్ణ,
లింగ
భేదములు
ఉండవు
కదా?
భగవంతుని
యందు
మనస్సును
నిలుపుటకును,
భగవంతుని
చేరుటకును,
చిత్త
శుద్ధితో
ఉపాసన
సలుపుటకును,
ఆశ్రమ,
వర్ణ
ధర్మములు
అడ్డుతగలవు.
దేహాత్మభావము,
లోకాత్మభావము
కలవారలకే
వర్ణ
ఆశ్రమ
లింగ
భేదములు.
కనుక
నీవు
వాటి
విషయమై
చింతించనక్కరలేదు”
అని
పరమాత్ముడు
అర్జునునకు
తెలిపినాడు.
28
▾
Meaning
Keep
అందులకు
అర్జునుడు
“కృష్ణా!
దేహాభిమానము,
లోకాభిమానము
కలవారలకు
నిర్గుణోపాసన
అంత
సులభము
కాదు
కదా?
సామాన్య
మానవులు
చేయు
‘సగుణోపాసన’చే
అంతఃకరణము
శుద్ధి
అగుటకు
వీలులేదా?
దయచేసి
తెలుపుము”
అన్నాడు.
Previous
←
The Gītā: Practice Is Greater Than Preaching
Next
The Way to Win God's Grace through Saguṇa and Nirguṇa Upāsana
→