Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Way to Win God's Grace through Saguṇa and Nirguṇa Upāsana
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
“అర్జునా!
‘సగుణోపాసన’
సులభమని
లోకులు
తలంతురు.
కానీ
అది
అంతటి
సత్యము
కాదు.
అది
అసత్యమే
అగును.
‘ఇంద్రియ
సంయమము’
కలుగు
వరకూ,
అనగా
ప్రారంభ
స్థితియందు
‘సగుణోపాసన’
కొంత
తోడ్పడును,
దారిని
చూపును,
అంతియే.”
2
▾
Meaning
Keep
“అంత
మాత్రముచే
ఆరాధనా
దైవము
అనుగ్రహించి
ముక్తిని
అందించడు.
అట్టి
ముక్తిని
పొందగోరు
వారు,
మొదలు
దేహాభిమానము
వదలవలెను.
అటుల
కానిదే
ఆత్మస్థితి
కలుగదు.
దేహాభిమానము
అవిద్యారూపము.
ఆత్మ,
ప్రకృతి
నుండి
వేరు
కావలెను.
దానికి
ధ్యాన
తపస్సులచే
అంతఃకరణములందు
గల
విషయవాసన
నశించవలెను.
అది
నశించినతోడనే,
కొబ్బరి
కురడీలు
మరలా
పీచుతోనూ,
చిప్పలతోనూ
చేరనట్లు,
తిరిగి
మొలకెత్తనట్లు,
ఎంతకాలమైననూ
చెడకుండునట్లు
జీవుడు
జనన
మరణముల
బారి
నుండి
వేరై,
మోక్ష
సిద్ధి
నుండి
చలించుట
కానీ
ఉండదు.
దీనిని
‘జీవన్ముక్తి’
యొక్క
స్థితి
అని
అందురు.”
3
▾
Meaning
Keep
“ఇట్టి
స్థితిని
పొందుటకు
‘నిర్గుణోపాసన’
ద్వారా
దేహాభిమానము
వదలవలెను.
అటుల
కాదేని,
సగుణోపాసకులు
కూడనూ
సమస్త
వైదిక,
లౌకిక
కర్మఫలములను
నా
యందు
సమర్పించి,
‘నేనే
పరమ
గతి’గా
ఉపాసన
చేసినచో,
నన్నే
ధ్యానించినచో,
చిత్తమును
నా
యందే
ఉంచినచో,
అట్టి
వారిని
కూడనూ
నేను
అనుగ్రహింతును.
సంసారమనెడి
సముద్రమును
దాటింతును.
మోక్షమను
గమ్యమును
చేర్తును.
బావా!
చిత్తమును
నా
యందే
ఉంచుట
అంత
సులభమైన
పని
కాదు.
అందరికీ
ఇది
సాధ్యము
కాదు.
ఎంత
అభ్యాసము
చేసిననూ
చిత్తమును
నాయందుంచుట
దుస్సాధ్యము.”
4
▾
Meaning
Keep
“అటులయిన
ఇక
వేరు
మార్గము
లేదా
అని
విచారింతువేమో?
ఉన్నది.
ఏమన,
నాకు
ప్రీతిని
కలిగించు
కర్మలు
చేయుటలో
ఎవరు
ఆసక్తిని
చూపుదురో
వారికి
కూడనూ
ఆత్మస్థితి
కలుగును;
మోక్షము
సిద్ధించును.
ప్రార్థన,
భజన
పూజాదులు
సలుపుటచే
పాపము
నశించి
అంతఃకరణ
శుద్ధి
అయి
జ్ఞానోదయము
కలుగును.”
ఇట్లు
శ్రీ
కృష్ణభగవానుడు,
సగుణ,
నిర్గుణోపాసనల
ద్వారా
దైవానుగ్రహము
సంపాదించు
విధానము
వివరించెను.
5
▾
Meaning
Keep
పాఠకులు
ఈ
విషయమును
చక్కగా
విచారించవలసిన
అవసరమెంతేనియూ
కలదు.
అట్టి
విచారణవలననే
వివేక
సహితమైన
విషయము
తేలును.
‘భక్తి’
అనగా
లోకులు
తలంచు
అర్థమునకును
పరమాత్ముడు
ఉపదేశించు
అర్థమునకునూ
ఎంత
భేదమున్నదో
యోచించుడు.
‘భగవంతుని
యందు
అవ్యాజమైన
ప్రేమయే
భక్తి’
అని
లోకులు
భావింతురు.
ఇంత
మాత్రమునకే
‘భక్తి’
అను
పదమునకు
సార్థకము
చేకూరదు.
భగవంతుని
ప్రీతితో
ఆరాధించుట
ఒక
విధమైన
సాధన
మాత్రమే
అగును.
కానీ
భక్తుడు
కాగోరువారు
అంతమాత్రమునకే
తృప్తిపడక,
తమ
ప్రేమ
భగవంతుని
యందు
ఎంత
మాత్రము
కలదని,
యోచించుట
కంటెను,
భగవంతుని
ప్రేమానుగ్రహములు
తనపై
ఎంతమాత్రము
కలవనియు,
ఎట్టి
కర్మలు
చేసిన,
ఏ
రీతిగా
మెలగిన
భగవంతుడు
సంతుష్టుడు
కాగలడు,
అనగా
భగవంతుని
ఆనందపరచగలము,
అతనిని
ఆనందపరచు
మార్గమేది
అని
యోచించి,
విచారించి
తదనుగుణ్యముగా
ప్రవర్తించుటే
భక్తి
యొక్క
లక్ష్యమని
తేలుచున్నది.
6
▾
Meaning
Keep
అయితే,
సామాన్య
మానవ
లోకమున
ఇట్టి
విచారణ
సలుపుట
లేదు.
ఆరాధించువాని
యొక్క
ప్రేమ
పరమాత్మ
యందు
ఎంత
గాఢముగానున్నదో
అంతమాత్రమే
చూచుకొందురు.
అట్లు
చేయుట
చేత,
భగవత్ప్రీతికరమైన
కర్మలను
కానీ,
ధర్మములను
కానీ
కొంత
యోచించకపోవచ్చును,
ఆచరించక
పోవచ్చును.
7
▾
Meaning
Keep
అందులకే
కాబోలు,
‘ఆరాధించువాని
అభీష్ట
కర్మలంకంటెను,
ఆరాధింపబడు
భగవత్
ప్రీతికరమైన
కర్మలు
అత్యుత్తమమైన’వని
కృష్ణుడు
నిరూపించెను.
భక్తులనబడువారు
ఏ
కర్మలు
చేసిననూ,
ఏమి
తలంచిననూ,
ఏమి
చూచిననూ
భగవత్
ప్రీతికరమైనవిగా
ఉండవలెను,
లేక
భగవదర్పితమై
యుండవలెను.
అంతేకానీ,
తన
ప్రీతి
ననుసరించి
సర్వకర్మలయందూ
సాధన
సాగిపోయిన
అది
సారములేని
భారము
కాగలదు.
ఏమి
చేసిననూ
ఈ
పని,
ఈ
భావము,
భగవంతునికి
ప్రీతి
అయినదేనా,
కాదా?
అని
విచారించుట
భక్తుని
యొక్క
ముఖ్య
కర్తవ్యము.
8
▾
Meaning
Keep
అట్లు
కాక
భగవంతునియందు
గాఢమగు
ప్రేమ
విశ్వాసములుండియు,
భగవదాజ్ఞకు
విరుద్ధముగా
కానీ,
లేక
భగవానుని
శాసనమైన
శాస్త్రమునందు
తెలుపబడిన
ధర్మములకు
విరుద్ధముగా
కానీ
ప్రవర్తించిన,
అట్టివారు
భక్తులు
కారని
కూడనూ
తెలుపుచున్నది
గీత.
అదియే
“భక్తిమాన్
యః
సమేప్రియః”
అని
కృష్ణుడు
తెలుపుటలో
భావము.
మరియు,
భక్తుడు
ఏ
కర్మలు
ఆచరించినను
తాను
“మమ
కర్మ”
అని
భావించకూడదు.
ఈశ్వరీయ
కర్మగా
ఉండవలెనని
కూడనూ
తెలుపుచున్నాడు.
అనగా,
కొన్ని
కర్మలు
తనవిగాను,
మరికొన్ని
కర్మలు
భగవంతునివిగానూ,
భావించుచుందురు.
అట్లు
భావించుట
భక్తుని
లక్షణము
కాదు.
సర్వకర్మలు
భగవదర్పితమైన
కర్మలుగా
భావించిన,
అభిమాన
మమకారములందున
చేరవు.
మమకార
అభిమానములను
నిర్మూలన
చేసుకొను
సాధనే
భక్తి.
సర్వమునూ
భగవత్
మయముగా
భావించవలెను.
9
▾
Meaning
Keep
అందులకే
“భక్తుడనగా
భగవంతునితో
విభక్తము
కానివాడ”ని
అనేక
ఆధ్యాత్మిక
తత్త్వములందు
తెలుపబడినది.
సర్వకాల
సర్వావస్థలయందూ
భగవత్
మయమైన
భావములుగా
కర్మలుగా
నుండవలెను.
అట్లుకాక
కష్టములు,
నష్టములు,
దుఃఖములు,
బాధలు
కలిగినపుడు
మాత్రము
“భగవంతుడా!
వీటిని
నివారింపుము”
అని
ప్రార్థించుట,
అది
తీరగనే,
నెరవేరగనే
భగవంతుని
స్మరణ
అయిననూ
లేక
ప్రకృతికి
దాసులగుట,
ఇట్టి
ప్రవర్తన
భక్తులకు
పరమ
విరుద్ధమైన
పద్ధతిగా
కూడనూ
తెలుపుచున్నది
గీత.
అవసరముననుసరించి
భగవంతుని
ఆరాధించరాదు.
10
▾
Meaning
Keep
నోరు
చెడినపుడు
ఊరగాయను
కోరినటుల,
బాధలు
కలిగినపుడు
భగవంతుని
కోరరాదు.
అయితే,
నేటి
కలి
మహత్మ్యమేమో
కానీ,
ఎక్కడ
చూచిననూ
ఇట్టి
ఆడంబర
భక్తే
తాండవమాడుచున్నది.
ఎంత
గొప్ప
సాధకులన్నవారు
కానీ,
ఎంతో
త్యాగములు
చేసి
“దైవమే
మా
సర్వస్వ”మని
భావించి
ఆరాధించు
భక్తుల
యందు
కానీ,
కాలకర్మ
స్థానములను
పట్టి
భక్తిని
ప్రదర్శించుచున్న
చర్యలు
కనిపించుచునే
యున్నవి.
అనేక
మంది
యాత్రలు
సలుపు
సమయములందూ,
పెద్దల
దర్శనమునకు
వెళ్ళు
సమయములందూ
లేక
దేవాలయములకు
పోవు
సమయములలో
‘భక్తి’
అను
బురకాలు
ధరించుచున్నారు.
తిరిగి
ఇంటికి
చేరగనే
ఆ
చింతన
కానీ,
ఆ
భావములు
కానీ
వెతికిననూ
చిక్కవు.
ఎంత
ప్రయత్నించినా
కనుపించవు.
ఇట్టి
ప్రవర్తన,
భక్తి
అని
అనుపించుకొనదు.
11
▾
Meaning
Keep
ఇవి
కేవలము
ఆడంబర
అవిద్యలు.
సర్వస్థానములందూ,
సర్వవేళలయందూ,
సర్వాత్మ
భావమే
‘నిజమైన
భక్తి’
అని
కూడనూ
తెలుసుకొనవలెను.
కొందరు
‘సర్వకర్మలూ
భగవదర్పిత’మని
మాటలతో
తెలుపుతూ
దేహార్పితము
చేయుచుందురు.
కృష్ణార్పితమని
చెప్పుతూ
పుత్రార్పితము
చేయుట,
రామార్పితమని
అంటూ
రాగార్పితము
చేయుట
జరుగుచుండును.
అట్టి
అర్పితము
అర్పితమనబడదు.
మనోవాక్కాయ
కర్మలతో
చేసిన
అర్పితము
అర్పితమనబడును,
భక్తి
అనబడును;
కానీ
మాటలతో
చెప్పినది
మనసుతో
చేయక,
మనసున
తలచినవి
క్రియతో
చేర్చక
ఉండుట
బూటకపు
ఆటలని
తలంచవచ్చును,
చెప్పవచ్చును.
12
▾
Meaning
Keep
కర్తృ,
కర్మ,
క్రియలన్నియు
పరమాత్మను
ఆశ్రయించి
యున్నవని
దృఢ
నమ్మకము
కలిగి
దైవమునకు
భక్తులు
కావలెను
కానీ,
ధనమునకు,
దారాదులకు,
పుత్రాదులకు,
భక్తులు
కారాదు,
కారాదు.
అభిమానమెక్కడో
అక్కడ
దైవభక్తి
అని
చెప్పచెల్లదు.
‘భక్తి’
పరిశుద్ధమైన
‘గంగ’వంటిది.
‘కర్మ’
‘యమున’
వంటిది.
‘జ్ఞానము’
గుప్తగామినియైన
‘సరస్వతి’
వంటిది.
ఇది
బైటకి
కనుపించునది
కాదు.
ఈ
మూడింటి
సమ్మేళనే
“త్రివేణి”
అని
పిలువబడును.
13
▾
Meaning
Keep
అట్టి,
త్రివేణి
యందు,
అనగా
త్రిగుణముల
ఏకత్వమే
మనోలయము.
అదియే
మమకార
రహితమని
అందురు.
అట్లుకాక
మరి
కొంతమంది
నిత్యము
రెండు
వేళల
స్నానసంధ్యాదులు
చేయుచు,
ఆరాధన
అర్చనాదులు
సలుపుచు,
నొసట
పెద్ద
పెద్ద
విభూతి
పట్టెలు,
గంధపు
పట్టెలు,
కుంకుమ
బొట్టులు
పెట్టుచు,
జపమాలలు
కంఠములందును
హస్తములందునూ
ధరించి
దేవాలయములకు
గానీ,
పెద్దల
దగ్గరకు
గానీ
లేక
క్షేత్రముల
సందర్శనమునకు
గానీ
వెళ్ళుచుందురు,
ప్రదక్షిణలు
తిరుగుచుందురు.
లేక
సత్కాలక్షేపములైన
ప్రసంగములు,
హరికథలు,
పారాయణములు
ఇత్యాది
పురాణ
కాలక్షేపములకు
వెళ్ళుచుందురు.
ఇట్టి
స్థితిని,
ఇట్టి
కర్మలను,
సత్
కర్మలనియు
సదాచారములనియు
చెప్పవచ్చునే
కానీ
ఇట్టి
కర్మలు
సలుపువారందరినీ
భక్తులని
చెప్ప
వీలులేదు.
14
▾
Meaning
Keep
భక్తికినీ,
వేషభాషలకునూ
ఏ
మాత్రమూ
సంబంధములేదు.
వేష
భాషలున్నంత
మాత్రమున
అట్టి
వారిని
భక్త
కోటికి
చేరిన
వారనుట
యెట్లు
సాధ్యమగును?
భక్తి,
భావములో
చేరినదే
కానీ,
బాహ్యముతో
చేరినది
కాదు.
పొగ
ఉన్నచోట
నిప్పు
ఉన్నదని
చెప్పవచ్చును.
నిప్పు
ఉన్న
చోటంతయూ
పొగ
ఉండుననుట
కల్ల.
పొగలేని
నిప్పు
కూడనూ
ఉండవచ్చును
కానీ
నిప్పులేని
పొగ
మాత్రము
ఉండనేరదు.
అటులనే,
భావములేని
కర్మలు
ఉండవచ్చును
కానీ,
ఆడంబర
కర్మలు
లేనిచో
భావము
లేదని
చెప్ప
వీలుకాదు.
15
▾
Meaning
Keep
బాహ్యడంబరములు
లేకపోయిననూ
భావశుద్ధి
ఉండి
యుండవచ్చును.
కాన,
భావశుద్ధియే
ప్రధానము!
దానికి
తగిన
సదాచారములు
వాటికి
ఆధారములు.
భావశుద్ధితో
చేసిన
కర్మలే
భగవత్
కర్మలు.
భావశుద్ధి
లేక
బాహ్యండబరముల
కొరకు
చేసిన
కర్మలు,
ప్రకృతి
కర్మలనే
చెప్పవచ్చును;
ఇట్టి
కర్మలు
భక్తునకు
విరుద్ధ
ప్రవర్తనలు.
16
▾
Meaning
Keep
తరువాత,
అర్జునుడు
అడిగిన
ప్రశ్నలో:
సగుణ
భక్తుడనియు,
నిర్గుణ
భక్తుడనియు
రెండు
విధానములు
కలవు.
ఇందులో
‘ఆర్తి,
అర్థార్తి,
జిజ్ఞాసు’,
సగుణ
భక్తులనియు,
అనగా
రూపనామములతో
ఆరాధన
సలుపువారనియు,
‘జ్ఞాని’
నిర్గుణ
భక్తుడనియు
తలంచవలెను.
వీరిరువురి
యందు
గల
భక్తి
ప్రవర్తనలలో
ఏది
శ్రేష్ఠమైనదనియూ
అర్జునుని
సందేహము.
17
▾
Meaning
Keep
ఈ
విషయమున
ఆనాటి
అర్జునునకేకాక
నేటి
మానవులందరికీ
ఈ
సందేహము
లేకపోలేదు.
నేటికినీ
ఇట్టి
సగుణ
నిర్గుణ
భక్తి
పై
అనేక
వాదోపవాదములు
జరుగుచునేయున్నవి.
కొందరు
సగుణ
భక్తియే
శ్రేష్ఠమనియు,
మరికొందరు
నిర్గుణ
భక్తియే
శ్రేష్ఠమనియూ,
ఇంకనూ
కొందరు
సగుణ
నిర్గుణ
సమ్మేళన
భక్తియే
శ్రేష్ఠమనియూ
ఈ
రీతిగా
ఒక
నిర్ణయము
కాక
తికమకలు
పడుచున్నారు.
కానీ,
‘గీత’
ఈ
సందేహమును
సులభముగా
తీర్చుచున్నది.
పరమాత్ముని
తీర్పే
సరియైన
తీర్పు
కానీ
పామరుల
తీర్పు
దీనికి
అన్వయించదు.
ఈ
మార్పులన్నియూ
సాధకుని
దృష్టి
భేదములే
కానీ
సరేశ్వరుని
సృష్టి
భేదములు
కావు.
18
▾
Meaning
Keep
ఉదాహరణమునకు
ఒకటి
చూతము.
ఒక
వ్యక్తికి
రెండు
పాదములున్నవి.
అందులో
ఏ
పాదము
ప్రధానమైన
పాదమన్న,
కర్మ
కలాపములకు
కుడి,
యెడమ
అని
భేదము
పాటింతుము
కానీ,
నడచుటకును,
దేహసంబంధమైన
బాధలకును
రెండునూ
తనవే
కదా?
ఏ
పాదమునకు
దెబ్బ
తగిలిననూ
ఆ
పాదములు
కల
వ్యక్తికే
కదా
బాధ?
ఏ
కాలుకి
బాధ
కలిగినా
తానే
బాధపడును.
కనుక,
బాధ
ఏ
కాలునకూ
రావలెనని
ఎవ్వరూ
కోరరు.
ఏ
కాలునకు
బాధ
కలుగుటకూ
ఏ
వ్యక్తియూ
అంగీకరించడు.
ఇప్పుడు
ఏ
కాలు
ప్రధానము,
ఏ
కాలు
ప్రధానము
కాదని
ఎట్లు
తెలుపగలరు?
రెండు
పాదములూ
చేరే
మానవుని
నడకను
సాగించుచున్నవి.
19
▾
Meaning
Keep
సగుణ
నిర్గుణములు
భగవంతుని
పాదముల
వంటివి.
దేనికి
అది
ప్రధానమే,
ఆధారమే.
ఒకటి
శ్రేష్ఠమనియూ,
మరొకటి
శ్రేష్ఠము
కాదనియూ
చెప్ప
వీలులేదు.
అయితే
కుడి
యెడమలని
మాత్రము
చెప్పక
తప్పదు;
సగుణము
ఎడమ
కాలనియూ,
నిర్గుణము
కుడి
కాలనియూ
చెప్పవచ్చును.
ఏ
మంగళ
కార్యమునందునూ
కుడి
కాలు
మొదలు
పెట్టినట్టుల,
మోక్ష
సౌధమునకు
నిర్గుణమను
కుడికాలును
మొదలు
పెట్టవలెను;
అదే
మంగళము.
అనగా
మోక్షసౌధమునకు
నిర్గుణుడు
మొదలు
ప్రవేశించును.
తరువాతు
సగుణుడు
ప్రవేశించును.
ప్రవేశము
ఇరువురికీ
కలదు.
అట్లు
లేదని
చెప్పుటకు
వీలులేదు.
ఎవరైననూ
ఒక
పాదము
లోపల,
మరొక
పాదము
వెలుపల,
యెంత
సేపని
పెట్టుకోగలదు?
అట్లుండి
కానీ
ఏమి
ప్రయోజనము?
కాన,
సగుణ
భక్తిని
సాధనంగానూ,
నిర్గుణ
భక్తిని
సాధ్యంగానూ
తలంచవచ్చును.
అనగా
నిర్గుణునకు
విశ్వమంతయూ
విశ్వేశ్వరుని
వలే
కనుపించవచ్చును.
సగుణుడును
విశ్వము
వేరుగాను,
విశ్వేశ్వరుని
వేరుగానూ
తలంచవచ్చును,
చూడవచ్చును.
ఈ
రెండునూ
లక్ష్యార్థమున
చూచిన
ఒక్కటియే.
ఎట్లన,
కొన్ని
చోట్ల
దారముగా
ఉన్న
వస్తువే
మరొకచోట
వస్త్రముగా
కనిపించును.
వస్త్రము
వేరు,
దారము
వేరుగా
ఉండును
కానీ,
దారమే
వస్త్రము,
వస్త్రమే
దారము.
దారమును
వేరుగా,
వస్త్రమును
వేరుగా
చూచుట
‘సగుణో
పాసన
తత్త్వము’.
దారము
యొక్క
సమ్మేళనే
వస్త్రమని
రెండింటినీ
ఏకముగా
చూచుటే,
నిర్గుణుని
యొక్క
తత్త్వముగా
భావించవలెను.
20
▾
Meaning
Keep
అయితే
భక్తి
అనునది
యెక్కడి
నుండియో
వచ్చి
పడునది
కాదు,
ఎవరూ
అందించునది
కాదు.
భూమి
నుండి
రాలేదు.
ఆకాశము
నుండి
పడలేదు.
తనలో
నుండియే
వచ్చు
భగవదనురాగము.
భక్తునిలోని
ప్రేమవృత్తి
ప్రవాహము
చెల్లాచెదరై
ప్రవహించక,
భగవంతునివైపు
ఏకోన్ముఖముగా
ప్రవహించిన
ప్రేమ
ప్రవాహమే
భక్తి
అని
పిలువబడును.
ప్రేమ,
సర్వప్రాణుల
యందును
కలదు.
ప్రేమలేని
జీవి
లేదు.
పశుపక్షి
మృగాదులకు,
క్రిమికీటకాదులకు
కూడా,
వాటికి
తగిన
ప్రేమవాటికున్నది.
వేయేటికి?
ప్రేమే
జీవనము,
జీవనమే
ప్రేమ.
21
▾
Meaning
Keep
ఆయా
జీవరాసులు
అన్నింటికినీ
తమ
తమ
బిడ్డలపై,
తల్లిదండ్రులపై,
మిత్రులపై,
వస్తువాహనాదులపై,
తిండి
తీర్థాదులపై,
పరిపరివిధముల
ప్రేమ
ప్రవహించుచుండును.
దీనిని
పట్టి,
తగిన
నామములు
నియమములగుచున్నవి.
అన్నింటికినీ
‘భక్తి’
అని
చెప్పవీలు
లేదు.
అది
సరియైనది
కాదు;
తమ
ప్రేమ,
తమ
తమ
బిడ్డలపై
మరలినపుడు,
అట్టి
ప్రేమను
‘వాత్సల్యమ’ని
పిలువబడును.
అదే
ప్రేమ
దాయాదులపై
తిరిగినపుడు,
‘మోహమ’ని
పిలువబడును.
అటులనే,
దీనులపై
పడినపుడు
‘కరుణ’
అనియు,
సమానులపై
చూపునపుడు
‘మైత్రి’
అనియు,
వస్తువాహములపై
పడినపుడు
‘ఇచ్ఛ’
అనియు,
‘వాంఛ’
అనియు
అందురు.
22
▾
Meaning
Keep
అయితే,
పూజనీయులైన
తల్లిదండ్రులపై,
విద్యా
గురువులైన
ఆచార్యులపై
ఈ
ప్రేమ
ప్రవహించిన,
దానిని
‘గౌరవమనియూ,
వినయమనియూ,
విధేయత’
అనియూ
అందురు.
23
▾
Meaning
Keep
కానీ,
ఒక్క
భగవంతునిపై
మాత్రము
ప్రవహించిన
ప్రేమనే
‘భక్తి’
అని
పిలువబడును.
చాలా
చీలికలుగా
ఏర్పడి,
క్షీణించి
ఎందుకూ
కొరగాక,
అశాంతి,
దుఃఖములకు
చిక్కుకొని
విలపించుటకంటే,
ఏక
ముఖమున
తన
ప్రేమ
ప్రవాహమును
భగవత్
అనుగ్రహమను
సాగరమున
చేరునట్లు
చేయు
సాధననే
భక్తి
అందురు.
సంసార
సాగరమున
చేరి,
నిస్సారమగుటకన్న,
సర్వేశ్వరానుగ్రహ
సాగరమును
చేరి
సార్థకమగుట,
సచ్చిదానందమును
పొందుట
ఎంత
పవిత్రము!
జన్మ
ధన్యము;
అదే
ఆనందము.
ఈ
విధమైన
ప్రయత్నములతో
సాధించి,
సంతసించినవారే
గోపికలు;
తరించినవారే
గోపికలు.
గోపికల
యొక్క
మనోవాక్కాయ
కర్మలన్నియు
సర్వకాల
సర్వావస్థలయందునూ
కృష్ణచరణారవిందములందు,
అర్పితములగుచుండెడివి.
కనుకనే
గోపికలు
‘యోగుల’ని
పిలువబడెను.
కృష్ణపరమాత్మయే
గోపికలను
‘యోగుల’ని
పిలువవలెనన్న
వారలది
యెంతటి
పవిత్ర
హృదయమో
యోచించుడు!
Previous
←
The Vision of the Viśvarūpa
Next
The Cessation of Sorrow and the Attainment of Ānanda
→