Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Cessation of Sorrow and the Attainment of Ānanda
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
దీనిని
పురస్కరించుకొని
అర్జునుడు
తిరిగి
ప్రశ్న
వేయ
ప్రారంభించెను:
“గోపాలా!
‘సగుణోపాసకు’ల
యొక్క
లక్షణములను
ముచ్చటగా
వివరించితివి.
అట్టి
లక్షణములు
కలవారు
‘యోగుల’ని
కూడా
సెలవిచ్చితివి.
చాలా
ఆనందము!
అయితే
సగుణోపాసకులకు
ఉండిన
లక్షణములవలే,
‘నిర్గుణోపాసకు’లకు
కూడనూ
కొన్ని
లక్షణములుందును,
కదా?
కనుక
దయచేసి
నిర్గుణోపాసకుల
లక్షణములు
ఎట్టివో,
సెలవిండు;
ఆనందముగా
విందును;
తెలిసికొందును.”
2
▾
Meaning
Keep
అందులకు,
నందకుమారుడు
సుందరాకారుడై
ఇట్లు
వివరించెను:
“బావా!
అర్జునా!
‘నిర్గుణోపాసకుని’లో
మొదటి
లక్షణము,
ఇంద్రియములను
తన
ఆధీనమునందుంచుకొన్నవాడుగా
కావలెను.
రెండవది,
సమస్త
పరిస్థితులలోను
సమాన
బుద్ధి
కలిగియుండవలెను.
ఇక
మూడవది,
కష్టసుఖములయందును,
నష్ట
నిష్ఠూరములయందును,
అందరికినీ
ఉపకారిగానే
యుండవలెను.
ఇట్టి
మూడు
లక్షణములు
కలవాడు
అక్షరో
పాసకుడని
తలంచుము.
ఇవి
నిర్గుణోపాసకుని
లక్షణములు.”
అక్షరోపాసకుడన్ననూ,
నిర్గుణోపాసకుడన్ననూ
ఒక్కటియే
అని
పాఠకులు
భావించవలెను.
3
▾
Meaning
Keep
విన్నంత
మాత్రముచే
అర్జునుడు
ఆనందమును
పట్టలేక,
“బావా!
నీవు
తెలిపిన
సగుణ,
నిర్గుణోపాసకుల
లక్షణములు
రెండింటిని
పూర్తి
అర్థము
చేసుకొంటిని.
కానీ,
నేను
ఇపుడు
ఏ
రీతిగా
ప్రవర్తించవలెనో,
ఎట్లు
చేసిన
నీ
అనుగ్రహమునకు
పాత్రుడను
కాగలనో
తెలుపుడు”
అని
పాదములపై
వ్రాలినాడు.
అపుడు
నారాయణుడు,
నరుడైన
అర్జునుని
లేవనెత్తుతూ,
“అర్జునా!
సగుణ
నిర్గుణో
పాసకుల
లక్షణములు
రెండూ
నీకిపుడు
అవసరములేదు;
అవి
అంత
సులభము
కావు.
దానికంటెనూ
సులభమైన
మార్గమొకటి
తెలుపుదును.
అట్లు
నీవు
చేసితివేని
తప్పక
నా
అనుగ్రహమునకు
గురి
కాగలవు;
ఏమన,
నీ
మనో
బుద్ధులు
నాయందుంచుము.
అది
నీ
చేత
కాక
పోయెనేని,
అహంకారమును
వదలి
భగవదర్థ
కర్మలను
చేయుము.
అదియూ
నీకు
కష్టమని
తలంచిన,
సాధ్యము
కాదని
భావించిన,
సమస్త
కర్మల
ఫలమును
“కృష్ణార్పణమ”ని
నాకే
వదలుము.
ఈ
పదము
కేవలము
మాటలతో
కాక,
మనోవాక్కాయకర్మలతో
చేయవలెను,
సుమా!
ఇందులో
ఏ
ఒక్కటి
చేసిననూ
చాలు.”
4
▾
Meaning
Keep
“ఇందులో
ఏదియునూ
సులభముగా
చేయుటకు
సాధ్యము
కాదందువా?
చేయలేనందువా?
తదుపరి
గతి,
స్థితి
నీకే
తెలియును”
అని
ఊరకుండెను.
ఈ
పవిత్ర
బోధనను
పట్టిచూడ,
‘భక్తుడు’
కాగోరు
వారికి
పని
యందు
మాత్రమే
లక్ష్యముండవలెను
కానీ,
కాలమందు
లక్ష్యముండకూడదని
తెలియచున్నది.
అందుకనే
అభ్యాసము
కంటే
జ్ఞానము,
జ్ఞానము
కంటే
ధ్యానము,
ధ్యానము
కంటే
కర్మఫల
త్యాగము
చాలా
శ్రేష్ఠమనియు
గోపాలుడు
తెలిపెను.
5
▾
Meaning
Keep
నీటికిని
నిప్పుకూ
ఎట్లు
పొత్తు
కుదరదో
అటులనే
ద్వేషమునకూ
భక్తికీ
పొత్తు
కుదరదు.
‘ఖేదమోదములు,
రాగద్వేషములు,
మంచిచెడ్డలు
లేకుండా,
అన్నింటినీ
సమానముగ
చూచు
వారలే
నాకు
ప్రియులు’
అని
కూడనూ
తెలిపెను.
ఏ
రూపముననైననూ
సరియే
ద్వేషవృత్తి
అంతఃకరణమునందు
ఉండిన,
వాడు
భక్తుడు
కాజాలడు.
“వాసుదేవస్సర్వమిదం”
సమస్తము
“వాసుదేవుడ”నే
భావము
ఉండవలెను.
తన
ఆత్మనే
అంతటనూ,
అన్నింటనూ
ఉన్నదని
తలంచి,
చరించి,
భావించి,
దేనిని
ద్వేషించిననూ
తనను
తాను
ద్వేషించుకొన్న
వాడగునని
కూడనూ
సెలవిచ్చెను.
6
▾
Meaning
Keep
దీనిని
విన్న
పాఠకులకు
సందేహము
కలుగవచ్చును.
ఏమన,
ద్వేషము
లేకుండినంత
మాత్రమున
“వాసుదేవస్సర్వమిదం”
అను
తత్త్వమును
పూర్తి
అనుభవించవచ్చునా
అని.
వినుడు
దాని
వివరము:
7
▾
Meaning
Keep
ద్వేషము
లేకుండినంత
మాత్రమున
దేహి
చేజిక్కడు.
ఆనందము
ప్రాప్తించదు;
భగవత్
ప్రీతికి
గురికాడు.
దీనికి
పంటను
పండించే
రైతును
చక్కని
ఉపమానముగా
తీసి
చూచిన,
సత్యము
తెలియును;
సంశయము
వీడును.
భూమి
యందు
పంట
పెట్టుటకు
పూర్వము,
రైతు
ఆ
భూమి
యందలి
పనికి
రాని
మొక్కలను
గడ్డిని
తీసిపారవేయును;
అంత
మాత్రముచే
పంట
యింటికి
రాదు.
తదుపరి
ఆ
భూమిని
దున్ని,
దుక్కు
చేసి
తదుపరి
ఆ
భూమిలో
వేయవలసిన,
చల్లవలసిన,
నాటవలసిన
పంట
పైరును
నాటి,
లేక
విత్తులను
వేసి,
పోషించిన
కానీ
పంట
ఇంటికి
చేరదు
కదా?
అటులనే
హృదయ
భూమియందు
పూర్వపు
వాసనలనెడు
‘రాగ,
ద్వేష,
అసూయ,
డంభమన’బడు
పనికిరాని
ముండ్ల
మొక్కలను
తీసివేసి,
‘సత్కర్మాచరణ’లనబడు
సేద్యము
చేసి,
అనగా
దున్ని
దుక్కుచేసి,
తదుపరి
‘ఆనంద’మను
మొక్కలను
అందులోనాటి.
‘క్రమశిక్షణ’
అను
సాధన
సాగించిన,
ఆనందమను
పంట
ఇంటికి
చేరును.
8
▾
Meaning
Keep
కేవలము
ద్వేషమును
మాత్రము
తీసివేసినంత
మాత్రమున
హృదయానందము
చేకూరదు.
‘మైత్రి’
కూడనూ
కలిగియుండవలెను;
అనగా,
ద్వేషము
తీయుట,
మైత్రి
నాటుట
అని
అర్థము.
ద్వేషము
లేకుండినంత
మాత్రము
చేతనే
‘భక్తి’
అని
తలంచిన
గోడకు,
చెట్టుకూ,
గుట్టకూ,
పుట్టకూ,
మట్టికీ
ఎవరిపై
ద్వేషము
కలదు?
ఎవ్వరి
యందునూ
లేదు.
అంత
మాత్రమునకే
గోడకు,
చెట్టుకూ,
గుట్టకూ
భక్తి
కలదని
తలంచుట
ఎంత
వెఱ్ఱితనము!
9
▾
Meaning
Keep
భక్తునకు
మొదటి
లక్షణము,
ద్వేషము
లేకుండుట;
రెండవ
లక్షణము,
మైత్రి
కలిగియుండుట;
ఇంత
మాత్రము
చేతనే
విడువక
దీనులయందును,
దుఃఖితులయందును
కరుణ
కూడనూ
ఉండవలెనని
శాసించినాడు
మువ్వ
గోపాలుడు.
10
▾
Meaning
Keep
వీటన్నింటినీ
అతి
శ్రద్ధతో
వింటున్న
అర్జునుడు
“కృష్ణా!
ఈ
మూడు
లక్షణములు,
లక్ష్యము
తప్పక
ఆచిరించిన,
అనుష్ఠించిన
చాలునా?
లేక
ఇంకనూ
కొన్ని
ఇట్టి
లక్షణములేవైననూ
కలవా?
తెలుపుడు”
అని
అడిగెను.
“అర్జునా!
పంట
పెట్టినంత
మాత్రమున
పైరు
పెరిగి
పెద్దది
కాగలదా?
ఫలమివ్వగలదా?
దానికి
తగిన
నీరూ,
ఎరువులు
అవసరము
లేదా?
ఇంత
మాత్రము
తెలిసికొనలేవా?
నేనింతకు
పూర్వము
చెప్పిన
ద్వేష
నిర్మూలము,
మైత్రి
నిర్మాణము
పైరు
పెట్టుట
మాత్రమే.
దీనికి
“నిర్మమః”,
“నిరహంకారః”
అని
రెండు
ప్రధాన
పోషణలు
అవసరము.
అనగా
నీరు,
ఎరువు
వంటివి.
ఇవి
లేక
ఆనందమను
పంటను
ఎట్టి
వాడైననూ
అనుభవించలేడు”
అని
భగవానుడు
విశదీకరించెను.
11
▾
Meaning
Keep
అనగా,
మమకారము,
అహంకారము
ఈ
రెండునూ
తన
యందు
లేకుండా
చేసుకొనవలెను.
ఈ
రెండునూ
వేరు
వేరు
కావు.
మమకారమునకు
మూలము
అహంకారము.
అజ్ఞానము
లేనివారికి
అహంకారము
చేరుటకు
వీలు
కాదు,
చోటు
లేదు.
అందుకనే
భగవత్
భక్తుడు
కాగోరువారు
“సతతం
సంతుష్టిః”
అనగా
భోగమందు
కానీ,
రోగమందు
కానీ,
నష్టమందు
కానీ,
ఆదాయమందు
కానీ,
దుఃఖమందు
కానీ,
సుఖమునందు
కానీ
ఏది
ప్రాప్తించిననూ
సంతుష్టుడై
ఉండవలెను.
తన
వాంఛా
ఫలసిద్ధియందును,
వాంఛా
అఫలమందును
మనసును
చలించకుండా
చూచుకొనవలెను.
12
▾
Meaning
Keep
అట్లు
కాక
తన
వాంఛకు
ఏమాత్రము
కొంచము
అడ్డు
తగిలినను,
చెప్పినను,
మనసు
ఉద్రేకమునకు
దారి
తీయుచుండును.
ఇంత
యెందులకు?
సకాలమునకు
సరిగా
కాఫీ
లేకపోయిన,
వారమునకు
రెండు
సినిమాలు
చూడకపోయిన,
ఉదయము
సాయంత్రము
రేడియోల
ముందు
కూర్చొనక
పోయిన,
ఇంకనూ
అనేక
విధములైన
అల్ప
విషయములందు
కూడనూ
తన
మనోభీష్టము
సిద్ధించకున్న
ఆనాడు
ఎంతయో
అసంతృప్తిగాను,
అశాంతిగాను
ఉందురు.
అట్టి
స్థితులు
‘సంతుష్టి’
అని
అనిపించుకొనజాలవు.
ఏది
జరిగిననూ
జరుగక
పోయిననూ,
సిద్ధించిననూ
సిద్ధించకపోయిననూ
రెండింటి
యందూ
సమూన
తృష్టిని
కనబరచుట,
అనుభవించుటే,
‘సంతుష్టి’
అని
చెప్పవచ్చును.
13
▾
Meaning
Keep
“స్వామీ!
ప్రకృతి,
పురుషుడు
అని
పలుమారు
తమరు
చెప్పూచుందురు
కదా!
ప్రకృతి
అనగా
నెట్టిది?
దాని
స్వభావమేమి?”
అని
పార్థుడడుగగా
అందులకు
కృష్ణుడు
అతి
సులభముగా
బోధపడునటుల
బోధించుచున్నాడు.
“బావా!
ప్రకృతికి
‘క్షేత్ర’మని
మరొక
పేరు
కూడనూ
కలదు.
ప్రకృతి
అన్ననూ,
క్షేత్రమన్ననూ
ఒక్కటియే.
ప్రకృతి
అనగా
ప్రపంచము.
అందులో
రెండు
వస్తువులున్నవి.
ఒకటి
జడము,
రెండవది
చైతన్యము.
అనగా
ఒకటి
ద్రష్ట,
రెండవది
దృశ్యము.
తెలుసుకొనునది
‘అహం’
వస్తువనియు,
తెలియబడునది
‘ఇదం’
వస్తువనియు
అందురు.
గుణముల
యొక్క
వికారము
ప్రకృతి
సంబంధములు.
సుఖ,
దుఃఖ,
మోహ
రూపములయిన
సత్వరజస్తమోగుణములు
‘ప్రకృతి
గుణములు’.
కర్తృత్వ
భోక్తృత్వ
ధర్మములు
ప్రకృతికి
సంబంధించనవే”
అని
జవాబు
తెలిపిన
కృష్ణపరమాత్మతో
అర్జునుడు
తిరిగి
ఏమో
అడుగుచున్నాడు.
అది
పరమాత్ముడు
గమనించి,
“బావా!
ఏమి
మరీ
ఏమిటో
అడుగుటకు
ప్రయత్నించుచున్నావు?”
అని
అనిన
వెంటనే
సమయము
దొరికిందని
తలంచి
అర్జునుడు,
“కృష్ణా!
‘ప్రకృతి’
తత్వము
తెలియ
జెప్పితివి.
ఇక
‘పురుషుడ’న్న
ఎవరో
అతని
స్వభావములేవో
తెలుపుడు”
అని
ప్రార్థించెను.
14
▾
Meaning
Keep
“అర్జునా!
విను.
‘పురుషుడన్నను,
క్షేత్రజ్ఞుడన్నను,
జ్ఞేయ’మన్ననూ
ఒక్కటియే.
‘పురుషుడ’నగా
జీవుడని,
ప్రకృతి
అనగా
దేహమనియు,
పురుషుడనగా
ఆ
దేహమును
తెలుసుకొనువాడు
అనియు;
ఈ
దేహమునకే
అనేక
నామములు
కలవు.
జీర్ణమయి
శిథిలమయ్యేది
కనుక
శరీరమనియు,
దహింపబడేది
కనుక
దేహమనియు
అందురు.
ఇందులో
చైతన్య
స్వరూపుడై
దాని
స్థితిని
సంపూర్ణముగా
తెలుసుకొనువానినే
‘జీవుడ’ని
కూడనూ
అందురు.”
15
▾
Meaning
Keep
అందులకు
అర్జునునకు
సందేహము
పొడసూపి
“కృష్ణా!
అట్టి
జీర్ణమయ్యే
శరీరమునకు,
దహించిపోయే
ఈ
దేహమునకు
‘క్షేత్రమ’ని
పేరెట్లు
వచ్చినది?”
అని
ప్రశ్నించినాడు
బుద్ధిశాలియైన
అర్జునుడు.
16
▾
Meaning
Keep
“బావా!
అర్జునా!
ఈ
దేహము
ద్వారానే
అనేక
పుణ్యములు
సంపాదించి,
జ్ఞానమును
పొంది,
మోక్షమును
పొందుదురు
కదా?
అట్టి
‘భగవద్విభూతులు’
నెలకొన్న
చోటు
కనుక
ఇది
‘క్షేత్రమ’ని
పిలువబడును.
క్షేత్రమన్న
కవచమువలే
జీవుణ్ణి
కాపాడేదని
మరొక
అర్థము;
‘క్షేత్రమ’నగా
భూమి
అని
మరొక
అర్థము,
‘పొలమ’నుటకును
ఒక
ఆధారమున్నది.
పొలమున
ఏ
విత్తనములు
చల్లుదుమో,
నాటుదుమో
అదే
పంటనే
మానవులు
తీసుకొందురు,
కోసుకొందురు.
శరీరం
క్షేత్రం,
క్షేత్రపాలకుడు
జీవుడు.
పుణ్య
బీజములను
చల్లి
‘సుఖసంతోషము’లను
పంటను
పండించుకొనును.
పాపబీజములను
చల్లి
‘దుఃఖమును,
అశాంతి’
అను
పంటను
పొందుచున్నారు.
జ్ఞాన
విత్తనములు
నాటి
‘మోక్ష’మను
ఫలమును
పొందుచున్నారు.
పొలమును
రైతు
తెలిసికొనినట్లు
క్షేత్రమను
దేహతత్త్వమును
క్షేత్రజ్ఞుడను
జీవుడు
తెలుసుకొనును.
క్షేత్రమునకు
క్షేత్రజ్ఞునకు
ఒక్కటి
మాత్రమే
వ్యత్యాసము.
అది,
‘జ్ఞ’
అను
శబ్దము.
‘జ్ఞ’
అనగా
‘జ్ఞానము’
అని
అర్థము.
అనగా
జ్ఞానము
కలవాడే
క్షేత్రజ్ఞుడనియు,
జ్ఞానము
లేనిదే
క్షేత్రమనియూ
చెప్పవచ్చును”
అని
గోవిందుడు
వివరించెను.
17
▾
Meaning
Keep
“కృష్ణా!
క్షేత్రమును,
క్షేత్రజ్ఞుని
తెలుసుకొన్నంత
మాత్రమున
వచ్చు
ఫలమేమి?”
18
▾
Meaning
Keep
“పిచ్చి
బావా!
‘క్షేత్ర
విచారణ’
వలన
‘దుఃఖ
నివృత్తి’యు,
‘క్షేత్రజ్ఞుని
విచారణ’
వలన
‘ఆనంద
ప్రాప్తి’యు
చేకూరును.
దానినే
‘మోక్ష’మని
కూడనూ
అందురు”
అని
అంతమాత్రముతో
మాటాడక
మౌనము
వహించెను.
19
▾
Meaning
Keep
ఇంతలో
ప్రజా
ప్రతినిధియైన
అర్జునుడు
“కృష్ణా!
‘దుఃఖనివృత్తి,
ఆనంద
ప్రాప్తి’
అని
అంటిరే,
ఇవి
రెండునూ
అనభవించువారెవరు?
జీవుడా
లేక
క్షేత్రమైన
దేహమా?
వివరములు
తెలుపుము”
అన్నాడు.
20
▾
Meaning
Keep
“అర్జునా!
క్షేత్రము
గుణములతో
చేరినది
కనుక
దానితో
చేరుటచే
జీవుడు
ఆయా
స్థితులను
అనుభవించుచున్నాడని
తలంతురే
కాని,
పురుషునకును,
ఈ
గుణవికారములకునూ
ఏ
మాత్రమూ
సంబంధములేదు.
అతను
సాక్షీభూతుడు.
అగ్నితో
చేరిన
ఇనుమునకు
దహించు
శక్తి
యుండును.
అయితే
దహించు
శక్తి
అగ్నిదే
కానీ
ఇనుముది
కాదు
కదా?
ప్రకృతి
సంసర్గముతో
పురుషునిలో
భోక్తృత్వము
ఆరోపించు
చుందురు.”
దీనిని
విచారించిన,
గుణములకు
నిలయమైన
దేహములో
నివసించుటచే
జీవునకు
కూడనూ
సుఖదుఃఖములు
కలవని
భావించుట
సమంజసము
కాదని
తేలుచున్నది.
భూమిలో
విత్తనము
నాటిన,
అది
పూర్ణవృక్షమై
వికాసము
నొందుటకు,
క్షీణించుటకు
భూమి
యొక్క
గుణము
యెటుల
ఆధారమో,
అలాగునే
దేహమను
భూమిలోనే
జీవత్వమను
బీజము,
బ్రహ్మత్వము
నొందవలసియుండును.
వృక్షము
అభివృద్ధి
గాంచుటకు
ఎరువు,
నీరు
మొదలగు
పోషణలు
ఎట్లు
అవసరమో,
అటులనే,
సత్యము,
శాంతము,
శమదమాదులు
ఆత్మాభివృద్ధికి
సాధనములు.
21
▾
Meaning
Keep
ప్రకృతి
అనేక
విధములైన
రూపములు
దాల్చుటకు
దాని
యందుందు
గుణభేదములే
కారణములు.
ఒక్క
విషయమును
యోచించుడు;
స్పష్టము
కాగలదు.
ఏమన,
మానవుడు
ఒకపరి
సంతోషముగ,
ఒకపరి
దుఃఖముగ,
మరొకపరి
భయముగ,
వేరొకపరి
ధైర్యముగ
వివిధ
వృత్తులు
కలిగి
ప్రవర్తించుచున్నాడు.
దీనికి
గుణముల
యొక్క
మార్పే
కదా?
కాదందురా?
మరేమి?
గుణములు
కాక
మరేమియూ
మానవుని
మార్పలేవు.
మానవునియందలి
త్రిగుణములైన
సత్వరజస్తమో
గుణములు
సమస్థితిలో
ఉండిన
మానవుని
యందు
ఎట్టి
మార్పునూ
రాదు,
లేదు,
కలుగదు.
అట్లుగాక
మూడు
గుణములూ
చెదరి
హెచ్చు
తగ్గులగుచుండిన
ప్రకృతి
తన
ఏక
రూపమును
వదలి
పలు
విధములగు
రూపముల
కన్పించుచుండును.
మూడు
గుణములును,
వేరు
వేరు
మూడు
స్వభావములు
కలిగియున్నవి.
రజోగుణము
‘ఆశ’ను
కలుగజేయు
పాశము,
దృశ్య
విషయములందు
‘అనురాగము’
కలుగజేయునది.
దీనికి
ఐహిక
ఆముష్మిక
సుఖములయందు
ఆసక్తి.
22
▾
Meaning
Keep
తమో
గుణమునకు
నిజ
జ్ఞానము
తెలియక
పోవుటచే
ఒక
వస్తువును
మరొక
వస్తువుగా
తలంచుట,
జ్ఞానరహితమై
అజాగ్రత్తగ
బద్ధకముచే
బంధించుట,
ఇత్యాది
గుణములు
కలది.
సత్వగుణము
దుఃఖ
శోకాది
కారణముల
అణచి
సుఖసాధనములైన
విషయముల
యందు
ప్రవర్తించుట.
పై
మూడింటి
ఏకత్వమే
నిర్మలత్వమును
ప్రసాదించును.
ఎటులన
ఒక
దీపము
నిర్మలమైన
ఒకే
రంగుగల
గాజు
ముక్కపై
పెట్టిన
దాని
తేజస్సు
స్వచ్ఛముగా
తేజస్సుతో
కనుపించును.
అట్లుకాక
కొన్ని
రంగు
రంగుల
గాజు
ముక్కలపై
పెట్టిన
అది
అనేక
రంగులుగా
తేజోహీనమై
కనిపించును.
మరియు
ఒక
మట్టి
కుండలో
పెట్టిన
మరింత
అంధకారమై
వెలుగును.
దీపము
ఒక్కటే
అయిననూ
దానికి
ఆధారమైన
ఉపాధులతో
తన
కాంతి
యెటుల
మార్పుజెందునో
అటులనే,
సత్వగుణము
స్వచ్ఛమైన
గాజుపెంకుపై
పెట్టిన
దీపము
వంటిదనియు,
రజోగుణము
అనేక
రంగులతో
ఉండిన
గాజుముక్కలపై
పెట్టిన
దీపమువలే
ప్రకాశరహితమై
అనేక
రంగులతో
కనుపించు
దీపమనియు,
తమోగుణము
మట్టికుండలోని
దీపమువలే
అంధకారముతో
ఉండునదనియూ
తలంచి,
సత్వగుణము
‘ఆత్మ
జ్ఞాన’మనియూ,
రజోగుణము
సత్వగుణము
వలే
తేజోరూపము
కాక,
మాలిన్య
భావములను
పొగతో
కూడిన
దీపమనియూ,
అంతియే
కాక,
నిలకడ
లేక
ఆడుచుండుననియు,
తమోగుణము
అంధకారమయమైన
మసితో
కూడిన
దీపమనియు,
అనగా,
మొదటిది
తేజము,
రెండవది
ధూమయుతమగు
చలించునదనియు,
మూడవది
మసితో
చేరినదియు
అని
తలంచవచ్చును.
Previous
←
The Way to Win God's Grace through Saguṇa and Nirguṇa Upāsana
Next
The Twenty Qualities Beginning with Amānitva
→