Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Twenty Qualities Beginning with Amānitva
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
“సత్వరజస్తమో
గుణములనబడు
మూడు
గుణములు
అనేక
పరిణామములు
కలిగి
ప్రకృతి
యందు
వ్యక్తమగుచుండుటచే
ప్రకృతికిట్టి
మార్పులు
కలుగుచున్నవి.
‘ఆత్మ’
తేజోరూపమైన,
చైతన్యము;
దానికెట్టి
గుణవికారములూ
లేవు;
దానికెట్టి
కళంకమూ
రాదు.
బుద్ధి,
మనస్సు,
శరీరము
మొదలగువన్నియు
ప్రకృతి
రూపములగుటచే
తమ
యందలిగల
గుణాధిక్యమును
బట్టి
వానిలో
లోపములుండును.”
2
▾
Meaning
Keep
“‘సత్వగుణము’
నిశ్చల,
నిర్మల,
నిస్వార్థ
తేజస్సు
కాన
ఈ
గుణము
కలవారికి
ఎట్టి
కోరికయు
లేక
యుండును.
కోరికలు
లేనివాడే
ఆత్మ
జ్ఞానమునకు
అర్హుడగును.
‘రజోగుణము’
కలవాని
కర్మలయందు
కొంత
కళంకము
కలిగి
పరోపకార
బుద్ధియుండియు
అందులో
ఫలమును
కీర్తిని
కోరి
పరోపకారముతో
పాటు
స్వార్థమును
సైతము
అపేక్షించును;
‘తమోగుణము’
కలవాని
జ్ఞానము
అంధకారమగుటచే
ఏది
చేయతగినది
ఏది
చేయతగనిది
అని
తెలుసుకొనలేడు.
ఈ
మూడు
గుణములుండు
వరుకును
నిర్వికారుడై
గుణాతీతమైన
మోక్షమును
పొందలేడు.
పురుషుడు
ప్రకృతియందున్న
వాడు
కనుక
ఆ
కారణమున
ప్రకృతి
సంబంధమగు
గుణములనుభవించుచుండినటుల
కనుపించుచున్న
భ్రమను
తొలగించుకొనుటే
క్షేత్రవిచారణ
అని
తేలినది.
సాధకునకు
జ్ఞాన,
జ్ఞేయములు
ప్రధానమైన
అంశములు.
జ్ఞానికి
సుగుణములే
ప్రధానమనియు,
దైవసాక్షాత్కారమే
జ్ఞేయమనియు
గ్రహించవలెను.”
3
▾
Meaning
Keep
అర్జునుడు
అన్నియూ
సావధానముగా
విని
తరువాత
“స్వామీ!
జ్ఞానికి
ఏయే
గుణములు
ఉండవలెను?”
అని
అన్నాడు.
దానికి
పరమాత్మ
“పార్థా!
‘అమానిత్వాది
ఇరువది
గుణములు’
పూర్తిగా
ఉండవలెను.
అవి
యేవని
నీవు
అడుగవచ్చును.
చెప్పెదను,
విను.
అవి
పూర్తిగా
ఉండినంత
మాత్రమున
తన
పని
పూర్తి
అయినదని
తలంచకూడదు.
జ్ఞేయమగు
బ్రహ్మ
సాక్షాత్కారము
కలిగిన
మాత్రముననే
అమృతత్త్వము
కలుగును.
జ్ఞానగుణములు
పూర్తి
అయిననే
జ్ఞేయములో
ప్రవేశార్హత
కలుగును.
జ్ఞానగుణములలో
ఏ
ఒక్కటి
లేకపోయిననూ
జ్ఞేయములో
ప్రవేశింప
వీలుండదు.
అందువలననే
‘జ్ఞాని’
సుగుణములను
తెలుసుకొని,
తదుపరి
‘జ్ఞేయ’మనబడు
సాక్షాత్కారమును
అనుభవించ
ప్రయత్నించుటకు
వీలుండునని,
మొదట
జ్ఞానమును
తెలుపుచున్నాను”
అని
అనెను.
4
▾
Meaning
Keep
ఆహా!
ఎంత
చక్కని
మార్గము.
మొదలు
నీతినీ
నిష్ఠనూ
ఉపదేశించక
పూర్వమే
బ్రహ్మమునుపదేశించుట
తైలము,
వత్తి,
ప్రమిదయు
లేకనే
దీపమును
వెలిగించ
ప్రయత్నించినట్లుండును.
తైలాదులు
మూడును
సిద్ధము
చేసిన
తదుపరే
బ్రహ్మజ్ఞాన
జ్యోతి
వెలుగును.
ఇచట
సాధకులు
అతి
జాగ్రత్తగా
విచారించవలెను.
ఏమన
వత్తి,
నూనె,
ప్రమిద
సమాన
స్థితిలో
నుండవలెను.
అనగా
వత్తి,
ప్రమిద
చిన్నవై
నూనె
అధికమైననూ
జ్యోతి
వెలుగదు.
ప్రమిద
పెద్దదయి,
నూనె
అధికమై,
వత్తి
చిన్నదైననూ
జ్యోతి
వెలుగదు.
వత్తి,
ప్రమిద
పెద్దవయిననూ
నూనె
తక్కువుండిన
జ్యోతి
వెలుగదు.
ఒకదానికి
తగినట్లు
మరొకటి
ఉండినపుడే,
సమాన
ప్రమాణములు
కలిగినపుడే
స్వచ్ఛమైన
వెలుతురును
అనుభవించగలరు.
5
▾
Meaning
Keep
అటులనే
పై
మూడు
గుణములును
సమస్థితియందుండిననే
జ్ఞానజ్యోతిని
పొందగలరు.
దాని
ద్వారా
మోక్షానందమును
అనుభవించగలరు.
మోక్ష
ప్రాప్తికి
పై
మూడు
గుణములలో
ఏ
ఒక్కటి
ఉండినను
ప్రకృతి
జన్య
దేహములో
బంధించు
మూడు
గుణములు
మూడు
బంధనలే.
ఏ
బంధన
ఉండిననూ
స్వతంత్రుడు
కాలేడు.
పశువునకు
ముందు
కాళ్ళు
రెండును
ఒక
పగ్గముతో
కట్టి
వైచి
వెనుక
కాళ్ళను
మరొక
పగ్గముతో
కట్టివైచి,
కొమ్ములను
మెడను
మరొక
త్రాడుతో
కట్టివైచిన
ఆ
పశువు
ఎట్లు
స్వేచ్ఛగా
ఉండజాలదో
అటులనే
మానవునకు
సత్వరజస్తమో
గుణములు
మూడూ
బంధించు
త్రాళ్ళవంటివి.
సత్వగుణము
కూడనూ
త్రాడే;
ఒక
బంధనే;
సత్వము
బంగరు
త్రాడువంటిది;
రజస్సు
రాగిత్రాడు
వంటిది;
తమస్సు
ఇనుపత్రాడు
వంటిది.
త్రాళ్ళ
విలువ
హెచ్చు
తగ్గులుండునే
కానీ
బంధన
దృష్టిలో
మూడునూ
స్వేచ్ఛారహితమే.
6
▾
Meaning
Keep
అర్జునుడు
విషయములను
తెలుసుకొనగోరి,
భగవంతునితో,
“కృష్ణా!
‘అమానిత్వాది
ఇరువది’
గుణములు
పూర్తీ
కలిగియుండిననే
జ్ఞాని
కాగలడని
అంటిరి.
కానీ,
ఇట్టి
యిరువది
గుణములు
ఏవియో
వాటిని
ఒక్కొక్కటి
విపులముగా
తెలిపిన,
తెలిసికొని
ధన్యుడను
కాగలను”
అన్నాడు.
7
▾
Meaning
Keep
“అర్జునా!
నీ
శ్రద్ధకు
నా
కెంతయో
ఆనందము;
వినుము.
మొదటిది
‘అమానిత్వము’
అనునది,
అనగా
అభిమానము
లేకుండుట.
మానమున్నంత
వరకూ
జ్ఞానము
కలుగదు.
మానవుని
వృత్తులు
నీటివలె
ఉండవలెను;
అంటే
నీటిలో
ఏ
రంగు
చేర్చిన
నీరు
ఆ
రంగుగా
మారును,
ఆ
రంగుతో
నీరు
చేరిపోవును.
నీటికి
అభిమానము
శూన్యము.
మానవుని
ప్రవృత్తి
దీనికి
పూర్తీ
విరద్ధము.
ఏ
చిన్న
ఉపకారమో,
ఏ
కించిత్
దానధర్మమో
చేసిన
అది
పదిమందికి
తెలియవలెను.
అట్లా
తెలియుటకు
వీలు
లేకున్న
తనకు
తానైననూ
చెప్పుకొని
తిరుగును.
లేక
ఏ
పేపర్లలోనా
వేయించుకొనును.
ఇట్టి
అభిమానము
లేకుండుటే
అమానిత్వము.”
8
▾
Meaning
Keep
“ఇక
రెండవది;
‘అదంభిత్వం’,
డంబము
లేకుండుట.
ఇది
మానవునకు
గొప్ప
సుగుణం.
తాను
గొప్ప
కాకపోయిననూ
గొప్పగా
నటించుట,
ఏ
శక్తి
సామర్థ్యములు
లేకపోయినా
సర్వశక్తులు
ఉండినట్లు
ప్రవర్తించుట,
ఏ
అధికారములు
లేకపోయిననూ
సర్వాధికారిగా
చలాయించుట
–
ఇవే
డంబము
యొక్క
గుర్తులు.
ఇట్టివి
లేక,
ఉన్నవి
ఉన్నట్లు
సంచరించుట
అదంభిత్వం
అనబడును.”
9
▾
Meaning
Keep
పాఠకులు
ఈ
విషయమును
బాగా
కన్నులు
తెరచి
చూడవలెను.
నేటి
రోజులలో
లోకమంతయు
దంబముతోనే
నిండియున్నది.
ఏ
రంగమందు
చూచినను,
ఏ
వ్యక్తిని
చూచిననూ
దంబముతో
ప్రవర్తించుచున్నాడు.
రాజ్యపాలనంతయూ
దంబమను
మంత్రి
చేతులలో
ఇమిడ్చుకొన్నాడు.
ఏమి
తెలియని
వాడు
కూడనూ
అన్నియూ
తెలిసినటుల
నటించును.
ఇంటిలో
వాని
ముఖమున
కింత
గంజి
పోసే
నాయకుడు
లేకపోయినా
బయట
సర్వ
సేవకులూ
ఉండినటుల
చెప్పుకొనును.
ఎంత
అసమర్థుడైననూ,
సమాజములో
సర్వసమర్థునిగా
తలంచవలెనని
ఆశించును.
ఒకటేమిటి,
అన్నింటియందూ
దంబమే
మొదటి
పాదము.
ఇది
మానవుని
పూర్తి
నాశము
చేయును.
అంతటితో
పోక,
లోకమునకొక
చీడపురుగు
వలే
ప్రాకును.
దీనిని
అంతమొనర్చిన
లోకములో
పీడ
వదలును.
కాన
దంబమునకు
చోటిచ్చిన
ఉభయ
భ్రష్టులు
కాగలరు.
ఇది
సామాన్య
మానవునకే
సరియైనది
కాదు.
ఇక
సాధకులు
కాగోరువారు,
సాక్షాత్కారము
పొందగోరువారు,
దీనిని
స్మరించిననూ
సరే,
పతనము
కాగలరు.
10
▾
Meaning
Keep
“ఇక
మూడవదైన
‘అహింస’,
ఇది
కూడనూ
ప్రధాన
గుణము.
ఇతరులను
బాధించుట,
కష్టము
కలిగించుట,
చింతలకు
చిక్కించుట
ఇత్యాది
వృత్తులు
‘హింస’
అని
అందురు.
అట్టివి
లేకుండటనే
అహింస
అని
అందురు.
కానీ
కేవలము
దేహమున
మాత్రము
ఇతరులను
బాధించకుండినంత
మాత్రమున
అహింస
కాజాలదు.
మనోవాక్కాయ
కర్మలతో
బాధారహితమైన,
స్వార్థరహితమైన
వృత్తుల
నాచరించుట,
ఇది
నిజమైన
అహింస
అనబడును.”
11
▾
Meaning
Keep
“నాలుగవది
‘క్షమ’.
దీనినే
‘క్షాంతి’
అని
కూడనూ
అందురు.
‘సహనమ’ని
కూడనూ
అందురు.
అనగా
పరులు
తనకెట్టి
అపకారములు,
కీడులు,
ద్రోహములు
చేసియుండిననూ,
తనను
ద్వేషించుచుండిననూ,
వాటినన్నింటిని,
స్వప్న
దృశ్యములుగా
తలంచి,
ఎండమావులుగా
భావించి
మరచిపోవుట.
అయితే
ఆ
ఓర్పు,
చేతకాక,
శక్తిలేక,
విధిలేక
ఓర్చుకోవటము
కాదు.
హృదయ
పూర్వకమైన
శాంతితో
పాటు
బయట
క్షాంతి
కలసి
రావలెను”
అని
అన్నాడు.
నిజమే!
బయట
లోకుల
యొక్క
మెప్పులకై,
తను,
ధన,
జన
బలములు
లేకనో,
చాలకనో,
లేక
తానేమి
చేసినా
చెల్లదనో,
ఓర్పుతో
ఉండుట
క్షాంతి
కాజాలదు.
ఇదియునూ
అహింసవలే
ప్రధానమైనది.
12
▾
Meaning
Keep
“తదుపరి,
ఐదవదైన
‘బుజుత్వం’.
సామాన్యముగా
దీనిని
‘నిజాయితీ’
అని
కూడనూ
అందురు.
కల్లాకపటములు
లేక,
మాయామర్మములు
ఉంచక,
చేసే
పనికి,
చెప్పే
మాటకు
తలచే
తలంపుకూ
ఏక
రూపము
కావలెను.
ఇది
లౌకిక,
అలౌకిక
జీవితముల
రెండింటియందునూ
ప్రధానముగా
పాటించవలసివచ్చును.
ఇది
బహుశా
‘అదంభిత్వము’
యొక్క
మరొక
పాదముగా
తెలియచున్నది.”
13
▾
Meaning
Keep
“ఇక
ఆరవగుణం,
‘ఆచార్యోపాసన’.
లౌకిక
విధులకు
ఎట్లు
గురువు
అవసరమో,
వేదాంత
విద్యలకు
కూడనూ
ఇది
అవసరము.
గురుభక్తి
వలన
గురువునకు
కలిగిన
శిష్య
వాత్సల్యము
శిష్యుని
ఉత్తమ
స్థితికి
తేగలదు.
అయితే
గురిలేని
గురుత్వము
నష్ట
భ్రష్టమై
పోవును.
దూడను
చూచిన
ఆవు
చేపుకు
విడచినటుల
శిష్యుని
చూచి
గురువు
అనుగ్రహమును
అందించవలెను.
భగవంతుని
పొందగోరుటకు
మోక్ష
ప్రాప్తినొందుటకు
గురుబోధనలే
ఆధారములు”
అని
తెలిపెను.
14
▾
Meaning
Keep
“ఏడవది
‘శౌచము’.
అనగా
శుద్ధిచేయుట.
బాహ్యశౌచమే
కాక
అంతర్శౌచము
ప్రధానమైనది.
అదియే
అంతఃకరణ
శౌచము.
రాగద్వేషములు
కానీ
కామక్రోధములు
కానీ
లేక,
సాత్వికమైన
దైవీ
గుణములు
విరాజిల్లినపుడు
అట్టి
దానిని
అంతశ్శౌచము
అని
చెప్పవచ్చును.
దేహమును
జలము
వలననూ,
మనస్సును
సత్యము
వలననూ,
జీవాత్మను
విద్యాతపస్సుల
వలననూ,
బుద్ధిని
జ్ఞానమువలననూ
శుద్ధి
చేసుకొనవలయును.”
15
▾
Meaning
Keep
“ఎనిమిదవది
‘స్థైర్యము’,
చపలచిత్తము
లేకుండుట.
నిమిషమునకొక
భావము,
దినమునకొక
ఆట
కాక
ఏదైననూ
మంచిదని
విశ్వసించిన
తరువాత
ఎన్ని
ఇక్కట్లు
సంభవించినను
సాధకుడు
పట్టు
వదలక
శ్రద్ధతో
అనుష్ఠించవలెను.
దీనినే
‘దీక్ష’
అని
కూడనూ
అందురు.
దౌర్బల్యము
పనికిరానిదని
దీని
అంతరార్థము.”
16
▾
Meaning
Keep
“తొమ్మిదవది
‘ఇంద్రియనిగ్రహము’.
నీ
కొరకు
ఇంద్రియములున్నవి
కానీ
నీవు
ఇంద్రియముల
కొరకు
లేవని
తలంచవలెను.
వాటికి
దాసుడుకాక,
నీకు
అవి
దాసులగునట్లు
చేసుకొనవలెను”
అని
బోధించెను.
17
▾
Meaning
Keep
“తరువాత
పదవది
‘వైరాగ్యము’.
అనగా
శబ్దాది
విషయాలలో
అనురక్తి
ఉండరాదు.
ఇంద్రియములు
వాటికి
తగినవే
కోరును.
కానీ
సాధకునకు
తగినవి
అవి
కోరవు.
కాన
ఇంద్రియార్థములు
పురుషార్థములు
కావు.
ఆత్మకు
కావలసినవే
పురుషార్థములు.”
18
▾
Meaning
Keep
“ఇక
పదకొండవది
‘అనహంకారము’.
అహంకారము
ఎన్ని
అవగుణములున్నవో
వాటన్నింటికినీ
పుట్టినిల్లు
వంటిది.
అహంకారికి
మంచి,
పుణ్యము,
పాపము,
సత్యము,
దైవము
ఏవీలేవు,
ఉండవు.
ధర్మము
వానికి
ఏ
మాత్రమూ
తెలియదు.
న్యాయము
వానికి
సరిపడదు.
ఇట్టి
దుర్గుణములు
లేకుండుటే
అనహంకారము.
అహంకారము
మిత్రునివలే
ఉండు
శత్రువు
అని
తెలుసుకో.”
19
▾
Meaning
Keep
“‘జన్మ
మృత్యు
జరా
వ్యాధి
దుఃఖ
దోషానుదర్శనము’.
ఇది
తెలిసికొనుట
అన్నింటికంటెను
ప్రధానమైనది.
జన్మ
దుఃఖము,
మరణ
దుఃఖము,
వ్యాధి
దుఃఖము
చూచుచుండియూ
వాటి
సత్యమును
తెలిసికొనపోకుండుట
మహా
ఆశ్చర్యము.
దీని
పుట్టుపూర్వోత్తరములు
విచారించిన
‘ఏది
తప్పిననూ
మృత్యువు
తప్పదని’
తేలుచున్నది.
మానవులు
దేనిని
సుఖమని
తలంచుచున్నారో
అవి
సుఖ
వేషముతో
కనబడు
దుఃఖాలే.
నిజమును
తెలిసికొనిన
విషయ
దోషములను
మననము
చేసినపుడు
వైరాగ్యము
చేకూరి
జ్ఞానము
సిద్ధించును.
కనుక
అర్జునా!
ఈ
జన్మ
మృత్యు
జరా
వ్యాధి
దుఃఖ
దోషములనుండి
విముక్తుడవుకా”
అని
యెంతో
ప్రేమతో
బోధించినాడు.
20
▾
Meaning
Keep
“తదుపరి
‘ఆసక్తి’.
చూచినవన్నియూ
కావలయునను
ఆశయే
ఆసక్తి.
దీనికి
కారణము
మమకారము.
అన్నింటియందు
మానవులను
బంధించునది
మమకారమే.
ఏది
చూచినా
‘నాకు
కావలె’ననుట,
‘నాది,
నాది’
అని
దానిపై
వ్యామోహమును
అభివృద్ధి
పరచుట
జ్ఞానికి
ధర్మవిరోధము.
మమకారమే
మహాపాశము.
అంతా
భగవంతుని
సృష్టియందలి
పదార్థములుగా
భావించిన
జ్ఞాని
లక్షణములకు
గుర్తుగా
ఉండును.
‘అనాసక్తి’
అవసరము.
ఇది
పదమూడవది.
ప్రతి
వస్తువునందును
స్నేహము
మాత్రమే
ఉండవలెను
కానీ
మోహముండరాదు.
ఉన్నంతవరకు
ఉపయోగించుకో.
అంతే
కానీ
వాటి
కొరకే
నీ
జీవితము
అంకితము
చేయకూడదు.
ఇది
మోక్షాపేక్ష
గలవారలకు
పెద్ద
అడ్డు.
ఎన్ని
సంపాదించిననూ
కడకు
అన్నియూ
ఒకపరి
వదలిపోక
తప్పదు.
పూచిక
పుల్లకూడనూ
వెంట
తీసుకొని
పోలేరు.
ఈ
లక్ష్యమును
దృష్టియందుంచుకొన్న
సత్యమును
దర్శించగలరు.”
21
▾
Meaning
Keep
“పుట్టక
పూర్వము
ఈ
ప్రపంచ
సంబంధములు,
వస్తువాహనములు
మానవునకు
ఉండవు.
చచ్చిన
తరువాత
ఆ
వస్తువాహనములు,
బంధుబలగములు
అతనికుండవు.
మధ్యలో
ఆడు
కొంత
ఆటనే
ఈ
లోక
సంబంధము.
అందువలన
మూడు
రోజుల
ముచ్చటకై
మోహము
పనికిరాదు.
ఆసక్తి
వలన
అంతఃకరణము
మాలిన్యము
కాగలదు.
మాలిన్యమైన
అంతఃకరణము
కలవాడు
మోక్షమును
పొందజాలడు.
నిజముగా
జ్ఞాని
కాగోరువారు,
మోక్షాపేక్ష
సాక్షాత్కార
ప్రాప్తి
ఆశించు
సాధకులు,
ఆసక్తికి
అంటక
ఉండవలెను.
అది
మహా
జిద్దు
పదార్థము.
తదుపరి
శుభ్రము
చేసుకొనుట
కష్టము.”
22
▾
Meaning
Keep
“తదుపరి
‘సమత్వ
స్థితి’.
అనగా
మంచి
చెడ్డల
యందును,
సుఖదుఃఖముల
యందును,
శీతోష్ణముల
యందును
సమాన
భావము
ఉండవలెను.
ఇది
పదునైదవ
జ్ఞానగుణము.
పొంగుట,
క్రుంగుట
పనికిరాని
వృత్తి.
సుఖదుఃఖములు,
కష్టనష్టములు,
నిందాస్తుతులు
భగవత్ప్రసాదములవలే
భావించవలెను.
ముండ్లు
ఉన్నచోట
చెప్పులు
వేసుకొని
ముండ్లబారి
నుండి
తప్పించుకొన్నట్లు,
వర్షము
కురియు
సమయమున
గొడుగును
పట్టి
వానను
తప్పించుకొన్నట్లు,
దోమలు
ఉండు
స్థానమున
దోమతెర
కట్టుకొని
వాటి
బాధనుండి
దూరమగునట్లు,
వచ్చే
నష్టకష్టములకు,
నిందాస్తుతులకు,
ఇష్టాయిష్టములకూ
ఈశ్వర
అనుగ్రహమను
‘సమాధాన
చిత్తము’ను
ధరించిన
అవి
మానవులను
ఏమియూ
బాధించలేవు!
అందులకే
సమ
చిత్తత్వము
అవసరము.”
23
▾
Meaning
Keep
“ఇక
‘అన్య
భావన
లేని
భక్తి’
కలిగియుండుట.
సంకట
సమయమున
వెంకటరమణుని
తలంచి,
సుఖము
ప్రాప్తించగనే
శ్రీనివాసుని
చిత్తము
నుండి
తొలగించుట
వంటిది
కాదు.
లేక
నోరు
చెడినప్పుడు
రుచికొరకై
ఏవైన
పుల్లటి
ఊరగాయలు
నంజుకొనినటుల
అప్పటికప్పుడు
ఉపయోగపెట్టు
వ్యంజనము
వంటిది
కాదు.
ఏమి
వచ్చిననూ
సర్వకాల
సర్వావస్థలయందును
భగవంతునితో
విభక్తుడు
కానివాడుగా
ఉండవలెను.
అట్టి
‘అనన్య
యోగము’నే
అన్యభావన
లేని
‘అనన్యభక్తి’
అని
అందురు.
ఏ
పనిచేసినా,
ఏమాట
ఆడినా,
ఏపాట
పాడినా
భగవంతుని
అనురక్తిని
కలిగినదే
అనన్యభక్తి.”
24
▾
Meaning
Keep
“తదుపరి
‘ఏకాంతవాసము’.
దీనియందు
అభిరుచి
కలిగియుండవలెను.
అనగా
కేవలము
శరీరమును
మాత్రము
ఎవ్వరూ
జనసంచారములేని
స్థానమున
అడవులయందు
ఉంచినంత
మాత్రమున
అది
ఏకాంతవాసము
కానేరదు.
మనస్సును
నిర్విషయం
చేసుకొనుట
‘అభ్యంతర
ఏకాంతం’.
ఒక్క
భగవంతుని
తప్ప
అన్యచింతలకు
కానీ
అన్యవ్యక్తులతో
కానీ
చేరక,
ఒకవేళ
పెద్దలైన
సాధకుల
దగ్గర
చేరిననూ
నిర్విషయ
సంబంధమును
కలిగియుండుట.”
Previous
←
The Cessation of Sorrow and the Attainment of Ānanda
Next
The Kṣetra and the Kṣetrajña
→