Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Kṣetra and the Kṣetrajña
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
“ఇక
పదునెనిమిదవ
జ్ఞానగుణము
–
‘జనసంఘమున
ప్రీతి
లేకుండుట’.
అనగా,
విషయాసక్తి
కలవారితో
పొత్తు
చేరకుండుట.
క్రూరమైన
మృగముల
మధ్యనుండియైననూ
సులభముగా
స్థితిని
పొందవచ్చును
కానీ,
సామాన్యమైన
పామరుల
మధ్య
సంచరించుచు
సాధనను
కొనసాగించ
సాధ్యము
కాదు.
వీని
సాధన,
సంఘమును
పట్టి
సంబంధమేర్పడును.
మంచి
వారితో
చేరిన
మంచి
సంబంధము,
చెడ్డవారితో
చేరిన
చెడ్డ
అలవాట్లు
సంభవించును.”
2
▾
Meaning
Keep
“మొదలే,
మంచీ
చెడ్డ
నిర్ణయించుట
కష్టము
కనుక
సామాన్య
మానవులకు
దూరముండి
సాధన
సాగించుట
యెంతో
ఉత్తమము.
మానవుని
మనసు
ఇనుమునకు
పోల్చబడినది.
మనసను
ఇనుము,
మట్టితో
చేరిన
త్రుప్పు
పట్టి,
తుండ్లవుతుంది.
అగ్నితో
చేరిన
నిర్మలమవుతుంది.
అందువలననే
జ్ఞానుల
సంఘము
చేరిన,
సత్పురుషుల
సంఘము
చేరిన,
ఏకాంతమునకంటే
నెక్కుడు
ఫలమును
పొంద
వీలుండును.
దాసీ
పుత్రుడైన
నారదుడు
కూడనూ
సత్
సంఘముచే
దేవబుషి
అయ్యాడు.
కిరాతక
వృత్తిలో
సంచరించుచున్న
రత్నాకరుడు
సప్తబుషుల
సాంగత్యముచే
ఆదికవి
యైన
వాల్మీకిగా
మారినాడు.
దుస్సంగత్వము
అతి
ప్రమాదము.
అగ్నిని
ముట్టిననూ
అంత
కాల్చదుకానీ
అగ్నితో
కాగిన
ఇనుము
ముట్టిన
దారుణము.
అటులనే,
పాపముకంటే,
పాపాత్ముని
సంఘము
మరింత
పాపము
కాగలదు.
కాన
సాధకుడు
ఈ
విషయమున
అతి
జాగ్రతగా
మెలగవలసియుండును.”
3
▾
Meaning
Keep
“ఆత్మానాత్మ
‘వివేక
జ్ఞానము’
పందొమ్మిదవ
గుణము.
దీనియందు
నిరంతరాసక్తి
కలిగియుండవలెను.
‘నేనే’
నిత్యుడను
కనుక,
నన్ను
నిరంతరమూ
స్మరించుచూ
చిత్తము
పరమాత్మపై
పెట్టి,
దేహేంద్రియములు
ఏమి
చేసిననూ
అవి
(ఆ
కర్మలు)
ఆత్మాభిముఖమై
యుందును.
మానవ
జీవితమే
ఒక
పోరాటము.
కాన
చిత్తము
నాపై
పెట్టి
యుద్ధము
చేయుము”
అని
బోధించినాడు.
4
▾
Meaning
Keep
“ఇక
ఆఖరుదైన
‘తత్త్వ
జ్ఞాన
దర్శనము’.
ఇది
‘మోక్షాపేక్ష
దృష్టి’
తప్ప
మరేమీ
లేకుండుట.”
5
▾
Meaning
Keep
పై
చెప్పిన
యిరువదింటిలో
ప్రయత్నవూర్వకముగా
రెండు,
మూడు
సాధించిననూ
మిగిలినవి
అప్రయత్నముగా
సమకూరును.
అన్నింటికినీ
ప్రయత్నించ
సాధ్యము
కాదు;
అవసరములేదు.
అయితే,
అమానిత్వాది
జ్ఞాన
గుణములు
ఇవియే
యని
కూడనూ
తలంచ
వీలు
లేదు;
ఇంకనూ
ఎన్నియో
కలవు.
అయితే
మానవుడు
వీటిని
సాధించి
సాధనలు
సలిపిన
చాలును.
అన్నింటియందును
ప్రధానమైన
ఉపాంగములు
ఇవి.
వీటిని
ఆధారము
చేసుకొని
గమ్యమును
చేరవచ్చుననియే
కృష్ణుడు
ఈ
‘ఇరువది
జ్ఞాన
గుణములను’
బోధించినాడు.
6
▾
Meaning
Keep
వీటిని
కలిగినవాడు
సాక్షాత్కారమును
తప్పక
పొందగలడు.
సందేహము
లేదు.
ఇన్నింటి
విచారణ
మూలమున
మానవుడు
దేహము,
బుద్ధి,
ఇంద్రియములు,
అంతఃకరణము
ఇవి
అన్నియూ
ప్రకృతి
సంబంధములని
తెలుసుకొనును.
వీటన్నింటికీ
భిన్నముగా
నున్నవాడే
‘పురుషుడ’నియూ
తేలిపోవును.
పురుషుడనగా
క్షేత్రమును
తెలుసుకొనువాడే
కానీ
క్షేత్రము
కాదని
బుజువగుచున్నది.
ఎప్పుడు
ఈ
ప్రకృతి,
పురుషుల
విషయములు
విజ్ఞాన
విచారణచే
తేలినవో
అప్పుడు
వాంఛా
రహితుడైన
‘సాక్షి
స్వరూపుడు’
తానేనని
కూడను
తెలియును.
7
▾
Meaning
Keep
అన్నింటికీ
సాక్షిభూతుడు
తానేనని
తెలుసుకొనుటయే
ఆత్మ
సాక్షాత్కారము.
తన
సత్యమును
తానే
అని
తెలుసుకొనుట,
తనను
తాను
తెలిసికొనుట,
అంతా
ఒక్కటే
ఆత్మయని
నిరూపించుట,
జీవుడు
వేరు,
దేవుడు
వేరు
కాదని
అనుభవముతో
తెలిసికొనుట,
వీటన్నింటినీ
‘సాక్షాత్కార’మనియే
పిలుతురు.
ప్రతిమానవుడును
సాధించవలసినదియును,
తెలుసుకొనవలసినదియును
ఇదియే.
కేవలము
పుట్టి,
పెరిగి,
చచ్చునంత
మాత్రమున
అట్టివాడు
మానవుడు
కానేరడు.
పశుపక్షి
మృగాదులవలె
కాక,
మానవుడు
తెలియని
సత్యాన్ని
తెలిసికొనుటే
వానికి
గల
దివ్య
శక్తి.
అట్టి
అనుగ్రహ
శక్తిని
వృథా
చేయరాదు.
8
▾
Meaning
Keep
“స్వామీ!
క్షేత్ర
విషయము,
క్షేత్రజ్ఞుని
విషయము
కొంతవరకూ
అర్థమయినది.
అనగా
ప్రకృతి–పురషుల
తత్త్వమేమిటో
తెలిపితిరి.
కానీ,
దీనియందు
‘జ్ఞేయ’మని
కూడా
ఏదో
ఒక
పేరు
పెట్టితిరి!
దాని
అర్థమేమో
అదియును
తెలిపిన
ధన్యుడను”
అని
అర్జునుడు
కోరినాడు.
అందులకు
పరమాత్మ,
“అర్జునా!
క్షేత్రజ్ఞుడన్ననూ,
జ్ఞేయమన్ననూ
ఒక్కటియే
అని
దీనికి
పూర్వమే
చెప్పితిని
కదా!
అయినా,
ఇంకనూ
విపులముగా
తెలియునట్లు
చెప్పెదను;
వినుము.
పరమాత్ముడు,
అనగా,
ఆత్మ
స్వరూపుని
తెలిసికొనుటకు
జ్ఞానమే
ప్రధానము.
జ్ఞానముతో
తప్ప
మరే
మార్గముననూ
ఆత్మను
తెలిసికొన
వీలుకాదు.
కర్మోపాసనలు
ఉత్పత్తి
స్థానములు.
ఆత్మ
నిత్యం,
కాబట్టి
దానికి
ఉత్పత్తిలేదు.
కూటస్థుడైన
ఆత్మకు
వికారములు
రావు.
కాన,
అట్టి
జ్ఞానముతో
తెలిసికోదగినవాడు
కనుకనే
జ్ఞేయమని
పేరు
వచ్చినది.”
9
▾
Meaning
Keep
“అట్టి
జ్ఞానముచే
ఆత్మయే
‘నేను’
అని
తెలిసికొనును.
అజ్ఞానముచే
దేహమే
‘నేను’
అని
తలంచును.
జ్ఞానాజ్ఞానములకు
ఇదియే
వ్యత్యాసము.
అయితే,
‘ధ్యేయ
వస్తువ’ని
కూడనూ
దీనికి
మరొక
పేరు
కలదు.
దీనిని
ధ్యానముతో
పొందునది,
కనుక
ధ్యేయమని
పేరు
వచ్చినది.
ముక్తి
కర్మఫలము
కాదనియు,
ముక్తి
జ్ఞాన
ఫలమనియు
ఇందుమూలమున
దృఢమగుచున్నది.”
10
▾
Meaning
Keep
“‘జ్ఞానాదేవతు
కైవల్యం’
ఆత్మ
తత్త్వజ్ఞానం,
సమ్యగ్దర్శనం
లభించినదా,
మోక్షము
నీలోనే
ఉండును!
ప్రకృతి
అనాది
అయినను
అనంతం
కాదనియు,
పురుషుడైన
క్షేత్రజ్ఞుడు
అనాది,
అనంతుడనియు,
అతనే
పరబ్రహ్మమనియూ”
నొక్కి
వక్కాణించెను.
11
▾
Meaning
Keep
“ప్రకృతిలోనున్న
గుణధర్మాలను
ఆత్మయందారోపించుట
కూడను
కద్దు.
ఆత్మ
స్వయముగా
ఈ
గుణ
ధర్మములకు
విలక్షణం.
గుణములకు
ఒక
ప్రకృతి
రాజ్యమునందు
మాత్రమే
స్వాతంత్ర్యము,
దాని
తరువాత
వాటికి
అధికారము
లేదు;
ఆత్మ
స్థానమును
చేరలేవు.
అయస్కాంత
సాన్నిధ్యముచే
సూదులు
కదులును,
కానీ
కర్తృత్వము
అయస్కాంతమునకు
లేదు.
12
▾
Meaning
Keep
అటులనే,
ఆత్మ
చైతన్య
సన్నిధానమునే
ఆయా
ఇంద్రియములు
తమ
తమ
పనులు
తాము
చేయును.
సూర్యోదయము
కాగానే
పక్షులు
లేచిపోవును,
పుష్పములు
విచ్చును,
కలువలు
ముకుళించును.
మానవులు
వారి
వారి
పనుల
కొలదీ
వారు
వెళ్ళుదురు.
బురద,
అందులోని
నీటిని
వీడి
గట్టిపడును.
అన్నింటికీ
ఆ
సూర్యుడు
కర్త
కాదు
కదా?
అధ్యక్షుడు
మాత్రమే.
నిజానికి
ఆత్మ
అతీతమైనదే
కానీ
ఇంద్రియ
ధర్మాలకేమాత్రము
తాను
కట్టుపడదు”
అన్నాడు
కృష్ణుడు.
13
▾
Meaning
Keep
పక్షులు
చూడు!
ఆకసమున
యెన్ని
విధములుగానో
పారాడుచుండును,
యెగురుచుండును,
ఆకాశమున
యే
జాడయూ
పడుట
లేదు;
అటులనే
హృదయాకాశమున
ఇంద్రియములను
పక్షులు
ఎంత
తిరుగాడిననూ
దానిలో
జాడలు
పడవు;
వాటి
సంచారమునకు
హృదయమునకూ
యేలాటి
సంబంధముండదు.
అన్నింటికినీ
ఆధారమైనదే
ఆత్మకానీ,
ఆధేయమైనది
కాదు.
14
▾
Meaning
Keep
అయితే
మానవులు
ఆధేయమే
చూతురు;
ఆధారమును
యోచించరు,
విచారించరు.
ఎటులన,
పూలమాలయందు
అన్ని
పుష్పములకూ
దారమాధారమై
యున్నది;
అది
లేక
పుష్పములు
హారములుగా
కానేరవు.
కానీ
పుష్పములనే
ప్రధానముగా
చూతురు.
కనుపించునది
కూడనూ
పుష్పములు.
ఆధారమైన
దారము
విచారణతో
తప్ప
సహజముగా
అది
కనుపించదు.
దీనితో
పోల్చిన,
ఆధారములో
ఆధేయములైన
పుష్పములున్నవి
కానీ,
ఆధారమైన
దారము
ఆధేయమైన
పుష్పములలో
లేదు.
15
▾
Meaning
Keep
మచ్చునకు
మరొక
విషయము
చూడుడు!
మట్టితో
చేయబడిన
అనేక
కుండలు,
మూకుళ్ళు,
గిన్నెలు,
దుత్తలు
ఇత్యాది
వస్తువులు
యుండును.
వీటియందు
ఆధార
ఆధేయములు
స్పష్టముగా
గోచరమగుచున్నవి.
“మట్టిలో
కుండలున్నవా?
కుండలో
మట్టి
ఉన్నదా?”
అని
విచారణ
జరిపిన,
మట్టిలో
మట్టే
ఉన్నది
కానీ
కుండలు
లేవు.
అయితే,
అన్ని
కుండలయందూ
మట్టి
లేకపోలేదు.
అటులనే
ఆత్మలో
గుణములు
లేవు
కానీ
గుణములయందు
కూడనూ
ఆత్మ
మాత్రము
ఉన్నది.
దీని
ద్వారా
ఆత్మ,
సత్య
వస్తువనియు,
గుణములు
మిథ్యా
భూతములనియూ
తేలుచున్నది
కదా!
ఈ
ఆధారమును
పురస్కరించుకొనిన
క్షేత్రజ్ఞ
పరమాత్మ
సమస్త
భూతములయందునూ
ఆత్మ
స్వరూపమున
ఉన్నాడనునది
విశదమగుచున్నది.
అదియే
నిజము.
16
▾
Meaning
Keep
తదుపరి
అర్జునుడు,
“కృష్ణా!
అట్టి
ఆధారమైన,
సర్వభూతాంతరాత్మ
అయిన,
పరమాత్మను
తెలుసుకొన
చాలా
కష్టమైనదైయున్నది.
సర్వవ్యాపి
అయినా,
కంటికి
కనిపించుటలేదు;
సర్వభూతాంతరాత్మ
అయినా,
స్పర్శకు
గోచరమగుటలేదు!
దీనికి
కారణమేమి?”
అని
ప్రశ్నించినాడు.
17
▾
Meaning
Keep
“అర్జునా!
నీకింకనూ
అర్థమగుటలేదు.
ఆత్మ
అతి
సూక్ష్మమైనది;
దానిని
తెలుసుకొనుట
చాలా
కష్టము.
పంచభూతములగు
భూమి,
జలము,
అగ్ని,
వాయు,
ఆకాశము,
ఇవి
నీకు
తెలియును
కదా!
ఇవి
మొదటి
నుండియూ
విచారించిన
ఒక
దాని
కంటే
మరొకటి
తేలిక
అగుచున్నది.
అనగా,
భూమికంటే
జలము,
జలముకంటే
అగ్ని,
అగ్నికంటే
వాయువు,
వాయువుకంటే
ఆకాశము
తేలిక
అగుటయే
కాక
విశాలముగుచున్నవి
కూడను.
అనగా
భూమియందున్న
గుణములు
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధములనబడు
ఐదు
గుణములు;
రెండవదనబడు
జలమందు
గంధము
తగ్గిపోయినది;
అగ్నియందు
గంధము,
రసము
తగ్గిపోయినవి;
వాయువునందు
రూప
రస
గంధములు
తగ్గిపోయినవి.
అందువలన
భూమికంటెను,
జలముకంటెను,
అగ్నికంటెను
మరింత
తేలికై
వ్యాపకమై
సంచరించుచున్నది.
ఇక
ఐదవదైన
ఆకాశమున
స్పర్శ,
రూప,
రస,
గంధములు
లేక
కేవలము
ఒక
శబ్దము
మాత్రమే
కలిగియున్నది.
ఒక్క
గుణముగల
ఆకాశమే
అంత
సూక్ష్మమయినపుడు,
నిర్గుణమైన
ఆత్మ
మరెంత
సూక్ష్మమో
యోచించుకొనలేక
పోవుచున్నావు!
అంత
సూక్ష్మమగుటే
బహిర్ముఖమున
తెలిసికొనలేకపోవుచున్నావు.
అది
అంతర్ముఖులకు
మాత్రమే
అతి
సమీపమున
నుండును”
అని
అన్నాడు
కృష్ణుడు.
18
▾
Meaning
Keep
బుద్ధికల
వారికిది
యొక
సిద్ధి;
కాకున్న
“భగవంతుడు
సర్వవ్యాపి
అని
అందురు
కదా?
ఎవరికీ
కనిపించుటలేదే!”
అని
మొరిగే
కుక్కలకు
ఇది
గుండ్రాయి
దెబ్బ.
గుణాతీతుడు
పరమాత్ముడని
విశ్వసించిన
ఈ
పిచ్చి
గుణములకు
అతీతుడని
యెందుకు
యోచించలేరో?
పాపము!
“యద్భావం
తద్భవతి”
అన్నట్లు
ఎవరు
భగవంతునకు
ఎంత
దగ్గరో
వారలకు
భగవంతుడునూ
అంత
సమీపుడు.
ఎవరు
భగవంతునకు
ఎంత
దూరమో,
భగవంతుడునూ
వారలకంత
దూరముగనే
యుండును.
ఇది
భావ
రూప
దర్శనము.
19
▾
Meaning
Keep
ఇందుకు
అతి
సులభమైన
ఆదర్శములు
పురాణములందు
కొన్ని
కలవు.
హిరణ్యకశిపుడు
నారాయణుని
వెతికి
వెతికి
యెక్కడా
లేదని
తెలుసుకొనెను.
ప్రహ్లాదుడు
“ఇందుగలడందులేదని
సందేహము
వలదు;
ఎందెందు
వెతికి
చూచిన
అందందే
కలడు”
అని
అన్నాడు.
అతనికి
ఎక్కడ
చూచిననూ
కనిపించెను.
కడకు
రంధ్రము
పెట్టుటకైననూ,
గాలి
చేరుటకైననూ
సాధ్యము
కానట్టి
ఇనుప
స్తంభమున
కూడనూ
దర్శనమొసంగెను!
దీనికి
కారణమేమి?
ప్రహ్లాదుని
అంతర్ముఖ
బుద్ధి
భగవంతునకు
సమీపమగుటయే.
ఆవు
పొదుగునందు
పవిత్రమైన
బలిష్టమైన
క్షీరముండియూ
తమ
పాలు
తాము
త్రాగక
కంపుకొట్టు
కుడితి
నీరు
వైపు
పరుగిడునటుల
మానవునియందే
మాధవుడు
ఆత్మస్వరూపుడై
యుండ,
అతనిని
తెలుసుకొను
ప్రయత్నమును
మాని
తుచ్ఛమైన
విషయవాసనలతో
చేరిన
ప్రకృతి
సుఖములకై
ప్రాకులాడుట,
అజ్ఞానముకాక
మరేమి?
నానాత్వం
గోచరించునదే
అజ్ఞానము;
ఏకత్వం
గోచరించునదే
జ్ఞానము.
నానా
విభేదాలు
శవదృష్టి;
ఏక
దృష్టియే
శివదృష్టి.
‘తత్’
అనినను,
‘జ్ఞేయ’మనినను,
‘ఆత్మ’
అనినను,
‘క్షేత్రజ్ఞుడ’నినను,
‘పరబ్రహ్మ’మనినను
ఒకటేనని
పరమాత్ముడు
అనుభవ
రూపమున
అర్జునునకు
బోధించినాడు.
20
▾
Meaning
Keep
పాఠకులారా!
నదులకు
సముద్రములాగ,
జీవులకు
గమ్యస్థానము
బ్రహ్మ
ప్రాప్తి!
చైతన్య
స్వరూపులైన
జీవులకు
జడస్వరూపులైన
వస్తువులతో
శాశ్వత
సుఖము
ఏనాడును
ఉండదు;
లేదు.
‘బ్రహ్మ
ప్రాప్తి’
అనినను,
‘నిత్యసుఖమ’నినను,
‘మోక్షమ’నినను
ఒక్కటే.
ఇవి
అన్నియు
పర్యాయ
పదములు.
21
▾
Meaning
Keep
నానా
రూప
ప్రపంచముపై
వైరాగ్యము
కల్గిన
వారికే
అనన్యభక్తి
కుదురును.
అదే
ఆత్మజ్ఞానము
నందించును.
సంసారాసక్తమైన
చిత్తమునకు
వైరాగ్యము
నేర్పు
నిమిత్తమై
ప్రపంచమును
ఒక
అశ్వత్థముగా
చెప్పడమైనది.
దీనిని
తెలుసుకొన్న
వాడే
నిజమైన
వేదాంతి
అని
కూడనూ
చెప్పవచ్చును.
లోకమున
సామాన్యముగ
ఊర్ధ్వమన్న
పై
భాగమని
తలంతురు.
కానీ
ఈ
భగవత్
వాక్యమైన
బ్రహ్మాండ
వృక్షమునకు
బ్రహ్మమే
ఊర్ధ్వము.
మాయోపాధిక
బ్రహ్మము
ఈ
జగత్తునకు
మూలమైనది;
సమస్తమునకు
బ్రహ్మమే
అధిష్ఠానము.
దీనిని
గురించే
తదుపరి,
పరమాత్మ
అర్జునునకు
తెలుపుచున్నాడు.
22
▾
Meaning
Keep
“అర్జునా!
సంసార
వృక్షము
చాలా
విచిత్రమైన
అశ్వత్థము.
ప్రపంచమున
చూచు
వృక్షమునకును,
ఈ
విచిత్రమైన
సంసార
వృక్షమునకు
చాలా
వ్యత్యాసము.
ప్రపంచమున
చూచు
వృక్షములకు
కొమ్మలు
పై
భాగమునందును,
వేర్లు
లోభాగమైన
భూమియందును
ఉండును.
అయితే,
సంసార
అశ్వత్థము
అట్లుకాక
పూర్ణ
విరుద్ధమైనదై,
వేర్లు
పై
భాగమునందును,
కొమ్మలు
క్రింది
భాగమునందునూ
కనుపించు
చుండును!
అనగా,
తలక్రిందలు
వృక్షముగా
నుండును.
దీనికి
అశ్వత్థమని
పేరు”
అని
అన్నాడు.
23
▾
Meaning
Keep
అందులకు
అర్జునుడు
“దీనికీ
పేరెట్లు
వచ్చినది?
ఆ
పేరు
వచ్చుటకు
ఆధారమేమి,
స్వామీ?
మరే
పేరైననూ
పెట్టవచ్చును
కదా?”
అని
అన్నాడు.
అందుకు
కృష్ణుడు
“అర్జునా!
విచిత్రమైన
వృక్షమునకు
పేరే
విచిత్రము;
అదే
ఈ
చిత్రము.
విను!
అశ్వత్థమనగా
అనిత్యము,
క్షణికము,
అని
అర్థము.
లోకమున
దీనినే
రావిచెట్టు
అందురు.
దీనిలోని
ఫలపుష్పాలు
తినుటకుగానీ,
వాసన
చూచుటకు
గానీ
పనికి
వచ్చునవి
కావు.
అంతియేకాక
ఎల్లప్పుడూ
దాని
ఆకులు
ఆడుచునే
ఉండును.
వృక్షము
విశాలమై
యుండును.
దీనికి
మరొక
పేరు
కూడనూ
కలదు.
‘చలదళ’మని
కూడనూ
పేరు;
చలించు
దళములు
కలదని
అర్థము.
ప్రపంచ
వస్తువులు
కూడనూ
నిరంతరమూ
చలన
శీలాలు.
ప్రపంచము
యొక్క
అనిత్యత్వాన్ని,
నిష్ఫలత్వాన్ని
నిరూపించుట
కోసం,
దీనికి
అశ్వత్థమనే
పేరు
వచ్చినది.
ప్రపంచముపై
వైరాగ్యమును
నేర్పి,
ఊర్ధ్వదృష్టి
కలిగించి
బ్రహ్మనిష్ఠను
నెలకొల్పుటే
ఈ
ప్రపంచము
యొక్క
ప్రయోజనము”
అని
వివరించెను.
24
▾
Meaning
Keep
ఇట్టి
ప్రపంచమున
గల
ఒక
వస్తువు
యొక్క
సమగ్ర
స్వరూపాన్ని
తెలిసికోవాలంటే
బహిరంగ
నిరీక్షణ,
అంతరంగ
నిరీక్షణ
రెండునూ
అవసరము.
మొదటిది
జీవ
ప్రపంచము.
రెండవది
ఈశ్వర
ప్రపంచము.
జీవ
ప్రపంచము
బంధకారణము.
ఈశ్వర
ప్రపంచము
బంధరహిత
కారణము.
ప్రపంచమును
ప్రపంచముగా
తెలుసుకొన్నవాడు
వేదవేత్త
కాజాలడు;
ప్రపంచమును
పరమాత్మ
స్వరూపముగా
తలంచినవాడే
నిజమైన
వేదవేత్త.
కార్యమైన
ప్రపంచము
కారణమునకంటే
భిన్నము
కాదని,
బ్రహ్మము
మూలమని
నానా
జీవకోట్లు
కొమ్మలని,
ఇవి
కర్మల
ద్వారా
వర్ధిలుచున్నవని
తెలుసుకొనినవాడు
వేదవేత్త
కాగలడు.
Previous
←
The Twenty Qualities Beginning with Amānitva
Next
Divine Wealth and Demonic Wealth
→