Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · Divine Wealth and Demonic Wealth
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
“కృష్ణా!
గోచరమగు
ప్రపంచమును
ప్రపంచముగా
తలంచక,
పరమాత్మగా
ఎవరు
తలంతురో,
తెలిసికొందురో
అట్టివారే
‘వేదవేత్తలు’
అని
శెలవిచ్చితిరి.
కార్యమైన
ప్రపంచము
కారణమునకంటే
భిన్నము
కాదనియు
మీరే
తెలిపితిరి.
ఇది
యెట్లు
సాధ్యమగును?
కనుపించు
ప్రపంచము
వృద్ధి
క్షయముల
పొందియుండును.
పరమాత్మ
నిత్య,
సత్య
నిర్మలమై
అచంచలముగా
నుండును.
నిప్పూ,
నీరుకు
పొత్తు
కుదురునా?
రెండింటి
యొక్క
యేకత్వము
దేనిని
పట్టి
యుండునో,
సెలవిమ్ము.
విని
ఆనందింతును”
అని
అర్జునుడు
తన
సందేహము
వెలిబుచ్చెను.
2
▾
Meaning
Keep
“బావా!
కనుపించు
ప్రపంచమునందలి
ప్రతిదియూ
‘స్వభావ’మని
తెలుపుదురు.
స్వభావమనగ,
అది
ఒక
‘గుణము’.
గుణిని
అనుసరించియే
గుణము
ఉండును.
ప్రపంచమునందలి
ప్రతివ్యక్తికినీ,
ప్రాణికినీ
గల
స్వభావములకు
ఆధారము
ఒకటి
ఉండియే
యున్నది.
దానినే
‘ఆత్మ’
అని
అందురు.
అట్టి
ఆధారమైన
ఆత్మను
విచారించక
కేవలము
ఆధేయమైన
ప్రపంచమును
పరిశీలించిన
ఫలితము
అనిత్యమే
చిక్కును.
వృక్షమునందలి
కొమ్మలు,
రెమ్మలు,
ఆకులు,
పుష్పములు,
కాయలు,
ఫలములూ
వీటన్నింటికీ
విత్తనమెట్లు
ఆధారమని
తలంతురో
అటులనే
ప్రకృతి,
ప్రపంచమను
వృక్షమునందలి
సర్వాంగములైన
పంచభూత
సమ్మిళిత
పదార్ధములు,
ఆత్మయను
విత్తనము
పై
ఆధారపడి
యున్నవి.
సర్వ
స్వభావాధారమైన
ఆత్మను
ప్రధానముగా
తీసుకొన్న,
కనబడు
సర్వ
ప్రపంచము
కనపడని
పరమాత్మలోనే
చేరియున్నది.
ఇట్టి
సత్యమును
తీవ్రమైన
సాధన,
విచారములతో
తెలిసికొనిన
వారే
వేదవేత్తలు
కాగలరు.
విచారణ
సలుపక,
వివేకముతో
యోచించక
కనుపించునదే
ఖాయమని
భావించుచూ,
వాదించుచూ
వక్రమ
మార్గమును
బట్టు
వారలకు
సక్రమ
సంగతి
యెట్లు
తెలియును?
ఇట్టి
సత్యమును
తెలుసుకొనగోరు
భావములనే
‘దైవసంపత్తి’
అనియు,
తెలియకపోయిననూ
తెలిసినటుల
వాదించుచు
తెలిసికొనుటకు
ప్రయత్నించక,
అసత్యమునే
సత్యమని
స్థిరము
చేయు
స్థితి
గల
వారి
భావములను
‘అసుర
సంపత్తి’
అనియూ
రెండు
అంశములు
కలవు”
అని
పరమాత్ముడు
తెలిపిన
తక్షణమే
సావధానముగ
వినుచున్న
అర్జునుడు
ఆశ్చర్యముగా
తలయెత్తి
“గోపాలా!
ఇంతవరకు
సర్వ
స్వభావములకు,
సర్వజీవులకు
ఆత్మనే
ఆధారమని
నుడివితిరి.
(అనగా
‘నేనే’
ఆధారమని
తెలిపితిరి)
ఇంతలోనే
దైవ
సంపత్తి,
అసుర
సంపత్తి
అని
రెండు
అంశములు
కలవని
తెలుపుచున్నారు.
నాకేమియూ
అర్థమగుటలేదు.
ఏది
నమ్మవలెనో,
ఏది
విడువవలెనో
తోచుట
లేదు.
తమరు
అర్థములేని
పనికాని,
సత్యముకాని
మాటకానీ,
చెయ్యరు,
అనరని
నాకు
సంపూర్ణ
విశ్వాసము.
కాన
ఇందులో
ఏదియో
గూడార్థము
చేరియేయుండును.
లేకున్న
తమరట్లు
చెప్పెడి
వారు
కారు.
మానవ
మనసు
మమకారమను
మాలిన్యముచే
కప్పబడి
యుండుటచే,
మాధవ
మాటలు
అర్థము
చేసుకొనుట
మహా
కష్టము.
వ్యర్థపు
సంశయములతో
జీవితములు
నిరర్థకము
చేసికొందుము.
దయచేసి,
అర్థమగునటుల
అట్టి
దైవాసురులు
ఎవరో,
ఏ
స్థితిలో
ప్రవేశింతురో,
వారి
స్వభావములెట్టివో
శెలవిండు”
అని
అర్థించెను.
3
▾
Meaning
Keep
“బావా!
అర్జునా!
నీ
ప్రశ్న
మరింత
విచిత్రముగా
యున్నది.
అర్థములేని
పని
చేయననియు,
సత్యము
కాని
మాట
ఆడననియు
నీవే
తెలిపితివి!
తిరిగీ
ఏది
నమ్మవలెనో
ఏది
విడువ
వలెనో
తెలియకున్నదని
విసుగుపడుచున్నావు.
పాపము!
ఇది
అంతయు
అర్థము
కాని
ఆందోళనయే
కాని
వేరు
కాదు.”
4
▾
Meaning
Keep
“బావా!
దైవాసురులను
వారు
ఇరువురు
ప్రత్యేకముగా
లేరు.
గుణభేదములననుసరించి
వాటిని
రెండు
అంశములుగా
చీల్బడమైనది.
గుణములు
కల్పనలు.
వీటిని
గురించి
దీనికి
పూర్వమే
తెలిపియున్నాను;
కుమ్మరి
కుండలు,
తప్పలు,
దుత్తలు
మట్టితో
చేయుచున్నాడు.
ఆ
చేయబడిన
పాత్రలు
పూర్వము
మట్టిలో
సహజ
సిద్ధముగా
లేవు.
సహజము
మట్టి;
కుండలు,
తప్పలు,
దుత్తలు
కల్పనా
రూపములు.
కల్పనయైన
రూపనామములనే
గుణములని
అందురు.
ఆధారము
మట్టి,
ఆధేయము
కుండలు
కదా?
ఆధారమైన
మట్టి
సహజము.
ఆధేయమైన
కుండలు
కల్పనలు.
కాన
సహజము
నా
స్వరూపము.
కుండలు
నాలో
లేవు
కానీ,
కుండలలో
నేను
వున్నాను.
అనగా
నాలో
గుణములు
లేవు
కానీ,
గుణములయందు
కూడనూ
నేనున్నాను.
అటులని
కుండలను
వేరు,
మట్టిని
వేరు
చేయ
ప్రయత్నించిన
అది
సాధ్యము
కాదు.”
5
▾
Meaning
Keep
“కృష్ణా!
తమ
స్వభావమునకును,
ప్రకృతి
యొక్క
స్వరూపమునకును
గల
సంబంధమేమి?”
6
▾
Meaning
Keep
“బావా!
పంచ
భూతములనబడు
పృథ్వి,
జలము,
అగ్ని,
వాయువు,
ఆకాశము
నా
స్వభావములని
నీకు
ఇదివరకే
తెలిసిన
విషయము
కదా!
ప్రపంచము
ఈ
పంచభూతములతో
చేరినదని
అందువా
లేక
ఏమందువు?
7
▾
Meaning
Keep
“కృష్ణా!
పంచభూతములే
లేకున్న
ఈ
ప్రపంచమున
ఏ
పదార్థమునూ
నిలువ
నేరదు
కదా!
అట్టితరి
అవి
లేవని
నేను
మాత్రమెట్లు
చెప్పగలను?
జీవితమంతయూ
వాటితోనే
చేరినది
కదా!”
8
▾
Meaning
Keep
“అట్లు
అంగీకరింతువేని
ఒకొక్క
భూతమునకును
తిరిగి
ఐదు
తత్త్వములు
ప్రత్యేకించి
చేరియుండుట
కూడనూ
అంగీకరింపవలెను.
ఆ
విధముగా
విచారించిన
పంచభూతములకూ
ఇరువది
ఐదు
తత్త్వములుండవలెను.
ప్రపంచమున
పృథ్వి,
జలము,
అగ్ని,
వాయువు
ఈ
నాల్గు
భూతములే
గోచరమగుచున్ననూ,
వీటికి
ఆకాశమాధారమై
యుండినటుల
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారములనెడి
కరణ
ధర్మములు
నాలుగు
కనుపించుచుండినప్పటికినీ,
అంతఃకరణము,
పై
కరణముల
నాలుగింటికినీ
ఆధారమైయున్నది.
అది
కనుపించదు.
కనుపించు
ప్రతి
పదార్ధమునకునూ
కనుపించని
ఒక
శక్తి,
బలము,
ఆధారమై
యుండును.
అట్టి
ఆధారమే
‘నేను’
(ఆత్మ).
సర్వాధేయములు
నన్ను
అనుసరించియే
యుండును.
అయితే
ఆధేయముల
యందు
కొన్ని
మార్పులు
కలుగుచుండును.
వికారములు,
క్షీణ
వృద్ధులు
కలుగుచుండును.
అంతమాత్రము
చేతనే
ఆధారములందు
కూడనూ
అట్టి
మార్పులు
కలవని
భావించరాదు.
మచ్చునకు
చూడు;
ఆకాశమునందలి
చంద్రుడు
అచంచలముగా
ప్రకాశించుచుండగా,
అతని
ప్రతిబింబము
జలమునందు
చలించుచుండును.
ఆధేయమైన
జల
కదలికచే
ఆ
బింబము
చలించునటుల
కనుపించుచున్నది
కానీ
చంద్రుడు
చలించుట
లేదు.
కానీ
చంద్రుడు
ఆడుచున్నాడని
చిన్నపిల్లలు
(తెలియని
వారు)
తలంతురు.
అటులనే
ఆధేయమందలి
మార్పులు,
ఆధారములో
నిరూపించుట
అసురత్వమనియు,
ఆధారమునందలి
నిత్యత్వం,
సత్యత్వం
ఆధేయమందు
కూడనూ
తెలిసికొనుట,
తెలుపుట
దైవత్వమనియు
అనబడును.
రెండింటి
యొక్క
మార్పులో
ఒకటి
నా
స్వభావము,
రెండవది
నా
స్వరూపము,
రెండునూ
వేరు
వేరుగా
చూడక
రెండింటి
యొక్క
(స్వరూప,
స్వభావముల
యొక్క)
ఏకత్వము
దర్శించుటే
వేదవేత్తల
స్థితి;
అన్నింటికీ
గుణ
మార్పే
కానీ
వేరు
మార్పు
కాదు”
అని
భగవానుడు
తెలిపెను.
9
▾
Meaning
Keep
అర్జునుడు
అతి
శ్రద్ధాళుడై
“మాధవా!
దైవ
దానవులకు
గుణ
మార్పులే
కారణములని
అంటిరి.
ఎట్టి
గుణములు
కలవారు
దానవులు?
ఎట్టి
గుణములు
కలవారు
దైవాంశమునకు
చెందినవారు?
కృపతో
తెలుపుము.”
అని
వేడుకొనెను.
“బావా!
నీ
బోటి
శ్రద్ధగలవాడు
చిక్కవలెనే
కానీ
తెలుపుటకు
నేనెల్లప్పుడూ
సిద్ధముగానే
యుందును.
అచంచల
మనస్కుడై
వినుము.
1.
అభయము,
2.
చిత్తశుద్ధి,
3.
జ్ఞానయోగమందుండుట,
4.
దానము,
5.
దమము
(బాహ్యేంద్రియ
నిగ్రహము),
6.
యజ్ఞము,
7.
అధ్యయనము,
8.తపస్సు,
9.
కపటము
లేకుండుట,
10.
అహింస,
11.
సత్యము,
12.
అక్రోధము,
13.
త్యాగము,
14.
శాంతి,
15.
కొండెములు
చెప్పకుండుట,
16.
సమస్త
ప్రాణులయెడ
కరుణ,
17.
విషయములందు
మనస్సు
పోకుండుట,
18.
తేజస్సు,
19.
క్షమ
(ద్వంద్వములను
సహించుట),
20.
ఆపత్కాలమునందు
సహితము
ధైర్యమును
విడవకుండుట,
21.
శౌచము,
22.
పరులకు
ద్రోహము
చేయకుండుట,
23.
మృదు
స్వభావము
(వాక్
మాధుర్యము),
24.
ధర్మ
విరుద్ధ
కార్యములలో
ప్రవేశింపకుండుట,
25.
చంచల
స్వభావము
లేకుండుట.
ఇట్టి
పవిత్రమైన
ఇరువది
ఐదు
గుణములు
కలవారు
దైవ
సంపత్తికలవారనియును,
డంబము,
గర్వము,
దురభిమానము,
కోపము,
పరులను
పీడించేలాగున
వచించు
స్వభావము,
వివేకజ్ఞానహీనత,
ఇత్యాది
దుర్గుణములు
కలవారలను
దానవాంశ
మనియును
అందురు.
ఆకారమున
మానవులవలె
కనుపించునంత
మాత్రమున
మానవులు
కానేరరు”
అని
మాధవుడు
పార్ధునకు
తెలియజెప్పెను.
10
▾
Meaning
Keep
“పై
తెలిపిన
దైవగుణములు
కలవారలనే
దైవాంశముగల
మానవులనియును,
దానవగుణములు
కలవారలనే
దానవాంశముతో
ధరనవతరించిన
దానవ
మానవులనియునూ
తలంచవచ్చును.
కొంతమంది
మానవులు
తమను
తాము
దైవాంశము
కలవారమని
తలంచుచుందురు.
కానీ
అందుకు
తగిన
దైవ
గుణములు
అన్నియూ
లేక
పోయినప్పటికినీ
యే
కొంత
మాత్రమైననూ
దయా,
ధర్మ,
పరోపకార,
శాంతములైననూ
వుండిన
కొంతవరకూ
దైవాంశమని
తలంచవచ్చును.
అటుల
కాక
పూర్తీ
విరుద్ధమైన
దానవ
ప్రవర్తనలే
పైన
కనుపించుచుండ,
అట్టి
వారిని
దైవాంశమని
చెప్ప
యెట్లు
వీలగును?
లేనివాటిని
ఉన్నటుల
చెప్పుట
కానీ,
ప్రదర్శించుట
కానీ
డంబమందురు.
డంబము
కూడనూ
దానవ
గుణమే
కానీ
దైవ
గుణము
కానేరదు.
బావా!
ఇట్టి
దైవ,
దానవ
అంశములు
యెవరికి
వారే,
వారి
వారి
స్వభావములను
పట్టి
సులభముగా
నిర్ణయించుకొనవచ్చును.
వీటికి
ఆకారము,
ఆస్తిపాస్తులు,
పదవీ
ప్రతిష్ఠలు
ఆధారములు
కావు.
ఎటులన,
రావణుడు
మానవాకారుడే.
అధికారమూ,
చక్రవర్తి
స్థానము.
ఆస్తిపాస్తులలో
కుబేరుని
మించినవాడు.
అంతమాత్రము
చేతనే
అతనిని
దైవాంశమైన
మానవుడని
తలంతురా?
కాదు.
గుణముల
యొక్క
స్వభావమునుబట్టి
రాక్షస
సంతతికి
చేర్చడమైనది.
అసుర
గుణములన్నింటికినీ
కామము,
క్రోధము,
లోభము,
అనెడి
మూడు
గుణములునూ
హేతువై
యున్నవి.
ఆత్మ
వినాశమునకునూ,
అసుర
వికాసమునకునూ
మూలకారణము
పై
మూడు
గుణములే.
వాటిని
జయించుటకు
దైవగుణములైన
వైరాగ్యము,
శాంతము,
త్యాగము
అను
ఉత్తము
గుణములే
సరియైన
సైనికులు.
ఈ
సైనికులను
చక్కని
శ్రద్ధతో
బలపరచిన
నిమిష
మాత్రములో
కామ,
క్రోధ,
లోభమను
రాక్షస
మూలాధార
సారధులను
నిర్మూలము
చేతురు.
దైవత్వమును
నిర్మాణము
గావింతురు.
కామ,
క్రోధ,
లోభములనబడు
అసురులలో
ఏ
ఒక్కడు
మిగిలియుండిననూ,
జీవితమునకు
ప్రమాదమే
కాన
మూడింటిని
మంట
గలుపవలెను.
అపుడే
జీవితము
ధన్యము
కాగలదు.”
11
▾
Meaning
Keep
“ఎటులన,
వృక్షమునకు
వేరులెటువంటివో
జీవులకు
ఆశా
పాశములటువంటివి.
వేరులు
అంతకు
అంతకు
తీసివేసిన,
(నరికివేసిన)
వృక్షము
అంతకు
అంతకు
వృద్ధి
తగ్గిపోవును.
ఏ
యొక్క
వేరు
ఆధారముగ
వున్ననూ
వృక్షము
కూడ
యెండి
రాలదు,
చావదు,
వేరులు
పూర్తీ
తీసివేసిననే
చెట్టు
చచ్చి
కూలిపోవును.
అట్లు
చావక,
కూలక,
యెండక
చెట్టు
నిలిచియుండియూ
వేరులు
పూర్తీ
తీసివేసితిమని
చెప్పు
వారల
మాటలు
బూటకములు
కాగలవు.
అటులనే
జీవుని
యొక్క
ఆశా
పాశములు
అంతకంతకు
తగ్గించుకొనిన
అంతకంతకు
జీవునకు
ఆవేశించిన
మాయు
శమించును.
కొంతమంది
ధ్యానసాధనలు
చేయువారు,
కొన్నింటిని
మాత్రము
అరికట్టి
(తగ్గించుకొని)
ధ్యానమును
చేతురు.
అట్టివారలకు
పూర్తీ
యేకాగ్రత
కుదరక,
పూర్తీ
చంచలత్వములేక,
మధ్యావస్థలో
బుద్ధిని
చెదుచుకొందురు.
కారణమేమి?”
12
▾
Meaning
Keep
“పూర్ణ
యేకాగ్రత
కలుగవలెనన్న
పూర్ణముగా
అశా
పాశములు
దూరము
కావలెను.
ఎపుడు
పూర్ణ
యేకాగ్రత
కుదరలేదో
తాను
పూర్తీ
ఆశా
పాశములు
విడువలేదనియే
అర్ధము.
అందులకే
కామ,
క్రోధ,
లోభములు
మానవునకు
పట్టిన
కఠిన
రాక్షసులని
అందురు.
రాక్షసులు
వికార
ఆకారములు
కలిగియుందురు
కదా
అని
తలంతురేమో!
ఆకార
మాత్రమున
వికారముండిన
ప్రమాదమంత
వుండెడిది
కాదు;
దానిని
వికార
ఆకారమని
మాత్రమే
చెప్పవచ్చును.”
13
▾
Meaning
Keep
రాక్షస
గుణాకారులే
లోకానికి
ప్రమాదకారులు.
రూపములు
అందచందముగా
వుండినంత
మాత్రమున,
పలుకులు
చిలుక
పలుకులై
ఉండినంత
మాత్రమున
అట్టివారలను
దైవాంశమున
పుట్టిన
పవిత్ర
మానవులని
తలంచరాదు.
అట్టి
వారలలో
దానవ
గుణములే
తాండవ
మాడుచుండిన,
వారి
అందచందములను
కూడనూ
దానవ
గుణములు
నానా
వికారముగా
మార్చును.
వారి
మాటలు
కడకు
సుత్తియేటు,
కత్తిపోటులుగా
మారును.
14
▾
Meaning
Keep
కాన
దానవ,
దైవ
సంపత్తి
–
గుణములలో
చేరినదే
కానీ,
కాయములలో
కాదు
అని
తెలుసుకొనవలెను.
Previous
←
The Kṣetra and the Kṣetrajña
Next
Sāttvika, Rājasika and Tāmasika Tendencies
→