Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · The Four Kinds of Jñānis
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
జ్ఞానులలో
నాలుగు
విధములు
కలరు;
1)
బ్రహ్మవిత్
2)
బ్రహ్మవిద్వరః
3)
బ్రహ్మవిద్వరీయాన్
4)
బ్రహ్మవిద్వరిష్టః
–
ఇవి
జ్ఞానియొక్క
సాత్విక
గుణాభివృద్ధి
ననుసరించి
నాలుగు
విధములుగ
విభజింపబడెను.
ఇందులో
మొదటివాడు
బ్రహ్మవిత్తనెడి
జ్ఞాని,
సత్త్వాపత్తి
అనెడి
నాలుగవ
భూమికలో
నుండును.
రెండవ
వాడైన
బ్రహ్మవిద్వరః
అనెడి
జ్ఞాని,
అసంసక్తి
అనెడి
ఐదవ
భూమిక
యందుండును.
మూడవ
వాడైన
బ్రహ్మవిద్వరీయాన్
అను
జ్ఞాని,
పదార్థాభావన
అనెడి
ఆరవ
భూమిక
యందుండును.
నాలుగవ
వాడైన
బ్రహ్మవిద్వరిష్టః
అనెడి
జ్ఞాని,
ఏడవ
భూమికయందు
తురీయావస్థలో
నుండును.
ఏడవ
భూమిక
యందున్న
బ్రహ్మవిద్వరిష్ఠుడు,
ఎల్లప్పుడు
సమాధిస్థితి
యందుండును.
బ్రహ్మవిద్వరిష్ఠుడు
విదేహముక్తుడు;
అతనికి
అన్నపానాదులు
సహితము
బలాత్కారముచే
తినిపించవలసివచ్చును.
లోకముకు
ఏ
పనియూ
చేయడు.
అట్టి
వారికి
దేహస్పృహ
యుండదు.
బ్రహ్మవిత్తుగానీ,
బ్రహ్మవిద్వరుడుగానీ,
కొంత
దేహజ్ఞానమును
కలిగియుందురు.
వారి
వారి
యొక్క
సంస్కారమును
అనుసరించి
ప్రపంచమున
పని
చేయుదురు.
ఇట్టి
వారికి
మనోనాశనము
ప్రధానము.
మనోనాశనమనగా
మనస్సును
అంతమొందించుట.
ఇవియు
రెండు
విధములు.
1.
సరూప
నాశము,
అనగా
చిత్తముతో
కూడా
రూపమును
నాశమొనరించుట.
2.
అరూప
నాశము,
అనగా
చిత్తమును
మాత్రమే
నశింపజేయుట.
2
▾
Meaning
Keep
ఇక్కడ
పాఠకులకు
సంశయము
కలుగవచ్చును.
ఏమన,
మనోనాశము
కలవాడెవడని.
ఎవని
యందు
రాగద్వేషములు,
మదమాత్సర్యములు
ఉండవో,
ఎవనికి
ఇంద్రియ
భోగములందాసక్తి
యుండదో,
అట్టి
మానవుడు
ఎవడైననుసరే
వాడు
మనోనాశము
కలవాడని
చెప్పబడును.
అతని
చిత్తము
ఏ
విధముగను
వృత్తులు
కలిగియుండదు.
సరూప
నాశమనెడి
చిత్తముకల
జీవన్ముక్తునికి
రాజస
తామసములు
నశించి
సత్వము
మాత్రము
మిగిలియుండును.
అట్టి
శుద్ధసత్వగుణము
చేత
అతడు
మైత్రి,
కరుణ
కలవాడై
యుండును.
విదేహముక్తుని
యందు
శుద్ధసత్వము
కూడా
నశించును.
శుద్ధసత్వము
యొక్క
ముఖ్య
చిహ్నము
ప్రకాశము,
జ్ఞానము,
ఆనందము,
శాంతము,
సమత్వము,
ఆత్మవిశ్వాసము,
పవిత్రత,
శుద్ధభావము,
మొదలైనవి.
శుద్ధసత్వమందే
ఆత్మ
ప్రతిబింబమును
చూడగలవచ్చును.
రాజస
తామసములు
శుద్ధసత్వముతో
కలిసినపుడు,
అది
అపవిత్ర
సత్వమగును.
అట్టి
అపవిత్ర
సత్వమువలననే
అవిద్య,
అజ్ఞానము
కలుగుచున్నది.
అదే
జీవునికి
ఉపాధి
అగుచున్నది.
కావున
మార్పు
కలుగును.
రాజసము
విక్షేపశక్తిని
కలిగి
యుండును.
గోచరమగు
జగత్తు
వృద్ధి
చెందుచుండును.
రాజసము
ఎక్కువ
అనురాగమును
కలిగించి
తద్వారా
అనేక
కర్మలు
చేయించి,
సుఖదుఃఖములను
కలిగించును.
రాజసము
జీవుని
బంధించి
క్రోధము,
దురాశ,
గర్వము,
అసూయ,
దంభము,
కపటము
మొదలగు
దుర్గుణములను
బలపరచుచున్నది.
ఇంక
తామసమా?
కన్నులు
కప్పించి
అజ్ఞానము,
తెలివితక్కువ,
అజాగ్రత్త,
నిద్రమత్తు,
బద్ధకము,
మాంద్యము
మొదలగునవి
తామసము
యొక్క
ఉపాధులయి
తప్పు
త్రోవలకు
తీసుకొనిపోవుచుండును.
తెలివిని
లేక
జ్ఞానమును
కప్పిపుచ్చి
కనిపించు
దానిని
కనిపించనట్లు
చేయును.
3
▾
Meaning
Keep
దాని
విక్షేపశక్తిని
గొప్ప
గొప్ప
పండితులు
కూడను
దాటలేరు.
సరియైన
తీర్మానమునకు
రాలేరు.
తామసము
కలవారి
మనస్సు
అనేక
శంకలతోను,
అర్థము
కాని
భోగములందాసక్తి
కలవాడై
జ్ఞానము
కోల్పోవుచుండును.
అట్టివారికి
వారి
ఆస్తిపాస్తి,
భార్యాబిడ్డలే
ఆత్మగా
కనిపించుచుండును.
అట్టివారికి
అసత్యము
సత్యముగానూ,
సత్యము
అసత్యముగానూ
కనిపించును.
చూడుడు,
తామసమెంత
చమత్కారి!
మాయ
యొక్క
ఆవరణశక్తి
వలననే
జీవుడు
తన
నిజమైన
సచ్చిదానంద
స్వరూపమును
గుర్తించలేకపోవుచున్నాడు.
పై
శక్తి
తామసము
యొక్క
ప్రభావమే.
జగత్తు
యావత్తు
విక్షేపశక్తి
నుండి
ఉద్భవించుచున్నది.
దాని
మూలముననే
విస్తరించుచున్నది.
అయితే
విశ్వప్రళయమందు
త్రిగుణములు
సమానముగా
నుండును.
వీటినే
గుణసామ్య
అవస్థ
అని
చెప్పబడుచున్నది.
ఈశ్వరేచ్ఛవలన
ప్రేరేపింపబడినవై
త్రిగుణముల
సమభావము
చెదిరిపోయి
జీవుని
కర్మలకు
అనుగుణమైన
ఫలముల
నిచ్చుచున్నవి.
త్రిగుణములు
వివిధముగా
విస్తరించగనే
జగదుత్పత్తి
గలుగుచున్నది.
దీనికి
వైషమ్యావస్థ
అని
చెప్పబడును.
అంతఃకరణము
మొదలు
భౌతిక
శరీరము
వరకు
మాయ
యొక్క
ఫలితమే.
ఇవి
మాయ,
అనాత్మలని
పిలువబడుచున్నవి.
ఇవి
వట్టి
భ్రమలు.
ఎండమావులను
చూచి
జలమని
భ్రమించినట్లు;
ఈ
మాయను
బ్రహ్మసందర్శనము
అనగా
ఆత్మసందర్శనము
వలన
తొలగింపవచ్చును.
కారణశరీరము
యొక్క
ఉపాధులు-బంధుమిత్రులను
కలసికొన్నప్పుడు
ఉద్భవించునది
ప్రియం;
కోరుకొన్న
వస్తువు
దొరికినప్పుడు
కలుగునది
మోదము;
దొరికిన
దానిని
అనుభవించునపుడు
కలుగునది
ప్రమోదము.
4
▾
Meaning
Keep
నిద్ర,
స్వప్నములు
కూడనూ
వృత్తులే.
అజ్ఞానవృత్తి
అనునది
గాఢనిద్రయందుండును.
అన్ని
వృత్తులను
నివృత్తి
చేయవలెను.
అప్పుడే
ఆత్మజ్ఞానముద్భవించును.
నేను,
నాది,
క్రోధము
మొదలయినవి
మనస్సుయొక్క
పరిణామవృత్తులు.
గుంపులు
గుంపులుగా
ఈగలు
ముసిరినట్లు
అంతఃకరణముల
నుండి
సంకల్పములును,
వృత్తులును
ఒకే
ప్రవాహమువలె
గుంపులుగా
నుద్భవించును.
కోటలో
ప్రవేశించు
శత్రువులను
సైనికుడు
ఒకటొకటిగా
ఎట్లు
చంపునో
అట్లే
ఒక్కొక్క
వృత్తిని
కూడనూ
మనసున
పుట్టగనే
అంతమొందింపవలెను.
ఈ
సంకల్పమునకు
కారణము
బీజరూపముతో
నుండిన
సంస్కారమే.
"నేనెవరు"
అని
విచారణ
చేసినచో
వృత్తులన్నియూ
పోవును.
ఎట్టి
వృత్తులు
వచ్చిననూ,
కలిగిననూ,
"నేనెవరను"
అన్న
ప్రశ్న
వేసుకొన్న
అన్ని
వృత్తులు
బుడగలవలెనణగిపోవును.
ఇట్టి
సాధనే
రమణమహర్షి
సాధించెను.
అదే
మార్గమును
తన
శిష్యబృందమునకు
బోధించెను.
అదియే
సులభమార్గము.
అనగా,
సర్వమును
బ్రహ్మమే,
దానికి
వ్యతిరేకమైనదేదియు
లేదు
అని
అర్థము.
"అహం
బ్రహ్మాస్మి"
అనే
మహావాక్యమును
జపించిననూ
అజ్ఞానము
పటాపంచలగును.
జీవికి
మొదట
పునాది
ఒకటి
కలదు.
దానినే
శుభేచ్ఛ
భూమిక
అని;
అట్టివారెట్లుందురన,
బ్రహ్మతత్త్వవేత్తల
యొక్క
సన్నివేశము,
వారి
ద్వారా
తెలిసికొనవలెననియెడి
అభిలాష,
మోక్షము
పొందవలెననియెడి
అభిలాష,
ఆధ్యాత్మిక
గ్రంథపఠనము,
ఇంద్రియ
భోగ
విరక్తి
మొదలగు
గుణములతో
నుందురు.
పై
చెప్పిన
చతుర్విధాభిలాషలు
గల
సాధకుడు
శ్రుతులను
విని
సద్గురువుల
పాదపద్మములందు
"తత్త్వమసి"
మొదలగు
మహావాక్యముల
యొక్క
అంతరార్థమును
గ్రహించినవాడై,
ఆ
5
▾
Meaning
Keep
మహావాక్యములను
మనన
మొనర్చుకొనుచు
ఏకాగ్రతచే
చింతించును.
దీనికే
విచారణ
భూమికయను
మెట్టు.
పై
చెప్పిన
రెండు
విధములైన
సాధనలచే
మనసు
క్షణములో
బ్రహ్మచింతనయందు
లగ్నము
కాగలదు.
మనస్సు
వాటిని
త్రాడువలె
ఉపయోగించి
పైమెట్టునెక్కి
ప్రయత్నించును.
అందువలన
బ్రహ్మాకారవృత్తి
జనించుచున్నది.
ఇదే
"తనుమనసి"
అనియెడి
మూడవమెట్టు.
పై
చెప్పిన
మూడుమార్గముల
సాధనలచే
సకల
కోరికలు
క్రమముగా
నశించుచున్నవి.
తత్త్వజ్ఞానము
వృద్ధిపొందుచున్నది.
ఇందు
మనసు
పూర్తిగా
పవిత్రత
చెంది
సత్యముతో
నింపబడుచున్నది.
కావున,
నెమ్మదిగా
మనస్సు
బ్రహ్మాకారవృత్తియందు
లీనమగును.
అసంసక్తియందు
బాహ్య
విషయములతోగానీ,
వాటి
సంస్కారములతో
కానీ,
సాధకున
కెట్టి
సంబంధమూ
ఉండదు.
ఇపుడు
లోపల,
వెలుపల
వస్తువులయందుండెడి
పూర్వపు
దృష్టి
నశించుచున్నది.
దీనిని
అభావప్రతీతి
అందురు.
అట్టి
జ్ఞాని
ఒకవేళ
ఏదైన
చూచినచో
అది
ఇతరుల
ప్రోద్బలమున
చూచును.
దీనినే
పదార్థభావనయనెదరు.
జ్ఞాని
ఆత్మానందములో
మునిగియుండును.
లోపలగానీ,
బయటగానీ
త్రిపుటి
అనునది
యుండక
సమస్త
దృష్టి
తన
ఆత్మానందమందే
లగ్నమగును.
దీనినే
తురీయావస్థ
అందురు.
తెలిసినవి,
తెలియనివి,
చూచినవి,
చూడనివి
గురించి
ఆలోచించుచూ
గాలిమేడలు
కట్టుచుందురు.
కొందరు
దీనిని
జాగ్రత్స్వప్నమందురు.
మరికొందరికి
మమత
-
నాది,
నేను
అను
భావములతో
-
అనేక
జన్మల
వలన
వృద్ధిపొందుచుండును.
దీనిని
మహాజాగ్రత
అనబడును.
పై
6
▾
Meaning
Keep
భావములన్నియూ
వృత్తులే.
ఆ
వృత్తులన్నియు
నశించిననే
జ్ఞానమను
రుచిని
అనుభవించగలడు.
అప్పుడే
ఆత్మజ్ఞాని
కాగలడు.
అంతవరకు
నామములెన్ని
తెలిసిననూ
యధార్థజ్ఞాని
కాజాలడు.
యధార్థజ్ఞానికి
పై
వృత్తులు
నశించుటే
ముఖ్య
లక్ష్యమయి
ఉండును.
Previous
←
Whoever Can Check the Onrush of the Citta and Fully Subdue It, to Them Comes the Vision of the Ātma
Next
The Manas Alone Is the Cause of Man's Bondage and Freedom
→