Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · The Manas Alone Is the Cause of Man's Bondage and Freedom
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సంచరించు
మేఘములకును,
ఆకాశమునకును
ఏవిధమైన
సంబంధము
ఎట్లా
లేదో,
అట్లే
శరీరమునకును,
పరమాత్మ
స్వరూపమైన
నీకునూ
సంబంధము
లేదు.
దేహావస్థలో
ఉండే
మెలకువ,
స్వప్న,
గాఢనిద్ర,
మొదలగు
స్థితులు
పరమాత్మ
స్వరూపమగు
నిన్నెట్లు
అంటగలవు?
నీ
నీడ
నీ
నుండి
ఎట్లు
వేరగుచున్నదో,
నీడ
యొక్క
స్థితిగతులు
నీకెట్లు
అంటకుండునో,
అట్లే
పరమాత్మ,
దేహము
రెండూ.
ఎముకలతోను,
కండలతోను
నిర్మింపబడిన
దేహమే
"నీవే"
అయినచో
"నాది"
అని
పిలువబడు
దేహమెక్కడ
ఉన్నది?
ఈ
విషయమును
పరిశీలించుటే
జ్ఞానము.
పంచభూతములతో
నిర్మింపబడిన
దేహము
కేవలము
కల్పించునదే.
అది
అవిద్య,
అజ్ఞానము
వలన
జనింపబడినది.
జన్మించుటకు
పూర్వముకానీ,
అంతకుముందు
కానీ
దేహమున్నదా?
లేదు;
మధ్య
కొంతకాలము
వరకు
మాత్రమే
యుండును.
ఈ
దేహము
అర్థరహితమైనది.
ఇది
కేవలము
మనసు
యొక్క
గారడి
విద్య.
నీవు
నిజముగా
సచ్చిదానంద
స్వరూపుడవు.
మట్టితో
కుండలు,
గిన్నెలు,
ప్లేట్లు
చేయవచ్చును.
అయితే,
అవి
తయారు
కాక
మునుపు,
వాటి
రూపములు
మారిన
తరువాత
నిరాకార
స్వరూపమైన
మట్టి
తప్ప
మరేమీ
కాదు.
మధ్య
జీవితములో
ఏర్పడు
ఉపయోగము
నిరుపయోగమే,
రూపనామములతో
నిండియుండుట
చేత.
2
▾
Meaning
Keep
సచ్చిదానంద
స్వరూపునకు
అన్నిరూపులు
తానే,
అంతయూ
తానే
కదా!
కాన
త్రికాలములందు
మారనటువంటి
పరమాత్మ
ఏదో
అదే
నీవు
కానీ,
మారునట్టి
దేహము
మాత్రము
నీవు
కాదు.
ఈ
భావన
తెలిసికొని
నిరంతరమూ
"నేనే
పరబ్రహ్మస్వరూపుడను"
అని
ఎవరు
తలంతురో
వాడు
జ్ఞాని.
మనసు
ఎంత
వరకు
వస్తువునందు,
మనుష్యునియందు,
స్థలమునందూ
ఆసక్తి
కలిగియుండునో
అది
బంధన;
వాటినివేటినీ
అంటకుండు
స్థితియుండుటే
ముక్తి.
కావున
అనురాగమే
బంధన,
మృత్యువు.
విముక్తియే
శాశ్వత
జీవితము.
"మనయేవ
మనుష్యాణామ్
కారణం
బంధమోక్షయోః"
అన్నట్లు,
మనస్సే
మానవుని
బంధనకు,
స్వాతంత్ర్యమునకు
కారణము.
ఆసక్తియే
రాగము.
అట్టి
అనురాగమే
కర్మకు
కారణము.
అనురాగమే
ఇంద్రియములను
చలింపజేయుచున్నది.
భయము,
క్రోధము,
అనురాగము
యొక్క
మొదటి
స్నేహితులేకాక,
ముఖ్య
స్నేహితులు,
ప్రాణస్నేహితులుకూడను!
అనురాగ
మెక్కడున్నదో
క్రోధము,
భయము
అక్కడే
యున్నవి;
ప్రక్కనే
యున్నవి.
అందుకనే
పతంజలి
కూడను
రాగమును
గూర్చి
ఈ
క్రింది
రీతిగా
తెలిపెను.
"సుఖానుశయీ
రాగః"
సౌఖ్యమును
ఆకర్షించుటకు
కారణము
ఆసక్తియే,
అని
చెప్పియున్నారు.
ఏది
సౌఖ్యమో
అది
అంతయు
అనురాగము.
విషయముల
నంటి
యుండుట
చేత
ఆసక్తి
ఏర్పడుచున్నది.
ఆసక్తిద్వారా
కోరికలు
పుట్టుచున్నవి,
కోరికల
నుండి
క్రోధము,
వాటి
మూలమున
సుఖదుఃఖములు,
మంచిచెడ్డలను
చక్రమున
ఇరుకుకొని
తపించుచుండుటే
అజ్ఞానము.
3
▾
Meaning
Keep
బాగుగా
కాల్చిన
ఎట్లు
బంగారమునందున్న
మాలిన్యము
పోయి
ధగధగ
మెరయునో,
అట్లే
గాధమైన
వివేకముచే,
విచారణచే
రాజస,
తామసములను
భ్రాంతులు,
వాంఛలు,
క్రోధములు
అను
మాలిన్యము
పోయి
ఆత్మజ్ఞానమను
ప్రకాశమును
దర్శించగలరు.
తీవ్రమగు
గాలి
దుమారము
చేత
చెదిరిపోయిన
నల్లని
మబ్బులవలె
వాసనలను,
సంకల్పములను,
తృష్ణలను
నిర్మూలించిన,
వెనుక
మనసు
పరబ్రహ్మైక్యము
కాగలదు.
ఎట్టి
కష్టసమయములందును
మనసును
జార
విడువరాదు.
ఉన్నత
దృష్టిచేత
మనసును
అరికట్టవలెను.
పవిత్ర
అంతఃకరణములతో
కలిమి
చేసికొని
ఆత్మను
శరణుజొచ్చవలెను.
అప్పుడు
సవికల్పసమాధినుండి
నిర్వికల్పసమాధిలోనికి
పోగలరు.
పూర్తీ
నిర్మోహము
కలిగినపుడే
నిర్వికల్పసమాధి
లభించును.
అదే
సంపూర్ణ
ఆత్మజ్ఞాన
ముదయించుటకు
పునాది.
నిర్వికల్పసమాధి
ద్వారా
పరబ్రహ్మను
చేరగలిగినపుడే
అవిద్య,
కర్మ,
కామము
మొదలగు
బంధనలను
త్రెంచివేయవచ్చును.
సమాధిలో
లగ్నము
చేయబడిన
మనస్సుతోనే
ఆత్మసందర్శనము
సాధ్యము.
బ్రహ్మజ్ఞానమును
అనుభవించుటకు
ప్రయత్నించే
వాడు
దేహమందు
భ్రాంతి
పూర్తిగా
పోయి
దానిని,
పాము
విడుచు
కూసుమువలె
నిర్లక్ష్యముగా
చూడవలెను.
ఇట్టివి
కేవలము
ఆత్మ
బలహీనత
గలవారు
తెలిసికొన
సాధ్యము
కావు.
ఆత్మచింతన
వలన
క్రమేణా
ప్రాపంచిక
వ్యవహారముల
నుండి
బయటపడగలము.
దీనికి
ఎక్కువ
ఓర్పు,
ఎడతెగని
సాధన
కావలెను.
నిజమైన
సాధకుడు
తన
యావచ్ఛక్తిని
ప్రపంచ
విషయములనుండి,
ఇంద్రియ
భోగములనుండి
మరల్చి
శాశ్వత
బ్రహ్మను
గురించి
విచారించుచూ,
అదే
గొప్ప
తపస్సుగా
చేయుచుండును.
మనుష్యుడు
కేవలము
ప్రపంచ
4
▾
Meaning
Keep
భోగముల
కొరకును,
బాహ్య
విషయములు,
మనుష్యానందము
కొరకును
యుద్భవించినట్లు
భావించుచుందురు.
ఇది
ఎంత
వెట్టి!
వీటన్నింటికి
నేను,
నాది
అను
అహంకారమే
మూలకారణము.
అహంకారమే
లేని
యెడల
బాహ్య
విషయములుండవు.
బాహ్యవిషయములుండని
యెడల
"నేను"
అనెడి
అహంకారముండదు.
కాన,
వివేకవంతుడు
తనయొక్క
విచక్షణాశక్తి
చేత
బాహ్యవిషయముల
నుండి
తనను
వేరుపరచుకొనుచు
యథాతథముగా
భగవంతుని
ఏజంటువలె
తిరుగవలెను.
ఒకానొక
సమయమున
ఏదో
మాటల
సందర్భములో
లోకానుభవ
నిమిత్తమై
వశిష్ఠమహర్షి
శ్రీరామచంద్రునితో
ఈ
క్రిందిరీతిగా
తెలిపెను.
"ఓ
పరాక్రమ
రామా!
జీవుడను
వృషభము
సంసారమనెడి
అరణ్యమునందుగల
పెద్ద
ఛాయగల
చెట్టుక్రింద
మోహమనెడి
నీడలో
నిద్రించుచున్నాడు.
కోరికలనెడి
త్రాళ్ళచేత
బంధింపబడి
యుండుట
వలన
వ్యాధులనెడి
క్రిమికీటకాదులు
కరచుచున్నవి.
అజ్ఞానమనెడి
అంధకారములో
కళంక
భూయిష్టమగు
విషయాసక్తుల
చేత
తన్నబడుచూ
ఇంద్రియభోగము
లనుభవించుట
కొరకై
పాపకర్మలనెడి
బురద
యందు
పొరలుచున్నాడు.
అట్టి
సమయమున,
వివేకవంతులు,
సజ్జనులైన
విజ్ఞానుల
సహవాసము
వలన
సంసారమను
ఘోరారణ్యమును
దాటగలుగుచున్నాడు.
కాన,
వివేక
విచారణచే
విజ్ఞానమును
సాధించి,
విజ్ఞానముతో
యధార్థమును
గ్రహించుటే
ఆత్మసాక్షాత్కారమనియు,
ఆత్మజ్ఞానమనియు
పిలువబడుచున్నది.
అట్టి
ఆత్మజ్ఞానమే
జీవితమునకు
అంత్యము,
అదియే
తురీయాతీతము".
అయితే,
ఒకటి
శ్రద్ధగా
గ్రహించవలెను,
గమనించవలెను.
బాహ్యవిషయములందలి
మోహము
వదలిననూ
అంతరంగమందుండు
5
▾
Meaning
Keep
కోరికలు
నశించనిదే
లాభము
లేదు.
దీనినే
"తృష్ణ"
అందురు.
లోపల,
వెలుపల
నుండు
వాసనలు
నశించిన
పిదప
కలుగు
ఆశను
ముక్తతృష్ణ
అనబడును.
తృష్ణలు
వృద్ధి
పొందు
కొలదీ
ఆ
మనస్సు
అలజడి
చెంది
అశాంతి
కలిగియుండును.
ఆత్మజ్ఞానోదయమొక్కటే
అన్ని
తృష్ణలను
నిర్మూలింపగలదు.
ఇట్టి
జ్ఞానియొక్క
స్వానుభవము
"నేను
బ్రహ్మము"
అని
పలుకునప్పుడు
మనస్ఫూర్తియగు
సత్యమును
నుడువుచున్నాడు.
స్థూలసూక్ష్మశరీరములు,
మనోబుద్ధి
ప్రాణములు
మొదలగునవన్నియూ
త్యజించి
వాటికి
అతీతము
కాగలిగినప్పుడు
మిగిలియుండునది
సత్తు
లేక
పరబ్రహ్మము
గదా!
కావున,
సర్వవ్యాపియైన
సర్వేశ్వరునే
తానుగా
పోల్చుకొనుచున్నారు.
సరియైన
సాధన,
శిక్షణ
పొందనివారు
దేహమునే
పరబ్రహ్మతో
పోల్చుకుందురు.
సత్తు,
చిత్తు,
ఆనందము
అనగా
శాశ్వతముగా
వుండునటువంటిదని
అర్థము.
నిరాకారుడనగా
ఆకారశూన్యుడు.
సర్వవ్యాపియైన
పరమాత్మకు
రూపమెక్కడిది?
పర,
పరము
అనగా
అన్నింటికంటె
ఉత్కృష్టమైనది
అని
అర్థము.
కావున
పరబ్రహ్మమనగా,
అతని
కన్న
ఉన్నతమైనది
ముల్లోకములందేదియును
లేదని
అర్థము.
అద్వైతుడు
అనగా
ఏకస్వరూపము.
శాశ్వతమైనది
ఏదియో
ఒక్కటే
ఉండవలయును
కానీ,
రెండు
ఎన్నటికినీ
శాశ్వతమైనది
కాదని
బోధించును.
రెండు
యెప్పుడుండునో
అప్పుడు
భేదము
ఏర్పడును.
భేదమెప్పుడు
ఏర్పడునో
అప్పుడు
పోట్లాట
తప్పదు.
బ్రహ్మ
సర్వత్ర
వ్యాపించి
యుండువాడు.
కావున,
ఏకైక
స్వరూపము
కలవాడు.
అది
విభజింప
అలవి
కాదని
గ్రహించుటే
నిజ
జ్ఞానము.
Previous
←
The Four Kinds of Jñānis
Next
To Know That Which Is Eternal, That Alone Is Jñāna
→