Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · To Know That Which Is Eternal, That Alone Is Jñāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఏది
శాశ్వతమైనదో
దానిని
తెలుసుకొనుటయే
జ్ఞానము
బ్రహ్మమను
పదము
"బృహ్"
అనెడి
పదము
నుండి
వచ్చినది.
"బృహ్"
అనగా
పెరుగుట,
విస్తరించుట,
వ్యాపించుట.
"బృహత్"
అనగా
పెద్దది,
గొప్పది,
ఎత్తైనదని,
స్థూలమైనదని
కూడా
చెప్పవచ్చును.
"పురుష"
అన్నపదము
"ప్రియ్"
అను
మాట
నుండి
వచ్చినది.
"ప్రి"
అనగా
నింపుట,
పూర్తిచేయుట
అని
కూడను
అనవచ్చును.
"పుర్"
అనగా
నగరము.
ఆ
స్థానమున
దేహమును
పోల్చుకొనవచ్చును,
దేహమనే
అనవచ్చును.
వీటిని
నింపు
వాడు
కావున
పురుషుడనబడును.
ఆత్మ
అను
పదము
"అప్"
అనెడి
మూలము
నుండి
వచ్చినది.
"అప్"
అనగా
పొందుట,
ఆక్రమించుట
అని.
కాన,
ఆత్మను
తెలుసుకున్న
వానికి
సర్వమును
లభించును.
అట్టి
వానికి
సర్వవ్యాపిత
జ్ఞానము
కలుగుచున్నది.
అప్పుడు
వాడు
సచ్చిదానందుడు
కాగలడు.
సచ్చిదానందమంటే
బ్రహ్మ
యొక్క
దేహము
(స్వరూపము)
అని
అర్థము.
స్వరూపమనగా
దాని
యొక్క
సారమని
అర్థము.
బ్రహ్మ
ఆనందము,
జ్ఞానము,
శాంతముల
యొక్క
సారములతో
చేయబడినవాడు.
తైత్తిరీయోపనిషత్
ఒకానొక
సమయమున
చెప్పినది
ఈ
క్రింది
రీతిగా:
"అన్నియూ
ఆనందముచే
జనించినవి.
ఆనందము
వల్లనే
అన్నియూ
జీవించుచున్నవి.
మరలా
అవి
ఆనందమునే
చేరి
అందేయున్నవి"
అని.
అట్టి
జ్ఞానమును
పొందిన
ఇంకొక
స్వరూపము
"అంతరాత్మ".
2
▾
Meaning
Keep
ఇది
పైన
చెప్పబడిన
ఆనందమునే
కలిగియుండును.
అంతరాత్మ
ఎంత
జ్ఞానానందముచే
నింపబడినదో,
అటువంటి
మానవ
స్వరూపము
గలదిగ
తెలియబడుచున్నది.
పైన
చెప్పినట్లు
ఆనందస్వరూపుడైన
మానవునికి
హాయి
కలిగించుచున్నది.
కుడి
భుజము
సంతోషము.
ఆనందమతని
దేహము.
బ్రహ్మమే
అతని
పునాది.
"భూమా"
అనగా
అంతులేనిదని
అర్థము,
శాశ్వత
బ్రహ్మము.
"భూమా"లో
మాత్రము
ఆనందము
కలదు
అని
ఛాందోగ్యోపనిషత్
చెప్పుచున్నది.
జ్యోతిస్స్వరూపుడనగా
స్వయముగా
ప్రకాశించువాడు,
కాంతిమయుడు.
పరమాత్ముని
కాంతి
ముందు
కోటి
సూర్యుల
కాంతి
కూడా
చాలదు.
శాంత
స్వరూపుడనగా
శాంతమే
పరమాత్మ
అని
అర్థము.
"అయం
ఆత్మా
శాంతో"
అనగా
ప్రశాంతమే
ఈ
ఆత్మయని
శ్రుతులు
నొక్కి
చెప్పుచున్నవి
కదా?
అందుకనే
పరమాత్మ
ఎల్లప్పుడూ
నిత్యశుద్ధ,
నిత్యబుద్ధ,
నిత్యముక్త,
నిత్యతృప్త,
నిత్యవిజ్ఞాన,
నిత్యచైతన్య
స్వరూపుడు;
శుద్ధమనగా
పవిత్రము.
విజ్ఞానమే
బ్రహ్మస్వరూపము.
కావున
అతడు
నిత్యబుద్ధ
స్వరూపుడు.
అతడు
ఎల్లప్పుడు
విముక్తుడు,
అసంగుడగుట
వలన
బ్రహ్మ
నిత్యముక్త
స్వరూపుడు.
నిత్యతృప్తి
అనగా,
శాశ్వతమైన
తృప్తి
(నిండుగా
నుండుట).
బ్రహ్మజ్ఞానము
ఏక్షణమైన
రుచి
చూడగలిగినపుడు
అన్ని
కోరికలు
అంతమొంది
శాశ్వత
తృప్తి
కలుగును.
అతడు
నిత్యతృప్తినిచ్చు
మూర్తి.
విజ్ఞానమనగా,
ప్రత్యక్షముగా
బ్రహ్మసందర్శన
మనుభవించునపుడు
కలుగునది.
ఇది
ప్రత్యేక
జ్ఞానము.
సాధారణముగా
పుస్తక
పఠనము
ద్వారా
3
▾
Meaning
Keep
కలిగెడి
జ్ఞానము
సర్వ
సామాన్యమైనది.
ఏదో
ఒక
శాస్త్రముచే
పరిశోధించిన
ఫలితమును
కూడా
విజ్ఞానమందురు.
జ్ఞానము,
విజ్ఞానము,
చిత్,
చైతన్యము,
సానువిత్తము,
ప్రజ్ఞానము
అని
బ్రహ్మజ్ఞానమైన
ప్రత్యేక
జ్ఞానమునకు
పేర్లు.
చైతన్యమనగా
శుద్ధ
అంతఃకరణము.
దీని
వ్యతిరేకపదము
జడము.
చైతన్యమనగా
ఆత్మజ్ఞానము.
బ్రహ్మ
నిత్యచైతన్య
స్వరూపుడు.
ఒక
జ్ఞాని
అందరిలోని
ఆత్మయే
తన
ఆత్మగా
భావించుచు,
తనే
సర్వోస్మియని
ఆనందముతో
ఘోషించును.
మనిషి
మనిషికి
తగిన
తారతమ్యములతనికి
ఉండవు.
నిర్గుణ
బ్రహ్మమాయకతీతుడు.
జాతి
మత
భేదములన్నియు
దేహమునకు
కానీ
ఆత్మకు
లేవు.
ఇవి
జీవుని
గుర్తులు.
నిష్కళమనగా
అంగరహితుడు.
నిర్మలమనగా
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
మద,
మాత్సర్యములు
ఎవనికి
వుండవో
వాడు
నిర్మలుడు.
నిష్క్రియ
అనగా
కర్మరహితుడు.
ప్రకృతి
సమస్తము
చేయుచుండగా,
పరమాత్మ
కేవలము
సాక్షీభూతముగా
గమనించుచూ
ఉండును.
కావున
అతడు
నిష్క్రియుడు.
ఏది
త్రికాలములయందుండునో,
ఆద్యంతములు
లేవో,
చలన
రహితమో,
ఏకరస,
ఏకరూపము
కలదో
అదియే
సత్యమనబడును.
మనస్సు,
దేహము,
ప్రాణము,
ఇంద్రియములు
మొదలగునవి
చలనము
కలవి.
వీటికి
ఆది,
అంత్యములున్నవి.
ఇవి
జడములు.
ఇవి
త్రిగుణములచే
జనింపబడుచున్నవి.
అవి
అసత్యమైనవి.
కేవలము
భ్రమింపజేయునవి.
పారమార్థిక
సత్యము
కలవి
కావు.
అవి
వ్యావహారికమయినవి,
ప్రాతిభాసికములైనవి.
అనాది,
అనంతమనగా
తుది,
మొదలు
లేనిది.
ఏది
కాలమాన
పరిస్థితులకతీతమో
అది
నాశము
లేక
శాశ్వతమైనదై,
ఆధారమైనదై,
అపరిచ్ఛిన్నమై
భేదింపబడనిది.
అనగా
శాశ్వతమైనదిగా
నుండునో
దానిని
4
▾
Meaning
Keep
తెలుసుకొనుటయే
జ్ఞానమని
తెలుపబడుచున్నది.
ఇది
అనిర్దేశ్యము.
అనగా
వర్ణింప
అలవి
కానిది.
బుద్ధి,
అంతఃకరణకు
కూడా
అతీతమగు
పరబ్రహ్మను
అల్పమగు
మాటలచేత
ఎట్లు
వర్ణింప
వీలగును?
అదృశ్యమనగా
భౌతికచక్షువులచే
చూడలేనిది.
భౌతికముగా
చూడబడునది,
అశాశ్వతమైనది.
కావున
శాశ్వత
పరబ్రహ్మ
భౌతికముగా
చూడబడదు.
అతని
వలన
కన్నులు
చూడగలుగుచున్నప్పుడు
అతనిని
కన్నులెట్లు
చూడగలవు?
దేశము
అను
హద్దులేదు.
కాల,
కారణ,
దేశములనెడి
మూడింటికి
కట్టుబడియుండును
మనసు.
పరబ్రహ్మకు
కట్టుబడి
నిర్మింపబడిన
కాల
ప్రదేశములతని
నెట్లు
నిర్దేశింపగలవు?
అమల,
విమల,
నిర్మల
మొదలైనవి
ఏకభావము
నిచ్చును.
అ,
నిర్
మొదలైన
అక్షరములు
మొదట
చేర్చుకొనుట
వలన
కాదు,
లేదు
అనెడి
అర్థమిచ్చును.
కావున
అమల
అనగా,
మలినము
లేనిది.
అచింత్య
మనగా
చింతింప
నలవికానిది.
అవ్యవహార్య,
పనిలేనిది.
ఒకటి
పైన
రెండు
మూడు
మొదలైన
సంఖ్య
కలిగినప్పుడు
వ్యవహారముండును
గానీ
ఏకైక
పరబ్రహ్మకు
వ్యవహారమే
లేదు.
జగత్తు
విరాట్పురుషుని
స్వరూపము.
ఇది
కల్పించునట్టి
పరబ్రహ్మ
అంతర్యామి.
బ్రహ్మమనగా
దాగియున్నది.
నిర్గుణబ్రహ్మమనగా
మహాకారణ
బ్రహ్మమని
పేరు.
ఈశ్వరుడు
కారణబ్రహ్మ,
హిరణ్యగర్భుడు,
అనగా
ఆదిపురుషుడు,
కార్యబ్రహ్మ.
ఈ
మర్మమును
తెలిసికొనుటే
జ్ఞానము.
Previous
←
The Manas Alone Is the Cause of Man's Bondage and Freedom
Next
Bhakti to God Is the Foundation of the Lamp of Jñāna
→