Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · Bhakti to God Is the Foundation of the Lamp of Jñāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
జ్యోతికి
దైవభక్తి
ఆధారము
లోకమున
అనేక
మంది
జ్ఞానము
'బ్రహ్మస్వభావము'
అని
వాదించుచున్నారు.
అది
వట్టి
అనుభవశూన్యము.
అనుభవములేక
ఎవరెన్ని
విధములయిననూ
వాదించవచ్చును
కానీ,
అది
యధార్థము
కాదు.
జ్ఞానము
'బ్రహ్మస్వరూపము'
అని
నేను
గట్టిగ
వచించుదును.
సత్యజ్ఞానానందస్వరూపుడని
శాస్త్ర
వేదములు
పలికినవి
కానీ
సత్యజ్ఞానానందస్వభావుడని
తెలుపలేదు.
బ్రహ్మము
ఇట్టిది
అట్టిది
అని
తెలుప
వీలుకానిదై
యున్నది.
అందుకనే
బ్రహ్మము
సన్మాత్ర
స్వరూపమని
పిలువబడుచున్నది.
జ్ఞానము
కూడనూ,
అట్టిదే.
దానిని
కూడనూ
సన్మాత్ర
స్వరూపమని
అందురు.
జ్ఞానమే
బ్రహ్మస్వరూపము
కాదన్న
బ్రహ్మము
విజ్ఞాన
ఘనమను
శ్రుతి
యేమైపోవును?
శ్రుతి,
శాస్త్ర,
వేదములు
తెలియని
వారే
బ్రహ్మము
వేరు,
జ్ఞానము
వేరని
తలంతురు.
ఇట్టివారు
పూర్తీ
అమాయకులనే
చెప్పవచ్చును.
జ్ఞానము
త్రిగుణాతీతము;
గుణస్వభావముతోనున్న
అజ్ఞానము
జ్ఞానమెట్లగును?
బ్రహ్మము
కూడనూ
గుణాతీతుడు.
కాన,
జ్ఞానము
బ్రహ్మస్వరూపము.
బ్రహ్మమూ,
జ్ఞానమూ
రెండునూ
నిర్గుణమేకానీ,
ఒకటి
సగుణము,
రెండవది
నిర్గుణము
కాదు.
ఒకవేళ
బ్రహ్మమునందు
గుణములు
కలవని
నిరూపించిన
అవి
కేవలము
జీవునకు
జీవావస్థయందు
ఉపయోగించు
అవిద్యా
కల్పితములే.
2
▾
Meaning
Keep
"జ్ఞానేన
హీనాః
పశుభిస్సమానాః"
అనగా
జ్ఞానహీనులయిన
వారు
పశువులతో
సమానములనబడుచున్నది.
జ్ఞానమే
సర్వానర్థ
నివృత్తికరమైన
శాశ్వతానందమోక్షమని
కూడా
వేదము
ఒప్పుకొనుచున్నది.
అట్టి
స్థానమునకు
అనేక
మార్గములున్ననూ,
భక్తి
ముఖ్య
సాధనమై
వెలసియున్నది.
అందులకనే
వశిష్ఠ,
నారద,
వ్యాస,
జయదేవ,
గౌరాంగ
ఇత్యాది
మహాపురుషులు,
మహనీయులు
కూడనూ
ఆ
మార్గమును
అవలంబించిరి.
దీపమునకు
తైలమెట్లు
ఆధారమైయున్నదో
జ్ఞానజ్యోతికి
దైవభక్తి
తైలమువలె
ఆధారమై
ఉండును.
జ్ఞానానందమను
మందార
వృక్షమునకు
భక్తి
జలమువంటిదని
తలంచవలెను.
అందుకనే
కరుణానిధియైన,
ప్రేమస్వరూపుడైన
కృష్ణుడు
గీతయందు
"భక్త్యా మామభిజానాతి"
అని
చెప్పెను.
దీనికి
కారణమేమి?
భక్తిమార్గమందు
ఏ
అపాయము
లేదు.
ఆబాలవృద్ధులు,
ఆచండాలబ్రాహ్మణులగు
స్త్రీ
పురుషులందరు
దీనికి
పాత్రులే.
అయితే
జబ్బు
వున్నవానికే
మందు
ముఖ్యావసరము
అయినట్లు,
ఎవరికి
అజ్ఞానము
అధికముగా
నున్నదో
వారు
కదా
జ్ఞానానుష్ఠానమును
ముందుగా
చేయవలయును?
ఆకలి
లేనివానికి
అన్నమెందుకు?
రోగము
లేనివానికి
మందెందుకు?
అసలు
జ్ఞానమను
బ్రహ్మ
పుట్టినదే
అజ్ఞాన
నివృత్తికొరకు.
అట్టి
అజ్ఞాన
నివృత్తి
చేసుకొనగోరువారు
యెవ్వరయిననూ
సరే
జ్ఞానమును
సాధించవచ్చును.
జ్ఞానము
సర్వమలినములనూ
భస్మము
చేయును.
ఏ
తెగవారికయిననూ
దీనిని
పొందుటకు
అధికారము
కలదు.
అట్లు
స్త్రీలకు
అధికారము
లేదన్న,
పరమ
సులభప్రియుడైన
పరమేశ్వరుడు
వేదాంతమును
పార్వతికెట్లు
బోధించెను?
అదియేకాక
3
▾
Meaning
Keep
మహాయోగీశ్వరుడయిన
కపిలాచార్యుడు
తన
తల్లియైన
దేవహూతికి
బ్రహ్మబోధ
కొరకు
సాంఖ్య
తత్త్వోపదేశము
చేసినట్లు,
ఋషిశ్రేష్ఠుడయిన
యాజ్ఞవల్క్య
మహర్షి
తన
భార్యయగు
మైత్రేయికి
వేదాంతసార
తత్త్వోపదేశము
బోధించినట్లు
భాగవత,
బృహదారణ్యకోపనిషత్తులలో
ప్రసిద్ధమైనది
అసత్యములా?
ఏనాటికీ
కావు,
అవి
గట్టి
సత్యములే.
ఇక
మతంగ
మహర్షి
అనే
ఋషిపుంగవుడే
శబరికి
బ్రహ్మ
తత్త్వోపదేశము
చేసినట్లు
చెప్పే
శ్రీమద్రామాయణము
అబద్ధమా?
అవట్లుండనీ,
కలియుగములో
ఉభయభారతి
అను
సురేశ్వరాచార్యుల
ధర్మపత్ని
జగద్గురు
శంకరాచార్యుల
వారితో
బ్రహ్మవాదము
చేసిన
సంగతి
ఎరుగని
వారుందురా?
కాన,
ఎట్టివారికైననూ
వారి
సాధనా
తపస్సులే
కారణము
కానీ
జాతి,
మత,
లింగ
భేదములు
కారణము
కాదు.
అట్టి
అర్హతకు
తగినంత
సాధన,
తపస్సులాచరించవలెను.
కరుణానిధియైన
పరమాత్ముడు
అందరికీ
అందుబాటులోవాడే.
ఒకరికి
ఆ
నిష్ఠలో
అధికారము
కలదనియు,
మరియొకరికి
జ్ఞాననిష్ఠలో
అధికారము
లేదనియు
చెప్పుటకు
ఈశ్వరునికి
తప్ప
మరెవ్వరికీ
అధికారము
లేదు.
ఇంకనూ
లోతుగా
యోచించిన
తనను
పొందుటకు
నీకు
హక్కులేదని
ఈశ్వరుడు
కూడనూ
చెప్పలేదు.
తనవారు,
తన
బంధువులు
తనలో
చేరుటకు
వెనుదీయునా?
తప్పని
చెప్పునా?
ఒక
తండ్రికి
నలుగురు
పుత్రులున్నచో
కొందరికి
మాత్రము
తన
ధనమునకధికారము
కలదని
చెప్పుటకేమి
అవకాశము?
ఏమి
న్యాయము?
ఇంక
నిష్పక్షపాతియైన,
కరుణా
సముద్రుడయిన
పరమేశ్వరుని
పక్షపాతిగా
దూషించుట
కాదా
-
ఒకరికి
బ్రహ్మవిద్య
అధికారము
కలదనియు,
మరొకరికి
లేదనియూ
చెప్పు
విషయము?
గీతయందు
సాక్షాత్
కృష్ణుడు,
నాకొకడు
4
▾
Meaning
Keep
ప్రియుడుకానీ
అప్రియుడుకానీ
లేదు.
ఏ
కులమందు
జన్మించినా
స్త్రీకానీ,
పురుషుడుగానీ
నన్ను
భక్తితో
భజింతురో
అట్టి
భక్తులెవరైననూ
సరే
నన్ను
చేరుటకు
అడ్డులేదు.
నేనునూ
సదా
అట్టి
భక్తుల
హృదయమందుండునని
తెలిపెను.
కానీ,
గీత
ఒట్టిదందురా?
అది
గట్టి
మాటే.
కానీ
లోకమున
ఒక
తప్పుధారణ
కలదు.
బ్రహ్మనిష్ఠాభ్యాస,
జపము
చేయవలెనన్న
మొదలు
ఆచారనిష్ఠులు,
శుచులై
యుండవలెనని
అందురు.
అది
నాకంత
సమ్మతించదు.
ఎట్లన
రోగమందుండువానికి
కదా
మందు
అవసరము.
ఔషధము
సేవింపక
రోగమెట్లు
కుదురును?
శుచులై
ఆచారనిష్ఠులయిన
తరువాత
బ్రహ్మనిష్ఠాభ్యాసము
చేయవలెననునది
ఎట్లున్నదనగా
రోగము
కుదిరిన
తరువాత
ఔషధము
సేవింతునన్నట్లున్నది.
ఇవి
పిచ్చి
మాటలు.
ఔషధము
సేవించిన
తరువాతనే
రోగము
కుదురునను
సంగతి
ఇప్పటి
పరిస్థితిలో
చాలామంది
గమనించుటలేదు.
అదీ
ఒక
జబ్బే.
కానీ
అజ్ఞానమనే
మహారోగముచే
బాధపడువారు,
జ్ఞానప్రథమమగు
గ్రంథములు
చదువక,
పెద్దల
అనుభవములు
తెలిసికొనకపోయిన
వారికి
యధార్థములు
తెలియలేవు.
కాన
అనుభవమునకై
పెద్దల
నాశ్రయించి
యధార్థమును
తెలిసికొనవలెను.
ఇందులో
ఒక
రహస్యము
కూడా
ఉన్నది.
దానిని
బాగుగా
గమనించవలెను.
ఔషధమును
సేవించువారు
దానికి
తగిన
పథ్యమును
అజాగ్రతపరచరాదు.
పథ్యమే
ప్రధానము.
పథ్యము
సరిగాలేనిది
ఎంత
దివ్య
ఔషధమైననూ
ఫలము
కలుగదు.
ఈ
రహస్యమును
మాత్రము
మరువరాదు.
మందును
సేవించుచూ,
దానికి
తగిన
పథ్యమును
తు.చ.
తప్పక
నడుచుకొన్న
మహనీయులు
ఎంతమందో
పరబ్రహ్మమను
జ్ఞానమున
లీనమయినారు.
5
▾
Meaning
Keep
వారు
యే
తెగవారో
యోచించుడు!
వశిష్ఠుడు
చూతమా,
వేశ్యయందు
జన్మించెను.
నారదుడు
చాకలి
కన్యయందు
జన్మించెను.
వాల్మీకి
బోయవాని
యందు
జన్మించెను.
విశ్వామిత్రుడు
క్షత్రియునియందు
జన్మించెను,
మతంగపుంగవుడు
మాదిగ
స్త్రీయందు
జన్మించెను.
దీనిని
పట్టి
చూడ
పరమేశ్వర
ధ్యాననిష్ఠ
ప్రధానముకానీ,
కులమతములు
ప్రధానములు
కావు.
ఇట్టి
ఏకభావమును
నిరూపించి
నిదర్శనముగా
నిల్చునదే
జ్ఞానము.
అట్టి
యధార్థ
భగవత్
తత్త్వమును
చాటునదే
జ్ఞానము.
ద్వైతము
కానిదే
అద్వైతము.
అద్వైతమే
జ్ఞానము.
జ్ఞానమే
బ్రహ్మ.
చక్కెరతో
చేయబడిన
బొమ్మకు
పాదము
మొదలు
శిరస్సు
వరకు
ఒకే
విధమయిన
మధుర
ముండునుకానీ
చేయి
ఒకరుచి,
కాలు
ఒకరుచి,
తల
ఒకరుచి,
ముఖ
మొకరుచి
ఉండునా?
ఒకే
పరమాత్మయందవతరించిన
మానవులు
ముఖము
నుండి
పుట్టినను,
పాదము
నుండి
పుట్టినను,
బాహువుల
నుండి
పుట్టిననూ
ఒకే
పరమాత్మ
పుత్రులే
కదా?
ఈ
యధార్థమే
జ్ఞానము.
ఏ
అంగమైనా
పరమాత్మ
రూపములోనిదే.
మేడి
వృక్షము
చూడు,
వేర్లభాగము
నుండి
సుడి
పైభాగము
వరకు
చెట్టున
ఫలములు
పుట్టును.
ఎక్కడ
పుట్టిననూ
మేడి
ఫలములే
కానీ
వేరు
ఫలములు
కావు
కదా?
మరొక
ఫలములుగా
మారవు
కదా?
అందులో
కాయలూ,
పక్వములూ,
ఫలములుగా
ఉండవచ్చునే
కానీ,
ఇతర
జాతి
ఫలములు,
కాయలు,
పక్వములూ
ఉండబోవు.
రుచులు
కూడా
ఆయా
దశలకు
తగినట్లుండునేకానీ,
పైభాగము
తీపు,
క్రిందిభాగము
చేదు,
మధ్యభాగము
ఒగరు
అని
ఉండవు.
పిందె,
కాయ,
పండు
అనునవి
ఒక
గుణములనబడును.
6
▾
Meaning
Keep
జాతులు
కూడా
అట్లే.
నాలుగు
జాతులనగా
నాలుగు
తరగతుల
వారని
అర్థము.
ఈ
నాలుగు
తరగతుల
వారూ
వారి
వారి
గుణకర్మములననుసరించి
కలుగును.
ఒక
వృక్షమందున్న
కాయలు
ఒకే
సమయమున
కోసినచో
కొన్ని
పిందెలు,
కొన్ని
కాయలు,
కొన్ని
ఫలములుగా
ఉండును
కదా?
వీటిని
మూడు
భాగములుగా
విభజించినట్లు
జాతులను
కూడా
ఆయా
నిష్ఠలనుపట్టి
తెగలు
విభజించిరి.
సత్త్వగుణ
ప్రధానులై
బ్రహ్మనిష్ఠులగువారు
బ్రాహ్మణులనియూ,
రజోగుణ
ప్రధానులగువారు
క్షత్రియులనియు,
ఈ
రీతిగా
శాస్త్రములలో
వివరించి
చెప్పియుండునే
కానీ,
వేరు
రీతిగా
భావించరాదు.
సత్త్వరజస్తమోగుణములననుసరించియును,
తపోధ్యాన
నిష్ఠాది
కర్మములననుసరించియునూ
నాలుగు
జాతులుగా
భగవంతునిచే
విభజించబడినవని
గీతనే
తెలుపుచున్నది
గదా?
శూద్ర
కులమునందు
జన్మించిననూ,
బ్రహ్మనిష్ఠాపరుడైనచో
బ్రాహ్మణత్వము
నొందుచున్నాడు.
బ్రాహ్మణకులమందు
అవతరించియూ
బ్రహ్మనిష్ఠాదిగుణములు
లేనిచో
శూద్రుడగుచున్నాడు.
అధికమునకూ,
హీనమునకూ,
అనుష్ఠాననిష్ఠలే
కారణము.
ఆత్మతత్త్వము
కారణము
కాదు.
దానికి
భేదములు
లేవు.
అట్టి
ఆత్మతత్త్వమును
తెలిసికొనవలెనన్న
భక్తియే
సోపానము.
కడకు
భక్తి
జ్ఞానములు
రెండూ
ఒకటే
కాగలవు.
వాటిని
వేరువేరని
భావించరాదు.
పక్వముకాక
పండు
యెట్లుకాగలదు?
కాయకాక
పక్వము
యెట్లు
కాగలదు?
మూడూ
కడకు
ఒక్కటియే.
భక్తి
జ్ఞానములు
ఒక్కొక్క
సమయమందున్న
పేర్ల
మార్వేకానీ
పరిపక్వ
కాలమున
ఏకస్వరూపమును
పొందును
—
చెరుకుపాలు
కలకండగా
మారినట్లు.
7
▾
Meaning
Keep
నిర్మలమైన
భక్తిచే
జీవస్వరూపము
మారి
శివస్వరూపమగుచున్నది.
జీవస్వరూపమే
అజ్ఞానము.
శివస్వరూపమే
జ్ఞానము.
Previous
←
To Know That Which Is Eternal, That Alone Is Jñāna
Next
Only When Sādhakas Immerse Themselves in the Confluence of Bhakti, Jñāna and Vairāgya Does the Fruit Come Into Hand
→