Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · Only When Sādhakas Immerse Themselves in the Confluence of Bhakti, Jñāna and Vairāgya Does the Fruit Come Into Hand
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సాధకులు
భక్తి-జ్ఞాన-వైరాగ్య
త్రివేణిలో
మునిగిననే
ఫలితము
చేజిక్కును
ఒక
మలినమైన
తెల్లని
వస్త్రమును
సబ్బువేసిగానీ,
కూకుడుగాయి
వేసికానీ,
చవుడుగానీ
వేసి
బండపయిన
ఉతుకున్నప్పుడు
ఏలాగున
దాని
మలినము
పోయి
పూర్వస్థితివలె
శుభ్రవస్త్రమగుచున్నదో,
అలాగున
పరిశుద్ధమై
సచ్చిదానంద
స్వరూపమైన
ఆత్మను
ఆవరించిన
అజ్ఞానమనే
మలము
నివారణ
కొరకు
పరబ్రహ్మ
ధ్యానమను
సబ్బువేసి,
నిర్మల
నిష్ఠ
అను
జలమునందు,
వైరాగ్యమను
రాయిపై
జ్ఞానధ్యానములను
ఉతుకును
ఉతుకునపుడు,
నిజబోధ
స్వరూపమగు
బ్రహ్మాకారము
ప్రకాశించును.
సబ్బు
మంచిదిగా
ఉన్నను
జలము
మలినమయినదిగా
వుండిన
ఉతికిన
కష్టము,
సబ్బు
నష్టము
తప్ప
బట్ట
నల్లగానే
యుండును.
అందువలననే
ఈ
కారణము
చేత
కొంతమంది
ఎంతో
కాలము
బ్రహ్మనిష్ఠ
చేయుచున్నను
మనస్సు
పరిశుద్ధము
కలుగకున్నది.
అట్టిది
సబ్బుదోషం
కాదు,
జలదోషం.
అనగా
దినచర్యలు,
ఆచారములు
నికృష్టములగుటచే
మనశ్శుద్ధులు
కాలేదు.
ఈ
కారణములు,
అజ్ఞానముచే
గ్రహించుకొనలేక
దైవశాసనములు,
దైవప్రాప్తికొరకు
చేయు
ధ్యాన,
జపాది
సాధనలు
మమ్ముల
బంధించు
ఇనుపగొలుసులని
భావించుచున్నారు.
దైవశాసనములు
యెట్టి
వారికయినను
వర్తించును.
చక్రవర్తి
మొదలు
భిక్షకుని
వరకు
వర్తించును.
కానీ
శాసనం
అర్థం
చేసుకొనుటకు
2
▾
Meaning
Keep
బదులు
కొందరు
అవివేక
వ్యక్తులు
ఈ
శాసనములతో
కయ్యము
చేయుచుందురు.
వాటిని
ఖండించుదురు.
నేను
గరికను
నాటితే
గోధుమ
యెందుకు
పండకపోదు,
యెందుకట్లు
కావలయును
అస్పష్టుగా
వాదన
చేయుదురు.
గోధుమ
నాటిన
వివేకికి
గోధుమ
పంటయే
ప్రాప్తించును.
అజ్ఞాని
అయిన
వాని
వింతలు
దీనికి
వ్యతిరిక్తంగా
యుండును.
వీటిపై
ప్రత్యేక
అభిమానములుకానీ
ఉండవు.
ప్రపంచమందలి
అందరకు
రెండుకు
రెండు
కలిపితే
ఏ
సంఖ్య
ఏర్పడునని
మనం
విశ్వసించినను,
విశ్వసించకపోయినను,
అవి
నాలుగు
కాక
పోవు.
నాలుగు
కాక
తప్పదు.
సర్వభూతములందును
పరమాత్ముడున్నాడనునది
కొందరు
ఒప్పినను,
ఒప్పుకున్నను,
తాను
వారిని
వదలిపోడు
లేక
వదలి
వుండడు.
ఉన్నాడనునది
సత్యముగా
నిరూపించవలెనన్న
జ్ఞానదృష్టిని
సంపాదించుకొనవలెను.
ఆ
దృష్టిలేక
ఆ
పరబ్రహ్మాకారము
తెలిసికొనలేరు.
అజ్ఞానముచే
పరబ్రహ్మకు
అతి
దూరముగా
నుండిన,
దూరపు
వస్తువును
చూడగోరిన
టెలిస్కోపు
ఎట్లు
ఆధారమో,
అదే
రీతిగా
సర్వభూతాంతరాత్మ
అయిన
పరబ్రహ్మమును
చూడగోరిన
జ్ఞానదృష్టి
ఆధారము.
అట్టి
దృష్టిని
సంపాదించుకొను
శక్తి
సాధనలు
చేయక,
"అది
నే
నమ్మను,
నమ్మను"
అన్న,
అది
అమాయకులయిన
పసిపాపల
లక్షణములు.
అయితే,
మరికొందరు
విచిత్ర
వ్యక్తులు
బయలుదేరుచుందురు.
మాకు
దేవుడు
అక్కరలేదు,
దైవం
అక్కరలేదు,
మాకు
కావలసినది
సేవ
అనుచుందురు.
అట్టివారు
నిజంగా
ఆధ్యాత్మిక
మార్గమున
క్రింది
తరగతి
వారనే
చెప్పవచ్చును.
ఆధ్యాత్మిక
గమ్యము
యిది
అని
తెలిసిన
వారయివుండిన,
3
▾
Meaning
Keep
వారట్లు
తెలుప
వీలులేదు.
ఆధ్యాత్మిక
జీవిత
ఫలమే
నిస్స్వార్థ
సేవ,
అదే
నిష్కామ
కర్మ.
చెట్టు
లేక
పండ్లు
ఎట్లు
లభించును?
ఆధ్యాత్మికత్వమునకు,
నిస్స్వార్థసేవకు
ఆధారమగు
నిత్య
ప్రేమయను
పునాది
లేక
నిస్స్వార్థ
సేవ,
ఆధ్యాత్మికత్వం
అను
భవనము
నిర్మింప
వీలగునా?
ఇప్పుడు
ఈ
జగత్తు,
తగిన
కిమ్మత్తును
ఇవ్వకుండగనే
తగిన
లాభం
రావలెనను
అభిలాషపడు
వ్యక్తులతో
నిండియున్నది.
అట్టివారు
దైవం
కావలెనని
పెదవులతో
మాత్రం
చెప్పుదురేకానీ,
తమ
యావత్
కాలమును
'విత్తుయేదో
పండేది
అదే'
అను
శాసనమును
ఇసుమంతయూ
లక్ష్యపెట్టక,
రాత్రింబగళ్ళు
తమతమ
హృదయాలలోను,
మనస్సులలోను,
ధనదేవతారాధననే
చేయుచున్నారు.
పునీత
హృదయులగువారి
భక్తి,
ప్రేమయుతములగు
జీవితములు
గదా
ధన్యవంతములు!
నిస్స్వార్థ
సేవ
అట్టివారికే
సాధ్యంగానీ,
అన్యులు
పలికిననూ
అది
బూటకమే.
నిస్స్వార్థ
సేవ
చేయువారు,
"అందరు
భగవంతుని
బిడ్డలు"
అను
భావమును
స్థిరము
చేసికొని,
భగవంతుని
సర్వభూతాంతరాత్మగా
దృఢపరచుకొని,
అతనిపై
సంపూర్ణ
విశ్వాసము
గలిగినవాడే
చేయునేకానీ,
"భగవంతుడు
వద్దు,
భక్తి
వద్దు"
అన్న
వానికి
వ్యక్తిత్వము
యొక్క
అహంకారం,
ఆడంబరం
యెంత
త్రోసినను
అది
ఆవంతయూ
కదలదు.
ఎప్పుడు
అది
మారదో
ఇంక
స్వార్థము
రాక
తప్పదు.
స్వార్థమెప్పుడు
హృదయమున
సూచించుచుండునో
వాడు
చేయు
ఎట్టి
కార్యమయిననూ
సేవ
క్రింద
చేరదు.
అట్టి
దానిని
సేవ
అనుట
కూడా
స్వార్థమే.
ఇట్టి
వివేకమును
గుర్తెరుగు
వరకూ
అజ్ఞానము
మాయదు;
లోకమంతయు
వున్నది.
ఒక్కడే
దేవుడు,
అతని
సంకల్ప
సృష్టి
తప్ప
ఈ
లోకమున
వేరు
లేదనియు,
అతడే
అనేక
రూపనామముల
ధరించి
చెంతకు
వచ్చుచున్నాడను
4
▾
Meaning
Keep
ప్రేమ,
విశ్వాసములు
హృదయమున
స్థిరమగు
వరకూ
సేవను
సేవగానూ,
భక్తిని
భక్తిగానూ,
ధర్మమును
ధర్మముగానూ
పాటించవలెను.
యధార్థజ్ఞానం
తెలియగానే
భక్తి,
సేవ,
ధర్మము
అనునవి
అన్నియూ
ఒక్కటిగా
తోచును,
ఒక్కటి
అవును.
అదే
జ్ఞానముకానీ,
చెప్పునదొకటి
చేయునదొకటి
బూటక
జ్ఞానము.
దేహజ్ఞప్తితో
మానవుడు
ఏమి
చేసిననూ
స్వార్థముగాక
తప్పదు.
దేహజ్ఞప్తితో
నిస్స్వార్థసేవ
మానవుడు
ఏనాటికీ
చేయలేదు.
దైవజ్ఞప్తితో
విశ్వప్రేమ
వెలువడును.
దాని
ఆధారంతో
మానవుడు
ఎట్టి
కార్యమునయిననూ,
నిస్స్వార్థము
అని
అనుకోకనే
చేయును.
అట్టివాడు
స్వార్థమనికానీ,
నిస్స్వార్థమనికానీ
భావించడు.
అది
ఒక
భగవత్
కార్యముగా
తలంచును.
వెలుగే
జ్ఞానము.
వెలుగు
లేకున్న
అంధకారం
ఆవేశమగును.
వెలిగే
జ్ఞానదీపం
తనచేత
లేనపుడు
వాడు
చీకటి
ప్రయాణమే
చేయును.
చీకటిలో
అంతా
భయమే.
భయమే
అజ్ఞానము.
పెద్ద
అంధకారమే
అజ్ఞానము.
కాన,
జ్ఞానభాస్కరుని
వెలుతురులో
ప్రయాణం
చేయ
సంకల్పించిన
ధన్యుడు
కాగలడు.
తన
మూలమున
అందరినీ
ధన్యులుగా
చేయగలడు.
అట్టి
జ్ఞానం,
దైవభక్తి
లేని
వైరాగ్యం
కూడా
శోభించదు.
మానవుని
యందు
భక్తిజ్ఞానములు
లోపించిన
వానిలోని
విరాగసంస్కారం
కూడా
క్షీణించును.
ఇపుడు
ఆధ్యాత్మికంగా
అభివృద్ధికి
రాకపోవటానికి
ఇవియే
కారణములు.
భక్తి,
జ్ఞాన,
వైరాగ్యములను
వేరువేరుగా
తలంచి,
ద్వేషించుచున్నారు.
ఆ
మూడింటినీ
కలిపి
సాధన
సలిపిననే
గమ్యమును
తెలుసుకొనగలుగుదురు.
భక్తిలో
జ్ఞానవిరాగములు
ఉన్నవని
నిరూపించవలెను.
5
▾
Meaning
Keep
భక్తి,
జ్ఞానం
లేని
వైరాగ్యం;
భక్తి,
వైరాగ్యం
లేని
జ్ఞానం;
వైరాగ్యం,
జ్ఞానం
లేని
భక్తి
గమ్యమునకు
చేరదు.
కొంతవరకు
పుణ్యసంస్కారం
కలిగించవచ్చును
తప్ప,
దీని
వలన
"మేము
భక్తులు,
జ్ఞానులు,
విరాగులు"
అని
తెలుపుకొనుటలో
ద్రోహము
తప్పదు.
కాన,
సాధకులు
ఈ
త్రివేణిలో
మునిగిననే
ఫలితము
చేజిక్కును.
అట్టి
సాధనకు
మొదలు
పవిత్రత,
చిత్తశుద్ధి
ముఖ్యము.
లోకమున
అందరూ
సాధకులవలె
కనిపింతురు
కానీ,
గుణసంపత్తి
గలవారు
అరుదు.
ఒక్క
విషయం
చూడుడు.
గీతను
అనేక
పర్యాయములు
పారాయణం
చేయు
వారు
కలరు.
దానిలోని
700
శ్లోకములు
కంఠస్థము
చేసిన
వారూ
కలరు;
దాని
అర్థమును
సహితము
గంటవలె
వల్లించు
వారూ
కలరు.
అట్టి
వారు
యధార్థసారమును
మాత్రం
ఆచరణలో
పెట్టకుండిన
వారు
ఒక
గ్రామఫోను
ప్లేటువంటివారు,
కాన
సాధకులు
కారు;
అది
ఒక
సాధన
కాదు.
కన్నవీ,
విన్నవీ,
తిన్నవీ
కొంతవరకైనా
జీవితములో
గుణరూపకంగా
కనిపించవలెను.
అట్లు
మనోవాక్కాయములలో
చూపినవే
నిజవివేకముకానీ,
లేకున్న
అజ్ఞాన
అవివేకము
తప్ప
వేరుకాదు.
జ్ఞానులయినవారు
ద్వేషరహితులయి,
సర్వభూతప్రియులయి,
స్వార్థరహితులయి,
చెప్పునది
చేయునది
ఒకటిగా
ఉండవలెను.
అట్లుకాక,
అజ్ఞానులగు
సాధకులు
స్థూలశరీరము,
మనస్సు,
దాని
వృత్తులతోనే
ఐక్యమగుచున్నారు.
వాస్తవమునకు
ఈ
శరీరమనస్సులు
పరికరములు
మాత్రమే.
నిజమైన,
నిత్యమైన,
నిర్మలమైన
ఆత్మపురుషుడు
మనసుకు
వెనుకనున్నాడు.
మనోవృత్తులతోనూ
శరీరంతోనూ
కలిసిపోవుటచే
మానవుడు
అనేక
నష్టములతో,
దుఃఖములతో
నిండిపోవుచున్నాడు.
ఈ
బ్రహ్మాండమంతయూ
ఏది
రూపనామములుగా
6
▾
Meaning
Keep
కనిపించుచున్నదో
అంతయూ,
అన్నియూ
మనఃకల్పనలతోనే
సృష్టింపబడుచున్నది.
ఇట్టి
మనోవృత్తులనూ,
భావములనూ
అణచివేయ
కలిగినప్పుడే
నిజస్థితిని
తెలిసికొనగలుగుదురు.
తటాకములో
నీరు
నిశ్చలముగానున్నప్పుడే
అడుగుభాగమున
నున్న
ఇసుకను
చూడగలుగునట్లు,
మనశ్శాంతిని,
నిశ్చలత్వమును,
జ్ఞానమునూ,
చెదరగొట్టు
మనోవృత్తులు
అణచిననే
గానీ
నిజస్థితిని,
ఆత్మను,
బ్రహ్మమును
లేక
జ్ఞానమును
కనుగానలేకపోవుచున్నారు.
తాత్కాలికానందము
కొరకు
పాటుపడునటువంటి
మనోవృత్తుల
సంకల్పమునకు
చోటివ్వక,
ప్రత్యగాత్మను
తెలిసికొను
వచ్చు
శాశ్వత
బ్రహ్మానందమును,
అమృతత్వమును,
శాశ్వత
శాంతి,
అనంత
జ్ఞానం
మొదలగు
ఫలములను
తూచి
చూడవలయును.
ఎల్లప్పుడు
ఇట్టివి
జ్ఞాపకమునందుంచుకొనినచో
ప్రాపంచికానందము
కొరకు
ఆశపడెడి
వాంఛల
నుండి
విముక్తి
పొందవచ్చును.
అట్టి
జ్ఞానం
కలుగుట
వలన
వైరాగ్యము,
వివేకము,
ముముక్షత్వము
పొందవచ్చును.
అశాశ్వతములగు
ఇంద్రియానందములలోని
దోషములు
తీవ్రంగా
పరిశీలించి
చూచినచో,
'ప్రాపంచిక
దృష్టి'
అనగా
'మిధ్యాదృష్టి'
తొలగిపోవును.
బంగారము,
వెలిగారము
మొదలగు
వాటిని
కొలిమిలో
పెట్టి
కాల్చుట
వలన
యెట్లు
ధగధగ
మెరయుచూ
ప్రకాశము
కలుగుచున్నదో,
అట్లే
వైరాగ్యము,
యోగాభ్యాసము
వలన
మానవుడు
బ్రహ్మతేజస్సుతో
ప్రకాశించి
జ్ఞానభాస్కరునిలో
లీనమగుచున్నాడు.
ఇట్టి
దివ్యజ్ఞానమును
కలిగియుండుటే
సమాధి
అని
కూడనూ
పిలువబడుచున్నది.
ఈ
మార్గమున
నిగ్రహము
అధికంగా
కలవారికి
7
▾
Meaning
Keep
సహజజ్ఞానం
త్వరలో
వృద్ధిపొందును.
అవివేకము
అతిక్రమించిన
వారికి
ఆత్మజ్ఞానము
క్రుంగిపోవును.
ఓపికతో
చింతనము
వృద్ధిచేసి,
అంతరాత్మలో
ప్రత్యగాత్మను
చూడవలయును.
సమాధి
వలన
అభ్యుదయము
నిశ్శ్రేయము
కలుగుచున్నది.
దాని
వలన
మోక్షము
కలుగుచున్నది.
అహంకారము,
తన్మాత్రలు
మొదలగునవన్నియూ
అజ్ఞానము
వలననే
పుట్టుచుండును.
ఆత్మజ్ఞానము
యెప్పుడు
ఉదయించునో
వెంటనే
అజ్ఞానము
పటాపంచలయిపోవును.
అహంకార
మమకారములు
లేకుండుటే
ఆత్మజ్ఞానముదయించిన
దనుటకు
సాక్ష్యము.
వాసనారహితమే,
అహంకార
నాశనమే,
సర్వభూత
సమానమే
ఆత్మజ్ఞానసారము.
Previous
←
Bhakti to God Is the Foundation of the Lamp of Jñāna
Next
The Greatness of the Jñāni Is Not Possible Either to Describe or to Imagine
→