Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · The Greatness of the Jñāni Is Not Possible Either to Describe or to Imagine
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
జ్ఞాని
యొక్క
ఘనత
వర్ణించుటకు
కానీ,
ఊహించుటకు
కానీ
సాధ్యము
కానిది
చక్షువులు
లేకుండా
చూడవచ్చును,
చెవులు
లేకుండా
వినవచ్చును,
నోరు
లేకనే
మాటాడవచ్చును,
శరీరము
లేక
స్పృశించవచ్చును,
ముక్కులేకనే
వాసనలు
పీల్చవచ్చును,
మనస్సు
లేకనే
గ్రహించవచ్చును,
కాళ్ళు
లేకనే
నడువవచ్చును.
నీవు
పవిత్రమైన
శుద్ధ
అంతఃకరణమవు.
నీవే
పరమాత్మవు.
ఈ
నిజమును
తెలుసుకొనలేకనే
అజ్ఞానమున
మునిగి
కేవలము
కర్మేంద్రియముల
పైబడి
తపించుచున్నావు.
పంచేంద్రియములు
మనస్సుతో
కలిసియుండును.
జ్ఞానేంద్రియములు
చేయగల
పనులను
విడివిడిగా
మనస్సు
చేయగలదు.
గ్రుడ్డివాడు
పుస్తకము
చదువుచున్నప్పుడు
మనస్సు
యొక్క
కన్నుతో
చదువుచున్నాడు.
కానీ,
జ్ఞాని
దివ్యచక్షువు
ద్వారాను,
జ్ఞానదృష్టి
ద్వారాను
వినును,
చూచును.
గీతలో
చెప్పినట్లు
ప్రతిచోటనూ
చేతులు,
కాళ్ళు,
కళ్ళు,
నోరు
కలిగినవాడు
అంతయూ
వినును,
అంతయూ
చూచును,
అంతయూ
చేయును.
ఇంద్రియ
రహితుడయ్యూను
ఇంద్రియములు
చేయు
కార్యములు
నిర్వర్తించుచున్నాడు.
ఈ
రహస్యమును
తెలిసికొనవలెనన్న
జ్ఞానమార్గమెంతో
సహాయకారి.
సంపూర్ణ
జ్ఞాని
అయిన,
అతనే
ఇతను,
ఇతనే
అతను.
ఏకస్వరూపుడు
కాగలడు.
అపుడు
అగాధ,
అప్రమేయ,
అపరిచ్చిన్న
బ్రహ్మను
నేనే
అని
తలంచును.
2
▾
Meaning
Keep
నిప్పు
మండుచున్నప్పుడు
దాని
కాంతి
దూరము
నందు
కనిపించుచుండును.
కానీ,
దూరముగానున్నవారు
దాని
ఉష్ణమును
ననుభవింపలేరు.
అట్లే
జ్ఞానమనునది
ఇట్టిది,
అట్టిది
అని
వ్రాయుట,
చదువుట
సులభమే.
కానీ,
బ్రహ్మానుభవము
పొందినపుడే
జ్ఞానానందమనుభవించవచ్చును.
దీనికి
యెడతెగని
తపస్సు,
భగవత్
చింతన
చేయవలెను.
శుద్ధ
అంతఃకరణను
తెలుసుకొనుటకు
సాధనే
భక్తి;
దాని
గమ్యమే
జ్ఞానము.
ఒక
రసిక
ప్రియుడు
యేదయినా
నాటకమును
వ్రాయవలెనని
పూర్తి
ఆశ
యుండును.
కానీ,
వాడు
పుస్తకము
వ్రాయకమునుపే
వాని
మనసున
ఆ
నాటకము
పూర్తి
అయివుండును.
తరువాత
పుస్తకములో
వేరువేరు
రంగములు,
వేరువేరు
సీనులు
అమర్చుకొనకుండిన
నాటకము
వ్రాయవలయుననను
సంకల్పమే
వానికి
రాదు
కదా?
అయితే,
చూచు
ప్రేక్షకులకు
మాత్రము
సీను
తరువాత
సీను
చూచి
కథను
అర్థము
చేసుకొందురు.
అర్థము
చేసుకొన్న
తరువాత
ఆ
నాటకమును
పూర్తిగా
వారు
కూడా
వివరింతురు
కదా?
ఆలాగుననే
పరమేశ్వరునికి
భూత
వర్తమాన
భవిష్యత్
కాలములు
కరతలామలకముగ
యుండును.
త్రికాలములు
అతనికి
రెప్పపాటులో
గ్రాహ్యమయియున్నవి.
ఏలననగా,
అతడు
సర్వజ్ఞుడు,
ప్లానును
ముందుగా
వేసే,
ఈ
లోక
నాటకమును
ఆడించుచుండును.
ఆడు
వారికి,
చూచు
వారలకు
అవి
అర్థముకాక
తికమకలు
పడుచుందురు.
కడకు,
ఆట
అంతయూ
జరిగిన
తరువాత
దాని
సారాంశమును
తెలుసుకొనగలుగుచున్నారు.
కాన,
జ్ఞానసారము
ఇంత
మాత్రమున
అర్థము
కాదు.
దానిని
పూర్తీ
అనుభవించిన
తరువాతనే
దీని
కథ
పూర్తిగా
తెలిసి
తానునూ
ఆ
కథను
నిస్సంశయముగా
3
▾
Meaning
Keep
చెప్పగలదు.
కాన
జ్ఞాన
నాటకమును
చూచేటి
ప్రేక్షకులకు
ఒకటి
తరువాత
ఒకటి
అర్థము
కాగలవే
కానీ,
ఒక
రంగము,
ఒక
సీను
చూచినంత
మాత్రమున
అర్థము
కాదు.
అర్థముకకనే,
నేనొక
జీవుడను,
నేనొక
సాధకుడను
అను
మనోబుద్ధి
లక్షణములకు
లోబడి,
దుఃఖసంతోషముల
మధ్య
సమసిపోవుచుందును.
దీని
మర్మము
పూర్తిగా
తెలియగనే
తానే
నేను,
నేనే
తాను
అను
అంశము
స్పష్టమగును.
కాన
సాధనను
పూర్తిగా
సాగింపుటకు
ప్రయత్నము
చేయుడు.
సారమును
వెతుకుటకు
సాహసించకు.
ఇది
జ్ఞానులు
పడవలసిన
జాగ్రత్త.
ప్రతి
జీవుని
హృదయమందును
పరమాత్మ
జ్ఞానస్వరూపుడై
సూక్ష్మముగానూ,
స్థూలముగానూ
యున్నాడు.
కాన
అంతరంగమందున్న
ఆత్మ
సందర్శనము
చేయగలిగిన
జ్ఞానికి
ఎన్నడునూ
దుఃఖము
రాదు,
వుండదు.
ఆత్మయనునది
చీమలో,
ఏనుగులో
అణువు
నుండి
బ్రహ్మావరకూ
యున్నది.
ప్రపంచము
అతి
సూక్ష్మముగ
ఆత్మచేత
వ్యాపించియున్నది.
సాధకుడు
ప్రపంచ
ధోరణిని
త్యజించి
అంతర్ముఖుడై
ఆత్మయందు
దృష్టి
మరలింపవలెను.
మనోవృత్తులెచ్చట
నుండి
ఉత్పన్నమగుచున్నవో
గ్రహింపనగును.
అట్లు
గ్రహించినచో
సంకల్పములన్నియూ
నాశమొందును.
అటు
తరువాత,
బ్రహ్మాకారవృత్తి
నిరంతరాయముగా
కలుగును.
దాని
వలన
అతడు
సచ్చిదానంద
స్వరూపస్థితి
యందు
స్థిరపడును.
అట్టి
జ్ఞానిని
ఎట్టి
సుఖదుఃఖములునూ
అంటజాలవు.
అపుడు
తాను
ఆత్మానంద
సాగరమున
మునిగి
ప్రపంచమునే
మరచి
దానికతీతుడై
యుండును.
బ్రహ్మాభ్యాసమనగా
ఎల్లప్పుడూ
బ్రహ్మమునే
తలంచుట,
ప్రార్థించుట,
ఉపన్యసించుట,
అతనిలో
కలసిపోగలుగుట.
అందుకనే
పంచదశిలో
4
▾
Meaning
Keep
కూడా
ఇట్లే
చెప్పబడినది.
"తత్
చింతనమ్,
తత్
కథనమ్,
అన్యోన్యం
తత్
ప్రబోధనమ్!
ఏతత్
ఏకపరత్వంచ
జ్ఞానాభ్యాసం
విదుర్బుధాః!"
బ్రహ్మనే
తలచుట,
మాటాడుట,
చింతించుట
మొదలయినవి
జ్ఞానులచే
జ్ఞానాభ్యాసమని
తెలియును.
దీనినే
కృష్ణుడు
గీతలో
కూడనూ
బోధించెను.
"మచ్చిత్తా
మద్గతప్రాణా
బోధయన్తః
పరస్పరమ్;
కథయన్తశ్చ
మాం
నిత్యం
తుష్యన్తి
చ
రమన్తి
చ."
నా
యందే
మనస్సుంచి,
నాయందే
దాగి,
నన్ను
గురించి
ముచ్చటించుచూ
తెలుసుకొన్నవారు
తృప్తిపొంది
ఆనందించెదరు.
కాన
'బ్రహ్మచింతన'
అనెడి
పదమునే
'ఆత్మాభ్యాసమ'నియు,
'జ్ఞానాభ్యాసమ'నియుకూడా
వాడెదరు.
మనసు
విషయాసక్తివలననూ,
విక్షేపశక్తివలననూ,
బహిర్ విషయముల
మీదికి
పరువెత్తుచుండును.
కానీ
మరల
మరల
దానిని
లక్ష్యముపైకి
తెచ్చుచుండవలెను.
ప్రథమములో
అది
కష్టముగానున్ననూ,
మన
శిక్షణద్వారా
మనసును
నిలుపగలిగినప్పుడు
"ఓం"
అను
జపము
మీద
నిలువగలదు.
శిక్షణ,
శమ,
దమ,
ఉపరతి,
తితీక్ష,
శ్రద్ధ,
సమాధానము
అనెడి
ఉపాయములతో
మనస్సును
కట్టవలెను.
మనసును
భజనలు,
ప్రార్థనలు,
సత్యగుణములు,
సత్
ప్రవర్తన
మొదలగువాటితో
నింపి
క్రమేణా
బ్రహ్మాభ్యాసములోనికి
దింపవలెను.
ఆత్మయందు
ధ్యానము
సాగింపగా
సాగింపగా
మనసు
యందు
క్రొత్త
ఆసక్తులు
బయలుదేరును.
ఇట్టి
శిక్షణచేత
మనసును
ఇతర
విషయములపై
ఉరుకకుండా
హృదయ
గుహయందు
బంధింపవచ్చును.
అట్టి
సాధనయొక్క
ఫలితమునే
నిర్వికల్పసమాధి
అందురు.
అట్టి
సమాధి
ఫలితము
బ్రహ్మజ్ఞానమనబడును.
బ్రహ్మజ్ఞానఫలమే
మోక్షము.
లేక
జననమరణముల
బారినుండి
విముక్తి
అని
గాని
అనుచుందురు.
వాంఛలను
విసర్జించుట,
5
▾
Meaning
Keep
మనస్సును
నిర్మూలించుట,
తత్త్వజ్ఞానము,
ఈ
మూడున్నా
కలిపి
సాధన
చేయవలెను.
అప్పుడే
ఆత్మజ్ఞానము
లభించును.
ఈ
మూడింటిని
సమానముగా
ఆదరించని
యెడల
ఆత్మజ్ఞానము
పొందబడదు.
ఈ
మూడింటి
నుండి
ఏ
ఒక్కటి
చాల
కాలము
సాధించి
ఆచరణలో
పెట్టినను
కూడా
మనస్సును
నిర్మూలింపగల
వాసనలవు
పొందజాలము.
ఏలయనగా
వాసనల
ఫలితమగనే
ఇంద్రియభోగములందు
ఆసక్తి,
బంధనము
కలుగుచున్నది.
కనుక
వివేకము,
ఆత్మచింతన,
విచార,
శమము,
దమము,
వైరాగ్యము,
త్యాగము,
మొదలగువాటి
వలననే
మనోవాసనలను
నశింపచేయవచ్చును.
ఎప్పుడు
మనోవాసనలు
వశించునో
అప్పుడు
జ్ఞానము
ఉదయించును.
ఇట్టి
సాధకుడు
మెలకువగా
యుండవలెను.
ఇంద్రియముల
తిరుగుబాటు
యెప్పుడైననూ
యేనిమిషమైననూ
రావచ్చును.
యోగికికానీ,
త్యాగికికానీ
వచ్చిననూ,
తిరిగి
పోవుచుండును.
కానీ
ప్రపంచ
ధోరణియందుండు
వారితో
కలియుట
యెక్కువ
పొరపాటు.
యెల్లప్పుడునూ
తత్త్వజ్ఞానాభ్యాసమునందే
మునిగియుండవలయును.
కోరికలను
వృద్ధిపరచరాదు.
కాలమును
వృధాగా
గడుపరాదు.
ఒక
సుఖము
మరొక
సుఖమును
కోరును.
కాన
సుఖమును
కూడనూ
కోరుట
ఒక
కోరిక.
ఆ
కోరిక
కోరికలను
అధికపరచును.
అందువలన
సుఖమునే
కోరకుండుట
త్యాగములన్నింటిపైన
గొప్ప
త్యాగము.
అట్టి
త్యాగము
త్వరితగతినే
జ్ఞానస్థానమునకు
చేర్చును.
జ్ఞాని
లేక
ముక్తుని
స్థితి
ఎటులుండుననగా,
సుఖదుఃఖములు
మనసుయొక్క
ధర్మములు,
అవి
మానసిక
నవరణలు.
మనస్సు
నశింపగనే
దాని
చిహ్నములగు
సుఖదుఃఖములు
జ్ఞానిని
యెట్లు
అంటగలవు?
ఎప్పుడు
6
▾
Meaning
Keep
మనస్సు
దేహముతో
కలియునో,
అప్పుడే
బాధ
అనుభవింపగలడు.
మత్తుమందు
తీసుకొన్నప్పుడు
బాధ
తెలియదు
కదా?
ఎందువలన?
మనస్సు
దేహమునుండి
వేరగుచున్నది.
అలాగుననే
జ్ఞానికూడా
తన
మనస్సును
ఆత్మయందు
ఇముడ్చగలిగియున్నాడు.
మానసిక
శిక్షణవలన
మనస్సును
ప్రశాంతింపచేయవచ్చును.
అందువలన
జ్ఞాని
తన
ఆత్మయందే
ఆనందింపగలుగుచున్నాడు.
బయటనుండి
యెట్టి
ఆనందమునూ
కోరడు.
అతని
అన్ని
కోరికల
సంతృప్తియూ,
ఆత్మయందు
అనుభవించుచుండుట
వలన
బయట
తాననుభవించవలసిన
కోరికలేవియూ
తనకుండవు.
తన
సత్
సంకల్పమువలననూ,
సత్
కామమువలననూ,
జ్ఞాని
కొన్ని
సిద్ధులను
కూడా
పొందును.
అట్టి
తరుణమున
అతడేది
కోరిననూ
దానిని
పొందగలడు.
కాని
జ్ఞానియొక్క
ఘనత
వర్ణించుటకుకానీ,
ఊహించుటకుకానీ
సాధ్యము
కానిది.
భగవత్
ఘనతలు
యెట్లు
అసాధ్యములో
తనను
తెలిసికొని
తనలో
లీనమయినవాని
ఘనతలు
కూడా
అట్టివే.
అతనే
బ్రహ్మమగుచున్నాడు.
అందువలననే
"బ్రహ్మవిత్
బ్రహ్మైవ
భవతి"
"బ్రహ్మవిత్
ఆప్నోతి
పరం"
అని
శ్రుతులు
ఘోషించుచుండును.
అనగా
'బ్రహ్మను
తెలిసికొనినవాడు
ఉత్కృష్టుడగుచున్నాడు'
అని
దాని
అర్థము.
కాన
యెవరు
ఈ
లోక
మసత్యము,
బ్రహ్మయే
సత్యమను
దృష్టితో
చూచెదరో
వారికి
వాసనలన్నియు
మాయమగును.
అజ్ఞానము
పటాపంచలైపోవును.
జ్ఞానరత్నమును
దొంగిలించినది
మనసే,
కాన
ఆ
మనసను
దొంగను
శిక్షించిన
ఆ
రత్నము
చేజిక్కును.
బ్రహ్మస్థానమును
అలంకరింపవచ్చును.
ఆత్మజ్ఞానమునందిన
మహాత్ములను
తప్పక
పూజింపవలయును.
అట్టివారు
చాలా
పవిత్రులు.
బ్రహ్మము
శాశ్వతుడు,
ద్వంద్వరహితుడు.
7
▾
Meaning
Keep
స్వతంత్రుడు.
లోకమున
యెట్టివారయిననూ,
ఎంతటి
మహాపురుషలయిననూ,
ఎన్ని
విధముల
తపస్సులు,
ధ్యానములు
సలిపినవారయిననూ
కడకు
పొందతగిన
సామ్రాజ్యము,
చేరవలసిన
గమ్యము,
అదియే.
ఇదియే
బ్రహ్మరహస్యము;
ఉపనిషత్
శాస్త్రవేదముల
రహస్యము.
ఈ
రహస్యమును
తెలిసికొనుటే
జ్ఞానియొక్క
సాధన
ఫలము,
జ్ఞానియొక్క
గమ్యము.
అదే
మోక్షము,
జన్మసార్థక్యము.
సత్యాసత్యములను,
జ్ఞానమను
ఖడ్గమునకు
బలి
ఇవ్వవలెను.
ఏ
జ్ఞానము
వలన
వాటిని
త్యాగము
చేసితిరో
ఆ
జ్ఞానమే
లోకమును
దూరముచేసి
లోకేశుని
నివాసము
చేర్చును.
ఆ
నివాసమే
విజ్ఞానంద,
పరమానంద,
బ్రహ్మానందమనబడును.
Previous
←
Only When Sādhakas Immerse Themselves in the Confluence of Bhakti, Jñāna and Vairāgya Does the Fruit Come Into Hand
Next
The Jñāna Gained Through Inquiry into the Manas's Own Meaning Alone Puts an End to Māyā
→