Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · The Jñāna Gained Through Inquiry into the Manas's Own Meaning Alone Puts an End to Māyā
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మనోవ్యాఖ్యార్థ
విచారముచే
కలిగిన
జ్ఞానమే
మాయకవధి
అద్వైతబ్రహ్మమందు
ఆవరణ,
విక్షేపశక్తి
సామర్థ్యముచే
జీవేశ్వర
జగద్రూపభ్రాంతిని
గల్పించుటే
మాయాకార్యము.
ఎట్లనిన,
అవ్యక్తముగా
వుండు
శక్తి
మనోరూపముగా
ఎప్పుడు
వ్యక్తమగునో,
అప్పుడు
'జగ'మను
వృక్షముల
అంకురములుగనుండు
మనోవాసనలు
మొలచుచున్నవి.
కనుక,
మనోవిలాసముగానుండు
సంకల్పవాసనలచే
జగంబు
స్వప్నరీతి
గల్పింపబడినది.
దానిలో
బడిన
జీవేశ్వరులును
జగదంతర్భూతులగుటచే,
జగమువలె
మనోవిలాసకల్పితులే.
స్వప్నమునందు
కనబడు
జగంబంతయును
మనోవిలాసము.
ఆ
స్వప్నమున
తోచు
జీవేశ్వరులును,
దాని
అంతర్భూతులు.
కనుక,
మనోవిలాస
శక్తిచే
కల్పితులగును.
గోడపై
జీవేశ్వరజగంబుల
చిత్రించిన
ఆ
చిత్రజగంబునందేకదేహులగు
జీవేశ్వరులును
దాని
అంతర్భూతులే.
కనుక,
వర్ణముచే
ఆరోపింపబడినటులను,
మనోవిలాస
కల్పనామయమగు
జగంబు
ననేకదేశులుగ
అంతర్భూతులుగనుండు
జీవేశ్వరులును
మనోవిలాసకల్పితులే,
సంశయములేదు.
మాయ,
జీవేశ్వరులను
యాభాసముల
కల్పించినదని
శ్రుతియు,
"వాడు,
నేను,
ఇది,
అది,
నా
వాడు,
నా
ధనము"
అను
నానావిధముల
మనోవాసనయే
ఇంద్రజాలము
రీతి
నృత్యము
చేయుచున్నదని
వాశిష్ఠస్మృతియునూ
వచించినది
కదా?
2
▾
Meaning
Keep
ఈ
స్మృతియందు
"సోహమిదం"
అను
పదముల
మూటచే
జీవేశ్వరజగంబులను
మూడును
చెప్పబడినవి.
"సః"
అను
'తత్'
పదముచే
'వాడు'
అను
పరోక్షత్వాదిగుణములుకల
'ఈశ్వరుడు'
చెప్పబడినాడు.
"అహ"మను
పదముచే
'నేన'ను
అభిమానియై
కర్తృత్వాది
గుణములు
కలవాడగు
'జీవుడు'
చెప్పబడినాడు.
"ఇదం"
అను
పదముచే
'ఇది'యని,
'నాది'
అని
భోగ్యరూపమగు
సకలజగంబును
జెప్పబడినది.
కనుక,
ఇట్లు
శ్రుతి,
స్మృతి
యుక్తి
అనుభవములచే
జీవేశ్వరజగంబులు
మనోవిలాసకల్పితములనుట
సిద్ధమాయెను.
దీని
అనుభవమెట్లనిన,
జాగ్రత్స్వప్నములందు
మనోవాసనలు
మొలకెలెత్తగనే
జీవేశ్వరజగంబులు
కనబడుచున్నవి.
సుషుప్తి
మూర్ఛాదులందు
అవి
మరుగైనప్పుడు
కనబడకపోవుచున్నవి.
ఇవి
సర్వజనానుభవమే!
జ్ఞానముచే
వాసనలన్నియును
బాగా
నివృత్తికాగా
జీవేశ్వరజగంబులును
నివృత్తి
అగును.
పూర్ణదృష్టిచే
నద్వైతజ్ఞానులగు
మహాత్ములు
జీవేశ్వరజగంబునంతయు
వదలి,
అద్వైతమును
అనుభవించుచున్నారు.
మనోవ్యాఖ్యార్థ
విచారముచే
కలిగిన
జ్ఞానమే
మాయకవధి.
మాయ
అవిచారమునుపజీవించునందున
విచారముచే
నశించును.
కాన,
విద్యయే
మాయకవధి.
ఎట్లనిన,
జ్వరాదిరోగములు
కర్మముచే
కలుగునవి.
అపథ్యము
నుపజీవించి
అపథ్యము
పెరుగ
పెరుగ
పెరుగునట్లును,
రజ్జువునందుగల
మాయ
రజ్జుస్వరూపమును
విచారించని
అవిచారము
నుపజీవించి
పెరిగి
సర్పమును
జూపి
దృఢముగనున్నట్లును,
మాయ
అకారణముగా
స్వతస్సిద్ధమై
అనాదిగా
నుండిననూ,
ఆత్మస్వరూపమును
విచారించని
అవిచారమునుపజీవించి
జగదాదులను
జూపుచు
దృఢమై
గాఢాంధకారమువలె
వృద్ధిచెందును.
3
▾
Meaning
Keep
ఈ
రీతి
అవిచారముచే
పెంపొందిన
గాధాంధకార
మాయ,
విచారముద్భవించుటచే
అవిచార
జీవనము
నశించగ,
స్వకల్పిత
జగదాదులతో
నశించును.
విచారమునకు
పూర్వము
త్రాటియందు
తోచిన
సర్పమును
చూపు
శక్తియు,
విచారముచే
వేరుగాక
మాయమై,
త్రాడు
మాత్రము
మిగులు
విధమున,
విచారమునకు
ముందు
తోచిన
మాయయు,
మాయావిలాసకల్పిత
జగంబును,
విచారానంతరము
పరబ్రహ్మమునకన్యముగాక,
మాయమై,
బ్రహ్మము
మాత్రము
మిగులును.
ఒకే
వస్తువు
రెండు
విధములుగ
యెట్లు
తోచునన్న,
అద్వైత
సన్మాత్ర
బ్రహ్మమొక్కటియే,
విచారమునకు
పూర్వము
వేరుగ
జగదాకారముగ
తోచినది.
విచారానంతరము
స్వభావముగా
కనపడినది.
ఉదాహరణమునకు:
మృత్తే
విచారమునకు
పూర్వము
ఘటముగ
తోచినది.
విచారానంతరము
మృత్తుగ
ఏర్పడినది.
విచారమునకు
పూర్వము
కటకమకుటకుండలాది
భూషణములుగా
తోచిన
కనకమే,
విచారానంతరము
కనకముగ
తోచినది.
అట్లే,
విచారముచే
తోచునేకాద్వైత
సజాతీయ,
విజాతీయ,
స్వగతభేదశూన్య
బ్రహ్మమొక్కటియే
కాలత్రయమున
నుండు
వస్తువు.
దాని
యందు
'మాయ'
అని
'జగ'మని
యే
కల్పనగానీ,
యెప్పుడు
గానీ
లేదనెడి
ఈ
బుద్ధియే,
"విద్య".
ఈ
విద్యయే
అవిద్యకవధి.
"శశిశృంగము"
అను
పేరు
మాత్రమే
గానీ
స్వరూపము
లేని
విధమున,
మాయని
చెప్పుట
మాత్రమేగానీ
స్వరూపము
లేదని
విచారముచే
తత్త్వమును
తెలిసిన
జ్ఞానులు
"శశిశృంగమువలె
మాయ"యని
చెప్పుటచేత,
జ్ఞానముచే
నిష్ఫలమై
శూన్యమైపోవుటయే
మాయకు
ఫలము.
అటులైనచో
అందరూ
ఆ
విధముగ
యేల
చెప్పుట
లేదనిన,
అజ్ఞానులు
మాయను
4
▾
Meaning
Keep
"సత్య"మందురు.
విచారపరులది
"అనిర్వచనీయ"మందురు,
జ్ఞానులు
"శశిశృంగసమాన"మందురు.
ఇటుల
మూడు
విధములుగ
తమతమ
దృష్టికి
తోచునటుల
జెప్పుదురు.
విచారపరులుకాని
బాలురకు
ఏదో
ఇచ్చట
భూతమున్నదని
అబద్ధమాడిన
ఆ
మాటను
నమ్మి
భూతము,
పిశాచము
సత్యమని
తలచి
వారెటుల
భయపడుదురో,
ఆ
రీతి
విచారము
లేని
అజ్ఞానులు
అబద్ధప
మాయచే
మోహపరవశులై,
దానిని
"సత్య"మందురు.
విచారపరులు
శాస్త్రముచే
'సత్యబ్రహ్మమును',
'అసత్యజగమును'
విచారించినపుడు,
రెండింటికినీ
విలక్షణమగు
'మాయ'
ఇట్టిదని
నిశ్చయింపజాలక
"అనిర్వచనీయ"మందురు.
విచారించి
బాగుగ
వెరిగిన
జ్ఞానులు
మరణించిన
తల్లి
పుత్రునిచే
దహింపబడినట్లు,
విద్యచే
మాయ
దహింపబడి
భస్మమైనందున,
కాలత్రయమందును
"మాయ
లేద"ని
వచింతురు.
విచారముచే
మాయ
శుద్ధముగా
తోచినపుడు,
విద్యగ
పరిణమించుట
చేతను,
మాయయందే
జ్ఞానముత్పన్నమగుట
చేతను,
మాయకు
'విద్య'
పుత్రుడని
చెప్పబడినది.
అవిచారముచే
జీవించిన
మాయకు,
విచారముచే
అంత్యకాలము
వచ్చినది.
అంత్యకాలమునకు
ప్రాణనాశార్థమై
ప్రసవించినటుల
మాయయు
తన
నాశము
కొరకై
విద్యయను
పుత్రునిగని
మరణించినది;
తక్షణము
విద్యయే
దహించివేసినది.
వృక్షముతో
కూడా
వృక్షమొఱయుటచే
దాని
యందు
ద్భవించిన
వహ్ని
దానిని
దహించు
విధమున,
మాయయందు
పుట్టిన
విద్య
మాయను
దహించును.
ఇటుల
విద్యచే
దహింపబడి
భస్మమయినందున
మాయ
5
▾
Meaning
Keep
"శశిశృంగము"
రీతి
నామమాత్రము
మిగులుటచే
అబద్ధమందురు,
జ్ఞానులు.
ఇది
మాత్రము
కాదు.
యేది
లేదో
అది
'అవిద్య',
'మాయ'
అను
పేరు
చేతనే
అబద్ధమని
స్పుటముగ
తెలుసుకొనవచ్చును.
ఇట్లు
విద్యచే
దహింపబడి
వ్యర్థమై,
నిష్ఫలమై,
శూన్యమై,
అసత్యమైపోవుటయే
మాయకు
ఫలము.
విద్యయుండుటచే
మాయ
సత్యము,
సఫలమనిన,
అవిద్యాపరిణామమగు
విద్య
సత్యమైన
యెడల
కదా
మాయ
సత్యమని
తెలుపవలెను.
విద్యచే
అవిద్య
నశించినతోడ,
ఆ
విద్యయు
నశించుచున్నది.
వృక్షకర్షణముచే
పుట్టిన
అగ్ని
వృక్షమును
కాల్చి
తరువాత
తానునూ
నశించునటుల,
కటకరేణు
(చిల్లగింజ)
జలమందుండు
కల్మషమును
పోగొట్టి
తానునూ
నశించు
రీతి,
విద్యయూ,
అవిద్యను
నాశనము
చేసిన
తక్షణమే
తానునూ
నశించును;
కనుక
వ్యర్థమయి,
శూన్యమయిపోవుటే,
ఫలమగుటయే
జ్ఞానము.
Previous
←
The Greatness of the Jñāni Is Not Possible Either to Describe or to Imagine
Next
Seeking Out the Truth Alone Must Be the Mark of the Jñānis
→