Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · Seeking Out the Truth Alone Must Be the Mark of the Jñānis
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
యథార్థమును
వెదకుటే
జ్ఞానుల
లక్షణముగా
వుండవలెను
వేదాంత
శ్రవణమున
కలిగిన
జ్ఞానమును
'అపరోక్షమ'నకూడదు.
అభాసావరణముండి
ప్రత్యక్షముగా
తెలియనీయక
దాచుటచే,
అది
అపరోక్షమెట్లగును?
కాదు,
'పరోక్షమే'.
శ్రవణముచే,
సచ్చిదానంద
బ్రహ్మస్వరూపము
తోచినను,
పంచకోశ
సాక్షియు
తానునగు
బ్రహ్మమును
ప్రత్యక్షముగా
చూడలేదు.
"చతుర్భుజుడును,
శంఖచక్రగదాపాణియునగువాడు
విష్ణుమూర్తి"
అని
శాస్త్రముచే
తెలిసిననూ,
ధ్యానముచే
మనంబున
తోచినను,
కనులార
ప్రత్యక్షముగా
చూడని
'మూర్తి
ప్రతిపాదక
శాస్త్రజన్యజ్ఞానము'
పరోక్షమేగానీ,
అపరోక్షము
కానటుల
–
'శ్రవణజన్య
జ్ఞానము'
కూడ
అపరోక్షము
కాదు.
విష్ణుమూర్తి
తాను
గాక
తనకన్యమగుటచే,
దానిని
శాస్త్రముచే
నెరిగిననూ,
అది
పరోక్షమే
అయ్యెను.
ఇచ్చటనది
కూడదు.
కారణము,
బ్రహ్మము
తన
కన్యముగాక,
తానుగా
నుండుటను
తెలియని
వాడు
"నీవే
బ్రహ్మ"మని
తత్త్వమస్యాది
మహావాక్యములు
ప్రతిపాదించుటను
విని
తెలిసిన
తక్షణము
బ్రహ్మమును,
తానుగ
ప్రత్యక్షముగ
తెలియవచ్చునుగదా?
తనకన్యమగు
స్వర్గాదుల
వలె
శాస్త్రముచే
పరోక్షముగ
యెరుగవలదని
శంక
గలిగినచో
అట్లు
చెప్పకూడదు.
ఎందుకనగా
శాస్త్రములందు
మహావాక్యములచే
"నీవే
బ్రహ్మ"మని,
తానే
బ్రహ్మముగా
చెప్పబడినది.
2
▾
Meaning
Keep
సందేహము
లేదు.
ఇందున,
అటులైనను
దానిని
శ్రవణము
చేయుటచేతనే
అపరోక్షజ్ఞానము
కలుగదని
చెప్పియున్నదే
దీనికి
ప్రమాణము.
శ్రవణ
ప్రకరణమును
శ్రద్ధతో
పరామర్శించి
చూచువాడాత్మ
స్వరూపమును
పరోక్షముగా
తెలిసి
దానిని
అపరోక్షముగా
నెరుగుటకై
సాధనముగనుండు
'మననము'
నపేక్షించును.
ఆత్మ
సర్వగతమై
అన్నిట
నుండిననూ,
ఆకాశమువలె
నంటనిదై
ఆకాశాతీత
చిదాకాశ
స్వరూపముగ
నుండుటచే
అవసరమని
"అసంగో
హ్యయం
పురుషః"
మొదలగు
శ్రుతులు
చెప్పెను
గదా?
ఆత్మ
యసంగమై
దేనినీ
తాకనిదై,
సర్వాతీతమై,
యుదాసీనమై
భిన్నముగ
నుండిన
పరిచ్ఛిన్నమని
సందేహింప
తగదు.
ఆత్మ
'త్రివిధ
పరిచ్ఛేదశూన్యమూ'
కావున
పరిచ్ఛిన్నము
కాదు,
పూర్ణమే.
ఎట్లనిన,
'ఆత్మ
ఒక
దేశమందున్నది,
మరొక
దేశమునందు
లేద'నుట
లేక
సర్వమున
వ్యాపించి
అన్ని
దేశములందుండు
కారణమున
'దేశపరిచ్ఛిన్నము'
కాదు.
ఆత్మ
ఒకప్పుడు
కలదు,
మరొకప్పుడు
లేదనుట
లేక,
నిత్యమై
ఎల్లప్పుడుండు
కారణమున
'కాలపరిచ్ఛిన్నము'
కాదు.
ఆత్మ
తప్ప
అన్య
వస్తువు
లేక
సర్వాత్మకమై
అన్నియు
తానుగ
నుండుటచే
'వస్తుపరిచ్ఛిన్నము'
కాదు.
ఇట్లు
'త్రివిధ
పరిచ్ఛిన్నము'
కాని
ఆత్మ
పరిపూర్ణమనుటే,
సంపూర్ణ
జ్ఞానము.
ఇదియే
సత్యము.
ఆత్మ,
వ్యాపకాకాశమురీతి
అన్నిట
వ్యాపించుటచే
వికారము
కాదా?
అని
కొందరు
శంకించవచ్చును;
అదికాదు.
పెరుగుట,
పరిపాకము
జెందుట,
క్షీణించుట,
నశించుట,
వీటినే
అస్తి,
జాయతే,
వర్ధతే,
పరిణమతే,
అపక్షయతే,
నశ్యతే
అను
షడ్భావవికారములు
కల
ఆకాశాది
భూతములన్నిటిని
తెలియు
"సర్వసాక్షి"యగుటచే
ఆత్మ
యేవికారములూ
లేని
'నిర్వికారము'.
ఆత్మ
నిర్వికారమనిన
వికారవస్తువులు
3
▾
Meaning
Keep
కొన్ని
వేరున్నవనవచ్చుటచే
'అద్వైత'మనక
రెండవ
వస్తువు
గలదగు
'సద్వయ'మని
చెప్పవలయుననిన
కూడదు.
'ఆత్మేతరములేవియూ
లేక'
అన్నియూ
తానేయగుట
వలన
సద్వయము
కాదు,
'అద్వయమే'.
ఏదియూ
ఆత్మేతరము
కాదనిన
నద్వైతమే.
సందేహము
లేదు,
రాదు.
సకలము
ఆత్మేతరము
కావనుటేల?
ఆత్మ
సకలమునకూ
కారణమగుటచే,
అవి
ఆత్మేతరములు
కావు.
కార్య
కారణములకు
భేదము
లేదు.
కారణమును
వదలి
కార్యము,
కార్యమును
వదలి
కారణము
వేరుగానుండదు.
ఆత్మ
యెటుల
సర్వకారణము?
అని
శంకించవచ్చు
కొందరు.
సర్వద్రష్ట
అనగా,
సర్వమును
నెరుగునదియు
అగుటచే
ఆత్మ
సర్వకారణమాయెను.
లోకములో
మిధ్యాపదార్థములన్నిటికి
చూచువాడే
కారణమని
కంటిమి.
'శుక్తియందు
తోచు
రజత
భ్రాంతి'కి
దానిని
కనువాడే
'యుపాదాన'
కారణమనియు,
స్వప్నభ్రమకు
ద్రష్టయే
యుపాదాన
కారణమనియు
కంటిమి.
అట్లే
జగత్తునందు
తోచు
సర్వ
జగద్భ్రాంతికి
ద్రష్టయైన
ఆత్మయే
యుపాదాన
కారణము
గదా?
సర్వజగమును
భ్రాంతియైన,
ఆత్మ
కారణమా
కానిమ్మా.
జగంబంతయూ
భ్రాంతి
యనుటెటులనిన
ప్రళయమునం
దద్వైతమైయుండు
ఆత్మయందు
రజ్జు
సర్పము
రీతి
మాయచే
నామరూపములు
కల్పింపబడినవని,
శ్రుతులు
కూడనూ
చెప్పెను
కదా?
ఆత్మయొప్పుడును
ప్రియమనిన,
ఒక
వస్తువుకంటె
మరియొకదానియందు
ప్రీతి
అధికమై
మారుచుండుట
వలననూ,
అది
సాతిశయమయి
అశాశ్వతముగనున్నది.
ఆ
ప్రీతి
మోహజనితము
కాని,
స్వభావము
కాదు.
చూడు.
సారరహితగోశల్యమందు,
శ్వానము
మోహముచే
తన
నోటి
రక్తమునే
దాని
సారమని
తలచి
ప్రీతినిజెంది
మరొక
యెముక
ముక్కను
జూడగనే
దీనిని
4
▾
Meaning
Keep
వదలి
దానిని
యెక్కువ
ప్రీతినిగొనుచున్న
విధమున
మాయా
కల్పితమయి
దుఃఖస్వరూపమే
స్వభావముగాగల
అన్యవస్తువులయందు
మోహముచే,
ఆత్మ
తన
స్వభావ
ప్రియత్వము
నారోపించి
అవి
అతి
ప్రీతికరములని
చూచుటేగాని,
నిజమున
అవి
అట్టివి
కావు.
అవి
దుఃఖరూపములే.
ఇట్లు
మోహజనిత
విషయ
ప్రీతి
మారునదిగాన,
సాతిశయమేగాని
నిరతిశయము
కాదు.
ఆత్మ
ప్రీతి
అటుల
మారక
దేహాదులు
వదలినను
తన్ను
వదలజాలక
యెప్పుడును
తనయందు
ప్రీతి
జూడబడుటచే
నిరతిశయమయినది.
ఆత్మయందందరికీ
ప్రీతి
కలదు.
కనుక
అది
పరమానందరూపము.
ఇందువలనే
ఆత్మకు
'సచ్చిదానందరూపమ'ని
చెప్పబడెను.
ఈ
సత్,
చిత్,
ఆనందమను
మూడును
ఆత్మకు
స్వభావములా?
గుణములా?
అని
అనుమానింతురు.
అగ్నికి
లోహితోష్ణ
ప్రకాశములు
స్వభావములు
కానీ
గుణములు
కావు.
అట్లే
ఆత్మకు
పై
సత్,
చిత్,
ఆనందములే
స్వభావములు
కానీ,
గుణములు
కానేరవు.
సత్,
చిత్,
ఆనంద
రూపములుగల
ఆత్మయు
మూడా?
అనిన
లోహితోష్ణ
ప్రకాశములు
మూడు
స్వభావములను
గల
అగ్ని
ఒకటిగానీ
మూడెట్లగును?
రస,
శైత్య,
ద్రవ
స్వభావములుగల
జలము
ఒకటే
కదా!
సచ్చిదానందములు
స్వభావములుగా
గల
ఆత్మ
ఒకటియేగాని
అనేకము
కాదు.
ఆత్మ
ఒకటై
సర్వమునందుండి
సర్వమును
నెరుగుటచే
సర్వగతము.
కోశసాక్షియైన
ప్రత్యగాత్మకు,
సర్వజ్ఞత్వమెటులనిన,
సకలభూత
భౌతికములన్నింటిని
తానే
యెరుగుచున్నదికానీ,
ఇతరమేదియు
ఎరుగుటలేదు.
ఆత్మేతరములన్నియు
జడములగుటచే
అవి
యెరుగవు.
ఘటమునందున్న
ఆకాశమును
ఘటములెరుగునా?
అవి
యెరుగకున్నను
5
▾
Meaning
Keep
ఘటమునందు
ఆత్మ
ఉన్నదే
కదా!
కానీ,
ఇంద్రియసన్నిధి
నుండు
జడపదార్థముల
ఆత్మ
యెరుగుచున్నది.
ఇంద్రియ
ప్రత్యక్ష
దేహ,
గృహ,
క్షేత్ర,
గ్రామ,
పుర,
దేశములన్నియు
యెరుగబడినవై
తన
జ్ఞానమున
తోచుచున్నటులనే,
ప్రత్యక్షముగ
యెరుగబడనివిగ
నుండు
మేరు,
స్వర్గాది
జడములును
తన
జ్ఞానమందు
తోచుచున్నవిగానీ,
వెనుక
తోచుట
లేదు.
వంధ్యాపుత్ర
సమానములగు
గ్రామ,
పుర,
దేశాదులు
లేనివైనను
ఉన్నటుల
మనోవాసనాకల్పితములయి
తెలియబడినవిగ
యెరుకయందు
తోచురీతినసత్తగు
మేరు
మొదలగునవి,
తెలియబడనివిగ
మనోకల్పితములయి
యెరుకయందు
తోచుచున్నవని
తెలియవలెను.
స్వప్నమందు
అనేక
దృశ్యములు
తెలియబడినవయిననూ,
అవి
సత్యములుకాక,
స్వప్నపదార్థములు,
మనోకల్పితములయి
స్వప్నసాక్షియగు
తన
యెరుకయందే
తోచుచున్న
విధమున,
జగత్తునందు
సకలపదార్థములును
రెండు
విధములుగా
మనోకల్పనలచే
తనయందే
తోచుచున్నవి.
లేనిచో
'నేను
మేరు
స్వర్గాదుల
నెరుగ'నని
లోకమున
చెప్పక
వుండవలెను
కదా?
కాన
ఇట్టి
యథార్థమును
వెదకుటే
జ్ఞానుల
లక్షణముగా
వుండవలెను.
Previous
←
The Jñāna Gained Through Inquiry into the Manas's Own Meaning Alone Puts an End to Māyā
Next
Only When the Manas Dissolves Does the Experience Indeed Come
→