Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · Only When the Manas Dissolves Does the Experience Indeed Come
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మనంబు
లయించిన
కదా
అనుభవము
కూడును
లోకమున
"సాక్షాత్కారము
గాంచితిని"
అని
కొందరు
తమకు
తాము
చెప్పుకొందురు!
అది
ఎట్లు
సత్యము?
"అహం
బ్రహ్మాస్మి"
అను
వాక్యములచే,
"నేనే
బ్రహ్మమ"ని
యెరుగునపుడు,
'నేన'ను
జీవి
'వికారి';
కాన
వికారియగు
అహంకారి
తాను
బ్రహ్మమని
యెటుల
తెలుపును?
ఎరుగజాలదు.
దరిద్రుడెటుల
తాను
రాజని
యెరుగజాలడో,
అటులనే
వికారియగు
జీవుడును
నిర్వికారియగు
బ్రహ్మము
తానని
నిరూపించలేదు,
యెరుగజాలడు.
'నేన'ను
జీవుడు
యెవడని
విచారించినచో,
సాక్షియై,
నిర్వికారమైయుండు
'ఆత్మ'యే
తన
స్వరూపమని
విచారించని
అజ్ఞానముచే,
'నేను'
అను
అహంకారియై,
వికారియైన
'జీవుడ'ని
యెన్నుకొనుచున్నాడు.
అతడే
విచారించి
చూచినపుడు
"నేను
వికారి
కాను;
వికారియగు
అహంకారమునకు
సాక్షి"
అను
తన
తత్త్వమును
తెలిసి,
తరువాత
నిర్వికార
సాక్షి,
"అహం
బ్రహ్మాస్మి"యని
యెరుగుటలో
విరోధమేమి
కలదు?
సాక్షియే
"అహం
బ్రహ్మాస్మి"యని
యెరుగునని
ఎటుల
చెప్పవచ్చును?
"అహం
బ్రహ్మాస్మి"
అని
యెరుగువాడెవడు?
సాక్షియే
యెరుగుచున్నదా?
లేక
"నేను"
అను
వ్యవహారియై
వికారిగానుండు
జీవుడెరుగుచున్నాడా?
2
▾
Meaning
Keep
సాక్షియే
యెరుగుచున్నదనిన,
సాక్షి
నిర్వికారమై
'నేను'
అను
అహంకారికి
సాక్షియైయుండుటచే,
దానికి
'నేన'ను
అహంకారమే
లేదు
కదా?
ఉన్నదనిన,
దానికి
అపుడు
సాక్షిత్వమే
లేదు;
అదియును
వికారి
కావలయును.
అట్లుకాక
'నేను
బ్రహ్మమ'ని
యేకల్పనయూ
లేకుండటచే
"నేను
బ్రహ్మమైతి"నను
జ్ఞానమతనికి
లేదన్నమాట.
కాన,
సాక్షియే
"అహం
బ్రహ్మాస్మి"యని
యెరుగుచున్నదని
చెప్పుటకవకాశము
లేదు.
ఇక
ఎవడెరుగుచున్నాడనిన,
"నేను"
అను
జీవుడే
యెరుగుచున్నాడని
చెప్పవలసివచ్చును.
కారణము,
అజ్ఞాని
కదా
సంసార నివృత్యర్థము,
"అహం
బ్రహ్మాస్మి"యను
జ్ఞానాభ్యాసమొనర్చవలెను?
సాక్షికి
అజ్ఞానము
లేనందున
జ్ఞానమూ
లేదు!
అజ్ఞానికి
కదా
జ్ఞానమావశ్యకము?
జ్ఞానాజ్ఞానములు
జీవునికిగానీ
సాక్షికి
లేవు,
అని
అనుభవదృష్టము.
ఎట్లనిన,
సాక్షిగానుండు
'ఆత్మ'
జ్ఞానాజ్ఞానములకు
అధిష్ఠానమై
జ్ఞానాజ్ఞానరహితమైయున్నది;
జీవి
జ్ఞానాజ్ఞానములు
కూడియుండువాడు.
అదెట్లని
కొందరు
శంకించవచ్చును.
'నేను'
అని
వ్యవహరించు
జీవుని,
"నీవు
సాక్షియగు
ఆత్మ
నెరుగుదువా?"
అని
అడిగిన,
"ఆ
సాక్షి
యెవరో
నేనెరుగను"
అని
చెప్పుటచే
జీవియందజ్ఞానానుభవము
గంటిమి.
వెనుక
వేదాంత
శ్రవణముచే
'సాక్షి
కలద'ని,
తనకు
సాక్షిగనుండు
ఆత్మను,
పరోక్షముగ
తెలియుచున్నాడు.
అనంతరము
విచారముచే,
తోచలేదను
ఆభాసావరణము
నశింప,
ఆత్మను
ప్రత్యక్షముగా
గనుచున్నాడు.
కనుక
జ్ఞానానుభవమును
జీవునియందే
గంటిమి.
ఇటుల
'సాక్షిగలద'ను
జ్ఞానాజ్ఞానములుగలవాడు,
జీవుడేకానీ
సాక్షికాదు.
కావున
జీవుడే
"అహం
బ్రహ్మాస్మి"యని
తెలియుచున్నాడు.
తెలిసికొన్న
తరువాత
'నేన'ను
అహంకారమే
కనుపించదు.
బ్రహ్మమే
తాను
కాగలడు.
3
▾
Meaning
Keep
ఇంక
చూచినదెవరు?
చూడబడినదేది?
చూపుయేది?
"నేను
చూచితిన"ను
వాక్యమున
ఈ
మూడూ
లీనమయినవికదా?
ఇంక,
'చూచితిన'నుటలో
అర్థము
లేదు;
సత్యమే
కాదు;
దానిని
జ్ఞానమనుట
శుద్ధ
తప్పు.
ఒకవేళ
దర్శించినంత
మాత్రమున,
వికారియగు
జీవుడు
నిర్వికారియగు
సాక్షినిగనుటచే,
తాను
సాక్షియగునా?
దరిద్రుడు
రాజును
చూచినంత
మాత్రమున
రాజగునా?
అట్లే,
సాక్షినిగనిన
జీవుడు
అప్పుడే
సాక్షి
కాజాలడు.
తాను
సాక్షికాక,
వికారియగు
జీవుడు
బ్రహ్మమై
"అహం
బ్రహ్మాస్మి"యని
తెలియజాలడు.
తనకధిష్ఠాన
సాక్షిని
యెరుగని
జీవుడు,
విచారము
చేసి,
తాను
'సాక్షియగు
బ్రహ్మమ'ని
యెరుగగలడనిన,
"నేను
సాక్షి"యని
యెటుల
పలుకగలడు?
తాను
రాజైన
తర్వాత,
ఇతరులు
తనను
రాజని
తలంతురేకాని
'నేనే
రాజ'ని
యేరీతిగా
తెలుపగలడు?
అది
అజ్ఞానము,
అమాయకము.
నిర్వికారియగు
సాక్షియైనగానీ
తాను
వికారిగా
నుండి
'నేను
సాక్షి'యని
తెలియుట
దుస్తరము,
దుర్లభము.
జీవుడు
సాక్షియేకాజాలక
పరిపూర్ణ
బ్రహ్మ
మెటుల
కాగలడు?
కోటలోని
రాజును
చూచిన
బిచ్చగానికి,
తాను
రాజుగాక
సామ్రాజ్యాధిపత్యము
దూరమగు
విధమున,
సర్వసాక్షియై
ఆకాశమునకన్న
అత్యంత
కేవలమై,
జ్ఞాతృ,
జ్ఞాన,
జ్ఞేయములను
త్రిపుటి
వ్యవహారములలో
నెదియూ
లేక,
నిత్య
శుద్ధ
బుద్ధ
ముక్త
పరమానంద
స్వరూపముగ
నుండు
'సాక్షి'ని
గనిన
జీవునికి,
తాను
సాక్షికాకనే,
తాను
పరిపూర్ణ
బ్రహ్మమని
యెరుగుట
దూరమగును.
'నేన'నునది
ఉన్నంత
వరకూ
తాను
సాక్షి
కాజాలడు.
సాక్షి
సర్వభూతాంతరాత్మ,
సర్వవ్యాపి,
సత్చిత్
స్వరూపుడు;
తనకన్యమైనది
4
▾
Meaning
Keep
వేరు
లేనిదిగా
నుండును.
తను
కానిది
లేనిదై
యుండును.
అంతా
తానై
యుండును.
'అట్టి
పరిపూర్ణుని
నేన'నుటలో
అర్థమే
యుండదు.
అట్టిదానిని
సాక్షాత్కారమని
కూడ
తలంచ
వీలులేదు.
శ్రుతియందు
"అహం
బ్రహ్మాస్మి"
అను
జీవ
బ్రహ్మ
'సామానాధికరణ్యము'
ముఖ్యముగ
జెప్పలేదు.
ముఖ్యసామానాధికరణ్యమేదనిన,
ఒక
ఘటమున
నుండు
ఆకాశమే
మరియొక
ఘటముననుండు
ఆకాశము.
ఘటమునందుండు
ఆకాశమే
మఠమునందుండు
ఆకాశము.
మహాకాశమే
యెల్లెడల
నిండియుండాకాశము.
ఘటాకాశమే
మహాకాశమని
తెలియుట
ముఖ్యసామానాధికరణ్యము.
ఒక
చోట
వాయువే
యెల్లెడలనుండు
వాయువు.
ఒక
చోట
వెలుగు
సూర్యప్రకాశమే
యెల్ల
చోటుల
వెలుగు
సూర్యప్రకాశము.
ఒక
మూర్తి
యందుండు
ఈశ్వరుడే,
మూర్తులన్నింటియందుండీశ్వరుడు.
ఈ
రీతిగా
తెలియుట
ముఖ్యసామానాధికరణ్యము.
అట్లే,
దేహములందు
సాక్షిగనుండునదే
యెందును
నిండియుండు
బ్రహ్మమని
తెలియుట
ముఖ్యసామానాధికరణ్యము.
ఆ
రీతి
"అహం
బ్రహ్మాస్మి"
అను
వాక్యముచే
"నేనే
బ్రహ్మమ"ని
జీవునికి
బ్రహ్మముతో
ముఖ్యసామానాధికరణ్యము,
శ్రుతి
చెప్పలేదు.
"బాధసామానాధికరణ్యము"
చెప్పుచున్నది,
చెప్పినది.
అదెట్లనిన
"నేను
బ్రహ్మమ"నుచోట
'నేను'
అను
జీవత్వమును
బోధించి
(విచారముచే
దూరము
చేసి)
తాను
బ్రహ్మముగా
శేషించియుండి,
తరువాత
"నేను
బ్రహ్మమ"ని
తెలియుట
బాధ
సామానాధికరణ్యము.
జీవత్వమును
నాశము
చేయక,
జీవుడుగ
నుండగ
బ్రహ్మమును
గనుటచేతనే
"నేను
బ్రహ్మనైతి"నని
తెలియుట
కాదు.
భిక్షుకుడు
తన
శరీరమును
చాలించి
నృపుడై
"నేను
5
▾
Meaning
Keep
నృపుడ"నని
యెరుగునట్లు,
తనను
దేవుడని
యెరుగదలచు
మనుజుడు
మానుషత్వమున
కుపాధియైన
మనుజ
దేహమును
వెనుకకు
పారవేసి
దేవదేహమును
పొంది
తరువాత
"నేను
దేవునిలో
నున్నాను,
నేనే
దేవుడు,"
అనుట
తెలిసికొనవలెను,
తెలుపవలెను.
"నేను
ఈశ్వరుడ"నని
యెరుగువాడంతరంగ
భక్త్యుపాసనా
మహిమచే
మానుషత్వమును
వీడి,
ఈశ్వర
సాయుజ్యమును
బడసి
"నేనీశ్వరుడ"నని
యెరుగునట్లు,
దరిద్రుడు
రాజ్యాధిపత్యమును,
మనుజుడు
దేవత్వమును,
భక్తుడు
ఈశ్వరత్వమును
దెలియునపుడు
ముఖ్యసామానాధికరణ్యము
కూడక,
దరిద్రమనుజోపాసకత్వములను
యుపాధులను
బోధించుటవలన
సామానాధికరణ్యము
గూడులాగున
'తానే
బ్రహ్మమ'ని
తెలియగోరు
జీవుడు,
చెప్పగోరు
జీవుడు,
విచారముచే
జీవోపాధిని
దూరము
చేసి,
బ్రహ్మముతో
సామానాధికరణ్యము
ఎరుగవలయునని
శ్రుతి
ఉపదేశించినది.
కానీ
ముఖ్యసామానాధికరణ్యము
చెప్పలేదు.
జీవత్వమును
విచారముచే
దూరము
చేయక,
'తాను
బ్రహ్మమ'ని
తెలియుట
అసాధ్యము.
జీవుడు
బ్రహ్మమే
అయినచో
సుషుప్తియందువలె
నిర్వికల్పముగా
నుండవలెను.
అటులుండక,
మరల
"నేనే
బ్రహ్మమ"ని
అనుభవించుటెటుల?
తైజసుడు
స్వప్నాంతరమున,
విశ్వుడై
"ఇంతసేపు
నానాదేశగమనాది
సంసారములన్నియు
చేసిన
వాని
రీతి
స్వప్నముగా
కంటిని,
ఇది
అంతయు
భ్రాంతియే
కదా,
నిజము
కాదే,
నేనే
సంసారము
చేయక
నిచట
సుఖముగా
నున్నాను"
అని
అనుభవించు
రీతి,
ఉన్మత్తుడు
ఉన్మాదము
వదలిన
పిదప
సంతోషసుఖములనుభవించుటవలెను,
వ్యాధి-ముక్తుడు
వ్యాధిగ్రస్తుడయిన
ఎవడోయని
దుఃఖరహితుడై
సుఖించుటవలెను,
దరిద్రుడు
రాజ్యాధిపతియై
6
▾
Meaning
Keep
దారిద్ర్యబాధ
నెరుగక
సుఖియగుటవలెను,
మనుజుడు
దేవత్వమును
పొంది
దేవానందమనుభవించవలెను.
ఉపాసకుడు
ఈశ్వర
సాయుజ్యమును
పొంది
ఈశ్వరానందానుభవుడైన
చొప్పునను,
జీవుడు
బ్రహ్మముతో
నైక్యము
చెంది
బ్రహ్మమై
"నేను
బ్రహ్మమైతినే,
సకల
సంసార
మెచట
పారిపోయెనో,
భ్రాంతిచే
కదా
జీవేశ్వర
జగదాది
బహువిధ
సంసారములం
జిక్కినవానివలె
భ్రమించితిని?
స్వభావముగ
కాలత్రయమున
నాయందేసంసారమును
లేదే?
సజాతీయ,
విజాతీయ,
స్వగతభేదశూన్యుడనై
సచ్చిదానంద
స్వరూపుడనై
యున్నాను"
అని
బ్రహ్మానందమనుభవించుట,
జ్ఞానము.
కావున
జీవునికి
యుపాధి
నాశముచే
సాక్షాత్కారము
సిద్ధించును
గానీ,
మరియొక
విధమున
సిద్ధించదు.
మనంబు
లయించిన
కదా
అనుభవము
కూడదు?
ఇది
అత్యంత
నాశము
కాదు.
మనస్సునకు
రూపలయమని,
అరూపలయమని
ద్వివిధములు
కలవు.
1.
వాసనామయ
వృత్తులే
మనస్సునకు
రూపము.
ఈ
సకల
వృత్తులను
లయించుటే
రూపలయము.
2.
సకలవృత్తులు
లయించి
నిద్రయుగాక,
జగము
తోచక
నిర్వికల్పమై
సచ్చిదానందానుభవ
మాత్రముగ
నుండు
సమాధ్యవస్థ,
అరూపమగును.
ఈ
అరూపమున
లయించుటయే
అరూపలయము.
ఈ
అరూపలయమున,
బ్రహ్మ
సాక్షాత్కారానుభవము
కూడదు.
అరూపలయము
విదేహముక్తియందుగాని
జీవన్ముక్తియందు
లేదు.
ఇప్పుడు
రూపలయమాత్రము
కలదు.
ఇట్లు
మనసుకు
రూపము
మాత్రము
లయించి,
అరూపము
లయించక
బ్రహ్మానంద
మార్గమున
నుండుటచే
బ్రహ్మముగనుండు
మనంబున
"అహం
బ్రహ్మాస్మి"యని
తోచుట
వలన
ఆ
ఆనందమనుభవించవచ్చును.
7
▾
Meaning
Keep
ఇట్లు
జీవునకుపాధిగనుండు
మనోరూపమును
లయముచేసి
సచ్చిదానంద
మనోరూపమును,
అనగా,
రూప
మనంబును
ఒడసి
"నేనే
బ్రహ్మమ"ని
యనుభవించుటయే
'సాక్షాత్కార'మని
సిద్ధాంతము.
యథార్థము,
జ్ఞానాభ్యాసమునకు
పూర్వము,
బ్రహ్మముతోననుస్మరణలేని
కాలమున,
'తనువే
తాన'ని
సంశయ
విపరీతములు
లేక
నిజముగ
నుండినటుల,
జ్ఞానముచే,
అభ్యాసముచే
తనువే
తాననెడి
భ్రాంతి
వీడి,
'తను'
తలంపే
లేక,
'సచ్చిదానందాకారుడై'
సంశయ
విపరీతములు
లేక
'బ్రహ్మమై'
'తానై'
యెల్లప్పుడూ
అనుభవించుట
సాక్షాత్కారమని
నే
వచింతును.
ఆచార్యులు
కూడా
దీనినే
బలపరచిరి;
బలపరచుటేమి?
అదే
సత్యము!
Previous
←
Seeking Out the Truth Alone Must Be the Mark of the Jñānis
Next
Whosoever Is Devoted to the Practice of the Fourfold Sādhana Is Indeed Entitled to Ātma-vicāra
→