Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Līlā Kaivalya Vāhini · The Veda Has So Many Names
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
వేదమునకు
యెన్నియో
పేర్లున్నవి
సాధక:
బ్రహ్మకాండ
అనగా
యేమిటి?
సాయి:
యజ్ఞయాగాదులకు,
ధర్మాచరణకు
సంబంధించినది.
ఇందులో
యెన్నియో
విశేషములతో
కూడిన
ధర్మములు,
యజ్ఞములు
కలవు.
సాధక:
ఉపనిషత్తులనగా
ఏమిటి?
సాయి:
ఇవి
విద్యావివేకాలచే
సాధించగలిగినవి,
సాధించదగినవి.
ఇవి
ధర్మార్థకామమోక్షములను
నాలుగు
పురుషార్థములతో
కూడినవి.
విద్యలలో
కూడా
పరవిద్య
అని,
అపరవిద్య
అని
రెండు
గలవు.
నాలుగు
వేదములు
అపరవిద్యలే.
అందులో
మూడు,
అనగా,
ధర్మ,
అర్థ,
కామముల
వలన
పురుషార్థములు
సాధించుకొనవచ్చును.
ఉపనిషత్తులలో
చెప్పిన
పరవిద్య
ద్వారా,
నాలుగవదయిన
మోక్షము
సాధ్యము.
సాధక:
అయితే
వేదాంతములనగా
యేమి?
సాయి:
ఈ
ఉపనిషత్తులకే
వేదాంతాలు
అని
పేరు.
వేదాంతాలు
తెలుసుకోకుండా
కేవలము
వేదములు
వల్లెవేసినంత
మాత్రమున
ప్రయోజనముండదు.
అంతియే
కాదు,
పరిపూర్ణ
ఫలము
కలుగదు.
సాధక:
వేదమును
శ్రుతి
అని
అంటారే,
యెందుకోసం?
సాయి:
వేదమునకు
నవ
విధములైన
పేర్లు
ఉన్నవి.
అందులో
శ్రుతి
వకటి.
సాధక:
ఆ
నవవిధములైన
పేర్లు
యేవి?
2
▾
Meaning
Keep
సాయి:
శ్రుతి,
అనుశ్రవం,
త్రయి,
ఆమ్నాయం,
సమామ్నాయం,
ఛందస్సు,
స్వాధ్యాయం,
ఆగమం,
నిగమం.
సాధక:
ఇవి
అంతరార్థములతో
కూడియుండునని
తలంతు.
దయచేసి
వాటి
అంతరార్థములు
కూడా
వివరించిన
తెలుసుకోగోరుచున్నాను.
వీటికి
ఈ
పేర్లు
యెట్లు
కలిగినవో
తెలుప
వేడెద.
సాయి:
గురువు
వుచ్చరించుచున్నదానిని
ఏకాగ్రచిత్తుడై
విని,
తిరిగి
గురువు
ఉచ్చరించినటులనే,
స్వరము
తప్పక
ఉచ్చరిస్తూ
శిష్యుడు
దానిని
నేర్చుకుంటాడు.
కనుక,
విని,
విన్నటుల
ఉచ్చరించి
నేర్చుకోవటం
వలన
దానికి
'శ్రుతి'
అని
పేరు
వచ్చినది.
దీనికే
'అనుశ్రవం'
అని
కూడా
పేరు.
ఇక,
త్రయి.
పూర్వము
మూడు
వేదములుగా
విభజించి,
అనగా
ఋగ్వేదం,
యజుర్వేదం,
సామవేదం
-
ఈ
మూడింటినే
ప్రధానముగా
పాటించుచుండెడివారు
అగుటచేత
దీనికి
'త్రయి'
అని
పేరు
వచ్చినది.
ఆమ్నాయం
అనగా
ఇది
"మ్నా"
అనే
ధాతువునుండి
వచ్చినది.
"మ్నా"
అనగా
అభ్యాసము
అని
అర్థము.
యెల్లప్పుడూ
అభ్యసించుటచేతనే
దీనికి
'ఆమ్నాయం'
అని
పేరు.
సమామ్నాయమని
కూడా
అందురు.
సామమనగా
ఇది
ప్రత్యేకించిన
గానసారము.
ఛందశ్శబ్దానికి
వేదపరమైనది.
వంశపారంపర్యంగా
అధ్యయనము
చేయుటచేత
దీనికి
'స్వాధ్యాయము'
అని
పేరు
వచ్చినది.
'ఆగమం'
అనగా
భగవంతుని
నిశ్వాసరూపంగా
బయల్పడినది
కనుక
ఇది
ఆగమమని,
నిగమమని
కూడా
చెప్పబడినది.
3
▾
Meaning
Keep
ఇవన్నియూ
మంత్ర
స్వరూపాలు.
ప్రతి
పదమూ
వక
మంత్రమే.
వేదములన్నియూ
మంత్రమయము.
సాధక:
మంత్రమనగా
యేమి?
సాయి:
విధింపబడిన
అర్థాన్ని
వివరించి
చెప్పేది
మంత్రము.
మననము
చేయడానికి
హేతువయ్యేది
మంత్రం
అని
కూడా
అనవచ్చు.
"మన్"
మననము,
"త్రా"
త్రాణశక్తి.
యేతావాతా
మనన
త్రాణ
సమ్మిళితం
మంత్రము.
యజ్ఞ
యాగాది
కర్మలు
చేస్తూ
వాటి
స్వరూపాన్ని
స్మరించటం.
యాజ్ఞికులు
ప్రత్యేకంగా
వుచ్చరించే
శబ్దాలు
మంత్రాలు.
అయితే
ఈనాడు
మంత్రాలను
వల్లెవేస్తున్నారు,
పారాయణం
చేస్తున్నారు,
అర్థాలు
తెలియకుండా.
అలా
చేస్తే
పారాయణముల
ప్రయోజనముండదు.
అర్థ
జ్ఞానంతో
పఠించిన
సంపూర్ణ
ప్రయోజనము
కలదు.
ఒక్కొక్క
వేదము
అనేక
శాఖలు
కలిగియున్నవి.
ఆ
శాఖల
యొక్క
పరిపూర్ణతను
కూడా
అనుభవించవలసి
వచ్చును.
సాధక:
శాఖలనగా
యేమి?
సాయి:
శాఖలనగా
వుపాంగాలు.
చెట్లకు
కొమ్మలుండినట్లు,
కొమ్మలకు
రెమ్మలుండినట్లు,
ఈ
కొమ్మలు
రెమ్మలతో
కూడినదే
వృక్షమయినట్లు,
ఈ
శాఖోపశాఖలతో
కూడినది
వేదము.
ఇట్లు
ఒక్కొక్క
వేదమునకు
అనేక
శాఖోపశాఖలు
వున్నవి.
యేవో
కొన్నింటిని
మాత్రమే
కొందరు
గుర్తించిరి.
గుర్తించక,
ఆచరించక
వదలిన
శాఖలు
కొన్ని
వేలు,
లక్షలు
వున్నవి.
అసలు
వాటి
పేర్లు
కూడా
యెవరికీ
తెలియదు.
కనుకనే
"అనంతోవై
వేదః"
అన్నారు.
ఒక్కొక్క
మహానీయుడు
ఒక్కొక్క
వేదములో
కొన్నికొన్ని
శాఖలు
మాత్రమే
గుర్తించి
వల్లె
వేస్తూ
వచ్చారు.
Previous
←
The Study of the Veda Is Only to Carry Life Across
Next
The Aims of the Ṛgveda and the Yajurveda
→