Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Līlā Kaivalya Vāhini · The Aims of the Ṛgveda and the Yajurveda
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఋగ్వేదము
మరియు
యజుర్వేదము
యొక్క
ఆశయాలు
సాధక:
ఋగ్వేదమనగా
యేమి?
దీనికి
ఈ
పేరెట్లు
వచ్చినది?
సాయి:
దేవతాస్తుతి
పరాలైన
మంత్రాల
సమూహము.
ఋగ్వేదమనగా
దేవతలు
అని
కూడా
చెప్పవచ్చు.
సాధక:
ఈ
వేదమునందు
యే
దేవతను
గురించి
అధికముగా
తెలుపుదురు?
సాయి:
దేవతలు
అనేకమంది
కలరు.
అయితే
ఈ
ఋగ్వేదములో
ముఖ్యమైన
దేవతలు
ముప్పైమూడు
(33)
మంది.
సాధక:
వారు
ప్రత్యేకించిన
రూపధారులా
లేక
సామాన్య
మానవ
ఆకారులా?
సాయి:
వారికి
మానవుల
వలె
శరీరములున్నవి.
సాధక:
వారి
స్వరూపము
లెట్టివో
దయచేసి
ఒకటి
రెండైన
తెలుపుడు.
సాయి:
సూర్యుడు.
ఇతనికి
కిరణములే
హస్తములు;
అగ్ని
జ్వాలలు
నాలుకలని
వర్ణింపబడినవి.
అగ్ని,
అరణి
మథనముచేత
పుట్టినది.
అగ్నికి
తల్లిదండ్రులున్నారు.
మథనానికి
ఉపయోగించే
కఱ్ఱలే
వారు.
అగ్ని
పుట్టగానే
తల్లిదండ్రులను
భక్షిస్తాడు.
ఇతనికి
పదిమంది
స్త్రీలు.
అనగా
వ్రేళ్ళచే
సృష్టింపబడినవారు.
అరణి
మథనముచేత
సృష్టింపబడుటచేత
అతనికి
బహుజన్ముడని
కూడా
పేరు.
ధూమమే
ఇతని
ధ్వజం;
అందువలన
ఇతనిని
ధూమకేతుడని
పిలుస్తారు.
ఇతనికి
యజ్ఞసారథి
అని
కూడా
పేరు.
కారణమేమన
దేవతలను
2
▾
Meaning
Keep
తన
రథము
మీద
తీసుకొని
వస్తాడు.
యజ్ఞములో
సమర్పించిన
ఆహుతులను
దేవతలకు
సమర్పిస్తాడు.
యజ్ఞమునకు
ఇతడే
ముఖ్యుడు.
అందుచేత
ఋత్విక్కులు,
హోతలు,
పురోహితులుగాను,
బ్రహ్మగాను
స్తుతింపబడుతాడు.
ఇతడు
మానవులకు
అత్యంత
సన్నిహితుడు.
అనగా
అగ్నిలేక
మానవదేహము
నిలువజాలదు,
యే
పనియు
చేయజాలరు.
సమస్త
కర్మలకు
దేహమందు,
దేహమునకు
వెలుపల
అగ్ని
ఉండియే
తీరవలెను.
కనుక
అతనిని
గృహపతి
అని,
అతిథి
అని
పిలుస్తారు.
అగ్ని
అన్ని
ప్రాణులను,
అన్ని
జాతులను
సమానముగా
చూచుచుండెడిది
కనుక
అగ్నికి
సమ
మిత్రుడని
కూడా
పేరు.
సాధక:
ఈ
ఋగ్వేదము
యొక్క
ఆశయమేమి?
సాయి:
మన
అందరి
ఆశలు
వకటిగా
ఉండాలనియు,
అందరి
హృదయాలు,
అందరి
ఆలోచనలు
మంచివిగా
ఉండాలనియు,
ఒక్క
సత్యమార్గమున
నడువవలెననియు,
అందరూ
ఒక్కటే
అని
ఏకత్వము
బోధిస్తుంది.
ఈనాడు
మానవులందరు
ఒక్కటే
అని
బోధించుట
క్రొత్తగా,
ఉన్నత
మార్గముగా
భావిస్తున్నారు.
ఇట్టి
భావము
క్రొత్తది
కాదు.
ఋగ్వేదము
ఇంతకంటే
గొప్పగా
సమాన
భావమును
బోధించినది.
ఇదే
ఋగ్వేదములోని
ప్రధాన
ఆశయము.
అందరూ
ఒక్కటే.
అందరూ
భగవంతుని
అంశములే,
శక్తులే.
అందరియందు
వున్న
ఆత్మస్వరూపుడు
ఒక్కడే,
భేదములుండరాదు
అని
శాసించినది.
ఇట్టి
విశాలభావాన్ని
ఈనాటి
మానవులు
కోల్పోయి,
భేదములు
అభివృద్ధిపరచుకొని
సంకుచిత
జీవితాన్ని
గడుపుచున్నారు.
ఆనాడు
సంకుచితమును
కూలద్రోసి
విశాలత్వమును,
ఏకత్వమును
చాటినది
ఋగ్వేదము.
సాధక:
యజుర్వేదమనగా
యేమి?
దీనికి
ఈ
పేరెట్లు
కలిగినది?
3
▾
Meaning
Keep
సాయి:
"యజ్"
అనే
ధాతువునుండి
పుట్టినది.
దీనికి
అనేక
అర్థములున్నవి.
ప్రధానముగా
దేవ
పూజ
అనియు
దాన
ధర్మాదులనియు
అర్థము.
యజ్ఞయాగాది
క్రియాకలాపాన్ని
వివరించే
వేదం
యజుర్వేదము.
దీనినే
అధర్వ
వేదమని
కూడా
చెప్పుదురు.
సాధక:
దీని
ఆశయమేమి?
సాయి:
దీనికి
రెండు
సాంప్రదాయములు
కలవు.
ఆదిత్య
సాంప్రదాయ
మనియు,
రెండవది
బ్రహ్మ
సాంప్రదాయ
మనియు.
బ్రహ్మ
సాంప్రదాయమే
కృష్ణ
యజుర్వేదమనియు,
ఆదిత్య
సాంప్రదాయమే
శుక్ల
యజుర్వేదమనియు
అందురు.
శుక్ల
యజుర్వేదము
ఉత్తర
భారతములోను,
కృష్ణ
యజుర్వేదము
దక్షిణ
భారతములోను
ప్రసిద్ధము.
ఇది
ఋక్
సంహితకు
దగ్గరగా
ఉంటుంది.
దేవపూజకు
హవిస్సులు
సమర్పించుటే
ఈ
మంత్రములయొక్క
ఉపయోగము.
ఈ
కృష్ణ
యజుర్వేదమునకు
86
ప్రధాన
శాఖలు
ఉండెను.
ఇప్పుడు
వినియోగములో
ఉన్న
శాఖలు
నాలుగు
మాత్రమే.
మిగిలిన
82
శాఖలు
కాలగర్భమున
కలసిపోయినవి.
శుక్ల
యజుర్వేదమునకు
17
ప్రధాన
శాఖలు.
అయితే
నేడు
దొరికేది
రెండు
శాఖలు
మాత్రమే.
ఉన్న
కొన్ని
శాఖలే
ఇంత
మహత్తరమైనవై
వుండగా,
అన్ని
శాఖలు
వుండి
వుండిన
దీని
విశిష్టత
వర్ణనాతీతము.
వేదము
ఘనతను
వర్ణింప
నెవరితరము
కాదు.
ఇది
అవాజ్మానస
గోచరం.
"యతోవాచో
నివర్తంతే
అప్రాప్య
మనసా
సహ"
ఈ
సత్యాన్ని
గుర్తించినవాడు
ధన్యుడు.
వాడే
పుణ్యుడు,
పురుషార్థమును
సార్థకము
గావించుకొన్నవాడు.
Previous
←
The Veda Has So Many Names
Next
Brahman, the Ṛṣis, and Svādhyāya
→