Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Līlā Kaivalya Vāhini · Brahman, the Ṛṣis, and Svādhyāya
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
బ్రహ్మము,
ఋషులు
మరియు
స్వాధ్యాయము
సాధక:
స్వామీ!
వేదమునకు
ఇంకను
పేర్లేమైన
నున్నవా?
సాయి:
ఆ.......
లేకేమి?
యింకా
యెన్నియో
పేర్లున్నవి.
పృశ్ని
అనియు,
ప్రథమజా
అనియు,
ఇంకా
ఆయా
సందర్భములను
పురస్కరించుకొని
అనేక
పేర్లున్నవి.
సాధక:
పృశ్ని
అనగా
ఏమి?
సాయి:
పరమేశ్వరుడు
పృశ్నిగర్భుడు.
పృశ్ని
అనగా
పరిశుద్ధము,
పవిత్రము,
నిర్మలం
అని
అర్థములు.
పరమేశ్వరుని
బుద్ధి
దోషరహితమని
అర్థము.
ఋషులు
మంత్రద్రష్టలై
పరిశుద్ధాంతఃకరణులై
బ్రహ్మ
ప్రేరితులై
తదనుగ్రహపాత్రులై
తపస్సమాధిలో
మంత్రజాతమును
దర్శించిరి.
అట్టి
మంత్రమును
దర్శించిన
మంత్రద్రష్టలుకూడా
భగవంతుణ్ణి
పృశ్నిగర్భుడని
వర్ణించిరి.
అయితే
మంత్రద్రష్టలగు
ఋషులు
కర్మబద్ధులై
మరల,
మరల
జన్మించువారు
కారు.
కల్పాదియందు
మాత్రమే
బ్రహ్మచే
సృజింపబడతారు.
కాన
వీరిని
"అజః"
అని
కూడా
శ్రుతిచే
చెప్పబడినది.
వారు
సహజముగనే
పరిశుద్ధాంతఃకరణులు.
వారిని
కూడా
పృశ్ని
అని
పిలువబడిరి.
అట్టి
పరిశుద్ధ
స్వరూపులై
తపము
నాచరించిరి.
ఆ
తపస్సమాధిలో
స్వాయంభువమగు
బ్రహ్మ
వారికి
అభివ్యక్తమాయెను.
బ్రహ్మ
సాక్షాత్కారమును
బడసి
బ్రహ్మయజ్ఞమును
దర్శించిరి.
2
▾
Meaning
Keep
సాధక:
బ్రహ్మయజ్ఞ
మనగా
యేమి?
సాయి:
బ్రహ్మయజ్ఞ
మనగా
స్వాధ్యాయము.
లోక
కళ్యాణార్థమై
బ్రహ్మానుగ్రహమును
పొంది
అజులగు,
అధికారులగు
ఋషులు
యజ్ఞములను
సృజించిరి.
మంత్రములను
దర్శించినవారు,
వేదచోదితమైన
పరమార్థమును,
ధర్మ
బ్రహ్మ
స్వరూపమును
దర్శించువారిని
మాత్రమే
ఋషులని
వేదమే
తెలిపినది.
అట్టి
వేదము
అంగీకరించిన
ఋషులు
సృజించిన
క్రతువులే
యజ్ఞములు.
తపస్సుచే
లభించిన
దగుటచే
బ్రహ్మత్వమును
'తపోజా'
అని
కూడా
దేవుని
లక్షణాలను
వర్ణించిరి.
దీనినే
దైవీవాక్,
దేవవాణి
అనిరి.
తపోజా
అనుటచే,
అంతకు
పూర్వము
లేక
క్రొత్తగా
పుట్టినది
కాదు.
అనాది
సిద్ధమైన
వేదవాణియే
తపస్సు
వలన
అభివ్యక్తమైనది.
స్వాయంభువమగు
బ్రహ్మ.
ఇది
అనాది
సాధనమైన
వాక్కు
అని
స్పష్టము
చేయుచున్నది.
స్వయంభూ,
తపోజా,
ఇత్యాది
పదములు
పురస్కరించుకొని
దైవీవాక్
వేదమునందు
అచటచట
మంత్రకృత్,
ఋషికృత్
ఇత్యాది
పదములను
అనుసరించుచూ
ఈ
వాక్
-
మంత్ర
-
మంత్రకర్తృ
రచితమై
చెప్పబడినవి.
అన్నము,
జలము,
అమృతము,
వేదము,
ఇవి
పృశ్ని
అని
చెప్పబడుచున్నవి.
ఇవి
యెల్లప్పుడూ
భగవంతుని
గర్భము
నందుండునవి
కాన
భగవంతుడు
పృశ్నిగర్భుడని
కూడా
బ్రహ్మనే
తనకు
తాను
వేదరూపమున
తెలుపుకొన్నాడు.
సాధక:
ప్రథమజా
అనగా
యేమి?
సాయి:
త్రయారూపమగు
వేదవాక్కు
ప్రథమజా
అని
కీర్తింపబడినది.
"ఉపస్థాయ
ప్రథమజాం"
అని
అనుటచే
ప్రథమజా
అను
వాక్కును
సేవించుటవలననే
విద్య
సిద్ధించుచున్నదని
చెప్పబడినది.
అనగా
వేదవాక్కును
సేవింపని
యెడల
బ్రహ్మవిద్య
సిద్ధింపదని
దీని
3
▾
Meaning
Keep
తాత్పర్యము.
వేదవాక్కు
కేవలము
అర్థము
తెలిసి
భావపూరితముగ
సేవించినపుడే
వేదవిద్యాసిద్ధిని
బడయవచ్చునే
కానీ
కేవలము
నోటితో
వుచ్చరించినంత
మాత్రమున
వేదవిద్యాసిద్ధి
లభించదని
కూడా
ఈ
వాణి
స్పష్టపరచినది.
సాధక:
ఈ
ప్రథమజా
అను
వాక్కు
యే
వేదమునందు
దర్శింపబడినది?
సాయి:
ఋగ్వేదమునందు
ప్రథమజా,
పూర్వజా
అను
పదములు
వేదముయొక్క
అనాదిత్వమును
చాటుచున్నవి.
అందుచేతనే
రామాయణమును
వ్రాయుచూ
వాల్మీకి
ఈ
వాక్కును
'అగ్రవాక్'
అని
కీర్తించినాడు.
వేదవాక్కునే
కాక
హిరణ్యగర్భునకు
కూడా,
'ప్రథమజాః'
అని
ప్రథమోత్పన్నమైనదగుటచే
బ్రహ్మను,
బ్రహ్మవిద్యను
ప్రథమజా
అని
శ్రుతులు
కీర్తించినవి.
"బ్రహ్మదేవానాం
ప్రథమః"
బ్రహ్మదేవునకు,
హిరణ్యగర్భునకు
ప్రథమజా
అని
పేరు
వేదమున
గన్పట్టుచునే
యున్నది.
సాధక:
ఇందులో
ప్రాధాన్యమెవరికి?
అనగా
హిరణ్యగర్భునకా
లేక
పరబ్రహ్మకా?
సాయి:
హిరణ్యగర్భునకంటే
పరబ్రహ్మకు
ప్రాధాన్యముండుటచే
బ్రహ్మనే
ప్రథమజా
అయినది.
ప్రథమజా
అనగా
అనాది
సిద్ధమగు
వాక్కు.
ఇది
పరబ్రహ్మ
ముఖమునుండే
ఆవిర్భవించినది
అని
అర్థము.
ప్రథమజా
అను
నామము
సార్థకము
అయినట్లే
ఆర్షపదము
కూడా
బ్రహ్మవాక్యమయిన
వేదమునకు
ప్రసిద్ధము.
మీమాంసాది
న్యాయముచే
పరిశీలన
చేయువాడే
ధర్మజుడు.
మీమాంసాదులచే
పరిశీలన
చేయనివాడు
అధర్ముడు
అని
అర్థము.
సాధక:
ఆర్షమనగా
యేమి?
4
▾
Meaning
Keep
సాయి:
వేదము
ఋషి
యగుటయే
కాక
ఋషిదృష్ట
అగుటచే
ఇది
'ఆర్ష'
అని
చెప్పబడినది.
ఈ
వేద
మంత్రజాతము
ఆర్షయధీనమని
ఋగ్వేదము
స్వయముగా
వివరించినది.
ఇంతేకాదు
సకారాన్త
పదము
వేద
బ్రహ్మకు
మరొక
నామము.
దానికే
'వేదః'
అని,
అనగా
ధనము,
జ్ఞానము,
లేక
పరమైశ్వర్యము
అని
అర్థములు.
లౌకిక
ధనముకంటే
విలక్షణమై
పురుషార్థ
సాధకమగును.
అనగా
వేద్యతా
ప్రసాదరూపమగునట్టి
ధనమే.
దీనినే
సర్వైశ్వర్య
జ్ఞానము
అని
కూడా
అందురు.
ఇది
వేదరూప
బ్రహ్మమును
దర్శింపచేయును.
దీనినే
వేదములో
కూడా,
"దేవా!
నీవు
వేద
స్వరూపుడవు,
పశుపుత్రాది
ధనముతో
లేక
పరమైశ్వర్యముతో,
జ్ఞానముతో
నన్ను
నింపుము.
అట్టి
ధనముతో
నేను
తృప్తుడనగుదును.
ఆ
ధనము
నీ
కైంకర్యమునకు
వినియోగింపబడినది
అగుటచే
నీవునూ
తృప్తుడవగుదువు"
అని
ప్రార్థించిరి
వేద
ఋషులు.
Previous
←
The Aims of the Ṛgveda and the Yajurveda
Next
The Method of Attaining the Vedic Jñāna That Bestows All Sovereignty
→