Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Līlā Kaivalya Vāhini · The Method of Attaining the Vedic Jñāna That Bestows All Sovereignty
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సకలైశ్వర్య
వేద
జ్ఞానము
పొందు
విధానము
సాధక:
ఈనాడు
అట్టి
ప్రార్థనతో
కూడిన
భావములు
యెక్కడా
కనుపించుటలేదు.
అర్థములు
తెలియక
కేవలము
గ్రాంఫోన్
ప్లేటు
పాడినట్లు,
అలవాటులో
దానిని
వుచ్చరించుచున్నారు
కదా!
వారికి
ఈశ్వరైశ్వర్యజ్ఞానము
లభించునా?
సాయి:
బాబూ!
నీవే
చెప్పుచున్నావు
కేవలము
గ్రాంఫోన్
ప్లేటువలె
వుచ్చరించుచున్నారని.
గ్రాంఫోన్
ప్లేటువలె
ఉచ్చరించువారికి
గ్రాంఫోన్
ప్లేటుకు
యే
ఫలితము
లభించునో,
యే
ఐశ్వర్యము
లభించునో,
వారికీ
అట్టి
ఐశ్వర్యమే
లభించును.
సకలైశ్వర్య
జ్ఞానము
ఎట్లు
లభించును?
కొమ్మను
కొట్టి,
నాటి,
ఇది
చెట్టు
అన,
అది
చెట్టెట్లగును?
భావశుద్ధితో,
అర్థభావముతో
వేదమును
వుచ్చరించువారికి
సకలైశ్వర్యజ్ఞానమగు
బ్రహ్మవిద్య
లభ్యమగును.
సాధక:
కేవలము
వేదమంత్రము
మాత్రమేనా,
లేక
యే
మంత్రమైనా
భావశుద్ధి,
అర్థ
భావముతో
వుండవలెనా?
సాయి:
బాబూ!
అందరికీ
వేదము
తెలియదు
కదా!
తెలియనంత
మాత్రాన,
వారికి
సకలైశ్వర్యజ్ఞానమగు
బ్రహ్మవిద్య,
బ్రహ్మప్రాప్తి
లభించదని
భావించరాదు.
యే
నామమైనా,
యే
మంత్రమైనా
భావశుద్ధితో,
అర్థ
భావముతో
వుచ్చరించిన,
అట్టివారికి
సకలైశ్వర్య
స్వరూపుడగు
బ్రహ్మ
అనుగ్రహముతో
బ్రహ్మవిద్యా
ప్రాప్తి
నందించును.
2
▾
Meaning
Keep
సాధక:
స్వామీ!
సామాన్యముగా
ధనము
నర్థించని
వారుండరు
లోకమున.
అయితే,
యెట్టి
ధనమును
అర్థింపవలెనో,
ఎట్లది
వేదరూపమగునో,
దీనిని
వేదము
యే
విధమున
తెలిపినదో
సెలవివ్వండి?
సాయి:
"వేదం
పరమేశ్వరం,
వేదయతీతి
వేదసః
వేదస్త్వమ్".
శుభప్రాప్తి
సాధనమై
అర్థింపబడునది
అగుటచే
ధనాదికము
అర్థః
అని
చెప్పబడుచున్నది.
సుఖరూపుడై
అందరిచే
అర్థింపబడువాడగుటచే
పరమేశ్వరునకు
'అర్థః'
అని
పేరు.
అట్టి
పరమేశ్వరుని
కొరకు
వినియోగింపబడే
తత్ప్రాప్తి
సాధనమగు
ధనము
లేక
జ్ఞానము
వేదస్
అగునని
వేదమే
తెలిపినది.
అట్టి
ధనమే
ఆరాధకునకు,
ఆరాధ్యుడగు
దైవమునకు
తృప్తిని
కలిగించుననని
శ్రుతియే
తెలిపినది.
వేదవాక్కుచే
వేదవిహిత
ధర్మాద్యాచరణముచే
సిద్ధించెడి
ధనమే
వేదః
అగుననెడి
అర్థము
వేద
తాత్పర్యము.
కావుననే
ఇట్టి
ధనమును
"శ్రుత్యమ్"
అని
ఋగ్వేదము
కీర్తించుచున్నది.
సాధక:
శ్రుత్యమ్
అనగా
యేమి?
సాయి:
పుత్ర
పౌత్రాది
రూపమున
నిరతిశయముగ
వర్థిల్లెడి
ఐశ్వర్యము
ననుగ్రహింపుడు
అని
అర్థము.
ధర్మము
వేద
స్వరూపమగుటచేతనే
పరమేశ్వరునకు
"ధర్మః"
అని
ప్రసిద్ధము.
"రామో
విగ్రహవాన్
ధర్మః"
రామాయణము
కీర్తించినది.
"సర్వ
భూతానాం
ధారణాత్
ధర్మః"
సర్వభూతములను
ధరించుటచేతను,
ధర్మములచే
ఆరాధింపబడుటచేతను
పరమేశ్వరునకు
"ధర్మః"
అని
సార్థకనామము.
"ధర్మో
విశ్వస్య
జగతః
ప్రతిష్ఠా"
ఇలాంటి
పవిత్రమైన
ధర్మమును,
యెవరికి
తోచినట్లు
వారు
వ్యాఖ్యానము
చేసి,
వారి
స్వార్థమునకు
తగినట్లు
అర్థములు
తెలుపుచూ
ధర్మస్వరూపమును
విరూపము
చేయుచున్నారు.
వేద,
దేవ
అను
పదములు,
శబ్దములు
రెండును
3
▾
Meaning
Keep
పర్యాయ
పదములై
వర్థిల్లుటయు
శ్రుతులయందు
స్పష్టముగా
కనిపించుచున్నది.
"స్వయం
సర్వం
వేత్తీతి
వేదః"
అని
వేద
శబ్దము
నిర్వచింపబడినది.
అనగా
సర్వజ్ఞుడు
వేద
స్వరూపుడైన
బ్రహ్మ
అని
అర్థము.
Previous
←
Brahman, the Ṛṣis, and Svādhyāya
Next
The Special Significance of the Mantras Svāhā and Svadhā
→