Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · The Four Āśramas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
3.
నాలుగు
ఆశ్రమములు
ప్ర.
ఇట్టి
మహా
లోకమున
ఏ
ధర్మములాచరించిన
అన్నియు
చేసిన
వారమగుదుము?
వీటికి
ఏ
ఆశ్రమము
అనుసరించవలెనో
సెలవిందు?
ఆశ్రమములెన్ని?
ఉ.
ఆశ్రమములు
నాలుగు
కలవు.
వాటి
విషయములు
మొదలు
తెలుసుకొన్న,
ఏ
ఆశ్రమము
అనుసరించవలెనో
వారి
వారి
సంస్కారములను
బట్టి
వాటి
యందు
అభిరుచి
కలుగును.
1.
బ్రహ్మచర్యము
2.
గృహస్థము
3.
వానప్రస్థము
4.
సన్యాసము
అను
నాలుగు
విధముల
ఆశ్రమములు
కలవు.
ప్ర.
'బ్రహ్మచర్యమ'నగా
అనేక
మంది
అనేక
విధముల
తెలుపుదురు.
దీని
విషయమై
యథార్థ
మార్గమేదియో
తమ
ద్వారా
తెలిసికొన
కోరుచున్నాను?
ఉ.
గృహస్థుడు
కాకుండినంత
మాత్రమున
'బ్రహ్మచర్యమ'ని
తలంతురు.
అది
చాల
పొరబాటు.
యథార్థము
అది
కాదు.
తన
చిత్తమును
ప్రపంచ
వ్యామోహములకు
చేరనీయక
దైవ
చింతనా
తత్పరుడగుచు
వింతలు
విశేషములు
వినక,
చూడక,
ఏ
రుచులనూ
కోరక,
ఆనంద
దుఃఖములకు
లోనుగాక,
మనో
బుద్ధి
అహంకారములకు
సాధ్యపడక,
నిష్కామ,
నిర్మోహ,
నిర్ద్వంద్వ,
నిర్విషయ,
నిశ్చలుడై
అన్నింటియందు,
అన్ని
వేళలందు
బ్రహ్మ
తత్త్వములోనే
నిలచియుండు
మనో
స్వరూపుని
బ్రహ్మచర్యమని
పిలువబడును.
ప్ర.
'గృహస్థమ'నగా
నేమి?
2
▾
Meaning
Keep
ఉ.
పెండ్లి
చేసుకొని
భార్యా
బిడ్డలతో
ఉండినంత
మాత్రమున
గృహస్థుడు
కాడు.
వర్ణాశ్రమ
ధర్మంబులు
వర్జింపక,
తనవారు,
పెరవారను
భేదము
లేక,
పిన్న
పెద్దలను
తారతమ్యములెరింగి,
సర్వ
భూతములను
తనవలె
భావించి,
సమరస
భావము
కలవాడై
తన్నాశ్రయించిన
ప్రాణికోటియందు
ఆదరణ
చూపుచు,
లోకజ్ఞాన
విశేషములను
తెలిసికొని,
శాస్త్రజ్ఞానము
సంపాదించి,
ఇహపర
చింతనలలో
ధర్మమును
తప్పక,
సమయాసమయములనక
సర్వ
వేళలయందు
తన
వర్ణ
ధర్మమును
వీడక,
బంధుమిత్రుల
యందును,
భార్యా
బిడ్డల
యందును
ప్రీతి
గలవాడై
ఆదరించుచు,
అష్టమదములద్రుంచి,
ధర్మార్థ
కామ
మోక్ష
చతుర్విధ
పురుషార్థములయందు
బహునేర్పరియై
మసలుకొనుచు,
ధన
కనక
వస్తు
వాహనములతో
తులతూగుతూ,
ఎందును
గర్వితుడుకాక,
దాన
ధర్మ
పరోపకారార్థము
కొంత
కాలమును
వినియోగించుచు,
పర
గృహముల
పంచల
పడక,
తన
ఇల్లాలు
తనను
నమ్మునట్లును
తన
సతిని
తాను
నమ్మునట్లును,
ఒకరి
కొకరు
తెలుసుకొని
మెలగుటయే
గృహస్థమని
పిలువబడును.
ప్ర.
ఇక
'వానప్రస్థమ'నగా
నేమి?
ఉ.
సమస్త
ద్వంద్వములు
అనిత్యములని
తలంచి,
సకలాపేక్షలు
విరమించుకొని,
ఈ
ప్రపంచమునకు
విరాగియై,
ఏ
జన
ప్రదేశములనుండ
నొల్లక,
అడవికి
పోయి
స్థాన
నిష్ఠా
గరిష్ఠుడై,
మంత్ర
జపసిద్ధియను
యజ్ఞమును
చేయుచు,
తనకు
ఆకలి
సమయమున
వండిన
ఆహారము
తినక,
ఫల
పత్ర
తోయ
వాయు
దుంపలను
తినుచు,
మితాహార
భక్షణుడై,
మహర్షి
గణముల
సమూహములలో
చేరి,
ఉత్తమ
ఋషీశ్వరుల
బోధలను
వింటూ,
జన్మము
ముగియు
వరకు
తిరిగి
వెనుక
మార్గము
పట్టక
వెనుకటి
చింతలను
తలపక.
క్రమేణా
3
▾
Meaning
Keep
సర్వమును
మరచి
సర్వేశ్వరునియందు
లీనము
కావలెను.
ఇక్కడ
ఒక్క
విషయమును
జాగ్రత్తగా
యోచింపవలెను.
ఏమన,
అట్టి
వానప్రస్థమును
కోరువారికి,
భార్యా
బిడ్డలుండిన,
బిడ్డలకు
తగిన
మార్గములు
చేసి
వారి
జీవనోపాధికి
యేవిధమైన
ఆటంకములు
కలుగకుండునట్లు
చేసి,
భార్యను
ఒప్పించి,
వానప్రస్థుడు
కావలయును.
అట్లుకాక
భార్య
తనవెంట
ఉండుటకు
అంగీకరించిన
ఆమెను
కూడను
వెంట
తీసుకొని
పోవలయును.
వెంట
ఉండినను
వారు
సోదరీ
సోదర
భావములతో
మెలగవలయును
తప్ప,
సతిపతుల
సంబంధము
ఉండకూడదు.
ఈ
సంబంధముతో
గృహమునందుండినను,
వాడు
వానప్రస్థుడే
యగును.
అట్లుకాక
సతి
భావముండి
మిగిలిన
వానప్రస్థ
క్రమములన్నియూ
నడుపుకొనుచు,
అడవులయందుండిననూ
వాడు
వానప్రస్థుడు
కాజాలడు.
ఇట్టివాడు
గృహస్థుల
ఇండ్లయందు
మకాములు
వేయరాదు.
పక్వాహారము
భుజించకూడదు.
ఆయా
ఋతువులందు,
ఆయా
వ్రతములు
సల్పుచుండవలయును.
అనగా
వర్షాకాలమున
వర్షములలో,
ఎండా
కాలమున
ఎండలయందును,
శీతా
కాలమున
చలియందును
సంచరించవలెను.
ఇంతియే
కాక
దేహ
సంబంధమైన
విషయములందు
కానీ,
మానసిక
సంబంధమైన
వృత్తులయందు
కానీ,
అభిరుచిని
అణచి
నిరంతర
భగవచ్చింతనలో
తాను
సంతసించుచుండవలయును.
ప్ర.
ఇక
'సన్యాసము'
యొక్క
అర్థమేమి?
ఉ.
ప్రకృతి
సంబంధమైన
సర్వ
విషయ
వాసనలకు
అతీతుడై,
సర్వదా,
సర్వకాలము,
సర్వత్ర,
సర్వేశ్వర
చింతనే
తన
శ్వాసమని
భావించి,
ఆచరించి,
ఆనందించునదే
'సన్యాసము'లోని
నిజసారము.
4
▾
Meaning
Keep
గృహస్థమును
రోసి,
జననీ
జనక,
సతి
సుతులు,
బంధు
మిత్ర
ధన
కనక
వస్తు
వాహనములు,
జనన
మరణాది
దుఃఖములు
యావత్తు
అస్థిరములని
దృఢముగా
తెలిసికొని,
రాగ
విరాగ
దూరుడై,
శిఖ
యజ్ఞోపవీతముల
విసర్జించి,
కాషాయ
వస్త్రములను
ధరించి,
గ్రామ
వాసము
చేయక,
చిక్కిన
అల్పాహారములు
భుజించి,
చిక్కనిచో
ఆహారము
లేదని
చింతించక,
తిన్నచోట
తినక,
నిద్రించిన
చోట
నిద్రించక,
నిద్రాహారములను
జయించి,
భగవంతుని
నిరంతరము
ధ్యానించుచు,
జపించుచు,
కాల
ప్రమాణములను
మీరి
వర్తించునదే
నిజమైన
సన్యాసమనబడును.
ప్ర.
ఇప్పుడు
ఎక్కడ
చూచినను
అనేకమంది
కాషాయంబరులై
సన్యాసులవలె
కనిపించుచున్నారే,
వారందరు
పై
చెప్పిన
స్థితిని
పొంది
క్రమములు
పాటించుచున్నారా?
ఉ.
అట్టి
స్థితిని
పొంది
క్రమములాచరించు
మహనీయులు
కూడను
లేకపోలేదు.
కానీ,
అందరూ
అట్టివారే
అని
చెప్ప
వీలుకాదు.
ప్ర.
కొంతమంది
ఆశ్రమములు
నిర్మించుకొని,
అనేక
శ్రమలు
పడుచు,
ధన
వస్తు
వాహనముల
కొరకు,
పేరు
ప్రతిష్ఠల
కొఱకు,
ఆశ్రమ
అభివృద్ధికనియు,
ధనమునకై
పరుగులెత్తువారిని
యేమని
పిలువవచ్చును?
ఉ.
ఆత్మ
సన్యాసులకు,
మనో
సన్యాసులకు,
ఆశ్రమవాసము
మహా
విరోధము.
అది
తనకు
శ్రమను
కలిగించునది.
సర్వ
ఆశలు
వీడిన
వారికి
ఆశ్రమ
ఆశ,
శ్రమ
కాక
మరియేమి?
ఇట్టి
ధర్మ
విరుద్ధ
మార్గము
నవలంబించు
వారిని
యేమని
పిలుతురో
అది
నే
చెప్పనవసరము
లేదు.
ఎవరికెట్లు
తోచిన
అట్లు
పిలువవచ్చును.
సన్యాసి
అని
పిలుచుటకు
మాత్రము
నేనంగీకరించను.
5
▾
Meaning
Keep
ప్ర.
స్వామీ!
ఆశ్రమ
అభివృద్ధి
కూడను
సన్యాసికి
ఒక
బంధన
అని
తమరు
సెలవిత్తురే,
ఆశ్రమ
అభివృద్ధి
అయికదా
అనేకమంది
మాబోటివారలు
తరించుటకు
ఆధారమగును.
అట్టి
దానికి
ధనము
లేకున్న
జరుగుటెట్లు?
ఆశ్రమ
అభివృద్ధి
కోరి
వారేవారు
హృదయ
పూర్వకముగా
ఇచ్చిన
ధనమును
స్వీకరించుటలో
తప్పు
లేదు
కదా?
ఉ.
పిచ్చివాడా!
ఇంటికి
తాళములు
విరగగొట్టి
తలుపులు
బ్రద్దలు
చేసి
దొంగిలించినను
దొంగతనమే!
ఇంటికి
గండివేసి
తప్పుదారులలో
ధనమును
ఎత్తుకు
వెళ్ళినను
దొంగతనమే!
పట్టపగలే
యేదో
తనకు
తెలిసిన
వానివలె
క్షేమ
సమాచారములు
విచారించుచు,
యజమానునికి
తెలియక,
వారింటియందున్న
సామాను
తెచ్చుకొన్నను
దొంగతనమే!
చిన్నదైనను,
పెద్దదైనను,
ఇవి
దొంగతనముగా
ఎట్లు
పరిగణించునో,
అటులనే
కామినీకాంచన
రహితుడైన
సన్యాసి
ధనమును
ఏవిధముగా
ఆశించినను
తన
మార్గములకు
అది
ద్రోహమే
యగును.
ఒకవేళ
ఆశ్రమ
అభివృద్ధి
కోరుటకు
తన
కేవిధమైనటువంటి
సంబంధము
లేక
ఈ
వ్యవహారములో
తాను
చేరక,
ఈ
ధన
సంబంధమైన
బాధ్యతలను,
తన
అంతరంగ
భక్తుడెవరైనను
ఉన్న
వానిపై
వైచి
తాను
సాక్షీమాత్రుడుగా
మెలగ
వలయును.
ఆశ్రయించిన
వారికి
ఉత్తమ
స్థానమును
పొందు
హితమును
బోధించుట
మాత్రమే
తన
కర్తవ్యముగా
వహించవలెను.
ఆశ్రమ
మమకారము,
అభివృద్ధిని
కోరు
అహంకారము,
ఇవి
రెండును
సన్యాసికి
తన
ఆత్మానందాభివృద్ధిని
కాల్చునట్టి
అగ్గిపుల్లలవంటివి.
ఇంతియేకాక
ఒక్క
అగ్గిపుల్లనే
యెన్ని
ఇండ్లనైనా
యెట్లు
కాల్చగలదో,
అటులనే
మమకారము,
అహంకారము
ఇందులో
ఏ
ఒక్కటైనను
తనను
తాను
కాల్చుకొనుటయే
కాక
ఆశ్రయించిన
అనేకుల
ఉత్తమ
మార్గములను
కూడను
చెడగొట్టినదగును.
ఈ
రెండింటిని
6
▾
Meaning
Keep
జయించిన
వానిని
లోకమే
ఆశ్రయించగలదు.
అట్లుకాక,
'ఆశ్రమము'
'ఆశ్రమము'
అని
దాని
కొరకై
ప్రాకులాడువారు
లోకము
నాశ్రయించవలసివచ్చును.
లోకము
నాశ్రయించుట
సామాన్య
జీవనము.
లోకమే
తనను
ఆశ్రయించుట
పవిత్రమైన
సాధక
జీవనము.
అదే
సన్యాసము.
Previous
←
The Fourteen Worlds
Next
Mokṣa and Karma
→