Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · Mokṣa and Karma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్ర.
అవధూత
అందురే
వారెటువంటి
వారు?
వారికి
ఉండవలసినటువంటి
అర్హతలు
ఏవి?
ఉ.
వీరు
వానప్రస్థ,
సన్యాసులవలెనే
సర్వ
రాగ
ద్వేషాలను
వీడి,
ఇది
ఊరే,
అడవే
అనే
భేదము
లేక
యెవ్వరితోనూ
సంబంధము
పెట్టుకొనక,
కాలత్రయములకు
అతీతులై,
కంటక
శిలాదులకు
భయపడక,
దండ
కాషాయాంబరములతో
పనిలేక,
ఎవరితోనూ
మాట్లాడక,
ఆహార
నిద్రలను
చింతించక,
నిరంతరము
ఆనందమునే
ఆహారముగా
అనుభవించుచు,
తమలో
తాము
ఏదో
గొణుగుకొనుచు,
నవ్వుకొనుచు,
ఎదుట
ఎంతమంది
ఉండిననూ
వారలపై
దృష్టిని
పెట్టక
సంచరించుచుందురు.
అట్టి
వారలు
ఇప్పటికినీ
హిమాలయమునందు
యెవ్వరికినీ
గోచరముకాని
గుహలలో
ఆత్మానందమును
అనుభవించుచున్నారు.
ఇట్టి
వారిని
చూచుటకు
కూడను
అందరికీ
సాఫల్యము
కాదు.
అదృష్టవంతులకు
తప్పకాని.
ఇప్పుడు
చాలమంది
మేము
'అవధూతలము'ని
లోకములో
తిరుగుచుందురు.
నిజావధూతలు
ప్రపంచమునందు
జనుల
మధ్య
సంచరించరు.
ఏమైనను
దారి
తప్పి
వచ్చిన,
ఎవ్వరికినీ
లొంగక,
చిక్కక,
ఏమి
చేసినను
నిలువక
వారి
మార్గమున
వారు
వెళ్ళుచుందురు.
ఇక
నిజావధూతలమని
తెలుపుకొనువారలు,
సాధకులపాలిటి
యమదూతలనే
తలంచవలెను.
ప్ర.
అటులయిన
ఈ
దేహ
ధర్మములు
ఎంత
వరకు
ఉండును?
2
▾
Meaning
Keep
ఉ.
జీవాత్మను
తెలుసుకొను
వరకు
ఉండియే
తీరవలెను.
ప్ర.
ఆ
జీవాత్మ
యెంతవరకు
ఉండును?
ఉ.
చీలిన
కాలువలు
జీవనదులను
చేరు
వరకు,
జీవనదులు
తమ
జన్మ
స్థానమగు
సముద్రమును
చేరు
వరకు
ఉండినట్లు,
జీవాత్మయును
స్థిర
నది
గమ్యమైన
పరమాత్మలో
చేరువరకు
ఉండవలయును.
ప్ర.
అటులయిన
మోక్షమనగా
నేమి?
ఉ.
సర్వ
బంధముల
నుండి
విడుదల
కావటమే
మోక్షము.
అనగా,
అనిత్య,
అశాశ్వతములైన
అనాత్మ
తత్త్వము
నుండి,
నిత్య
సత్య
నిర్మలములను
ఆత్మ
తత్త్వములను
పొందుటయే
మోక్షమందురు.
ప్ర.
ఇట్టి
స్థితి
అందరకు
సాధ్యమగునా?
ఉ.
ఎందుకు
సాధ్యము
కాదు?
అట్టి
యోగ్యత
సంపాదించుకొన్నవారికందరకు
సాధ్యమే.
దానికి
తగిన
ప్రయత్నములు
చేసి
సాధించువారలందరికి
అది
లభించుచునే
యున్నది.
రోగమున్న
వారందరు
మందును
భుజించుటకు
అధికారులే.
వీరు
భుజించవచ్చును,
వారు
భుజించకూడదు
అను
తారతమ్యముండదు.
కాని
విలువైన
మందులను
తీసుకొను
శక్తి
అందరికి
ఉండదు
కదా!
అట్లే
శక్తి
కలిగిన
వారు
ఎవ్వరయినను
భగవదనుగ్రహమను
ఔషధమును
సేవించి
భవరోగమును
నివారణ
చేసుకొనవచ్చును.
ప్ర.
ఈ
సాధనలు
ఎవరికి
ముఖ్యావసరము?
ఉ.
జనన
మరణ
ప్రవాహము
నుండి
తప్పించుకొనవలెనను
వాంఛగల
ప్రతి
వారికీ
కూడను
అవసరమే.
ప్ర.
జననమునకు
హేతువేమి?
ఉ.
కర్మ
సంస్కారములే
కారణము.
3
▾
Meaning
Keep
ప్ర.
కర్మలెన్ని
విధములు
కలవు?
ఉ.
ఇవి
మూడు
విధములు
కలవు.
కాని
మరి
కొంతమంది
నాలుగు
విధములని
అందురు.
దుష్కర్మ,
సత్కర్మ,
మిశ్రమ
కర్మ.
నాలుగవది
జ్ఞాన
కర్మ.
ప్ర.
దుష్కర్మ
అనగా
నేమి?
ఉ.
భగవంతుడన్నను,
పాపమన్నను
భయములేక,
మంచి
చెడ్డల
తారతమ్యము
ఇంచుకైనను
తెలుసుకొనక,
అరిషడ్వర్గములకు
వశుడై,
సంసార
మోహ
నిమగ్నుడై,
ఈషణ
త్రయములనుభవించుచు,
పశుప్రాయుడై,
వివేక
వైరాగ్య
విచక్షణలను
మనసున
స్మరించక,
దయ,
ధర్మ,
సత్య,
శాంతి,
ప్రేమలు
లేక
చేయునట్టి
యే
కర్మలయినను
దుష్కర్మలే.
ప్ర.
సత్కర్మలనగానేమి?
ఉ.
భగవంతుడన్నను,
పాప
కార్యములన్నను
భీతి
కలవాడై,
సత్య,
ధర్మ,
దయ,
శాంతి,
ప్రేమలతో
ఎట్టి
కర్మలు
చేసినను
అవి
సత్కర్మలగును.
ప్ర.
ఇక
మిశ్రమ
కర్మలనగా
నేమి?
ఉ.
ఇవి
చాలా
విచిత్ర
స్వరూపములు
దాల్చియుండును.
పరోపకార
కార్యములను
చేయుచు,
దైవభీతి,
పాపభీతి
ఉండియు,
వాటికి
విరుద్ధమైన
దుష్కర్మలు,
దుర్మార్గములు,
దురాలోచనలు
చేయుచునే
ఉందురు.
కొంతమంది
పేరు
ప్రతిష్ఠల
కొరకు
దాన
ధర్మములు
చేయుచుందురు.
పరోపకారమైన
సత్రములు,
చలివెందలు
ఏర్పరచుచు,
అచ్చట
పని
చేయువారలకు
కూలీ
సైతము
సరిగా
నివ్వక
బాధపెట్టుచుందురు.
పేరు
కొరకు
ప్రాకులాడుచుందురు.
'ధర్మము
ధర్మమ'ని
భిక్షగాండ్లకు,
తనకు
పనికిరాని
పదార్థములనో,
చెల్లని
కాసులనో
ఇచ్చుచుందురు.
అనగా
ఏ
కర్మను
చేసినను
తన
4
▾
Meaning
Keep
స్వార్థమును
ఆశించి
చేయు
ఎట్టి
మంచి
కర్మలైనను
అవి
మిశ్రమ
కర్మలే!
ప్ర.
జ్ఞాన
కర్మ
అనగా
నేమి?
ఉ.
జనన
మరణాది,
వస్తువాహన
బంధు
బలగాది,
సుఖ
దుఃఖాది
ద్వంద్వములను
బాగుగా
తెలిసికొని
వాటినుంచి
దూరమగు
మార్గమును
శాస్త్ర
గ్రంథముల
వలననూ,
పెద్దల
బోధలవలననూ,
అనుభవజ్ఞులను
అనుసరించుచూ,
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమలచే
మెలగుచు,
సర్వేశుని
సాయుజ్యమును
కోరి
యే
.కర్మలు
ఆచరించినను
అవి
జ్ఞాన
కర్మలే
అగును.
Previous
←
The Four Āśramas
Next
Vidyā and Bhakti
→