Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · Vidyā and Bhakti
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మరియు
భక్తి
ప్ర.
స్వామీ!
'అమనస్కము,
అమనస్కము'
అని
అందురే,
అట్టి
స్థితి
ఏది?
ఉ.
ద్రష్టచే
దర్శింపబడు
ఈ
ప్రపంచమంతయు
దృక్కుతో
చూడ
చూడ
అదృశ్యమగును.
దీనినే
'అమనస్కమ'నబడును.
ప్ర.
అపుడు
ఎరుక
(జాగ్రదవస్థ)
ఏమాయెను?
ఉ.
అదృశ్యమాయెను.
ప్ర.
ఇది
స్వప్నావస్థయందు
ఎక్కడ
ఉన్నది?
ఉ.
జీవ
స్థానమున
నివసించి,
తానే
సమస్తమును
కల్పించుచున్నది.
ప్ర.
సుషుప్తి
యందెందుండెను?
ఉ.
'నిష్కల'లో
నణగియుండును.
ప్ర.
తురీయావస్థ
యందెందుండును?
ఉ.
వికార
రహితమై
ఈశ్వర
స్థానమందు
తన్ను
మరచి
తురీయమై
ఉండును.
ప్ర.
ఇంక
పరమార్థమనగా
నేమి?
ఉ.
ఈ
దేహేంద్రియ
ప్రపంచమునకు
పరముగా
నున్నందున
పరమార్థమని
చెప్పుచుందురు.
ప్ర.
పరమపదమనగా
నెట్లుందును?
ఉ.
నామ
రూప,
క్రియా
రూప
రహితమై
యుండును.
2
▾
Meaning
Keep
ప్ర.
దేవుడనువాడు
ప్రపంచమును
మీరియున్నాడా?
ప్రపంచముతో
చేరియున్నాడా?
ఉ.
ప్రపంచమునకు
లోపల,
వెలుపల
అంతట
నిండియున్నాడు.
కనుక,
తాను
లేని
స్థానము
కాని,
తనది
కాని
పేరుగాని
లేదు.
ప్ర.
సర్వత్ర
నిండియుండిన
పరమాత్ముని
ఏమని
పిలుతురు?
ఉ.
పరమపదమనియు,
బట్టబయలనియు,
పరమార్థమనియు,
అశరీరమనియు,
పరిపూర్ణమనియు,
అవాఙ్మానస
గోచరుడనియు
అనేక
పేర్లు
గలవు.
ప్ర.
ఇట్టి
సత్పదార్థము
నూతనమా?
సనాతనమా?
ఉ.
ఇది
సనాతనమే
కాని,
నూతనము
కాదు.
ప్ర.
కడకు,
పురుషార్థమనునది
ఏది?
ఉ.
మోక్షమే
పురుషార్థము.
ప్ర.
స్వామీ!
విద్యా
చతుష్టయములందురే,
అవియేవి?
ఉ.
అన్వీక్షకి,
త్రయి,
వార్తా,
దండనీతి.
ప్ర.
అన్వీక్షకి
అనగా
నేమి?
ఉ.
ఆత్మ,
అనాత్మల
వలన
మోక్షసాధనమగు
విద్య.
ప్ర.
త్రయి
అనగా
నేమి?
ఉ.
కర్మ
ద్వారమున
స్వర్గ
సాధనమగు
విద్య.
ప్ర.
వార్తా
అనగా
నేమి?
ఉ.
కృష్యాది
ఫలరూపమైన
విద్య.
ప్ర.
దండనీతి
అనగా
నేమి?
ఉ.
పాలకులచే
(ప్రభుత్వముచే)
ధన
ధాన్య
సంపాదన
సాధనమగు
విద్య.
3
▾
Meaning
Keep
ప్ర.
ఈ
నాలుగింటిలో
జన్మ
ప్రదములైనవేవి?
ఉ.
ఇందులో
మొదటిదైన
అన్వీక్షకికి
తప్పు,
మిగిలిని
మూడును
జన్మ
ప్రదములే!
ప్ర.
ఈ
మనస్సును
నిర్మలముగా
నుంచవలెనన్న
ప్రధానములైన
గుణములేవి?
ఉ.
మైత్రి,
కరుణ,
ముదిత,
ఉపేక్ష
అని
నాలుగు
సద్గుణములు
ప్రధానములు.
ప్ర.
"మైత్రి"
అనగా
నేమో
సెలవిందు?
ఉ.
సాధు
సజ్జనులయందు
స్నేహ
బుద్ధి,
భగవత్
రూపనామములయందు
ప్రేమ
బుద్ధి
ఉండుటయే.
ప్ర.
కరుణ
అనగా
నేమి?
ఉ.
దుఃఖితాత్ముల
యందుగల
దయామతినే
కరుణ
యందురు.
ప్ర.
ఇక
ముదిత
యనగా
నేమి?
ఉ.
మంచి
పనులు
చేయు,
అనగా
దాన,
ధర్మ,
పరోపకార,
పర
దుఃఖ
నివారణ
ఇత్యాది
కర్మలు
చేయు
వారి
పట్ల
సంతోష
వృత్తి.
ప్ర.
ఉపేక్ష
అనగా
నేమి?
ఉ.
పాపాత్ములయందు
రాగముగాని,
ద్వేషముగాని
లేకుండుటనే
ఉపేక్ష
అందురు.
ప్ర.
చతుర్విధ
భక్తులని
అందురే,
వారెట్టివారు?
ఉ.
నాయనా!
భక్తులు
అనేక
విధములు
కలరు.
అందరును
ఈ
నాలుగింటి
పైననే
ఆధారపడి
ఉందురు.
అవియే:
ఆర్తుడు,
అర్థార్థి,
జిజ్ఞాసువు,
జ్ఞాని
అని
నాలుగు
విధములైన
పేర్లతో
పిలువబడుచున్నవి.
4
▾
Meaning
Keep
ప్ర.
ఆర్తుడనగానేమో
తెలుపుడు?
ఉ.
ఆధ్యాత్మికాది
దుఃఖములచే
పీడితుడై
పరమాత్మను
భజించువాడు,
ప్రార్థించువాడు.
ప్ర.
ఇక
అర్థార్థి
అనగా
నేమి?
ఉ.
సంపదను
కోరి
పరమాత్మను
భజించి,
పూజించి,
ధ్యానించి,
తపస్సులాచరించువాడు.
ప్ర.
జిజ్ఞాసువు
అనగా
నేమి?
ఉ.
మోక్ష
విషయికమగు
అపేక్షచేత
పర
తత్త్వమును
వెదకువాడు,
విచారించువాడు.
ప్ర.
జ్ఞాని
యనగా
ఎవరు?
ఉ.
ద్వంద్వ
భావము
వీడి
పరమాత్మ
"నేనే"నను
అభేద
దృష్టితో
సంచరించువాడు.
ప్ర.
ఈ
నాలుగు
మార్గములందు
అనుభవము
కలవారెవరైననూ
కలరా?
వారెవరో
సెలవిచ్చిన
ఇట్టి
స్థితులు
సులభముగా
అర్థమగును.
ఉ.
లేకేమి?
ఆర్త
భక్తులలో
ద్రౌపది,
ప్రహ్లాద,
నక్కూబాయి
మొదలగువారు.
అర్థార్థ
భక్తులలో
ధృవుడు,
అర్జునుడు
మొదలగువారు.
జిజ్ఞాసువులలో
ఉద్ధవుడు,
రాధ
మొదలగువారు.
జ్ఞానులలో
శుక,
సనక
మొదలగువారు.
Previous
←
Mokṣa and Karma
Next
Mokṣa — Its Obstacles
→