Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · Mokṣa — Its Obstacles
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రతిబంధకములు
ప్ర.
ఇట్టి
ముముక్షువులకు
మూడు
ప్రతిబంధకములు
కలవని
అందురే,
అవి
యేవి?
ఉ.
భూత,
వర్తమాన,
భావి
ప్రతిబంధకములు.
ప్ర.
భూత
ప్రతిబంధకమనగా
నేమి?
ఉ.
గడచిన
విషయములను
మరల
మరల
మనసునకు
తెప్పించుకొనుట.
ప్ర.
వర్తమాన
ప్రతిబంధకమనగా
నేమి?
ఉ.
ఇది
ఒకటి
కాక
నాలుగు
ప్రతిబంధకములుగా
ఉన్నవి.
అవియే
విషయాసక్తి,
ప్రజ్ఞామాంద్యము,
కుతర్కము,
విపర్యయదురాగ్రహము.
ఇందులో
'విషయాసక్తి'
అనగా
పెద్దల
చెంత
కావ్యార్థ
శ్రవణము
చేయుచుండగా
వృత్తి
శబ్దాది
విషయాయత్తమగుట.
'ప్రజ్ఞామాంద్యమ'నగా
చెప్పిన
విషయములు
బుద్ధికి
తోచకుండుట.
'కుతర్కమ'నగా
పెద్దల
వాక్యములకు
విపరీతముగా
అర్థము
చేయుట.
'విపర్యయదురాగ్రహమ'నగా
సర్వులకంటే
"నేనే
గొప్ప"యని
తనది
తప్పయిననూ
సరియని
సమర్థించుకొను
దుష్ట
బుద్ధి.
ప్ర.
ఇక
భావి
ప్రతిబంధకమనగా
నేమి?
ఉ.
ఏ
సమయమునకు
ఏమి
వచ్చునో
యని
ముందుగనే
చింతించుట.
(అనగా
రాబోవు
వాటికి
క్రుంగుట,
పొంగుట)
ప్ర.
చతుర్విధ
భూతములని
అందురే,
అవి
యేవి?
ఉ.
అండజ,
స్వేదజ,
ఉద్భిజ్జ,
జరాయుజములు.
2
▾
Meaning
Keep
ప్ర.
అండజమనగా
నేమి?
ఉ.
గ్రుడ్లు
వలన
పుట్టు
పక్షులు
మొదలైనవి.
ప్ర.
స్వేదజము
అనగా
నేమి?
ఉ.
చెమట
వలన
పుట్టు
పేను,
ఈరు
మొదలైనవి.
ప్ర.
ఉద్భిజ్జము
అనగా
నేమి?
ఉ.
భూమిని
పగులగొట్టుకొని
పుట్టు
చెట్లు,
చేమలు
మొదలగునవి.
ప్ర.
జరాయుజములనగా
నేమి?
ఉ.
మనుష్యులు,
పశువులు,
మృగములు
మొదలగునవి.
ప్ర.
దైవోపాసకులని
లోకమున
ప్రత్యేకముగా
ఉన్నారా?
ఉ.
ఉండకేమి?
వారు
నాలుగు
విధములైన
దైవోపాసకులుగా
ఉన్నారు.
ప్ర.
వారలనేమని
పిలుతురు?
ఉ.
ద్విజులు,
మునులు,
అల్ప
బుద్ధులు,
విదితాత్ములు.
ప్ర.
ద్విజులన
ఎట్టివారు?
ఉ.
అగ్నిహోత్రములందే
దైవబుద్ధి
కలిగి
పూజించి
భజించువారు.
ప్ర.
మునులనగా
ఎవరు?
ఉ.
పరమాత్మను
హృదయ
నివాసిగానెంచి
ప్రార్థించువారు.
ప్ర.
అల్పబుద్ధులనగా
నెవరు?
ఉ.
ప్రతిమాదులు,
చిత్ర
పటములయందే
దైవబుద్ధి
గలిగి
పూజించి,
భజించువారు.
ప్ర.
విదితాత్ములనగా
నెవరు?
3
▾
Meaning
Keep
ఉ.
సర్వ
భూతాత్మకమగు
ప్రపంచమంతయూ
పరమాత్మయే
యని
తెలిసి
ధ్యానించువారు.
ప్ర.
ఇందులో
ఎవరు
గొప్ప
ఉపాసకులు?
ఉ.
అన్ని
విధముల
ఉపాసనలు
ఆయా
స్థానములకు
గొప్పవే,
కాని
ఉత్తమమైన
వారు
విదితాత్మ
ఉపాసకులే!
వారే
శ్రేష్ఠులు.
ప్ర.
ముముక్షత్వమునకు
ముందడుగు
వేయకుండ
అడ్డువచ్చు
చెడ్డ
గుణములేవి?
ఉ.
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
మద,
మత్సర్యములనెడి
అరిషడ్వర్గములే.
ప్ర.
కామమనగా
నేమి?
ఉ.
ధన
ధాన్యాదులయందు,
వస్తు
వాహనాదులయందు,
పుత్ర
పౌత్రాదులయందు,
వేయేల,
అసత్య,
అనిత్య,
అశాశ్వత,
అశుద్ధమైన
ఈ
ప్రపంచము
అనగా
వాంఛానిష్ఠుడే.
ప్ర.
క్రోధమనగా
నేమి?
ఉ.
ఎల్లప్పుడు
ఇతరులను
చెరుపుటకు
తీవ్రమైన
దీక్షను
పూనియుండుట.
ప్ర.
లోభమనగానెట్టిది?
ఉ.
తాను
ఆర్జించిన
ధనము
నుండి
చిల్లి
గవ్వయైనను
ఇతరులకు
చేరకూడదని
పట్టుపట్టుటయేకాక
తాను
కూడను
ఎట్టి
అవసర
సమయమందైనను
ఆ
ధనమును
అనుభవింపకుండుట.
ఇట్టి
స్థితినే
లోభమందురు.
ప్ర.
మోహమనగానేమి?
ఉ.
తన,
మన
వారల
యందు
అధికమగు
ప్రీతియుంచి
తనకున్న
వస్తు
వాహనములు
చాలవని,
అధిక
ధనమును
ఆర్జించవలెనని
ఆశ
గలిగియుండుట.
4
▾
Meaning
Keep
ప్ర.
ఇక
మదమనగానేమి?
ఉ.
ద్రవ్యమధికమగుటచేత,
విద్యాబలము,
దేహ
బలము
ఉండుటచేత
ఇతరులను
లక్ష్యము
చేయక
సంచరించుటయే
మదమనబడును.
ఇంతియేకాక
పై
ధన,
విద్యా,
దేహ
బలములు
లేనప్పటికిని
ఇతరులను
బెదిరించి
విచ్చలవిడిగా
తన
సుఖములు
అనుభవించుచు,
పెద్ద,
చిన్న
యను
తారతమ్యమును
గుర్తింపక
ఆయా
సమయమునకు
తన
సుఖమును
మాత్రమే
కోరునట్టి
స్వార్థపరులను
కూడను
మద
స్వభావమందురు.
ప్ర.
మత్సరమనగానేమి?
ఉ.
తనవలె
ఇతరులు
సుఖ
సంతోషములు
అనుభవించుచున్న
చూచి,
విని
సహించుకొనకుండుటయే
మత్సరమనబడును.
ప్ర.
దంభము,
దర్పము
అందురే,
వాటి
స్వభావములేవి?
ఉ.
దంభమనగా
లోకమెల్ల
తనను
మెచ్చుకొనవలెనని,
దానము,
ధర్మము,
యాగము,
యజ్ఞము
మొదలగునవి
చేయుట.
దర్పమనగా
పుత్ర,
మిత్ర,
కళత్రము,
బంధుబలగ,
ధన,
ధాన్య
సంపదలయందు
తనతో
సరియగు
వారు
లేరని
భావించుట.
ప్ర.
ఈర్ష్య,
అసూయ
అంటే
యేమిటి?
ఉ.
ఈర్ష్య
అనగా
తనకు
కలిగిన
దుఃఖములు,
కష్టములు,
అశాంతులు
ఇతరులకు
కూడనూ
సదా
కలుగవలెనని
కోరుచుండుట.
అసూయ
అనగా
నిరంతరము
ఒకరికి
చెడుపు
చేయవలెనని
తలంచుచుండుటయే
కాక
ఆ
తలంపులకై
తానెట్టి
కష్టనష్టములనైననూ
అనుభవించుటకు
సిద్ధముగానుండుట.
ఇట్టివారినే
అంతర్
శత్రువులని
కూడనూ
అందురు.
ఈ
పరస్పరాధ్యాసము
ఉన్నంతవరకూ
మానవుడు
ముముక్షువు
కాజాలదు.
Previous
←
Vidyā and Bhakti
Next
The Five Sheaths
→