Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · The Five Sheaths
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్ర.
అయితే
ఈ
పరస్పరాధ్యాసము
ఎట్లు
నివృత్తి
యగును?
ఉ.
వివేక,
విజ్ఞానములతో
నివృత్తి
యగును.
ప్ర.
బుద్ధి
యందు
ప్రతిబింబ
రూపమై
యుండు
జీవునికి,
కూటస్థునికి
పరస్పరాధ్యాసము
ఉన్నదా?
ఉ.
లేకున్ననూ
చూచువారలకు
పరస్పరాధ్యాసము
ఉన్నట్లుగా
కనుపించుచున్నది.
ప్ర.
అది
యెట్లు?
ఉ.
కూటస్థుడు
అసంసారి,
అసంగుడు,
నిత్యముక్తుడు
అయినను
అధ్యాస
ప్రభావముచే
విపరీతముగా
ఉండును.
ఇదే
కూటస్థ
జీవులకు
పరస్పరాధ్యాసము.
ప్ర.
కొంతమంది
పెద్దలు
మహావాక్యమైన
"తత్",
"త్వం"
అనే
పదార్థముల
యొక్క
"లక్ష్యార్థము"లకు
ఏకత్వము
ఉన్నదని
అందురు.
అది
యెట్టిదో
సులభముగా
అర్థమగునట్లు
తెల్పుడు?
ఉ.
ఘట,
మఠ,
పటములు
ఉన్నవనుకో,
ఇవి
కేవలము
ఉపాధులు
కదా?
ఇట్టి
ఉపాధులకు
ఏకత్వమున్నదా?
లేదు.
ఈ
ఉపాధులేనాటికీ
ఏకము
కావు.
కానీ,
ఈ
ఉపాధులయందున్న
ఆకాశము
ఉపాధులు
శిథిలమైన
తక్షణమే
ఏకత్వము
కావడానికి
ఏవిధమైన
అభ్యంతరము
లేదు.
అట్లే
ఉపాధి
భేదములుండవచ్చును
గాని,
అందులో
ప్రకాశించే
2
▾
Meaning
Keep
జ్యోతికి
ఏకత్వము
చెప్పుటకు
ఎట్టి
అభ్యంతరము
లేదు.
ప్రకాశ
ధర్మమును
బట్టి
యెన్ని
జ్యోతులకైననూ
ఏకత్వము
సిద్ధిస్తుంది.
ప్ర.
"పంచ
కోశాతీతమయిన
ఆత్మను
దర్శించుటయే
పాంచభౌతిక
దేహుడైన
మానవుని
నిజధర్మము,"
అని
అంటిరే,
ఆ
పంచకోశ
అతీతుడనగా
ఎవరు?
ఉ.
కోశమనగా
ముసుగు.
ఖడ్గాన్ని
మూసేది
ముసుగని
కూడనూ
అందురు.
ఇటువంటి
పంచ
కోశములచే
మరుగుపడినటువంటి
ఆత్మ
"నేనే"
అని
యథార్థమును
తెలుసుకొని,
ఆవరించిన
ముసుగులను
విడనాడుటే
తనను
తాను
చూచుకొనుట.
ప్ర.
మానవునియందున్న
పంచకోశములేవి?
ఉ.
అన్నమయము,
ప్రాణమయము,
మనోమయము,
విజ్ఞానమయము,
ఆనందమయము
అని
అయిదు
కోశములు
కలవు.
ప్ర.
'అన్నమయ
కోశమ'నగా
యేమి?
ఉ.
తల్లిదండ్రులు
తిన్న
అన్న
రసము
ద్వారా
ఈ
శరీరము
తల్లి
గర్భము
నుండి
కనిపించినది
కనుక
'అన్నమయ
కోశమ'ని
అందురు.
ఇంతియేకాక,
జన్మించిన
తర్వాత
కూడనూ
అన్నము
వలననే
వృద్ధి
పొంది,
మరణించిన
తర్వాత
అన్నమయమయిన
పృథ్వీలో
లయమొందుచున్నది.
అన్నము
వలననే
పుట్టి,
అన్నము
వలననే
ఉండి,
అన్నము
వలననే
పెరిగి,
అన్నము
వలననే
పృథ్వీలో
లయమవును.
కనుక
'అన్నమయ
కోశమ'ని
అందురు.
ప్ర.
ఈ
అన్నమయ
కోశము
యొక్క
స్థానమెట్టిది?
ఉ.
స్థూల
దేహము
సుఖ
దుఃఖ
భోగాలను
అనుభవించే
స్థానమై
ఉన్నది.
ప్ర.
దీనికి
మరొక
పేరేమైనను
ఉన్నదా?
3
▾
Meaning
Keep
ఉ.
లేకేమి?
దీనినే
భోగాయతనమని
పిలుతురు.
ప్ర.
ఇక
'ప్రాణమయ
కోశమ'నగా
యేమి?
ఉ.
పంచ
కర్మేంద్రియములతో
కూడిన
పంచ
ప్రాణములను
ప్రాణమయ
కోశమని
అందురు.
లేదా
పంచ
ప్రాణాలు,
ఉప
ప్రాణాలు
చేరి
ప్రాణమయ
కోశమని
అందురు.
ప్ర.
స్వామీ!
ఉప
ప్రాణాలు
అంటారే,
అవి
యేవి?
ఉ.
నాగ,
కూర్మ,
కృకర,
దేవదత్త,
ధనుంజయాలని
ఉపప్రాణముల
పేర్లు
కలవు.
ప్ర.
ఇవి
చేయు
పనులేవి?
ఒక్కొక్క
దానిని
గూర్చి
వివరముగా
తెలపండి?
ఉ.
నాగవాయువు
త్రేపులను
కలిగించును.
కూర్మ
వాయువువలన
రెప్పపాటు
సంభవించును.
కృకర
వాయువు
వలన
తుమ్ములు
వచ్చును.
దేవదత్త
వాయువు
వలన
ఆవలింతలు
కలుగును.
ధనంజయ
వాయువు
శరీరమంతటి
నుండి
దేహమును
స్థూలముగా
చేయును.
ఇంతే
కాదు
దేహము
మరణించిన
తరువాత
కూడా
దేహములో
నిల్చియుండి
కళేబరాన్ని
ఉబికించును.
ఇట్లు
పంచ
ప్రాణములు,
ఉప
ప్రాణములు
కలసి
ప్రాణమయ
కోశమనబడును.
ప్ర.
ఇక
మనోమయ
కోశమనగానేమి?
ఉ.
పంచ
ప్రాణేంద్రియములతో
(జ్ఞానేంద్రియములు)
కూడుకొనిన
మనస్సును
మనోమయమందురు.
అది
ప్రాణమయ
కోశములో
ఉన్నది.
ప్ర.
మనస్సన
నెట్టిది?
దాని
లక్షణమెట్టిది?
4
▾
Meaning
Keep
ఉ.
దేహముపై
'అహం
బుద్ధి',
దేహసంబంధ
వస్తువులపై
'మమకార
బుద్ధి';
ఇంద్రియముల
ద్వారా
బయటికి
పరుగెత్తి
పోవుచుండుట
దీనికి
సహజము.
ఇది
నిరంతరము
చంచల
లక్షణము
కలిగియుండును.
ప్ర.
అన్నమయ
కోశమునకు
నేను
అతీతంగా,
విలక్షణంగా
ఉన్నాననే
విషయమును
మానవుడు
ఏ
విధముగా
తెలిసికొనగలడు?
ఉ.
శరీరము
తల్లి
గర్భము
నుండి
పుట్టుటకు
మునుపు
ఎక్కడున్నదో
తెలియదు.
మరణించినతరువాత
ఏమౌనో
తెలియదు.
మధ్యకాలములో
మాత్రము
కనుపించును.
దీనికి
ఉత్పత్తి
వినాశనములున్నవి.
ఉత్పత్తి
వినాశనములున్న
వస్తువు
కార్యవస్తువనబడును.
కనుక
ఈ
శరీరమును,
అన్నమయ
కోశాన్ని,
కూడా
కార్య
వస్తువనే
అందురు.
"నేను
ఎప్పుడూ
ఉన్నవాణ్ణి,
భావ
రూపుణ్ణి.
నాకు
ఉత్పత్తి
వినాశనములు
లేవు.
నేను
స్థూల
శరీరానికి
విలక్షణమైన
వాణ్ణి.
కాబట్టి
నేను
అన్నమయ
కోశమును
కాదు.
అన్నమయ
కోశమును
తెలిసికొనగల
ద్రష్టనే
నేను"
అని
తెలిసికొనినపుడే
అన్నమయ
కోశానికి
అతీతమైన
విలక్షణమని
గుర్తించవలెను.
ప్ర.
ప్రాణమయ
కోశమునకంటే
కూడా
"నేను"
అనునది
వేరు
అని
యేవిధంగా
తెలిసికొనగలమో
సెలవిండు?
ఉ.
రాత్రివేళ
జీవుడు
నిద్రలో
ఉన్నప్పుడు
ప్రాణములు
తిరుగుచునే
ఉండును.
కాని
యేమి
జరిగినను
తెలిసికొనలేవు.
ఇష్ట
బంధుమిత్రులే
వచ్చినను
తెలిసికొని
ఆదరించలేవు.
శత్రువులే
వచ్చిన
వారితో
పోరాడలేవు.
మొద్దువలె
జడములై
ఉండును.
కనుక
"నేను"
అనునది
చైతన్య
స్వభావమే!
"ప్రాణముల
వలెనే
నా
స్వభావము
జడము
కాదు.
నేను
ప్రాణమయ
కోశమును
తెలిసికొనునట్టి
ఆత్మను
కనుకనే
ఆ
కోశమునకు
విలక్షణమే."
Previous
←
Mokṣa — Its Obstacles
Next
Yoga — Mokṣa
→