Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · Yoga — Mokṣa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్ర.
ఈ
దేహ,
మనస్సులతో
అనేక
పుణ్యపాపములు
చేయుచున్నాము
కదా!
వీటి
ప్రతిఫలములైన
సుఖదుఃఖములకు
"నేను"
అనువాడు
కర్త,
భోక్త
కాదా?
ఉ.
ఏనాటికి
కాదు.
క్రియావంతునే
కర్తయని
అందురు.
క్రియ
వికార
యుక్తమై
ఉండును.
కాబట్టి
కర్త
కూడను
వికారికాక
తప్పదు.
"నేను"
అనునతడు
నిర్వికారి.
అతడు
కూటస్థుడగుటవలన
క్రియకు
ఆశ్రయుడు
కాదు.
పుణ్యపాపరూప
క్రియలకు
కర్త
కాదు.
కర్తృత్వము
అంతఃకరణ
ధర్మము.
ఆ
ధర్మమును
పురస్కరించుకొనే
కర్త,
భోక్త
ఇన్ని
విధముల
తోచుచున్నాడు.
ప్ర.
అట్లయిన
ఈ
లోకమునకు
రావటము,
పర
లోకమునకు
పోవటము,
ఇట్టి
లోకాంతర
గమనాగమనాలు
'నా
ధర్మములు
కావ'ని
ఏ
విధముగా
తెలిసికొనగలము?
ఉ.
"అంతఃకరణము
(లింగ
దేహము)
పరిచ్ఛిన్నమయినది.
ప్రారబ్ధ
కర్మము
యొక్క
వేగముతో
ఆ
లింగ
దేహమునకు
గమనాగమనములు
సంభవించును
కాని,
ఆకాశమువలె
'వ్యాపకుడు',
'అసంగుడు'
అయిన
నాకు
ఈ
లోకానికి
రావటము,
పరలోకానికి
పోవటము
అనే
గమనాగమన
ధర్మములు
లేవు"
అని
తెలుసుకొనవలెను.
ప్ర.
ఇట్లుండగా
మోక్షమును
పొందుటకు
ఏది
కారణము?
ఉ.
విజ్ఞానమే
కారణము.
2
▾
Meaning
Keep
ప్ర.
కొందరు
మహనీయులు
యోగము
కారణమందురే,
అది
నిజమేనా?
ఉ.
అదియును
నిజమే.
ఒక
స్థానమునకు
రెండు
మార్గములున్నట్లు
యోగ
జ్ఞానములు
రెండునూ
మోక్షమునకు
మార్గములే!
ప్ర.
ఇందులో
ఏది
ప్రధానమయినటువంటిది?
ఉ.
రెండునూ
ప్రధానమే.
రెండునూ
గమ్యమును
చేర్చునవే.
కాని
రెండు
మార్గములయందును
ఒకే
పర్యాయము
నడచుట
ఎట్టి
వారికయిననూ
కష్టమే!
వారి
వారి
సంస్కారముననుసరించి
'యోగ
మార్గమున'
కొందరు,
'జ్ఞాన
మార్గమున'
కొందరు,
సాధనలు
సల్పుదురు.
భవబంధముల
నుండి
వేరు
చేయునట్టివే,
రెండింటి
యొక్క
స్వభావము.
ప్ర.
యోగము
వలన
జ్ఞానము
దొరకునా?
జ్ఞానము
వలన
యోగము
దొరకునా?
ఉ.
యోగము
వలన
జ్ఞానము
దొరకును.
కనుక
యోగ
జ్ఞానముల
వలన
మోక్షము
సులభముగా
పొందవచ్చుననుట
సరియైన
విషయము.
ప్ర.
యోగము
చేయు
పని
యేమి?
దాని
ప్రయోజనమేమి?
ఉ.
యోగము
అగ్ని
వంటిది.
అందువలననే
'యోగాగ్ని'
అని
కూడను
అందురు.
అది
సమస్త
పాపములను
దహించివేయును.
దాని
వలన
అంతఃకరణములు
శుద్ధి
అగును.
అట్టి
అంతఃకరణ
పరిశుద్ధము
వలన
జ్ఞానముద్భవించును.
జ్ఞాన
జ్యోతి
వలన
అజ్ఞానాంధకారము
తొలగి
మోక్షము
లభించును.
ప్ర.
యోగమునకు
ఇంతటి
శక్తి
సామర్థ్యములు
కలవా?
ఉ.
కలవా
అందువేల?
కలవు.
ఎంతటి
జ్ఞానికైనను,
వైరాగికైనను,
ఎంతటి
మేధావికైనను,
సకలేంద్రియములను
జయించిన
తరువాతనే
వాడు
3
▾
Meaning
Keep
మోక్షార్థుడగును
కాని,
లేకున్న
కానేరదు.
పై
వారలు
యోగాభ్యాసము
లేక
పాప
రహితులు
కాలేరు.
పాప
రహితులు
కాక
అంతఃకరణ
శుద్ధము
కాలేదు.
అంతఃకరణ
శుద్ధి
లేనివానికి
జ్ఞానము
లభించదు.
జ్ఞానము
లభించక
మోక్షము
లభించదు.
కనుక
యోగము
అన్నింటికి
ఆధారమైవున్నది.
ప్ర.
స్వామీ!
ఈ
విషయమునే
పామరులకు
కూడా
అర్థమగునటుల
చిన్న
చిన్న
ఉపమానములతో
సెలవిత్తురా?
ఉ.
పెనుగాలి
వీచుచున్నప్పుడు
ఎటువంటి
వాడైననూ
నిరావరణంగా
దీపమును
వెలిగించుటకు
వీలగునా?
అలాగుననే
విషయ
దోషముల
చేత
చిత్త
చాంచల్యముండిన
జ్ఞాన
జ్యోతిని
వెలిగింప
ఎవరికి
సాధ్యమగును?
ప్ర.
యోగము
చేయు
పని
యేమి?
ఉ.
సకల
వాసనలను,
సకల
వృత్తులను
నశింపజేసి
మనస్సును
అణగద్రొక్కును.
Previous
←
The Five Sheaths
Next
Jñāna and Yoga
→