Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · Jñāna and Yoga
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్ర.
జ్ఞానము
చేయు
పనియేమి?
ఉ.
ఆత్మ
స్వరూపమును
(అనగా
స్వస్వరూప
సందర్శనము)
కలిగించును.
ప్ర.
యోగము
లేని
వాని
స్థితి
ఎట్టిది?
ఉ.
కుంటివానితో
సమానము.
ప్ర.
జ్ఞానము
లేని
వాని
స్థితి
యెట్టిది?
ఉ.
గ్రుడ్డి
వానితో
సమానము.
ప్ర.
యోగము
సకల
దోషములను
నశింపజేయునని
అంటిరే,
అది
యెట్లు?
ఉ.
అగ్ని
సంయోగములేక
బియ్యము
అన్నమగునా?
అటులనే
యోగాదులచే
చిత్తము
తప్తమగును.
ఇంతియేగాక
యోగ
జ్ఞానములు
రెండు
నూనె,
దీపములవలె
నున్నవి.
ఇందులో
నూనె
'యోగ
తైలము'గాను,
'జ్ఞాన
జ్యోతి'
ప్రకాశముగాను,
సర్వదా
వెలుగుచుండును.
ప్ర.
అనేకమంది
వేదాంతమును
బోధించుచుందురే,
ఇట్టి
సత్యమును
పెద్దలయిన
మహనీయులందరును
అనుభవించియే
యుందురా?
2
▾
Meaning
Keep
ఉ.
ఇది
చెప్పుట
సాధ్యము
కాదు.
ఇట్టి
స్థితిని
అనుభవించు
వారికి,
బోధించు
వారికి
హృదయ
శుద్ధి,
చిత్త
శుద్ధి,
పరమాత్మ
విషయిక
జ్ఞానము,
తప్పక
ఉండవలెను.
ఈ
లక్షణములు
ఉన్నవారే
వేదాంత
వాక్యములను
అఖండముగా
బోధించుటకుగాని,
అనుభవించుటకు
గాని
అర్హులయి
ఉండవలెను.
ప్ర.
ఇట్టి
గుణములు
లేనివారి
బోధనలు
కొంత
వరకయిననూ
ఫలమునిచ్చునా?
ఉ.
బాగుగా
ఆకలిగొని
బాధ
పడుచుండు
వానికి
వివిధములగు
షడ్రసములతో
చేరిన
పంచభక్ష్య
పరమాన్నాదుల
వర్ణనలు
ఆ
ఆకలిని
ఏ
మాత్రము
ఆర్చలేదో
అటులనే
అనుష్ఠానములేని
వేదాంత
బోధయు,
ఆసక్తి
లేని
శ్రవణము,
నిష్ప్రయోజనమగును.
విషయ
విరక్తి
లేని
వేదాంతము
వినుటకు
ఇంపైన
చిలుకపలుకులవంటిది.
ఆసక్తి
లేక
వినగోరు
వారి
యొక్క
హృదయములు
ఆడంబర
వ్యక్తులనే
తలంచవలయును.
ప్ర.
తమరు
సెలవిచ్చినట్లు
చిత్త
హృదయ
శుద్ధి,
పరమాత్మ
విషయిక
జ్ఞానము
ప్రధానమయినపుడు,
ఈ
పాంచ
భౌతిక
శరీర
సాధనలు
చేసి
ఫలమేమి?
స్వస్వరూప
జ్ఞానమొక్కటుండిన
చాలును
కదా?
ఉ.
పిచ్చివాడా!
నదిని
దాటవలెనన్న
చుక్కాని
ప్రధానమని
పడవ
భద్రత
లేకున్న
ప్రయాణమెట్లు
జరుగును?
వేదాంత
శాస్త్రములను
బాగుగా
విచారించిన
సంసార
సాగరమును
దాటుటకై
శరీరమును
నావ
స్వరూపముగాను,
చిత్తమును
నావకు
ప్రధానాంగమైన
చుక్కానిగాను,
భగవంతుడు
ప్రసాదించినాడని
మొదలు
విశ్వసించవలయును.
ఆ
నావకు
స్వస్వరూప
జ్ఞానమే
చుక్కాని.
స్వస్వరూప
జ్ఞానమును
పొందుటకు
శరీర
సంబంధమైన
అనుష్ఠాన
నిష్ఠలు
కూడనూ
3
▾
Meaning
Keep
ప్రధానముగా
చూచుకొనవలెను.
అగమ్య,
అగోచరమైన
స్వస్వరూప
జ్ఞానమును
పొందుటకు
కొంతవరకు
శారీర
మానసిక
సాధనలు
ముఖ్యావసరములు.
ప్ర.
ఈ
విషయమై
మరింత
సందేహము
కలుగుచున్నది.
శరీరములలోనున్న
స్త్రీ
పురుషుల
భేదములు
బ్రహ్మవిద్యకు
కలవా?
ఉ.
నాయనా!
పడవను
శరీరమునకు
స్త్రీ
పురుష
భేదములు
లేవు.
ఈ
లౌకిక
ఆచార
విచారములు
పాటింతురేకాని,
బ్రహ్మ
విద్యకు,
చిత్తశుద్ధికి
వీటితో
సంబంధములు
లేవు.
రోగ
పీడితులయిన
వారికి
మందు
సేవించుటలో
అందరికీ
సమానమైన
అధికారమున్నది
కదా?
అటులనే,
భవరోగగ్రస్తులైన
వారా
బ్రహ్మవిద్య
అను
ఔషధమును
స్వీకరించుటకు
అధికారము
కలదు.
కాని,
అందరూ
ఆ
విలువైన
ఔషధమును
పొందునట్టి
సామర్థ్యములు
లేకపోవచ్చును.
అట్టి
శక్తి
సామర్థ్యములు
లేకున్ననూ
మాకు
బ్రహ్మవిద్య
అను
ఔషధమును
భుజించుటకు
అధికారమున్నదని
వాదించుటలో
అర్థము
లేదు.
ప్ర.
కొందరు
వేదాంతులు
స్త్రీలకు
బ్రహ్మవిద్యయందధికారము
లేదని
అందురే,
ఇక్కడ
శారీరక
భేదమయిన
పదవల
మార్పుగా
కనిపించుచున్నవే,
దీనిపై
తమ
యభిప్రాయమేమి?
ఉ.
నాయనా!
ఔషధమును
తీసికొనుటలో
అందరికి
సమానాధికారమున్నది
కాని,
అంతటితో
అనారోగ్యము
నివారణ
కాదు.
దానితో
పాటు
పథ్యము
కూడనూ
అత్యవసరము.
అటులనే
బ్రహ్మవిద్యాభిలాషులు
నిరంతరము
బ్రహ్మ
భావమను
ఔషధమును
తినుచుండినను
దానికనువైన
క్రమాచరణ
జ్ఞాన
వైరాగ్యాది
గుణములనబడు
ఆధ్యాత్మిక
పథ్యమును
కూడను
కలిగివుండవలెను.
స్త్రీలలో
ఇంతటి
కఠిన
క్రమాచరణలను,
పథ్యమును
వారు
4
▾
Meaning
Keep
సక్రమముగా
పాటింపలేరని,
వారి
దౌర్బల్యమును
తెలిసికొని
వారి
క్షేమమును
కోరే
ఇట్టి
ఔషధమును
వారు
భుజించుటకర్హులు
కారని
తెలిపి
యుండవచ్చును.
అంతేకాని
పై
చెప్పిన
క్రమాచరణలను,
పథ్యమును
పాటించునట్లైన
స్త్రీలకు
కూడనూ
ఈ
దివ్యౌషధమును
స్వీకరించుటలో
అర్హత
కలదని
నా
అభిప్రాయము.
Previous
←
Yoga — Mokṣa
Next
Women and Brahma-vidyā
→