Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · Women and Brahma-vidyā
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్ర.
ఈ
కఠిన
పథ్యము
పురుషులకు
మాత్రము
లేదా?
ఉ.
వెఱ్ఱివాడా!
పురుషుడు
మాత్రము
మాంస,
నర,
రక్త,
ఎముకలతో
లేడా?
వాడికి
మాత్రము
రోగము
రాదా?
భవ
రోగముతో
పీడింపబడు
ప్రతి
వ్యక్తియును
ఈ
దివ్యౌషధమును
సేవింపవచ్చును.
ఎవరు
ఈ
ఔషధమును
సేవింతురో,
వారందరును
ఈ
పథ్యమును
పాటింపవలెను.
పథ్యమును
సరిగా
పాటింపకున్న
పురుషులకయినను,
స్త్రీలకయినను
రోగము
నివారణ
కాదు.
పురుషులము
కదా
అని
పథ్యమును
మాత్రము
విడువకూడదు.
అటులనే
బ్రహ్మోపదేశమును
పొందియు,
శమదమాది
గుణరహితులై,
సక్రమ
అనుష్ఠాన
శూన్యులైన,
స్త్రీ
పురుషులైనను
భవరోగ
విముక్తులు
కాలేరు.
ప్ర.
స్త్రీలకు
బ్రహ్మ
విద్యయందు
అధికారము
లేదని
అనేకమంది
శాస్త్రజ్ఞులు
ఖండింతురు
కదా!
దీనికి
కారణమేమి?
ఉ.
స్త్రీలకు
బ్రహ్మ
విద్యయందు
అధికారము
లేదనుటలో
అర్థములేదు.
విష్ణుమూర్తి
భూదేవికి
గీతామాహాత్మ్యమెటుల
బోధించెను?
పరమేశ్వరుడు
పార్వతికి
గురుగీతయందు
బ్రహ్మ
తత్త్వోపదేశము
ఎటుల
చెప్పెను?
ఈ
విషయమునే
గీతయందు
"ధరోవాచ"
అనియు,
గురుగీతయందు
"పార్వతి
ఉవాచ"
యని
ఉండుటలో
అర్థమేమి?
ఇంతియేకాక
యోగశాస్త్రమును,
మంత్రశాస్త్రమును
ఈశ్వరుడు
పార్వతికి
ఉపదేశించెను.
బృహదారణ్యకోపనిషత్తునందు
2
▾
Meaning
Keep
యాజ్ఞవల్క్యుడు
మైత్రేయికి
బ్రహ్మవిద్యోపదేశము
చేసినటుల
అందరికీ
విదితమే!
దీనిని
బట్టి
స్త్రీలకు
అధికారమున్నదో
లేదో
నీవే
యోచించుకొనుము.
ప్ర.
మరికొందరు
స్త్రీలకు
బ్రహ్మచర్యమందును,
సన్యాసమునందును
అధికారము
లేదని
అందురే,
అది
సత్యమా?
వేదము
దీనిని
నిషేధించినదా?
ఉ.
వేదము
కర్మకాండమనియు,
జ్ఞానకాండమనియు
రెండు
విభాగములతో
కూడియున్నది.
ఇందులో
కర్మకాండము
ప్రాకృత
జనులకు,
జ్ఞానకాండము
విజ్ఞానులకు
ఏర్పడినది.
కర్మకాండము
ప్రాకృత
జనులకు
అని
ఉన్నది
కాని,
స్త్రీలకని
గాని,
పురుషులకని
గాని
లేదు.
ప్రాకృత
జనులనగా
అజ్ఞానులు.
కాన
అమృతతుల్యమగు
ఆత్మవేత్త
వాక్యమేల
గ్రహింపరు?
బృహదారణ్యమున
సన్యాసము,
బ్రహ్మచర్యము
ఇత్యాది
ఆధ్యాత్మిక
సద్గుణములతో
జాజ్వల్యమానమై
ప్రకాశించు
మైత్రేయి
(వానప్రస్థము),
గార్గి
(బ్రహ్మచర్యము),
భారతమున
శుభ
(సులభ)
యోగిని
(సన్యాసము)
మొదలగు
ఆదర్శ
నారీమణుల
యొక్క
చరిత్రలేమని
అందురు?
ప్ర.
అటులయిన
స్త్రీలు
గృహస్థులుగా
ఉండియు
బ్రహ్మ
జ్ఞానమును
సంపాదించ
వీలగునా?
ఉ.
కాకేమి?
చూడాల,
మదాలస
మొదలగు
నారీమణులు
గృహస్థాశ్రమమున
ఉండియు
బ్రహ్మ
జ్ఞానమును
సంపాదించి
మంగళ
స్వరూపమగు
బ్రహ్మమును
పొందినటుల
యోగ
వాసిష్ఠము,
పురాణములందు
వినియేయుందురు.
ఇంతియేకాక
కాత్యాయని,
శారిజ్గ,
సులభ,
విశ్వవర,
మైత్రేయి
మొదలగువారు
బ్రహ్మజ్ఞాన
3
▾
Meaning
Keep
సంపన్నులయినటుల
ఉపనిషత్తులయందును
వినిపించుచున్నది
కదా?
ప్ర.
స్త్రీలయందు,
గృహస్థులుగా
ఉండి
బ్రహ్మ
జ్ఞానమును
పొందిన,
సన్యాసము
నుండి
బ్రహ్మ
జ్ఞానమును
పొందిన,
వానప్రస్థము
నుండి
బ్రహ్మ
జ్ఞానమును
పొందిన,
బ్రహ్మచర్యము
నుండి
బ్రహ్మ
జ్ఞానమును
పొందిన
నారీమణులు
ఎవరయినను
కలరా?
ఉండిన
వారెవరో
ఆ
సాధ్వీమణుల
పేర్లు
చెప్పుడు?
ఉ.
నాలుగు
ఆశ్రమములయందును,
బ్రహ్మ
జ్ఞానమును
సాధించిన
నారీమణులు
లేకపోలేదు.
గృహస్థమున
చూడాలయు,
సన్యాసమున
సులభ
యోగినియు,
వానప్రస్థమున
మైత్రేయియు,
బ్రహ్మచర్యమున
గార్గియు
కలరు.
ఇంకను
అనేకమంది
సాధ్వీమహాతల్లులు
మన
భారతదేశమున
నాడును,
నేడును
మెలగుచునే
యున్నారు.
నీవడుగుటచే
మచ్చునకే
నాలుగు
పేర్లు
తెలిపితినే
కాని
ఇంత
మాత్రమేనా
అని
నీవు
నిరుత్సాహ
పడనక్కరలేదు.
ప్ర.
ఇన్ని
ఆదర్శములు
ఉండగా
స్త్రీలకు
బ్రహ్మవిద్యయందు
అధికారము
లేదని
వాదించువారల
భావమేమి?
ఇట్లు
స్త్రీలను
నిర్బంధించుటలో
ప్రయోజనమేమి?
ఉ.
స్త్రీలకు
బ్రహ్మవిద్యయందు
అధికారము
లేదనుట
శుద్ధ
అబద్ధము.
కాని
లౌకిక
వ్యవహారములందు
వారలకు
కొన్ని
నిబంధనలు
అత్యవసరము.
ఇదియును
ధర్మ
రక్షణ
నిమిత్తమే,
లోక
కల్యాణార్థమే.
స్త్రీలు
ఇటువంటి
నిబంధనలు
తు.చ.
పాటించియే
తీరవలెను.
ఇందులో
ఆచార
విచారములు
గూఢముగా
నుండుటచే,
స్త్రీలు
వాటిని
సక్రమముగా
పాటించలేని
బలహీనులగుటయు,
ప్రకృతికి
సంబంధమయిన
కొన్ని
ఆటంకములుండుటయు,
నిబంధనలకు
4
▾
Meaning
Keep
కొన్ని
కారణములుగా
నున్నవి.
అసలు
పండితులు
సహితము,
శాస్త్రజ్ఞులు
సహితము,
బ్రహ్మాది
దేవతలయందు
నారీస్వరూపిణియగు
సరస్వతీ
దేవిని
ఉపాసించియే
జ్ఞానమును
పొందుదురు.
విద్యాధిదేవత
అయిన
సరస్వతియు,
ధనాధిదేవత
అయిన
లక్ష్మియు,
జ్ఞాన
స్వరూపిణి
అయిన
పార్వతియు
స్త్రీజాతి
వారే
కదా!
వేయేల?
లోకమునందు
కూడనూ,
ఎవరికయిననూ
స్త్రీలకు
జాబులు
వ్రాయునపుడు
కూడనూ
'లక్ష్మీ
సమానురాలైన'
అని
సంబోధించుట
పరిపాటే
కదా!
మాతాపిత,
గౌరీశంకర,
లక్ష్మీనారాయణ,
సీతారామ,
రాధాకృష్ణ
ఇత్యాది
స్త్రీవాచక
పదములు
ప్రయుక్తములయి
ఉన్నవి.
కాన
స్త్రీలకు
ఇందులో
ఎంత
గౌరవస్థానము
కలదో
గుర్తించవలెను.
ప్ర.
స్త్రీ
పురుషులను
భేదమును
'మిథ్యాజ్ఞాన'మందురా
లేక
'ఆత్మ
జ్ఞాన'మందురా?
ఉ.
నాయనా!
ఆత్మ
స్త్రీ
పురుష
భేదరహితమై
నిత్య,
శుద్ధ,
బుద్ధ,
ముక్త,
స్వయంజ్యోతి
స్వరూపమైనది
కాన
ఇది
మిథ్యా
జ్ఞానమే
కాని
ఆత్మ
జ్ఞానము
కానేరదు.
ఇంతియేకాక,
దీనికి
ఉపాధి
భేదము
మాత్రమే
కలదు.
ఈ
ఆత్మ
వస్తుతః
స్త్రీ
పురుష
నపుంసక
భేదము
కలది
కాదు.
ఉపాధి
భేదమే
ఈ
పేర్లకు
కారణముగా
ఉన్నది.
Previous
←
Jñāna and Yoga
Next
Āśramas — Varṇas
→