Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · Āśramas — Varṇas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఆశ్రమములు
-
వర్ణములు
ప్ర.
బ్రహ్మచర్య,
గృహస్థ,
వానప్రస్థ,
సన్యాసములలో
యే
ఆశ్రమము
ప్రధానమై
అన్నింటికి
ఆధారభూతమై
ఉన్నదో
తెలుపుడు?
ఉ.
ప్రాణవాయువునాశ్రయించి
సకల
జీవులు
జీవించుచున్నట్లు,
గృహస్థుల
నాశ్రయించి
సకల
ఆశ్రమముల
వారు
ఉంటున్నారు.
గృహస్థుడే
మిగిలిన
మూడాశ్రమముల
వారికి
అన్నపానములనొసంగి
పోషించుచు,
వేదాధ్యయనము
చేయించుచున్నాడు.
కనుక
గృహస్థుడే
నాలుగాశ్రమములలోను
శ్రేష్ఠుడని
చెప్పవచ్చును.
మను
ధర్మమునందును,
నారద
పరివ్రాజకోపనిషత్తునందును,
శ్రుతుల
యందును,
"స్వధర్మానుష్ఠాన
నిరతుడగు
గృహస్థుడు
పరమోత్కృష్టుడ"ని
తెలిపినవి.
ప్ర.
కొంతమంది
పెద్దలైన
మహర్షులు
గృహస్థులకన్నను
సన్యాసులే
శ్రేష్ఠులని
వచింతురే,
ఇది
ఎంత
మాత్రము
సత్యమో
సెలవిందు?
ఉ.
ఏ
ఆశ్రమముననున్న
వారైనను
సరే,
స్వధర్మ
నిరతులై
బాగుగా
అనుష్ఠాన
నిష్ఠలను
దృఢతరమగు
స్వప్రయత్నము
యొక్క
అతిశయముచే
తప్పక
ముక్తులగుచున్నారు.
ఆత్మ
జ్ఞాన
సంపన్నులగుటకు
ఆశ్రమముల
యొక్క
తేడాలు
అవసరము
లేదు.
ఇందులో
శ్రేష్ఠుడు,
అధముడు
అను
తారతమ్యములు
వర్తించవు.
ఆచార
విచారణలకు
మాత్రము
శ్రేష్ఠ,
అధమ
అను
పదములు
అనువర్తించును.
2
▾
Meaning
Keep
ప్ర.
గృహస్థము
బంధ
కారణమనియు,
బ్రహ్మచర్య
సన్యాసములు
దానికంటె
ఉత్తమ
స్థానములనియు
అందురే,
వీటి
భావమేమి?
ఉ.
న్యాయముగా
ధనమును
సంపాదించువాడును,
అతిథుల
సత్కరించువాడును,
సర్వజన
రంజితుడును,
తత్త్వజ్ఞాన
నిష్ఠుడును,
శాస్త్రజ్ఞుడునగు
గృహస్థుడు
కూడనూ
విముక్తుడగుచున్నాడు.
కేవలము
గృహస్థము
బంధకారణమనుట
నేనంగీకరింపను.
ఉత్తమ
వంశమునందు
జన్మించినవాడైననూ,
యతీశ్వరుడైననూ,
సన్యాసియైననూ,
తత్త్వ
జ్ఞాన
సంపన్నుడైననూ,
స్వధర్మాచరణ
వ్రత
నిష్ఠుడు
కాక,
వేదాధ్యయనము,
గీతా,
రామాయణ,
భాగవత
పారాయణములు
లేక
ధ్యానాద్యనుష్ఠానములు
లేక
కేవలము
గృహస్థులు
కాక
సన్యాసి
అయిననూ
అట్టివారు
భవ
సాగరము
నుండి
విముక్తులు
కాజాలరు.
ప్ర.
నాలుగాశ్రమముల
వారును
తరించవలయునన్న
ఏ
ఏ
గుణములు
ముఖ్యావసరమో
తెలుపుడు?
ఉ.
దమ,
అస్తేయ,
ధీ,
విద్య,
సత్య,
ఇంద్రియ
నిగ్రహ,
శౌచ,
క్షమ,
ధృతి,
అక్రోధములను
పది
ధర్మ
లక్షణములు
ఈ
నాలుగు
ఆశ్రమముల
వారును
తప్పక
కలిగియుండవలెను.
ఈ
దశ
ధర్మములు
కలిగియుండిన
ఏ
ఆశ్రమము
వారయినను
తప్పక
తరింతురు.
ఇట్టి
ధర్మ
లక్షణములు
లేనివారు
ఏ
ఆశ్రమమునందుండిననూ
నిష్ప్రయోజకులగుదురు.
తన
నిత్యానుష్ఠానము
కంటే
శ్రేష్ఠమైనది
మరొకటి
లేదు.
ఈ
విషయమునే
అర్జునుడు
కృష్ణ
పరమాత్మను
ప్రశ్నించగా
కృష్ణ
పరమాత్ముడేమి
చెప్పెనో
నీకు
తెలియదా?
ప్ర.
స్వామీ!
ఈ
విషయమై
కృష్ణ
పరమాత్మ
అర్జునునకు
ఏమని
సెలవిచ్చెనో
తెల్పుడు?
3
▾
Meaning
Keep
ఉ.
ఏ
పరమోత్కృష్టమగు
మోక్షము
సాంఖ్య
యోగులచే
పొందబడుచున్నదో
అదియే
నిష్కామకర్మయోగనిష్ఠుల
చేత
పొందబడుచున్నది.
కావున
ఏ
జ్ఞాని
సాంఖ్య,
నిష్కామ
కర్మయోగములు
ఒక్కటేనని
తెలుసుకొనుచున్నాడో,
ఆ
తత్త్వవేత్తయే
నిజమును
గుర్తెరింగినవాడు.
గృహస్థుడు,
సన్యాసి
యను
భేదమేమియు
లేదు.
సమ్యగనుష్ఠానపరులు
ఎవరయినను
తప్పక
మోక్షము
పొందుచున్నారు.
సర్వదా
ప్రయత్నశీలులగువారు
ఏ
ఆశ్రమములో
ఉన్నను
పరవాలేదు.
సమస్త
కోరికలు
వీడి,
తలంపులేక,
అహంకార
మమకారములు
లేనివాడై,
సదా
బ్రహ్మమందు
విహరించుచున్నాడో,
అట్టి
విజ్ఞాని
సకల
దుఃఖ
నివృత్తిని,
పరమశాంతిని
బడయుచున్నాడు.
ఓ
అర్జునా!
ఈ
బ్రహ్మ
స్థితిని
పొందిన
మహాపురుషుడు
ఎన్నటికిని
మోహమును
చెందడు.
పోనీ
అవసాన
కాలమందైనను
ఈ
బ్రహ్మనిష్ఠను
పొందినవాడు
మోక్షమును
పొందును
అని
గీతలో
తెల్పెను.
అసలు
గీతా
తత్త్వశాస్త్రము
సర్వ
సాధారణముగా
జాతి,
మత,
ఆశ్రమ
భేదములు
లేక
వచించుచున్నది.
ప్ర.
అట్లయిన
ఈ
జాతులు,
వర్ణములు,
ఆశ్రమములు
ఎందుకు
ఏర్పడినవి?
ఉ.
అవి
దేహ
ధర్మమునకు
ఏర్పడినవి.
ఇవి
ఆత్మ
ధర్మములు
కావు.
దేహ
ధర్మమును
సక్రమముగా
పాటింపక,
ఆత్మ
ధర్మమును
అర్థంచేసికొన
దుస్సాధ్యము.
కనుక
మొదలు
దేహ
ధర్మము
నెరవేర్చుటకై
జాతి,
మత,
వర్ణ,
ఆశ్రమములకును
హద్దులను
ఏర్పరచి
మానవుని
కర్తవ్యము
కడతేరు
మార్గమును
సూచించిరి.
అందుకనే
తత్త్వవేత్తలు,
ఈ
మూడును
ఆదరించిరి.
యథార్థమెరిగిన
'ఆత్మధర్మము'
ఎరిగిన,
ఆ
మహాపురుషులు
'సత్తు,
చిత్తు,
ఆనందము'లను
మూడు
గుణములనే
4
▾
Meaning
Keep
'స్వరూప
లక్షణముల'ని
నిర్ణయించిరి.
దీనిని
పట్టి
చూడ,
ఆత్మశుద్ధి
నిత్యానంద
మోక్షమునకు
కారణము.
అట్టి
శుద్ధ
రూప
మనస్తత్త్వము
కలవారు
ఏ
ఆశ్రమముల
వారైనను
విజ్ఞానమునకు
యోగ్యమైన
అంతఃకరణ
శుద్ధి
కలిగివున్నందుచే
ఏలాటి
ప్రతిబంధకము
లేనివారై
ముక్తిని
పొందుచున్నారు.
శాస్త్రము
కూడను
ఇటులనే
చెప్పినది.
రాగ
ద్వేషము
కలవారు,
వనమునందుండినను
వానికన్నియును
దోషములే
కలుగును.
గృహస్థాశ్రమమందుండియు,
పంచేంద్రియ
నిగ్రహము
కలవాడు
తాపసుడే
యగును.
నిందితముకాని
కర్మ
చేయువాడు
ఎచ్చటున్నను
జ్ఞానియే
అగును.
రాగ
రహితునకు
స్వగృహమే
తపోవనము.
అలాగున
సంతానము
చేతను,
కర్మల
చేతను,
ధనము
చేతను,
యజ్ఞ
యాగాదుల
చేతను
ముక్తిని
కూడను
పొందవచ్చును.
మోక్షమునకు
కేవలము
ఆత్మశుద్ధి
ఒక్కటియే
అని
తలంచవలెను.
Previous
←
Women and Brahma-vidyā
Next
The Śāstras and Sannyāsa
→